Jump to content

బాల వ్యాకరణము/సంజ్ఙా పరిచ్ఛేదము

వికీసోర్స్ నుండి


  బాల వ్యాకరణము - సంజ్ఙా పరిచ్ఛేదము

1. సంస్కృతమునకు వర్ణము లేఁబది.

2. ప్రాకృతమునకు వర్ణములు నలువది.

3. తెనుఁగునకు వర్ణములు ముప్పది యాఱు.

4. ఋ ౠ ఌ ౡ విసర్గ ఖ ఛ ఠ థ ఫ ఝ ఢ ధ భ ఙ ఞ శ లు సంస్కృత సమంబులను గూడి తెలుఁగున వ్యవహరింపబడు.

5. క చ ట త ప లు పరుషంబులని గ జ డ ద బ లు సరళంబులని చెప్పంబడు.

6. ఇతరములగు హల్లులు స్థిరములు.

7. దంత్యతాలవ్యంబులయిన చ జ లు సవర్ణంబులు.

8. ఇ ఈ ఎ ఏ లం గూడిన చ జ లు తాలవ్యంబులు.

9. అ ఆ ఉ ఊ ఒ ఓ ఔ లం గూడిన చ జ లు దంత్యంబులు.

10. సంస్కృత సమంబులం దికారాంతములయిన శబ్దముల యుపధా చ జ లు బహువచనంబు పరంబగునపుడు దంత్యము లగును.

11. నకారంబు ద్రుతంబు.

12. ద్రుతాంతములయిన పదములు ద్రుత ప్రకృతికములు.

13. ద్రుతప్రకృతులు గాని శబ్దంబులు కళలనంబడు.

14. హ్రస్వముమీఁది ఖండబిందువునకుఁ పూర్ణబిందువు వైకల్పికముగ నగును.

15. దీర్ఘముమీద సాధ్యపూర్ణము లేదు.

16. సంస్కృత సమేతరము లయిన తెలుఁగు శబ్దములయందుఁ బరుష సరళంబులకు ముందే బిందువు కానంబడుచున్నది.

17. యకారంబును వు వూ వొ వో లును దెలుఁగు మాటలకు మొదట లేవు.

18. య ర ల వ లు లఘువులని యలఘువులని ద్వివిధంబు లగు.

19. సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమంబు.

20. సంస్కృత ప్రాకృత భవంబగు భాష తత్భవంబు.

21. త్రిలింగదేశ వ్యవహార సిద్ధంబగు భాష.

22. లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యంబు.

23. ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రామ్యంబు.

హయగ్రీవాయనమః.

బాల వ్యాకరణము.

సంజ్ఞా పరిఛ్చేదము.

1. సంస్కృతమునకు వర్ణము లేఁబది.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ - - ఏ ఐ ఓ ఔ అం అః || క ఖ గ ఘ జ్న చ ఛ జ ఝ ఇన్ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ || ఇం దకారాదు లచ్చులు - కకారాదులు హల్లులు - అజ్ఝల్విభాగ మీలాగుననే మీద నెఱుంగునది.

2. ప్రాకృతమునకు వర్ణములు నలువది.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఓ అం అః || క ఖ గ ఘ చ ఛ జ ఝ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స హ ళ || కొందఱ మతంబుల హ్రస్వవక్రంబులును బ్రాకృతంబునందు గలవు. కొందఱ మతంబున వక్రతమంబులుం గలవు. ఎ ఏ ఒ ఓ లు వక్రములులని, ఐ ఔ లు వక్రతమములని ప్రాచీనులు వ్యవహరింతురు.

3. తెనుఁగునకు వర్ణములు ముప్పది యాఱు.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః || క గ చ - జ - ట డ ణ త ద న ప బ మ య ర ల వ స హ ళ. 4. ఋ ౠ ఌ ౡ విసర్గ ఖ ఛ ఠ థ ఫ ఝ ఢ ధ భ ఙ ఞ శ లు సంస్కృత సమంబులను గూడి తెలుఁగున వ్యవహరింపబడు.

ఋతువు - పితౄణము - దుఃఖము - ఖడ్గము - ఘటము - ఛత్రము - ఝరము - కంఠము - ఢక్క - రథము - ధరణి - ఫణము - భయము - ఆజ్ఞ - శరము - షండము.

5. క చ ట త ప లు పరుషంబులని గ జ డ ద బ లు సరళంబులని చెప్పంబడు.

6. ఇతరములగు హల్లులు స్థిరములు.

ఖ ఘ ఛ ఝ జ్ఞ ఠ ఢ ణ థ ధ న ఫ భ మ య ర ల వ శ ష స హ ళ.

7. దంత్యతాలవ్యంబులయిన చ జ లు సవర్ణంబులు.

తాలవ్య చకారంబు దంత్య చకారంబునకును దాలవ్య జకారంబు దంత్య జకారంబునకును గ్రాహకములని తాత్పర్యము.

8. ఇ ఈ ఎ ఏ లం గూడిన చ జ లు తాలవ్యంబులు.

చిలుక - చీమ - చెలి - చేమ; జిల - జీడి - జెఱ్ఱి - జేజ.

9. అ ఆ ఉ ఊ ఒ ఓ ఔ లం గూడిన చ జ లు దంత్యంబులు. ౘలి - ~ఛాప - ౘ్ఉక్క - ౘ్ఊపు - ౘ్ఒక్కు - ౘ్ఓటు - ౘఉక - ౙముడు - ౙఅతర - ౙ్ఉన్ను - ౙ్ఒన్న - ౙఅలి - ౙ్ఓకు. ఐదంతము లయిన చ జలు సమేతర శబ్దములందు లేవు.

10. సంస్కృత సమంబులం దికారాంతములయిన శబ్దముల యుపధా చ జ లు బహువచనంబు పరంబగునపుడు దంత్యము లగును.

ఇవి దప్ప సంస్కృత సమంబులందు దంత్య చ జలు లేవని తాత్పర్యము. ఉపధ యనగా దుదివర్ణమునకు ముందువర్ణము అర్చి-అర్చులు; రోచి-రోచులు; వీచి-వీచులు; రాజి-రాజిలు; వాజి-వాజులు. మరియు రాజుశబ్దం బొక్కటి దంత్యయుక్తంబు కానంబడియెడి. ఇతరములయిన చ జల కుదాహరణములు; చంద్రుడు - చామరము - చుక్రిక - చూర్ణము - చోరుడు - చౌర్యము - జయము - జాతి - జుగుప్స - జూటము - ఇత్యాదులు.

11. నకారంబు ద్రుతంబు.

12. ద్రుతాంతములయిన పదములు ద్రుత ప్రకృతికములు.

ఉత్తమ పురుషైకవనంబులు - భూత తద్ధర్మాద్యక్షర ప్రథమ పురుషైకవచనంబులు - ఆశీరాద్యర్థంబులయిన యెడు త వర్ణకంబులు - శతృ తుమా నంతర్య చేదాద్యర్థంకంబులు - నేను తాను పదంబులును - వలె ప్రభృతులును - ద్రుతప్రకృతికంబులు. నన్నున్ - నాచేతన్ - నాతోడన్ - నాకొఱకున్ - నావలన్ - నాకంటెన్ - నాకున్ - మాలోపలన్ - మాయందున్ - వత్తున్ - వచ్చెదన్ - వచ్చెన్ - వచ్చున్ - వచ్చెడున్ - ప్రసన్నులయ్యెడున్ - కావుతన్ - కొట్టుచున్ - కొట్టన్ - కొట్టగన్ - కొట్టుడున్ - కొట్టినన్ - వలెన్ - ఎంతయున్ - పోలెన్ - అయ్యున్ - ఇత్యాదులూహ్యంబులు.

13. ద్రుతప్రకృతులు గాని శబ్దంబులు కళలనంబడు.

రాముఁడు - రాములు - హయము - విష్ణువు - గోడ - మేడ - అయ్య - అమ్మ - రామునికయి - జ్ఞానముఁబట్తి - నాయొక్క - వచ్చిరి - వచ్చితివి - వచ్చితిరి - వచ్చితిమి - రాఁడు - రారు - రాదు - రావు - రాము - కొట్టక - తిట్టక - ఎత్తిలి - ఒత్తిలి - ఊరక - మిన్నక - బళి - అక్కట - ఏల - ఇత్యాదు లూహించునది.

14. హ్రస్వముమీఁది ఖండబిందువునకుఁ పూర్ణబిందువు వైకల్పికముగ నగును.

ఆడఁకువ - ఆడంకువ - అరఁటి - అరంటి - ఎఱుఁగుట - ఎఱుంగుట - బలఁగము - బలంగము - మగఁటిమి - మగంటిమి.

15. దీర్ఘముమీద సాధ్యపూర్ణము లేదు.

వాఁడు - వీఁడు - రాఁడు - లేఁడు - కాఁబోలు - కాఁబట్టి - గోఁగులు - రేఁగులు. 16. సంస్కృత సమేతరము లయిన తెలుఁగు శబ్దములయందుఁ బరుష సరళంబులకు ముందే బిందువు కానంబడుచున్నది.

వంకర - కలఁకువ - మంౘు - త్రాఁౘు - దంట - దాఁటు - కొంత - కోఁత ఇత్యాదు లూహ్యంబులు.

17. యకారంబును వు వూ వొ వో లును దెలుఁగు మాటలకు మొదట లేవు.

ఎవఁడు - ఎక్కడ - ఏమి - ఏల - ఉండ - ఊరు - ఒకడు - ఓడ - హరియతఁడు - నిద్రవోయె నిట్టిచోట్ల సంధి వశంబున వచ్చిన యకార వకారంబులుగాని పూర్వసిద్ధంబులు గావు. వోఢృ వోఢవ్య శబ్దములు దప్ప సంస్కృత సమంబులందు సహితము వు వూ వొ వో వర్ణాదులగు శబ్దంబులు లేవని యెఱుంగునది. ఉదకము - ఊర్మిక - ఓదనము.

18. య ర ల వ లు లఘువులని యలఘువులని ద్వివిధంబు లగు.

హరియతఁడు ఇత్యాదులం దాగమ యకారము లఘువు, తక్కిన యకారమలఘువు. విఱుగు, మెఱు గిత్యాదులందు రేఫంబలఘువు. ఇదే శకటరేఫమని చెప్పబడును. శకట రేఫము తత్సమ తద్భవములందు లేదు. పెరుఁగు కరు గిత్యాదులందు రేఫంబు లఘువు. ఏళులు పాళులు త్రాళులని బహుత్వమందు రలడల కాదేశ మయిన ళకార మలఘువు. తల, నెల యిత్యాదు లందలి లకారము లఘువు. వర్ణ సమామ్నాయమందలి ళ కారము వర్ణాంతరముగాని యలఘు ళ కారము గాదని యెఱుంగునది. అతఁడు వలికె నిత్యాదులందున్న పాదేశవకారము లఘువు. తక్కిన వకార మలఘువు.

19. సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమంబు.

సంస్కృతము సంస్కృతసమము

రామః ... రాముఁడు

విద్యా ... విద్య

హరిః ... హరి

ధేనుః ... ధేనువు

భూః ... భువి

పితా ... పిత

గౌః ... గోవు

నౌః ... నావ

దౌః ... దివి

హృద్‌ ... హృది

జగత్‌ ... జగత్తు, జగము

ఇత్యాదు లూహ్యంబులు.

సంస్కృతము ప్రాకృతము ప్రాకృతసమము

అగ్నిః ... అగ్గీ ... అగ్గి

ఆటిః ... ఆడీ ... ఆడి ఆలిః పఙ్క్తౌ ... ఓలీ ... ఓలి

కటుః ... కారో ... కారము

గౌరవమ్‌ ... గారవం ... గారవము

జటా ... జడా ... ౙడ

మిరా ... మేరా ... మేర

యమః ... జమో ... ౙముఁడు

రాజ్ఞీః ... రాణీ ... రాణి

శృఙ్గారః ... సింగారో ... సింగారము

శ్రీః ... సిరీ ... సిరి

ఇత్యాదు లెఱుంగునది.

20. సంస్కృత ప్రాకృత భవంబగు భాష తత్భవంబు.

సంస్కృతము. సంస్కృతభవము.

ఆకాశః ... ఆకసము

కుడ్యమ్‌ ... గోడ

చన్ద్రః ... ౘందురుడు

తమఙ్గః ... తమగము

తామరసమ్‌ ... తామర

నారాచః ... నారసము నిభః ... నెపము, నెవము

ముఖమ్‌ ... మొకము, మొగము

మృగః ... మెకము, మెగము

వక్రః ... వంకర

వేసరః ... వేసడము

సముద్రః ... సముద్రము

సూచీ ... సూది

స్మరః ... మరుఁడు

హరిణమ్‌ ... ఆరణము

హరితాళమ్‌ ... హరిదళము


ఇత్యాదులు గ్రహించునది.


సంస్కృతము ప్రాకృతము ప్రాకృతభవము

అఙ్గారః ... ఇంగాలో ... ఇంగలము

అప్సరా ... అచ్చరా ... అౘ్చర

ఆశ్చర్యమ్‌ ... అచ్చేరం ... అచ్చెరువు

పఞ్చాశత్‌ ... పణ్ణాసా ... పనస

పృథివీ ... పుఢవీ ... పుడమి

ప్రయాణమ్‌ ... పయాణం ... పయనము ప్రవాళః ... పవాళో ... పవడము, పగడము

మత్సరః ... మచ్చరో ... మౘ్చరము

యజ్ఞః ... జణ్ణో ... ౙన్నము

లక్ష్మీః ... లచ్చీ ... లచ్చి

విష్ణుః ... విణ్ణూ ... వెన్నుఁడు

వైద్యః ... వెజ్జో ... వెౙ్జు

స్తమ్భః .... ఖంభో ... కంబము

స్థూలమ్‌ ... థోరం ... తోరము

ఇత్యాదులు తెలియునది.

21. త్రిలింగదేశ వ్యవహార సిద్ధంబగు భాష.

ఊరు, పేరు, ముల్లు, ఇల్లు, కోట, పేట, దూడ, మేడ, కోఁత, లేఁత, తావి, మోవి - ఇత్యాదులరయునది.

22. లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యంబు.

వస్తాఁడు, తెస్తాఁడు, వచ్చేని, తెచ్చేని, వచ్చేవాఁడు, తెచ్చేవాఁడు, వచ్చేటివాఁడు, తెచ్చేటివాఁడు ఈ భాష ప్రయోగంబున కనర్హంబు.

23. ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రామ్యంబు. పెద్దలు వ్యవహరించిన మాట గ్రామ్యంబయిన గ్రహింపఁదగునని తాత్పర్యము. కఱకంఠుఁడు, ప్రాణగొడ్డము, జీవగఱ్ఱ, కపిలకన్నులు, కపిల గడ్డము, కపిలజడలు.

ఇది సంజ్ఞాపరిచ్ఛేదము.


సంధి పరిచ్ఛేదము.


1. ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధి యగు.

పూర్వపరస్వరంబులకుం బరస్వరం బేకాదేశంబగుట సంధి యనఁబడు.

రాముఁడు ... అతఁడు ... రాముఁడతఁడు.

సోముఁడు ... ఇతఁడు ... సోముఁడితఁడు.

మనము ... ఉంటిమి ... మనముంటిమి.

అతఁడు ... ఎక్కడ ... అతఁడెక్కడ.

ఇతఁడు ... ఒకఁడు ...ఇతఁడొకఁడు.


2. ప్రధమేతర విభక్తి శత్రర్థ చువర్ణంబు లందున్న యుకారమునకు సంధి వైకల్పికముగా నగును.

నన్ను + అడిగె = నన్నడగె, నన్నునడిగె.

నాకొఱకున్‌ + ఇచ్చె = నాకొఱకిచ్చె, నాకొఱకునిచ్చె.