Jump to content

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/ఏడవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

ఏడవ అధ్యాయము

ప్రొటెస్టెంటు మతస్థాపనము


(1)

రాజు యొక్క అధికారము,

"ఫ్రాన్సు దేశ వు రాజగు పదునొకండవ లూయిరాజు క్రింద పట్టణములు వృద్ధియయ్యెను. పరిశ్రమలు హెచ్చి ధనము అధిక మయ్యెను. అచ్చువే వేయుటను రాజు ప్రో త్సహించెను. విద్య వ్యాపించెను. తెలివిగలి గినట్టి యు, స్వతంత జీవనములు కలిగి నట్టియు మధ్యమతరగతి ప్రజా సంఘము వృద్ధి చెందెసు. వీరు ప్రభువుల యధికారమునందు వి. ముఖులై రాజు యొక్క అధికారవృద్ధికి తోడ్పడిరి. రాష్ట్రము . లన్నిటిలోను రాజు యొక్క అధి కారము క్రింద న్యాయస్థానములు స్థాపించబడెను. ప్రజలందరును వీనిలో తమ కష్టములను చెప్పు

కొనవచ్చునను ఆచారము ఏర్పడెను. 72

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ఆటలీలో
యుద్ధములు

పదునొకొండవ లూయి తరువాత 8వ హేన్రీ రాజ్యము నకు వచ్చెను. అప్పుడు ఇటలీ దేశములోనున్న రాష్ట్రములు తమ లో తాము పోరాడుచు, నొక రాష్ట్రము వారు , ఫ్రెంచి రాజు యొక్క సహాయమును కోరిరి. ఎనిమిదవ హెన్రీ ఫ్రెంచి సేనలతో ఇటలీ దేశము పై దండెత్తి కొన్ని రాష్ట్రముల నాక్రమించెను. "ఫ్రెంచివారు బలవంతుల గుట కిష్టము లేక ఫ్రాస్సుకు వ్యతిరేకముగ స్పెయిన్ దేశపురా జును, ఆస్ట్రియాచకవ ర్తియు బయలు దేరి వచ్చిరి. ఫ్రాన్సు రాజు లగు ఎనిమిదవ 'హెన్రీ, పండ్రెండవలూయి, "మొదటి ఫ్రాన్సిసు రాజుల కాలమున ఇటలీలో ఫ్రాన్సుకును, ఆస్ట్రియా చక్రప ర్తికనీ, స్పెయిన్ రాజునకును యుద్ధములు జరిగెను. కొన్ని జయము లపుడపుడు పొందినను ఫ్రెంచి రాజులే మొత్తముమీద నోడి పోయిరి. 1494 మొదలు 1550 సంవత్సరమువరకు నియు ములు కొద్ది విరామములతో జరుగుచుండెను. 1518 వ సంవ త్సరమున పరాసుదేశములో ఇంగ్లీషువారికుండిన "కలే" -పట్టణమును ఫ్రెంచివారు లాగికొనినిరి. 1559 వ సంవత్సరమున ఇటలీలోని యుద్ధములు కాటు కేంబ్రాసిసు సంధి వలన ముగి సెను. ఇందువలన ఫ్రాన్సునకు ఈశాన్యమునసున్న మెట్టు, టూలు, వర్ధ ప్రాంతములు వశము చేయబడెను. ఇటలీ దే శము విదేశీయుల పాలనము క్రిందికి వచ్చెసు. స్పెయిన్ రాజుకు ఇటలీలోని కొన్ని ముఖ్య రాష్ట్రములు స్వాధీనమయ్యెను. కాని స్పెయిన్ కును, ఫ్రాన్సుకును మధ్య శాంతి కుదుర లేదు. రెండు వందల సంవత్సరములవరకును. స్పెయిన్ ఫ్రాస్సు దేశములు

కలహించుచునే యుండెను.

73

ఏడవ అధ్యాయము

(2)

ప్రొటెస్టెంటు
మతస్థాపన,

మహామహుడగు మార్టిను లూథరు జర్మనీలో ప్రొట స్టెంటు మతమును స్థాపించెను. యూరపుఖండములోని క్రైస్త వమతమున కంతకును రోములోనున్న పోపు ప్రథాన మతాచార్యుడుగా నుండెను. పోపు లేమి, మతగురువు లేమి శాశ్వత బ్రహ్మచారులుగా నుండిరి. పోపులలో కొంద రింద్రియవ్య సనములలో చిక్కి మిగుల అవినీతిపరు లుగ నుండిరి. తమ బంధువులకు విశేషముగ సహాయము చేయుచుండిరి. 1517 సంవత్సరమున పోపు పదియవలియో రోములో నొక గొప్ప దేవా యము కట్టించుచుండెను. దానికి సొమ్ము కావలసియుండెను. పోపు, పాపములు క్షమించబడె ననియు, స్వ ర్గద్వారములు తెరువబడుననియు వ్రాసి దస్కతు చేసి కాగితములు అమ్మకమునకై పంపెను. జర్మనీలో నీపాప క్షమాపణటిక్కెట్ల సమ్ముచుండగా మార్టిన్ లూథరను జర్మన్ సర్వక ళాశాలలోని పండితు డాక్షేపించి ఖండినమును వ్రాసె సు. ఈటిక్కెట్లు కొనినవారు ఎట్టిపాపములు చేసినను నరక భయము లేదని భావించసాగిరి. ఇట్టి అవినీతికరమైన మూఢాభి ప్రాయములను ప్రజలలో వ్యాపింప జేయుట పోపు యొక్క గొప్పతప్పిదమని వ్రాసెను. అప్పటికి క్రైస్తవమతములో ప్రబలి యున్న ఇంకను కొన్ని మూఢ నమ్మకములను, మతగురువులలో ప్రబలియున్న అవినీతివికూడ మార్టిన్ లూథరు ఖండించెను, పోపు మార్టిన్ లూథరును క్రైస్తవమతము నుండి వెలివేసెను.

పోపు పంపిన బహిష్కారపత్రికను . లూథను తగులబెట్టెను,
74

ప్రెంచి స్వాతంత్ర్య విజయము


లూథరు పోవు యొక్క అధికారముసు తిరస్కారము చేసి క్రైస్త వమతములో సంస్కారమును బోధింప సాగెను. క్రైస్తవ వేద మగుబైబిలును జర్మను భాషలోనికి తర్జుమా చేసెను. అదివరకు దానిని లాటిన్ భాషలోనే ఉంచవలెననియు, ప్రజలు చదువు. టకు హక్కు లేదనియు నను నమ్మికలు వ్యాపించియుండెను. మత గురువులు మాత్రమే చదివి ప్రజలకు నర్థమును, వ్యాఖ్యాన మును చెప్పుచుండిరి. లూథరు బైబిలును ప్రజలభాష లోనికి మార్చి ప్రతివారుసు దానిని స్వయముగా చదువు కొనవచ్చునని ప్రకటించెను. జర్మసుప్రజలు విదేశీయులగు పోపుల యొక్క అధికారమును తోసి వేసి తమ యిచ్చవచ్చిన యోగ్యతగలగురువుల నెన్నుకొనవ లెసని బోధించెను. గురు వులు వివాహమాడవచ్చునని శాసించెను. బైబిలులోనున్న వాఖ్యములే ప్రమాణములుగాని పోవులు వ్రాసినగంథము లును, వారు జారీ చేసినయుత్తరువులును ప్రమాణములు కావని చెప్పెను, విగ్రహారాధన బైబిలుకు వ్యతిరేక మని ఖండించెను. ఈ బోధలు జర్మనీలో దేశాభిమానముసు. స్వాతం త్వేచ్ఛను పురిగొలిపెను,మూఢవిశ్వాసములను బంధనములను తెంచి వైచి ఆత్మస్వాతంత్యమును స్థాపించెను. అనేకులు మార్టీన్ లూథరు యొక్క ప్రొ సెంటుమతమును స్వీకరించుచువచ్చిరి. ఆవుడు జర్మను రాష్ట్రములను నిరంకుశముగ పాలించుచున్న అయిదవ చార్లెసుచక్రవర్తి కీనూతన మత సంస్కరణమును, స్వతంత్ర భావవ్యాపకమును కంటకముగ నుండెను, మార్టిన్ లూథరును చంప యత్నించెను. లూథరు చాలకాలము తన స్నేహితులగు

ఏడవ ఆధ్యాయము

3

జర్మనీలోని శాక్సనీ రాష్ట్రాధిపతి
యొక్క రక్షణార్థము దాగుకొనెను.

ఇంతటి నుండియు క్రైస్తవమతములో రెండు శాఖ లేర్ప డెను. పాత దానికి రోమన్ కాథలిక్కు మతమనియు, నూతన సంస్కరణమునకు ప్రొటస్టెంటు ముత మనియు బేరువ చ్చెను. 1542 వ సంవత్సరమున చార్లెసు రాజు స్పెయిన్ దేశములో ప్రారంభమున ఇన్ క్విజిషన్" అని మతవిచారణ శాఖ నేర్ప రచెను. ఇట్టి మతవిచారణ శాఖలు పోపు యొక్క యుత్తర్వుల ప్రకారము రోమను కాథలిక్కు దేశములన్నిటిలో స్థాపించబ డెను. ప్రొటెస్టెంటులను విచారణ చేసి ఖండించి యెఱ్ఱగా కాలిన యినుప స్తంభమునకు కట్టి వేసిగాని, మంటలో పడ వేసిగాని, శిర చ్ఛేదము జేసిగాని చంపుచుండిరి. అనేకులు తమ మనస్సాక్షి కొఱకై యిట్టి ఘోరమరణములను పొందుటకు సిద్ధపడిరి. ప్రొటస్తెంటు మతము వ్యాపించిన కొలదియు ప్రొటస్టెంటులగు రాజులుకూడ తమ దేశములలోని రోమను కాథలిక్కులగు ప్రజలను ఘోరశిక్షలకే పొలుచేసిరి. "ఈశ్వరుని నారాధిం చుటకు అనేక మార్గము లున్నవి. ఎవరిబుద్ధికి బాగుగయున్న మార్గమున వారారాధించవచ్చును,” అను ధర్మమును యూ రఫుఖండ వాసులు చిరకాలము పఱకును గ్రహించ లేదు. 'దేశము లోని మతగురువుల యొక్కయు రాజు యొక్కయు మతము గాక ఇతర మతము నవలంబించిన వారికి మరణశిక్ష విధించుచు వచ్చిరి. రోమసు కాథలిక్కులు ప్రొటస్టెంటులను, ప్రొటెస్టెం

టులు రోమను కాథలిక్కులను మతము పేరిట చంపుకొనిరి.
76

ప్రెంచిస్వాతంత్ర్య విజయము

వీరి యుభయుల మధ్యను అనేక యుద్ధములు జరిగెను. "ప్రేమా స్వరూపుడును సాత్వికమూర్తి lయగు ఏసుక్రీస్తు పేర యూరపు ఖండములో మానవరక్తము వెల్లువలుగా పారెసు.

స్పెయిన్ దేశము స్వాతంత్ర్యము

స్పైన్ దేశము మహ:మహమ్మ దీయులగు మూరుజాతి వారిచే జయింపబడి పాలింపబడుట చూచియున్నాము. ఈ మహమ్మదీ య రాజులు దేశములో శాంతిని నెలకొలిపి తమ పాలనిలోని క్రైస్తవ ప్రజలకు మత స్వేచ్ఛ నొసంగి కళలను, విద్యలను, ప్రకృతి శాస్త్రములను వృద్ధి చేసి గొప్పనాగరికతను స్థాపించిరి. కాని స్పెయిన్ దేశములోని క్రస్త వులు మతావేశము చేతను, దేశాభిమానము చేతను విదేశీయులు ను, ఇతర మతస్థులును నగు మహమ్మదీయులను స్పెయిన్ నుండి వెళ్లగొట్టుటకు ప్రయత్నించిరి. 732 వ సంవత్సరము మొదలు 1492 వ సంవత్సరము వఱకును క్రైస్తవులకును మహమ్మదీ యులకును పోరాటములు జరిగి క్రమముగా దేశము క్రైస్తవుల పశ మయ్యెను. 1402 వ సంవత్సరము లో జరిగిన యుద్ధములో ముసల్మానులు . పూర్తిగనోడిపోయి స్పెయిన్ దేశమునుండి వెడల గొట్టబడిరి. స్పెయిన్ దేశమున కంతకును ఇజబెల్లా రాణి యయ్యను . ఈమె మనుమడగు అయిదవ చార్లెసు రాజు ఆస్ట్రీ

యాకు చక్రవర్తియై యూరపుఖండమున ప్రథానుడగు రాజుగ నుండెను.

75

ఏడప అధ్యాయము


హా లెండు స్వాతంత్ర
పోరాటము,

ఈయన పాలనలోనున్న హాలెండు దేశములో ప్రొట స్టెంటుమతము కడు శీఘ్రముగా వ్యాపి చెను. దాదాపుగా ప్రజ లందరును ప్రొటెస్టెంటు మతము నవలంబించిరి. ఈయనకుమారుడగు 'రెండవ ఫిలిప్పు రోమనుకాథలిక్కు మతస్థుడై హాలెండు లోని ప్రొటెస్టెంటు మతమును మిగుల క్రూరమగు పద్ధతులుచే నిర్మూలము చేయుటకు యత్నించెను. ఆయన విధించిన కారాగృహశిక్షలకు మరణ శిక్షలకు మితి లేదు. హాలెండు ప్రజలు మత స్వేచ్ఛకుసు దేశస్వాతంత్యమునకును 1572 వ సంవత్సరమున విలియం ఆఫ్ ఆరెంజ్అను ధీరుని నాయకత్వము క్రింద 'స్పెయిన్ రాజు పై తిరుగు బాటు చేసిరి. ఈ స్వాతంత్ర్య కలహములు పదిసంవత్సరములుజరిగెను. ప్రథమభాగములో ప్రతి చోటను స్పెయిను వారేగెలుచుచు వచ్చిరి. వారి నోడించిన ప్రొస్టెంసెంటు ప్రజలపైచూపిన క్రౌర్యమునకు మేర లేదు. నాలుకులు పీకించియు, కండ్లు పొణిచియు, చర్మము నొలిచియు, మంటలలో పడ వైచియు ఇంక సనేక విధములగు వర్ణనాతీత ములగు చిత్రవధ వధలను చేసిరి.. హాలెండు ప్రజల నాయకుడు విలియం ఆఫ్ ఆరెంజి యొక్క ప్రాణమును తీసినవారికి గొప్ప బహుమాన మిత్తునని స్పెయిసు రాజు ప్రకటించెను. ఆయనను చంపుట కనేక ప్రయత్నములు జరిగి తుదకు 1581 వ సంవత్సరమున నొకడు

తాను ప్రొటస్టెంటునని నమ్మించి ఆయన దరిజేరి, ఆయనను
79

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

పొడిచి చంపెను. హాలెండు ప్రజ లిన్ని కష్టముల మధ్య సహన ముతో పోరును సాగించిరి. విలియం యొక్క కుమారుడగు మారిసు హాలెండు ప్రజలకు నాయకత్యమును వహించెను, కొంతకాలమునకు "స్పయినుకు శత్రువులగు ఫ్రాన్సు ఇంగ్లాండు రాజులు హాలెండు ప్రజల సహాయమునకు వచ్చిరి, స్పెయినువా రోడిపోయిరి. 1600 వ సంవత్సరమున 'స్పెయిను రాజు హాలెండు ప్రజలస్వాతంత్యము సంగీక రించి సంధి చేసుకొనెను. ఈపోరా టములో హాలెండు ప్రజలు స్పెయినువారికి పోటీగ పడవలను నిర్మించి సముద్రముల మీద ప్రయాణములు చేసి ఆసియా తోను అమెరికాలోను వర్తకమునందు ప్రథాన స్థానమును పొం దిరి. స్పెయిను నుండి స్వాతంత్యమును పొందిన తరువాత హాలం డులో రాజరికపు కక్షియు ప్రజాస్వామ్య కక్షియు నను రెండు కక్షలు కొంత కాలమువరకు తగవులాడి రాజరికపుకక్షవారు ప్రాబల్యమును పొంది, విలియం ఆఫ్ ఆరెంజి వంశ్యులు స్టాడ్టు "హెూల్డరు అను పేరుతో నొకవిధమగు రాజులయిరి.

(5)

ఫ్రాన్సు దేశములో
మత కలహములు

ఫ్రాన్సు దేశమున ఏడవ హేన్రీరాజు ప్రొటెస్టెంటు మతము పై నిర్భంధ విధాన మవలంబించి ప్రొట సైంటులయిన వారిని చంపి వేయుచు, ఆమతము తన దేశములో వ్యాపించకుండ జేసెను. కాని ఫ్రాన్సు దేశములోనే కాల్విను అను మత సంస్కర్త బయలు దేరి ఫ్రెంచి భాషలో గ్రంథములసు వాసెను. ఫ్రెంచి ప్రజలలో సంస్కరణము వ్యాపించ జొచ్చెను, పరాసు ప్రభువులలో ననేకు లీమతములో

,

79

ఏడవ అధ్యాయము


చేరిరి. పరాసుదేశములోని దక్షీణపశ్చిమ భాగములు రోమను క్యాథలిక్కు మతమును విడిచి మాతన మతముసవలం బించెను. ఇదికూడ ప్రొటెస్టెంటు మతములో శాఖయే. ప్రొటెస్టెంటు మతములో నెన్నియో శాఖలుగలవు. పరాసు దేశములో ప్రొటెస్టెంటు మత మింకసు వ్యాపించి యుండును గాని రోమసు కాథలిక్కు మతములో ననేక సంస్కరణలు జరిగి, వారి యరాధన, జీవితము ఎక్కువ స్వచ్ఛమయినదిగ చేయబడి, మూఢ నమ్మికలు తోసివేయబడి ప్రజలను ప్రొటెస్టెంటు మత మునవలంబించ కుండ నాకర్షించిరి. ప్రాస్సు దేశములోని యధిక సంఖ్యాకులగు ప్రజలు రోమసు కాథలిక్కులుగనే యుండిరి. రోమను కాథలిక్కు లిష్పటికీని రోములోని పోవు యొక్క పీఠ ముసకు లోబడి విగ్రహారాధకులై యున్నారు. పొటెస్టెంటుల నమ్మికలను బలవంతముగా నణచివేయు ప్రయత్నముల వలన మనస్సాక్షి కొరకు బాధల నొందు వారియందు ప్రజలలో గౌర వము కలిగి ప్రొటస్టెంటు మతము ఎక్కువగా వ్యాపించెసు. ఇందుకు మారుగా రోమను కాథలిక్కు మతములో సంస్కరణము సు గావించి యారాధనను, జీవితమును ఎక్కువ యుత్కృష్టమయి సదిగా చేయుటవలన మాత్రమే రోమను కాథలిక్కు మతము సంరక్షింపబడి ప్రొటెస్టెంటు మతవ్యాపన యూరఫుఖండములో నరి కట్టబడినది.


రెండవ 'హెన్రీ చనిపోయిన తరువాత తొమ్మిదవ చార్లెసు రాజ్యమునకు వచ్చెను. ఈయన చిన్న వాడై నందున

రాజమాతయగు కాథరిన్ డి మెడిసి పాలనము చేసెను. ఈ కాల
80

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

మున బోర్బాన్" ప్రభువులు కాల్విన్ మతస్థులుగను, గైజుప్రభు వులు రోమను కాథలిక్కులుగను నుండిరి. రాజు యొక్క ప్రధాన మంత్రి యగు లహాపిటలు మత సహనమును పహించి కొన్ని, నిర్బంధములకు లోబడి ప్రొటస్టెంటుల ఆరాధన జరుగవచ్చునని శాసించెను. ఇది గైజు ప్రభువున కిష్టము లేదు. 1562 సంవత్సర ము మార్చి నెలలో తన సేనలతో బయలుదేరి వాసీయను చిన్న పట్టణమున జరుగుచున్న కాల్విన్ మతస్థుల యారాధ నను బలవంతముగా చెదరగొట్టి అనేకుల 'ప్రొటెస్టెంటు లను వధించెను, ఇందుమీద ప్రొటెస్టెటుల పక్షమువ బోర్బాన్ ప్రభువులు కత్తిదూసిరి. ఇంక ననేకులు ప్రభువు లిరు పక్షములను చేరిరి. ముప్పది సంవత్సరముల వరకును పరా సు దేశములో రోమను కాథలిక్కులకుసు ప్రొటస్టెంటులకును యుద్ధములు జరిగెను. చాలవరకు రోమసు కాథలిక్కులకే జయ ములు కలిగెను. ఇంగ్లండు, జర్మనీ, స్విడ్జర్లెండు దేశముల కులు ప్రొటెస్టెంటులకు సహాయమునంపగ స్పెయిను రాజు రోమ నుకాథలిక్కులకు సహాయము చేసెను. 1570 సంవత్సరమున నొక సంధి జరిగెను. పొటెస్టెంటు మతము నిచ్చవచ్చిన వారప లంబించ వచ్చునని సంధివలన నిర్ణయించబడెను. తొమ్మి దవ చార్లెసురాజు యుక్త వయస్కుడై ఈ అంతర్యుద్ధమువలన తన దేశము క్షీణించిపోవుచున్నదనియు తన శత్రువగు స్పెయి సు అభివృద్ధి చెందుచున్న దనియు గ్రహించి తాను రోమను కాథలిక్కు మతస్థుడయ్యును ప్రొటెస్టెంటులగు ఇంగ్లాండు రాణి

తోను హాలెండు ప్రజలతోను స్నేహము చేసి స్పెయిను యొక్క

81

ఏడవ అధ్యాయము


వ్యాపకమునకడ్డుకలుగ జేయ యత్నించెను. ఈ సంగతి రాజ మాత కిష్టము లేక తిరిగి మత యుద్ధము కల్పించు తలంపుతో కొందరు రోమను కాథలిక్కు ప్రభువుల సహాయమున నామె 1572 సంవత్సరము - 24 వ ఆగస్టు తేదీన రోమను కాథలిక్కు ప్రజల నావేశ పరచి వారిచే పరాసు దేశములోని పది వేల మంది ప్రొట స్టెంలను హత్య గావించినది. పరాసుదేశము లోని పొప్రొటస్టెంటులకు “హ్యుజినాట్లు” అని పేరు. ప్రొటెస్టం ట్లు ఆత్మసంరతణకొఱకై తిరిగి యుద్ధము ప్రారంభించిరి. యుద్ధ ములు సాగుచుండెను. తొమ్మిదవ చార్లెసు చనిపోయెను. మూడవ హెన్రీ రాజ్యము చేయుచుండెను. ఈయనకు సంతతి లేదు. ఈయనత ర్వాత వారను ప్రొటెస్టెంటుకక్షికి నాయకు డగు నా వరు ప్రభువగు 'హెన్రీ అయియుండెను. హెన్రీ వార నుగాకుండ నుండుటకై రోమసు కాథలిక్కుకక్షివారు పట్టు పట్టిరి. ఇందువలన యుద్ధము తీవ్రమయ్యెను. మూడవ హెన్రీ రాజు నొక మతగురువు పొడిచిచంపెను. తర్వాత వారసును, నావ రు ప్రభువును నగు 'హెన్రీనాలుగవ హెన్రీరాజసు బికుదమును ధరించెను. ఈయన ప్రొటెస్టెంటు మతస్థుడగుటవలన రోమసు కాథలిక్కు ఫాస్సు ఈయనను రాజుగ నంగీకరించలేదు. రెండు సంవత్సరములు తన సైన్యములతో రోమును కాథ లిక్కులను జయించి లోబరుచుకొన యత్నించెను. రోమసు కాథలిక్కులకు స్పెయిను రాజు సహాయము చేయుచుండెను. స్పెయిసు రాజు పరాసు రాజ్యము నాశించెను. ఇంతలో 1593

సంవత్సరమున నాలుగవ హెన్రీ పోటెస్టెంటు మతమును వదలి
82

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

రోమసు కాథలిక్కు మతమును స్వీకరించెను. క్రమక్రమ ముగా ఫ్రాన్సు దేశ మంతయు నీయనకు లోబడి ఈయనను రాజుగా గ్రహించెను. కాని పోపు అంగీకరించనిది ప్రయో జనము లేదు. 1595 సంవత్సరమున నాలుగవ హెన్రీ రోముకు పోయి పోఫుగారు విధించిన ప్రాయశ్చిత్తమును చేసికొని పోపు గారిచే రోమును కాథలిక్కుగ సంగీక రించబడెను. నాలు గవ హేన్రీ రోమను కాథలిక్కగు స్పెయిను రాజుతో సంధి చేసికొనెను. పరాసు దేశములోని ప్రొటెస్టెంటు లందరును ప్రభుమందిరము లలోను కొన్ని పట్టణములలోను ఆ రాధనను సలుపుకొనవచ్చు సనియు, సర్వకశాలలలో చదువుకొను టకును ప్రభుత్వోద్యోగములలో ప్రవేశించుటకును అర్హులని యు, 1598 సంవత్సరమున నాన్ టీసు ఈడిక్టు అను శాస నము గావించెను. ఇది శాశ్వతముగ నుండవలెనని కూడ శాసించెను. ఇందువలన రోమను కాథలిక్కు మతగురువులలో నసం తృప్తిగలిగి కొందరీయనను చంపయత్నించిరి. అట్టివారి నీయన దేశములోనుండి వెడలగొట్టెను. 1610 వ సంవత్సర మున జర్మనీలో ప్రొటెస్టెంటులకును రోమును కాథలిక్కుల కుసు పోరాటము కలిగెను. ఈయన ప్రొటెస్టెంటుల పక్షమున సైన్యములతో బయలు దేరి వెళ్లుచుండగా నొక రోమను కాథ. లిక్కు మతస్థు డీయనను పొడిచి చంపెను.


తరువాత పదునాలుగవ లూయిరాజు 1685 వ సంవత్స, రమున నాన్ టటిసు శాసనమునురద్దుపరచి ప్రొటెస్టెంటుల దేవాలయములను పడగొట్టెను. వారి యాస్తులను స్వాధీన

.

83

ఏడవ అధ్యాయము

ము చేసికొనెను, వారు ఎచటను ఆరాధన జరుపుకొనుటకు వీలు లేదని శాసించెను. నయముననో భయముననో చాల మందిని రోమను కాథలిక్కు మతములో చేర్చెను. మిగిలిన వేలకొలది ప్రొటెస్టెంటులు ఇంగ్లాండు, హాలండు, జర్మనీ దేశ ములకు పారిపోయిరి. ఫ్రాన్సు దేశములో ప్రొటెస్టెంటు మతము లేకుండ చేయబడెను.

6

జర్మినీలో ముప్పది
సం.ల యుద్ధము

జర్మనీలో కొందరు రాష్ట్రాధిపతులు ప్రొటెస్టెంటులును, తక్కినవారు రోమను కాథలిక్కులును నయిరి. చక్రవర్తి రోమను కాథలిక్కు మతస్థుడై ప్రొటెస్టెంటు' రాష్ట్రాధిపతులతో యుద్ధము చేయుచు వచ్చెను. కొంతకాలము వరకు సంధి జరిగెను. తిరిగి, 1594 "మొదలు 1624 వరకు ముప్పది సంవత్సరముల కాలము ఎడ తెగక రోమసు కాథలిక్కులకును ప్రొటెస్టెంటులకును తీవ్ర మైన యుద్ధము జరిగెను. ఒకరి నొకరు ఘోరవధలను గావిం. చుకొనిరి. జర్మనీదేశ మీ యంతఃకలహములవలస మిగుల క్షీణించెను. (ఈ ముప్పది వత్సరముల యుద్ధమును గూర్చి, కొంచెము విస్తారముగా రెండవ సంపుటములో జర్మనీని గూర్చిన అధ్యాయమున వ్రాయబడినది.)

(7)

ఇంగ్లాండులో మత
స్వేచ్ఛ లేకుండుట,

మతసంస్కరణమునందు ఇంగ్లాండు దేశము మూడవ త్రోవతొక్కినది. ఎనిమిదవ హెన్రీరాజు ప్రథమమున లూథరు రు యొక్క సంస్కరణములను ఖండించుచు

వ్రాయగా పోపు రాజును మెచ్చుకొనెను.
84

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

కొలదికాలములో హేన్రీ రాజుకు పోపుతో కలహము గగెను. హేన్రీరాజు తనభార్యయగు కాథరిన్ ను విసర్జించి. వేరు స్త్రీని వివాహమాడ దలచెను. కాధరిన్ తోడ జరిగిన వివా హము విచ్ఛేదము చేయుమని పోవును కోరెను. పోపు సమ్మ తించలేదు. అందుపై రాజు పోపు నెదిరించి తన దేశముమీద పోవుకు అధికారము లేదనెను. రాజు తన దేశములోని క్రైస్తవ దేవాలయములలోని ఆరాధనలో కొన్ని సంస్కరణములను గావించెను. ఇంగ్లాండులోని మత గురువు లెవరును పోపుకు లోబడ గూడదనియు, ఐహిక విషయములలో వలె మతవిషయ ములలో గూడ రాజే సర్వాధికారియనియు శాసించెను. దేశములోని ప్రధానమతాచార్యునిచే కాధరిన్ వివాహము విచ్ఛేదము గావించుకొనెను. ఇంగ్లాండులోని అనేకములగు రోమన్ కాథలిక్ మఠములను దోచుకొని వానిని నాశనము చేసెను. గొప్ప విద్వాంసులగు మూరు, పిషరు మొదలగు వారును పెక్కు మంది రోమన్ కాథలిక్ లును పోపుకు బదులుగా రాజ యొక్క నిరంకుశాధికారమును మతవిషయములలో సంగీ శరించ నందున మరణశిక్షలకు లోనైరి. రాజు రోమన్ కాథ లిక్ మతము నుండి మారెనే గాని తన దేశములోని నూతన సంస్కరణములను లూథరుకాల్విన్ గార్ల సిద్ధాంతములతో పాటు చేయలేదు. 1589 వ సంవత్సరమున రాజు ఆరు సిద్ధాంతములను నందరును నమ్మి తీరవలెననియు, నమ్మని వారు మంటలలో పడవేసి చంపబడుదు రనియు శాసించెను,

అనేకులు మంటల కాహుతియైరి. మత గురువులు వివాహ మా

85

ఏడవ అధ్యాయము


డరాదనికూడ శాసించెను. బైబిలుకు నింగ్లీషు తర్జుమా చేయిం చెను. ఈయన చేసిన యేర్పాటులు రోమణ కాథలిక్కులకును ప్రొటెస్టెంటులకును అసంతృప్తికలుగజేసెను.


ఈయనకుమారుడగు ఆరవ ఎడ్వర్డు రాజు కాలమున ప్రొటెస్టెంటు మతము బాగుగ వ్యాపించినది. చాలవరకు తక్కి న దేశములలోని ప్రొటెస్టెంటు సిద్ధాంతము ,లమలులో పెట్ట బడెను.


తరువాత రాణియైన మేరి దృఢమైన రోమన్ కాథలిక్కు, అయి స్పెయిన్లో రాజుగు రెండవ ఫిలిప్పును వివాహమాడి ప్రొ టెస్టెంటులను తండోపతండములుగ మంటలలో పడవేయించి చంపి వేయించెను. ఈమే తరువాత రాజ్యమునకు వచ్చిన ఎలి జెబెత్తు ప్రొటెస్టెంటు అయ్యెను. లూథరు, కాల్విన్ సిద్ధాంత ములను పూర్తిగ నవలంబించని ప్రొటస్టెంటు మతము యిం గ్లాండులో స్థాపించబడినది, దీనికి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండు అని పేరు. రాణీచేసిన యేర్పాట్ల ప్రకారము తప్ప వేరువిధమైన యెట్టి ఆరాధనయు నింగ్లాండులో జరుగరాదని 1558 వ సం వత్సరమున శాసించినది. రాణిచే స్థాపించబడిన దేవాలయము లకు రాని వారికి గొప్ప జుల్మానాలు వేయబడెను. అనేక మంది రోమన్ కాథలిక్కులు చంపబడిరి. ఎవరినై నను రోము ను కాథలిక్కు మతము లోనికి చేర్చుకొనిన వారికి మరణశిశు విధిం పబడెను. కొంత కాలమయిన తరువాత తీవ్రమగు ప్రొస్టెంస్టె టులుకూడ మరణశిక్షలకు లోనయిరి. ఐర్లాండురోని రోమను

కాథలిక్కులను ఎలిజబెత్తురాణి పెట్టిన హింసలు, విధించిన
86

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయ


ఘోరశిక్షలు వర్ణనాతీతములు. ఎలిజబెత్తు రాణి ఐర్లండులోని విశాలవంతమగు ప్రదేశములను అందలి ప్రజలను వెడలగొట్టి స్వాధీనమును పొంది ఇంగ్లీషు ప్రముఖులకు కాపురముండుట కిచ్చెను. ఈమె 1.608 వ సంవత్సరమున చనిపోయెను.


తరువాత రాజ్యమునకు వచ్చిన జేమ్సు, చార్లెసు రాజుల కాలములో తీవ్రమగు సంస్కరణములు కోరిన ఫ్యూరి టను శాఖ ఇంగ్లాండు దేశమునందు విశేషముగ వ్యాపించెను. కాని రాజులా మత శాఖ నణచివేయ యత్నించినందున కొంతమంది దేశమునువిడిచి పారిపోయిరి. కొంత కాలమునకు ప్రజలు చార్లెసు రాజు పై తిరుగుబాటు చేసి యాయనను శిర చ్ఛేదము గావించిరి. తరువాత స్థాపింపబడిన ఫ్యూరిటసు ప్రజాస్వామ్యము వారు రోమును కాథలిక్కులను హింసించిరి. కొంతకాలమునకు తిరిగి రెండప చార్లెసు రాజై 'ప్యూరిటను మతగురువుల నందఱను తీసివేసి రోమను కాథలిక్కులకు స్వేచ్ఛ నియ్య యత్నించెను. కాని పార్లమెంటు వారు రోమను కాథలిక్కు గురువులు దేశమును వదలిపోవ లెసని శాసించిరి. చర్చి ఆఫ్ ఇంగ్లాండు శాఖ యొక్క ఆరాధనకు భిన్నమగు ఆరాధ నను ఐదుగురికన్న నెక్కువమంది సలిపినచో వారిని ఖైదులో చేసెదమనికూడ శాసించిరి. అనేక మంది ప్రొటస్టెంట్లు మనస్సాక్షి కొఱకు కారాగృహములకు జనిరి. కొందరు చెర సాలలలో మరణించిరి. ఎల్లిను అసు సుప్రసిద్ధ గంధకర్త టాంటన్ జైలులో పడిన బాధలవలన మరణించెను. జాక్ బనియను

అను గొప్ప గ్రంథకర్త పండ్రెండు సంవత్సరములు చెరసాలలో

87

ఏడవ అధ్యాయము

నుండెను. ఆయన వెళ్ళిన జై లు ఇట్టి మతబోధలు చేసిన వాటితో నిండెను. ఆయన భార్యయు పిల్లలు విశేషమగు దరిద్ర బాధకు లో నైరి. ఆంగ్లేయ భాషలో మిగుల సుప్రసిద్ధ గ్రంథ రాజమగు “పిలిగ్రిమ్సు ప్రోగ్రెస్సు"ను ఆయన చెరసాలలోనే వ్రాసెను. 1672 వ సంవత్సరమున "రెండవ చార్లెసు రాజు చెరసాలలలో 'సున్న వారి సందరసు విడుదల చేసి కొంత మతస్వేచ్ఛ కలుగ చేసెను. "కాని ఆంగ్లేయు పార్లమెంటువారు సర్కారుద్యోగము లలోనుండు ప్రతివారును సర్వక ళాశాలలో పట్టపరీక్షకు వెళ్లు వారును చర్చి ఆఫ్ ఇంగ్లాంకు శాఖకు చెందినట్లు ప్రమాణము చేయవలెనని శాసించిరి. ఇందువలన చాలమంది యుద్యోగ ములను పోగొట్టు కొనిరి. రోమను కాధలిక్కులు ఆంగ్లేయు పార్లమెంటులో సభ్యులుగా నుండ గూడదనియు, బహిరంగ ముగా ఆరాధనను జరుపగూడ దనియు చట్టములు చేయబడెను. 1678 వ సంవత్సరమున కుట్రలు చేయుచున్నటుల నేర మారో పింపబడి ఇంగ్లాండులోని రోమను కాథలిక్కులందరును అరెస్టు చేయబడిరి. వారిలో చాల మందిని విచారించి మరణశిక్ష విధించిరి. రెండవ జేస్సు రాజు రోమను కాథలిక్కుల ఉద్యో గములిచ్చి వారిని బహిరంగముగా ఆరాధనను జరుపుకొననిచ్చి సందున పార్ల మెంటువారు ఆయనమీద తిరుగుబాటు చేసి దేశ భ్రష్టునిగావించి హాలెండు దేశమునుండి విల్లియము అను ప్రొటెస్టెంటు మతస్థుని రాజుగా తెచ్చుకొనిరి. "ఐర్లాండు దేశపు కాపురస్థులలో నూటికి ఎనుబదిమంది రోమను కాథలిక్కు

లైనను, ఐర్లాండు దేశము ఆంగ్లేయుల క్రిందికి వచ్చినది మొదలు
88

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

రోమను కాథలిక్కులకు ప్రభుత్వోద్యోగములు , చేయుటకు గాని న్యాయవాది వృత్తి నవలంబించుటకుగాని పార్లమెంటుకు సభ్యుల నెస్ను కొనుటకుగాని పార్లమెంటుకు సభ్యులగుటకు గాని" హక్కులు లేకుండ చేయబడెను. 1868 వ సంవత్సరమున రోమనుకాథలిక్కులు మొదలగువారిమీద గల నిర్బంధము లన్నియు తీసి వేయబడి ఆంగ్లేయ రాజ్యములో సంపూర్ణ మగు మత స్వేచ్ఛ నెలకొలు పబడెను. కాని ఇప్పటికిని ఆంగ్లేయ రాజు మాత్రము చర్చి ఆఫ్ ఇంగ్లాండు శాఖకు చెందిన ప్రొటెస్టెంటు క్రైస్తవుడుగా నుండి తీరవలెను. హిందూ దేశములో బ్రిటిషు ప్రభుత్వము స్థాపించబడుసరికి యూరపుఖండమున మత యుద్ధము లాగిపోయి మత స్వేచ్ఛ బాగుగ నెలకొలుప బడినది. ప్రభుత్వ ములు పౌరులమత విశ్వాసములతోను ఆరాధనా పద్ధతులతోను జోక్యము కలుగ జేసికొనుట మాని వేసిరి.

(8)

హిందూ దేశమున
మతస్వాతంత్రము

ఆనాది కాలమునుండియు హిందూ దేశమున సంపూర్ణ మగు మత స్వేచ్ఛ యుండెను. “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అనగ "భగవంతు డొక్కడు; ఆయనను పండితులు అనేక నామముల పిలిచెదరు," అనియు “ఆకాశా త్పతితం తోయం యథాగచ్ఛతి సాగరం,సర్వదేవ సమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి” అనగ "ఆకాశము నుండిపడిన యుదక మంతయు సముద్రమున నే చేరునటుల, నేపేరున నారాధించినను ఆ యారాధనము ఒక్కడగు పరమాత్మనే చెందును,” అనియు మొదలగు సిద్ధాంతములు హిఁదూదేశము

89

ఏడవ అధ్యాయము


సందు అనాది కాలమునుండియు నేటివఱకును స్థిరముగా నాటు కొనియున్నవి. కావున హిందూ దేశ చరిత్రలో నెప్పుడును మతము కొఱ కై గాని మతము పేరగాని యెట్టి యుద్ధములుసు జరిగి యుండ లేదు. అన్యమతావలంబులను యెట్టిహింసలకు 'నెప్పుడును లోబఱచి యుండ లేదు. ఎప్పుడును సమస్తమత నమ్మిక లందును సహనమే చూపబడెను. విదేశములనుండి యే యన్య మతస్థులు వచ్చినను హిందూ దేశ వాసులు ఆతిథ్యము నిచ్చిరి. తమతమ దేశ ములలో మత స్వేచ్ఛ లేక కష్టములపాలై ఇచట శరణుజొచ్చిన యూదులకును పౌరసీలకును హిందూమతల్లి సంరక్షణనిచ్చి తన బిడ్డలనుగా స్వీకరించి యున్నది. క్రీస్తుశకము ప్రధమ శతాబ్దములో హిందూదేశమునకు వచ్చిన క్రైస్తవులు పశ్చిచుసముద్రతీరమున స్తిర నివాసమేర్పంచుకొనిరి. "శాంతముగను చుట్టుపట్టునున్న వారితో స్నేహముగను కాలము గడపుచు. తమమతమును కూడ వ్యాపింప జేసికొని యున్నారు. ప్రాచీన హిందూ దేశములోని మత స్వేచ్ఛనుగూర్చిహిందూ దేశ చరిత్రను వ్రాసిన విన్సెంటుస్మిత్తు " పూర్వకాలమున హిందూ దేశము నందు మత నమ్మికలకొఱకై మనుష్యులను బాధలు పెట్టి ఎరుగరు. వివిధ మతావలంబకులు స్నేహముగా కాపురముండు టయేగాక రాజులందరిని నిష్పక్ష పాతముగా చూచి ఉద్యో గముల నిచ్చుచుండిరి. అని వ్రాసియున్నాడు. క్రీస్తుకుపూర్వ ము మూడు వందల సంవత్సరముల క్రిందట హిందూదేశమును పాలించిన చందగుప్త చక్రవర్తి కాలమున వ్రాయబడిన అర్థ

శాస్త్రములో " రాజు కొత్త దేశమును సంపాదించినచో, అచటి
90

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ప్రజల యొక్క, మత నమ్మికలను ఆచారములను గౌరవించి వారి మత సంబంధమయిన పండుగలలో పాల్గొనవలెను." అని వ్రాయబడినది. క్రీస్తుకు పూర్వము 278 ముదలు 282 వఱకు భరతవర్షమును పాలించిన అశోక చక్రవర్తి ఇతరుల మత నమ్మి కలతో సానుభూతియు సహనమును చూపుట మానవుని కుండ వలసిన సద్గుణములలో నొకటి యని చెప్పుచుండెడివాడు. తన రాజ్య మందంతటను తన పండ్రెండవ ఆజ్ఞను "మాప్రజ లెవరుసు తమ యిరుగుపొరుగు వారి మతమును గూర్చి నీచముగా మా ట్లాడ గూడదు. మతములలోని తస్సీళ్ళలో నెట్టి భేదాభిప్రాయ ములున్నను, అన్ని మతములుసు మానవులు ఇంద్రియ నిగ్రహ ముసు, మనోనైర్మల్యమును పొందుటయసు పరమావధిని గలిగియుండి ముఖ్యోద్దేశ్యములలో నేకీ భవించుచున్నవను సంగతి జ్ఞాపకముంచు కొనవలెను" అని వ్రాయించి శిలా శాసన ములమీద చెక్కించెను. హిందూ రాజు లేమి, బౌద్దరాజు లేమి అన్ని మతముల వారికిని దానధర్మములు చేయు చుండిరి. “ఆ కాలమున హిందూ దేశములోని రాజులు తమ ప్రజలలో వ్యాపించియున్న మతవిశ్వాసముల నన్నిటిని గౌరవించుచుం డెడివారు"అని 'బుల్లరు 'అను చరిత్ర కారుడు వ్రాసియున్నాడు. “ఇదియే ప్రాచిస హిందూరాజుల పద్ధతి” అని . విన్సెంటుస్మిత్తు వ్రాసి యున్నాడు. చైనా దేశమునుండి ఫాహియాను అను బౌద్ధ యాత్రికుడు హిందూ జేశమును దర్శించుటకు వచ్చినప్పుడు పాటలీపుత్రము నందు విక్రమాదిత్యుడను హిందూరాజు' పాలిం

చుచుండెను. "బౌద్ధులును జై సులుసు హిందువులలోని శైవ,

91

ఏడవ అధ్యాయము


వైష్ణన, సౌర, శాక్తేయ, గాణాపత్యాది వివిధ శాఖలవారును మిగుల స్నేహభావముతో మెలగు చుండిరి. పూర్తియగు మత స్వేచ్ఛ మత సహనములు ప్రబలి యుండెను” అని ఫాహి యాను వాసెను. క్రీస్తుశక పారంభమున హిందూ దేశము లోని చాలభాగము నేలిన ఆంధ్ర రాజులు హిందువులైనను బౌద్ధమతమును గూడ మిగుల గౌరవించి బౌద్ధమత ప్రతి ష్టాపనలకును చాల సహాయము జేసిరి. తరువాత రాజ్య మునకు వచ్చిన గుప్తరాజులు వైష్ణవులగు హిందువులయి నను ఆకాలము నందుండిన హిందూ, బౌద్ధ, జైనమతము లను సమానముగా జూచిరి. 606 వ సంవత్సరమున రాజ్యము నకువచ్చిన హర్ష చక్రవర్తి బాహ్మణులను, బౌద్ధభిక్షులను గూడ తన రాజ్యములోని , పాఠశాలల కుపాధ్యాయులుగా నియమించెను, ఈయన బౌద్ధమఠములను హిందూ దేవాలయ ములనుగూడ కట్టించెను. హర్షుని తాత శివుని పూజించెను. హర్షుని తండి సూర్యుని పూజించెను. హర్షుడు శివుని, సూర్యుని, బుద్ధునికూడ పూజించెను. అప్పటికే పౌరాణిక హిందూమతము దేశమున బాగుగ వ్యాపించెను. ప్రతి మానవుడును తన యిచ్చ వచ్చిన మతమును స్వీకరించి తన యిచ్చవచ్చిన దైవము నారా ధించు చుండెను. అందఱును సోదర భావముతో మెలగు చుండిరి. ఈ రాజు పాలించుచుండగా చైనాదేశమునుండి హూయను త్సాంగసు మరియొక బౌద్ధయాత్రికుడు. హిందూదేశమును దర్శించుటకు వచ్చెను. ఈ రాజు క్రీస్తుశకము 643 వ సంవత్సర

మున ప్రయాగలో వొక గొప్పమత సమా వేశము గావించి
92

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

అన్ని మతముల ప్రతినిధులను గౌరవించి హిందువులకును. బౌద్ధులకును జైనులకును సమానముగ ధర్మములు చేయు టను గూర్చియు ఆకాలమునందుండిన పూర్తియగు మత స్వేచ్ఛ. సుగూర్చియు హూయను త్సాంగు వర్ణించియున్నాడు. "హిందూ చేశములో బౌద్ధమతము క్షీణించుటకు కారణము, హిందూ రాజులు బౌద్ధులను హింసించి వెళ్లగొట్టుట వలన కాదనియు అట్టివి యేమియు హిందూదేశములో నెన్నడును జరుగనే లేదనియు హిందూమతము లోనికి ముఖ్యమగు బౌద్ధమత సిద్ధాం తముల నన్నిటిని జేర్చుకొని హిందూమతమునకు నూతనవికా సమునిచ్చి బోధించుటవలననే బౌద్ధమతము క్రమముగ హిందూదేశమునందు క్షీణించి చాలవరకు బౌద్ధులు నూతన హిందూమతమును స్వీకరించి” రనియు విన్సెంటుస్మిత్తు వ్రాసి యున్నాడు. బౌద్ధమతమును గూర్చి పెక్కు గ్రంథములు వ్రాసిన రైసు డేవిడు. "హిఁదూ దేశములోని బౌద్ధులను హిందువులు బాధ పెట్టిరనునది యథార్థము కాదు” అని వ్రాసియున్నాడు. శ్రీస్తుశకము 6 వ శతాబ్దములో మధ్య ఆసియానుండి 'హను' లను జాతివారు దండెత్తివచ్చి ఘూర్జర రాష్ట్రములోను, మధ్య హిందూదేశములోను రాజ్యములను స్థాపించగా వారి నంద రిని ' హిందూమతములోనికి చేర్చుకొని రాజపుత్రులనుగా జేసిరి. వీరు సూర్యవంశమునుండియు, చంద్రవంశము నుండియు పుట్టినటుల కట్టుకథలను గూడ న ల్లిరి. ఇపుడు రాజవుత్రస్థానము

నేలు రాజపుత్రుల యొక్క పూర్వులు వీరే.

93

ఏడవ అధ్యాయము

మహమ్మదీయపాలన
మున మత స్వేచ్ఛ

పూర్వకాలమున హిందూ దేశములో పూర్తియగు మత స్వేచ్ఛ యుండినటుల హిందూ దేశ చరిత్రనుండి ప్రబల నిదర్శనములు చూపియున్నాము. ఇక మహమ్మ మహద్ముదీయుల కాలమున ఎటులనుండెనో నిష్పక పాతబుద్ధితో చూడవలసియున్నది. మహమ్మదీయ పాలనము హిందూదేశములో స్థాపించబడక పూర్వ ము హిందూదేశముపై దండెత్తి దోచుకొనిపోయిన మహమ్మ దు గజసీని బట్టియు, మొగలాయి రాజ్యము పడిపోయిన తరు వాత దండెత్తి హిందూ ముసల్మానులను హింసలుగావించి దోచుకొనిపోయిన నాదర్జాను బట్టియు, మహమ్మదీయపాలన మును విమర్శించగూడదు. ఇటులనే అరాజక కాలమున దేశము ను దోచుకొన్న మరాటాదండులను బట్టి శ్రీ శివాజిఛత్రపతి స్థాపించిన మహారాష్ట్ర రాజ్యమును విమర్శించగూడదు. మహ మ్మదు గజనీయు, నాదర్షాయు కేవలము దోపిడిగాండ్రు. రాజ్యస్థావకులు కారు. మహమ్మదీయులు హిందూదేశములో పాలన మేర్పరచుకొనిన తరువాత హిందువుల మతవిశ్వాస ములతోను, ఆరాధనలతోను జోక్యము పుచ్చుకొన లేదని గట్టి గా చెప్పవచ్చును. యూరపులోవలె మతము పేర నిర్బంధము లుగానీ, హత్యలుగాని, యుద్ధములుగాని ముసల్మానుల పాలన మున జరుగ లేదు. జరిగిన యుద్ధములు స్వమతవ్యాపకము

కొఱకును పరమతనాశనము కొఱకును గాక, కేవలము రాజ్య
96


ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ఔరంగ జేబు చక్రవర్తి చేసిన పొరబాటులకు ఫలితముగ ఛత్ర పతిశివాజి, రాజపుత్రులు మొదలగు హిందూరాజులు తిరుగు బాటులు ప్రారంభించగా ఔరంగ జేబు చక్రవ ర్తి కాలములో బలహీనమయి ఆయన మరణించగనే మొగలాయిరాజ్య మస్త మించెను.


మొగలాయి రాజుల కాలమున హిందూ దేశము మత స్వే చ్ఛను శాంతిని ఐశ్వర్యమును అనుభవించి లోకములో కెల్ల నగ్రస్థానము వహించియుండెను. ఆకాలమున నీదేశములో ప్రబలియున్న పరిశ్రమలు, వర్తకము, ఐశ్వర్యము, సురక్షితము ధనార్జనము కొరకై యూరపుఖండవాసుల నిచటి కాకర్షించెను. మఱియు హిందూ మహమ్మదీయ మతముల రెంటిలోను గల యుత్కృష్టమగు సిద్ధాంతములను సమన్వయము చేసి నూత నోద్యమములను ప్రతిష్ఠించిన కబీరు, నానకు, తుకారాం, చైతన్యుడు మొదలగు సంస్కర్తలు పెక్కు మంది బయలు దేరిరి, హిందూమహమ్మదీయ నాగరికతలు గంగాయమునల విశుద్ధ ప్రవాహములవలె సమ్మేళనము చెంది భరతవర్షము యొక్క ఇతిహాసమునకు నూతనశోభను కలుగ జేసెను.