Jump to content

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/ఆఱవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

ఆఱవ అధ్యాయము

యూరపియనులు హిందూదేశమునకు వచ్చుట

(1)

తురుష్కులులు
కౌన్ స్టాంటి
నోపిలును
వశపరచు
కొనుట,

పదుమూడవ శతాబ్దమున ముసల్మానులలో ఆటోమా ను తురుష్కులు ప్రాముఖ్యమును వహించిరి. వారి నాయకులు 1398 సంవత్సరమున సర్బియాను జయించి , యూరపుఖండములో స్థావర మేర్పజచు కొనిరి. 1453 సంవత్సరమున ముసల్మాను సుల్తానగు" రెండవ మహమ్మదు కాన్ స్టాంటినోపిలు పై దండె త్తెను. "కాన్ స్టాంటి నోపిలు 4 వ క్రైస్తవ మత యుద్ధమునాటి :

నుండియు బలహీనముగ నుండుట చూచియున్నాము. అపుడు.

61

ఆఱవ అధ్యాయము

కాన్ స్టాంటినోపిలును కాన్ స్టాంటైను అను చక్రవర్తి పాలించు చుండెను. తురుష్కులు లక్ష యేబది వేలమంది సైనికులతో ముట్టడి సలిపిరి, కాస్ స్టాంటైను చక్రవర్తియొద్ద పది వేలకన్న సైన్యము లేదు. ముసల్మానులు ఫిరంగులతో గోడలను పడ గొట్టి పట్టణములో ప్రవేశించిరి. మే 29 వ తేదిన యుద్ధములో కాన్ స్టాంటైను చక్రవర్తి మరణించెను. కాస్ స్టాంటినోపిలు తురుష్కులవశ మయ్యెను. అచటి 'సెంటుసోఫియా యను క్రైస్తవ దేవాలయము స్వాదీనము చేసి కొని దానిలో ముస స్మాసులు మహమ్మదీయ మత ప్రకారము ప్రార్థనలు సలిపిరి.

2

యూరపులో నవీన
యుగ ప్రారంభము.

పదు నేనవ శతాబ్దముతో మధ్యమయుగము ముగిసి యూరపుఖండమున నవీన యుగము ప్రారంభ మయినదని చరి త్రకారులు వ్రాసియున్నారు. ఆ శతాబ్దములో యూరపుఖండములోని అన్ని దేశములలోను 'ద్యావ్యాపకము బాగుగా జరిగెను. అచ్చు వేయుట కని పెట్ట డినది. ఒక్కొక్క గ్రంథమునకు ఎన్ని వేలపతులై నను, బహు తేలికగసు త్వరితముగను అచ్చువలన తయారు చేయుటకు వీల మ్యెను. ఇది జ్నానవ్యాపకమునకు మిగుల తోడ్పడినది. ప్రాచిన నాగరికత కాలవాలమగు గీసు దేశము' ముసల్మాలచే జయించబడుటవలన నాదేశములోని చాలమంది పండితులు, తత్వశాస్త్రజ్ఞులను ముసల్మానుల పాలనము క్రింద నుండుటకిష్టము లేక ఫ్రాన్సు, జర్మనీ, ఇంగ్లాండు,

స్పెయిన్ మొదలగు క్రైస్తవ దేశముల కనేక ప్రాచీన
62

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

గ్రీకుగ్రంధ రాజములతో కూడ వెళ్లి పాఠశాలలను స్థాపించిరి. కళాశాలలలో కొంద రాచార్యత్వమును వహించిరి, యూరపు ఖండములోని చాల దేశములలో ప్రాచీన గ్రీకుల యొక్క విజ్ఞాన ముసు పఠించసాగిరి. క్రీస్తు పుట్టక పూర్వము గ్రీసు దేశములో ప్రాచీన హిందూ దేశము లోవలె, స్వతంత్ర మైన భావములలో నిండిన వాజ్మయము, నాగరికత, ప్రకృతి శాస్త్రములు ప్రబలి యుండెను, క్రస్తవమతము వచ్చినతర్వాత మతగురువుల ప్రాబల్య మధిక మై స్వతంత్ర భాపములను నిర్మూలింప జేసిరి. ప్రకృతిశాస్త్రములు సైతానుయొక్క విద్యయని క్రైస్తవమత గురువులు నిరుత్సాహపరచిరి. గొప్ప ప్రకృతి శాస్త్రజ్ఞులను మతగురువులు కారాగృహములలో పడ వేయించిరి. మతగురు వుల ఆధిక్యతకింద మధ్య మయుగములో యూరపుఖండము మూఢ మైన నమ్మికలలోను, అంధ కారములోను మునిగియుండె ను. పదు నేనవ శతాబ్దములో ప్రాచీన గ్రీకుల నాగరికత, విజ్ఞాన ము వ్యాపించిన కొలదీయు యూరఫుఖండమునకు మానసిక వికా సము కలిగెను. మూఢవిశ్వాసములు కొంతవరకు తొలగ నారంభించెను. హేతువాదన, యథార్థమును కనుగొనవలెనను సంకల్పము కలిగెను. మత స్వేచ్ఛను, క్రైస్తవమతములో సం స్కరణమును కొందరు వాంఛించిరి. ప్రకృతి శాస్త్ర శోధనలు ప్రారంభమయ్యెను. స్వాతం త్రాంకురములు మొలకలెత్తసా గెను. పదు నేనవ శతాబ్దమున నిటలీ దేశమున సుప్రసిద్ధులగు

చిత్రలేఖకులు బయలు దేరి కళలకును, చిత్తరువులకును, రంగులు
63

ఆఱవ ఆధ్యాయము

వేయుటకును నూతనజీవమును కలుగ జేసిరి. వీరిలో ముఖ్యులు మెకల్ యేంజిలో, రాఫేల్ లు.

(3)

హిందూ దేశమునకు
త్రోవలయత్నము

అదివర కనేక శతాబ్దముల నుండియు యూరఫు ఖండము నకు ఆసియూఖండము తో వర్తకము సాగుచుండెను. హిందూ దేశములో, చైనా దేశములో తయారుచేయబడిన దూది, ఉన్ని, పట్టు వస్త్రములును,నితర పారిశ్రామిక సరుకులును యూరపు ఖండములోని వివిధ దేశములకు నెగుమతి యగుచుండెను. ఆసియూ మైనరు, ఈ కోల్డు బాల్కన్ రాష్ట్రములు, గ్రీసుదేశముల గుండ నీసరు కులు యూరపునకు రవాణా యగుచుండెను. తురుష్కు లీప్రదే శముల నన్నిటిని స్వాధీనమును పొందినత ర్వాత క్రైస్తవులగు యూరపు దేశములవారికి తమ శత్రువులగు ముసల్మాను రాజ్యముగూడ వ్యాపారము సాగించుట దుర్భరమయ్యెను. తురుష్క సుల్తానుగారి యనుగ్రహమ పొందుట కష్టతర మయ్యేను. కావున ఆసియాఖండములోని తూర్పు ప్రాంతము నకు, ముఖ్యముగా హిందూ దేశమునకు సముద్రములమీద ప్రయాణము చేయుటకు తోవలు కని పెట్టుట , యూరపు లోని వివిధ దేశములవారును యత్నములు సలిపిరి. ఆకాల మున హిందూ దేశము వ్యవసాయమునకును, పరిశ్రమలకును, కళలకును, శాస్త్రములకును, వర్తక వ్యాపారములకును, నాగరి కతకును ప్రసిద్ధి చెంది మిగుల నైశ్వర్యవంతమైనదై లోకము

లో కెల్ల సగ్రస్థానము వహించియున్నది. “భూతల స్వర్గ"మని
64

ప్రెంచి స్వాతంత్ర్యవిజయము

యెంచబడినట్టియు, "సువర్ణమయ " మైనట్టియు, "రత్నగర్భ" ఆయినట్టియు, "వరహాల వృక్షములు" కలిగినట్టియు హిందూ దేశముతో వర్తకము చేసికొనుట గొప్ప మదృష్టమని యూర' పునాను భావించిరి. హిందూదేశము యొక్క చెప్పనలవిగాని యైశ్వర్యయు యూరపియ జతుల నాకర్షించినది, ఎటులైన హిందూ దేశమునకు నూతనమైన తోవలు కనుగొనవ లేనని యూర పుజాతులవారు గొప్ప ప్రయత్నములను చేసిరి. హిందూ దేశమును దరిద్రస్థితి నుండి బాగు చేయుటకుగాని, అనాగరిక స్థితినండి యుద్ధరించుటకుగాని ఈదేశ మునకు యూరపుఖండవాసులు రాలేదు. తేమకన్న ఎక్కువ నాగరికతను చెంది . మిగుల భాగ్యవంతముగనున్న యీ దేశముతో వ్యాపారము చేసికొని, తాము బాగుపడి, తమ దేశములకు సొమ్ము తీసికొ నిపోవుటకయియే యూరపియను ( తెల్లవార) లిచటికి విచ్చే సిరి. ఇప్పుడు హిందూదేశము లోకములో కెల్ల దరిద్ర వంతమై నదై క్షామ దేవతకు శాశ్వతనివాసమైనది. పరిశ్రమలన్నియు నశించినవి. కళలు రూపుమాసినవి. పౌరుషము పూజ్యమైనది . ప్రకృతి శాస్త్రములు మంటగలిసినవి. విజ్ఞానము అడుగంటినది. హిందూ దేశీయులు ప్రపంచములో ప్రతిచోటను నీచముగ చూడబడుచున్నారు. హిందూ దేశము యొక్క "ఐశ్వర్యము,”

“రత్నములు, " "సువర్ణము," వరహాలు" విదేశీయుల పాలైనవి. 65

ఆఱవ ఆధ్యాయము

ఆఫ్రికాను
కనుగ"గుట

సముద్రముల మీద ఆసియాకు చేరుటకు తోవలకై తెల్లజాతులవారు ఆరు వైపుల నుండి వెదకిరి. హెన్రీరాకుమారుని నాయకత్వము క్రింద పోర్చుగీసు వారు ఆఫ్రికా ఖండము యొక్క పశ్చిమ తీరమున దక్షిణముగ చాలవరకు ప్రయాణము చేసిరి. కొంచెము కొంచెముగా అప్రికా ఖండము యొక్క సంగతి వీరికి తెలియ సాగెను. తదకు 1483 సం||మున డయ్యజు అనువాడు ఆఫ్రికాఖండము నకు దక్షిణాగ్రమున సున్న గుడ్ హోఫ్ అగ్రమును చేరెను. ఇం కను ఆపైన కనుగొనవలసినది చాలగలదని తెలిసికొని వెనుకకు వెళ్ళెను.

అమెరికాను
కనుగొనుట

ఇటలీలోని జినోవాకాపురస్థుడగు కిష్టపరు కొలం' బసు సూటిగ అట్లాంటికు మహా సముద్రముగుండ పడమరగా ప్రయాణము చేసినచో ఆసియాకు చేరవచ్చు నని నిశ్చయించెను. భూమి గుండ్రముగా నున్న దని కొలంబసునకు తెలియును. కాని యూరపు ఖండమునుండి, పడమరగా పోయినచో ఆసీయాకును యూరఫునకును మధ్య అమెరికా యున్నదని అప్పటి కెవరికిని తెలియదు. కొలంబసు, చాలమార్లు అట్లాంటికు మహాసముద్రములో ప్రయాణము చేసి కొంతదూరము పోయి తిరిగి వచ్చుచుండెను. ఒకసారి ఐస్ లాండు ద్వీపమును జేరి మరలివచ్చెను. ఇతనియొద్ద దూర ప్రయాణము చేయుటకు ద్రవ్యము లేక చాలకాల మాగవలసి వచ్చెను. తునకు స్పెయిను దేశములోని రాజపోషణవలనను,కొం

దరు వర్తకులసహాయము వలనను 1492 వ సంవత్సరమున కొలం
66

ప్రెంచిస్వాతంత్ర్య విజయము

బసు మూడునౌకల తోడను, ఎనుబది యెనిమిది మంది సహచరుల తోడను బయలు దేరి అట్లాంటికు మహాసముద్రమున సూటిగా, పడమరగా రెండు నెలల తొమ్మిదిరోజు లొకే వైపున నడిసము ద్రములో ప్రయాణము చేసి అక్టోబరు 12 తేది యుదయమున స్పెయిన్ ప్రభుత్వపు పతాకములతో నొక నూతన ప్రపంచమున దిగెను. కాని అది హిందూదేశమువలె లేదు. హిందూదేశము సుగూర్చి తాను వినిన లక్షణము లేవియు సచట కానరావు. తాను దిగినది ద్వీపములు. అక్కడ మోటువారు నివసించి యుండిరి. హిందూ దేశములో నున్నటుల ఉత్కృష్టమగు నాగ రికతచెందిన ప్రజ లచట లేరు. కావున నీ నూతనపు దేశము నకు పశ్చిమయిండియా ద్వీపములని పేరిడెను. అచటి ప్రజలు తామ్రవర్ణము గలవారు. వారికి నెర్రయిండియనులని పేరు వచ్చెను. ఇండియా (భరతపర్షము) కొరకు అన్వేషించుటలో నీప్రదేశ ముసకు చేరుటవలన దీనికి పశ్చిమఇండియా అనియు, ఇచటి ప్రజలకు నెర్రయిండియనులనియు పేర్లు పెట్టబడెను. కొలంబసు ఆ ద్వీపములను స్పెయిన్ రాజు నకు ప్రతినిధిగా పాలిం చెను. ఇదియే అమెరికాఖండమునకు ప్రథమమున యూరపు ఖండవాసులు చేరుట. పశ్చిమ ఇండియాద్వీపములు అమెరికా ఖండములో చేరిన ద్వీపములు. స్పెయిన్ దేశమునుండి అనేకు లీద్వీపములలోనే గాక అమెరికాఖండమునకును పలసవచ్చి నివసించిరి. అమెరికా యొక్క నూతన భాగములలో చేరుచు

నాక్రమించుచు వచ్చిరి,

67

అఱవ అధ్యాయము

హిందూ దేశము
చేరుట

ఇంతలో పోర్చుగీసువాడగు వాస్కోడ గామా 1498 వ సంవత్సరమున ఆఫ్రికాఖండము యొక్క దక్షిణ భాగమును చుట్టి హిందూ దేశములోని పశ్చిమతీర మనసున్న కళ్ళికోట చేరెను. ఈప్టు కుత్తరమున సూయజు కాలువ తవ్వబడు వరకును యూర పుఖండమునుండి ఆసి.కూకు వచ్చుటకు ఆఫ్రికా ఖండమును చుట్టివచ్చుటయే ప్రధానమైన త్రోవగ నుండెను.


ఆసియాను చేరుటకు ఇంకను కొన్ని త్రోవలు కనుగొను టకు మరికొందరు ప్రయత్నించిరి. రుష్యాలోని యుత్తరభాగ ముగుండ ఆసియా యొక్క యుత్తర భాగము చేరుటకు యత్నిం చిరి. ఇది అతిశీతల ప్రదేశమై మచుగడ్డలతో కప్పబడి ప్రయో, కారి కాలేదు. కొందరు ఉత్తర అమెరికాకు పడమరగా బయలు దేరి కొంతవర కువచ్చి మరలిపోయిరి. ఇతరులు దక్షిణ అమెరికా నుండియు, మరికొందరు పనామా జలసంధి గుండను పోవ యత్నించిరి. ఈ ప్రయత్నములు జయప్రదములు కాకపోయినను ఆఫ్రికా అమెరికా ఖండములలో చాలభాగము యూరపియను జాతులకు బాగుగా తెలిసెను. పదునారవ శతా బ్దాంతమువరకును ఆస్ట్రేలియా తప్ప మిగిలిన అన్ని ఖండము లును యూరపియునులకు తెలిసెను.

4

యూరపియను
జాతులు
వ్యాపకము

.

యూరపియనుజాతులలో నూతనప్రదేశములను కనుగొనుటలోను, ఆక్రమించుటలోను వర్తకము చేసికొను టలోను ముందంజ వేసినవారు స్పెయిను వారును,పో ర్చుగీసు వారును. వర్తకలాభము కొరకును, రాజ్య

స్థాపనకొరకును వీరుభయులలో పోరాటములు కలి
68

ప్రెంచిస్వౌతంత్ర్యవిజయము

గెను. ప్రధాన క్రై స్తవ మతాచార్యుడగు పోపు ఒక కాగితము మీద గీతగీచి అమెరికాలోని కేపు వర్డీ లంక లకు పశ్చిమమంత. యు 'స్పెయిస్" వానికి, తూర్పుగనున్న ప్రపంచమం తయు పోర్చు. గలు వారికిని పఁంచి యిచ్చెసు. అమెరికా ఆఫ్రికాఖండములు కనుగొనబడినవి. ఆసియా ఖండముతో సులభముగ వర్తకము. చేయుటకు త్రోవలు కనుగొనబడినవి. ఆసియాలోని స్వదేశ రాజుల నాశ్రయించి కొన్ని సముద్ర రేవులలో గిడ్డంగులు కట్టుకొని వ్యాపారము సాగించు చుండిరి. ఆసియాఖండముతో వర్తకముపలన చాలలాభము వచ్చుచుండెను. అమెరికా శీతోష్ణస్థితి యూరపియనులకు మిగుల అనుకూలముగ నుండెను. అమెరికాలోని భూములు, గనులు, అడవులు వీరి వశ మయ్యెను.. అక్కడ అడ్డు లేక వీరు దేశము నాక్రమించుచుండిరి. అనే కులు వలస వెళ్ళి సౌఖ్యముగా నివసించుచుండి. బంగారము తోడను, మేలయిన సరకులతోడను నిండిన పడవలతో తమ. దేశములకు వచ్చుచుండిరి. ఆఫ్రికాఖండములోని నల్లజాతుల. వారిని పట్టుకొని బానిసలుగా విక్రయించుచు, బానిసవ్యాపా' రమువలన చాల దవ్యమును సంపాదించు చుండిరి. ఇటుల స్పె యిను వారుసు పోర్చుగీసువారును ముందు ప్రారంభించగ వారి యైశ్వర్యాభివృద్ధిని చూచి యేబదిసంవత్సరములలోపలనే, డచ్చివారును, పరాసువారును, ఆంగ్లేయులును, నింక నితర యూరపియన జాతుల వారందరును బయలు దేరి వారి మార్గ ములనే యనలంబించిరి. పోపు గీచిన కాగితపు పంపిణీని గౌరవిం

చినవా రెవరును లేరు. ఆసియాఖ:డముతో జరుగు వర్తక

69

ఆఱవ అధ్యాయము

లాభముకొరకును, సముద్రములమీద ప్రయాణము చేయుట కు తోవల కొరకును, అమెరికా, ఆఫ్రికాఖండముల ఆక్రమణ కొరకును వివిధ యూరవుజాతుల వారికిని పోటీలుగలిగి అనేక యుద్ధములు జరిగినవి. ఈ యుద్ధములలో నోడిపోయినవారి కీనూతనఖండములను కని పెట్టుట వలన కలిగే లాభములలో లెక్కువగా లభించెను. గెలిచిన వారి కెక్కు వగ లభించెను. వీటి మధ్య సైనిక బలముతప్ప ధర్మనిర్ణయము చేయుటకు వేరు ఉపొ యము లేదయ్యేను. ఆమెరికా ఆప్రికా ఖండములు పూర్తిగా యూరి పియసు జూతులచే నాక్రమింపబడినవి. ఆఫ్రికాలో నుత్తరమున నాగరికతను చెందిన ముసల్మాసుప్రజలు గలరు. వీరుగూడ స్వతంత్రమును కోల్పోయి యూరపియను జాతులచే పాలించబముచున్నారు. ఇదిగాక మిగిలిన యావత్తు ఆఫ్రికాఖండ ములోను, యావత్తు అమెరికా ఖండములోను యూరపియను ‘జాతులు వలసవచ్చి కాపురముండిరి. ఆప్రదేశములలో నది వరకు నివసించుచుండిన నల్లజాతులు చాలవరకు యూరపియ సులచే నాశనము చేయబడిరి. చావగ మిగిలిన కొద్దిమందిని యూరపియనులు తమకింద బానిసలుగ చేసికొనిరి. పందొ మ్మిదవ శతాబ్దమున బానిసత్వము రద్దుపరచబడెను. అటుత రువాత నీ నల్లవారు యూరపియనుల వ్యవసాయక భూముల లోను, తేయాకు, కాఫీ, రబ్బరు, చెఱకుతోటలలోను, గనుల లోను పనిచేయు కూలీలుగ సున్నారు. ప్రపంచము యొక్క వర్తక మంతయు క్రమముగా యూరపియనులవశ మయినది.

యూరపుఖండములో తయారగు సరకులు ప్రపుచములోని దుకా
70

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ణములను నింపి వేయుచున్నవి. ఆసియా ఖండములోని బౌద్ధ దేశ ములు స్వతంత్రమును గోల్పోవక నిలిచి యున్నవి. ముసల్మా సుదేశములు చాలకాలము స్వతంత్రముగ వున్న విగాని 1919 వ సంవత్సరములో జరిగిన సంధివలన ముసల్మాను. దేశములలో కొన్ని యూరపియసుల యాజమాన్యము కిందికి వచ్చి. స్వాతంత్ర్యము కొఱకై పోరాడు చున్నవి. ఆసియాలోని మధ్య దేశమగు హిందూ దేశ ము మాత్రము మొగలాయిరాజ్య మస్తమించగనే కలిగిన అరాజకమువలన యూరపియనుల పాలనము క్రిందికి వచ్చినది. కొలదినంవత్సర ములనుండియు మేల్కొని స్వరాజ్యమునకై కృషి సలుపుచున్న ది. ఆఫ్రికా దేశ ములోని ఈజిప్టు దేశము కూడ తెల్లవారి ప్రభుత్వమునుండి స్వాతంత్ర్యమును బొందుటకు ప్రయత్నించి కొంతవరకు జయమును బొందినది.