భాస్కరరామాయణము/కిష్కింధాకాండము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

భాస్కరరామాయణము

కిష్కింధాకాండము



రమణీప్రియరమణీ
శ్రీరమ్యోరుకుచకుంభసేవాలోల
స్ఫారదృగాశయనేత్రాం
భోరుహపూజాప్రహృష్ట పురుషవిశిష్టా.

1


చ.

ఘను లగురామలక్ష్మణులఁ గార్ముకబాణకృపాణపాణులన్
సునిశితవిక్రమక్రముల సూర్యతనూజుఁడు చూచి భీతుఁ డై
మనము గలంగఁబాఱి ధృతి మాయఁగ నచ్చట నుండ నోడి యే
చినపెనువంతతోడఁ దనుఁ జేరిన మంత్రులఁ జూచి యి ట్లనున్.

2


తే.

ఘోరశస్త్రాస్త్రపాణు లై వీర లున్న, వారు కపటంపుఋషివేషధారు లగుచు
వాలిపంపున వచ్చి యీవనమునందు, వలసినట్లు క్రుమ్మరుచున్నవార లనిన.

3


వ.

ఆసుగ్రీవుమంత్రులగు వానరవీరులు నారామలక్ష్మణులం జూచి యధికభయంబున
జిత్తంబులు గలంగి.

4


క.

తరువులు నఱుముగఁ బుష్పో, త్కరములు రాలంగ ధరణిధరశిశిరంబుల్
చరణప్రహతుల విఱుగఁగఁ, గరిశార్దూలాదిమృగనికాయము బెదరన్.

5


క.

గిరిగిరిశిఖరంబులకును, దరుతరుశాఖలకు దావదావంబులకుం
బొరిఁబొరి దాఁటులు వైచుచుఁ, ద్వరితగతిం బాఱి రన్యవననగములకున్.

6


వ.

ఇట్లు కలంగి తొలంగినసుగ్రీవసచివులు హనుమంతుం బురస్కరించికొని యొ
క్కెడ నోసరించి యున్నసుగ్రీవుపాలి కేతెంచి ప్రాంజలులై యుండ నప్పుడు హను
మంతుం డినతనయు నుపలక్షించి నీ వెవ్వరిం జూచి వాలి పంపినవా రనుభయం
బునఁ దొలఁగ నేతెంచి యున్నవాఁడ విచ్చట.

7


ఉ.

వాలి యధీశుఁ డై పనుప వచ్చినవారలు గారు వార లా
వాలియుఁ గిల్బిషం బిపుడు వావిరిఁ జేయఁడు మర్కటత్వముం
బోలఁగ నీవు దాల్చుటకుఁ బూర్ణవివేకము లేక బేల వై
యేల మనంబునన్ బెగడె దింగితబుద్ధిఁ దలంచి చూడుమా.

8

క.

బుద్ధిం గార్యము దలఁపని, బుద్ధివిహీనులను భూతములె శాసించున్
సిద్ధింప దారయ నస,ద్బుద్ధులకును రాచకార్యభూతులు గలుగన్.

9


అని పల్కన్ హనుమంతుతో ననునయం బారంగ సుగ్రీవుఁ డి
ట్లను బాణాసనబాణతూణయుతబాహాత్యుగ్రులున్ దీర్ఘలో
చనులు దేవసుతోపమానులును నై చండప్రభన్ వాలునా
ఘనులం జూచిన నేరికిన్ భయము సక్రాంతంబు గా కుండునే.

10


ఉ.

వారలు వాలిపంపునన వచ్చినవా రనుశంక నామదిన్
వారక నాటి యున్నయది వాలియు నాయెడఁ గ్రించురాజు లే
పార ననేకమార్గముల నప్రియులం దెగఁజూతు రేర్పడన్
వారి నెఱుంగఁగా వలయు వచ్చునె నమ్మఁగ నెందు రాజులన్.

11


వ.

మఱియుఁ బ్రచ్ఛన్నవేషధారు లగువారలం జారులవలన నెఱుంగవలయు.

12


క.

నమ్మఁ జన దెదిరిఁ దమ్మును, నమ్మినవారి మదిలోన నమ్మక పరుపైఁ
గ్రమ్మఱఁ ద ప్పిడి చెఱుతురు, నమ్మ న్నేవారి నిపుడు నాహిత మారన్.

13


చ.

అనిలతనూజ నీవు ప్రియ మారఁగ వారలఁ జేరి వార లీ
వనమున కేమికారణము వచ్చిరొ యేటికి నస్త్రశస్త్రముల్
తనరఁగఁ బూనినారొ రణదర్పమునం జనుదెంచినారొ నే
ర్పునఁ బరికింపు రూపములఁ బోలఁగ మాటల సత్త్వదృష్టులన్.

14


క.

వారలు సన్మును లైనం, గోరిక విశ్వాసపఱిచి కూడి ప్రశంసల్
సారెకుఁ జేయుచు సామం, బారఁగఁ గావింపు మనకు నభిమత మొందన్.

15


క.

అని పలుకఁగ నగుఁ గా కని, హనుమంతుఁడు భిక్షుకత్వ మలవడఁగాఁ గై
కొని రామలక్ష్మణులకడ, కనుపమతరబుద్ధి నేఁగి యారాఘవులన్.

16


వ.

ప్రియోక్తుల నగ్గించుచు హనుమంతుండు వారల కిట్లనియె.

17


మ.

ఉరుమత్తద్విపవీర్యు లార్యగుణు లింద్రోపేంద్రతుల్యుల్ ప్రభా
కరతేజస్కు లుదారధీరులు శుభాకారుల్ బహుశ్రీయుతుల్
హరిసంచారులు భూరివర్షులు విశాలాక్షుల్ నిలింపేంద్రభా
స్వరచాపాంచితచాపసంయుతభుజుల్ శస్త్రాస్త్రవిద్యావిదుల్.

18


శా.

మీ రీకాన మృగంబులం గపులఁ బేర్మిన్ భీతిఁ బొందించుచుం
దీరోపాంతతరుప్రతానముల నర్థిం జూచుచున్ వేడ్కతో
నీరమ్యాపగచెంత నొప్పెదరు మీ రేపారు తేజంబునన్
గారా మారఁగ నిన్నగేంద్రము వెలుంగంజేయుచున్నా రొగిన్.

19


క.

సింహప్రేక్షణు లాతత, సింహపరాక్రములు భూరిసింహస్కంధుల్
సింహసమానబలాఢ్యులు, సింహకృశోదరులు పురుషుసింహులు మీరల్.

20


క.

కీలితకనకజ్వాలలఁ, గ్రాలెడి మీ కేల ముక్తకంచుకకీలా

జాలకరాళజనాంతక, కాలవ్యాళములువోలెఁ గరవాలంబుల్.

21


క.

నరమునివేషము లొందిన, నరనారాయణులపగిది నాకాగతని
ర్జరవరవహ్నులసరణిని, ధరణిం జరియించు చంద్రతరణులకరణిన్.

22


వ.

నెరయ మెఱయుచుం బరస్పరసమానరూపయౌవనగుణలక్షణవిక్రమక్రమవి
శేషంబులఁ బరఁగుచున్నా రని పలికి మఱియును.

23


మ.

పరిఘాత్యాయతబాహు లశ్వినిసరూపప్రాప్తు లుగ్రప్రభా
భరితుల్ పార్థివలక్షణాకలితు లై భాసిల్లుచున్నారు మీ
రరయన్ వార్ధిపరీతభూభువనరాజ్యం బొంద నర్హుల్ జటా
భరకృష్ణాజినవల్కలంబులు ధరింపం గారణం బేమొకో.

24


శా.

సుగ్రీవుం డనువానరేంద్రుఁడు రణకక్షోణీస్థలిం దన్ను న
త్యుగ్రప్రక్రియ వాలి దోలినఁ గడున్ దూరస్థుఁ డై ఋశ్యమూ
కగ్రావంబున నుండి మీకడకు సఖ్యం బొప్పఁ గావింప బ
ద్ధిగ్రాహిత్వముతోడఁ జెల్మికిని బుత్తేరంగ నే వచ్చితిన్.

25


క.

తపనతనూజుని సచివుఁడఁ, గపిమూర్తిని గామరూపిఁ గామగముఁడఁ గా
డుపుతనయుఁడ హనుమంతుఁడఁ, గపటపుభిక్షుకుఁడ దూతకార్యమ్మునకున్.

26


వ.

మీపాలికి నేతెంచి మీ రేరాజసుతులరో యేమహానుభావులరో యీపంపాతీర
దుర్గమారణ్యంబున కరుగుదెంచిన కారణం బేమియో యని హనుమంతుండు
పలికిన రామచంద్రుండు మందస్మితవదనారవిందుం డై సుమిత్రానందనుతోడ
మనవచ్చినవృత్తాంతం బెఱింగింపు మనిన సౌమిత్రి యావాయుపుత్రుం గనుంగొని.

27


సీ.

దశరథుం డనుపేరి ధరణిపాలాగ్రణి, కగ్రపుత్రుండు నా కగ్రజుండు
సర్వభూతహితుండు జనతాశరణ్యుండు, విక్రమక్రమశాలి విజయశీలి
రాముఁ డీసుగుణాభిరాముండు జనకుని, సత్యంబు నెఱప రాజ్యంబు విడిచి
తనపత్నియును దాను వనమున కేతేర, రక్కసుం డొక్కఁ డీరాజుదేవి
విపులపుణ్య సీతఁ గపటి యై కొనిపోయె, నేము లేనిచోట నేము వానిఁ
గాన కెల్లదిశలుఁ గలయంగ వెడకుచుఁ, దిరిగితిరిగి యొక్కవరణి రాగ.

28


క.

మునిశాపంబున రాక్షస, తను వొందినదనుసుతుండు దనువు మహీనం
దనసుద్ది మీకుఁ జెప్పెడి, నినజుం డని మాకుఁ జెప్పి యేఁగెన్ దివికిన్.

29


క.

కావున సుగ్రీవునిచే, నీవసుధేశుపతివార్త యెఱుఁగంగ సుహృ
ద్భావంబును భానుజుతోఁ, గావింపఁగ నిటకు రాక కపికులవర్యా.

30


వ.

అని మఱియు ని ట్లనియె.

31


సీ.

ప్రజలు ప్రసాదంబుఁ బడయఁగోరెడుభర్త, తరుచరేంద్రుని ప్రసాదంఁబు నొంద
సకలలోకులకును శరణదుం డగురాజు, కర మర్థి సుగ్రీవు శరణు సొరగ
నరనాథుఁ డగులోకనాథుండు ప్లవగనా, థుం డిచ్చఁ దనకు నాథుండు గాఁగ

నఖిలలోకసహాయుఁ డై యుండుపుణ్యుండు, కపివర్యుసాహాయ్యకంబు వేఁడ
రాజు లెల్లను సేవించు రాజగురుఁడు, వానరేంద్రుని సేవింప వచ్చినాఁడు
రామచంద్రుని కిట్టిదుర్దశలు వచ్చెఁ, జారుచారిత్ర యగుసీతకారణమున

32


క.

ఏ లక్ష్మణుఁడను రామమ, హీలలనుం డన్న గాన యీవిభువెనుకం
బోలఁ దపోవేషము నేఁ, దాలిచి వచ్చితి నభీష్టతను గానలకున్.

33


తే.

ధైర్యనిధి యయ్యుఁ దనపత్నిఁ దలఁచి తలఁచి, రామచంద్రుఁడు శోకవారాశిచంద్రుఁ
డగుచు నధికదైన్యంబుతో నాననంబు, విన్న నై యుండ నిచ్చట నున్నవాఁడు.

34

శ్రీరామసుగ్రీవులకు హనునుంతుండు సఖ్యంబు చేయుట

వ.

అనుచు బాష్పాకులలోచనుం డగుచున్న లక్ష్మణుం గనుంగొని హనుమంతుం డూ
రార్చుచు నతని కి ట్లనియె.

35


శా.

ఆలం బుద్ధతిఁ జేసి చేవ చెడి ధైర్యం బేది యవ్వాలిచే
నాలిం గోల్పడి వీడు వోవిడిచి రాజ్యభ్రష్టుఁ డై సంచిత
శ్రీ లెల్లం జెడి కానలో మఱుఁగుచుం జేడ్పాటుతో నుండుటం
జాలం బోలఁగ మీకు నర్కజునకున్ సఖ్యంబు వే కల్గెడున్.

36


క.

మీరును సుగ్రీవుఁడును, గారవమునఁ బొత్తు సేసి కపిసేనలతో
నారవిజుఁడు దోడ్పడఁగ ను, దారత సాధింపఁ గలరు ధారుణి యెల్లన్.

37


వ.

అనవుడు సౌమిత్రి ముదం బంది రామచంద్రుం గనుంగొని.

38


క.

చన నామాటల కలరుచు, ననురక్తిం జిత్తగించి యభిముఖుఁ డై యీ
హనుమంతుఁడు వినుచుండుట, నినజునకు మనకు మైత్రి యిప్పుడ కల్గున్.

39


వ.

అనిన రఘువరుండు హనుమంతుని సంభావించి యతని కి ట్లనియె.

40


క.

ఉగ్రాంశుకులీనుల మే, ముగ్రాంశుసుతుండు దాను నుచితం బరయన్
సుగ్రీవునకును మాకును, నగ్రియసఖ్యంబు సేయ నర్హము గాదే.

41


వ.

అని పలుకుచుండ హనుమంతుండు ముదం బంది కృతకార్యసిద్ధు లయిరి రాఘ
వు లనుచు నారామలక్ష్మణుల సముచితసంభాషణంబులం దేల్చి వారలం దో
డ్కొని ఋశ్యమూకంబు గడచి మలయాద్రి కరిగి యచ్చట రాఘవుల నునిచి
సుగ్రీవునిసన్నిధి కేఁగి సుగ్రీవా నీతోడిసఖ్యంబునకు రామలక్ష్మణులం దోడ్కొని
వచ్చితిఁ గృతార్థుండ వయితి వారామచంద్రుండు ధర్మజ్ఞుండును గృతజ్ఞుండును
సత్యసంధుండును బితృవాక్యపరిపాలకుండు నధికబలపరాక్రముండు నాశ్రితవత్స
లుండును గావున నీమనోరథంబు సఫలంబు సేయ సమర్థుండు జనకాజ్ఞ నడవి కేతెం
చి తనపత్ని రాక్షసాపహృత యైననిమిత్తంబున నిన్నుం గాన నేతెంచె నీవు నమ్మ
హానుభావుని నభివందనపూర్వకంబుగా సంభావింప నర్హుండ వనిన హనుమం
తువాక్యంబులకు సంతోషించి సుగ్రీవుండు వాలివలనిభీతి వాడినపుష్పదామం
బునుంబోలె విడిచి హనుమంతునితోఁ గూడ నధికసమ్మదంబున నేతెంచి.

42

క.

మర్కటకులవల్లభుఁ డగు, నర్కతనూభవుఁడు వచ్చి యనురక్తి సమి
త్కర్కశభుజవిక్రమసం, పర్కుని రాముఁ గని మ్రొక్కి ప్రాంజలి యగుచున్.

43


చ.

జనవర నీదుధర్మజయసత్యపరాక్రమశక్తు లొప్పఁగా
ననిలసుతుండు సెప్పె నవి యట్టివ నీశుభదర్శనంబు నా
కనుపమరాజ్యభూతికర మయ్యెడు వానరకోటితోడ నా
మనమున నీకు నాకుఁ దగమైత్రి యొనర్పఁగ బుద్ధి పుట్టెడున్.

44


క.

మనమున నమ్మిక పుట్టఁగ, జనవర చే సాఁపు మనుడు జనపతి యగుఁ గా
కని యితరేతరమస్తక, మనుకూలతఁ బట్టి చేసి రాలింగనముల్.

45


చ.

అనిలసుతుండు కాష్ఠయుగ మప్పుడు గూర్చి మథించి యగ్నిసం
జనితము గాఁగ నర్చు లిడి చాలఁ బ్రవృద్ధము చేసి ముందటం
దనరఁగ దెచ్చి పెట్టినఁ బ్రదక్షిణముల్ పని వచ్చి నమ్మ న
య్యనలము సాక్షి గాఁగ మన మారఁగ సఖ్యము సేసి రిద్దఱున్.

46


వ.

ఇ ట్లగ్నిసాక్షికంబుగా సఖ్యంబు సేసి యధికానందంబులం దనియ నన్యోన్య
ముఖావలోకనంబులు సేయుచుండి రప్పు డర్కజుం డర్కవంశజు నాలోకించి.

47


క.

కాకుత్స్థ యింక వగవకు, నీకడకున్ వేగ దత్తు నీసతి దివిష
ల్లోకమున నున్నఁ బన్నగ, లోకంబున నున్న నబ్ధిలోపల నున్నన్.

48


వ.

అని పలికి మఱియు రామచంద్ర నవలోకించి.

49


ఉ.

రావణుసంకమధ్యమున రౌద్రభుజంగిగతిన్ వెలుంగుచున్
వావిరి బాష్పముల్ దొరఁగ వారక లేడ్చుచు రామరామ యేఁ
బోవుచు నున్నదాన గుణభూషణ లక్ష్మణ నీవు వేగ న
న్గావఁ గదయ్య యంచు నధికవ్యధఁ జీరుచు భీతి నేఁగుచున్.

50


వ.

ఆసమయంబున.

51


మ.

ఘనశైలస్థలి నేను నల్వురు కపుల్ గాంక్షన్ వినోదింపఁగా
జనకాధీశతనూజ మమ్ముఁ గని లజ్జన్ నమ్రవక్త్రాబ్జ యై
తనయాకల్పము లుత్తరీయమునఁ బొందం గట్టి మాముందటం
గనుపట్టన్ దిగవైచుచుం జనియె శోకకధ్వానముల్ సేయుచున్.

52

సుగ్రీవుండు దెచ్చి యిచ్చిన భూషణోత్తరీయంబులం గని రాముండు వగచుట

క.

జనవర యాసతితొడవులు, తనరఁగ నే డాఁచినాఁడఁ దద్భూషలు దె
మ్మని యానతిచ్చిన వెసఁ, గొనివచ్చెద ననిన వేగ గొని ర మ్మనుడున్.

53


క.

దినకరతనయుఁడు రయమునఁ జని గిరిగుహఁ జొచ్చి యందు జతనంబునఁ డాఁ
చినభూషణములు ప్రమదం, బునఁ గొనివచ్చి రఘువిభునిముందటఁ బెట్టన్.

54


క.

ఉల్లము జ ల్లన ముఖమునఁ, బెల్లుగ బాష్పములు దొరఁగఁ బ్రేమంబున హా
వల్లభరో యనుచును మది, పల్లటిలన్ రాముఁ డుర్విఁ బడి మూర్ఛిల్లెన్.

55

పుట:భాస్కరరామాయణము.pdf/242 పుట:భాస్కరరామాయణము.pdf/243 పుట:భాస్కరరామాయణము.pdf/244 పుట:భాస్కరరామాయణము.pdf/245 పుట:భాస్కరరామాయణము.pdf/246 పుట:భాస్కరరామాయణము.pdf/247 పుట:భాస్కరరామాయణము.pdf/248 పుట:భాస్కరరామాయణము.pdf/249 పుట:భాస్కరరామాయణము.pdf/250 పుట:భాస్కరరామాయణము.pdf/251 పుట:భాస్కరరామాయణము.pdf/252 పుట:భాస్కరరామాయణము.pdf/253 పుట:భాస్కరరామాయణము.pdf/254 పుట:భాస్కరరామాయణము.pdf/255 పుట:భాస్కరరామాయణము.pdf/256 పుట:భాస్కరరామాయణము.pdf/257 పుట:భాస్కరరామాయణము.pdf/258 పుట:భాస్కరరామాయణము.pdf/259 పుట:భాస్కరరామాయణము.pdf/260 పుట:భాస్కరరామాయణము.pdf/261 పుట:భాస్కరరామాయణము.pdf/262 పుట:భాస్కరరామాయణము.pdf/263 పుట:భాస్కరరామాయణము.pdf/264 పుట:భాస్కరరామాయణము.pdf/265 పుట:భాస్కరరామాయణము.pdf/266 పుట:భాస్కరరామాయణము.pdf/267 పుట:భాస్కరరామాయణము.pdf/268 పుట:భాస్కరరామాయణము.pdf/269 పుట:భాస్కరరామాయణము.pdf/270 పుట:భాస్కరరామాయణము.pdf/271 పుట:భాస్కరరామాయణము.pdf/272 పుట:భాస్కరరామాయణము.pdf/273 పుట:భాస్కరరామాయణము.pdf/274 పుట:భాస్కరరామాయణము.pdf/275 పుట:భాస్కరరామాయణము.pdf/276 పుట:భాస్కరరామాయణము.pdf/277 పుట:భాస్కరరామాయణము.pdf/278 పుట:భాస్కరరామాయణము.pdf/279 పుట:భాస్కరరామాయణము.pdf/280 పుట:భాస్కరరామాయణము.pdf/281 పుట:భాస్కరరామాయణము.pdf/282 పుట:భాస్కరరామాయణము.pdf/283 పుట:భాస్కరరామాయణము.pdf/284 పుట:భాస్కరరామాయణము.pdf/285 పుట:భాస్కరరామాయణము.pdf/286 పుట:భాస్కరరామాయణము.pdf/287 పుట:భాస్కరరామాయణము.pdf/288 పుట:భాస్కరరామాయణము.pdf/289 పుట:భాస్కరరామాయణము.pdf/290 పుట:భాస్కరరామాయణము.pdf/291 పుట:భాస్కరరామాయణము.pdf/292 పుట:భాస్కరరామాయణము.pdf/293 పుట:భాస్కరరామాయణము.pdf/294 పుట:భాస్కరరామాయణము.pdf/295 పుట:భాస్కరరామాయణము.pdf/296 పుట:భాస్కరరామాయణము.pdf/297 పుట:భాస్కరరామాయణము.pdf/298 పుట:భాస్కరరామాయణము.pdf/299 పుట:భాస్కరరామాయణము.pdf/300 పుట:భాస్కరరామాయణము.pdf/301 పుట:భాస్కరరామాయణము.pdf/302 పుట:భాస్కరరామాయణము.pdf/303 పుట:భాస్కరరామాయణము.pdf/304 పుట:భాస్కరరామాయణము.pdf/305 పుట:భాస్కరరామాయణము.pdf/306 పుట:భాస్కరరామాయణము.pdf/307 పుట:భాస్కరరామాయణము.pdf/308 పుట:భాస్కరరామాయణము.pdf/309 పుట:భాస్కరరామాయణము.pdf/310 పుట:భాస్కరరామాయణము.pdf/311 పుట:భాస్కరరామాయణము.pdf/312 పుట:భాస్కరరామాయణము.pdf/313 పుట:భాస్కరరామాయణము.pdf/314 పుట:భాస్కరరామాయణము.pdf/315 పుట:భాస్కరరామాయణము.pdf/316 పుట:భాస్కరరామాయణము.pdf/317 పుట:భాస్కరరామాయణము.pdf/318 పుట:భాస్కరరామాయణము.pdf/319 పుట:భాస్కరరామాయణము.pdf/320

దునిమెద మేరువున్ విఱుగఁ ద్రోచెద శేషునిఁ బట్టి నుల్చెదన్
వనజభవాండముల్ పగులవైచెద దాఁటెద నేడుదీవులన్.

819


క.

సరసిజహితుఁ డురుజవమున, నరుదుగ నొకమాటు దిరుగునంతటిలో ని
ర్జరనగము వేయిమాఱులు, దిరిగెద నత్తరణిఁ గడచి దృఢగతితోడన్.

820


క.

గగనముననుండి యురవడి, ఖగతతి పుడమిఁ బడుచుండఁగా వేమాఱుల్
ఖగపతిఁ గడవఁగఁ బఱచెద, జగములు నాజవముఁ జూచి సంస్తుతి సేయన్.

821


క.

పారావారము నవ్వలి, పారమునకు దాఁటి నిలువఁబడక మగిడి యీ
పారము మగుడన్ దాఁటి య, పారమతిం బాఱుదేరఁ బటుజవశాలిన్.

822


మ.

అరుదారం బదివేలయోజనము లుద్యచ్ఛక్తిమై దాఁటెదన్
ధరణీపుష్కరచక్రముం దిరిగెదన్ దంభోళివీర్యత్వరం
గరయుగ్మంబున ఋశ్యమూకమును లంకాద్వీపముం బట్టి
త్వరభంగిం గొనివచ్చి యిచ్చటనె సీతారాములం గూర్చెదన్.

823


క.

శరనిధి నున్నభుజంగము, నిరవుగఁ బక్షములనడుమ నిడుకొని గరుడుం
డురుగతిఁ దెచ్చువిధంబున, నురవడిఁ దెచ్చెనను లంక నున్నమహీజన్.

824


వ.

అని పలికి.

825


శా.

లాటీచందనచర్చ చోళమహిళాలావణ్యసామగ్రి క
ర్ణాటీగీతకలాసరస్వతి కళింగాంతఃపురీమల్లికా
వాటీమంజరి గౌడవామనయనావక్షోజహారాలి యై
పాటింపం దగునీదుకీర్తి రధినీపాలాగ్రణీ సాహిణీ.

826


మాలి.

సురనుతపదపద్మా శుద్ధవిజ్ఞానిసద్మా
హరిణకలితహస్తా యాపగాసిక్తమస్తా
హరిహయసురరమ్యా యంచితధ్యానగమ్యా
స్ఫురదురుగిరిచాపా పుణ్యవీథిస్వరూపా.

827


గద్యము.

ఇది శ్రీమదష్టభాషాకవిమిత్ర కులపవిత్ర భాస్కరసత్కవిపుత్ర మల్లికా
ర్జునభట్టప్రణీతం బైనశ్రీమద్రామాయణమహాకావ్యంబునఁ గిష్కింధాకాండము
సర్వంబు నేకాశ్వాసము.

828