Jump to content

యాత్రా చరిత్ర పూర్వభాగము

వికీసోర్స్ నుండి

శ్రీ

శ్రీ జగదీశ్వరాయ నమః

శ్రీ గణపతయె నమః

శ్రీరస్తు శ్రీః

యాత్రా చరిత్ర పూర్వభాగము.


శ్రీ జగదీశ్వరుని యొక్క జగద్రూప విలాసములో గొంత వశమైనంత వరకు జూడవేడుక గలిగి 1886 సం|| జనవరి 24వ తేదీకి సరియైన పార్ధివ నామ సం|| పుష్య బ 5 ఆదివారమునాడు సుముహూర్తమునందు ప్రస్థాన లాంచన పుర్వకముగా గొంత పరివారమును ముందుగా బంపి తే 25వ దిని శ్రీ బొబ్బిలి వేణుగోపాలస్వామివారిని సేవించికొని పగలు 10 గంటలకు బయలుదేరి 4 గంటలకు విజయనగరము నొరసియున్న కంటన్మేంటులో బసచేసినాము. నడుమనున్న మజిలీ గ్రామములు 1. రామభద్రపురము. మైళ్ళు 7|| 2. మరడాము. మై 7|| 3. గజపతినగరము. మై 9. విజయనగరము మై 13. బస్తీ పట్టణము సుందరముగా నున్నది, ఇది శ్రీ పూసపాటి యానందగజపతిరాజ మహారాజావారి రాజధానియైయున్నది. ఇందు నాలు బురుజులుగల సాధారణమైన రాతి కోటయు సంస్థానపు బియ్యే కాలేజీయు - తంతి యాఫీసును పెక్కండ్రు వర్తకులును - సాహుకారులును 4, 5 శివకేశవ నివేశంబులును మేలైన పూలతోటయు మంచి కోనేరును - పెక్కంగళ్లును - హూణ వైద్యశాలలును - సంస్కృతపాఠశాలయు నొక సత్రంబును గలవు. 26వ తేది మంగళవారము నాడిచ్చటనుండి బయలుదేరి 5 గంటలకు విశాఖపట్టణములో బ్రవేశించితిమి. నడుమనున్న మజిలీలు 1. నీలయ్య సత్రము. మై 9. 2. తాళ్లవలస సత్రము. మై. 8 3. మధురవాడ సత్రము. మై. 7. 4. వాల్తేరు, మై 10. నీలయ్య సత్రము దాటిన పైని చంపావతీ నదీతీరమందు చిట్టివలస యనునూరున్నది. ఇచ్చట గోనెలు నీలిమందు తయారు సేయదగిన ఫాక్టరీలున్నవి. ఆ పైని సముద్రతీరమందు భీముని పట్టణమున్నది. ఇందులో మునసబు వగైరాల ఖచేరీలున్నవి. దొరలు సైతమున్నారు. రేవుస్థలమైనందున ధనిక వర్తక భూయిష్టమైయున్నది. ఇది కొండదిగువనున్నందున నిమ్నోన్నతముగా నున్నది. కొండమీద శ్రీ నృసింహస్వామి వారి గుడియున్నది. భోగరాగము లనుకూలముగానే జరుగుచున్నవి. సముద్ర ప్రాంతమునుండి విశాఖపట్టణమునకు బోవు త్రోవలో నడుమ ఋషికొండ దిగువ నొక దేవాలయంబును సత్రంబును గలవు.

వాల్తేరులో గొప్ప దొరలు పెక్కండ్రు నివసించియుండిరి. వేసవిలో సముద్రపు గాలికి దొరలును గొప్ప సుకుమారులును వచ్చియుందురు.

విశాఖపట్టణము జిల్లాస్థలము, జడ్జీ, కలెక్టరు వగైరా ఖచేరీలున్నవి. హిందూస్కూలు- మిషన్ స్కూలు- ఆస్పత్రులు పెక్కు మహడీలు- భవంతులు. శ్రీ జగన్నాధాది దేవతా మందిరములు గలిగి ధనిక వర్తక సంపన్నమై సుందరముగా నున్నది. ఇచ్చట బర్వతములయందు సముద్రస్నానము సేయదగిన తీర్థపుఱాళ్ల ఱేవునకు బశ్చిమముగా విశాఖ నామముగల కుమారస్వామి యొక్క మందిర మున్నందున దీనిని విశాఖపట్టణమనుటకు గారణమైనది.

ఇచ్చటకి 8 మైళ్ల దూరముగా వాయవ్య భాగమందు శ్రీ సింహాచల క్షేత్రమున్నది - 1096 మెట్లు గలవు. కొండమీదినుండి గంగధా ర వఱకు 154 మెట్లున్నవి. గంగధార ననుసరించి కొండమీద హనుమద్ఘట్టము వరకు- కూర్మధార- గోదావరీధార- ఆకాశధార- యనునట్టి నామములు గల యనేక ధారలున్నవి. దేవళము బహు సుందరముగా నున్నది. శ్రీకృష్ణదేవరాయలు మొదలైన పుర్వరాజులు చేసిన శాసనములు స్తంభములపై వ్రాయబడియున్నవి. ఆ దేవళమందు శ్రీ వరాహనరసింహ స్వామివారు స్వయం వ్యక్తముగా వేంచేసి యుండగా- ప్రహ్లాదుడు ప్రధమారాధన మొనరించినందున ప్రహ్లాద ప్రతిష్ఠ యందురు.

శ్లోకము.

వ్రాహీతి వ్యాహరంతం త్రిదశరిపుసుతం గ్రాతు కామోరహస్యే |
విస్రప్తం పీతవస్త్ర--క్రట్సికటే సవ్యహస్తేన గృహ్ణన్ ||
వేగశ్రాన్తం నితాప్త శిలాం మమృతం పాయయేన్నత్యపాణౌ |
సింహాద్రౌ శీఘ్రపాత క్షితి వేహితపసః పాతుమాం నారసింహా ||

అని యీ చొప్పున స్వామివారిని ధ్యానింతురు. అక్షయతృతీయనాడు చందనము విచ్చి యభిషేకింతురు. గనుక నాడు మాత్రము నిజరూప దర్శనమగును. ఆ పైన ప్రతిదినము సంవత్సరము వరకు చందనము పూయుదురు. గావున స్వామి రొమ్ము పొడవుగా పుల్లగుమ్మడిపండు వలె యుండును. ముందు విచ్చిన చందనపు పెచ్చులు ప్రసాదముగా నిచ్చుచుందురు. దినము 1కి ఖ1/1 బియ్యము వండి త్రికాలారాధనము చేయుచున్నారు. అందులోబాల భోగమునకు ఖ 1/1 రాజభోగమునకు ఖ 1 రాత్రి భోగము 0 1 0 వినియోగమగును. కొండమీదను, అడివారమనెడు దిగువ తిరుపతిలోను పెక్కండ్రు వైష్ణవులున్నారు. సువాసనగల గులాబీ జాతులనేకముగా గలవు. కొండమీద మున్నాగువారా పువ్వుల చెట్లు, కరివేప చెట్లు, అనాసపనాస చెట్లు బడ్డుముడి మొదలైనవి పెరుగుచున్నవి. యిక్కొండమీదనే తూర్పుగా 4 మైళ్లలో నొక బంగళా కట్టబడియున్నది. దిగువనుండి బంగళా వఱకు పాము మెలికలుగా నొక రోడ్డున్నది తఱుచుగా విశాఖపటట్టణమునుండి కొందఱు దొరలు వచ్చుచు బోవుచుందురు. సోపానపాశ్వన్ మందున్న బట్టేగుండా ప్రవహింపుచున్న యాకాశధారా నీరమాధారంగా కొండ గిరువనశ్రీ విజయనగ్తరపు మహారాజావారి బంగళా వెనుక గొప్పపుష్పవనమున్నది. జలయంత్రములవల్ల నుల్లసిల్లుచు నుల్లమునకు జల్లదనము వెదచల్లుచున్నది. ఈ క్షేత్రము విజయనగరము వారిది. ప్రృతమందుద్యోగస్థులయొక్క యేర్పాటువలన గుత్తలో నున్నందున పూర్వము కన్న నిప్పుడు పూజామర్యాదులు వగైరాలు నానాటికి దరగుచున్నట్టు జనులు ప్రశంసింపుచ్న్నవారు.

తాళ్లవలసనుండి శొంఠేము సత్రములో గాని పైగా గాని బస చేసికొని కొందఱీ సింహాచలమునకెంబదురు.

రోడ్డు రమ్యముగానే యున్నది. 27వ తేది విశాఖపట్టణములోనే నివసించితిమి.

28వ తేదీ గురు|| రాత్రికి 20 మైళ్ల దూరములో నున్న యనకాపల్లి బంగళాలో ప్రవేశించినారము, షొంఠేమునుండియు, విషాఖపట్టనము నుండీయు నిక్కడీకి రెండు రోడ్లున్నవి, యిదిగాక వడ్డాది మాడుగులకు బోవు రోడ్డును గలదు, యీ యనకాపల్లి గొప్ప గ్రామము,గొప్ప గొప్ప షాహుకార్లుగలరు. సప్త పురుషాంతములనుండి యాహితాగ్నులు గాని వేదులవరీయూరిలో లేరు. ఇచ్చటలేని కూరలు పయిని లేవనవచ్చును. రు.30000 ల రాబడిగల పంట భూమి గలదు. దీనికి బడమరగా శారదా నది యున్నది. పతంకుల దరఖాస్థు పైని వారి వల్ల కొంతధనము వసూలు చేసి తక్కిన లోటు పుతిన్ చేసి గవర్నమెంటువారు తంతీయాఫీసుంపించినారు. స్కూలు, చిన్న యాసుపత్రి, సత్రము కల యాత్రాచరిత్ర వు హరిహరుల మందిరంబులు రెండున్నవి. యిందులో నొక మందిరమందున్న విష్ణు ప్రతిక పూర్ఫమందు సంద్రములోనే యుండి తన మీదుగా బోవుచున్న విశాఖపట్టనపు కోమటి యోడను పోకుండనిల్పి తన్ను బ్రాధిన్ంపుచున్న యా కోమటికి స్వప్నగోచర మయ్యెనట- అటపైనిక్కో,మటికి యీ యనకాపల్లిలో నీ గుడి గట్టించి ప్రతిష్ఠించి భోగరాగంబులంరాగంబున ననుకూలంబుగా జేయింపుచున్నాట్టు స్థలజ్ఞలనిరి.

ఈ రాత్రి యిచ్చట నివసించి మరునాడు 29.వ తేది శుక్రవారము మె 15. దూరమందున్న యలమంచిలి బంగళాలో దిగితిమి. ఇది కొండ చేర్పున నిడువుగా నున్నది. మునసబు ఖచేరీ- కొన్ని బంగాళాలు బ్రాహ్మణ గృహములు సత్రము - దేవాలయములు గలవు. మార్గస్థులకు గొంత సదుపాయము గానే యున్నది.

30వ తేది శని|| నాడు 10 గంటలకు బయలుదేరి యిక్కడికి 13. మైళ్లలోనున్న నక్కపల్లి జేరితిమి. ఇచ్చ్జట మాగలాస్థులని సదుపాయంబుగా మూడు భవంతులు గల యొక సత్రంబున్నది. బ్రాఃహ్మణులకు భోజనంబు దొరుకును- రంగులుగల లక్క పూతపూరించి తగిన వెలకు విక్రయించుచున్న పనివాండ్రిచ్చట గలరు యంగళ్లున్నవి.

ఈ యూరికి దక్షిణము గానున్న చెరువు గట్టుగుండా 1 మైలు దూరముపోగా సుప్రసిద్ధమైన యుపమాక మనెడు క్షేత్రంబున్నది. పూర్వమందు వేటమార్గంబుగా వచ్చిన శ్రీవేంకటేశ్వరులకు పాలు సమర్పింపుచు యదువనెడు గొల్లవాడు ప్రార్ధింపగా స్వామివారు.

       (శ్లో) ఏకేనశంఖమిత రేణక రేణచక్ర: మన్యేన ఖడ్గమసరేణ ధను                                         పూర్వభాగము

       స్సబాణం నామేశ్రియంపరిదధత్తురగాధిరూఢని పాయాతృమాం
      ఖగధరస్థితవేంకటేశ:||

  అనునట్లు రేఖాకారంబుగా వేంచేసిన యవసరముగానున్నారు, కొన్ని నృసింహాది సాలగ్రామ శిలలు స్వామివారి సన్నిధిలోనున్నవి.  యీ స్వామివారి గుడి చిన్నగుహ వలెనున్నది.  యీ గుడియున్న కొందకు306  మెట్లున్నవి.  కొండదిగువన స్వామిపుష్కరిణీకి నైఋతి భాగమందు శ్రీవేంకటేశ్వర విగ్రహమొకపాటి మందిరములో బ్రతిష్ఠింపబడి యధోచిత పూజారాగమ్లు గలిగి ప్రకాశింపుచున్నది.  దీనికీశాన్యముగా నొక శివాలయము గ్రామమునకుత్తర పాశ్వమందున్నది. బ్రాహ్మణ్లు వైష్ణవులు పెక్కండ్రు గలరు.  యీ స్థలము గొడేవారిదై యున్నది.  యీ స్వామివారిని యధావిధిగా సేవించి యీరాత్రి బయలుదేరి.30 వ తేది ఆది. 23 మైళ్లదూరమునందున్న యన్నవరపు సత్రమం దు బసచేసితిమి,  యీసత్రం కిర్లంపూడి యినుగంటి నృసింహరాయనింగారు కట్టించినారు.  శ్లాఘింపతగియున్నది.  బ్రాహ్మణుల కాదరించి షడ్రసోపేతంబుగా నన్నంపేట్టుటయేకాదు సోపస్కరంబుగానభ్యంగన స్నానంబు సేయింతురు.  వండికొనువారికి సమృద్ధిగా స్వయంపాకంబు లిచ్చుచుందురు.  దీనికి బడమరగా నొక గడ్డయున్నది.
   ఈదినమిచ్చట నివసించి యీ రాత్రి బయలుదేర్ ఫిబ్రవరి 1వ తేది సో-పీఠికాపురంబు మీదుగా మై.24 చామర్లకోటలో ప్రవేశించితిమి. గడిచిన రాత్ర్రి నడచిన త్రోవలో నడవి గలదు. చోరభీతియుంగలద్దు.  యీ పిఠాపురము శ్రీ గంగాధర రామారావు బహదరు గారి రాజధాని.  దీనిలో  శిధిలమైన మంటికొట గలదు. పట్టణ మొక మైలు వరకు నిడువుగతిగి యున్నది తగియంగళ్లున్నవి.  ఉత్తరభాగముందొక సత్రమున్నది.  దక్షిణభాగమందున్న పాదగయాక్షేత్రములో నొక                                    యాత్రాచరిత్ర

మంచి పుష్కరిణియు- శ్రీకుక్కటేశ్వరాలయంబును గలవు. స్వామి లింగము పస్కటాకారంగా నున్నది. పాధనుప్రహారము గంగయు శిరస్సున గలవు. నిమ్నమైన లింగొపరిభాగము నుండి నీరు స్రవింపుచు ముక్కు గుండా కారుచుండును గనుక గంగ యున్నందుకిది నిదర్శనమని చెప్పుదురు అమ్మవారు శ్రీరజరాజేశ్వరి భోగరాగోత్సవాదులనుకూలముగానే జరుగుచున్నవి. యీగుడి యావరణంలోనే యీశాన్య భాగమందు శ్రీవిష్ణు పాదములున్నవి. యిచ్చటనే పిండప్రధానము గావించి పుష్కరిణిలో బడవైతురు. విష్ణు పాదము లీపుష్కరిణిలోనే యున్నదనియు దర్ప్రలిసులైన యీ పాదములయందుగాని, బసలో గాని పిండదాన మొనరించి పుష్కరిణిలో వైచు యాచారమని కొందఱనిరి- ప్రకృతమందు శ్రీ రాజాగారు కాలనానదిలో నున్నందున నావల 3వ తేది బుధ నాడు ప్రాతఃకాలమందీలాకు దాటి ధవళేశ్వములో సత్రములో దిగి గోదావరి స్నానాదులు గావించి భోజనానంతరమందు రెండవపూట స్టీంబోటు తెప్పించి దాని పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/12 6వ తేదికి సరియైన బెజవాడలో బ్రవేశించి మధ్య పుష్కరములో పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/14 10వ తేది. బు|| సింగరాయకొండలో బ్రవేశించితిమి. 11వ తేది గు|| కావలిలో నివసించినాము 12వ తేది శు|| రాజుల పాలెము సత్రములో బసచేసితిమి.


13వ తేది శ|| నెల్లూరిలో శ్రీ రంగనాయకులవారి చిత్రకూటములో బ్రవేశించి నారము త్రోవ సరళముగానే యున్నది యీ నెల్లూరు. జిల్లాస్థలమై పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/18 14వ తేది ఆది|| మనుబోలు సత్రములో నివసించి నారము ఇది శ్రీ వెంకటగిరి సంస్థానాధిపతుల యొక్క దక్షిణాది తాలూకాలలో నొకటియై యున్నది

ఫిబ్రివరి 15వ తేదికి సరియైన పార్థివ సం|| మాఖ శు 11 సోమవారమున గొల్లపల్లి మకాము దాటి శ్రీ వేంకటగిరి మహా రాజధానిలో క్షేమముగా బ్రవేశించినారము పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/20 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/21 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/22 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/23 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/24 పిబ్రివరి తే2. వది. ఆది- శ్రీ వేంకటగిరి మహారాజధానినుండి బయలుదేరి యా రాత్రికి 2|| ఆమడదూరములోనున్న రేణుగుంటయను గ్రామము జేరినారము తే 22వది సోమ| ఉదయమందు శ్రీమదిందిరాసుందరీ మందిరాయమానంబగు చెన్నపురీ మహారాజధానిలో మవుంటురోడ్డులో శ్రీవేంకటగిరి మహారాజావారి మోతీ మహలునకు సమీపమందున్న తదీయపుష్పక మహలులో బ్రవేశించితిమి - ఈ ప్రసేడిన్సీ క్రింద 23 జిల్లాలు గలవు పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/27 మార్చి తే 8ది సో|| చెన్నపురిలో ఫస్టుక్లాసు రు8 థర్డుక్లాసు రు చొ|| చార్జీయిచ్చి రయిలెక్కి రేణుగుంటలో విడిచి బండ్లమీదుగా తిరుపతిలో బ్రవేశించి మరునాడు కొండయెక్కి నారము. పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/29 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/30 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/31 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/32 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/33 మార్చి తే10ది యైన ఫాల్గుణ శు 5 బుధ|| తిరుపతినుండి బయలుదేరి, చిరతానూరులో వేంచేసియున్న యలమేల్మంగను సేవించికొని రాత్రికి రేణుగుంటలో జన 1కి రు

తే 11ది 8 ఘంటలలో శ్రీ కంచిలో ప్రవేశించినారము. పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/35 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/36 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/37 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/38 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/39 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/40 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/41 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/42 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/43 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/44 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/45 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/46 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/47 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/48 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/49

మార్చి 14వ తేది కంచి నుండి బయలుదేరి 15వ తేది ఫాల్గుణ శు 10 సో|| మధురలో బ్రవేశించితిమి. పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/51 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/52 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/53 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/54 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/55 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/56


మార్చి 17వ తేది బు|| మధురకు 23 మైళ్లదూరములోనున్న ముత్తనందల్ సత్రములలో బస యీ సత్రములు 2 శివగంగరాజావారివి. శివ


మార్చి 18వ తేది. గు|| ఇక్కడికి 22 మైళ్ల దూరమునందున్న మగుడి సత్రములో బసచేసితిమి. ఇదియు శివగంగ రాజావారిదేనట.


మార్చి 19వ తేది శు|| రామనాథపురములో జేరియున్న లక్ష్మీపురములో నున్న రామనాథపురపు రాజావారి యొక్క యెదుట టెంకాయ గున్నలు సాంద్రముగాగల మూడు భవంతుల సత్రములో దిగినారము.


మార్చి 20వ తేది శ|| 24 మైళ్ల దూరములోనున్న ఉచ్చపుళి సత్రములో దిగినారము. మార్చి తే 20 ది ఆ|| ---లో బసచేరినారము. పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/62 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/63 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/64 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/65 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/66



మార్చి 24వ తేది బు|| రెండవపూట రామేశ్వరమునుండి బయలుదేరి పామస్ రేవున పడవలెక్కి ఆ రాత్రి బయలుదేరి 26వ తేదీ శు|| నాడుదయంబునకు దర్బశనము చేరి రామనాధపురపు రాజావారి సత్రములో బసచేసి- చక్రతీర్థ రామతీర్థములయందు స్నానంబుజేసి నిస్తరంగఘోషమై 3 మైళ్లదూరమందున్న రత్నాకరమందు స్నానదానాదికంబు లొనరించి- వెంటనేవచ్చి దేవళంబులో వేంచేసియున్న క్షేత్రపాలకుడైన శ్రీజగన్నాధస్వామిని లక్ష్మిని దర్భశాయియై నాభికమలమందు బ్రహ్మగల శ్రీరామమూర్తిని హనుమల్లక్ష్మణ సహిత శ్రీరామోత్సవ విగ్రహములను సేవించుకొని బసకు వచ్చి భుజించి- శంఖాదిపదార్ధములనుకొని సంగ్రహించి- 2 ఘంటలకు బయలుదేరి- రాత్రికి రామనాధపురపు దరినున్న లక్ష్మీపురపు సత్రములో బసచేసినారము.

26వ తేదీ రాత్రి బయలుదేరి 27వ తేదీ శ|| నాటి ప్రాతఃకాలమందు నవపాషాణంబుల దీరి నున్నయొక గ్రామంబులోనున్న రామనాధపురపు రాజావారి సత్రంబులోదిగి- అక్కడికరమైలుకులోగానున్న సముద్రతీరమందలి మంటపంబుచేరి చక్రతీర్థస్నాన పూర్వకంబుగా సంకల్పంబుజెప్పి- సేతువు వద్దవలెనే ధనుఃపూజచేసి ప్రార్ధించి సాధారణపు చర్వువలే నిస్తరంగమై క్రమనిమ్నమైన సముద్రములో మునుపటివలె స్నానము చేసుకొని సముద్రములో మూరెడు నీరున్నచోట శ్రీరాములవారు సేతబంధనారంభ మందిసుకతో స్థాపించి పూజించిన నవగ్రహసంజ్ఞగల నవ పాషాణములను పూజించి గోధూమాది నవధాన్యములు గ్రహపీడాద్యనర్ధ పరిహారార్ధమై నవగ్రహప్రీతిగా యథాశక్తి దక్షిణములతో దానములుచేసి ప్రదక్షిణ పూర్వకంబుగా నమస్కరించి తర్వాత హిరణ్యశ్రాంధాదికములు జరిగించి యిచ్చటనేయున్న గణపతి హనుమంతులను దర్శించి యచ్చటికి పడమరగా సమీపమందున్న శ్రీ జగన్నాధస్వామిని లక్ష్మణ హనుమత్సహితులైన శ్రీరాములవారిని సేవించుట విధియై యున్నది. ఇటీవల కొంతకాలంబుక్రిందట నొకచోటద్రవ్వుచుండగా బంచలోహమయమైన శ్రీ సీతా విగ్రహము దొరికినందున దానినీజగన్నాధాలయములో శ్రీ రాములవారి పాశ్వన్మందు నూతనంబుగా బ్రతిస్టించిరని విన్నారము. తిలకేశ్వరుడని యొక శివలింగమున్నగుడి సత్రంబునకెదురుగా వున్నది. అదియు సేవింతురు--గనక మేమునట్లనే యీయాత్రజరిగింది. భోజనానంతరమే బయలుదేరి రామనాధపురపు దరినున్న లక్ష్మనపురపు సత్రంబునకారాత్రికే జేరివెంటనే బయలుదేరి దినక్రమంబుగా పరమగుడి ఉచ్చపులి ముత్తనందల్ వీనిమీదుగా మార్చి30 వ తేదీ ఉదయంబునకు మరలా మధురలో బ్రవేసించినారము. దశపాషానంబులు ధర్బ శయనంబు, యెత్తెలమండపంబు యీ స్థలములోపల నారామడవలయముగా గల ప్రదేశమును పుల్లారన్యమందురు. ఇచటిసంకల్పంబులో పుల్లారణ్యేయనియుం జెప్పుదురు.

ఏప్రిల్ --వ తేదీ రయల్ మీదుగా తామ్రపణీ తీరమందున్న తిరునల్వేలిలో లోకల్ఫండు యిలాకా సత్రపుమాడిలో ప్రవేసించినారము., ఇది రయలాఫీసు దరినున్నది. గనుక అన్ని పదార్ధములుగల మంచియంగల్లున్నవి ఇక్కడికి దక్షిన భాగమందు సమీపంబులో, తామ్రపణిన్ మహానది, ప్రాగ్వాహినిగావున్నది. ఆ నదిలో ---మండపములు,---చప్టాలున్నవి. పూర్వకాలమందొక దూరదేశభక్తుడు తన తలిదంద్రుల యస్తికలు, కాశీగంగలో వైచుటకుగా బయలుదేరి, దేహాశక్తతయూ, ద్రవ్యాసక్తతయూ గలిగి, పోజాలక చాల కించపడుచుండగా గంగ ప్రసన్నురాలై, ఓభక్తుడా నీవీతామ్రపనీన్నదీతీరమందే నిల్వుము నేనువచ్చి, నీతెచ్చిన యస్తికలను స్వీకరింతునని స్వప్నమందు చెప్పగా, వాడట్లనేనిల్చి, నిరీక్షింపుచుండగా గంగ తామ్రపర్నిలో మిలితముగావచ్చి, యీ భక్తుడున్నచోట, ప్రవాహమద్యమునుండీ కంకణముద్రికాలంకృ తమైన తనచేతితో వాడు తెచ్చిన, యస్థికలను స్వకీయముగాపిల్చి స్వీకరించి, నేటినుండీయూ నెవ్వరస్థికలనీ తామ్రపర్ణిలో వైతురో, వారిపిత్రుదేవతలును, వారును, శాశ్వతపదవి నొందుదురనియు, నేనిందు సన్నిహితురాలనైయుందుననియు గంగ, యానతిచ్చెనట. కావుననే, నేటివరకదేతీరున నస్థికలవైచుచు హిరణ్యాది శ్రార్ధంబులను జేయుచుంట, సదాచారమై యున్నదనియు, స్థలపురాణములో నిట్లున్నదనియు నిక్కడి పెద్దలనిరి, దీని యుత్తరతీరమునందా నందవల్లీదేవీసహిత కైలాసనాథేశ్వరమందిర మొక గోపురముతో, నొకప్రాకారముతో సాధారణముగానున్నది. యిది బహుపురాతనమని చెప్పుదురు, గొప్ప తేరొకటియున్నది, తగుమాత్రపు వాహనములున్నవి. అప్పుడప్పుడుత్సవములు జరుగుచుండును, ఏటికి దక్షిణ, నైరుతిగా, పాలెంకోటయని, యొక జిల్లా స్థలమున్నది. ఖచేరీలన్నియుంగలవు, పట్టణ మొకతరబడీగా, గొప్పదిగానున్నది, అన్ని యంగళ్లు గలవు, ప్రతి ఇల్లు, ప్రతి మిద్దె, ప్రతి మహడీ, సమీపశ్రేణిగాయున్నప్పటికీ నొకదానినొకటియంటియుండక ప్రత్యేకావరణములు గలిగి వీధులలో టెంకాయ వగైరా చెట్లలోవున్నందున, సుందరముగానే కనబడూచున్నది, స్త్రీ పురుషులు, మధురలోవలే నుందురు, గానీ స్త్రీలకు మధురలోవలే వికారపు చెవికుట్టురంధ్రములు లేక యధోచితముగానున్నందునను, తగుమాత్రపు భూషణములున్నందునను, ఇంచుకంత చూడతగియుందురు. కంచిమొదలుకొని యిదివరకు చూచిన యావద్దేశములోను స్త్రీలుగాని పురుషులుగాని, ఆబాలగోపాలముగా, స్నానము భస్మదారణము, దైవభక్తి, తాంబూలము, లేనివారు లేనేలేరు, తఱచుగా స్త్రీలును, వితరంబుగా పురుషులునూ, రంగుబట్టలు కట్టుదురు, ఈప్రాంతములయందు అరటితోటలు, టెంకాయ తోటలు, వగైరాలు బహుసాంద్రముగానున్నందున టెంకాయలు, అరటిపండ్లు, అరటికాయలు కొన్ని కొన్ని కూరలు, వలసినన్ని, య రలు,వలసినన్ని యధోచితమైనవెలకు దొరకును,ప్రతిగొప్పస్థలములోను పాటపాట తెలుగువచ్చిన బ్రాహ్మనులు,వర్తకులునుగలరు.ఇక్కడితో దగింపురైలుసరి.ఇక్కడినుండిరోడ్డు మీదుగాబండ్లుచేసుకునిగాని, నడచిగాని యనంతశయన మైదుదినములకు జేరుదురు. కొండత్రోవ ఇప్పుడు యండలు మెండుగావున్నందున, త్రోవలో బావులలోసైతము నీరు దొరకక మిగుల శ్రమయగుననియు, ప్రక్రుతమందు రక్తభేదులు నోటిపూత పుట్టుననియు బహుజనులు చెప్పినందున తిరువనంతపురమునకు బయలుదేరలేదు. అనంతశయనమునుండి సముద్రపుద్రోవగుండా --దినములుపోగా అచ్చట ఖరాసురప్రతిస్థితములైన 3 లింగములు గల 3 దివ్యస్థలములు. గొప్పమహిమ నేటికిని కనపరుచుచున్నవని ఇక్కడివారుచెప్పినారు. రెండుచేతులతోను రెండులింగములు నోటితో నొకలింగము ఏకముహూర్తమందు ఖరాసురుడు ప్రతిస్థించెనట. అందులో కుడిచేతితో ప్రతిషించెనస్థలము వెక్కెము. ఎడమచేతితోప్రతిష్టించినస్తలము ఏత్వనూరు నోటితో ప్రతిస్టించినస్తలము కడిత్తురి అనిచెప్పుదురు. వాటిమహిమలు ముందుచూచినపైని వ్రాయుచున్నాము. ఈ --వెల్లిస్టేషనుదరినున్న యూరికుత్తరముగా సుమారు--మయిల్లదూరములో తిరునల్వేలియని యొక--పాలెంకోటవంటిబస్తీపట్టణముగలదు. రమ్యముగానేవున్నది. స్త్రీపురుషులు మధురలోకన్నా కొంతమెరుగుగానుందురు. ఇక్కడనల్లెపారే తిరునల్వేలీస్వర్ శ్రీ వేనువనేస్వుడు అని మూడు పేలుగల స్వయంవ్యక్త శివునిస్థలము--4 గోపురములు --ప్రాకారములు పెక్కు మండపములుగలిగి-- బహువిశదముగానున్నది. ఆచెంతణె శ్రీకాంతిమతీదేవియొక్క మందిరము సుందరముగానున్నది. ఈరెండును మధురమందిరమువలే కలసియున్నవి. అమ్మవారిగుడికి మూడుప్రాకారంబులున్నవి. అందు--ప్రాకారములోపుష్పవనములోనున్న వన తోత్సవ మండపము విశాలరమనీయము. ఈవనమందే --------దళములుగల బిల్వవ్రుక్క్షములున్నవి. ఆదలములు చిన్నవిగాను సుందరముగాను కనబడినవి. అమ్మవారిగుడి -వ ప్రాకారంలో స్వర్నతీర్థమని చిత్రతీర్థమనీ సరస్సులు-బహునిర్మలముగానున్నవి. వీనిలో స్నానముజేసి తత్సమీప శతస్థంభమంటపమందున్న గణపతిని కాంతిమతిని కుమారస్వామిని తత్పరివార దేవతలను-సేవించి తర్వాతస్వామివారిని సపరివారముగా సేవించుట యిక్కడియాచారమంట--మధురలోనిట్టియాచారము గలదు. మేము శుక్రవారమునాడు సా యంకాలమందు దర్సనమునకు వెడలినప్పుడు బెక్కుగా గ్లోబులూ-దీపములూ వెలిగించినందున బహు మనోహరముగానున్నది.అమ్మవారి మూర్తియు నలంకారములును రమ్యముగానేయున్నవి. అమ్మవారు మీనాక్షికన్న నించుకంత యున్నతంబుగా రాచఠివిగా ప్రౌఢముగా నిలువంబడియున్నారు. తర్వాత స్వామి మందిరంబునకు వచ్చి యట్లనే యలంకరింపబడిన సన్నిధినిగాంచి సంతసించి స్వామిని సేవించి ప్రదక్షినమొనర్చి వచ్చినారము. ముఖమండపములో మణిమండపమని యొకమండపమున్నది.దానికి---స్థంభములున్నవి. అందులో--ంటికొక స్తంబములో యేకండిగా----దేసిచిన్నస్థంభములు మలచియున్నారు. తక్కిన రెండుమూలస్తంభములయొక్క యేకండిశిలలో---గేసిపోకబోదెలవంటి చిన్నస్తంబములువెదురుపొదవలెనేయున్నవి. ఈపని వింతగానే యున్నది.ఆచిన్నస్తంభములు గోటితోమీటితే--స్వరములు అనగా చతుర్వింశతిశ్రుతులు పలుకును. ఏకశిలయందు మలచినట్టు చెప్పుదురుగాని శిలకు ధ్వని యెచ్చటినైనను గానముగాన లోహస్థంభములు మట్టుదిమ్మలో వాటినినిలబెట్టినట్టు నాదముబట్టియూ నాకారముబట్టియునూహింపదగియున్నది. గవర్నమెంటువారు-----దేశపుశ్రోత్రియపుదస్తు----జమలారు------భక్తులవల్లసుమారు రు ౨౦౦౦ కలిపి రు ౨౫౦౦౦ సాలు ౧కి రాబడిగలదట, యింతయు వినియోగపడునట, లక్షవరకు గుడిలో నిలవగా నున్నదట, ఆణి నెలలో (మిథునమాసములో) స్వామివారికిని తులామాసములో అమ్మవారికిని బ్రహ్మోత్సవములు, దివ్యంబుగా జరుగునట. స్వామిగుడికి పడమరగా పూర్వమందు స్వామియావిర్భవించిన చోటికి బహు సన్నిహితమైన వెదురుపొద యున్నతావున్నది. ఇప్పుడు పొద లేదుగాని వర్షాకాలములో మొలకలెత్తుచుండునట. యీస్వామి మహిమ పాండ్య ప్రభుకాలములో నొకగొల్లవాడు రాజునకు రోజును పాలుతెచ్చి యిచ్చుచున్న కాలములలో వొక వెదురుపొద యెదుటికి వచ్చువరకు కాలికి డక్కా తగిలి పాలొలికి పోవుచుండుట మూడుదినములు చూచి నాల్గవనాడు పదిలంబుగా వచ్చిన నట్లనే పాలొలికి పోవుటయేగాక కాలి బొటనవ్రేలికి దెబ్బతగిలి రక్తము వచ్చినందున శఠించి వాడాతావున నేమున్నదోయని త్రవ్వుచుండగా రక్తమూరుచు లింగాకారముగా స్వామి యావిర్భవించినదినంగాంచి వెరగంది యీసంగతి పాండ్యరాజుతో విన్నవింపగా నతండు మిగుల నాశ్చర్యబడి భక్తుడు గనుక యీ గోపుర ప్రాకార మంటపారామ పుష్కరిణీ సంపన్నములుగా నీమందిరములు కట్టించి వేణువనేశ్వరుడను పేర దానొక లింగమును, కాంతిమతీదేవిని, పరివారదేవతలను, భక్తులను ప్రతిష్ఠించి మంచిదైన యొకదేశము శ్రీస్వామివారికి, నమ్మవారికిని సమర్పించెనని స్థలపురానమందున్నట్టు క్షేత్రవాసులనిరి.5-6 తేరులున్నవి. అందొకతేరు బహుచిత్రముగాను, బహున్నతంబుగాను, కనబడినది. మరొకటి కొంచెము తక్కువైనను తత్తుల్యంబుగానే యున్నది. అమ్మవారి గుడిలో వేదత్రయపాఠము బహు శిష్యులకు జెప్పుచున్న యుపాద్యాయులు పెక్కుండ్రుగలరు.

ఏప్రిల్ 3వ తేదీ ఆదికి సముద్రతీరమందున్న తూతుకూరులో ప్రవేశించినారము. ఇది తిర్నవిల్లి జిల్లాతో సంబంధించిన షహరు గనుక సబ్ కలెక్టరు వగైరా దొఱలు కొందఱు గలరు. మధుర దాటిన ౨ ష్టేషనుల వరకు, వరిపంట బహు యుక్తముగానే యున్నది. ఈవలగోయుచు నావల వెదజల్లుచుండిరి. తర్వాత తిర్నవిల్లివఱకు, ప్రత్తి పంటకన్న రెండవపంట కనబడదు. ఒక్కొక్క తావున, మిరియపు తోటలు, కందిచేలు ఆముదపు చేలును, గలవు. కాబట్టి ఈ తూతుకూరులో ప్రత్తివర్తకులు పెక్కుండ్రు గలరు. యంత్రములతో దూది యేకుదురు. ప్రత్తివిత్తులు, మిక్కిలి చవకగా గరిసెలకొలంది దొఱకును. గనుక, పశువులు బహు పుష్టిగానే యున్నవి. ఈ యూరిలో గొప్పయంగల్లు గలవు. ౪౫ షాపులున్నవి. రోడ్డుపక్కలను, గంగరావిచెట్లు సాంద్రముగా పంక్తిగా మొలపించుటవల్ల చల్లగాను, రమ్యముగాను, కనబడును. సుమారు మధురలోవలెనే ఇండ్లున్నవి. పడమర సముద్రమునకిది సన్నిహితప్రదేశము. సముద్రమునకు, తరంగములు లేవు. చెర్వువలె యున్నది గనుక. ౪౫ దేసి వందల గజముల దూరము వరకు ఱాళ్ళుపాతి ౭౮ వంతెనలు కట్టియుంచిరి. దూది వగైరా యెగుమతి దిగుమతి వంతెనలగుండా నడిపి పడవలమీదవైచుచూ దిగియుచుందురు. ఈ బస్తీలో నొకదొఱ యొక్క బంగళా రవునుగాను సమున్నతముగాను, బహుసుందరముగాను- పుష్పవన పరివేష్టితముగాను ప్రసిద్ధికెక్కినది గలదు. పిళ్ళారిగుడి కెదుటనొక ఱాకట్టపు కొలను గలదు. అది బహురమ్యముగానున్నది. దానిలో నీరు కావేరీ జలతుల్యముగా నున్నది. నీరెత్తి పైని స్నానము సేయవలెను. గాని దిగనివ్వరు. జలజంతువుల యొక్క యముకలు చిరకాలము, సముద్రమందున్నందున చిన్న చిన్న రంధ్రములు గలిగి శిలలవలే నతికఠినముగా నుండును. పురజనులు వానిచేతనే గోడలు పెట్టుదురు. (భిత్తి స్త్రీ కుడ్యమేడూకంతదంతర్నయస్తకీకసం) అని యమరమందున్న యేడూక శబ్దమిచ్చటి గోడలకు రూఢిగానే చెల్లును. ఒక సెట్టి కట్టి ందిన విశాలసత్రమొకటిగలదు. మేము వచ్చిన మరునాడు-పార్ధివ సం#ఫాల్గుణ బ ౩౦ ఆదివారమైనందున శంఖములు పుట్టునట్టి శంఖముఖ్హమనెడు దీవునకుసమీపమందు సముద్రస్నానము చేసితిమి. అడుగునచతురాది బహుకోణములుగాను- క్రమోన్నత విశాలముఖములుగాను తాటియాకు బుట్టలును చాపలును- సుందరముగా తయారుచేసి చవకగానేయమ్ముదురు. సముద్రపురోడ్లు తప్ప- తక్కినరోడ్లు చూడదగియుండవు.ఏప్రిల్ ౪వ తేది సో# రెండుజాములకు బయలుదేరి రయల్మీదుగా తిరచనాపల్లికి వచ్చి తెల్లవారినపైని వ్యయ సం# చైత్ర శు ౧ నాడు తిరుచునాపల్లి నాల్గువీధులూచూచి ౮ఘంటలలోగా శ్రీరంగములో ౭ ప్రాకారంబులో చిత్రవీధిలో ప్రవేసించి తీర్థప్రయుక్తపవనపురస్వరముగా శ్రీకావేరీస్నానంబు చేసి ౪ ఘంటలప్పుడు ప్రాకార ప్రదక్షినంబుగా గుడికిబోయి వత్సరాద్యుత్సవము- గనుక యెదటి మండపంబులో పంచాంగ శ్రవణా---- వేంచేసియున్న యుత్సవులను సేవించి తరువాత మూలవిరాట్టయి సప్తప్రాకారమధ్యేయను శ్లోకములోచెప్పబడిన చందముగా వేంచేసియున్న శ్రీరంగనాయకులవారి దర్సనము సావధానంబుగాచేసి సేవించుకుని బసకేగి భోజనశయనదులొనరించి మరునాడు. దక్షిణ కావేరీ స్నానపుర్వకంబుగా యధావిధిగా గరుడాది పరివార సహితంబుగా శ్రీరంగనాయకులను ౫వ ప్రాకారంబులో నొక మందిరంబునందే వేంచేసియున్న శ్రీదేవీ, భూదేవీ,రంగనాయకీ దేవీ త్రయంబును సేవించినారము.ఆ రెండవపూట తిరుచనాపల్లి మరలజూచి మరునాడు కావేరీ స్నానపూర్వకముగా శ్రీరంగమున కాగ్నేయముగా సుమారు ౧# మైలుదూరమందున్న జంబుకేశ్వరక్షేత్రమునకు బోయి (అబ్లింగమైన) శ్రీజంబుకేస్వరస్వామివారిని శ్రీమదఖిలాండేస్వరీ దేవీదర్సనపూర్వకముగా సేవించినారము. ఆ రెండవపూట సాయంకాలమందు తిరుచినాపల్లి (త్రిశిరహ్ పుర) పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/76 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/77 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/78 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/79 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/80 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/81 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/82 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/83 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/84 ఏప్రిల్ 9వ తేది వ్యయ సం|| చైత్ర శు 4 గు|| తంజావూరులో రాదారి బంగళాలో రాత్రికి ప్రవేశించినారము. తంజావూరు చోళదేశ మహారాజుల రాజధాని. షహరు చుట్టు నగద్దె జలసంపన్నమైయున్నది. పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/86 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/87 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/88 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/89

ఏప్రిల్ తే 10ది చైత్ర శు|| శ|| నేడామంగళపు స్టేషనుకు దక్షిణముగా, 8/9 మైళ్లదూరములో, చంపకారణ్యమనియు, దక్షిణద్వారక యనియు, ప్రసిద్ధికెక్కిన రాజమన్నారు గుడియనెడు, మహాక్షేత్రం పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/91 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/92 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/93

ఏప్రిల్ 11 వ తేది ఆ|| నాడు నాగపట్టణములో బ్రవేశించితిమి. పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/95 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/96 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/97 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/98 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/99 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/100

ఏప్రిల్ 13వ తేది చైత్రశు 9 మం|| శ్రీ కుంభఘోణము సత్రములో బ్రవేశించినారముపుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/102 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/103 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/104 1886 సం|| యేప్రేల్ 14వ తేదికి సరియైన వ్యయ సం|| చైత్ర శు 11 బుధవారము ఉదయకాలమునకు మధ్యార్జున మహాక్షేత్రములో నాటుకోటి సత్రములో బసచేసినారముపుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/106 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/107

యేప్రేల్ తే 14 ది రాత్రికి మయూరక్షేత్రములో నాటుకోటి సత్రములో బసపుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/109 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/110

యేప్రేల్ 16వ తే|| ఉదయానకు వైద్యనాధక్షేత్రములో నాటుకోటిసత్రములో బ్రవేశించినారము. చైత్ర శు13 శు|| సరియైన ఏప్రెల్ 16వ తేదీ సాయంకాలమందు స్వామిని సేవించినారము. పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/113 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/114 ఏప్రేల్ 17వ తేది చైత్ర శు14 శ|| రు 0-2-0 రెండణాలు-రైలు చార్జీయిచ్చి రైలెక్కి శ్రీ చిదంబర క్షేత్రములో ప్రవేశించినారము. పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/116 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/117 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/118

ఈ చిదంబర సభానాయక మూల విగ్రహమునకు సంవత్సరములో 6 ఆరుమార్లు జ్యేష్ఠాభిషేకము గనుక శ్రీ చిత్సభలోనుండి కనకసభలోని కమ్మవారిలో స్వామివారిని వేంచేయజేసి యభిషేకించుకాలములు. పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/120 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/121 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/122 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/123 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/124 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/125 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/126 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/127 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/128 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/129 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/130 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/131 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/132 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/133 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/134 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/135 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/136 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/137 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/138 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/139 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/140 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/141 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/142 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/143 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/144 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/145 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/146 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/147 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/148 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/149 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/150 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/151 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/152 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/153 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/154 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/155 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/156 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/157 పుట:Yaatraa charitra puurvabhaagamu.pdf/158

ఇతర మూల ప్రతులు

[మార్చు]

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.