భాస్కరరామాయణము/సుందరకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

భాస్కరరామాయణము

సుందరకాండము



రమణీహృదయేశ్వర
కారుణ్యసుధాంబురాశికల్లోలభవ
శ్రీరంజితవరవైభవ
సారయశశ్శ్రీవిహార సాహిణిమారా.

1


క.

అంతం గపివీరులతో, సంతస మందంగఁ జండసమరజయశ్రీ
మంతుం డగుహనుమంతం, డెంతయు బలగర్వ మెసఁగ ని ట్లని పలికెన్.

2


చ.

ఉరవడి నుప్పరం బెగయ సూఁకుమదీయపదోగ్రఘట్టన
స్ఫురణము సైఁపలేక వడి భూమి దిగంబడుఁ గాన యిమ్మహీ
ధరదృఢభూరిశృంగములు దాఁపలుగా లఘులీల దాఁటి స
త్వరగతితోడ యోజనశతంబును గూడ నతిక్రమించెదన్.

3

హనుమదాదివానరులు మహేంద్రగిరిం జేరుట

చ.

అన విని సంతసంబున సమస్తకపీంద్రులుఁ జేరి యాసురేం
ద్రున కనురక్తి దేవతలు మ్రొక్కువిధంబున మ్రొక్కి వాయునం
దను నవపుష్పమాలిక నుదంచితకాంచనకుండలంబులం
గనకమయాంగదంబులఁ దగంగ నలంకృతుఁ జేసి రత్తఱిన్.

4


చ.

అనుపమవిక్రమక్రమసమగ్రభుజార్గళుఁ డైనవాయునం
దనుఁడు నిజాప్తవానరులుఁ దానును నెక్కె మరుత్సురాంగనా
జనకృతసంగశృంగచయసంగతతారకసూర్యచంద్రమున్
[1]ఘనవనమంద్రమున్ సుజనగమ్యనగేంద్రము నమ్మహేంద్రమున్.

5


వ.

ఇవ్విధంబున నెక్కి బహుఫలకిసలయకుసుమవిలసితలతాతరువిసరభాసురంబును
ఘోరతరరవశరభసైరిభభైరవకంఠీరవచండమదోద్దండవేదండపుండరీకభల్లూక
విపులవిషాభీలకాలవ్యాళకోలస్థూలగోలాంగూలప్రముఖప్రాణికులంబును గాక
మూకానేకపక్షికులవ్యాకులంబును నభ్రంకషోత్తుంగశృంగంబును సురాసురయ

పుట:భాస్కరరామాయణము.pdf/323 పుట:భాస్కరరామాయణము.pdf/324 పుట:భాస్కరరామాయణము.pdf/325 పుట:భాస్కరరామాయణము.pdf/326 పుట:భాస్కరరామాయణము.pdf/327 పుట:భాస్కరరామాయణము.pdf/328 పుట:భాస్కరరామాయణము.pdf/329 పుట:భాస్కరరామాయణము.pdf/330 పుట:భాస్కరరామాయణము.pdf/331 పుట:భాస్కరరామాయణము.pdf/332 పుట:భాస్కరరామాయణము.pdf/333 పుట:భాస్కరరామాయణము.pdf/334 పుట:భాస్కరరామాయణము.pdf/335 పుట:భాస్కరరామాయణము.pdf/336 పుట:భాస్కరరామాయణము.pdf/337 పుట:భాస్కరరామాయణము.pdf/338 పుట:భాస్కరరామాయణము.pdf/339 పుట:భాస్కరరామాయణము.pdf/340 పుట:భాస్కరరామాయణము.pdf/341 పుట:భాస్కరరామాయణము.pdf/342 పుట:భాస్కరరామాయణము.pdf/343 పుట:భాస్కరరామాయణము.pdf/344 పుట:భాస్కరరామాయణము.pdf/345 పుట:భాస్కరరామాయణము.pdf/346 పుట:భాస్కరరామాయణము.pdf/347 పుట:భాస్కరరామాయణము.pdf/348 పుట:భాస్కరరామాయణము.pdf/349 పుట:భాస్కరరామాయణము.pdf/350 పుట:భాస్కరరామాయణము.pdf/351 పుట:భాస్కరరామాయణము.pdf/352 పుట:భాస్కరరామాయణము.pdf/353 పుట:భాస్కరరామాయణము.pdf/354 పుట:భాస్కరరామాయణము.pdf/355 పుట:భాస్కరరామాయణము.pdf/356 పుట:భాస్కరరామాయణము.pdf/357 పుట:భాస్కరరామాయణము.pdf/358 పుట:భాస్కరరామాయణము.pdf/359 పుట:భాస్కరరామాయణము.pdf/360 పుట:భాస్కరరామాయణము.pdf/361 పుట:భాస్కరరామాయణము.pdf/362 పుట:భాస్కరరామాయణము.pdf/363 పుట:భాస్కరరామాయణము.pdf/364 పుట:భాస్కరరామాయణము.pdf/365 పుట:భాస్కరరామాయణము.pdf/366 పుట:భాస్కరరామాయణము.pdf/367 పుట:భాస్కరరామాయణము.pdf/368 పుట:భాస్కరరామాయణము.pdf/369 పుట:భాస్కరరామాయణము.pdf/370 పుట:భాస్కరరామాయణము.pdf/371 పుట:భాస్కరరామాయణము.pdf/372 పుట:భాస్కరరామాయణము.pdf/373 పుట:భాస్కరరామాయణము.pdf/374 పుట:భాస్కరరామాయణము.pdf/375 పుట:భాస్కరరామాయణము.pdf/376 పుట:భాస్కరరామాయణము.pdf/377 పుట:భాస్కరరామాయణము.pdf/378 పుట:భాస్కరరామాయణము.pdf/379 పుట:భాస్కరరామాయణము.pdf/380

హనుమంతుఁడు సీత యిచ్చినశిరోరత్నము రామున కిచ్చుట

క.

భూరిప్రభ నొప్పారెడు, నారత్నము నల్లఁ గేల నక్కున నిడికొం
చారాముం డనుజుండు మ, హారోదనము లొగిఁ జేసి రధికాతురతన్.

562


వ.

అప్పుడు సుగ్రీవాదులు బోధింప నెట్టకేలకు శోకం బుడిగి రామచంద్రుం డిట్లనియె.

563


క.

ఏదెసఁ జూచిన నాదెస, నాదృష్టికిఁ దాన యగుచు నామది నెపుడున్
వైదేహి పాయ దొండెడ, వైదేహిం గంటి మనుట వాదో నిజమో.

564


క.

మును నిమిషాంతరమును సైఁ, పనిమత్ప్రియ జలధిశైలబహుళాంతర యై
నను నెట్టు పాసి యున్నది, ఘనతరవిరహాగ్నిచేతఁ గ్రాఁగుచు నకటా.

565


క.

జనకసుతఁ బాసి నిలువవు, దనువునఁ బ్రాణములు నాకుఁ దడయక యింకన్
జనకసుత యున్నచోటికి, ననుఁ గొని చని వగలు మాన్పు నగచరవర్యా.

566


వ.

అనుచుఁ బ్రలాపించురామచంద్రు నూరార్చి హనుమంతుం డి ట్లనియె.

567


క.

అర్ణవము దాఁటి బహుభుజ, పూర్ణుం డగుపంక్తికంఠుఁ బొరిగొని జగముల్
వర్ణన సేయఁగ నీవర, వర్ణిని గొని తేరఁ బోవవలయు నరేంద్రా.

568


క.

అని పలికి జలధి దాఁటిన, తనవిక్రమ మాది గాఁగఁ దగువృత్తాంతం
బును సీతావృత్తాంతము, విన సర్వముఁ జెప్పె రామకవిభుతో వెలయన్.

569


క.

సురతరుణీకోమలతర, కరసరసిజపీడ్యమానకమనీయభవ
చ్చరణసరోరుహసేవా, కరణచణప్రమథనాథ గౌరీనాథా.

570


మాలి.

సవనభుగభినంద్యా సర్వలోకైకవంద్యా
రవిశశిశిఖినేత్రా రమ్యరామార్ధగాత్రా
భువననివహనేతా భుక్తిముక్తిప్రదాతా
ప్రవిమలగుణసంగా భవ్యకోటీరగంగా.

571


గద్యము.

ఇది శ్రీమదష్టభాషాకవిమిత్ర కులపవిత్ర భాస్కరసత్కవిపుత్ర మల్లికా
ర్జునభట్టప్రణీతం బైన శ్రీమద్రామాయణమహాకావ్యంబునందు సుందరకాండ
ము సర్వంబు నేకాశ్వాసము.

572
  1. ఘనవరరుంద్రమున్