బైబులు భాష్య సంపుటావళి - దేవమాత, అంత్యగతులు/విజ్ఞాన బోధనలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2. విజ్ఞాన బోధనలు

మనవిమాట

   ఈ విజ్ఞానబోధనలను బైబులు భాష్యం 87-91 సంచికల్లో ప్రచురించాం. ఆ సంచికలనే ఇక్కడ కొలది మార్పులతో ఏక గ్రంథంగా ప్రచురించాం. ఈ పుస్తకంలో బైబుల్లోని విజ్ఞాన బోధనలను సంగ్రహంగా వివరించాం.
   పూర్వవేదంలో విజ్ఞాన బోధనలు బాబిలోనియా ప్రవాసానంతరం 6వ శతాబ్దంనుండి ప్రచారంలోకి వచ్చాయి. దేవునిపట్ల భయభక్తులు చూపడమే విజ్ఞానం.నూత్నవేదంలో క్రీస్తే మన విజ్ఞానం. నేడు మనం దేవునినుండి విజ్ఞానాన్ని వరంగా పొందుతాం.
   మనదేశంలో బోలెడంత విజ్ఞానవాజ్మయం వుంది. ఈ సాహిత్యాన్ని అర్థంజేసికోవడానికి బైబులు విజ్ఞాన బోధనలు కొంతవరకు ఉపకరిస్తాయి. ఇంకా, నైతికంగా విశుద్ధ జీవితం గడపడానికి గూడ ఈ బోధనలు తోడ్పడతాయి.
  ఈ పుస్తకంలోని విజ్ఞాన బోధనలను 40 అధ్యాయాలుగా విభజించాం. వీటన్నిటినీ నైతికవర్తనం, దుష్టవర్తనం అనే రెండు ప్రధానాంశాలక్రింద పొందుపరచాం. క్రైస్తవ భక్తులు అనుదినం ప్రార్ధనం చేసికోవడానికీ, సచ్చీలం అలవర్చుకోవడానికీ ఈ పొత్తం ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం.

విషయసూచిక

1. నైతికవర్తనం

1. విజ్ఞాన గ్రంథాలకు పరిచయం 52
2. బహుమానాలూ శిక్షలూ 57
3. దయ 59
4. 59 దానం 59
5. సాంఘిక న్యాయం 64
6. విజ్ఞానం 67
7. కొన్ని నైతిక విలువలు 75
8.దేవునికి ఆరాధనలు కాన్మలు 77
9.దైవభక్తి 78

10.ఆత్మ గౌరవాన్ని కాపాడుకో 82 11.స్నేహధర్మాలు 83 12.వివాహ ధర్మాలు 85 13.పెద్దలపట్ల గౌరవం 89 14.మంచి సలహాలను పాటించాలి 15.దుషులూ సజ్జనులూ 16.రాజకీయ, ఆర్థిక రంగాలు 17.నరుల్లో తేడాలు 18.తన్నుతాను అదుపులో పెట్టుకోవాలి 19.వయస్సుకంటె జ్ఞానం ముఖ్యం 20.ధర్మశాస్త్ర బోధకుడు 21.ఈ జీవితం అశాశ్వతం 22.మృత్యుస్మరణం 23.ప్రభువు కరుణ

2. దుష్టవర్తనం

24. మూర్ఖత్వం 25.వాక్పారుష్యం 26.ప్రేమలేని జీవితం వ్యర్థం 27. కొన్ని దురణాలు 28,పగను అణచుకోవాలి 29,దురాశ తగదు 30.నిజాయితీ లేకపోవడం 31. సోమరితనం 32. త్రాగుబోతుతనం 33. తిండిపోతుతనం 34. కలహాలు 35. వ్యభిచారం 36.గర్వం 37.అసూయ 38.విగ్రహారాధనం 39.మూఢవిశ్వాసాలు 40.పాపం చేయకూడదు

ప్రశ్నలు

82 83 85 89 92 93 95 97 98 100 101 103 104

105 106 12 113 114 115 115 117 118 119 121 122 127 129 130 136 137 138

1. నైతిక వర్తనం

1. విజ్ఞాన గ్రంథాలకు పరిచయం

1. జ్ఞాన గ్రంథాలు

మామూలుగా పూర్వవేదంలో ఏడు గ్రంథాలను విజ్ఞాన గ్రంథాలు అని పిలుస్తారు. అవి యోబు, సామెతలు, ఉపదేశకుడు, సీరా జ్ఞానం, సాలోమోను జ్ఞానం, పరమగీతం, కీర్తనల గ్రంథం అనేవి.

2. యిప్రాయేలు విజ్ఞానానికి ఆధారం

యిస్రాయేలీయులకంటె ముందుగానే వారి యిరుగు పొరుగు దేశాలైన ఈజిప్టు, మెసపొటామియా, కనాను, అరేబియా మొదలైనవి విజ్ఞానాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. యిస్రాయేలు రచయితలు ఈ దేశాల విజ్ఞానాన్ని కొంతవరకు వాడుకొన్నారు. వాళ్ళ సాంత విజ్ఞానాన్ని కూడ పెంపొందించుకొన్నారు. యూదులు మోషేను ధర్మశాస్త్రానికి, దావీదును కీర్తనలకూ ఆధారం చేసినట్లే, సొలోమోను రాజును విజ్ఞానానికి ఆధారం చేసారు. యిర్మీయా ప్రవచనం 18,8 నుండి యూద సమాజంలో యాజకులకూ, ప్రవక్తలకూ, జ్ఞానులకూ సమానమైన హోదా వుండేదని తెలుస్తుంది.

3. అన్యజాతుల విజ్ఞానమూ, యూదుల విజ్ఞానమూ

అన్యజాతుల విజ్ఞానం కేవలం లౌకికమైంది, దానికి దేవునితో సంబంధంలేదు, మన దేశంలో పుట్టిన విజ్ఞానం కూడ ఈలాంటిదే. కాని యూదుల విజ్ఞానం పూర్తిగా మతపరమైంది. వాళ్ళ ఆలోచనల ప్రకారం, విజ్ఞానానికి మొదటి మెట్టు దైవభీతి.

4. విజ్ఞానమంటే యేమిటి?

జ్ఞానగ్రంథాలు జీవితం, మరణం, కష్టాలు, చెడ్డ, ప్రేమ, నరుడు భగవంతునితోను నరునితోను మెలిగే తీరు మొదలైన అంశాలను పేర్కొంటాయి. మంచి జీవితం ఏలా జీవించాలో, దానిద్వారా సుఖశాంతులూ విజయమూ ఏలా సాధించాలో చెప్తాయి. జీవితంలో ఎదురయ్యే నానా సమస్యలకు పరిష్కారాలు సూచిస్తాయి. రాజకీయాల్లో నేర్పూ కళల్లో ప్రావీణ్యం, బాలురకు విద్యగరపడం మొదలైన అంశాలనుకూడ ప్రస్తావిస్తాయి. నరునికి సామాన్య పరిజ్ఞానాన్ని నేర్పుతాయి. కాని ఈ యంశాలన్నిటినీ లౌకిక పద్ధతిలోకాక ఆధ్యాత్మిక పద్ధతిలో నేర్పుతాయి. అన్నిటినీ దేవునితో ముడిపెడతాయి. ప్రభువుపట్ల భయభక్తులు చూపడం విజ్ఞానానికి మొదటిమెట్టు అని చెప్తాయి - సీరా 1, 14 సామె 1,7, ఎప్పడూ వరప్రసాదం విజ్ఞానం కలసిపోతాయి. వరప్రసాదాన్నికోల్పోయిన నరుళ్ళో విజ్ఞానం నిలువదు. దానికీ పాపులకూ చాల దూరం.

బైబులు విజ్ఞానాన్ని వివేకం, వివేచనం, గ్రహణశక్తి, సలహాను చేకోనడం అనికూడ పిలుస్తుంటుంది. ఆ విజ్ఞాన గుణానికి భిన్నమైంది పాపం, బుద్ధిహీనత, అజ్ఞానం, మూర్ఖత్వం, అహంకారం, దుష్టత్వం, అవహేళనం. ఈ పదాలను బట్టికూడ విజ్ఞాన స్వభావాన్ని కొంతవరకు గ్రహించవచ్చు.

ఈ విజ్ఞాన గ్రంధాలు ధర్మశాస్త్రం, నిబంధనం, ఎన్నిక, విముక్తి, దైవారాధనం మొదలైన పూర్వవేదంలోని ప్రధానాంశాలను ప్రస్తావించవు. కనుక యూదులు ఆదిపంచకానికీ, ప్రవక్తల గ్రంథాలకూ ఇచ్చిన విలువను ఈ పుస్తకాలకు ఈయలేదు. విజ్ఞానం ప్రధానంగా బాబిలోనియా ప్రవాసానంతరం (587) వృద్ధిలోకి వచ్చింది. మామూలుగా ఈ పుస్తకాలు వ్యక్తి బాగోగులనే కాని సమాజం బాగోగులను పట్టించుకోవు. ఐనా వీటి విలువను తక్కువగా అంచనా వేయకూడదు.

5. జానులు

ఈ గ్రంథాలను చెప్పిన జ్ఞానులు తాత్వికులు, మానవతావాదులు. యాజకులు ధర్మశాస్త్రాన్ని బోధించి దేవాలయంలో ఆరాధనను నిర్వహించేవాళ్లు ప్రవక్తలు దైవసందేశాన్ని తెలియజెప్పేవాళ్ళు జ్ఞానులు కేవలం ఉపాధ్యాయులు. వాళ్లు తరతరాల మానవ జీవితాన్ని గూర్చిన తమ అనుభవాన్నీ విజ్ఞానాన్నీ మనకు అందించిపోయారు. కాని వారి బోధలు కేవలం లౌకికమైనవికావు, భగవత్ర్పేరితమైనవి. కావుననే వారి గ్రంథాలకు బైబుల్లో చోటు లభించింది. విజ్ఞాన బోధకుడైన ಜ್ಞಾನಿನಿ సీరా గ్రంథం 39, 1-11 చక్కగా వర్ణిస్తుంది.

విజ్ఞాన గ్రంథాల్లో మూడు ప్రధానాంశాలు కన్పిస్తాయి. 1. జ్ఞానులు తమ బోధలను సామెతలు సూక్తులు నీతివాక్యాల రూపంలో వెలయించారు. 2. వారి బోధల్లో దైవ ప్రేరణమూ కన్పిస్తుంది, సొంత ఆలోచనలూ అనుభవాలు కూడ కన్పిస్తాయి. కనుక ఈ గ్రంథాలను అన్య మతస్తులుకూడ పరించి లాభం పొందవచ్చు. చాల తావుల్లో వీళ్ళ బోధలు మన దేశంలో వెలసిన పంచతంత్రం, హితోపదేశం, నీతిశాస్త్రాలు, నీతిశతకాలు మొదలైన పుస్తకాల స్థాయిలో వుంటాయి. ఇవి లౌకిక బోధలు మాత్రమే. 3. మతం ఓ సిద్ధాంతం మాత్రమే కాదు, ఆచరణం కూడ. కనుక ఈ పుస్తకాలు మతాచరణనుగూర్చీ సత్ర్పవర్తనను గూర్చీ మాటిమాటికీ నొక్కి చెప్తాయి. అసలు ఈ గ్రంథాల్లో 75 శాతం నైతిక బోధలే వుంటాయి. జ్ఞానులు తమ విజ్ఞానాన్ని రాజస్థానాల్లో బళ్ళల్లో కుటుంబాల్లో కూడ బోధించారు. విజ్ఞానాన్ని సాధించే మార్గాలు పఠనం, క్రమశిక్షణ, జ్ఞానుల సూక్తులను ఆలించడం మననం చేసికోవడం, దేవునికి ప్రార్థన చేయడం మొదలైనవి. విజ్ఞానానికి ఆధారం ప్రభువే. అతనినుండేగాని మనం జ్ఞానాన్ని సంపాదించలేం - సీరా 1.1. కావుననే సొలోమోను జ్ఞానం కొరకు ఈలా ప్రార్థించాడు

నీవు నీ జ్ఞానాన్ని దయచేస్తేనే తప్ప,
స్వర్గంనుండి నీ పవిత్రాత్మను పంపితేనే తప్ప
నీ చిత్తాన్ని ఎవడు తెలిసికోగలడు?
ఈ రీతిగా నీవు దయచేసే జ్ఞానంద్వారా
భూమిమీది నరులు ఋజుమార్గంలో నడుస్తున్నారు
నీకు ప్రీతికరమైన కార్యమేమిటో తెలిసికొంటున్నారు
భద్రతను పొందుతున్నారు - సాలో జ్ఞాన 9, 17-18.

6. విజ్ఞానం ఓ దైవవ్యక్తి

ఈ గ్రంథాలు చాల తావుల్లో విజ్ఞానాన్ని ఓ దైవ వ్యక్తినిగా వర్ణిస్తాయి.

1) విజ్ఞానం మనకు ఓ ఆతిధేయ, ఆమె మనకు అందించే అన్నపానీయాలు విజ్ఞానమే.

రా, నేను తయారుచేసిన భోజనాన్ని ఆరగించు
నేను సిద్ధంచేసిన ద్రాక్షాసవాన్ని సేవించు
మూర్ఖత్వాన్ని విడనాడితే నీవు బ్రతికిపోతావు
విజ్ఞాన పథాన నడుస్తావు - సామె 9, 4-5.

2) ప్రభువు ఈ విజ్ఞానాన్ని ప్రప్రథమంలోనే సృజించాడు. అది శాశ్వతమైంది. ప్రభువు లోకాన్ని సృజించేపుడు ఆది వో శిల్పిలా అతని ప్రక్కన నిల్చుండి వుంది. దానిలో దైవత్వమంది.

ప్రభువు నన్ను ప్రప్రథమంలోనే సృజించాడు
తాను పూర్వమే కలిగించిన వాటన్నిటిలోను
నన్ను మొదటిదాన్నిగా చేసాడు
నేను ప్రధాన శిల్పివలె అతనిచెంత నిల్చివున్నాను
పసికందులాగ రోజురోజు అతనికి ఆనందం చేకూరుస్తూ
నిత్యం అతని సన్నిధిలో ఆటలాడుకొనేదాన్ని

అతడు చేసిన పుడమిమీద క్రీడిస్తూ ప్రమోదంతో మానవాళిమధ్య వసించేదాన్ని - సామె 8, 30-31

3) అది యిస్రాయేలీయుల మధ్య వసిస్తుంది. విజ్ఞానమూ ధర్మశాస్త్రమూ వొకటే.
సర్వాన్ని కలిగించిన దేవుడు నాకాజ్ఞ యిచ్చాడు
సృష్టికర్త నేనెచట వసించాలో నిర్ణయించాడు
అతడు నీవు యాకోబు వంశజులమధ్య వసించు
యిస్రాయేలీయులు నీ ప్రజలౌతారని చెప్పాడు
ఈ విజ్ఞానం మోషే అజ్ఞాపించిన ధర్మశాస్త్రం
మహోన్నతుడైన ప్రభువు నిబంధన గ్రంథం
యిస్రాయేలీయులకు వారసంగా లభించిన ఆస్తి - సీరా 24, 8, 23.
ఈ విజ్ఞానం దేవుని ఆజ్ఞల గ్రంథం
శాశ్వతంగా నిల్చే ధర్మశాస్త్రం
దాన్ని పాటించేవాళ్ళ బ్రతుకుతారు
విడనాడేవాళ్ళు చస్తారు - బారూకు 4,1

4)సాలోమోను జ్ఞానగ్రంథం 7, 22-27 వచనాలు విజ్ఞానానికి దేవుని గుణాలను ఆరోపిస్తాయి. విజ్ఞాన వర్ణనలన్నింటిలోను ఈ భాగం పర్వత శిఖరం లాంటిది. ఈ జ్ఞానం దేవునికి ప్రతిరూపమే.

అది దైవశక్తియొక్క శ్వాసం
ప్రభువు మహిమయొక్క స్వచ్ఛమైన ప్రవాహం
మలినమైనదేదీ దానిలోనికి ప్రవేశింపలేదు
అది శాశ్వతజ్యోతికి ప్రతిరూపం
దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించే నిర్మల ముకురం
అతని మంచితనానికి ప్రతిబింబం – 7,25-26

7. విజ్ఞానం క్రీస్తే

దైవగుణాలు కలిగిన ఈ విజ్ఞానం నూత్న వేదంలో క్రీస్తుగా అవతరించింది. పూర్వవేదం బోధించిన విజ్ఞానం క్రీస్తేనని చెప్తుంది నూత్నవేదం.

జ్ఞానగ్రంథకర్తల్లాగ క్రీస్తుకూడ సామెతలతోను సూక్తులతోను బోధించాడు. పర్వతప్రసంగమే ఇందుకు సాక్షి అతడు జ్ఞానియైన సాలోమోనుకంటె గొప్ప జ్ఞాని - మత్త 12, 42, తన కోశాగారంనుండి నూతన, పురాతన వస్తువులను వెలికితెచ్చే ధర్మశాస్త్ర బోధకుడు - 13, 52. అతడుశిష్యులకు వివేకాన్నిస్తాడు - లూకా 21,15. క్రీస్తు దేవుని వివేకం - 1 కొ 1,24. అదృశ్యుడైన దేవునియొక్క ప్రత్యక్ష రూపం. దేవుని సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు - కొలో 1,15. దేవుని మహిమయొక్క తేజస్సు ,దేవునికి అచ్చమైన ప్రతిరూపం - హెబ్రే 1,3. ఆదిలో విజ్ఞానం దేవుని చెంత వున్నట్లే, వాక్కుకూడ దేవునిచెంత వుంది - యోహా 1,1. విజ్ఞానం మానవాళిమధ్య వసించినట్లే క్రీస్తుకూడ తన వారి వద్దకు విచ్చేసాడు -1,11. ఈ నూత్నవేద వాక్యాలన్నీ కూడ క్రీస్తుపూర్వవేదంలోని విజ్ఞానమేనని రుజువుచేస్తాయి.

8. క్రైస్తవుడూ విజ్ఞానం

క్రీస్తు దేవుని విజ్ఞానమని చెప్పాం. అతని శిష్యులమైన మనంకూడ ఈ విజ్ఞానాన్ని పొందుతాం. తండ్రే దీన్ని శిష్యులకు అనుగ్రహిస్తాడు. "తండ్రీ! విజ్ఞలకు వివేకులకు ఈ రహస్యాలను మరుగుపరచి వీనిని పసిబిడ్డలకు బయలు పరచావు - మత్త 11,25. ఆత్మ మనకు విజ్ఞానపూర్వకమైన వాక్కును ప్రసాదిస్తుంది - 1కొ 12,8. ఈ విజ్ఞానం దేవుడు గోప్యంగా వంచిన క్రీస్తు మనుష్యావతార రహస్యం, పౌలు లాంటి అపోస్తలులు ఈ రహస్యాన్ని మనకు బోధించారు-1 కొ 2,7. అది మన నైతిక జీవితానికిగూడ గుర్తు. జ్ఞానియైనవాడు సత్ర్పవర్తనంద్వారా తన జ్ఞానాన్ని రుజువు చేసికోవాలి - యాకో 3,13. వివేకం లేనివాడు దేవుణ్ణి అడుగుకొంటే అతడు వానికి విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు - యాకో 1,5.

ఈ విధంగా పూర్వవేదంలో మొదట నీతిబోధలతో ప్రారంభమైన విజ్ఞానం క్రమేణ దైవభీతి ఐంది. తర్వాత దైవభక్తి ఐంది. నూత్నవేదంలో క్రీస్తు అయింది. కడన క్రైస్తవులు పొందే వరమైంది.

9. రోజువారి జీవితంలో విజ్ఞానం

1. బైబుల్లో సామెతల గ్రంథం, సీరా గ్రంథం మొదలైన సామెతల పుస్తకాలున్నాయి. కాని మనదేశ భాషల్లో ప్రాచీన లిఖిత సాహిత్యంలో సామెతల గ్రంధాలు లేవు. సామెతలు మన ప్రాచీన ప్రజల్లో ముఖతః మాత్రమే ప్రచారంలో వుండేవి. ఈ మౌఖిక లోకోక్తులను మనదేశంలో 20వ శతాబ్దంలో గ్రంథాలుగా ప్రచురించడం మొదలెట్టారు. ఇప్పుడు తెలుగు సామెతలు సంపూర్ణంగా గ్రంథరూపంలో దొరుకుతాయి.

ఒక్క సామెతలేగాకుండ మనదేశంలో విజ్ఞానవాజ్మయం బోలెడంత వుంది. నీతికథలు, నీతి శాస్త్రాలు, నీతి శతకాలు, పొడుపు కథలు మొదలైనవన్నీ ఈ శాఖకు చెందినవే. సంస్కృతంలో పంచతంత్రం, హితోపదేశం ప్రధానంగా విజ్ఞాన గ్రంధాలే. తెలుగులో వేమన శతకం, సుమతీ శతకం బాగా ప్రచారంలోకి వచ్చాయి. మనదేశంలోని ఈ నీతివాజ్ఞ్మయ శాఖలను అర్థంజేసికోవడానికి బైబుల్లోని విజ్ఞానవాజ్మయం కొంతవరకు తోడ్పడుతుంది.

2. బైబులు విజ్ఞానం మతపరమైంది. భగవంతుడు దాని కాశ్రయం. దైవభీతి విజ్ఞానానికి మొదటిమెట్టు అన్నాడు సామెతల గ్రంథకారుడు. నూత్నవేదంలో క్రీస్తు మనకు ఆదర్శజ్ఞాని. కాని మనదేశంలో పుట్టిన విజ్ఞానం కేవలం లౌకికమైంది. దానికి పరమాత్మునితో సంబంధంలేదు.

3. ఏ దేశాల్లో వర్ధిల్లినా విజ్ఞాన వాజ్మయం ప్రయోజనం ఒక్కటే. నరుడు తన దుష్టవర్తనాన్ని మార్చుకొని సద్వర్తనాన్ని అలవర్చుకొనేలాచేయడం. విజ్ఞాన వాజ్మయం అనే అద్దంలోకి చూచుకొని మన నైతిక రూపాన్ని మనం చక్కదిద్దుకోవాలి. ఈ పుస్తకంలోని 40 అంశాలూ ఇందుకు తోడ్పడేవే. మానవుడు విజ్ఞానం బోధించే ఆశయాలను సాధించడానికి జీవితాంతం కృషిచేస్తుండాలి.

భక్తుడు విజ్ఞాన వాక్యాలనూ సామెతలనూ వల్లెవేయడంతోనే సరిపెట్టుకోగూడదు. అతని జీవితమే ఓ విజ్ఞాన సూక్తిగా, ఓ మంచి సామెతగా రూపొందాలి. సజ్జనుడైన వాడే ప్రాజ్ఞడు.

ఈ గ్రంథంలో విజ్ఞానబోధలను 40 అధ్యాయాలుగా విభజించాం. రానున్న పుటల్లో వీనిని క్రమంగా పరిశీలించి చూద్దాం.

2. బహుమానాలూ, శిక్షలూ

నరులు చేసే మంచిపనికి దేవునినుండి బహుమతి లభిస్తుంది. చెడ్డపనికి శిక్షపడుతుంది. ఈ బహుమతినీ దండననూ ఎవడూ తప్పించుకోలేడు.

ప్రభువు కృపాకోపాలు రెండూ ప్రదర్శిస్తాడు
అతడు క్షమించడానికీ కోపించడానికీగూడ సమర్ణుడు
పాపాత్ముడు తాను దోచుకొన్నదానికి
శిక్ష అనుభవింపక తప్పదు
పుణ్యాత్ముడు పడిన శ్రమకూ ఫలితముంటుంది. - సీరా 16,12-13
ప్రకృతిశక్తులుకూడ దేవుని ఆజ్ఞకు లొంగి దుష్టులను శిక్షిస్తాయి.
నిప్పు వడగండ్లు కరవు వ్యాధి
నరులను శిక్షించడానికే సృజింపబడ్డాయి
కూరమృగాలు తేళ్లు పాములు దుష్టుల పనిబట్టే కత్తులు

మొదలైనవి సంతోషంతో ప్రభువు ఆజ్ఞ పాటిస్తాయి
అవి ప్రభువుని సేవించడానికి సిద్ధంగా వుంటాయి
సత్వరమే అతని ఆజ్ఞను నెరవేరుస్తాయి - సీరా 39, 29-31

ఎంత కీడుకి అంత శిక్ష అంటియోకసురాజు యూదులకు బద్ధశత్రువు. అతడు యూదులను హింసించడానికి యెరూషలేము వెళూంటే దారిలో దేవుడే అతన్ని హింసించాడు. "అంటియోకసురధాన్ని ఎక్కడా ఆపక ఎకాయెకిని యెరూషలేమకి తోలమని సారధిని ఆజ్ఞాపించాడు. నేను యెరూషలేము చేరగానే ఆ నగరాన్ని శ్మశానంగా మారుస్తానని మహాగర్వంతో శపథం చేసాడు. కాని ప్రభువు శిక్షకూడ తన వెంటనే వస్తూందని అతడు గ్రహించలేదు. అంటియోకసు పై మాటలు పలకగానే అన్నిటినీ గమనించే యిప్రాయేలు దేవుడు అతన్ని ఏదో గుర్తుతెలియని మహా రోగంతో పీడించడం మొదలెట్టాడు. అతని ప్రేగుల్లో ఫనోరమైన బాధ పుట్టింది. ఆ బాధకు ఉపశాంతిలేదు. అనేకుల కడుపుకి చిచ్చుపెట్టినవానికి ఈ కడుపునొప్పి ఉచితమైన శిక్షేకదా!" - 2 మక్కబీయులు 9, 4-6, కొంతమంది దేవుడే నరులచేత పాపం చేయిస్తాడనీ నరులకు స్వేచ్చ లేదనీ అనుకొంటారు. కాని ఇది పొరపాటు.

 
నేను పాపం చేయడానికి దేవుడే కారణమని చెప్పకు
తాను అసహ్యించుకొనేదాన్ని దేవుడేలా చేయిస్తాడు
దేవుడు నన్ను పెడత్రోవ పట్టించాడు అనకు
అతడు పాపాత్ముల్ని తనపనికి వాడుకోడు - సీరా 15, 11-12

మంచిని చేయడానికీ చెడ్డను మానుకోడానికీ గూడ నరునికి స్వేచ్చ వుంది. కనుక అతని పాపానికి అతడే బాధ్యుడు.

భగవంతుడు ఆదిలో నరుని చేసినప్పడు
అతనికి తన నిర్ణయాలు తానే చేసికొనే స్వేచ్ఛనిచ్చాడు
నీవు కోరుకొంటే ప్రభువు ఆజ్ఞల్ని పాటించవచ్చు
అతన్ని అనుసరించాలో లేదో నిర్ణయించేది నీవే
ప్రభువు నిప్పూ నీళ్ళూగూడ నీముందు వుంచాడు
చేయి చాచి వీటిల్లో నీ కిష్టమొచ్చినదాన్ని తీసికో
మృత్యువు జీవంకూడ నరుని ముందట వున్నాయి
అతడు తాను కోరుకొన్నది తీసికోవచ్చు - సీరా 15, 14-17

పాపపుణ్యాల విషయం వచ్చినపుడు మన హృదయం ముఖ్యం. కీలకమంతా దానిలోనే వుంటుంది.

అన్నిటికంటె ముఖ్యంగా

నీ హృదయాన్ని పదిలం చేసికో

నీ జీవనగతికి ఆకరమదే

వెండి బంగారాలను కుంపటి పరీక్షిస్తుంది - సామెతలు 4, 23, 20,27

3. దయ

నరునికి దయాగుణం ఎంతో అవసరం. దయాపరుడు తన బానిసనుగూడ సొంత సోదరునిలా చూస్తాడు. తన భోజనాన్ని పేదలకు వడ్డిస్తాడు. {{center|

భక్తహీనుల పుత్రులకు పెద్ద కుటుంబాలు కలగవు

వాళ్ళు రాతిమీద మొలచిన మొక్కల్లాగ క్షీణిస్తారు

ఏటి వొడ్డున ఎదిగే తుంగ అన్నిటికంటె ముందుగా

కోసివేయబడినట్లే వాళ్ళూ నాశమౌతారు

కాని కరుణ భాగ్యవనం లాంటిది

దానం శాశ్వతంగా నిలుస్తుంది - సీరా 40 : 15-17

మంచివాడు తన దాసునిగూడ కరుణతో జూస్తాడు

నీ బానిసను నీవలె చూచుకో

వాణ్ణి నీ కష్ణార్జితంతో కొనితెచ్చుకొన్నావుకదా!

అతన్ని నీ సోదరునివలె చూచుకో

నీవు నీకెంత అవసరమో వాడూ నీకు అంత అవసరం - సీరా 33,30-31

ఇంకా ఈ సందర్భంలో సామెతల గ్రంథం ఈలా వాకొంటుంది

తన భోజనాన్ని పేదలకుగూడ వడ్డించే కరుణామయుడు

దేవుని దీవెనలు పొందుతాడు

ప్రభువు పేదలకోపు తీసికొని

వాళ్ళను పీడించేవాళ్ళను పీడిస్తాడు - 22, 9.23.

4. దానం

దానం, ఉపవాసం, ప్రార్ధనం యూదుల భక్తికి మూలస్తంభాల్లాంటివి. ప్రస్తుతం వీటిల్లో దానాన్నిగూర్చి చూద్దాం. తోబీతు తన కుమారుడు తోబియాకు ఈలా చెప్పాడు. "నాయనా! దేవునిపట్ల భయభక్తులు చూపేవారికి నీ సాత్తునుండి దానధర్మాలు చేయి. నీవు పేదలను అనాదరం చేయకుంటే దేవుడు నిన్ను అనాదరం చేయడు. నీకున్న దానినిబట్టి నీవు దానంచేయి. నీకు ఎక్కువగావుంటే ఎక్కువగానే ఈయి. తక్కువగావుంటే తక్కువగానే ఈయి. ఈయడంలో మాత్రం ఎప్పడూ వెనుకాడకు. ఇచ్చిన ఈవి ఆపత్కాలంలో పెద్ద నిధిలా సాయపడుతుంది. దానం మోక్షంలోని దేవునికి ఇష్టమైన కాన్క కనుక దానం చేసేవాణ్ణి అతడు అంధకారబంధురమైన మృత్యులోకాన్నుండి రక్షిస్తాడు” - తోబీతు 4,7-11. పేదలకు దానం చేయడంలో ఆలస్యం పనికిరాదు. పేదవానికి మరల రేపురా అని చెప్పకూడదు. దరిద్రుడు ధనికునిముందు మొరపడి అతన్ని శపిస్తే ఆ మొరను దేవుడు వింటాడు

నీకు శక్తివుంటే

ఇతరులు అడిగిన వుపకారం తప్పక చేసిపెట్టు

పొరుగువాడికి సత్వరమే

సాయంచేయగలవేని చేసిపెట్టు

{[center

నిరాశ చెందివున్నవాని బాధలు అధికం చేయకు

అతడు చేయిచాచి అడిగితే జాప్యం చేయకు

బిచ్చగాడు యాచించినప్పడు నిరాకరించవద్దు

పేదవానినుండి మొగం ప్రక్కకు త్రిప్పకోకు

దరిద్రునినుండి నీ చూపు మరల్చకు

అతడు నిన్ను శపించకుండా వుండేలా చూచుకో

హృదయవేదన భరింపజాలక

ఆ దరిద్రుడు నిన్ను శపిస్తే

ప్రభువు అతని మొర ఆలిస్తాడు - సీరా 4,3-5

పేదలకు చేసిన దానం ప్రభువుకి చేసినట్లే అతడు ఆ సొమ్మని మనకు వడ్డీతోసహా చెల్లిస్తాడు. ఇది చాల మంచి భావం.

పేదలను ఆదుకొంటే ప్రభువుకే అప్పిచ్చినట్లు

ఆ యప్పను అతడు తప్పక తీరుస్తాడు - సామె 19, 17.

దానమనేది పేదలకు అన్నంపెట్టడం, బట్టలీయడం, చనిపోయినవారిని పాతిపెట్టడం అని చాల రకాలుగా వుంటుంది. తోబీతు ఈలా చెప్పకొన్నాడు. "షల్మనేసరు బ్రతికివున్నకాలంలో నేను మా జాతివారికి పెక్కుదానధర్మాలు చేసాను. వాళ్ళ ఆకలిగొనివస్తే నేను భోజనం పెట్టేవాడ్డి బట్టలులేనివారికి బట్టలిచ్చేవాణ్ణి. నీనివే పౌరులు మా జాతివారి శవాలను పట్టణ ప్రాకారం, వెలుపల పారవేస్తే నేను వారిని పాతిపెట్టేవాణ్ణి - తోబీ 1,16-17. దానంవల్ల మనకు చాల లాభాలు చేకూరుతాయి. తోబీతు ఈలా చెప్పాడు. “ధనం కూడబెట్టుకొని దుష్టజీవితం జీవించడంకంటె ವಿಪ್ತಕುದ್ದಿಟ್ ప్రార్ధన చేయడం మేలు, మంచి జీవితం గడుపుతూ దానధర్మాలు చేయడం మెరుగు. బంగారాన్ని కూడబెట్టుకోవడంకంటె దానం చేయడం మంచిది, దానం మిమ్మ మృత్యువునుండి కాపాడుతుంది. మీ పాపాలనెల్ల కడిగివేస్తుంది. దానం చేసేవాళ్ళ దీర్గాయుష్మంతులౌతారు" తోబీ 12, 8-9

అనాథులకూ పేదలకూ చేసే దానధర్మాలను దేవుడు తన అంగుళీయాన్నిలా విలువతో చూస్తాడు

అనాథులకు తండ్రివలె వుండు
వితంతువులకు వారి భర్తవలె సాయం చేయి
అప్పడు నీవు మహోన్నతుడైన దేవునికి పుత్రుడమోతావు
అతడు నీ సొంతతల్లికంటెగూడ అధికంగా నిన్ను ప్రేమిస్తాడు
నరుడు పేదలకు చేసిన దానధర్మాలను
ప్రభువు తన అంగుళీయాన్నివలె విలువతో జూస్తాడు
నరుడు పేదలపట్ల చూపే కరుణను
ప్రభువు తన కంటిపాపనులాగ మన్ననతో జూస్తాడు - సీరా 410. 17,22

దానంద్వారా మనం పరలోకంలో నిధిని కూడబెట్టుకొంటాం. యుద్ధంలో డాలులా అది మనలను కాపాడుతుంది. •

పేదసాదలను సానుభూతితో చూడు
వారిచే దీర్ఘకాలం బతిమాలించుకోకు
నీ కాసులను ఏ బండక్రిందనో దాచి
త్రుప్పపాలు చేయడంకంటె
వానిని నీ పొరుగువాని కొరకో స్నేహితుని కొరకో
వెచ్చించడం మేలు
దైవాజ్ఞ సూచించినట్లే
దానధర్మాలనే నిధిని ప్రోగుజేసికో
ఆ నిధి నీకు-బంగారంకంటె అధికంగా ఉపయోగపడుతుంది
పేదలకు ఇచ్చిందే నీవు భద్రపరచిన నిధి అనుకో
అది నిన్ను సకలాపదలనుండి కాపాడుతుంది

అది బలమైన డాలుకంటె, బరువైన ఈటెకంటె
అధికంగా నీ శత్రువులతో పోరాడి నిన్ను రక్షిస్తుంది - సీరా 29, 8-13
ఆపదలో తోబుట్టువులు సహాయులు
చెంతవుంటే బాగుంటుంది
కాని దానధర్మాలు చేయడంవలన సిద్ధించే సహాయం
అంతకంటె శ్రేష్టమైంది - 40, 24
ధర్మమార్గంలో డబ్బు కూడబెట్టి దానం చేసేవాడి సంపదలు స్థిరంగా నిలుస్తాయి
పాపమార్గంలో డబ్బు కూడబెట్టనివాడూ
నిర్దోషి ఐన ధనికుడు ధన్యుడు
ఆలాంటివాడు దొరికితే అతన్ని అభినందించాలి
అతడు ధనికులెవ్వరూ చేయని అద్భుతం చేసాడు
ఈ పరీక్షలో నెగ్గినవాడు నిక్కంగా గర్వించవచ్చు
పాపం చేయగలిగీ చేయనివాడు,
పరుని మోసగింపగలిగీ మోసగింపనివాడు
ఎవడైనా వుంటాడా?
ఆలాంటివాడు ఎవడైనా వుంటే
అతని సంపదలు స్థిరముగా నిల్చునుగాక
జనులెల్లరూ అతని మంచితనాన్ని సన్నుతింతురుగాక - 31, 8-11
ఇంకా, దానంవల్ల మన పాపాలు కూడ పరిహారమౌతాయి
నీళ్ళ మంటను చల్లారుస్తాయి
దానధర్మాలు పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాయి - 8,30

ఈ సందర్భంలో తోబీతు గ్రంథంకూడ "దానం మీ పాపాలనెల్ల కడిగివేస్తుంది. మీరు దీర్గాయుష్మంతులౌతారు" అని చెప్తుంది - 12,9

తోడివాడు అక్కరలో వున్నపుడు అతనికి బదులీయలి
తోడివాడు అక్కరలో వున్నపుడు కరుణతో అరువీయి
పొరుగువాడికి సాయపడినపుడు
ప్రభువు ఆజ్ఞలు పాటించినట్లే
తోడివాడు అవసరంలో వున్నపుడు సాయం చేయి
నీవు బాకీపడి వున్నపుడు వెంటనే ఋణం తీర్చు - సీరా 29, 1-2 .

62

కొందరు వాగ్దానం చేసికూడ సాయం చేయరు. ఆలాంటివాళ్ళు ఏలా వుంటారు?
నరుడు వాగ్గానం చేసికూడ వస్తువులనీయకపోతే
మబ్బు గాలి ఆర్భాటం చేసికూడ
వాన కురవనట్లుగా వుంటుంది - సామె 25, 14
రోగులను పరామర్శించి వారికి ఊరట వాక్యాలు చెప్పాలి.
శోకతప్తులకు సానుభూతి చూపు
బాధార్తుల బాధల్లో పాలుపంచుకో
వ్యాధిగ్రస్తులను పరామర్శించడంలో అశ్రద్ధ చూపకు
ఆలాంటి సత్కార్యాలద్వారా
ప్రజల మన్నన పొందుతావు
ఒకదినం నీవూ మరణించి తీరుతావని
నీవు చేసే కార్యాలన్నిటిలోను గుర్తుంచుకో
అప్పడు నీవు ఏనాడూ పాపం చేయవు - 7,34-85

మననుండి దానం పొందేవాళ్లు పేదలు, అనాథులు, వితంతువులు. వీళ్ళంటే ప్రభువుకి ఎంతో జాలి

ప్రభువు పేదలకు అన్యాయం చేయడు
బాధితులు మొర అశ్రద్ధ చేయడు
అనాథుని ప్రార్థనను అనాదరం చేయడు
వితంతువు వేడికోలును పెడచెవిని బెట్టడు
వితంతువు నేత్రాలవెంట కారే కన్నీళ్ళు
ఆమెను పీడించినవానిమీద నేరంతెచ్చి
దేవునికి మొరపెడతాయి - సీరా 35, 13-15
నరుడు కటువుగా గాక మృదువుగా మాట్లాడుతూ దానం చేయాలి.
మంచు కురిసినప్పడు వేడిమి సమసిపోతుంది
నీవిచ్చే వస్తువుకంటెగూడ నీ మాటలు ముఖ్యం
కరుణగల వాక్యాలు ప్రశస్తదానంకంటె శ్రేష్టమైనవి
కాని ఉదార స్వభావుడు ఆ రెండిటినీ యిస్తాడు
మూర్ఖుడు ఏమీయాయక వచ్చిన వారిని అవమానిస్తాడు
అనిష్టంగా ఇచ్చినదాన్ని ఎవడు ప్రీతితో జూస్తాడు? - 18, 16-17

పేదలపట్ల మర్యాదగా మెలగాలి కూడ

పేదలు విన్నవించుకొనే సంగతులు విని

వారికి మర్యాదగా బదులు చెప్పు - 4,8

తోబీతుకూడ తన కుమారుణ్ణి ఈలా హెచ్చరించాడు. "ఆకలిగొన్నవారికి అన్నంపెట్టు. బట్టలు లేనివారికి బట్టలీయి. నీకు సమృద్ధిగా వున్న ప్రతి వస్తువు నుండి కొంత భాగం దానంగా ఈయి. ఇచ్చేదాన్ని ప్రీతితో ఈయి" - 4,16.

దేవునికి కానుకలు అర్పించేపుడు గూడ సంతోషంగాను, ఉదారంగాను ఈయాలి.

ప్రభువుకి ఉదారంగా కానుకలీయి

నీ తొలిఫలాలను అర్పించడంలో పిసినారివి కావద్దు

చిరునవ్వుతో నీ కానుకలు అర్పించు

సంతోషంగా నీ దశమభాగాన్ని ఈయి

మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవూ అతని కీయి

నీ శక్తికొలది ఉదారంగా ఈయి

తనకిచ్చేవారిని ప్రభువు బహూకరిస్తాడు

అతడు నీకు పదిరెట్ల అదనంగా యిస్తాడు - 35, 9–11

5. సాంఘిక న్యాయం

పూర్వవేదం బోధించే గొప్ప ధర్మాల్లో సాంఘిక న్యాయం ఒకటి. అనగా పేదసాదలకు న్యాయం జరిగించడం. ఈ పట్టున సీరా గ్రంథం ఈలా చెప్తుంది.

నీవు పీడకుని బారినుండి పీడితుని విడిపించు

నీవు తీర్చే తీర్పులలో ఖండితంగా వుండు - 4,19

.

పేదలకు అన్యాయంచేసి దేవునికి బలులర్పిస్తే అతడాబలులను స్వీకరింపడు. దరిద్రులకు అన్యాయంచేసి వారి నోటికాడి కూడు పడగొట్టకూడదు.

అన్యాయార్జితమైన పశువును బలిగా అర్పిస్

ఆ బలి దోషపూరితమైన దౌతుంది

దుష్టుల బలిని దేవుడు అంగీకరించడు

మహోన్నతుడు ధుర్మారుల బలివలన సంతుష్టిచెందడు

పెక్కు బలులు అర్పించడం వలన

వారి పాపాలు తొలగిపోవు
పేదవాని పశువును అపహరించి బలిగా అర్పించడం
తండ్రి చూస్తుండగా కుమారుని చంపడం లాంటిది
పేదలకు అన్నమే ప్రాణం
ఆ యన్నాన్ని నాశం చేయడమంటే
పేదవాణ్ణి చంపడమే - సీరా 34, 18–22
ఇంకా ధర్మశాస్తాన్ని భక్తితో పాటిస్తే అన్ని బలులూ సమర్పించినట్లే
ధర్మశాస్తాన్ని పాటిస్తే చాల బలులు అర్పించినట్లే
ఉపకారికి ఉపకారం చేయడం
ధాన్యబలిని అర్పించడంతో సమానం
పేదలకు దానం జేయడం
స్తుతిబలిని అర్పించడం లాంటిది
పాపంనుండి వైదొలగితే ప్రభువు సంతసిస్తాడు
కిల్ఫిషాన్ని విడనాడడం
ప్రాయశ్చిత్త బలిని సమర్పించడంతో సమానం - 35, 1-3
దేవుడు న్యాయాన్ని ఖండితంగా పాటించేవాడు
దేవునికి లంచమిస్తే అంగీకరించడు
అన్యాయంగా ఆర్థించినదానిని ప్రభువుకి అర్పింపకు
అతడు న్యాయవంతుడు, పక్షపాతి కాడు
అతడు పేదలకు అన్యాయం చేయడు
బాధితుని మొర అశ్రద్ధ చేయడు - 35, 12-15

ఇంకా, దీనుని వేడికోలు దేవుని చెవిని పడితీరుతుంది.అతడు దీనుణ్ణి ఆదరించి దుష్టుణ్ణి శిక్షించితీరుతాడు.

దీనుని వేడికోలు మేఘమండలాన్ని దాటిపోతుంది
మహోన్నతుని సమక్షం చేరికాని అది ఆగదు
ప్రభువు జోక్యం జేసుకుని
 దీనాత్మనికి న్యాయం చేకూర్చి
దుష్ణుని శిక్షించేవరకు అది అతన్ని వదలదు - 35, 17

యూదితు దేవుని న్యాయాన్నీ కరుణనీ ఈలా స్తుతించింది
నీవు సైనికులు సంఖ్యపైనగానీ
బలాఢ్యుల బలంపైన గాని ఆధారపడవు
నీవు వినయవంతుల దేవుడవు
పీడితులకు సహాయుడవు
దుర్భలులకు అండగా వుండేవాడవు
నిరాశ్రయులకు ఆశ్రయుడవు
నిరాశ చెందినవారికి ఆదరువవు - 9,11

బానిసలకు స్వేచ్చనీయడం గొప్ప దయ. యూదితు ఆలా చేసింది. "ఆమె చనిపోకముందు తన యాస్తిని తన దగ్గరి చుట్టాలకూ పెనిమిటి బంధువులకూ పంచియిచ్చింది. తన బానిసకు స్వేచ్ఛను ప్రసాదించింది" -16, 23-24 ఈ సందర్భంలో సీరా గ్రంథంకూడ ఈలా చెప్తుంది.

చిత్తశుద్ధితో పనిచేసే బానిసకుగాని
పూర్ణహృదయంతో శ్రమజేసే కూలివానికిగాని హాని చేయవద్దు
బుద్ధిమంతుడైన బానిసను
ఆత్మసమునిగా యెంచి అభిమానించు
అతనికి స్వాతంత్ర్యం దయచేయి - 7, 20-21

యజమానుడు తనకు కూలిచేసినవానికి వెంటనే కూలి చెల్లించాలి
నీవు పేదవాని బ్రతుకుతెరువును చెడగొట్టవద్దు
అతిన్ని ఆదుకొనడంలో ఆలస్యం చేయవద్దు - సీరా 41

ఈ సందర్భంలో తోబీతు తన కుమారుడు తోబీయాకు ఈలా చెప్పాడు. "నీకు పనిచేసినవారి కూలిని ఏరోజుకారోజు చెల్లించాలేగాని మరుసటిదినం వరకు అట్టిపెట్టుకోరాదు. నీవు ఈ నియమాన్ని పాటించి దేవుని గౌరవిస్తే అతడు నిన్ను బహూకరిస్తాడు" - 4,14.

మనం పేదసాదలను కాపాడాలని చెప్పూ సామెతల గ్రంథంకూడ ఈలా వాకొంటుంది

నీవు నోరులేనివారి పక్షాన మాటలాడు
నిస్సహాయుల కోపు తీసికో
అనాథుల పక్షాన వాదించు
వారికి న్యాయం కలిగేలా తీర్పుచెప్ప

పేదసాదలను అక్కరలోవున్న వారిని ఆదరించు వారి హక్కులను నిలబెట్టు – 31, 8-9

ఈ సాంఘిక న్యాయాన్నిగూర్చి తోబీతు గ్రంథం సంగ్రహంగా ఈలా వాకొంటుంది. "ఇతరులు ఏలాంటి కార్యంచేస్తే నీకు అప్రియం కలుగుతుందో ఆలాంటి కార్యాన్ని నీవు ఇతరులకు చేయవద్దు. " - 4, 15.

6. విజ్ఞానం

జ్ఞానగ్రంథాలు చాలా తావులో విజ్ఞానాన్ని గూర్చి మాట్లాడతాయి. కనుక మనం దాని స్వభావాన్ని కొంతవరకైనా గ్రహించి వుండాలి. ఇక్కడ జ్ఞానాన్ని గూర్చి ఐదంశాలు పరిశీలిద్దాం.

1) ఈ రచయితలు జ్ఞానానికి ఆతిధేయ, భార్య వధువు, తల్లి అనే నానా వపమానాలు వాడారు.

ఆమె ఆతిధేయమై నరులను తన అన్నపానీయాలు పుచ్చుకోవడానికి రమ్మని ఆహ్వానిస్తుంది, ఈ యన్నపానీయాలు విజ్ఞాన బోదలే.

రా, నేను తయారుచేసిన భోజనాన్ని ఆరగించు
నేను సిద్ధంజేసిన ద్రాక్షాసవాన్ని సేవించు
మూర్ఖత్వాన్ని విడనాడితే నీవు బ్రతికిపోతావు
నీవు విజ్ఞానపధాన నడవాలి - సామె 9,5-6
నన్నభిలషించేవాళ్ళంతా నా చెంతకు రండి
మీ యాకలి తీర నా ఫలాలను భుజించండి
మీరు నన్ను స్మరించుకోగా నేను మీకు
తేనెకంటె తీయగా వుంటాను
నన్ను భుజించేవాళ్లు మరి యధికంగా భుజింపగోరుతారు
నన్నుపానం చేసేవాళ్ళు మరి యధికంగా పానంజేయగోరుతారు

- సీరా 4, 19-21

ఆమె తల్లిలా, ఎలప్రాయపు వధువులా వచ్చి భక్తనికి విజ్ఞానాన్నం పెడుతుంది
దైవభీతి కలవానిని ఆహ్వానిస్తుంది
అతనికి తెలివిడి అనే అన్నం పెడుతుంది
వివేకం అనే పానీయం అందిస్తుంది - సీరా 15,2-3

2) విజ్ఞానం ఓ దైవ వ్యక్తి.దాని పుట్టక దివ్యలోకంలో అది శాశ్వతంగా ఉండేది. దేవుని లక్షణాలే దానికీ వుంటాయి.

కాలం కలగక మునుపే
ఆదిలోనే దేవుడు నన్ను చేసాడు
నేను కలకాలం వుండేదాన్ని - సీరా 24,9. ప్రభువు నన్ను ప్రప్రథమంలోనే సృజించాడు తాను పూర్వమే కలిగించినవాటన్నిటిలోను
నన్ను మొదటిదాన్నిగా చేసాడు
అతడు నన్ను మొట్టమొదటనే సృజించాడు పుడమికంటె ముందుగా నన్ను పట్టించాడు - సామె 9, 22-23 అది దేవుని
శ్వాసం, లేక పలుకు. దేవునికి ప్రతిరూపం. అతనితోపాటు స్వర్ణంలో
వసించేది.

నేను మహోన్నతుడైన ప్రభువు పల్కిన వాక్కుని
పొగమంచువలె నేను భూమిని కప్పాను
అత్యున్నతమైన ఆకాశం నా నివాసస్థలం
నా సింహానం మేఘస్తంభంమీద వుండేది - సీరా 24, 3-4

\

విజ్ఞానం దైవశక్తియొక్క శ్వాసం
ప్రభువు మహిమయొక్క స్వచ్ఛమైన ప్రవాహం
మలినమైనదేదీ దానిలోనికి ప్రవేశింపలేదు
అది శాశ్వతజ్యోతికి ప్రతిరూపం
దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించే నిర్మల ముకురం
అతని మంచితనానికి ప్రతిబింబం - సాలో జ్ఞాన 7, 25-26

అది దేవుని సింహాసనానికి ప్రక్కగా కూర్చుంటుంది. దేవునికి ప్రీతిపాత్రురాలవుతుంది. దేవా!
నీ సింహాసనం ప్రక్కన కూర్చుండివుండే
జ్ఞానాన్ని నాకు దయచేయి
నన్ను నీ తనయుల్లో ఒకణ్ణిగా స్వీకరించు - సాలో జ్ఞాన 9,4

అది దేవుని సన్నిధిలో వసించడంవల్ల
దాని కులీనత మరింత వన్నెకెక్కింది
అన్నిటికీ అధిపతియైన ప్రభువు దాన్ని ప్రేమించాడు - 8,3

దేవునికుండే లక్షణాలే జ్ఞానానికీ వుంటాయి. కనుకనే అది ఓ దైవవ్యక్తి, అది నరుల్లోకి ప్రవేశించి వారిని దేవుని స్నేహితులనుగాను ప్రవక్తలనుగాను మారుస్తుంది.

విజ్ఞానపుటాత్మ తెలివికలది, పవిత్రమైంది,
సూక్ష్మమైంది, చలనాత్మకమైంది, స్పష్టమైంది,
పరిశుభ్రమైంది, స్వచ్ఛమైంది, బాధింపరానిది,
మేలు చేసేది, చురుకైంది,
ఎదిరింప శక్యంకానిది, ఉపకారం చేసేది,
నరులతో స్నేహంచేసేది,
స్థిరమైంది, నమ్మదగినది, విచారానికి లొంగనిది,
సర్వశక్తి కలది, సర్వం పరీక్షించేది,
జ్ఞానాత్మకాలూ సూక్ష్మాలూ పునీతాలూ ఐన
ప్రాణులన్నిటిలోనికి ప్రవేశించేది,
జ్ఞానం కదలికకంటెగూడ త్వరగా కదులుతుంది
అది పవిత్రమైంది కనుక అన్ని వస్తువుల్లోకి ప్రవేశిస్తుంది.
అది దైవశక్తియొక్క శ్వాసం,
ప్రభువు తేజస్సు యొక్క స్వచ్ఛమైన ప్రవాహం,
మలినమైనదేదీ దానిలోనికి ప్రవేశింపలేదు,
అది శాశ్వత జ్యోతికి ప్రతిరూపం,
దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించే నిర్మల ముకురం,
అతని మంచితనానికి ప్రతిబింబం,
అది వొంటిగా పనిచేసినా అన్నిటినీ నిర్వహిస్తుంది
తాను మారకుండానే అన్నిటినీ మారుస్తుంది
అది ప్రతితరాన కొందరు భక్తులలోనికి ప్రవేశించి
వాళ్ళను దేవునికి స్నేహితులనుగాను
ప్రవక్తలనుగాను మార్చివేస్తుంది
జ్ఞానాన్ని చేపట్టినవాణ్ణి మాత్రమే ప్రభువు ప్రేమిస్తాడు - సాలో జ్ఞాన 7, 22-28

3) విజ్ఞానంచేసే కార్యాలుకూడ బహుముఖంగా వుంటాయి. అది దేవుని సన్నిధిలో అటలాడుకొంటూంది. అతడు సృష్టిచేసేప్పడు ఓ శిల్పిలా అతని ప్రక్కనే నిల్చివుంది. సంతోషంతో మానవాళి మధ్య వసిస్తూంది. విజ్ఞానం ధర్మశాస్త్రం ఒకటే

ప్రభువు నభోమండలాన్ని నిర్మించినపుడు
కడలికి చెలియలికట్టను చుట్టినపుడు
నేను ప్రధాన శిల్పివలె అతని చెంత నిల్చివున్నాను
పసికందులాగ రోజురోజు అతనికి ఆనందం చేకూరుస్తూ
నిత్యం అతని సన్నిధిలో ఆటలాడుకొనేదాన్ని
అతడు చేసిన పుడమిమీద క్రీడిస్తూ
ప్రమోదంతో మానవాళిమధ్య వసిస్తూండేదాన్ని - సామె 8, 30-31

నిర్మలమైన ప్రేమకి దైవభీతికీ విజ్ఞానం జనని. యిప్రాయేలీయులు విజ్ఞానవృక్షఫలాలు భుజిస్తారు. విజ్ఞానం వారి మధ్యనే వసిస్తుంది.

నిర్మలమైన ప్రేమకీ దైవభీతికీ
విజ్ఞానానికీ నిరీక్షణకూ నేను జననిని
నేను శాశ్వతంగా మనేదాన్ని కనుక
దేవుడు తానెన్నుకొనిన ప్రజలందరికీ నన్ను దయచేసాడు
నన్నభిలషించేవాళ్ళంతా నా చెంతకు రండి
మీ యాకలితీర నా ఫలాలను భుజించండి - సీరా 24, 18-19

అపుడు సర్వాన్ని చేసిన దేవుడు నాకాజ్ఞ యిచ్చాడు
సృష్టికర్త నేనెచట వసించాలో నిర్ణయించాడు
అతడు నీవు యాకోబు వంశజుల నడుమ వసించు
యిస్రాయేలీయులు నీ ప్రజలౌతారని చెప్పాడు
పవిత్రమైన గుడారంలో నేను ప్రభువుని సేవించాను
అటుతర్వాత సియోను కొండమీద వసించాను
ప్రభువు తనకు ప్రీతికరమైన నగరాన
నాకు నివాసమేర్పరచాడు
యెరూషలేముమీద నాకు ఆధిపత్యం ఒసగాడు
అతడు తన సొంత ప్రజనుగా ఎన్నుకొని
ఆదరాభిమానాలతో చూచుకొనే జనుల నడుమ నేను స్థిరపడ్డాను - సీరా 24, 8-12

ఈ జ్ఞానమూ ప్రభువు ధర్మశాస్త్రమూ ఒకటే. మోషే ధర్మశాస్త్రమే జ్ఞానం అనడం పూర్వవేదంలో చాలా గొప్ప భావం.

ఈ విజ్ఞానం మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం
మహోన్నతుడైన ప్రభువు నిబంధన గ్రంథం యిస్రాయేలు సమాజాలకు వారసంగా లభించిన ఆస్తి - సీరా 24, 23. ఈ జ్ఞానం దేవుని ఆజ్ఞల గ్రంథం
శాశ్వతంగా నిల్చే ధర్మశాస్త్రం
దాన్ని పాటించేవాళ్ళ బ్రతుకుతారు విడనాడేవాళ్ళు చస్తారు - బారూకు 41.

విజ్ఞానం లోకాన్ని క్రమపద్ధతిలో నడిపించి కాపాడుతుంది. ఆదాము కాలం నుండి నరజాతిని నడిపిస్తూ వచ్చింది. ఎప్పడూ నరులను ఋజమార్గంలో నడిపించి రక్షించేది అదే.

దాని మహాశక్తి ప్రపంచమంతట వ్యాపించివుంది
అది సమస్తాన్నీ క్రమపద్ధతిలో నడిపించి
సద్వినియోగం చేస్తుంది - సాలొ జ్ఞాన 8,1
ప్రభూ! నీవు నీ జ్ఞానాన్ని దయచేస్తేనేతప్ప,
నీ చిత్తాన్ని ఎవడు తెలిసికోగలడు?
ఈ రీతిగా నీవు దయచేసే జ్ఞానంద్వారా
భూమిమీది నరులు ఋజుమార్గాన నడుస్తున్నారు
నీకు ప్రీతికరమైన కార్యమేమిటో తెలిసికొని
భద్రతను పొందుతున్నారు - 9, 17-18

4) విజ్ఞానం మనకు ನಿ'ದಿಂವಿಪಿಟ್ಟೆ వరాలుకూడ చాల వున్నాయి. అది నరునికి అమూల్యమైంది

సింహాసనంకంటె కిరీటంకంటె గూడ అధికంగా
నేను జ్ఞానాన్ని అభిలషించాను
సంపదలు దానితో తులతూగలేవని గ్రహించాను
అమూల్యమణులేవీ దానికి సాటిరావని తెలిసికొన్నాను
జ్ఞానంతో పోలిస్తే ఈ లోకంలోని బంగారమంతా వట్టి యిసుకముద్ద
వెండి అంతా వట్టి మట్టి పెళ్ళ
నేను ఆరోగ్యంకంటె సౌందర్యంకంటె
జ్ఞానాన్ని ఎక్కువగా కోరుకొన్నాను

దాని కాంతి యేనాడూ తరగిపోదు కనుక
 వెల్తురుకంటెగూడ దాన్ని అధికంగా అభిలషించాను
జ్ఞానం నా చెంతకు వచ్చినపుడు
సమస్త ప్రశస్త వస్తువులనుకూడ తీసుకవచ్చింది -సొలో జ్ఞాన 7,8-11

అది మనకు దీర్ఘాయువునీ ఆనందాన్నీ సంపదలనూ దయచేస్తుంది.
 విజ్ఞానం కుడిచేత దీర్ఘాయువుంటుంది
ఎడమచేత సంపదలూ కీర్తీ వుంటాయి
 అది నీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది
 నీ మనుగడకు సంతృప్తినిస్తుంది
 విజ్ఞానం తన్ను స్వీకరించేవారికి జీవవృక్షమౌతుంది?
 దాన్ని పొందేవాళ్లు సంతోషంతో జీవిస్తారు- సామె 3,16-18

దానివలన మనకు భద్రత కలుగుతుంది. అది మనలను ఉపద్రవాలనుండి కాపాడుతుంది

 కుమారా! నీవు విజ్ఞానవివేకాలను అలవర్చుకో
 వానిని ఏనాడూ అశ్రద్ధ చేయకు
 అవి నీకు జీవాన్నిస్తాయి
 నీ కంఠానికి అలంకార మౌతాయి
 విజ్ఞానవివేకాలతో నీవు సురక్షితంగా నడుస్తావు
 నీ యడుగులు ఎచ్చటా తడబడవు
 నీవు శయనించేపుడు భయపడక నిశ్చింతగా నిద్రపోతావు
 దుర్మారులకులాగా నీకు అకస్మాత్తుగా
 ఏమి ఉపద్రవాలు వస్తాయో అని భయపడవు
 నిన్ను కాపాడేవాడు ప్రభువు కనుక
 అతడు నిన్నే బంధాల్లోను చిక్కుకోనీయడు - 3, 21–26

దానివల్ల మనకు సకల భాగ్యాలూ, న్యాయమూ సిద్ధిస్తాయి.
 నా యొద్ద భోగభాగ్యాలు కీర్తిప్రతిష్టలు
అక్షయ సంపదలు నీతిన్యాయాలు వున్నాయి
 మేలిమి బంగారంకంటె, మెరుగైన వెండికంటె
 నే నొసగే ఫలాలు మిన్నయైనవి
 నేను ధర్మపథాన నడుస్తాను
 న్యాయమార్గాన సంచరిస్తాను - సామె 8,8-20

అన్ని పుణ్యాలకు నిలయం విజ్ఞానమే.
 కనుక నరుడు దాన్ని సాధించాలి.
 జ్ఞానానికి మించిన సంపదలేదు
అన్నిటిచేత పనిచేయించేది అదే
బుద్ధిశక్తి అభిలషించదగినదైతే
జ్ఞానానికి మించిన బుద్ధిశక్తి యేమి వుంది?
 లోకంలోని వస్తువులనన్నిటిని నిర్మించిందదే
 పుణ్యం కోరుకోదగినదైతే
పుణ్యాలన్నీ జ్ఞానంనుండే పడతాయి
మితత్వం, న్యాయం, వివేకం, ధైర్యం
 మొదలైన వాటినన్నిటినీ జ్ఞానమే మనకు బోధిస్తుంది
 ఈ జీవితంలో వీటికంటె విలువైన వేవీలేవు - సాలొ జ్ఞాన 8, 5–7

5) జ్ఞానాన్ని ఆర్థించే మార్గమేమిటి? మొదట, పాపులకు విజ్ఞానం అబ్బదు
 మూరులు విజ్ఞానాన్ని బడయలేరు
 పాపాత్ముల కంటికి అది కన్పింపనైన కన్పింపదు
 గర్వాత్ములకు అది దూరంగా వుంటుంది
 అనృతవాదుల మనసులోకి అది ప్రవేశింపదు - సీరా 15, 7-8.

విజ్ఞానమంటే యేమోకాదు. దైవభయమే. భక్తులకు పుట్టువునుండే విజ్ఞానం లభిస్తుంది•

విజ్ఞానమెల్ల దేవునికి భయపడ్డమే
విజ్ఞానమెల్ల దైవాజ్ఞలను పాటించడమే
ప్రభువు సర్వాధిపత్యాన్ని గుర్తించడమే
ప్రభువుపట్ల భయభక్తులు చూపడం విజ్ఞానానికి మొదటి మెట్టు
భక్తులు మాతృగర్భంనుండే విజ్ఞానాన్ని పొందుతారు
దేవునికి భయపడ్డమే విజ్ఞానం, దుష్కార్యాలు విడనాడ్డమే వివేకం -సీరా 19,20. 1,14. యోబు 28, 28,

నరుడు ఎంత కృపైనాచేసి ఈ జ్ఞానాన్ని ఆర్జించాలి. విజ్జుల సూక్తులనుండి దాన్ని గ్రహించాలి.

కుమారా! బాల్యంనుండి ఉపదేశాన్ని నేర్చుకో
ముదిమి పైబడిందాకా విజ్ఞానాన్ని గడిస్తూండు

రైతు పొలందున్ని విత్తనాలు నాటినట్లే
నీవూ విజ్ఞానార్జన కొరకు కృషిచేయి
అప్పుడు నీకు చక్కని పంట లభిస్తుంది
నీవు విజ్ఞల బోధలను అనాదరం చేయవద్దు
 వారి సూక్తులను జాగ్రత్తగా పఠించు
వాని వలన నాగరికత అలవర్చుకొని
రాజులకు సేవలుచేసే విధానం నేర్చుకొంటావు - సీరా 6, 18-19, 8,8

విజ్ఞానానికి వెలకట్టలేం. విజ్ఞానవాక్కే సుభూషణం. దానివల్ల మన భవిష్యత్తు బంగారుబాటు ఔతుంది.

బంగారంకంటె విజ్ఞానాన్ని ఆర్థించడం మెరుగు
 వెండికంటె వివేకాన్ని బడయడం మేలు
సముద్రంవలె అగాధమూ, పారేయేరులా నిర్మలమై
 నరుని పల్ములు విజ్ఞాన సంభరితాలై వుంటాయి
 బంగారమంది ముత్యాలున్నాయి
 కాని విజ్ఞానవాక్కేసుభూషణం
 కుమారా! తేనెను భుజిస్తే తీయగా వుంటుంది,
 మధుకోశంనుండి చిప్పిలే తేనే నాల్మకు రుచించినట్లే
 విజ్ఞానం హృదయానికి ఇంపుగా వుంటుంది
 దాన్ని పొందితే నీ భవిష్యత్తు బంగారుబాట ఔతుంది
 - సామె 16,16. 18.4,20.15. 24,13-14

జ్ఞానం ఇంత విలువైంది కనుక భక్తులు దీన్ని గాఢంగా వాంఛించారు. సొలోమోను దీనికొరకు ప్రభువుని ప్రార్ధించాడు.

ప్రభూ! నీ సింహాసనం కుడిప్రక్కనకూర్చుండివుండే
జ్ఞానాన్ని నాకు దయచేయి
నన్ను నీ తనయుల్లో ఒకనిగా స్వీకరించు
పరమ పవిత్రమైన మోక్షపదంనుండి,
మహిమాన్వితమైన నీ సింహాసనం నుండి
జ్ఞానాన్ని నా యొద్దకు పంపు
అది నాతోగలసి పనిచేయునుగాక

దాని సాయంతో నీకు ప్రీతి కలిగించేదేదో
 నేను తెలిసికొందునుగాక - సొలో జ్ఞాన 9, 1–10

సీరాగూడ దీనికొరకు దేవునికి ప్రార్థన చేసాడు
 నేను విజ్ఞానం కొరకు పోరాడాను
విశుద్ధ వర్తనాన్ని అలవర్చుకొన్నాను
 దేవునికి ప్రార్ధనచేసి
 నేనెంతటి అజ్ఞానినో తెలియజేసికొన్నాను
 కాని నేను విజ్ఞానాన్ని అభిలషించాను
 నిర్మల హృదయాన్ని అలవర్చుకొని దాన్ని సాధించాను
దానిని ఆర్జించినప్పటినుండి వివేకవంతుజ్ఞయ్యాను
 ఇక నేను దానిని విడనాడను - సీరా 51,19-20

ఈ భక్తుల్లాగే మనంగూడ జ్ఞానంకొరకు ప్రార్థిద్దాం. దేవునినుండి ఈ యమూల్యవరాన్ని పొందుదాం.

7. కొన్ని నైతిక విలువలు

జ్ఞాన గ్రంథాలు చాలా నైతిక విలువలను పేర్కొంటాయి. ప్రస్తుతానికి వాటిలో మూడింటిని పరిశీలిద్దాం. అవి పొదుపు, నిజాయితీ, నమ్మదగినతనం. మానవుడు పొదుపుగా జీవించాలి.

పంటలు పండిన కాలాన కరువును గుర్తుంచుకో
సంపదలు కలిగిన కాలాన పేదరికాన్ని స్మరించుకో
ఉదయ సాయంకాల మధ్యలోనే పరిస్థితులు మారవచ్చు
ప్రభువు తలపెట్టిన మార్పు అతి శీఘ్రంగా వస్తుంది - సీరా 18,25-26

కనుక నరుడు దూబర ఖర్చులు మానాలి
 సుఖభోగాలకు దాసుడివి కావద్దు
 భోగజీవనంవలన అయ్యేఖర్చులు నిన్ను గుల్లజేస్తాయి
 నీ చేత డబ్బులేనపుడు
బాకీలుజేసి విందులారగించి బిచ్చగాడివైపోవద్దు
అలా చేస్తే నీవు సంపన్నుడివి కాలేవు
 చిన్న విషయాల్లో శ్రద్ధ చూపనివాడు
 క్రమంగా నశిస్తాడు - 18,32-19,1

మన జీవితంలో నిజాయితీ కూడ వుండాలి మనం వాడే తూకపురాళ్ళూ కొలమానాలూ సక్రమంగా వుండాలి.

నీవు నమ్మినదానికి కట్టుబడి వుండు
నీ పలుకుల్లో నిజాయితీ చూపెట్టు.
గొప్పవాడిలా తిరుగుతూ ఆకలితో చావడంకంటె
సామాన్యునిలా బ్రతుకుతూ
కడుపుకూడు సంపాదించుకోవడం మేలు.
సరియైన కొలమానాలూ పడికట్టురాళ్ళూ వాడాలి
పెద్దదో చిన్నదో వ్యాపారం చేసికోవాలి.
తూనికలు కొలతలు సక్రమంగా వుండాలని ప్రభువు కోరిక
సక్రమంగా సరుకులు అమ్మాలని అతని ఆశయం. - సీరా 5,10. సామె
 12,9. సీరా 42,5. సామె 16,11

నరుల్లో నమ్మదగినతనం వుండాలి. స్నేహితుని రహస్యాలను వెల్లడి చేయకూడదు. సకాలంలో ఋణం తీర్చాలి. నమ్మదగినవాళ్ళంగా నటిస్తేనే చాలదు.

నీ స్నేహితుణ్ణి ప్రేమించి విశ్వసనీయుడివిగా మెలగు
అతని రహస్యాలను వెల్లడిచేస్తే
ఇక అతన్ని వదలుకోవలసిందే
నరుడు తన శత్రువుని నాశం చేసినట్లే
నీవుకూడ రహస్య ప్రకాశనంద్వారా
నీ స్నేహాన్ని నాశం చేసికొన్నావు
నీ చేతిలోని పక్షి జారిపోయినట్లే
నీ స్నేహితుడుకూడ తప్పించుకొన్నాడు
అతడు మరల నీకు చిక్కడు.
నీవు ఋణదాతకిచ్చిన మాట నిలుపుకొంటే
అతడు నీ యక్కరల్లో ఎల్లప్పడూ సాయం చేస్తాడు
నీకు పూటకాపుగా వున్నవాని వుపకారాన్ని మరువకు
అతడు తన పరువుని పణంగాబెట్టి నిన్ను కాపాడాడు.
నీవు కరుణనూ విశ్వనీయతనూ అలవర్చుకో
వానిని దండలాగ నీ మెడలో తాలు
నీ హృదయఫలకంపై వ్రాసికో.
అందరూ మేము నమ్మదగినవాళ్ళమేనని చెప్పకొంటారు
కాని యధార్థంగా విశ్వసనీయులైనవాళ్లు ఎందరు? - సీరా 27,17-18. 29,3-
15. సామె 3,3.20,6


8. దేవునికి ఆరాధనలూ కానుకలూ అర్పించాలి

నరుడు దేవుణ్ణి ఆరాధించి కానుకలు అర్పించుకోవాలి. చేసిన మొక్కుబడులు చెల్లించాలి, తనపొలంలో పండిన పంటనుండి తొలిఫలాలూ దశమభాగాలూ సంతోషంగా అర్పించాలి.
దేవునికి భయపడి యాజకులను గౌరవించు
విధ్యుక్తంగా వారి కీయవలసిన కానుకలు ఈయి
ప్రధమ ఫలాలు, పాపపరిహార బల్యర్పణాలు
బలిపశువు జుబ్బ, పవిత్రార్పణలు ఈయి
కుమారా! నీవు నీ స్థితికి తగినట్లుగా భుజించు
 ప్రభువుకి మేలి కానుకలు అర్పించు
దేవునికి మొక్కిన మొక్కులను వెంటనే తీర్చుకో
 చనిపోయే సమయందాకా జాప్యం చేయకు
 మొక్కుబడి చేసేపుడు దాన్ని చెల్లించే వద్దేశముండాలి
దేవుని సహనాన్ని పరీక్షింపకూడదు.
విమలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరిస్తాడు
 అతడు దాన్ని విస్మరింపడు
ప్రభువుకి ఉదారంగా కానుకలీయి
 నీ తొలిఫలాలు అర్పించడంలో పిసినారివి కావద్దు
చిరునవ్వుతో నీ కానుకలను అర్పించు
సంతసంతో దశమభాగాలను ఈయి.
 సీరా 7.31 14,11. 18,22-23. 35,7-9. 38.11.

మతం కేవలం కర్మకాండ కాకూడదు. అది హృదయగతమైన మతమై వుండాలి. దానికి వినయం అవసరం. ఈ వినయాన్ని అవర్చుకోవాలంటే నరుడు తన దారిద్ర్యాన్నీ చావనీ స్మరించుకోవాలి. తన తప్పిదాలకు పశ్చాత్తాపపడాలి.

కుమారా! నీవు చేసే పనులన్నిటిలోను
వినయంతో మెలుగు
బహుమతు లిచ్చేవానికంటే గూడ
వినయవర్తనుని ప్రజలు అధికంగా మెచ్చుకొంటారు
నీవు ఎంత అధికుడివో అంత వినయవర్తనుడివి కా

అప్పడు ప్రభువు మన్నన పొందుతావు
 గొప్పవారు పేరుప్రసిద్దులు కలవారు చాలమంది వున్నారు
 కాని ప్రభువు వినయాత్మలకు
 తన రహస్యాలు ఎరిగిస్తాడు
ప్రభువు మహా ప్రభావం కలవాడైనా
 వినముల పూజలు అందుకొంటాడు
 వ్యాధి అనే శిక్షకు గురికాకముందే
వినయాన్ని ప్రదర్శించు
 తప్ప చేసినపుడు పశ్చాత్తాపపడు
 ఉరుముకి ముందు మొరపు చూపట్టినట్లే
 వినయవంతుని మంచిపేరు
అతనికి ముందుగా నడుస్తుంది
 దుమ్మూ బూడిదా ఐన నరులు
 ఏమి జూచుకొని గర్వపడాలి?
మనం బ్రతికివుండగానే మన శరీరం కుళ్ళిపోతుంది
నరుడు చచ్చాక అతనికి దక్కేది
 పరుగులు ఈగలు మాత్రమే
మృత్యువు నీకోసం వేచివుండదు
 నీవేనాడు పాతాళానికి పోతావో నీకే తెలియదు
వ్యాధి అనే శిక్షకు గురికాకముందే
 వినయాన్ని ప్రదర్శించు
తప్ప చేసినపుడు పశ్చాత్తాపపడు
 తన తప్పని తా నొప్పకొనేవాడు
 శిక్షను తప్పించుకొంటాడు - సీరా 3,17-20. 18, 21. 32,10. 10,9-11. 14,12. 18,21. 20,3.

9. దైవభక్తి

నరునికి దైవభక్తి వుండాలి. అతడు ప్రభువు పరీక్షకు సిద్ధంగా వుండాలి. స్వేచ్ఛతో దేవుణ్ణి సేవించాలి. దేవభీతి కలవారిని ప్రభువు ఆదుకొంటాడు. అతన్ని కాలుజారి పడనీయడు. దైవబలమే నిజమైన బలం. తల్లిదండ్రులు చిన్ననాటినుండే తమ బిడ్డలకు దైవభీతిని నేర్పాలి.

కుమారా! నీవు దేవుని సేవింప గోరితే
పరీక్షకు సిద్ధంగా వుండు
చిత్తశుద్ధితోను పట్టుదలతోను మెలగు
ఆపదలు వచ్చినపుడు నిబ్బరంగా వుండు
ప్రభువుని ఆశ్రయించు, అతన్ని విడనాడకు
అప్పడు నీవు విజయాన్ని పొందుతావు
ప్రభువు దౌష్ట్యాన్ని పూర్తిగా అసహ్యించుకొంటాడు
దైవభీతికల నరుడు చెడ్డను అంగీకరింపడు
భగవంతుడు ఆదిలో నరుని చేసినప్పడు
అతనికి తన నిర్ణయాలను తానే చేసికొనే స్వేచ్చ నిచ్చాడు
నీవు కోరుకొంటే ప్రభువు ఆజ్ఞలు పాటించవచ్చు. అతన్ని అనుసరించాలో లేదో
నిర్ణయించేది నీవే
ప్రభువు నిప్పూ నీళూకూడ నీముందు పెట్టాడు
చేయి చాచి వాటిలో నీ కిష్టం వచ్చింది తీసికో
మృత్యువు జీవంకూడ నరుని ముందున్నాయి
అతడు తాను కోరుకొన్నది తీసికోవచ్చు.
నీ మరణ కాలంలో ప్రభువు నీపట్ల
ఆగ్రహం చూపకుండా వుండేలానూ
నీకు తీర్పుచెప్పేపుడు నీకు విముఖుడుగా
వుండకుండేలానూ జాగ్రత్తపడు
దైవభీతి కలవాళ్ళు జీవాన్ని పొందుతారు
వాళ్లు నమ్మిన దేవుడే వాళ్ళను కాపాడతాడు
దైవభీతి కలవాడు భయపడనక్కరలేదు
ప్రభువుని నమ్మాడుగాన
అతడు పిరికివాడు కానక్కరలేదు
ప్రభువుని నమ్మినవాడధన్యుడు
ఏ దిక్కునుండి సహాయం లభిస్తుందో అతనికితెలుసు
దేవుడు తన్ను ప్రేమించేవాళ్ళని
ఒక కంట కనిపెట్టి వుంటాడు
వారిని తప్పక ఆదుకొని శక్తితో సంరక్షిస్తాడు
వారిని వడగాలి నుండి

మధ్యాహ్నపు వేడినుండి కాపాడతాడు
వారిని కాలుజారి పడనీయడు, నాశమైపోనీయడు
వారికి సేదదీర్చి
వారి కన్నులలో కాంతిని నెలకొల్పుతాడు
ఆయురారోగ్యాలతో వారిని దీవిస్తాడు
ధనబలాల వలన ఆత్మవిశ్వాసం కలుగుతుంది
కాని ఆ రెండిటికంటె దైవభీతి మేలు
దైవభీతి కలవారికి వేరేమి అక్కరలేదు
ఇతరాధారాలేమీ అవసరంలేదు
దైవభీతి నానా లాభాలొసగే ఉద్యానవనం లాంటిది
దానికి మించిన సదాశ్రయం లేదు
దైవభక్తిలేని బిడ్డలు ఎంతమంది వున్నా
వారిని జూచి సంతృప్తి చెందవద్దు
ఆ బిడ్డల భవిష్యత్తు శుభప్రద మౌతుందనీ
వాళ్ళ దీర్ఘకాలం జీవిస్తారనీ ఆశింపవద్దు
వేయిమంది పుత్రులకంటె ఒక్కడు మెరుగు
భక్తిహీనులైన బిడ్డలను కనడంకంటె
అసలు బిడ్డలు లేకుండ చనిపోవడం మేలు

-సీరా 2, 1-3. 15, 13-17. 18,24. 34, 13-17. 40, 26-27. 16, 2-3. మన పథకాలు మనకుండవచ్చుగాక, వాటిని సఫలం చేసేవాడు మాత్రం ప్రభువే. అతని దీవెన వల్లనే మనం విజయం పొందుతాం. ఈ జీవితంలో మనలను నడిపించేది అతడే.

నరుడు పథకాలను సిద్ధంచేసికోవచ్చగాక
ప్రత్యుత్తర మిచ్చేది మాత్రం ప్రభువే .
నరుడు పథకాలను సిద్ధంజేసికోవచ్చుగాక
అతని కార్యక్రమాలను నడిపించేదిమాత్రం ప్రభువే .
నరుడు ప్రణాళికలను వేసికోవచ్చుగాక
దేవుని సంకల్పం నెరవేరి తీరుతుంది.
నరుడు గుర్రాన్ని యుద్దానికి సిద్ధంచేయవచ్చుగాక
విజయాన్ని ఒసగేది మాత్రం ప్రభువే.

దేవుణ్ణి నీ కార్యక్రమాలను దీవించమని వేడుకొంటే
 నీకు తప్పక విజయం కలుగుతుంది
 నీకున్న సిరిసంపదలతో దేవుణ్ణి పూజించు
 నీకు పండిన పంటలో మొదటిపాలు అతని కర్పించు
 నరుణ్ణీ నడిపించేవాడు ప్రభువే
లేకపోతే మనుజునికి త్రోవ యేలా తెలుస్తుంది?
 - సామె 16, 1. 9. 19,21. 2.81. 16,8.8,8. 20,24

నరుడు దేవుణ్ణి నమ్మిజీవించాలి. మేలూ కీడూ కూడ అతనినుండే వస్తాయి. మన పనుల్లో దేవుణ్ణి నమ్మకొంటే అతడు వాటిని సులభం చేస్తాడు. నరుడు ప్రభువు శిక్షను మనస్పూర్తిగా అంగీకరించాలి. అతనిపట్ల భయభక్తులు కలిగి జీవించాలి. ప్రభువు దివ్యనామమనే కోటలో దాగుకోవాలి.

ఒకడు బానిసలా శ్రమించి పనిచేసినా
ఎల్లప్పడూ వెనుకబడుతూనే వుంటాడు
మరొకడు తెలివితక్కువవాడు,
అన్యుల సాయం కోరేవాడు,
శక్తిలేనివాడు, పరమదరిద్రుడు కావచ్చు
కాని ప్రభువు వాణ్ణి కరుణతో వీక్షించి
దీనావస్థ నుండి ఉద్ధరింపవచ్చు
అప్పడతడు మళ్ళా ఔన్నత్యాన్ని పొందడంజూచి
అందరూ ఆశ్చర్యచకితు లౌతారు
మేలు కీడు, బ్రతుకు చావు, కలిమి లేమి
అన్నీ దేవునినుండే వస్తాయి
భక్తుడు దేవుని దీవెననే బహుమతిగా పొందుతాడు
ఆ దీవెన క్షణకాలంలోనే సత్ఫలితాన్నిస్తుంది.
నీ కార్యాలన్నిటిలో ప్రభువుని స్మరించుకో
అతడు నీ పనులను సులభతరం చేస్తాడు
కుమారా! ప్రభువు శిక్షణను తృణీకరించవద్దు
అతని మందలింపులను అశ్రద్ధ చేయవద్ధు
తండ్రి తన కిష్టుడైన కుమారుణ్ణీ శిక్షించినట్లే
ప్రభువు తనకు ప్రీతిపాత్రుడైన నరుణ్ణి చక్కదిద్దుతాడు.
                                            

                   81 

దేవునిపట్ల భయభక్తులు కలవానికి చీకుచింత లేదు
అతని సంతతినిగూడ ప్రభువే రక్షిస్తాడు
దైవభయం జీవజలధారవంటిది
దానివలన మృత్యుపాశంనుండి తప్పించుకోవచ్చు.
ప్రభువు దివ్యనామం కోటలాంటిది
పుణ్యపురుషులు దానిలో ప్రవేశించి
రక్షణం పొందుతారు

ధనవంతులు మాత్రం తమ సంపద తమ్ము ఉన్నతమైన ప్రాకారంవలె సంరక్షిస్తుందని బ్రాంతి పడతారు - సీరా 11, 11-14.22. సామె 3,6. 11-12. 14, 26-27. 18, 10-11

10. ఆత్మగౌరవాన్ని కాపాడుకో

నరుడు తన్నుతాను తక్కువగా ఎంచుకొని ఆత్మగౌరవాన్ని చెడగొట్టుకోగూడదు. తన్ను తాను నిందించుకోగూడదు. మాటామాటికి పొరుగువారి యింటికిబోయి చులకన కాగూడదు.

కుమారా! నీకు లభించిన అవకాశాలను
సద్వినియోగం జేసికో
కాని దుష్కార్యాలకు పూనుకోకు
నిన్నుజూచి నీవే సిగ్గుపడకు
వినయవర్తనం గౌరవాన్ని కీర్తిని తెచ్చిపెడుతుంది
కాని తన్నుతాను తక్కువగా ఎంచుకోవడం పాపహేతువు
ఇతరులపట్లగల మోజుచే
నీయాత్మ గౌరవాన్ని చెరచుకోవద్దు
నీ హక్కుని వదలుకొని స్వీయనాశాన్ని తెచ్చుకోవద్దు
కుమారా! ఆత్మాభిమానమూ వినయమూ కలిగివుండు
నీకు తగినట్లుగానే నిన్నునీవు గౌరవించుకో
తన్ను తాను నిందించుకొంటే ప్రయోజనం లేదు
ఆత్మగౌరవం లేనివాణ్ణి ఇతరులు గౌరవిస్తారా?
తేనెనుగూడ మితంమీరి భక్షింపరాదు
భక్షిస్తే వాంతి ఔతుంది

82

అట్లే పొరుగువాని యింటికిగూడ

మాటిమాటికి వెళ్ళరాదు
వేళ్తే అతనికి విసుగెత్తి నిన్ను చీదరించుకొంటాడు - సీరా 49, 2222,10,2829 25, 16-17.

11. స్నేహధర్మాలు

స్నేహితుణ్ణి పరీక్షించి మరీ యెన్నుకోవాలి. మంచి స్నేహితుడు నిధిలాంటివాడు. ప్రాత మిత్రుణ్ణీ వదలుకోరాదు. స్నేహితుణ్ణి అవమానిస్తే అతన్ని పోగొట్టుకొంటాం. మిత్రుడు మిత్రుని రహస్యాలు దాచాలి. దేవుని దీవెనవల్ల మన శత్రువులుకూడ మనకు మిత్రులౌతారు

మృదుభాషణం వలన
చాలమంది స్నేహితులు కల్గుతారు
మర్యాదావర్తనం వలన మిత్రులు పెరుగుతారు
నీకు పరిచితులు చాలమంది వుండవచ్చుగాక
సలహాదారుణ్ణిగా మాత్రం
వేయిమందిలో ఒక్కణ్ణి ఎన్నుకో
పరీక్షించి చూచిన పిదపనేగాని
ఎవజ్జయినా మిత్రునిగా అంగీకరింపకు
త్వరపడి యెవర్నీ నమ్మకూడదు
నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోటలాంటివాడు
ఆలాంటివాడు దొరికితే నిధి దొరికినట్లే
అతనికి వెలకట్టలేము
అతని విలువ అన్నిటిని మించింది
ప్రాతమిత్రుణ్ణీ పరిత్యజింపవద్దు
క్రొత్త మిత్రుడు అతనికి సాటిరాడు
నూత్న మిత్రుడు నూత్న ద్రాక్షాసవం లాంటివాడు
ప్రాతపడిన పిదపగాని మధువు
సేవించడానికి యింపుగా వుండదు.
నీవు నీ స్నేహితునిమీద కత్తిదూసినా
నిరాశపడనక్కరలేదు, మరల సఖ్యం కలిగించుకోవచ్చు
అతనితో ఘర్షణకు దిగినా

83

చింతించనక్కరలేదు, మరలా రాజీపడవచ్ఛ్హు
కాని అవమానం, అహంకారం,
రహస్యాలను బయలుపర్చడం, వెన్నుపోట్ల పొడవడం
అనేవాటిని ఏ మిత్రుడు సహించలేడు
రహస్యాలను వెలిబుచ్చేవాడు నమ్మదగనివాడు
అతనికి ఆప్తమిత్రులు దొరకరు
నీ స్నేహితుణ్ణి ప్రేమించి
విశ్వసనీయుడిగా మెలుగు
అతని రహస్యాలను వెల్లడిచేస్తే
ఇక అతన్ని వదలుకోవలసిందే.
ప్రభువు ఎవనివలన ప్రీతి జెందుతాడో
వానికి శత్రువులుకూడ మిత్రులయ్యేలా చేస్తాడు - సీరా 6, 5-8. 14–16. 9,10. 22.20-22, 16–17 సామె 16,7.

దుష్టునితో స్నేహం పనికిరాదు. కష్టాల్లో అతడు మనలను ఆదరించడు, ఆపదల్లో ఆదుకొనేవాడే నిజమైన మిత్రుడు.

కీలు ముట్టుకుంటే చేతులకు మురికి ఔతుంది
దుష్టులతో స్నేహంచేసేవాడు వారివంటివాడే ఔతాడు
సంపదల్లో మంచి మిత్రుడ్డి గుర్తించలేం
కాని ఆపదల్లో చెడ్డమిత్రుడ్డి గుర్తించవచ్చు
కష్టాల్లో మిత్రులుకూడ మనలను విడిచిపోతారు
కాని సంపదల్లో చెడ్డవారుకూడ మిత్రుల్లా నటిస్తారు
చెడ్డ స్నేహితుణ్ణి ఎప్పడూ నమ్మరాదు
త్రుప్పు లోహాన్నిలాగే అతని దుష్టత్వం
మనలను నాశం చేస్తుంది
కొందరు మనం పచ్చగా వున్నపుడు మిత్రుల్లాగే కన్పిస్తారు
కాని ఆపదలు వచ్చినపుడు మనకు ఎదురుతిరుగుతారు
కాని కొందరు కష్టాల్లో మనలను ఆదుకొంటారు
శత్రువు మనమీదికి వచ్చినపుడు వానితో పోరాడతారు
నీ తరపున పోరాడిన నేస్తుని మరచిపోవద్దు

నీకు సంపదలబ్భీనపుడు అతన్ని విస్మరించకు
కొందరు మిత్రులు మనకు కీడు దెస్తారు
కాని కొందరు సోదరులకంటె యొక్కువగా హితం చేకూరుస్తారు- సీరా 13,1. 12,8-10, 37, 4-6, సామె 18,24

12. వివాహ ధర్మాలు

పురుషునికి పెండ్లి ఆడుతోడూ అవసరం. భార్యభర్తకు సాయం చేస్తుంది.
స్త్రీ సౌందర్యం పురుషునికి ఆనందం కలిగిస్తుంది
నరుని కంటికి అంతకంటె యింపైనది లేదు
భార్యను బడసినవాడు అదృష్ణాన్ని బడసినట్లే
ఆమె అతనికి సాయంజేసి అతన్ని ప్రోత్సహిస్తుంది
కంచెలేని స్థలాన్ని అన్యులు ఆక్రమించుకొంటారు
భార్యలేని పురుషుడు నిటూర్పులతో
ఊళ్ళ వెంట తిరుగుతాడు - సీరా 36, 22–25.

సొంత తెగనుండే పిల్లను దెచ్చుకొని పెండ్లిజేసికొంటే ఒద్దికగా సంసారం గడపవచ్చు. కనుక తోబీతు కుమారునికి ఈలా వుపదేశం చేసాడు. "నాయనా! మన తెగనుండే వొక పిల్లను పెండ్లిజేసికో, మన పూర్వులైన నోవా, అబ్రాహాము, ఈసాకు, యాకోబు మొదలైన వాళ్ళంతా వారి తెగకు చెందిన పిల్లలనే పెండ్లడారు. కనుక దేవుడు వారికి సంతానాన్ని దయచేసాడు” - తోబీ 4,12-14

గుణవతియైన భార్యను బడసినవాడు ధన్యుడు
ఆమె మూలాన అతని ఆయుస్సు రెండురెట్ల పెరుగుతుంది
సద్బుద్ధిగల భార్య భర్తకు పరమానందం కలిగిస్తుంది
అతడు శాంతిసమాధానాలతో జీవితం గడుపుతాడు
మంచి యిల్లాలు శ్రేష్టమైన వరం లాంటిది
దైవభీతి కలవారికేగాని ఆ వరం లభింపదు
యోగ్యురాలైన భార్యవలన భర్త ఆనందం చెందుతాడు
ఆమె సామర్థ్యం వలన అతడు బలాఢ్యుడౌతాడు
మిత భాషిణియైన భార్య దేవుడిచ్చిన వరమనాలి
ఆమె సంయమనానికి వెలకట్టలేం
శీలవతియైన భార్య మనోజ్ఞత అంతింతకాదు

ఆమె సచ్ఛీలాన్ని ఏ తక్కెడతోను తూయలేం
ఆకాశాన ఉదయభానుడు ప్రకాశించినట్లే
మంచి యిల్లాలు తాను చక్కగా
తీర్చిదిద్దుకొన్న యింటిలో వెలుగొందుతుంది
పవిత్ర దీపస్తంభంమీద దీపం వెలిగినట్లే
సుందరమైన తనువుమీద ఆమె మొగం ప్రకాశిస్తుంది
వెండి దిమ్మలమీద నిల్చిన బంగారు స్తంభాల్లాగే
బలమైన మడమలమీద ఆమె అందమైన కాళ్లు
వేలుగొందుతుంటాయి
నాయనా! దేశంలో సారవంతమైన క్షేత్రాన్ని వేదకి
దానిలో నీ సొంత బీజాలను వెదజల్లు
నీ మంచి విత్తనాలను నీవు నమ్మాలి
అప్పడు నీ బిడ్డలు మంచి కుటుంబంలో పుట్టామని
విశ్వసించి పెరిగి పెద్దవారై వృద్ధిలోకి వస్తారు - సీరా 26,1-4, 13-21.

సామెతల గ్రంథం 31, 10-31 ఆదర్శ గృహిణిని అతి మనోజ్ఞంగా వర్ణిస్తుంది. పాఠకులు ఈ భాగాన్నంతటినీ చదవాలి. స్థలాభావంవల్ల ఇక్కడ కొన్ని వాక్యాలు మాత్రమే ఉదాహరిస్తున్నాం.

యోగ్యురాలైన గృహిణి యొక్కడ దొరుకుతుంది?
ఆమె పగడాలకంటె విలువైంది
ఆమె పెనిమిటి ఆమెను విశ్వసిస్తాడు
ఆమెవలన అతనికి చాల లాభం కలుగుతుంది
ఆమె జీవించినంతకాలం అతనికి మంచినేగాని
చెడును తలపెట్టదు
ఆమె పెనిమిటి సభలో పెద్దవారిమధ్య కూర్చుండి
ఎల్లరి మన్నన పొందుతాడు
తళుకుబెళుకులు నమ్మరానివి, అందం నిల్చేదికాదు.
ప్రభువుపట్ల భయభక్తులుకల మహిళ మెచ్చుకోదగింది.
ఇంతవరకు గుణవతియైన భార్యనుగూర్చి వివరించాం. ఇక, దుషురాలైన భార్యకూడ వుంది. ఆమె "పెనిమిటిని ధిక్కరిస్తుంది.

పెనిమిటిని గౌరవించే యిల్లాలిని
ఎల్లరూ వివేకవతిగా యెంచుతారు
కాని పొగరుబోతుతనంతో భర్తను ధిక్కరించేదాన్ని
ఎల్లరూ దుష్టురాలినిగా గణిస్తారు
యోగ్యురాలైన భార్యను బడసినవాడు ధన్యుడు
ఆమె వలన అతని ఆయుస్సు రెండంతలు పెరుగుతుంది - సీరా 26, 26.

ఇంకా చెడ్డభార్య సణుగుకొంటుంది, గయ్యాళితనం ప్రదర్శిస్తుంది. ఆమేతో కాపురం చేయడం కష్టం.
మూర్కుడైన పత్రునివల్ల తండ్రి చెడతాడు
భార్య సణుగుడు ఇంటి కప్పనుండి కారే
నీటిబొట్లలా గుంటుంది.
గొణగే భార్యతో ఇంటిలో వసించడంకంటె
ఇంటిమీద ఒక ప్రక్కన పడివుండడం మేలు.
కోపంతో సణుగుకొనే భార్యతో
కాపురం చేయడంకంటె
ఎడారిలో వసించడం మేలు.
గయ్యాళి భార్య సణుగుడు
వానరోజున ఎడతెగకపడే చినుకుల్లా వుంటుంది
గాలిని ఆపడంగాని చమురును గుప్పిట బట్టడంగాని
ఎంత కష్టమో ఆమె నోరు మూయించడం అంత కష్టం - సామె 19, 13.21.
9, 19. 27, 15-16.
తండ్రిగా, భర్తగా పురుషుని బాధ్యతలుగూడ గొప్పవి. కొమార్తెకు పెండ్లి చేసేవాడు దొడ్డకార్యం చేసినట్లే
కాని ఆమెను వివేగంగల యువకుని కీయాలి
నీ భార్య నీకు ప్రీతి కలిగించేదైతే విడాకులీయవద్దు
కాని నీకిష్టంగానిదైతే ఆమెను నమ్మవదు. - సీరా 7, 25-26
మగవాళ్ళు అతివలనుజూచి మతి గోల్పోగూడదు
స్త్రీ సౌందర్యానికి బ్రమసిపోవద్దు
అతివనుజూచి మతి గోల్పోవద్దు - సీరా 25, 21.

భార్యాభర్తల కలయికవల్ల పిల్లలు జన్మిస్తారు. తల్లిదండ్రులు తమ బిడ్డలను
జాగ్రత్తగా పెంచి ప్రయోజకులను చేయాలి. విశేషంగా కుమారుడు బాలుడుగా వున్నపుడే
తండ్రి వాడికి క్రమశిక్షణం నేర్పాలి. తండ్రి చనిపోయాక గూడ తన కుమారుల్లో జీవిస్తాడు.
ప్రేమగల తండ్రి తన కుమారుడ్డి తరచుగా శిక్షించాలి
సుశిక్షితుడై పుత్రుడు పెరిగి పెద్దవాడైనప్పడు
తండ్రి సంతోషపడతాడు
కుమారుడ్డి క్రమశిక్షణకు గురిచేసే తండ్రి
సత్ఫలితాన్ని పొందుతాడు.
అతడా పత్రునిగూర్చి మిత్రులతో గొప్పలు చెప్పకోగలడు
కుమారునికి విద్యగరపిన తండ్రి
తన శత్రువులకు అసూయ పుట్టిస్తాడు
అతడా పత్రుని తలంచుకొని మిత్రులమధ్య
సగర్వంగా తిరుగుతాడు
తండ్రి చనిపోయినా చనిపోయినట్లు కాదు
అతని ప్రతిబింబమైన కుమారుడు మిగిలివున్నాడు కదా!
తండ్రి బ్రతికివున్నపుడు పుత్రునిజూచి ఆనందిస్తాడు
చనిపోయేపుడు నిశ్చింతగా చనిపోతాడు
కాని పుత్రుని చెడగొట్టే తండ్రి
వాని గాయాలకు కట్ట కడతాడు
వాడు ఏడ్చినపుడెల్ల అతని హృదయం కరుగుతుంది
చక్కగా తర్ఫీదు నీయని గుర్రం మొండిదౌతుంది
అదుపుమీరిన కుమారునికి పొగరెక్కుతుంది
గోముగా బెరిగిన బిడ్డడు కడన తండ్రికి నిరాశ కలిగిస్తాడు
తండ్రి పుత్రునితో ఆడిపాడెనేని
తర్వాత అతనికి దుఃఖం తప్పదు
బాల్యంలో బిడ్డడికి స్వేచ్ఛ ఈయరాదు
వాడి తప్పిదాలకు దండనం విధించి తీరాలి
కనుక శ్రమపడి నీ తనయునికి శిక్షణనీయి
లేకపోతే వాడు నీకు అపకీర్తి తెస్తాడు - సీరా 30, 1-13.

పిల్లవాణ్ణి శిక్షించడానికి బెత్తం వాడాలి. చిన్నపుడే బాలునికి మంచిమార్గంలో

నడవడం నేర్పిస్తే పెద్దయ్యాక ఇక ఆ త్రోవ తప్పడు. బెత్తంవాడని తండ్రి పుత్రుని ప్రేమించినట్లు కాదు తనయుని ప్రేమించే తండ్రి వాణ్ణి శిక్షించితీరుతాడు బాలుని హృదయంలో చాపల్యం సహజంగానే వుంటుంది బెత్తం ఉపయోగిస్తే అది తొలగిపోతుంది. బాలుని శిక్షించడానికి వెనుకాడవద్దు బెత్తంతో కొడితే వాడు చనిపోడు బాలునికి తాను నడువవలసిన మార్గాన్ని గూర్చి బోధిస్తే పెరిగి పెద్దవాడైన పిదపగూడ ఆ త్రోవను విడనాడడు - సామె 13,24. 22, 15. 23,13. 22,6. ఇప్పటిలాగే పూర్వంగూడ ఆడపిల్లలనుగన్న తండ్రి నానావిధాల ఆందోళనం చెందేవాడు. తండ్రి కొమార్తనుగూర్చి ఆందోళనం చెందుతాడు రేయి అతని కంటికి కూర్మరాదు ఈ సంగతి కొమార్తెకు తెలియదు దుహిత బాలికగావుంటే ఆమెకు పెండ్లికాదేమో అనీ పెండ్లయితే ఆమె సుఖింపదేమో అనీ తండ్రి విచారిస్తాడు పత్రిక కన్యగావుంటే ఎవరైనా ఆమెను చెరుస్తారేమో అనీ ఆమె పట్టింటనే గర్భవతి ఔతుందేమో అనీ అతని భయం ఆమెకు పెండ్లయితే శీలవతిగా వుండదేమో అనీ లేదా సంతానం కలగదేమో అనీ అతని వగపు - సీరా 42, 9–10.

13. పెద్దలపట్ల గౌరవం

పెద్దలపట్ల మనకు గౌరవం వుండాలి. తల్లిదండ్రులు, జ్ఞానులు, వృదులు, యజాకులు, వైద్యులు, అధికారులు మొదలైనవాళ్లు పెద్దలు. మొదట మనం తల్లిదండ్రులను గౌరవించాలి తండ్రిని గౌరవించేవాడు తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికొన్నట్లే తండ్రిని సన్మానించేవాడు నిధిని చేకొన్నట్లే తల్లిని సన్మానించే పుత్రుడ్డి అతని పుత్రులు సంతషపెడతారు అతని ప్రార్థనను దేవుడు ఆలిస్తాడు తండ్రిని ఆదరించేవాడు దీర్గాయుష్మంతుడౌతాడు తల్లిని సంతోషపెట్టేవాడు దేవునికి విధేయుడైనట్లే తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహాలు వృద్ధిచెందుతాయి తల్లి శాపాల వలన పిల్లల కొంపలు కూలిపోతాయి పూర్ణహృదయంతో నీ తండ్రిని గౌరవించు నిన్ను కన్నతల్లి పురిటి నొప్పలను మరచిపోకు నీకు ప్రాణమిచ్చినవాళ్ళ నీ జననీజనకులు వాళ్ళ ఋణాన్ని నీవెట్ల తీర్చుకొంటావు? నీవు జనులమధ్య కూర్చుండివున్నపుడు మైమరచి కామపమాటలుపల్కినీయవివేకాన్ని చాటుకోవచ్చు ఆ సంగతి వింటే నీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో వూహించు - సీరా 3,3-6,9, 7, 22-28, 23, 14 విశేషంగా ముసలివారైన తల్లిదండ్రులను ఎంతో ఆదరంతో జూడాలి. నాయనా! వృద్దుడైన నీ తండ్రిని బాగుగా జూచుకో అతడు జీవించివున్నంతవరకు అతన్ని కష్టపెట్టకు అతనికి మతి దప్పినా నీవతన్ని ఆదరంతో జూడు నీవు బలంగాను ఆరోగ్యంగాను వున్నావు కనుక అతన్ని ఆలక్ష్యం చేయకు నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు ఆ కరుణ నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిపెడుతుంది తల్లిదండ్రులను శపించేవాని దీపం నడిచీకటిలో ఆరిపోతుంది - సీరా 3,12- 14,సామె 20, 20, తల్లిదండ్రులను గౌరవంతో చూడాలని చెపూ తోబీతు తోబియాకు ఇట్ల బోధించాడు. "నాయనా! నేను చనిపోయినప్పడు నన్ను అన్ని మర్యాదలతో పాతిపెట్టు, నేను దాటిపోయిన తర్వాత మీయమ్మను గౌరవంతో జూడు. ఆమె బ్రతికియున్నంతకాలం ఆమెను పోషించు. ఆమె చనిపోయినపుడు నా ప్రక్కనే పాతిపెట్టు, నిన్ను గర్భాన మోసి కనినపుడు ఆమె యెన్ని అపాయాలకు గురైందో జ్ఞప్తికి తెచ్చుకో. కనుక ఆమె కోరినదెల్ల చేయి. ఎన్నడూ నీ తల్లి మనసు కష్టపెట్టకు" - తోబీ 4,3-4.

మాతాపితలనులాగే వృద్దులనూ జ్ఞానులనూగూడ గౌరవించాలి, వారి బోధలను శ్రద్ధతో వినాలి.

వృద్దుని చిన్నచూపు చూడవదు
మనమందరం ముసలివాళ్ల ఔతాంగదా!
విజ్ఞల బోధను అనాదరం చేయవద్దు
వారి సూక్తులను జాగ్రత్తగా పఠించు
వాటి వలన నాగరికత అలవర్చుకొని
రాజులకు సేవలుచేసే విధానం నేర్చుకొంటావు
పెద్దవారి ఉపదేశాలను అనాదరం చేయవద్దు
వారు తమ పూర్వులనుండే వాటిని నేర్చుకొన్నారు
వారినుండి నీవు విజ్ఞానాన్ని గడిస్తావు
అవసరం వచ్చినపుడు జవాబు ఏలా చెప్పాలో
తెలిసికొంటావుగూడ - సీరా 8,6. 8–9.
యాజకులనుగూడ మన్ననతోజూచి వారి కీయవలసిన కానుకలను ఈయాలి.
దేవునికి భయపడే యాజకులను గౌరవించు
విధ్యుక్తంగా వారికీయవలసిన కానుకలు ఈయి
ప్రధమ ఫలాలు, బల్యర్పణం, పవిత్రార్పణం ఈయి - సీరా 7.21.

వైద్యులద్వారా, వారిచ్చే మందులద్వారా ప్రభువే వ్యాధులు నయం చేస్తాడు. కనుక వారిని సన్మానించాలి.

నీకు చికిత్స చేసినందుకు వైద్యుని సన్మానించు
ప్రభువే అతన్ని కలిగించాడు
వైద్యులద్వారా మహోన్నతుడే వ్యాధినయంచేస్తాడు
రాజులు ఆ వైద్యులను బహూకరిస్తారు

ప్రభువే భూమినుండి మందులు కలిగించాడు బుద్ధిమంతుడు వాటిని తప్పక వినియోగించకుంటాడు కుమారా! నీకు జబ్బుచేస్తే అశ్రద్ధ చేయకు ప్రభుని వేడుకొంటే నీకు ఆరోగ్యం దయచేస్తాడు. నీ తప్పిదాలను విడనాడి నిర్దోషివి కా నీ హృదయంనుండి పాపాన్ని నిర్మూలించు అటుపిమ్మట వైద్యుని పిలువ ప్రభువే అతన్ని కలిగించాడు నీ కవసరంవుంది కనుక అతన్ని నీ చెంతనే వుంచుకో ఒక్కోసారి నీ యారోగ్యం అతని చేతిలో వుంటుంది అతడు తాను రోగిబాధలను తొలగించి వ్యాధిని కుదిర్చి ప్రాణాలు నిల్పడానికి శక్తిని దయచేయమని దేవుని ప్రార్ధిస్తాడు సృష్టికర్తకు ద్రోహంగా పాపంచేసిన నరుడు రోగియై వైద్యుని ఆశ్రయించడం న్యాయం - సీరా 38, 1-4, 9 - 25 ఆలాగే మంచివాడు అధికారంలో వున్న వారికి లొంగివుండాలి. నీవు భక్తసమాజం మన్నన పొందు అధికారంలో వున్నవారికి తలవొగ్గు - సీరా 47.

14. మంచి సలహాను పాటించాలి

మంచి సలహావల్ల చాల లాభాలున్నాయి. కనుక మనం దాన్ని పాటించాలి. మన హృదయంకూడ మనకు సలహా యిస్తుంది. బుద్ధిమంతుడు ఇతరుల అభిప్రాయాలను వింటాడు కాని భక్తిహీనులైన గర్వాత్ములు దేనికీ జంకరు ఎవడైనా ఉపదేశం చేయగలడు కొందరు స్వలాభం కొరకే సలహా యిస్తారు సలహాయిచ్చే వానిని జాగ్రత్తగా పరిశీలించిచూడు అతని కోరిక యేమిటో తెలిసికో అతడు స్వార్ణాన్ని ఆశిస్తూండవచ్చు కడన నీకు అపకారం తలపెట్టవచ్చు

92


కాని భక్తిపరుడైనవాణ్ణి, దైవాజ్ఞలు పాటించేవాణ్ణి,
నీతో సమానమైన అభిరుచి కలవాణ్ణి,
నీ పతనాన్ని జూచి విచారించేవాణ్ణి, సలహా అడుగు
కడన నీ హృదయం చేసే ఉపదేశాన్నికూడ నమ్ము
దానికి మించిన సలహా లేదని తెలిసికో
బురుజుమీద కూర్చుండే ఏడ్గురు పహరావారికంటె
మన హృదయం మనకు ఎక్కువ తెల్పుతుంది
అన్నిటికంటె పైగా నిన్ను సత్యమార్గాన నడపమని
మహోన్నతుని ప్రార్థించు.
హితోపదేశంలేని ప్రజలు నశిస్తారు
చాలమందిహితోపదేశకులుంటే భద్రత కలుగుతుంది
పొగరుబోతుతనం తగవులు తెస్తుంది
విజ్ఞతగలవాడు సలహా అడుగుతాడు.
హితోపదేశంలేందే పథకాలు ఫలింపవు
చాలమంది హితబోధకులు ఉన్న చోట కార్యాలు నెరవేరుతాయి

- సీరా 32, 18,37, 7–8, 12-15. సామె 11,14, 13,10, 15,22. కడన, తోబీతు కుమారునికి ఈలా బోధించాడు. "బుద్ధిమంతుల సలహాను పాటించు. మంచి ఉపదేశాన్ని ఎప్పడూ పెడచెవిని పెట్టవద్దు" - 4,18.

15. దుఘ్టలూ సజ్జనులూ

అన్ని నీతిగ్రంథాలూ సజ్జనులనూ దుర్జనులనూ పేర్కొంటాయి. సత్పురుషులు దేవుని దీవెన వలన వృద్ధిలోకి వస్తారు. దుర్జనులు దేవుని శాపం వలన అణగారిపోతారు.

ద్వేషం వలన ఎవనికీ భద్రత కలుగదు
ధర్మం వలన నరుడు
వేళ్లుపాతుకొన్న చెట్టులా నిలుస్తాడు
పుణ్యపురుషుని దీపం దేదీప్యమానంగా వెలుగుతుంది
దుషుని దివ్వె ఆరిపోతుంది.
ఆపదలు దుర్మార్గులవెంట బడతాయి
సత్పురుషులు శుభాలు పొందుతారు.
తానేమి చేయాలో తనకు తెలియడంలోనే

విజ్ఞని విజ్ఞత యిమిడివుంది
కాని మూర్జుని అజ్ఞానం వాణ్ణి పెడత్రోవ పట్టిస్తుంది.
ప్రభువు దుష్టుని బలిని అసహ్యించుకొంటాడు
సజ్జనుని ప్రార్ధన వలన ప్రీతి జెందుతాడు.
దుఘ్టనికి పోకడలు ప్రభునికి నచ్చవు
అతడు ధర్మాత్ముణ్ణి మెచ్చుకొంటాడు.
ప్రభువు దుఘ్టనికి దవ్వుగా వుంటాడు
కాని అతడు సజ్జనుని వేడికోలును ఆలిస్తాడు.
మూరుడు నూరుదెబ్బలు కొట్టినా నేర్చుకోలేనంత
వివేకశీలి ఒక్కసారి మందలిస్తేనే నేర్చుకొంటాడు.
వినయమూ దైవభీతి కలవాడు
సంపదలూ గౌరవమూ దీర్ఘాయువూ పొందుతాడు
దుష్టుని త్రోవ ముండ్లతోను ఉరులతోను నిండి వుంటుంది
జీవితంపై ఆశకలవాడు ఆ త్రోవ త్రోక్కడు.
దుష్టునికి మంచిరోజులు లేవు
అతని దీపం గుప్పున ఆరిపోతుంది
సత్పురుషుడు దుష్టునికి చిక్కి భ్రష్టుడు కావడం,
చెలమ చెడిపోవడంలాంటిది,
బావి మలినం గావడంలాంటిది.
దుష్టులకు న్యాయమంటే యేమిటో తెలియదు
ప్రభువు భక్తులకు న్యాయం బాగా తెలుసు - సామె 12,3, 13.9.21, 14,8, 15, 8-9, 29, 17,28, 22,45. 24, 20, 25,26. 28, 5.
న్యాయనిర్ణయ దినాన దుష్టులు సజ్జనులను జూచి ఆశ్చర్యపోయి ఈలా తలుస్తారు.
పూర్వం మనం ఇతన్ని జూచి నవ్వాం
ఇతన్ని గేలిచేసాం, కాని మనమే పిచ్చివాళ్ళం
ఇతనిది వట్టి వెర్రిజీవితం అనుకొన్నాం
ఇతడు నికృష్టమైన చావు చస్తాడనుకొన్నాం
కాని ఇప్పుడితడు దేవుని పుత్రుడుగా
చలామణి ఔతున్నాడు
ప్రభువు భక్తుడుగా గుర్తింపు పొందుతున్నాడు

కాని మనం సత్యమార్గం నుండి వైదొలగాం
ధర్మజ్యోతి మనమీద ప్రకాశింపలేదు
నీతిసూర్యుని పొడుపుని మనం దర్శింపనేలేదు
మనం నడవని దుష్టమార్గాలు లేవు
త్రోవల్లేని యెడారులందెల్లా తిరుగాడాం
దైవమార్గాన్ని మాత్రం విస్మరించాం
మన అహంకారంవల్ల మనం పాముకొన్నదేమిటి?
మన సంపదల వలన మనకు ఒరిగిన దేమిటి?
అవియెల్ల యిపుడు నీడలా గతించాయి
వదంతుల్లాగ దాటిపోయాయి
మనం పుట్టగానే చచ్చాం
మనం చేసిన పుణ్యకార్యాలు ఏమీలేవు
మన దుష్టత్వమే మనలను నాశం చేసింది - సాలోమోను జ్ఞాన - 5,4-13.

16. రాజకీయ, ఆర్థిక రంగాలు

ప్రభువే రాజులను నియమిస్తాడు. మంచిరాజు ప్రజలకు మేలు చేస్తాడు. చెడ్డరాజు కీడు చేస్తాడు.

విజ్ఞతగల పాలకుడు తన ప్రజలకు శిక్షణనిస్తాడు
అతని పరిపాలనం క్రమబద్ధంగా వుంటుంది
పాలకుడు ఏలాంటివాడో
ఉద్యోగులూ ఆలాంటివా రౌతారు
ప్రజలుకూడ అతనిలాంటివారే ఔతారు
విద్యారహితుడైన ప్రభువు ప్రజలను చెరుస్తాడు
పాలకులు విజ్ఞలైతే ప్రభుత్వం బాగుపడుతుంది
ప్రభువే లోకాన్ని పాలిస్తాడు
అతడు తగిన కాలంలో తగినవాణ్ణి పాలకుణ్ణి చేస్తాడు
ఆ పాలకుని విజయం ప్రభువు చేతిలో వుంటుంది
ఏ యధికారి కీర్తియైన ప్రభువుమీదనే ఆధారపడి వుంటుంది
గర్జించేసింహం, ఎరకొరకు తిరిగే ఎలుగూ ఏలాంటివో
పేదలపై అధికారం నెరపే దుష్టపాలకుడు ఆలాంటివాడు - సీరా 10, 1-5.
సామె 28, 15.

యూదితు గొప్ప దైవభక్తి కలది. హోలోఫెర్నెసు అనే అస్సిరియా సైన్యాధిపతి బెతూలియా పట్టణాన్ని ముట్టడించడానికిరాగా ఆమె సాహసంతో వెళ్ళి ఆ సైన్యాధిపతి శిరస్సు తెగనరుక్కొని వచ్చింది. పౌరులందరికీ ఈలాంటి దేశభక్తి వుండాలి - యూది 12,8.

చాలామంది ధనాన్ని కూడబెడతారు. కాని దాన్ని సద్వినియోగం చేసికోవాలి. పిసినిగొట్టలు ఆలా చేసికోరు. కనుక వారు కూడబెట్టిన సాత్తును అన్యులు అనుభవిస్తారు. నరుడు ఉచితమైన సుఖాలను అనుభవించాలి.

తా ననుభవింపక సామ్మ కూడబెట్టేవాడు
ఇతరుల కొరకే కూడబెడుతున్నాడు
అతని సాత్తుతో ఇతరులు హాయిగా బ్రతుకుతారు
తన కొరకు తాను ఖర్చుజేసికోనివానికంటె నికృష్ణుడు లేడు
పిసినారితనానికి తగిన శిక్షే వుంది
లోభియైన నరుడు దుష్టుడు
అక్కరలో వున్న వారిని ఆదుకొనడు
అతడు తనకున్న దానితో తృప్తిజెందడు
దురాశ వలన అతని హృదయం కుదించుకొనిపోతుంది
పిసినారి కడుపునిండ తినడానికి ఇష్టపడడు
కనుక చాలినంత భోజనం సిద్ధంజేసికోడు
మృత్యువు నీ కొరకు వేచివుండదు
నీవేనాడు పాతాళం చేరుకొంటావో నీకే తెలియదు
ప్రతిదినం నీ వనుభవింపగలిగింది అనుభవించు
ఉచితాలైన నీవంతు సుఖాలను విడనాడకు
నీ సాత్తును ఇతరులకు వదలనేల?
నీవు కష్టపడి కూడబెట్టింది అన్యులు పంచుకోనేల? - సీరా 14, 4–6, 8–
 10. 12-16.

భక్తుడు తాను పేదవాడుగాని ధనికుడుగాని కాకుండ మధ్యస్థంగా జీవించాలని కోరుకొన్నాడు. ధనికుడైతే తాను దేవుణ్ణి పట్టించుకోకపోవచ్చు. పేదవాడైతే దొంగతనానికి పాల్పడవచ్చు. కనుక ఆ రెండింటికీ మధ్యలో వుండడం మంచిది.

దేవా! నేను నిన్ను రెండువరాలు అడుగుతున్నాను
నేను మరణించకముందే నాకు వీటిని ప్రసాదించు
నేనెంతమాత్రం అబద్దాలు ఆడకుండా వుండేలా చేయి
నన్ను సంపన్నుణ్ణీ చేయవద్దు, ధనికుణ్ణీ చేయవద్దు
నాకు కావలసినంత తిండి మాత్రం దయచేయి
నీవు సంపదలిస్తే నిన్ను ధిక్కరించి
ప్రభువెవడని పల్కుతానేమో!
లేమి కల్గితే దొంగతనానికి పాల్పడి
నా దేవుడవైన నీకు అపఖ్యాతి తెస్తానేమో! - సామె 30, 7-9

17. నరుల్లో తేడాలు

అందరూ ఒకే రీతిగా వుండరు. నరుల్లో తారతమ్యాలుంటాయి. కుమ్మరి తన కిష్టమొచ్చినట్లుగా పాత్రలను చేస్తాడు. అలాగే ప్రభువు అధికులనూ అల్పులనూ గూడ చేస్తాడు.

అందరూ మట్టినుండి పుట్టినవాళ్ళే
ఆదాముకూడ అలా జన్మించినవాడే
ఐనా ప్రభువు వివేకంతో నరులమధ్య వ్యత్యాసం కలిగించి
వారికి భిన్న కార్యాలు ఒప్పగించాడు
అతడు కొందరిని దీవించి ప్రముఖులను చేసాడు
కొందరిని పవిత్రపరచి తనయెదుట నిల్పుకొన్నాడు
కొందరిని శపించి మన్ను గరిపించి స్థానభ్రష్టులను చేసాడు
మట్టి కుమ్మరి చేతిలో వుంది
అతడు దాన్ని తన యిష్టం వచ్చినట్లు మలుస్తాడు.
ఆలాగే నరులుకూడ ప్రభువు చేతిలో వున్నారు
అతడు వారిని తన యిష్టంవచ్చినట్లు చేస్తాడు
మంచికి చెడ్డ, మృత్యువుకి జీవం, వ్యతిరేకాలు
ఆలాగే పాపికి పుణ్యాత్ముడు వ్యతిరేకి
మహోన్నతుడైన ప్రభువు కార్యాలను పరిశీలిస్తే

అవి పరస్పర విరుద్దాలైన ద్వంద్వాల్లా కన్పిస్తాయి
నా మట్టుకు నేను పనివారిలో కడపటివాణ్ణి
నేను ద్రాక్షపండ్లు కోసే పనివారి వెనుక
పరిగలేరుకొనేవానివలె పని ప్రారంభించాను
కాని దేవుని దీవెనవల్ల ఆ పనివారినెల్ల మించాను
వారివలె నేను నా ద్రాక్షతొట్టిని రసంతో నింపాను
నా కొరకు మాత్రమే నేనీ శ్రమనంతా చేయలేదు
ఉపదేశాన్ని ఆశించేవాళ్ళందరి కొరకు ఈ కృషి చేసాను. - సీరా 33,10-17.

18. నరుడు తన్ను తాను అదుపులో పెట్టుకోవాలి

నరుడు తన్ను తాను అదుపులో పెట్టుకోవాలి. నగరాన్ని జయించడంకంటె తన్నుతాను గెల్వడం మేలు. వినయంతో మన దుర్గణాలను మనం సవరించుకోవాలి.

ఓర్పుగలవాడు వీరునికంటె ఘనుడు
నగరాన్ని జయించడంకంటె
తన్నుతాను గెల్వడం లెస్స
తన్నుతాను అదుపులో పెట్టుకోలేనివాడు
ప్రాకారాలు లేనందున రక్షణను కోల్పోయిన
నగరంలాంటివాడు.
రేపటి దినాన్నిగూర్చి ప్రగల్భాలు పలకవద్దు
నేడేమి జరుగుతుందో నీకే తెలియదు
ఇతరులు నిన్ను పొగడవచ్చుగాని
నిన్ను నీవే పొగడుకోగూడదు
పరులు నిన్ను స్తుతించవచ్చుగాని ఆత్మస్తుతి కూడదు
రాయి బరువు, ఇసుక బరువు,
కాని మూర్జుని వలన కలిగే బాధ
వీటికంటె ఎక్కువ బరువు
కోపం క్రూరమూ వినాశప్రదమూ ఐంది
కాని అసూయ దానికంటె ఘోరమైంది - సామె 16,32, 25,28, 27, 1-4.

19. వయస్సుకంటె జ్ఞానం ముఖ్యం

 ఎన్నేళ్లు జీవించామన్నది ముఖ్యంకాదు. ఎంత జ్ఞానంతో, ఎంత నిర్మలంగా జీవించామన్నది ముఖ్యం. సజ్జనుడు కొద్దికాలమే జీవించినా ఆ స్వల్పకాలంలోనే పరిపూర్ణతను పొంది దీర్ఘకాలం జీవించినవాడౌతాడు. ప్రభువు మంచివారిని చెడ్డనుండి కాపాడ్డంకోసం త్వరలోనే తీసుకపోతాడు,

దీర్ఘకాలం జీవించడంవల్లనే గౌరవం కలగదు
పెక్కేండు బ్రతకడంవల్లనే జీవితం సార్థకంకాదు
జ్ఞానార్ధనమే తల నరవడానికి గుర్తు
నిర్మల జీవితమే వృద్ధత్వానికి చిహ్నం
ప్రభువుకి ప్రీతికలిగించిన పుణ్యపురుషుడు ఒకడున్నాడు
దేవుడు అతన్ని ప్రేమించాడు
అతడు పాపాత్ముల నడుమ వసిస్తూంటే
ప్రభువు అతన్ని పరలోకానికి కొనిపోయాడు
చెడుగు ఆ సజ్జనుని మనస్సు పాడుచేసేదే
దుష్టత్వం ఆ సత్పురుషుని హృదయాన్ని చెరచేదే
కనుక ప్రభువు అతన్ని ముందుగానే తీసుకపోయాడు
చెడగు నరులను మభ్యపెట్టి
వాళ్ళ మంచిని గుర్తించకుండా వుండేలా చేస్తుంది
వ్యామోహాలు మంచివారి హృదయాలనుగూడ చెరుస్తాయి
కాని ఆ సజ్జనుడు స్వల్పకాలంలోనే సిద్ధిని పొంది
దీర్ఘకాలం జీవించినవా డయ్యాడు
ప్రభువు సత్పురుషుని వలన ప్రీతిజెంది
అతన్ని పాప ప్రపంచం నుండి సత్వరమే కొనిపోయాడు
ప్రజలకు అతని మరణాన్నిగూర్చి తెలిసినా
వాళ్ళ విషయాన్ని అర్థం చేసికోలేదు
సత్యం వారి తలకెక్కలేదు
ప్రభువు తన భక్తులకు కృపను దయచేస్తాడనీ
వారిని కాచి కాపాడతాడనీ ప్రజలు గ్రహించలేదు
చనిపోయిన పుణ్యపురుషుడు

బ్రతికివున్న దుర్మార్గుని ఖండిస్తాడు
స్వల్పకాలంలోనే సిద్థిని పొందిన యువకుడు
దీర్ఘకాలం జీవించే వృద్ధపాపిని గేలిచేస్తాడు - సాలోమోను జ్ఞాన 4,8-16

20. ధర్మశాస్త్ర బోధకుడు

   ధర్మశాస్త్ర బోధకుడు మోషే ధర్మశాస్రాన్ని చక్కగా అధ్యయనంచేసి దాన్ని ప్రజలకు బోధిస్తాడు. అతడు ఎల్ల యెడలా జ్ఞానాన్ని వెదజల్లుతాడు. కనుక అతని జీవితం ధన్యమైంది. నేటి మన బోధకులుగూడ ఇతనిలా జీవిస్తే ఎంత బాగుంటుంది!

మహోన్నతుని ధర్మశాస్తాన్ని పఠించడంలో కాలంగడి పే
ధర్మశాస్త్ర బోధకుడు మాత్రం భిన్నమైనవాడు
అతడు పురాతన రచయితల జ్ఞానవాక్కులను పరిశీలిస్తాడు
ప్రవచనాలను పఠించడానికి కాలం వినియోగిస్తాడు
సుప్రసిద్దుల సూక్తులను పదిలపరుస్తాడు
ఉపమానాలమీద నైపుణ్యంతో వ్యాఖ్య చెప్తాడు
సామెతల గూఢార్ధాన్ని అర్థంచేసికొంటాడు
పొడుపు కథల మర్మాన్ని చర్చిస్తాడు
ప్రముఖులకు సేవలుచేస్తూ
రాజులతో కలసి తిరుగుతాడు
అన్యదేశాలలో సంచరించి
నరుల బాగోగులను పరిశీలిస్తాడు
వాడుక చొప్పన వేకువనే లేచి
తన్ను సృజించి దేవునికి జపం చేస్తాడు
మహోన్నతుడైన దేవుని ముందట గొంతెత్తి ప్రార్ధనచేసి
తన పాపాలను మన్నింపమని వేడుకొంటాడు
ఆ మహాప్రభువు కరుణిస్తే
అతని హృదయం విజ్ఞానంతో నిండుతుంది
అతడు జ్ఞానవాక్కులను వెదజల్లుతూ
దేవునికి కృతజ్ఞతాస్తుతులూ చెల్లిస్తాడు
తన విజ్ఞానాన్నీ ఉపదేశాన్నీ అన్యులకు పంచిపెడతాడు
నిగూఢమైన దేవరహస్యాలను అర్థం జేసికొంటాడు

అతని విజ్ఞానాన్ని అనేకులు మెచ్చుకొంటారు
ఆ విజ్ఞానం ఏనాటికీ అంతరింపదు
భావితరాలవారు అతన్ని స్మరించుకొంటారు
అతని పేరు మాసిపోదు
అన్యజాతులు అతని విజ్ఞానాన్ని సన్నుతిస్తాయి
విద్వత్సభ అతన్ని కీర్తిస్తుంది
ముసలి ప్రాయందాకా జీవిస్తే అతడు సుప్రసిద్దుడౌతాడు
కీర్తిని పొందకముందే గతించినా అతనికి కొరతలేదు. - సీరా 39, 1-11

21. ఈ జీవితం అశాశ్వతం

నరులు ప్రాతబట్టలా చినిగిపోతారు. చెట్టమీది ఆకుల్లా రాలిపోతారు. ఈ జీవితం వ్యర్థమైంది. ఈ లోకంలో క్రొత్తయేమీలేదు. ఎప్పడూ జరిగిందే జరుగుతూ విసుగు పుట్టిస్తుంది. ముసలితనంతో, ఆ తర్వాత వచ్చే చావుతో, అంతా గతిస్తుంది. గొర్రెలకాపరి గొర్రెలనులాగ, మృత్యువు మనలను ఇక్కడినుండి తోలుకొనిపోతుంది.

ప్రాణులన్నీ జీర్ణవస్త్రంలాగ శిధిలమైపోతాయి
పురాతన నియమం ప్రకారం
జీవకోటికి మృత్యువు తప్పదు
గుబురుగా ఎదిగిన చెట్టమీద ఆకులు
కొన్ని పండి రాలిపోతూంటే
కొన్ని చిగుర్చుతూంటాయి
తరతరాల నరజాతికి ఈ గతే పడుతుంది
కొందరు చనిపోతూంటే మరికొందరు పుడుతూంటారు
నరుడు సాధించిన ప్రతి కార్యం నశిస్తుంది
ఆ కార్యాన్ని సాధించిన నరుడూ గతిస్తాడు. - సీరా 14, 17-19
ఉపదేశకుడు ఈ జీవితం వ్యర్ధమని చెప్తున్నాడు. వ్యర్థం, అంతా వ్యర్థమే. నరుడు ఈ భూమిమీదపడే నానా పాట్లకూ ఫలిత మేముంది? - ఉప 1, 2-3,

   ప్రతిదినం విసుగు పుట్టించేదే. ఈ విసుగుని వర్ణించడానికి మాటలు చాలవు. మన కండ్లు అవి చూచిన వస్తువులతోగాని, మన చెవులు అవి విన్న సుద్దులతోగాని సంతృప్తి చెందవు. పూర్వం జరిగిన కార్యాలే యిప్పడూ జరుగుతున్నాయి. నరులు పూర్వం చేసిన పనులే మరల చేస్తున్నారు. లోకంలో క్రొత్త యేమీలేదు. ఇది క్రొత్తది అనే దాన్ని 

దేన్నయినా తీసికోండి. అది మనం పట్టక పూర్వం నుండి వున్నదేనని తెలుస్తుంది. ఆలాగే ఇక జరిగేవాటిని గూడ భావితరాలవారు గుర్తుంచుకోరు - ఉప 1,8-12.

కొన్ని యేండ్లయిన తర్వాత నరునికి వార్ధక్యం వస్తుంది. అపుడు
ఇంతవరకు నిన్ను కాపాడిన చేతులు వణకుతాయి
ఇంతవరకు బలంగావున్న నీ కాళ్లు కూలబడతాయి
నీ పండ్లు రాలిపోతాయి
నీ కండ్ల వెల్లుర్ని సరిగా చూడలేవు
నీ చెవులు వీధిలో శబ్దాలను సరిగా వినలేవు
తిరుగటిరాయి చేసే శబ్దాలను వినలేవు
సంగీతాన్నీ పక్షుల కూతలను గ్రహించలేవు
అప్పడు నీవు మెరకను ఎక్కలేవు
అటూయిటూ కదలడంగూడ ప్రమాదకరమే
నీ వెండ్రుకలు నరసి తెల్లనౌతాయి
నీవు కష్టంతోగాని అటూయిటూ కదల్లేవు
నీ యెదలోని కోర్కెలన్నీ సమసిపోతాయి.

అపుడు నరుడు తన శాశ్వత నివాసానికి వెడలిపోతాడు. అతని కొరకు శోకించేవారు వీధిలో అటూయిటూ తిరుగుతారు.

అపుడు వెండి గొలుసు తెగిపోతుంది
బంగారు దీపం క్రిందపడి పగిలిపోతుంది
బావిమీది గిలక విరిగిపోతుంది
నీటికుండ జారిపడి ముక్కలైపోతుంది
నరుని దేహం ఏ మట్టినుండి వచ్చిందో ఆ మట్టిలోనికి తిరిగి పోతుంది. అతని ప్రాణం మొదట దాన్ని దయచేసిన దేవుణ్ణి చేరుకొంటుంది. కనుక అంతా వ్యర్ధమే. సర్వం వ్యర్ధమేనని ఉపదేశకుడు వాకొంటున్నాడు - ఉప 12, 3–7.
ఏ శక్తి మనలను మృత్యువునుండి కాపాడలేదు. మనమంతా జనులు చంపడానికి తోలుకొనిపోయే మృగాల్లా చావవలసిందే.
నరుని వైభవాలు అతని ప్రాణాలను కాపాడలేవు
అతడు వధకు గురియైన మృగంలా చావవలసిందే
మృత్యువే నరులకు కాపరియై
వారిని గొర్రెలనువలె పాతాళలోకానికి
తోలుకొనిపోతుంది - కీర్త 49, 12-14.

22. మృత్యుస్మరణం

   మృత్యువుని ఎవడూ ఇష్టపూర్తిగా అంగీకరింపడు. కాని అందరమూ చావుకి లొంగవలసిందే.

ఓ మృత్యువా! ఆస్తిపాస్తులతో
హాయిగా కాలం గడిపేవానికి,
చీకూచింతా లేకుండ జీవిస్తూ
అన్నిట విజయం సాధించేవానికి,
కడుపునిండా తినగల శక్తికలవానికి,
నిన్ను గూర్చిన తలంపు ఎంత దుఃఖకరమైంది!
నాయనా! నీవు మృత్యుశాసనానికి భయపడనక్కరలేదు
నీ పూర్వులనూ నీ తర్వాతి వారినీ జ్ఞప్తికి తెచ్చుకో
ప్రభువు బ్రతికివున్నవారందరికీ మరణశిక్షవిధించాడు
మహోన్నతుని సంకల్పాన్ని కాదనడానికి నీవెవరివి?
నీవు జీవించేది పదేండ్లయినా, వెయ్యేండ్లయినా
మృత్యులోకంలో ఎవడూ పట్టించుకోడు - సీరా 41, 1-4.

దేవుడు మనలను చావడానికికాక, జీవించడానికే చేసాడు. మృత్యువు ఈ లోకంలో రాజ్యంచేయలేదు. పిశాచం నరుణ్ణిచూచి అసూయచెంది చావుని లోకంలో తెచ్చి పెట్టింది.

మృత్యువుని దేవుడు కలిగింపలేదు
ప్రాణులు చావడంజూచి అతడు సంతసింపడు
అతడు ప్రతి ప్రాణినీ జీవించడానికి సృజించాడు
అతడు చేసిన ప్రాణులన్నీ
ఆరోగ్యంతో అలరారుతున్నాయి
జీవులలో మరణకరమైన విషమేమీలేదు
మృత్యువు ఈ లోకంలో రాజ్యం చేయదు.
దేవుడు నరుణ్ణి అమరునిగా జేసాడు

అతన్ని తనవలె నిత్యునిగా జేసాడు కాని పిశాచం అసూయ వలన మృత్యువు లోకంలోనికి ప్రవేశించింది పిశాచపక్షాన్ని అవలంబించేవారు చావుని

   చవిజూస్తారు - సొలోమోను జ్ఞాన 1, 13-14, 2,24-24
   చనీపోయాకగూడ తన మంచిపేరును నిలబెట్టుకొనేవాడే గొప్పవాడు.
   నరులు చనిపోయినవారికొరకు విలపిస్తారు
   కాని దుషుల మరణానంతరం వారి పేరుకూడ మిగలదు
   నీ కీర్తిని నిలబెట్టుకో
   నీవు చనిపోయాకగూడ నీ మంచిపేరు నిల్చివుంటుంది
   అది వేయి సువర్ణ నిధులకంటె ఎక్కువకాలం నిలుస్తుంది
  నరుని మంచి జీవితం 
  కొన్నాళ్ళపాటు మాత్రమే కొనసాగుతుంది
  కాని అతని సత్మీర్తి శాశ్వతంగా నిలుస్తుంది - సీరా 41, 12-13
  నరుడు తన మరణాన్ని నిత్యం గుర్తుంచుకోవాలి అలా చేస్తే సులువుగా 
కట్టుకోడు. 
 ఓ దినం నీవు మరణించి తీరుతావని
 నీవు చేసే కార్యాలన్నిటిలోను గుర్తుంచుకో
 అప్పడు నీవు ఎన్నడూ పాపం కట్టుకోవు - సీరా 7, 36.

23. ప్రభువు కరుణ

           ప్రభువు మహాకరుణ కలవాడు. అతడు తాను కలిగించిన ప్రాణులను వేటినీ 
 అసహ్యించుకోడు, అసహ్యించుకొనేవాడైతే వాటిని పట్టించే వుండడు. ఒకవేళ పట్టించినా,
 ఎంతోకాలం ఉనికిలో ఉంచడు. కనుక మనం పట్టామంటే, ఇంకా బ్రతికి ఉన్నామంటే,
 మనపట్ల అతనికి యిష్టముందని అర్థం చేసికోవాలి. నాశంలేని దేవుని ప్రాణమే
 ప్రతిప్రాణిలోను నెలకొని వుంటుంది. ఇవి చాల ఉదాత్తమైన భావాలు.
          ప్రభూ! నీ వన్నిటినీ చేయగలవు కనుక
          అందరినీ దయతో చూస్తావు
          నీవు నరుల తప్పిదాలను ఉపేక్షించి
         వారికి పశ్చాత్తాపపడడానికి అవకాశమిస్తావు
         ఉనికిలో ఉన్నవాటినన్నిటినీ నీవు ప్రేమిస్తావు
         నీవు కలిగించినవాటిని వేటినీ అసహ్యించుకోవు
         అసహ్యించుకొనే వాడివైతే వాటిని పుట్టించే వుండవు
         నీవు సృజించందే ఏ ప్రాణి వనికిలో వుంటుంది?

104 నీవు అంగీకరించందే ఏ జీవి మనుతుంది? అన్ని ప్రాణులూ నీవే గనుక నీవు ప్రతీ ప్రాణినీ కృపతో జూస్తావు నీవు బ్రతికివున్న ప్రాణులన్నిటినీ ప్రేమిస్తావు నాశంలేని నీయాత్మే ప్రతి ప్రాణిలోను నెలకొనివుంది - సాలోమోను జ్ఞాన

11,23- 12, 1.

2. దుష్టవర్తనం

24. మూర్ఖత్వం

ఇంతవరకు మనం నైతిక వర్తనాన్ని గూర్చి పరిశీలించాం. ఇకమీదట ఆ నైతిక

వర్తనాన్ని గూర్చి విచారిద్దాం. మొదట మూర్ధత్వాన్ని గూర్చి చూద్దాం. జ్ఞానానికి 

వ్యతిరేకమైంది మూర్ఖత్వం.

            తోబీతు చెప్పినట్లు బుద్ధిమంతుడు జ్ఞానుల ఉపదేశాన్నిపాటిస్తాడు. "నాయనా! నీవు బుద్ధిమంతుల సలహాను పాటించు. మంచి ఉపదేశాన్ని ఎప్పడూ పెడచెవిని పెట్టవద్దు" -
418. కాని దుష్టుడు ఉపదేశాన్ని వినడు.

మూరులకు విద్యగరపబూనడం పగిలిపోయిన కుండపెంకులను అతికించడంలాగ, గాఢనిద్రలో వున్నవాణ్ణి లేపజూడ్డంలాగ, వ్యర్థమైన కార్యం మూర్జునికి బోధించడం నిద్రతో తూలేవానికి బోధించడం లాంటిది అంతా విన్నాక అతడు నీవేమి చెప్పావని అడుగుతాడు - సీరా 22,7-8. మందలింపును అంగీకరింపనివాడు పాపపు త్రోవలో నడుస్తాడు దైవభీతికలవాడు పరివర్తనం చెందుతాడు మూరునికి విజ్ఞానం అర్థంపర్థంలేని మాటలప్రోగు అది అతనికి కూలిపోయిన యింటిలా వుంటుంది అజ్ఞానికి ఉపదేశాన్ని ఆర్థించాలంటే

105 కాలు సేతులకు సంకెళ్ళ పడినట్లుంటుంది - సీరా 2,16, 18-19. మూరుడు క్రమశిక్షణకు లొంగడు, అది అతనికి రాతిబండలాగ బరువుగా

వుంటుంది.

క్రమశిక్షణకు లొంగనివారికి విజ్ఞానం కటువుగా వుంటుంది మూరుడు దీర్ఘకాలం విజ్ఞానంతో మనలేడు విజ్ఞానం పెద్ద బండవలె భారంగా కన్పింపగా అతడు దాన్ని శీఫ్రుమే అవతలికి నెట్టివేస్తాడు. - సీరా 6,20-21.

కనుక బాలునికి చిన్ననాటినుండే జ్ఞానాన్ని బోధించాలి.

తగని సమయంలో పిల్లలకు బుద్ధిచెప్పడం శోకించేవారికి సంగీతం విన్పించడం లాంటిది కాని పిల్లలను మందలించి క్రమశిక్షణ నేర్పడం ఎల్లవేళలా మంచిదే జ్యోతి ఆరిపోయింది కనుక మృతుని కొరకు విలపిస్తాం వివేకం ఆరిపోయింది కనుక మూర్శని కొరకు విలపించాలి - సీరా 22, 6-11.

25. వాక్పారుష్యం

" అన్ని ధర్మగ్రంథాలూ పరుషవాక్కను పరిహరించి మృదువాక్కును అలవర్చుకోమని చెస్తాయి. మొదట నరుడు నోటిని అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే తోడిజనులు అతన్ని అసహ్యించుకొంటారు. అసలు అతని మాటలు వినరు. నోటిని అదుపులో పెట్టుకొనేవాడు ఆపదలనుండి తప్పించుకొంటాడు వదరుబోతును జూచి అందరూ దడుస్తారు నోటికి వచ్చినట్లు వాగుతాడని ఎల్లరూ వాణ్ణి అసహ్యించుకొంటారు. మూరుడు సుభాషితాన్ని పల్మినా ఎవరూ వినరు అతడు అనుచితమైన కాలంలో దాన్ని పల్ముతాడు - సామె 21, 23. సీరా 9, 18, 2020.

106 ఉత్తముడు మృదువాక్కులు పల్కాలి. జీవనమరణాలు కూడ నాలుక అధీనంలోనే వుంటాయి. మృదువుగా మాట్లాడితే కోపం చల్లారుతుంది కటువుగా పలికితే ఆగ్రహం హెచ్చుతుంది కరుణాపూరితంగా మాట్లాడే జిహ్వ జీవవృక్షంలాంటిది కటువుగా మాట్లాడే నాలుక హృదయాన్ని ప్రయ్యలు చేస్తుంది నాలుకనుబట్టే నరుని జీవితముంటుంది జిహ్వనుబట్టే అతని జీవిత విధానముంటుంది జీవమూ మరణమూకూడ నాలుక అధీనంలో వున్నాయి నరుడు దాన్ని ఏలా వాడుకొంటాడో ఆలాంటి ఫలితాన్నే పొందుతాడు - సామె 15, 1.4 18,20-21. మూర్ణుడు ఆలోచనలేని పల్కులు పల్కి అపఖ్యాతి తెచ్చుకొంటాడు. వాడి మాటలే వాణ్ణి నాశం చేస్తాయి. అజ్ఞడు ఆలోచనలేక నోటికి వచ్చినట్లు వదరుతాడు జ్ఞాని చక్కగా ఆలోచించిగాని సంభాషించడు నీ మాటల వలననే నీకు ఖ్యాతి అపఖ్యాతికూడ కలుగుతుంది నీ నాల్క వలననే నీవు నాశం తెచ్చుకొంటావు - సీరా 21, 26, 5,13. వాచాలత తప్పలకు దారితీస్తుంది, వదరుబోతు పలుకులు చెత్తలాగ విలువలేనివి. అతిగా ప్రేలితే తప్ప దొరలక తప్పదు మౌనం వహించేవాడు వివేకి పుణ్యపురుషుని పల్కులు మంచి వెండి వంటివి

కాని దుష్టని భావాలు చెత్తలాంటివి - ਹੇ। 10,19-20.

మితభాషణం భూషణం. నోటికి వచ్చినట్లు పేలితే చెడ్డపేరు తెచ్చుకొంటాం. కొందరు మితంగా మాటలాడ్డంచే జ్ఞానులనబడతారు కొందరు అమితంగా మాటలాడ్డంచే

చెడ్డపేరు తెచ్చుకొంటారు 

ఏమి మాటలాడాలో తెలియక కొందరు మౌనంగా వుంటారు

107 ఎప్పడు మాటలాడాలో తెలిసి కొందరు మౌనం వహిస్తారు జ్ఞాని తగిన సమయం లభించేవరకూ మౌనంగా వుంటాడు

కాని గొప్పలు చెప్పకొనే మూర్భనికి

ఉచితమైన సమయం తెలియదు

అమితంగా ప్రేలేవాణ్ణి జనం అసహ్యించుకొంటారు
మాటలాడ్డానికి తమకు అవకాశమీయనివాణ్ణి నరులు రోస్తారు - సీరా 20, 5-8.

వదరుబోతుతనం పనికిరాదు. మన సంభాషణం మన శీలాన్ని పట్టియిస్తుంది. ఊపిన జల్లెడలో మట్టి పెళ్ళలు మిగిలినట్లే

నరుని సంభాషణంలో దోషాలు కన్పిస్తాయి
కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవం 

అట్లే నరునికి పరీక్ష అతని సంవాదం చెట్టు కాపునుబట్టి దానికెంత పరామరిక జరిగిందో ఊహించవచ్చు అట్లే నరుని మాటలతీరునుబట్టి అతని శీలాన్ని గుర్తించవచ్చు నరుని సంభాషణమే అతనికి పరీక్ష కనుక ఏ నరుజ్జీ అతడు మాటలాడక ముందు

స్తుతించవద్దు - సీరా 27, 4-7.

వదరుబోతులాగే వదరుబోతు భార్యకూడ నింద్యురాలు. అట్టి దానితో జీవించడమంటే ఆమెతో యుద్ధం చేయడమే. వదరుబోతు భార్య యుద్దారంభంలో ఊదే బూరలాంటిది

అట్టి భార్యను పొందినవాడు
పోరుననే జీవితం గడపాలి 

తొట్టినుండి నీటిని కారనీయగూడదు

దుషురాలైన భార్యను నోటికి వచ్చినట్లు 

వాగనీయకూడదు - సీరా 26,27, 25,25.

108 నాలుక వినాశకారి. లోకంలో కత్తివలన చచ్చినవారికంటె నాలుక వలన చచ్చినవాళ్ళే యొక్కువ.

        కొరడాదెబ్బ ఒడలిమీద బొబ్బలు పొక్కిస్తుంది
        కాని దుష్టజిహ్వ ఎముకలనుగూడ విరగగొడుతుంది 
        కత్తివాతబడి చాలమంది చచ్చారు
        కాని నాలుకవాతబడి చచ్చినవాళ్లు ఇంకా యొక్కువ
        నాలుక ఉపద్రవానికి లొంగనివాడు,
        దాని ఆగ్రహానికి గురికానివాడు,
        దాని కాడిని మెడమీద పెట్టుకొని మోయనివాడు
        దాని గొలుసులచే బంధింపబడనివాడు - ధన్యుడు
        నాలుక కాడి యినుప కాడి
        దాని గొలుసులు ఇత్తడి గొలుసులు - సీరా 28,17-21.
    పొలానికి కంచె వేసినట్లు, పెట్టెకు తాళం వేసినట్లు, బుద్ధిమంతుడు నోటికి గడె వేసికోవాలి. 
       నీ పొలానికి ముండ్లకంచె వేస్తావు కదా!
       నీ ధనాన్ని పెట్టెలోబెట్టి తాళం వేస్తావు కదా! 
       అట్లే నీ ప్రతి పలుకుని తక్కెడలో బెట్టి తూయి 
       నీ నోటికి తలుపు పెట్టి గడె బిగించు
       నీ నాలుక వలన నీవు నాశమైపోకుండేలా,
       నీ పతనాన్ని ఆశించేవాని యెదుట
       నీవు వెల్లకిలపడకుండేలా, జాగ్రత్తపడు.
       కొందరి మాటలు బాకులవలె గుచ్చుకొంటాయి
       కాని బుద్ధిమంతుల పలుకులు మందులా మేలు చేస్తాయి
  - సీరా 28,17-21, 24-26. సామె 12,8.
       కొందరికి చాడీలు చెప్పే దుర్గణం వుంటుంది. కాని దీనివలన అవమానం
   తెచ్చుకొంటాం. బుద్ధిమంతుడు అసలు కొండాలు చెప్పకూడదు. 
       నీవు చాడీలు చెప్పడంలో దిట్ట వనిపించుకోవద్దు 
       నీ నాలుకతో ఉచ్చులు పన్నవద్దు
       చోరులు అవమానానికి గురైనట్లే 
109

అసత్యవాదులు తీవ్రనిందకు పాత్రులౌతారు
 నీ పొరుగువానిమీద చాడీలు చెప్పాలి అనుకోకు
 నీ మిత్రునిమీద కొండాలు తలపెట్టకు
అసలు కొండాలు చెప్పవద్దు
 వాటివలన ఏ ప్రయోజనమూ కలుగదు - సీరా 5,14, 7,12-1.

 మనం విన్న రహస్యాలను దాచాలి. మూర్శలు రహస్యాన్ని దాచలేక ప్రసవవేదనపడే స్త్రీలాగా బాధపడతారు. రహస్యాన్ని దాచితే పొట్ట పిగిలిపోదు కదా!

నీవు విన్న సంగతిని ఇతరులకు చెప్పవద్దు
 ఇతరులకు చెప్పకుండడం పాపహేతువైతేనేతప్ప
మిత్రులకుగాని శత్రువులకుగాని దాన్ని చెప్పవద్దు
నీ నుండి ఆ వర్తమానాన్ని విన్నవాడు నిన్ను శంకిస్తాడు
 అటుపిమ్మట నిన్ను ద్వేషిస్తాడు కూడ
 నీ వేదైన సంగతి వింటే
దాన్ని నీతోనే సమసిపోనీయి
 భయపడకు, దానివలన నీ కడుపు పిగిలిపోదు!
 ముర్ఖుడు తాను విన్న రహస్యాన్ని దాచలేక
 ప్రసవవేదనను అనుభవించే స్త్రీలా బాధపడతాడు
 తొడలో దిగబడిన బాణమెట్లో
మూర్జుని యెదలోవున్న రహస్యవార్తలట్లు
 రహస్యాలను వెలిబుచ్చేవాడు నమ్మదగనివాడు
 అతనికి ఆప్తమిత్రులు దొరకరు
 నీ స్నేహితుని ప్రేమించి విశ్వసనీయుడివిగా మెలుగు
 అతని రహస్యాలను వెల్లడిచేసావంటే
 ఇక అతన్ని వదలుకోవలసిందే - సీరా 19,8-12, 27, 16-17.

ఇతరులు చెప్పేది వినాలి. మధ్యలో అతని మాటలకు అడ్డురాగూడదు.
 ఇతరులు చెప్పేది విన్నపిదపగాని జవాబు చెప్పవద్దు
 మాటలాడేవానికి మధ్యలో అడ్డురావద్దు -సీరా 11,8.

ఇతరులమీద అపనిందలు మోపకూడదు. ఆలా మోపేవాళ్లు వ్యక్తులనూ
 కుటుంబాలనూకూడ నాశం చేస్తారు

.

110 కల్లలాడేవాళ్న అపనిందలు పట్టించేవాళూ శాపగ్రస్తులు ఆలాంటివాళ్ళు శాంతియుతంగా జీవించేవాళ్ళను నాశం జేస్తారు అపదూరులు మోపేవాళ్లు చాలమందిని నాశంజేసి తావునుండి తావకు తరిమికొట్టారు ఆ దుషులు బలమైన పట్టణాలను కూల్చివేసారు ప్రముఖుల గృహాలను కూలద్రోసారు ఇంకా వాళ్లు యోగ్యురాళ్ళయిన యిల్లాళ్ళకు విడాకు లిప్పించి వారి కష్ణార్జితాన్ని అపహరించారు అపదూరులు మోపేవాని మాటలు నమ్మేవాడు శాంతినీ విశ్రాంతినీగూడ కోల్పోతాడు - సీరా 28,13-16. కొంతమంది సులభంగా దేవుని పేరుమీదిగా వొట్టుపెట్టుకొంటారు. ప్రభువు నామాన్ని అంత తేలికగా ఉచ్చరించ కూడదు.

నీవు వట్ట పెట్టుకోవద్దు పరిశుధుడైన ప్రభువు నామాన్ని తేలికగా ఉచ్చరించవద్దు - సీరా 23,9.

అన్యలనుగూర్చి మనం వినే చెడ్డ వార్తలన్నీ నమ్మకూడదు. అసలు వాళ్ళు పాడుపని చేయకుండానే వుండవచ్చు.

నీ మిత్రుడు ఏదో పాడుపని చేశాడని వార్త పడితే అతన్నే అడుగు, అతడాలాంటి పనిచేసివుండకపోవచ్చు ఒకవేళ చేసినా మళ్ళా దాన్ని చేయడు, నీ ప్రక్కవాడేదో పాడుమాట చెప్పాడని వార్తపడితే అతన్నే అడుగు, అతడామాట చెప్పివుండకపోవచ్చు ఒకవేళ చెప్పినా మళ్ళా ఆ మాట చెప్పడు, నీ మిత్రునిగూర్చి యేదో వదంతి పడితే అతన్నే అడుగు, అది వట్టి అపనింద కావచ్చు మనం విన్నదాన్నెల్ల నమ్మకూడదు ఒక్కోసారి నరునికి నోరు జారవచ్చు కాని అతడా మాటను ఉద్దేశపూర్వకంగా అని వుండక పోవచ్చు - సీరా 19, 13-16.

పైన మనం మాటలద్వారా చేసే తప్పలను చాలచూచాం. ఏ నరుడూ తన నాల్కను పూర్తిగా అదుపులో పెట్టుకోలేడు. కనుక నోరు జారకుండావుండే వరప్రసాదం దయచేయమని మనం దేవుణ్ణి వేడుకోవాలి. నా నోటికి ఎవరైన కావలి వండి విజ్ఞతతో నా పెదవులను మూయిస్తే ఎంత బాగుంటుంది! అప్పడు నేను తప్పలు చేయను నా జిహ్వ నన్ను నాశం చేయదు. నాకు తండ్రివీ నా జీవానికి కర్తవూ ఐన ప్రభూ! నేను నా జిహ్వకు లోపడకుండా వుండేలానూ, నా నాలుక నన్ను నాశంచేయకుండా వుండేలానూ, అనుగ్రహించు - సీరా 27, 27. 23, 1.

26. ప్రేమలేని జీవితం వ్యర్థం

   మనకు బడుగువర్గాలమీద ప్రేమ వుండాలి. బిచ్చగాడు దానం చేయమని అడిగితే మొగం ప్రక్కకు త్రిప్పకోకూడదు. అప్పడతడు మనలను శపించవచ్చు. పిసినిగొట్టయిన వాడు తాను తినడు, ఇతరులకు పెట్టడు.లోభివాని ఆశకు అంతంలేదు. ప్రియవాక్కులతో దానం చేయాలే గాని తిడుతూ ఈయకూడదు.
   బిచ్చగాడు యాచిస్తే నిరాకరింపకు
   పేదవానినుండి మొగం ప్రక్కకు తిప్పుకోకు
   దరిద్రునినుండి చూపు మరల్చకు
   అతడు నిన్ను శపించకుండా వుండేలా చూచుకో
   హృదయవేదన భరించలేక ఆ పేదవాడు నిన్ను శపిస్తే
   ప్రభువు అతని మొర ఆలిస్తాడు
   పిసినిగొట్టుకి సిరిసంపదలు తగవు
  లోభికి ధనంతో ఏమి ప్రయోజనం?
  తాననుభవింపక సొమ్ము కూడబెట్టేవాడు
  ఇతరుల కొరకే కూడబెడుతున్నాడు
  అతని సొత్తుతో ఇతరులు హాయిగా బ్రతుకుతారు
  తనకొరకు తాను ఖర్చుజేసికోనివానికంటె
  నికృష్ణుడు లేడు
  పిసినిగొట్టుతనం తన శిక్షను తానే తెచ్చుకొంటుంది
  లోభియైన నరుడు దుష్దుడు
  అక్కరలో వున్నవారిని ఆదుకొనడు 

అతడు తనకున్నదానితో తృప్తిజెందడు దురాశ వలన అతని హృదయం కుదించుకపోతుంది నాయనా! నీవు దానం చేసేపుడ నిందావాక్యాలు పలుకవద్దు ఇతరులకు ఇచ్చేపుడు మనసు నొప్పించవద్దు మంచు కురిసినప్పడు ఎండ వేడిమి సమసిపోతుంది కదా! నీవిచ్చే వస్తువులకంటెగూడ నీ మాటలు ముఖ్యం కరుణామయ వాక్యాలు ప్రశస్త దానంకంటె శ్రేష్టమైనవి కాని ఉదార స్వభావుడు ఆ రెండిటినీ యిస్తాడు - సీరా 4,4-6.13,3-4.6-9. 18, 15-17.

27. కొన్ని దురుణాలు

    మన జీవితంలో చిన్నచిన్న దుర్గుణాలు చాలవుంటాయి. వాటిని గూడ సవరించుకోవాలి. మనం వెలుపలి డాబును లెక్కచేయకూడదు. అనుచితమైన కోపం పనికిరాదు. పేదవాణ్ణి పీడించి అవమానిస్తే అతన్ని చేసిన దేవుణ్ణేఅవమానించినట్లు.
    అందంగా వున్నందువలన ఎవరినీ మెచ్చుకోకు
    అందంగా లేనందువలన ఎవరినీ నిరాకరింపకు
    రెక్కలతో ఎగిరే జీవుల్లో తేనెటీగ చాల చిన్నది
    కాని దాని తేనె మహామధురంగా వుంటుంది
    నీ నాణెమైన దుస్తులను జూచుకొని మురిసిపోవద్దు
    గౌరవం అబ్బినపుడు పొగరుబోతువి కావద్దు.
    అనుచితమైన కోపం తగదు
    అది కోపిష్టినే నాశం చేస్తుంది
    సహనవంతుడు తగిన సమయం కొరకు
    ఓపికతో వేచివుంటాడు
    కడన అతడు సంతోషం చెందుతాడు.
    దేవుడు నరులు కోపించాలని కోరుకోడు
    కనుక నరులు ఉగ్రులు కాకూడదు

113

విచారం వలన నరుడు
ప్రాయం రాకముందే ముసలివా డౌతాడు
అసూయ కోపం ఆయుస్సుని తగ్గిస్తాయి
అన్యునిపై కోపంతో మండిపడ్డం కంటె
అతన్ని మందలించడం మెరుగు.
పేదవాణ్ణి పీడించేవాడు
అతన్ని కలిగించిన సృష్టికర్తను అవమానిస్తాడు
దరిద్రుని గౌరవించేవాడు దేవుణ్ణి గౌరవిస్తాడు
పేదవాణ్ణి గేలిచేస్తే
అతన్ని సృజించిన దేవుణ్ణి గేలిచేసినట్లే.
- సీరా 11,24, 1,22-23, 10,8, 30,24, 20,2. సామె 14,31, 17,5.

28. పగను అణచుకోవాలి

పగ పామవిషం లాంటిది. కనుక సజ్జనుడు దాన్ని అణచుకోవాలి. మనం పరుల తప్పులను మన్నించకపోతే దేవుడు తన తప్పలను మన్నించడు. ద్వేషం వలన తగాదాలూ, ప్రేమవలన క్షమాపణ సిద్ధిస్తాయి.

అపకారాలన్నిటిలోను
శత్రువు చేసే అపకారం గొప్పది
ప్రతీకారాలన్నిటిలోను
పగవాని ప్రతీకారం ఘోరమైంది
పాము విషాన్ని మించిన విషం లేదు
పగతుని కోపాన్ని మించిన కోపం లేదు
ప్రభువు నరుని పాపాలన్నీ గమనిస్తాడు
పగతీర్చుకొనే నరునిమీద తాను పగతీర్చుకొంటాడు
నీవు తోడినరుని అపరాధాలను మన్నిస్తే
నీవు మొరపెట్టినపుడు
దేవుడు నీ యపరాధాలను మన్నిస్తాడు
నీవు తోడి నరునిమీద కోపంగా వుంటే
నిన్ను క్షమించమని భగవంతుణ్ణి ఏలా అడుగుతావు?
తోడి నరుని మన్నింపనివాడు
తన తప్పిదాలను మన్నింపమని
దేవుణ్ణి ఏలా వేడుకొంటాడు?

నరమాత్రులైనవారు కోపాన్ని అణచుకోలేకపోతే
ఇక అతనితప్పిదాలను ఎవడు మన్నిస్తాడు?
ద్వేషం తగాదాలను కొనివస్తుంది
కాని ప్రేమ అపరాధాలను కప్పి పెడుతుంది - సీరా 25, 14-15, 28,1-5.
సామె 10,12.

29. దురాశ తగదు

కొందరికి డబ్చే ఉరౌతుంది. పాపమార్గాన ధనం కూడబెట్టని ధనికుడు ధన్యుడు.
ధనాశ కలవాడు సత్పురుషుడు కాలేడు
డబ్బు చేసికోగోరేవాడు పాపం కట్టుకొంటాడు
డబ్బువలన చాలమంది నాశమయ్యారు
ధనంవలన వారు వినాశానికి చిక్కారు
ధనం వలన సమ్మోహితుడయ్యేవాడికి అది ఉరౌతుంది
మూర్ఖులు ఆ ఉరిలో తగులుకొంటారు
పాపమార్గాన డబ్బు కూడబెట్టనివాడూ,
నిర్దోషీ ఐన ధనికుడు ధన్యుడు
ఆలాంటివాడు దొరికితే అతన్ని అభినందించాలి
అతడు ధనికులెవ్వరూ చేయలేని అద్భుతాన్ని చేసాడు
ఈ పరీక్షలో నెగ్గినవాడు నిక్కంగా గర్వించవచ్చు
పాపం చేయగలిగీ చేయనివాడూ,
పరుని మోసగింపగలిగీ మోసగించనివాడూ,
ఎవడైనా వుంటాడా? - సీరా 31, 5-10.

30. నిజాయితీ లేకపోవడం

కొందరు దొంగలాభాలకు పాల్పడతారు. మరి కొందరు దొంగతూకాలకు పూనుకొంటారు. దేవుడు వాళ్ళను అసహ్యించుకొంటాడు. వేరుకొందరు గట్టురాళ్ళను పీకివేస్తారు. ఇంకా కొందరు లంచాలు పుచ్చుకొంటారు. అది అన్నిటినీ సాధించి పెడుతుంది. వేరుకొందరు ముష్టికి కూడ పాల్పడతారు. దానివలన గౌరవమర్యాదలు నశిస్తాయి. వర్తకుడు దుష్కార్యం చేయకుండ వుండలేడు ప్రతివ్యాపారి పాపానికి పాల్పడతాడు లాభాన్ని గణించాలన్న పేరాసతో చాలమంది పాపంజేసారు ధనికుడు కాగోరేవాడు కండ్లు మూసికోవాలి బిగించిన రెండు రాళ్ళ మధ్య మేకు ఇరుకుకొని వున్నట్లే

క్రయవిక్రయాల నడుమ
అన్యాయం దాగుకొని వుంటుంది
నరుడు దైవభీతికి లొంగకపోతే
వాని యిల్ల వానిమీదనే కూలిపడుతుంది.
తప్పుడు తూనికలను ప్రభువు అసహ్యించుకొంటాడు
నిండు తూనికలవలన అతడు ప్రమోదం చెందుతాడు
పూర్వులు పాతించిన గట్టురాళ్ళను కదిలించకు
అనాథుల పొలాలను ఆక్రమించుకోకు.
లంచాలు అన్యాయాలు అడుగంటిపోతాయి
ధర్మం మాత్రమే నిలుస్తుంది
లంచం మంత్రంలాగ పనిచేస్తుంది
అది సాధించిపెట్టని కార్యంలేదు.
కుమారా! నీవు ముష్టి యెత్తుకొని బ్రతకవద్దు
తిరిపెంకంటె చావు మేలు
కూటికోసం ఇతరులమీద ఆధారపడేవాడి జీవితం
అసలు జీవితమే కాదు
అన్యుల కూడు తినేవాడు
తన్నుతాను మైలపరచుకొంటాడు
గౌరవమర్యాదలు కలవాడు ఆ పనికి పాల్పడడు
సిగ్గుసెరం లేనివాడు
బిచ్చమెత్తుకోవడం మంచిదే అంటాడు
కాని తిరిపెం అతని కడుపుకి చిచ్చుపెడుతుంది.
- సీరా 26,29. 27,1-3. సామె 11,1. 23,10. సీరా 40,12. సామె 17,8. సీరా 40, 28-31.
              116 

31. సోమరితనం

సోమరితనం చాలమందిని ఆవహిస్తుంది. కొందరికి మాటలెక్కువ, చేతలు తక్కువ. సోమరిపోతు చీమలను జూచి బుద్ధి తెచ్చుకోవాలి. పై అధికారి తనిఖీ చేయకపోయినా అవి నిరంతరం కష్టపడి పనిచేస్తుంటాయి. పని చేయనివాడు వినాశానికి తమ్ముడౌతాడు. వాడు బయట సింహముంది, కనుక నేను వీధిలోకి పోను అంటాడు. సోమరిపోతు పొలం పండదు. వాడు కంచంలోని అన్నాన్ని పైకెత్తి నోటితో పెట్టుకోవడమనే చిన్నపని చేయడానికి గూడ ఇష్టపడడు.

మాటలలో దిట్టతనం జూపి
    క్రియలో సోమరితనం జాప్యంచూపడం పనికిరాదు
    ప్రగల్భాలు పల్కుతూ ఆకటితో చావడంకంటె
    కష్టపడి పనిచేసి
    నిండుగా తిండి సంపాదించుకోవడం మేలు.
    సోమరీ! చీమలను జూడు
    వాటి జీవితాన్ని జూచి బుద్ధి తెచ్చుకో
    వాటికి నాయకుడు లేడు,
    పర్యవేక్షకుడు లేడు, అధికారి లేడు
    ఐనా అవి వేసవిలో ఆహారం చేకూర్చుకొంటాయి
    కోతకాలంలో ధాన్యం చేకూర్చుకొంటాయి
    సోమరీ! నీ వెంతకాలం పండుకొంటావు?
    ఎప్పుడు నిద్రమేల్కొంటావు?
    ఇంకా కొంచెంసేపు కన్నుమూసి
    కొంచెం నిద్రించి
    కొంచెం చేతులు ముడిచి
    విశ్రాంతి తీసుకోగోరుతావు కాబోలు
    కాని యింతలోనే దారిద్ర్యం
    దోపిడికానివలె నీ మీదికి వస్తుంది
    పేదరికం ఆయుధహస్తునివలె
    నీ మీదికి ఎత్తివస్తుంది.
    పనిచేయని సోమరిపోతు

           117 
 వినాశమూర్తికి సాక్షాత్తు సోదరుడు.
 బయట సింహముంది, అది నన్ను వీధిలో చంపుతుంది
 అని సోమరిపోతు ఇల్లు కదలడు.
 సోమరిపోతూ మూర్ఖుడూ ఐన ఓ నరుని
 పొలం ప్రక్కగాను, ద్రాక్షతోట ప్రక్కగాను,
 నేను నడచిపోయాను
 ఆ పొలం నిండ మండు కలుపు ఎదిగి వున్నాయి 
 దాని చుటూరా వున్న రాతిగోడ కూలిపోయింది
 నేనా పొలాన్ని జూచి ఆలోచించడం మొదలెట్టాను
 ఆ చేనివైపు చూడగా నాకీ గుణపాఠం తట్టింది
 కొంచెంసేపు నిద్రించు,
 కొంచెంసేపు కునికిపాట్లు పడు,
 కొంచెంసేపు చేతులు ముడుచుకొని విశ్రాంతి తీసికో
 ఈ మధ్యలో దారిద్ర్యం దొంగలాగానూ
 సాయుధుడైన దోపిడికానిలాగానూ వచ్చి 
 నీమీద పడుతుంది.
 తలుపు బందుమీద తిరిగినట్లే 
 సొమరిపోతు పడకమీద దొర్లుతాడు
 అతడు కంచంలో చేయి పెడతాడు కాని
 అన్నం ఎత్తి నోట బెట్టుకోవడం కష్టమనుకొంటాడు

- సీరా 4,29. 10,27. సామె 6,6-11. 18,9. 22,13. 24, 30-34. 26, 14-15.

         32. త్రాగుబోతుతన
     మద్యపానం గర్హింఅపదగింది. ఇనుముకి పరీక్ష కొలిమి. త్రాగి వాదులాడే వాడికి
పరీక్ష వాడు త్రాగిన మద్యమే, మితంగా సేవిస్తే మధువు హానిచేయదు. కాని మితంమీరి త్రాగితే అది              యెంతో కీడు చేస్తుంది. మద్యం పాములాగ కరుస్తుంది. పిచ్చి పుట్టిస్తుంది.కనుక బుద్ధిమంతుడు దాన్ని మితంమీరి త్రాగడు.
   నీ గొప్పను నిరూపించుకోవడానికి
   అమితంగా త్రాగకు
   మధువు వలన చాలమంది నాశమయ్యారు
                118 

ఇనుం మనికికి పరీక్ష కొలిమి
   త్రాగి వాదులాడే గర్వాత్మలకు పరీక్ష ద్రాక్షరసం
   మితంగా సేవిస్తే ద్రాక్షారసం నరునికి నూత్నజీవాన్నిస్తుంది
   మధువు లేకపోతే జీవితానికి విలువలేదు
   నరుల ఆనందం కొరకే అది కలిగింపబడింది
   తగిన కాలాన తగినంతగా సేవిస్తే
   ద్రాక్షసవం ఆనందోల్లాసాలను చేకూరుస్తుంది
   కాని మితంమీరి త్రాగితే అది
   ద్వేషం కలహం పతనం తెచ్చి పెడుతుంది
   త్రాగి మత్తెక్కివున్న మూర్ఖదు
   కోపంతో తనకు తానే కీడు చేసికొంటాడు
   అతడు బలాన్ని కోల్ట్టక దిగుతడూ
   పానపాత్రంలో ఎర్రగా నిగనిగలాడేదైనా,
   సులువుగా గొంతులోకి దిగజారేదైనా
   నీవు మద్యానికి బ్రమసిపోవద్దు
   అంతా అయిన తర్వాత అది పాములా కరుస్తుంది
   విషనాగంలా కాటువేస్తుంది
   నీ కంటికి వింతదృశ్యాలు కన్పిస్తాయి
   నీవు పిచ్చిమాటలు పల్ముతావు
   నీకు సముద్రపు అలలమీద ఉయ్యాలలూగినట్లుగా,
   ఓడమీది తెరచాప కొయ్యమీద
   తూలియాడినట్లుగా తోస్తుంది - సీరా 31, 25-20. సామె 23,30-34.
   తోబీతు కూడ తన కుమారుడు తోబియాకు "నీవు ద్రాక్షసారాయాన్ని తప్పత్రాగి
మత్తుడివి కావద్దు. త్రాగుడు అనే వ్యసనానికి లొంగిపోవద్దు" అని హితవు చెప్పాడు – 4,15.

       38. తిండిపోతుతనం
  విందులు ఆరగించేపుడు జాగ్రత్తగా మెలగాలి. చాల మందికి కడుపు నిండినా

కండ్లు నిండవు. ప్రక్కవారిని త్రోసుకొంటూ బోయి మనకు కావలసిన ఆహారపదార్థాలను తెచ్చుకోగూడదు. తిండిమీది కోర్మెను కాస్త అదుపులో పెట్టుకోవాలి. ఆత్రంతో తినకూడదు. పంక్తినుండి అందరికంటె ముందులేస్తే మర్యాదగా వుంటుంది. మితంగా భుజిస్తే చక్కగా

                119 

నిద్రపడుతుంది. లేకపోతే ఎరక్కతిని అరక్క చావవలసి వస్తుంది. భోజనప్రీతివల్ల చాలమంది చచ్చారు. ఎప్పుడుగూడ ఎవరికి గిట్టే ఆహారమే వాళ్ళ తినాలి.

విందును ఆరగించడానికి కూర్చున్నపుడు
          నోరు విప్పి చూడకు
          ఇక్కడ భోజనపదార్ధాలున్నాయని
          ఆశ్చర్యవచనాలు పల్కకు
          దృష్టిదోషం చెడ్డదని తెలిసికో
          సృష్టిలో కంటికంటె పేరాసకలది యేదీలేదు
          కనుకనే అది మాటిమాటికి నీరు కార్చుతూంటుంది
          నీ కంటికి కన్పించిన పదార్థాలన్నీ తీసికోవద్దు
          వాటిని తీసికొనేప్పడు తోడివారిని ప్రక్కకు త్రోయవద్దు
          ఇతరుల కోరికలు నీ కోరికలవంటివే
          కనుక ఇతరులను అర్థంచేసికొని ఆదరంతో మెలగు
          నీకు వడ్డించిన భోజనాన్ని మర్యాదగా తిను
          ఆత్రంతో తింటే యెల్లరికీ రోతపుట్టిస్తావు
          భోజనంచేసి ముగించేవారిలో
          నీవు మొదటివాడవైతే మర్యాదగా వుంటుంది
          మితిమీరి తింటే జనులు నిన్ను మెచ్చరు
          పదిమందితో కలసి భుజించేపుడు
          అందరికంటె ముందుగా నీవు పదార్థాలు తీసికోవద్దు
          మర్యాద తెలిసినవాడు స్వల్పంగా భుజిస్తాడు
          కొద్దిగా తింటే నిద్రించేపుడు ఆయాసపడనక్కరలేదు
          మితభోజనం వలన బాగుగా నిద్రపడుతుంది
          వేకువనే ఉత్సాహంతో మేల్కొనవచ్చు
          మితంమీరి తింటే కడుపునొప్పి
          నిద్రపట్టకపోవడం దాపురిస్తాయి
          కుమారా! ఈ జీవితయాత్రలో
          నిన్ను నీవు పరీక్షించి చూచుకొంటూండు
          నీకు గిట్టని భోజనపదార్థాలు తినకు
          ప్రతిభోజనం ప్రతివానికీ సరిపడదు

          

అందరికి అదేరకపు అన్నం రుచించదు
విశిష్టాన్నాలమీద మక్కువ వదులుకో
ఎట్టి భోజనాన్నయినా మితంమీరి తినకు
అమితంగా తింటే రోగం వస్తుంది
భోజనప్రియత్వంవలన పిత్తం మదురుతుంది
భోజనప్రీతి వలన చాలమంది చచ్చారు
కావున ఈ విషయంలో జాగ్రత్తగా వుండి
నీ ఆయుస్సును పెంచుకో
 - సీరా 31, 12-20. 37, 27-31.

34. కలహాలు

సులభంగా తగాదాలకు దిగకూడదు. ఇతరుల మధ్య పోట్లాట పెట్టకూడదు. మొండివాడికి తగాదా లెక్కువ. కలహాలకు దూరంగా వుండేవాడు గొప్పవాడు. కట్టెలు మంటలను పెంచినట్లు కొండెగాళ్ళు కలహాలు పెంచుతారు. కనుక వాళ్ళను దూరంగా వంచాలి.

కలహాలు పరిహరిస్తే నీ పాపాలు తగ్గుతాయి
దుషుడు స్నేహితులమధ్య తగాదాలుపెట్టి
కలసివున్నవారిని విడదీస్తాడు
కట్టె కొలది మంటలల్ల
నరుడు బలవంతుడూ ధనవంతుడూ ఐనకొలది
అతని కోపం రెచ్చిపోతుంది
దిడీలున పుట్టుకవచ్చిన కలహం ఉద్రేకాన్ని పెంచుతుంది.
త్వరపడి కలహించేవాళ్ల రక్తపాతానికి ఒడిగడతారు
నిప్పరవ్వమీద ఊదితే మంటలేస్తుంది
దానిమీద ఉమ్మివేస్తే అది ఆరిపోతుంది
ఈ రెండు క్రియలను మన నోటితోనే చేస్తాం
గర్వాత్మల కలహాలు హత్యకు దారితీస్తాయి
వారి దూషణభాషణలను మనం వినలేం
అల్పుడు ఎవడైనా జగడాలు ఆడగలడు

తగాదాలకు దూరంగా వుండేవాడే ఘనుడు
కట్టెలు లేకపోతే మంటలు ఆరిపోతాయి
కొండెగాడు లేకపోతే కలహాలు అంతరిస్తాయి
నిప్పలకు బొగ్గులు, మంటలకు కట్టెలు,
జగడాలకు కలహప్రియుడు, అవసరం - సీరా 28, 8-12, 27,15. సామె 20,2. 26, 20-21.

35. వ్యభిచారం

నరుల్లో కామాగ్ని ఎప్పడూ కొలిమిలా మండుతూనే వుంటుంది. వ్యభిచారి నరుల కన్నుగప్ప జూస్తాడు. కాని దేవుని కన్నుకప్పలేడు. సూర్యునికంటె కాంతిమంతమైన నేత్రాలుకల దేవుడు పాపి పాపాలన్నీ గమనిస్తాడు. కనుక అతనికి శిక్ష తప్పదు.

కొలిమిలా మండే కామాగ్నిని ఎవరూ చల్లార్చలేరు
అది తన్నుతాను కాల్చివేసికొని ఆరిపోవలసిందే
కామవాంఛను తీర్చుకోడానికి జీవించే నరుని
కడన ఆ కామాగ్నే కాల్చి వేస్తుంది
ఆలాంటివాడు ప్రతిస్త్రీని కామిస్తాడు
ఆ దుషుడు జీవించి వున్నంతకాలం
అతని కామవాంఛ తీరదు
వివాహధర్మాన్ని మీరి వ్యభిచారానికి పాల్పడేవాడు
నన్నెవరు చూస్తారు?
ఇది చీకటివేళ, గోడలు అడ్డంగా వున్నాయ.
ఎవరు నన్ను గమనించరు, నాకు భయమెందుకు?
మహోన్నతుడైన ప్రభువు నా దోషాలను పట్టించుకోడు అని అనుకొంటాడు
నరులు తన్ను చూస్తారేమో అనే అతని భయం
కాని ప్రభువు నేత్రాలు సూర్యునికంటె
పదివేలరెట్లు కాంతిమంతంగా వుంటాయనీ
అవి మనం చేసే ప్రతికార్యాన్నీ
మన రహస్యాలన్నీ గమనిస్తాయనీ అతడెరుగడు
కనుక ఆ పాపి తానూహింపనప్పడు పట్టువ
బహిరంగంగా

మగవాడు స్త్రీల విషయంలో జాగ్రత్తగా వుండాలి. అతనికి పరస్త్రీ సాంగత్యం తగదు. త్రోవలో అందగత్తె యెదురుపడితే అతడు తన చూపులను ప్రక్కకు త్రిప్పకోవాలి.లేకపొత సౌందర్యం అతనిలో ఉద్రేకజ్వాలలను రగుల్కొల్పుతుంది .

నీవు అనురాగంతో జూచుకొనే భార్యను శంకించకు
శంకిస్తే, ఆమెను నీకు కీడుచేయ ప్రోత్సహించినట్
ఏ స్త్రీకి మనసిచ్చి కదాసుడివి కావద్దు
పరకాంత సాంగత్యం పనికిరాదు
నీవు ఆమె వలలో చిక్కుకొంటావు
పాటకత్తెతో చెలిమి వద్దు
ఆమె నిన్ను బుట్టలో వేసికొంటుంది
కన్యవైపు వెర్రిగా జూడవద్దు
ఆమెకు నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది
వేశ్యకు హృదయం అర్పింపకు
నీ ఆస్తి అంతా గుల్లవుతుంది
నగర వీధుల్లో నడచేపుడు
నలువైపుల తేరిపారజూడవద్దు
నరసంచారంలేని తావుల్లోకి పోవద్దు
అందగత్తె ఎదురుపడినపుడు
నీ చూపులను ప్రక్కకు త్రిప్పకో
పరకాంత సౌందర్యంమీదికి మనసు పోనీయకు
స్త్రీసౌందర్యం వలన చాలమంది తపుత్రోవపట్టారు
అది అగ్నిలా జ్వాలలను రగుల్కొల్పుతుంది
పరకాంత సరసన కూర్చుండి భోజనం చేయకు
ఆమెతో కలసి పానీయం సేవించకు
నీవు ఆమె ఆకర్షణకు లొంగిపోయి
ఉద్రేకానికి గురై స్వీయనాశం తెచ్చుకోవచ్చు - సీరా 9,1-19.

పురుషుడు మంచి పిల్లను పెండ్లిచేసుకొని ఆమెను కూడి సక్రమైన సంతానాన్నికనాలి.అతనికి వేశ్యాసాంగత్యం పనికిరాదు. మామూలుగా మంచివాడికి మంచి భార్యా "చెడ్డవాడికి చెద్దభార్యాదొరుకుతారు.

నాయనా! నీవు యువకుడివిగా వున్నప్పడు
నీ యారోగ్యాన్ని కాపాడుకో
అన్యకాంతలనుగూడి నీ బలాన్ని వమ్ముజేసికోకు
దేశంలో సారవంతమైన క్షేత్రాన్ని వెదకి
దానిలో నీ సొంత బీజాలను వెదజల్ల
నీ మంచి విత్తనాలను నీవు నమ్మాలి
అప్పడు నీ బిడ్డలు
తాము మంచికుటుంబంలో పుట్టామని నమ్మి
పెరిగి పెద్దవారై వృద్ధిలోకి వస్తారు
ఉంపుడుకత్తె ఉమ్మివలె హేయమైంది
వ్యభిచారిణియైన భార్య తన ప్రియలకు చావు తెస్తుంది
దుర్మార్ణునికి అతనికి తగినట్లే
భక్తిహీనురాలైన భార్య లభిస్తుంది
దైవభీతికల నరునికి భక్తిగల భార్య దొరుకుతుంది
సిగ్గుమాలిన భార్య తనకు తానే
అవమానం తెచ్చుకొంటుంది
కాని శీలవతియైన భార్య
తన భర్త యెదుటకూడ సిగ్గుపడుతుంది - సీరా 26, 19-24

పురుషుడు స్త్రీ సౌందర్యాన్ని చూచి మతి పోగొట్టుకో గూడదు. తొలి పాపానికి స్త్రీయే కారణం. ఆ పాపంవల్లనే నరజాతికి చావు ప్రాప్తించింది.

సౌందర్యానికి బ్రమసిపోవద్దు
అతివను జూచి మతి కోల్పోవద్దు
దుష్ణురాలైన భార్యవలన భర్తకు
విషాదమూ విచారమూ హృదయవేదనా కలుగుతాయి
పాపం స్త్రీతోనే ప్రారంభమైంది
ఆమె మూలాన మనమందరం చావవలసి వచ్చింది. - సీరా 25,21-24.

పరస్త్రీ సాంగత్యం మొదట తేనెలా తీయగా వుంటుంది. అటుతర్వాత విషముష్టిలా చేదుగా వుంటుంది. ఆమె తన వెంటబోయేవాడ్డి మృత లోకానికి గొనిపోతుంది. రంకులాడి దగ్గరికి వెళ్ళేవాడు ఆస్తి, గౌరవం, చివరకు ప్రాణాలు కూడ పోగొట్టుకుంటాడు. పురుషుడు సొంత భార్యతో సుఖమనుభవించాలికాని పరస్త్రీతో కాదు.

పరస్త్రీ పెదవులు తేనెలు ఒలుకుతుంటాయి
             ఆమె మాటలు ఓలివ తైలంలా మృదువుగా వుంటాయి
             కాని కడన ఆమె విషముష్టివలె చేదుగొల్పుతుంది
             రెండంచుల కత్తిలాగ బాధ గొనితెస్తుంది
             ఆ వనిత నిన్ను మృత్యులోకానికి చేర్చుతుంది
             ఆమె నడచిన మార్గం పాతాళానికి పోతుంది
             రంకులాడికి సాధ్యమైనంత దూరంగా వుండు
             ఆమె యింటి గుమ్మంకూడ తొక్కవద్దు
             ఈ యాజ్ఞ మీరితే నీ గౌరవాన్ని కోల్పోతావు
             క్రూరులకు జిక్కి అకాలమృత్యువు వాతబడతావు
             పరులు నీ సాత్తును స్వాధీనం చేసికొంటారు
             నీవు శ్రమజేసి సంపాదించింది అన్యులపాలవుతుంది
             నీవు మృత్యుశయ్యను చేరుతావు
             నీ దేహం క్షీణించిపోతుంది
             నాయనా! నీ సొంత బావినుండి మాత్రమే నీళ్లు త్రాగు
             నీ జలధారనుండే స్వచ్ఛమైన నీరు సేవించు
             నీ చెలమ నీటితో ఇతరుల పొలాలు తడపకు
             నీ జలధారను వీధిలోనికి పారనీయకు
             నీ జలాలు నీకేగాని అన్యులతో పంచుకోడానికికాదు
             నీవు యావనంలో పెండాడిన భార్యతో సుఖించు
             ఆమె దీవెనలు పొందునుగాక
             ఆ వనిత లేడిలా, దుప్పిలా

పురుషుడు పరకాంత సొగసుకి బ్రమసి పోగూడదు. ఆమెను తాకితే అగ్నిని తోడినరులూ పరస్త్రీ భర్తకూడ వ్యభిచారిని చావమోదుతారు.

పరకాంత సొగసునకు నీవు బ్రమయవలదు
            ఆమె కంటిచూపుకి నీవు సమ్మోహితుడివి కావద్దు

వేశ్యకు కొద్దిపాటి సొమ్ము చెల్లిస్తే చాలు
          కాని పరుని భార్యతోడి రంకు
          నీ యాస్తినంతటినీ అపహరిస్తుంది
          నిప్పలను రొమ్ముమీద పెట్టుకొంటే బట్టలు కాలవా?
          అగ్నిమీద నడిస్తే సాదాలు మాడవా?
          అన్యుని భార్యను కూడేవాడూ అంతే
          ఆమెను స్పృశిస్తే శిక్ష తప్పదు
          దొంగ ఆకలితో పొట్టకూటికొరకు దొంగిలిస్తే
          జనులతనిని అంతగా దూషించరు
          కాని పరుని సతిని కూడేవానికి అసలు బుద్ధిలేదు
          అతడు తన చావుని తానే తెచ్చుకొంటాడు
          అతన్ని జనులు చావమోది అవమానిస్తారు
          శాశ్వతమైన అపకీర్తి కలుగుతుంది
          అసూయకు గురైన భర్త రౌద్రంతో మండిపడతాడు
          కరుణమాని ప్రతీకారానికి పూనుకొంటాడు. - సామె 6,25-35.


సామెతల గ్రంథం 7వ అధ్యాయం వారకాంత వలపు, యువకులు ఆమె వలలో చిక్కుకొని నాశంకావడం కన్నులకు కట్టినట్లుగా వర్ణిస్తుంది. పాఠకులు ఈ యధ్యాయాన్నంతటినీ చదువుకోవాలి. గ్రంథవిస్తరణభీతిచే ఇక్కడ ఈ యధ్యాయంలో చివరి వాక్యాలను మాత్రం ఉదాహరిస్తున్నాం.

ఇకనేమి, కోడె వధ్యస్థానానికి పోయినట్లే,
లేడి వచ్చులలో తగుల్కొన్నట్లే
అతడు ఆ వారకాంత యింటికి బోయాడు
వాడిబాణం అతని గుండెలో గ్రుచ్చుకోనుంది
వలలో చిక్కుకోబోయే పక్షిలాగ
అతని ప్రమాదం అతనికే తెలియదు
కనుక కుమారా! నా పలుకులు ఆలించు
నా మాటలు శ్రద్ధగా విను
హృదయాన్ని అట్టి వనితకు అర్పింపకు
నీవు ఆమె వెంట పోవద్దు
ఆ కాంత పూర్వం చాలమందికి ముప్ప తెచ్చింది

ఆమె చేతజిక్కి చచ్చినవాళ్ళ అనేకులున్నారు
        ఆమె యింటికి పోవడమనగా పాతాళానికి పోవటమే - సామె 7, 22-27

.}}

నరుడు తనంటతట తాను కామ వికారాన్ని అణచుకోలేడు. కనుకనే రచయిత భగవంతునికి ఈలా ప్రార్ధన చేసాడు.

నాకు తండ్రివీ
      నా జీవనానికి దేవుడవూ ఐన ప్రభూ!
      అహంకారం నుండి నన్ను కాపాడు
      నా హృదయంనుండి కామాగ్ని తొలగించు
      నేను మోహానికి లొంగకుండేలానూ
      సిగ్గుమాలి కామవికారానికి లోపడకుండేలానూ కరుణించు - సీరా 23, 4-6.

36. గర్వం

నరులకు సులభంగా అలవడే దురుణం గర్వం. పాపంతో గర్వం ప్రారంభమైంది. గర్వాత్ముడు దేవుణ్ణి నిరాకరిస్తాడు. ప్రభువు రాజులను సింహాసనాలమీదినుండి కూలద్రోస్తాడు. వినయాత్మలను గద్దెనెక్కిస్తాడు.

సృష్టికర్తయైన ప్రభువుని విడనాడ్డం గర్వానికి తొలిమెట్టు
      పాపంతో గర్వం ప్రారంభమౌతుంది
      గర్వితులుగానే మనుగడ సాగించేవాళ్లు మహా దుషులౌతారు
      ప్రభువు అట్టివారిని తీవ్రశిక్షకు గురిచేసి సర్వనాశం చేస్తాడు
      అతడు రాజులను సింహాసనంనుండి కూలద్రోసి
      వినయాత్మలను గద్దెనెక్కిస్తాడు - సీరా 10,12-14

నరుడు ఆశాపాశాలకు లొంగకూడదు. వాటిల్లో గర్వంకూడ వొకటి. ఈ దుష్టశక్తులను తావిచ్చేవాళ్ల సమూలంగా ఎండిపోయిన చెట్టలా నాశమౌతారు.

ఆశాపాశాలకు తావీయకు
      అవి నిన్ను ఎద్దుకొమ్మలతోవలె పొడుస్తాయి
      నీవు ఎండిపోయి, ఆకులను పండ్లను కోల్పోయిన
      చెట్టువంటివాడ మోతావు
      ఆశాపాశాల వలన నరుడు చెడతాడు
      నీ శత్రువులు నిన్ను జూచి నవ్వుతారు - సీరా 6, 2-4

మన సంపదలనూ గౌవవాలనూ అందమైన దుస్తులనూ జూచి మనం మురిసిపోకూడదు. మనం ఎప్పడు పడిపోతామో మనకే తెలియదు. రాజులే బిచ్చగాళ్ళయ్యారు.

నీ నాణెమైన దుస్తులనుజూచుకొని మురిసిపోకు
     నీకు గౌరవం అబ్చినపుడు పొగరుబోత్సువి కావద్దు
     ప్రభువు అద్భుత కార్యాలు చేస్తాడు
     వాటిని నరులు తెలిసికోలేరు
     చాలమంది రాజులు గద్దెదిగి నేలమీద కూర్చున్నారు
     ఎవరూ ఊహింపనివాళ్లు వచ్చి
     ఆ రాజుల కిరీటాలు ధరించారు
     పాలకులు చాలమంది అవమానం పొందారు
     సుప్రసిద్దులు చాలమంది
     అన్యులశక్తికి లొంగిపోయారు - సీరా 11,4-6.

గర్వాత్ముడి లక్షణం ఆత్మస్తుతీ, పరనిందా. కాని యిది తగదు.
       ఇతరులు నిన్ను పొగడవచ్చుగాని
       నిన్ను నీవే పొగడుకోగూడదు
       పరులు నిన్ను స్తుతించవచ్చుగాని
      ఆత్మస్తుతి పనికిరాదు - సామె 27.2

గర్వాత్మడు డాబూ దర్పమూ ప్రదర్శిస్తాడు. “మింగమెతుకు లేదుగాని మీసాలకు సంపెంగనూనె" అన్నట్లుగా వుంటుంది అతని వాలకం.

నీవు పనిచేసేపుడు
      నీ ప్రావీణ్యాన్ని ప్రదర్శింప నక్కరలేదు
      ఇక్కట్టులలో వున్నపుడు డాబుసరి పనికిరాదు
      ప్రగల్భాలు పలుకుతూ ఆకటితో చావడంకంటె
      కష్టపడి పనిచేసి పొట్టనిండ తినడం మేలు - సీరా 10, 26 -27.

భవిష్యత్తులో మనకు ఏలాంటి దుర్గతి పడుతుందో మనకే తెలియదు. క్షణకాలంలోనే మన పరిస్థితి మారిపోతుంది. కనుక మనకు గర్వం పనికిరాదు.

నరుడు, ఇక శ్రమచేయడం చాలించి
     నే నార్జించిన సొత్తుని అనుభవిస్తానని యెంచవచ్చు

}}

కాని అతడు చావడానికీ
     అతని సొత్తు ఇతరులపాలు కావడానికీ
     ఇంకా యెన్నాళ్ళ వ్యవధి వుందో అతనికే తెలియదు కదా!
     పాపాత్ముల విజయాలను చూచి అసూయ చెందకు
     దేవుని నమ్మినీ పనులను నీవు శ్రద్ధగా జేయి
     క్షణకాలంలోనే దరిద్రుని సంపన్నుని జేయడం
     ప్రభువుకి కష్టంగాదు.
     ఉదయసాయంకాల మధ్యలోనే పరిస్థితులు మారిపోవచ్చు,
     దేవుడు తలపెట్టిన మాఅతిశీఘంగా కలుగుతుంది - సీరా 11, 19-21, 18,26.

దుష్టులు వృద్ధిలోకిరావడం చూచి మనం సహించలేం. అసూయపడతాం. కాని వాళ్ళ త్వరలోనే దేవుని శిక్షకు గురౌతారు. కనుక మన అసూయ నిరర్థకమైంది.

37.అసూయ

పాపి విజయాన్ని చూచి అసూయ చెందవద్దు
    వాడికెట్టి వినాశం దాపరిస్తుందో నీ వెరుగవు
    దుపులు అనుభవించే ఆనందాన్ని ఆశింపకు
    బ్రతికి వుండగానే వారికి శిక్ష పడుతుంది - సీరా 9, 11-12.

నరునికి విచారమూ, కోపమూ, అసూయా పనికిరావు, సంతోషచిత్తత అతనికి మేలు చేస్తుంది.

విచారం వలన నరుడు
    ప్రాయం రాకముందే ముసలివా దౌతాడు
    అసూయ, కోపం ఆయుస్సుని తగ్గిస్తాయి
    సంతోషచిత్తుడైన నరునికి బాగా ఆకలి వేస్తుంది
    అతడు తృప్తిగా భుజిస్తాడు - సీరా 30, 24-25.

ఇంకా అసూయ ఎముకల్లోపుట్టే కుళ్ళలాంటిది. కనుక దాన్ని ఆవశ్యం వదులుకోవాలి.

శాంతగుణం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి
    అసూయ ఎముకల్లో పుట్టిన కుళ్ళలాంటిది - సామె 14,30.

38. విగ్రహారాధనం

సొలోమోను జ్ఞానగ్రంథం ప్రకృతి శక్తుల ఆరాధనాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. నరులు తమ చుటూవున్న వస్తువులనుచూసి వానిని చేసిన సృష్టికర్తను గుర్తించి వుండవలసింది. కార్యాన్నిచూచి కారణాన్ని తెలిసికోవచ్చు గదా! ప్రకృతి వస్తువులే అంత అందంగా వుంటే వాటిని చేసిన ఇంకా యెంత సుందరంగా వుంటూడా అని వారు ఊహించి వుండవలసింది. ఐనా ఈ నరులు లోకస్వభావాన్ని గూర్చి సిద్ధాంతాలుచేసిన జ్ఞానులు. ఈలాంటివాళ్లు లోకనాథుని తెలిసికోలేకపోవడం ఆశ్చర్యకరం!

దేవుణ్ణి తెలిసికోలేనివాళ్ళు నిక్మంగా మందమతులు
     వాళ్ళ తమచుటూవున్న సృష్టివస్తువులను చూచికూడ
     సజీవుడైన దేవుణ్ణి గుర్తించలేదు
     ఆ శిల్చి చేసిన వస్తువులను చూచిగూడ
     అతన్ని తెలిసికోలేదు
     వాళ్ళు అగ్ని వాయువు, తుఫాను
     నక్షత్రరాశి, ప్రవాహజలం, గగనజ్యోతులు
     ఈ లోకాన్ని పాలించే దేవతలని యెంచారు
     ఆ వస్తువుల సౌందర్యానికి ముగ్గులై
     అవి దేవతలని తలపోసారు
     కాని ఆ వస్తువులను కలిగించిన ప్రభువు
     వాటికంటె అధికుడనీ
     సౌందర్యకారకుడైన ప్రభువు వాటిని సృజించాడనీ
     వారు గ్రహించి వుండవలసింది
     ఆ వస్తువుల శక్తినీ అవి పనిచేసే తీరునూ జూచి
     ఆ జనులు ఆశ్చర్యపడితే, వానిని చేసిన దేవుడు
     వాటికంటె శక్తిమంతుడని
     వారు గ్రహించి వుండవలసింది కదా?
     సృష్టి వస్తువుల మహత్వాన్నీ సౌందర్యాన్నీ చూచి
     సృష్టికర్త యేలాంటివాడో గ్రహించవచ్చు
     కాని ఆ ప్రజలు దేవుడ్డి మక్కువతో వెదకడంలోనే
     తప్ప త్రోవ పట్టివుండవచ్చును గనుక

వారినంతగా నిందింపనక్కరలేదేమో!
వాళ్లు తను చుట్టూవున్న సృష్టివస్తువులమధ్య జీవిస్తూ
వాటిని మాటిమాటికి పరిశీలించి చూస్తూ
వాటి అందానికి బ్రమసి
వెలుపలి ఆకారం వలన మోసపోయారు
ఐనా ఆ ప్రజల అవివేకాన్ని మన్నించరాదు
వాళ్ళు లోకస్వభావాన్ని గూర్చి
సిద్దాంతాలు చేయగల్లిగూడ
లోకనాథుని తెలిసికోకపోవడానికి కారణమేమిటి? - సాలో జ్ఞాన 13,1-9.

ఈ పుస్తకం విగ్రహారాధనాన్ని గూడ నిశితంగా ఖండిస్తుంది. వడ్రంగి చెట్టును నరికి దాన్ని చెక్కిరోజువారి పనికి ఉపయోగపడే పనిముట్టును తయారుచేస్తాడు. మిగిలిన ముక్కలతో అన్నం వండుకొంటాడు. కాని ఆ ముక్కల్లోనే ఓ పనికిమాలిన ముక్కను తీసికొని దాన్ని మనుష్యాకృతిగల బొమ్మగానో, మృగరూపంలో వున్న బొమ్మనుగానో మలుస్తాడు. ఆ బొమ్మకు మెరుగులు దిద్ది, రంగులుపూసి దాన్ని గోడలోని గూటిలో పెడతాడు. అటుతర్వాత అతడు సిగ్గూసెరమూ లేకుండా ఆ నిర్జీవ ప్రతిమకు ప్రార్థన చేస్తాడు. జీవమేలేని ఆ బొమ్మ,శక్తిలేని ఆ బొమ్మ ,అతనికేలా సహాయం చేస్తుంది? కనుక విగ్రహాల కొలువు వెర్రితనం.

నిర్జీవాలైన ప్రతిమలను నమ్మేవాళ్ళు
నిక్కంగా దౌర్భాగ్యులు.
వాళ్ళు నరమాత్రులు చేసిన వస్తువులను దైవాలని పిలుస్తారు
అవి వెండిబంగారాలతో
అందంగా మలచిన మృగరూపాలు
లేదా పూర్వమెవడో చెక్కిన నికృష్ణశిలలు
నిపుణుడైన వడ్రంగి అనువైన చెట్టును నరికి
దాని బెరడునంతటిని ఒలిచివేసి
దాని మొండెంనుండి
రోజువారి పనులకు ఉపయోగపడే
పనిముట్టు నొకదాన్ని తయారుచేస్తాడు
మిగిలిన ముక్కలను వంటచెరకుగా వాడుకొని
అన్నం వండుకొని ఆరగిస్తాడు
కాని మిగిలిన వాటిల్లోనే

పనికిమాలిన ముక్క వొకటి అతని కంటబడుతుంది
అది వంకరపోయి మళ్ళతో నిండివుంటుంది
అతడు దాన్ని తీరికవేళల్లో నేర్చుతో చెక్కి
మనుష్యాకృతిగల బొమ్మనుగా మలుస్తాడు
లేదా నీచమైన మృగంగా తయారుచేస్తాడు
ఆ బొమ్మకు ఎర్రరంగుపూసి దాని నెర్రెలు
కప్పివేస్తాడు
తరువాత గోడలో ఒక గూడు తయారుచేసి
ఆ గూటిలో ఇనుప చీలల్తో దాన్ని బిగగొడతాడు
అది జారిపడకుండేలా జాగ్రత్తపడతాడు
అది వట్టి బొమ్మ కనుక తనంతట తాను నిలువలేదనీ
ఇతరులు దాన్ని ఆదుకోవాలనీ అతనికి తెలుసు
ఐనా ఆ నిర్జీవ ప్రతిమకు ప్రార్ధన చేయడానికి
అతనికి సిగ్గులేదు
తన పెండ్లి, పిల్లలు, సంపదలనుగూర్చి
అతడు దానికి మనవి చేస్తాడు
ఆ బొమ్మ సామర్థ్యం లేనిది
ఐనా ఆరోగ్యం కొరకు అతడు దానికి ప్రార్ధనచేస్తాడు,
అది నిర్జీవమైంది
ఐనా జీవం కొరకు దానికి మనవి చేస్తాడు,
అది శక్తిలేనిది
ఐనా సహాయం కొరకు దానికి విన్నపాలు చేస్తాడు,
అది అడుగైన కదపలేనిది
ఐనా ప్రయాణసాఫల్యం కొరకు దానికి మనవిచేస్తాడు,
ఆ బొమ్మ చేతులకు శక్తిలేదు
ఐనా తనకు లాభం కలగాలనీ
తాను డబ్బు చేసికోవాలనీ
దానికి విజ్ఞాపనం చేస్తాడు - 13, 10-19.

ఈ గ్రంథకర్త మరొక తావులో విగ్రహాల పుట్టుకను గూర్చి యిలా చెప్పాడు. ఓ తండ్రి తన కొడుకు చనిపోతే దిగులుతో వాడి బొమ్మనుచేసి వాడ్డి పూజించాడు. ఆ తండ్రి తర్వాత వచ్చిన నరులూ ఆలాగే ఆ కొడుకుని పూజించారు. ఈలా విగ్రహారాధనం వాడుకలోకి వచ్చింది. ఇంకా, కళాకారులు రాజు బొమ్మను చేస్తారు. సామాన్య జనులు రాజమీదగల గౌరవంచే దాన్ని ఆరాధిస్తారు. ఈలాకూడ విగ్రహాల కొలువు వ్యాప్తిలోకి వచ్చింది. నరమాత్రులు క్రమేణ దేవుళ్ళయ్యారు.

పూర్వం ఒక తండ్రి
 తన పత్రుడు తలవని తలంపుగా చనిపోగా
 ఘోరవ్యాకులత నొంది వాని బొమ్మను చేసాడు
 నిన్న చచ్చిన నరుడ్డి నేడు దేవుణ్ణి చేసి పూజించాడు
 అతడు తనక్రిందివారికీ ఆ దేవుణ్ణి పూజించే విధానమూ
 రహస్యారాధన పద్ధతులూ నేర్పిపోయాడు
 కాలక్రమేణ ఆ దుష్టకార్యం బలపడి
 నియమంగా మారిపోయింది.
 రాజుల శాసనంపై బొమ్మలు ఆరాధ్యదైవాలయ్యాయి
 దూరంగా వున్న రాజును
 తమ యెదుట గౌరవింపగోరిన ప్రజలు
 అతని ఆకారాన్ని వూహించుకొని
 ప్రతిమను తయారుచేస్తారు
 దూరాన వున్నవాణ్ణి దగ్గరలో వున్నవాడ్డిలాగ
 ముఖస్తుతి చేయాలని వారి ఆశయం
 ఈ బొమ్మలను చేసిన దురాశాపరుడైన కళాకారుడు
 ఆ రాజునిగూర్చి యేమాత్రం తెలియనివాళ్ళనుగూడ
 అతని ఆరాధనకు పురికొల్పుతాడు
 అతడు రాజు మెప్పు పొందగోరి నేర్పుతో
 రాజుకంటె అతని ప్రతిమను సుందరంగా మలుస్తాడు
 సామాన్యులు ఆ ప్రతిమ. పౌందర్యానికి మురిసిపోయి
 పూర్వం తాము నరునిగా ఎంచి గౌరవించినవానినే
 ఇపుడు ఆరాధించడానికి పూనుకొంటారు
 ఈ రీతిగా ప్రజలు గోతిలో పడసాగారు
 వాళ్లు యాతనలు అనుభవించడం వల్లనో
 లేక రాజాజ్ఞకు బదులు కావడం వల్లనో
 ఏ వస్తువుకీ చెల్లని దివ్యత్వాన్ని
 ఓ కొయ్యకో ఐండకో అంటగట్టి
 వాటిని పూజించడం మొదలెట్టారు - 14, 15-21.

ప్రజలు గోతిలో పడ్డానికీ, బంధాల్లో చిక్కుకోడానికీ విగ్రహాలు కారణమయ్యాయి. కనుక ప్రతిమలూ వాటిని చేసిన నరులూకూడ శాపగ్రస్తులౌతారు.

నరుడు చేసిన కొయ్య విగ్రహమూ
దాన్ని చేసిన నరుడూ శాపగ్రస్తులౌదురుగాక
అతడు నశ్వరమైన వస్తువుని జేసి
దాన్ని దేవుడని పిలుస్తున్నాడు
దుష్టులనూ వారు చేసిన దుష్టవస్తువులనూ గూడ
ప్రభువు ద్వేషిస్తాడు
పనివానినీ వాడు చేసిన పనినీగూడ దేవుడు శిక్షిస్తాడు
అన్యమతస్తుల విగ్రహాలకు దేవుడు తీర్పు తీరుస్తాడు
అవి ఆ దేవుడు కలిగించిన సృష్టివస్తువులైనా
హేయమైన వస్తువులయ్యాయి
ప్రజలు గోతిలో పడ్డానికీ,
మూర్ఖులు బంధాల్లో చిక్కుకోడానికీ, కారణాలయ్యాయి - 14, 8-11.

కుమ్మరిచేసే బొమ్మలను విగ్రహాలుగా భావించి కొల్చేవాళ్లు మూర్ఖులు. మనకు ఉపయోగపడే కుండలను తయారుచేసే మట్టితోనే అతడు బొమ్మనుకూడచేసి దానికి దేవుడని పేరు పెడతాడు. ఒకే మట్టినుండి పగిలిపోయే కుండనూ విగ్రహాన్నీ కూడ చేసేవాడు తాను చేసేపని తప్పని గ్రహించి తీరుతాడు. ఐనా ధనాపేక్షతో అతడు విగ్రహాలు చేస్తాడు. జనులు మూర్ఖులై వాటికి మొక్కుతారు.

కుమ్మరి మెత్తని మట్టిని మలచి
మనకుపయోగపడే పరికరాలను చేస్తాడు
అతడు కొలదికాలం క్రితమే మట్టినుండి చేయబడినవాడు
కొలది కాలమయ్యాక, తనకీయబడిన ఆత్మను
తిరిగి దేవునికి ఒప్పగించవలసిన సమయం వచ్చినపుడు,
ఆ మట్టిలోనే కలసిపోతాడు
ఆలాంటివాడు ఆ మట్టినే తీసుకొని
వ్యర్ధప్రయాసతో నిరర్థకమైన దైవాన్ని మలుస్తాడు
ఆ కుమ్మరి కొలదికాలం మాత్రమే జీవించి
త్వరలోనే చనిపోయేవాడు
కాని అతడా విషయం ఏ మాత్రం తలపోయడు
అతని హృదయం బూడిదప్రోవు వంటిది,

అతని ఆశ మురికికంటె హేయమైంది,
అతని జీవితం మట్టికంటె నీచమైంగి,
అతడు క్రియాశీలకమూ ప్రాణమయమూఐన ఆత్మను
తనలోకి వూది
తన్న మలచిన దేవుని అర్థం చేసికోలేదు
అతడు నరజీవితాన్ని ఓ ఆటలా,
డబ్బు సంపాదించే అంగడిలా ఎంచాడు
దుష్టమార్గాన్ని అవలంబించైనా సరే
సొమ్ము జేసికోవాలని యెంచాడు
ఒకే మట్టినుండి విగ్రహాలనూ
పగిలిపోయే పాత్రలనుగూడ చేసేవాడు
తాను చేసే పని పాపకార్యమని
తప్పక గ్రహిస్తాడు కదా?- 15, 7-13.

విగ్రహాలు శక్తిరహితాలు. అవి కండ్లున్నా చూడలేవు. చెవులున్నా వినలేవు. కాళ్ళన్నా నడవలేవు. నరుళ్లోనైన జీవముంటుంది కాని అతడు చేసే ప్రతిమల్లో అసలు జీవమే వుండదు. కనుక వాటిని పూజించడం వ్యర్థం.

విగ్రహాలు తమ కంటితో చూడలేవు
నాసికతో గాలి పీల్చుకోలేవు
చెవులతో వినలేవు
వ్రేళ్ళతో తాకి చూడలేవు
కాళ్ళతో నడవలేవు
నరమాత్రు డొకడు వాటిని చేసాడు,
తనలోని శ్వాసను ఎరువుతెచ్చుకొన్నవా డొకడు
వాటిని మలచాడు
ఏ నరుడూ తనకు సరిసమానమైన వేల్పును చేయలేడు
మర్త్యుడు తన పాపపు చేతులతో చేసే
బొమ్మలుకూడ చచ్చినవే
నరుడు పూజించే బొమ్మలకంటె నరుడే ఘనుడు
అతనిలో నైనా జీవం వుందికాని

అతడు కొలిచే బొమ్మలు మాత్రం ఏనాడూ జీవించవు
నరులు హేయమైన మృగాలనుగూడ,
వాటిల్లోను జ్ఞానం ఏమాత్రం లేనివాటినిగూడ,
పూజిస్తారు - 15, 15–29.
కీర్తన 115, 4-8 కూడ ఇదే ధోరణిలో విగ్రహాలు శక్తిరహితాలని వాకొంటుంది

39. మూఢవిశ్వాసాలుకొందరు కలలను నమ్మి మోసపోతారు. అరుదుగా దేవుడు పంపే కలలను నమ్మవచ్చుగాని అన్ని కలలను నమ్మకూడదు. అలాగే సోదె, శకునాలు కూడ వట్టి బూటకాలు.
<poem>
మూరుడు లేనిపోని ఆశలవల్ల మోసపోతాడు
కలలవల్ల వారి ఆలోచనలు
రెక్కలు కట్టుకొని ఎగురుతాయి
స్వప్నాలను నమ్మడం నీడను పట్టుకోవడంలాంటిది
గాలిని తరమడం లాంటిది
అద్దంలో ముఖంలాగ
కలల్లో మన అనుభవాలే ప్రతిబింబిస్తాయి
కల్మషత్వంనుండి నిర్మలత్వం రాదు
నిజం కానిదానినుండి నిజమైంది రాదు
సోది, శకునాలు, కలలు నిజంకావు
అవి ప్రసవవేదనల్లో వున్న స్త్రీ వూహల్లాగ
వట్టి వూహలు మాత్రమే
సర్వోన్నతుడు పంపే కలలను నమ్మవచ్చు
కాని వట్టికలలను విశ్వసింపకూడదు
స్వప్నాలవల్ల చాలమంది అపమార్గం పట్టారు
వాటిని నమ్మి చాలమంది నిరాశ చెందారు - సీరా 34, 1-7.

ఇంకా కొందరు మంత్రవిద్యలు, అపవిత్రారాధనలు, నరబలులు, రహస్యపూజలు మొదలైనవాటికి పాల్పడతారు. ఇవన్నీ మూడాచారాలు , హేయమైన కార్యాలూ.

పూర్వం నీ పవిత్ర దేశంలో నివసించేవాళ్లు
హేయమైన కార్యాలు చేసారు గాన
నీవు వారిని అసహ్యించుకొన్నావు

వాళ్ళు మంత్రవిద్యకూ అపవిత్రారాధనకూ పాల్పడ్డారు
క్రూరబుద్ధితో తమ శిశువులనే చంపారు
ఉత్సవాల్లో నరమాంసం నరరుధిరం ఆరగించారు
రహస్యారాధనలు జరపడానికి ఉపదేశం పొంది
ఆ యారాధనల్లో తమ బిడ్డలనే బలియిచ్చారు
నీవు మా పితరుల ద్వారా వారిని నాశం చేయించావు. - సాలో జ్ఞాన 12, 3-6.

40. పాపంచేయకూడదు

నరులు బాల్యంనుండి చెడ్డవైపునకే మొగ్గుతుంటారు. కడన దేవుని తీర్పునకు గురై శిక్షను అనుభవిస్తారు. ఐనా మనం ఓ దినం చనిపోతామని ఎల్లవేళలా గుర్తుంచుకొంటే పాపం చేయడానికి జంకుతాం. సజ్జనుడు పామునుండివలె పాపంనుండి దూరంగా పారిపోవాలి. పాపం కోరలు సింహం కోరల్లాగ ప్రాణాలు తీస్తాయి.

నరులు బాల్యంనుండి చెడ్డవైపునకే మొగ్గుతారు
వాళ్లు తమ దుష్టహృదయాన్ని మార్చుకోరు
ప్రభువు కడన తీర్పుచెప్పి దుషులను శిక్షిస్తాడు
వారు తమ పాపాలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు
ఓ దినం నీవు మరణించి తీరుతావని
నీవు చేసే కార్యాలన్నిటిలోను గుర్తుంచుకో
అప్పడు నీవు ఎన్నడూ పాపం కట్టుకోవు
కుమారా! నీవీవరకే పాపం చేసివుంటే మళ్ళా చేయవద్దు
పూర్వం చేసిన తప్పులను మన్నించమని దేవుణ్ణి వేడుకో
సర్పంనుండిలాగ పాపంనుండి దూరంగా పారిపో
దాని దగ్గరికి పోయావంటే అది నిన్ను కాటువేస్తుంది
పాపం కోరలు సింహం కోరల్లాంటివి
అవి నరుల ప్రాణాలు తీస్తాయి
రెండంచుల కత్తి నయంగాని గాయాన్ని చేస్తుంది
దైవాజ్ఞమీరి చేసిన పాపంకూడ ఈలాగే చేస్తుంది. - సీరా 17, 16, 23. 7,36. 21, 1-3.

తోబీతు తన కొడుకు తోబియాకు ఈలా సలహా యిచ్చాడు. "నాయనా! నీ జీవితంలో ప్రతిదినం ప్రభువుని గుర్తుంచుకో. ఏనాడూ పాపం చేయకు. దేవుని ఆజ్ఞ మీరకు. ఎప్పడూ సత్కార్యాలే చేయి. దుష్కార్యాలు మానుకో. నీవు సత్యవర్తనుడవైతే ప్రతికార్యంలోను నీకు విజయం చేకూరుతుంది” - తోబీ 4, 5-6. ఈ వాక్యాలు మనంకూడ పాటించదగ్గవి కదా!

ప్రశ్నలు

1. విజ్ఞానం అంటే యేమిటి? బైబులు విజ్ఞానానికీ మన దేశంలో పుట్టిన విజ్ఞానానికీ తేడాయేమిటి? రోజువారి జీవితంలో విజ్ఞానం ప్రాముఖ్య మేమిటి? 2. నరులు చేసే మంచి చెడ్డలకు బహుమానమూ శిక్షా వున్నాయి - వివరించండి. 3. దానప్రాశస్త్యాన్ని తెలియజేయండి. 4. జ్ఞాన గ్రంథాలు పేర్కొనే సాంఘిక న్యాయాన్ని విశదీకరించండి. 5. విజ్ఞానాన్ని గూర్చిన ఐదంశాలను తెలియజేయండి. 6. పొదుపు, నిజాయితీ, నమ్మదగినతనం అనే మూడు నైతిక గుణాలను వివరించండి. 7. జ్ఞానగ్రంథాలు వర్ణించే దైవభక్తిని విశదీకరించండి. 8. స్నేహధర్మాలను పేర్కొనండి. 9. విజ్ఞానబోధల్లో తగిలే వివాహధర్మాలను విశదీకరించండి. 10. పెద్దలపట్ల గౌరవం జూపే తీరును తెలియజేయండి. 11. దుషులేలాంటివాళ్ళో సజ్జను లేలాంటివాళ్ళో తెలియజేయండి. 12. ఈ జీవితం అశాశ్వతం - వివరించండి. 13. మృత్యుస్మరణను విశదీకరించండి. 14 వాక్పారుష్యాన్ని వివరించండి. 15. సోమరితనాన్ని వివరించండి. 16. తిండిపోతుతనాన్ని గూర్చి తెలియజేయండి. 17. వ్యభిచారాన్నీ కామవికారాన్నీ గూర్చిన విజ్ఞాన బోధలను ఉదాహరించండి. 18. గర్వంతో పాపం ప్రారంభమైంది - వివరించండి. 19. జ్ఞానగ్రంధాలు విగ్రహాల కొలువును నిరసించిన తీరును తెలియజేయండి. 20. పాపాన్ని ఎందుకు మానుకోవాలి?