ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము/అయిదవ అధ్యాయము

వికీసోర్స్ నుండి


ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము

అయిదవ అధ్యాయము

నూరు సంవత్సరముల యుద్ధము

(1)

కాపటు
వంశపు రాజులు

హ్యూళి కాపటు 987 సం|| న పరాసుదేశమునకు రాజ గుట చూచి యున్నాము. ఫ్రాన్ సు దేశములోని ప్రజలు రాజు లను తీసి వేయువరకును ఈ కాపటు వంశ్యులే ఫ్రాన్సును పాలించిరి. మొఖా సాప్రభువరం పరాపద్ధతివలస రాజులకు పోయిన బలమును తిరిగి సంపాదించు టకు కోపటు వంశ రాజులు ప్రయత్నించిరి, కాలగమమున ప్రభు పుల బలమును తగ్గింది రాజులు నిరంకుశత్వమును పొందుటకు యత్నించిరి. రాజులు నిరంకుశులగుటకు కొన్ని శతాబ్దములు పట్టెను. 1060 సం|న మొనటి ఫిలిప్పు రాజయ్యెను. 1066

సు. న యామునకు సామంత రాజకు నార్మండ్ రాష్ట్రప్రభువు
46

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము

విలియము ఇంగ్లాండును జయించి యా దేశమునకు రాజయ్యెను.. 1180 సం||న పరాసు దేశమునకు రెండవ ఫిలిప్పు రాజయ్యెను. ఈయన పెక్కు యుద్ధములు చేసి తన సామంత రాజులనుండి . చాల భూములను లాగుకొని తన స్వంత భూములుగ చేసికొని మిగుల బలవంతుడయ్యెను. 1215 సం|| న జాన్ అను బలహీ సుడగు రాజు ఇంగ్లాండును పాలించుచుండెను. పరాసు రాజుకు సామంతముగ అతనికి పరాసు దేశములో నార్మండీ అంజూవిన్ రాష్ట్రములుండెను. రెండవ ఫిలిప్పురాజు ఇంగ్లీషు రాజు పై యుద్ధము చేసి యోడించి నార్మండ్ అంజూవిస్ రాష్ట్రములను స్వాధీనము పొందెను. రెండవ ఫిలిప్పురాజు పరాసు దేశము లోని అనేక పట్టణములకు స్వతంత్ర పాలనాహక్కుల నిచ్చెను. . వర్తక సంఘములు కొంతవరకు ప్రత్యేక స్వపరిపాలనా సౌక ర్యములను కలుగ జేసి ప్రోత్సహించెను. పట్టణములుసు, వర్తక మును ఎక్కువెయిన కొలదియు, ప్రభువులకు సంబంధము లేని భాగ్యవంతులయినట్టియు, తెలివి తేటలు గలిగినట్టియు, . హక్కులపై రాజుల నాశ్రయించు నట్టియు ప్రజలు పరాసు దేశమునందంతటను వృద్ధి జెందిరి. ఈపట్టణము లన్నియు సమయము వచ్చినపుడు రాజునకు పట్టుకొమ్మగా నిలిచినవి. . రెండవ ఫిలిప్పు తన నౌక రీలో నుండి ప్రభువులను తీసివేసి మధ్య మతరగతి ప్రజలనుండి నౌకరుల నేర్పఱచుకొ నెను. . పట్టణముల నుండియు వర్తకుల నుండియు కొన్నిపన్నులు వసూలు చేసెను. సామంత రాజులు తనకు జేయు కొన్ని స్వంత నౌకరీలను

మాన్పించి వానికి బదులు సొమ్ము పుచ్చుకొ నెను. స్వంత

అయిదవఅధ్యాయము

47


భూములనుండియు చాల సొమ్ము వచ్చుచుండెను. వీలైనంత వరకు ఆయన తన స్వంత పటాలములను జీతములిచ్చి పెట్టు కొనెను. తన సామంత ప్రభువుల మీద ఆధారపడ లేదు. ఆయన కాలమున రాజుగౌరవము హెచ్చెను. ప్రభువులు రాజునకు భయపడుచుండిరి. ఈయన మనుమడగు సెంటులూయి యొక్క పాలనమున 1242 సం.న పరాసు దేశములోని సామంత రాజు లేక మై రాజుమీద తిరుగబడగ రాజు వారినోడించి శిక్షిం చెను. ఇంతటినుండియు పరాసు దేశములోని ప్రభువులు రా జును ధిక్కరించెడి స్థితిలో లేరని చెప్పవచ్చును. సెంటులూయి రాజుకాలమున టూలోను రాష్ట్ర మున కలతలు గలిగి యరా ష్ట్రము "సెంటులూయిస్ కి చేరెను. ఇందువలన విశాలలమైనట్టియు భాగ్యవంత మైనట్టియు భాగములు రాజు యొక్క స్వంతభూము' లలో చేరెను.

ప్త్రథమ స్టేట్సు
జనరలు.

ఈయన మనుమడగు నాల్గవ ఫిలిప్పు కాలమునకు రాజు యొక్క స్వంతభూములు పరాసు చేశములో మూడింట రెండు భాగము లుండెను. ఈయనకును క్రైస్తవ ప్రధాన మతాచార్యుడగు పోపునకును కలహ ము కలిగెను. పోపు ఈయనను వెలి వేసితినని ఆంక్ష పత్రమును పంపెను. ఆంక్ష పత్రమును ఈయన తగుల బెట్టి వేసెను. పరాసు దేశమును తనపక్షమున నుంచుకొనుటకై 1302 వ సంవత్సర మున స్టేట్సుజనరలు అను దేశ ప్రతినిధి సభను సమావేశ పర చెను, మతగురువుల నొక సభ గాను, ప్రభువుల నొక సభగాసు,

ప్రజాప్రతినిధు లొక సభ గాను కూడునట్లు చేసెను. ఆసభలో
48

ఫ్రెంచిస్వాతంత్ర్యవిజయము

"ఫిలిప్పురాజు గారిని ప్రజలమైన మేము ఈ దేశ వ్యవహారము లలో భగవంతునితప్ప మీ రెవరియొక్క - అధికారమును అంగీ కరించవద్దని ప్రార్ధించుచున్నాము," అని ప్రజాప్రతినిధులు చెప్పిరి. దీని నాధారము చేసికొని ఆయన పోపును నిర్లక్ష్యము చేయగలిగెను. . ఆ సంవత్సరముననే పారిసుసగరమున ప్రధాన న్యాయస్థానము నొక దానిని ఏర్పరచెను. దీనికి పారసు పార్లమెంటు అని పేరు. ఈన్యాయస్థానములో పేరుపడసిన న్యాయవాదులను న్యాయాధిపతులుగా నియమించెను. రాజు యెక్క స్వంత భూములలోని ప్రజల పై నసు, రాజుకిందనుం డిన దేశములోని యావత్తుపట్టణముల ప్రజల పైనను, రాజున కును క్రింది ప్రభువులకును గల తగాదా విషయములోను విచారించి తీర్పు చెప్పుచుండిరి. ఇది క్రమముగా దేశమునకంత కును ప్రధాన న్యాయస్థాన మయ్యెను. అన్ని తగవులను రాజు విచారించవచ్చు నను నాచారము బయలు దేను. నాలుగవ ఫిలిప్పుకుమారుడగు పదియవలూయి కాలమున ప్రభువులు రాజుయొక్క, మంత్రులను చంపి తమకదివరకుగల హక్కు లను తిరిగి చలాయించిరి. నాలుగవ ఫిలిప్పును, ఆయన కుమా రుడును కొంతసొమ్ము పుచ్చుకొని చాల మంది వ్యవసాయక బానిసలకు స్వేచ్ఛనొసంగిరి.

ఇంగ్లీషు పరాసు
దేశముల మద్య
నూరు సంవత్సరముల
యుద్ధము

ఆకాలమున, యూరపు ఖండమున ఇంగ్లాండు, ఫ్రాన్సు దేశములు ప్రధానములుగ నుండెను. 1337 సం॥ నుండియు నీరెండు

దేశములకును మధ్య మధ్య కొద్ది విరామములతో నూరు సంవత్సరముల

అయిదవ అధ్యాయము

49

కాలము యుద్ధము జరిగెను. పరాసురాజగు నాలుగవ ఫిలిప్పు యొక్క ముగ్గురు కొమాళ్ళును నిస్సంతతిగా చనిపోయిరి. 'ఇంగ్లాండు దేశవు రాజగు మూడప ఎడ్వర్డు నాలుగవ ఫిలిప్పు రాజు యొక్క కూతురి కుమారుడు గావున ఫొస్సు రాజ్యము తనకు రావలె ననెను. ఫ్రాన్సు దేశపు రాజుల ఆచారప్రకారము స్త్రీలగుండ స్థిరాస్తి సంక్రమణ లేదని చెప్పి నాలుగవ ఫిలిప్పు యొక్క తమ్మునికుమారుడగు ఆరవ ఫిలిప్పు ఫ్రాన్సు సింహాసనము నధిష్టించెను. ఇంగ్లాండు రాజగు ఎడ్వర్డు ఫ్రాన్సుపై దండెత్తెను. విదేశీయుడగు ఇంగ్లాండు రాజును తమపై పాలనము చేయకుండ చేయవలెనని ఫ్రెంచివారి యుద్దేశ్యము. ప్రథమమున కొంతకాల మింగ్లీషువారికి జయములు కలిగెను. 1346 సంవత్సరమున కెస్పీవద్ద జరిగిన గొప్ప యుద్ధములో ఇంగ్లీషువారు సంపూర్ణముగ జయమొందిరి. "కేలేయను రేవు 'పట్టణము ఇంగ్లీషువారికి స్వాధీనమయ్యేను. ఇంగ్లాండులో ఘోర మగు ప్లేగు వ్యాపించినందున కొంత కాలము యుద్ధము ఆగినది. తిరిగి 1356 సంవత్సరమున ఇంగ్లీషు రాజుకుమారుడు ఫ్రాన్సులో గొప్ప సేనలతో ప్రవేశించి పాయి టీర్సు పద్ధ ఫ్రెంచి సేనల నోడించి అప్పటి పరాసు రాజగు "జాన్”ను ఖయిదీగ పట్టు కొనెను. 1360 సంవత్సరమున సంధి జరిగెను. ఎడ్వర్డు రాజుకు సంపూర్ణ హక్కులతో పరాసు దేశములోని అక్వీటైను రాష్ట్ర మును, కె లే పట్టణమును ఇచ్చిరి. ఎడ్వర్డు పరాసు దేశపు రాజ్య

మునకు హక్కును వదలుకొనెను.
50

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

వరాసురాజు “జాన్ " చనిపోయినందున ఆయన కుమా మడగు అయిదవ చార్లెసు రాజ్యమునకు వచ్చెను. తిరిగి యుద్ధ మును ప్రారంభించెను. 1372 సంవత్సరమున లా రొషీలు వద్ద నింగ్లీషు నౌకలను పరాసునౌకాదళ మోడించెను. 1377 సంవత్స రమున ఇంగ్లాండులో మూడవ ఎడ్వర్డు రాజు చనిపోయెను. అప్పటికి ఫాస్సులో కెలే మొదలగు కొన్ని పట్టణములు తప్ప మిగిలిన ఆంగ్లేయ రాజునకుఁడిన రాజ్యమంతయు పరాసురాజు తిరిగి స్వాధీన పఱచుకొనెను. యుద్ధమువలన పరాసు దేశము నకు మితి లేని నష్టముగలిగెను. యుద్ధకాలమున ఆంగ్లేయ 'సేసలు పరాసు ప్రజలను దోచుకొని, ఇండ్లు తగుల పెట్టి, దేశ మును నాశనము చేయుచుండెను. పరాసు రాజులు, ప్రభువుల సైన్యములు చాలక జీలిము లిచ్చి సైనిక దళముల నేర్పరచు కొనిరి. యుద్ధము లేనపు డీ సైనికులు దేశములో దోపిళ్ళు, హత్యలు జరుపుచుండిరి.

ఫ్రాన్సులో
అంతర్యుద్ధము.

అయిదవ చార్లెసు చనిపోవుసరికి ఆయన కుమారుడగు ఆరవచార్లెసురు పదునొకొండు సంవత్సరముల వయసుండెను. ఎటులనో రాజునకు యుక్తవయస్సు వచ్చువరకును పాలనముజరిగెను. యుక్తవయస్సు రాగ నే రాజుకు పిచ్చి యెత్తెను. ఆయన పేరట పరాసు దేశము నెవరు పాలించ వలెనసు విషయమున రాజబంధువులగు పరాసు ప్రభువుల మధ్య కలత లేర్పడెను. బర్గండీ ప్రభువు తాను పాలించప లెననియు, ఆర్మగునాకు ప్రభువు తాను పొలించవ లెననియు తగవులు

పడి వారు కొందరిని, వీరు కొందరినీ చేర్చుకొని దేశమును

51

అయిదవ అధ్యాయము


రెండుకళలుగా: విభజించి యుద్ధములు చేయుచుండిరి. ఈ స్థితిని కని పెట్టి 1413 సంవత్సరమున ఆంగ్లేయ రాజగు అయి దవ 'హెన్ రీ పరాసు దేశము పై దండెత్తెను. 1415 వ సంవత్స గమున ఎజినోకోర్టువద్ద జరిగిన గొప్ప యుద్ధములో ఆంగ్లేయు పరాసు సేనలు పూర్తిగ నోడించబడెను. ఫ్రాన్సులోని అంతర్యుద్ధ మెక్కు,వయ్యెను. ఒక కక్షి దారగు బర్గండీ ప్రభువు ఆం గేయ రాజుతో చేరెను. ఆంగ్లేయ రాజుపని , మంచిద య్యెను. 1418 వ సంవత్సరమున ఆంగ్లేయరాజు నా ర్మండీ రాష్ట్రమును జయించెను. పరాసు రాజపక్షము వారు చేయునది లేక ఆంగ్లేయ రాజగు హెన్రీతో సంధి చేసికొనిరి. హేన్రీ పరాసురాజు యొక్క కూతురిని వివాహమాడునట్లును, రాజు యొక్క జీవితకాలములో పరాసు దేశము నాయన పేరును పాలించునట్లును 1420 సంవత్సరమున సంధి చేసికొనిరి. మరుసటి సంవత్సరము 'హెన్రీ పారిసు పట్టణమున ప్రవేశించెను. కాని 1422 సంవత్సరమ. న హెన్రీ చనిపోయెను. ఆ సంవత్సరమే పరాసు దేశపు పిచ్చి రాజుకూడ మరణించెను. ఆయన కుమారు డగు ఏడవచార్లెసు పరాసు దేశమునకు రాజయ్యేను.

ఆర్లియన్సు
ముట్టడి,

ఇంగ్లీషు వారితో యుద్ధము జరుగుచునేయుండెసు. ఇంగ్లీషువా రేజయముల నొందుచుండిరి. పరాసు దేశములో ఉత్తర

భాగము నంతను ఆక్రమించు కొనిరి. 1428 సం

వత్సరమున ఆంగ్లేయ సేనలును, బర్గండి ప్రభుసేన లును కలిసి పరాసుదేశము లోని దక్షిణ భాగమునకు ముఖ్య

మయిన దగు ఆర్డియన్సు పట్టణమును ముట్టడించిరి. ఈ పట్టణము
52

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

శత్రువుల చేతిలో పడిపోవుటకు సిద్ధమగుచుండెను. ఇది పడినచో పరాసురాజు పరాసుదేశమును విడిచి పారిపోవలసినదే.

3

జోన్ ఆఫ్ ఆర్కు

ఇట్టిస్థితిలో విదేశీయులగు ఆంగ్లేయులనుండియు, 'దేశ ద్రోహులగు బర్గండీయులనుండియు పరాసు దేశమును రక్షిం చుటకు ఒక యువతి బయలు దేరెను. ఈమె పేరు జోన్ ఆఫ్ ఆర్కు. ఆమె డెమ్రీ అను గ్రామములోని యొక - వ్యవసాయకునికూతురు. ఆమె కప్పు టికి పందొమ్మిది సంవత్సరముల వయస్సు. మిగుల సాధువు.. పవిత్ర హృదయురాలు. గొప్పభక్తురాలు. విదేశీయులు తన దేశీయులను గావించుచున్న హత్యలకథలను వినుచుండుట వలన ఆమెకు హృదయ వేదన కలిగెను. తన దేశపు రాజగు పదవచార్లెసు యొక్క దీనస్థితిని వినిన కొలదియు ఆమె వేదన హెచ్చెను. ఎల్లపుడును దేవాలయములోను, అడవులలోను, తోటలలోను నొంటరిగా ఆమె తన దేశవిముక్తి కొరకుసు, తన రాజునకు జయము కలుగవలెననియు ప్రార్థించు చుండెను. క్రైస్తవమహాత్ములు ధర్మయుద్ధములో పరాసు సేనలకు జయముకలుగ జేయక పోరను ఆశ ఆమె మనసులో నుండెను. 'పగలును రాత్రియు ఆమె కదియే పరితాపము. ఆమెహృదయము దేశాభిమానము తోడను, హింసింప బడుచున్న వారియందు కరుణారసముతోడను నిండియుండెను. ఒక్కరోజొక మధ్యాహ్న మొక దివ్య స్వరూప మామెకు గన బడి "జోన్! బయలు దేరుము. పరాసు దేశపు రాజును రక్షింపు

ము. ఆయన రాజ్యము నాయన కిమ్మ. " అని చెప్పినట్లు విన

53

అయిదవ అధ్యాయము


బడెను. ఆమె భయపడి "అయ్యా! నేను బీదదాననగు యువ తివి. యుద్ధములను నడిపించుట నా కెటుల సాధ్యమగును?” అని జబాబు చెప్పెను. “మహాత్ములగు 'సెంటు కాథరిన్, సెంటు మార్గరెటులు నీకు సహాయము చేతురు లెమ్ము.” అని యాదివ్య స్వరూపము అదృశ్యముయ్యెను. ఇటుల అనేక సార్లు ఆమెకు మహాత్ములు ప్రత్యక్ష మగుటయు " లెమ్ము, దేశమును సం రక్షింపుము. విదేశీయులను వెడలగొట్టుము. నీ రాజునకు జయము నిమ్మ" అని చెప్పుటయు ఆమె వినుచుండెను. ఆమె యొక్క పరితాపము హెచ్చెసు. ఈ మహత్కార్యమును చేయు టకే తాను జన్మించెనని ఆమెకు తోచుచుండెను. ఆ మెతండ్రి, కీసంగతి తెలుపగా ఆమె సైనికులతోకూడ వెళ్లట కాయన సమ్మ తించలేదు. ఆమె పినతండ్రి యింటికి వెళ్ళినది. ఈ యుదంతమం తయు చెప్పినది. ఆయన అచటి సైనికాధికారి కా వృత్తాంత మెరింగించెను. సైనికాధికారి యిట్టి ఉన్మత్తురాలిని తన యొద్దకు పంపవలదని చెప్పెను. ఆమె తాను నడచియైన పోయి రాజు దర్శనము చేసితీరవలెనని నిశ్చయించెను. ప్రజ లామెపట్టు దలకు ఆశ్చర్యమును పొందిరి. ఆమె రాజదర్శనము చేయు టకు సైనికాధికారి అంగీకరించు నటుల చేసిరి. ఆమె వెంట్రు, కలను కత్తిరించి పురుష వేషమును ధరించి • గుఱ్ఱము నెక్కి కత్తిని చేతిధరించి బయలు దేరెను. ఆరుగురు చక్రరక్షకులతో రాజదర్శనమున కై శత్రువులున్న ప్రదేశము దాటిపోవలసి వచ్చెను.కూడసున్న వారి కామె ధైర్యమును చెప్పుచుండెను.

“భయపడవలదు. భగవంతుడు సన్నీ కార్యమునకై నియో'
54

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

గించినాడు” అని చెప్పెను. 24 ఫిబ్రవరి తేదిన రాజుండిన సినాన్ పట్టణమును చేరెను. రెండుదినము లామెకు దర్శన. మియ్యవ లెనా లేదాయని రాజు ఆలోచించెను. తుదకు దర్శన మిచ్చుటకు నిశ్చయించెను. ఆమె నిర్భయముగా రాజునొద్దకు వెళ్ళినది. మోకరించినది. "రాజకుమారుడా! నన్నేల విశ్వ సింపవు? భగవంతునికి నీ పైనను నీ ప్రజల పైనను జాలికలిగినది. నామాట నమ్ముము. నీ పూర్వులగు సెంటులూయీ, సెంటు షార్ల మేనులు నీకొరకు భగవంతుని ప్రార్థించుచున్నారు. నీవు నాకు సైనికుల నిమ్ము. నేను ఆర్లియన్సు ముట్టడిని వదలించి శత్రువులను వెళ్ల గొట్టి బర్గండీ రాష్ట్రములోని రైమ్సువద్ద నీకు కిరీటధారణము చేయించెదను. శత్రువులగు ఆంగ్లేయులు నీ దేశమును వదలిపోవుట భగవదుద్దేశ్యమై యున్నది.” అని రాజుతో చెప్పినది. రాజుగాని, ఆయనతో కూడ నుండిన మత గురువులుగాని ఆ మెమాటలు విశ్వసించ లేదు. అనేక ప్రశ్నలు వేసిరి. ఆమె అన్నిటికిని సమాధానము చెప్పినది. అద్భుత ములు చేసి చూపమని వారు కోరిరి. "నాచేతకాదు. నేను ఒక అద్భుతము మాత్రమీ చేసి చూపించెదను. నాకు సైన్యముల నిచ్చినచో ఆర్లియస్సునుండి శత్రువులను వెడలగొట్టెదను,” అని ఆమె చెప్పెను. ప్రజలు విశ్వసించిరి. ప్రజాభిప్రాయము సనుసరించి, రాజు ఆమె చెప్పిన చొప్పున ఆమెతో కూడ సేన లను పంపుట కొప్పుకొనెను. 1429 సం!!న ఏప్రిల్ 29 వ తేదిన జోన్ ఆఫ్ ఆర్కు సేనలను వెంటగొని ఆర్లియస్సుపై కి

వెడలెను. పరాసు సేనలు ప్రార్థనము సలిపిరి. తాము భగవ
55

అయిదవ అధ్యాయము


దనుగ్రహమువలన జయించి తీరెదమను దృఢవిశ్వాసము గలిగి యుండిరి. ఆమె పేరు విని దయ్యాల పోతనియు సైతాను యొక్క బలముచే తమ్మును. నాశనము చేయుటకే వచ్చి నిదనియు ఆంగ్లే య సైనికులు మిగుల భీతిఁ జెందిరి. పరాసు సేనలు ఆమెయొక్క ప్రోత్సాహమువలన బహుసాహసముతో పోరాడి ఆంగ్ల సేనల నోడించి ఆర్లీయస్సులో ప్రవేశించిరి. లోపలనున్న ప్రజలు కూడ బయటికి వచ్చి ఆంగ్లేయులను ముట్టడించిరి. మే నెల 8 వ తేదిన వారి సేనాధిపతులునుచే చాలవరకు సైన్యములును హతులు కాగ ఆంగ్లేయులును, బర్గండీ యులును మందుగుండు సామగ్రిని వదలి పారిపోయిరి. సేనలును ప్రజలును వారి వెంటనంటి చంపదలచి రిగాని, "వారిని పోనిండు; వారి వెంటబడి చంప వలదు.ఈది సము సబ్బాతుదినము," అని జోను చెప్పినందున మానివైచిరి. మే 18 వ తేదిన ఆమె తిరిగి రాజును దర్శించి రైమ్సునకువచ్చి కిరీట ధారణము గావింపుమని కోరెను. రైమ్సుకు రాజు బయ లు వెడలెను. త్రోవలో పేటేయివద్ద ఇంగ్లీషు సైన్యముల నోడిం చెను. ఇంగ్లీషు సైనికులలో చాలమంది హతులైరి. వారి సేనానులు పరాసు వారిచే ఖయిదుచేయబడిరి. ఆ ప్రాంతము లన్నియు పరాసురాజు స్వాధీన మయ్యెను. ట్రాయిసు, షాలా న్సు పట్టణములు పరాసు రాజు వశమయ్యెను. ప్రతిచోటను ప్రజలాయనను ఆదరించిరి. తుదకు జులై 18 వ తేదిన జయ ప్రదముగా రాజు . రైమ్సును చేరెను. అది బర్గండి రాష్ట్రములో నిది, అచటి ప్రజలుకూడ పరాసురాజుకు లొంగిరి, జూలై 17 వ తేదిన పరాసురాజగు - ఏడవచార్లెసు పట్టాభిషిక్తుడై


-
56

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

కిరీటధారణము గావించెను. జోను తనకు భగవంతునిచే నియమింపబడిన కార్యమును ముగించెను, తన స్వగ్రామము. నకు పోయి తన తండ్రి యొక్క మేకల మందలను కాచుకొనెద నని చెప్పెను. కానీ ఇంకను పరాసు దేశములో చాలభాగము ఆంగ్లేయుల క్రింద నున్నది గావున ఇంకను కొంతకాల మాగవల యునని రాజు గోరెను. ఈమె తక్షణమే పారిసు మీదికి వెడలు మని చెప్పెను. కాని రాజు యొక - సలహాదారు లట్టిపని చేయు టకు ధైర్యము చాలక పారిసు చుట్టుపట్ల నున్న చిన్న ప్రదేశ' ములను ముందుగా జయించ నిశ్చయించిరి. ఈ ప్రాంతము లన్నియు పరాసు వారికి లోబడెను. పారిసును వీరు చేరుసరికి: శత్రువులు పారిసులో బాగుగా స్థావర మేర్పఱచు కొని పారిసు ప్రజలను తమ వైపుకు తిప్పుకొనిరి. పరాసు సైన్యములు పారి సును ముట్టడిసల్పెసు గాని నిష్ప్రయోజక మయ్యెను. బర్గండీ. ప్రభువు కాం పైన్ ను ముట్టడించెను. దీనిని జోను సంరక్షింప యత్నించెను. 1430 వ సంవత్సరము మే నెల 30 వ తేదీన ఆమె దీని దర్వాజా బయటకు వచ్చి యుద్ధము చేయుచుం డెను. ఇంతలో దర్వాజా లోపలనుండి మూయబడెను. ఆమె శత్రువుల మధ్య చిక్కెను. బర్గండీవా రామెను పట్టుకొనిపోయి పది వేల ఫ్రాన్కులకు ఇంగ్లీషువారి కమ్మి వేసిరి. ఇంగ్లీషువా రామేను ఖైదులో వేసి తమకు లోబడిన ముగ్గురు పరాసు మత గురువుల చేత విచారణ చేయించిరి. పురుషుల బట్టలు ధరించుట యు, తల్లిదండ్రుల అనుమతి లేక యుద్ధమునకు వెడలుటయు,

మహాత్ముల దర్శనమయినదని చెప్పుటయు, మతమునకు వ్యతి

57

అయిదవ అధ్యాయము

రేకమని నేరారోపణ చేసి. ఆమె నిర్దోషినని చూపుటకు అవ కాశమియ్య లేదు. పోపుకు అప్పీలు చేసికొనుటకు అవకాశమియ్య లేదు. ఆమె పురుష వేషము ధరించినది, ఆమె "సైనికులనుండి మానమును గాపాడ కొనుటకై యుండెను. తక్కిన సంగతుల కన్ని టికిని ఆమె సమాధానము చెప్పెను. న్యాయాధిపతు లామె ను ఎటులైనను శిక్షించుట కొరకయియే నామకః విచారణను జరిపిరి. ఆమెను కై స్తవ మఠములో వదలి పెట్టెదమని వాగ్దత్త ముచేసి, ఇంతటి నుండియు పురుష వేషము వేయననియు, తాను యుద్ధములో ప్రవేశించి ననియు వ్రాయించు కొని, యావజ్జీవ మామె ఖయిదులో నుండునట్లు న్యాయాధిపతులు శిక్ష విధించిరి. ఆంగ్లేయుల ఖయిదులో ఆమె యుండెను. ఆంగ్లే యులు యుద్ధములలో ఓడి పోవుచుండిరి. ఆమె బ్రతికి యుండుట ఆంగ్లేయుల కిష్టము లేదు. ఆంగ్లేయు సైనికు లామెకు 'చెర సాలలో పురుష వస్త్రముల నిచ్చి బలవంతముగ స్త్రీవస్త్రములను లాగికొనిరి. ఆమె యెంత చెప్పినను వినలేదు. నిస్సహాయురా లగు ఆయబల పురుష వేషము వేయక తప్పినదిగాదు, ఏబట్టలు లేకుండ నాయువతి ఎటులుం డగలదు? విధి లేక పురుషవస్త్రముల దరించినది. పురుష వస్త్రములు తిరిగి ధరించినదని 'ఆ మె మీద నాంగ్లేయులు నేరారోపణ చేసిరి. యథార్థము న్యాయాధిపతుల కు తెలియును గాని శిక్షించకుండ న్యాయాధిపతు లెటులు విడిచి పెట్టగలరు? తిరిగి మతద్రోహి అయినది గావున ఆమెను మంటల లో వేసి తగులబెట్ట వలసినదను శిక్ష విధించిరి. ఈఘోరశిక్ష విన

గా నే తనవలన సెట్టిలోపము లేనిదే ఇట్టి మతద్రోహి యొక్క
58

ఫ్రెంచి స్వాతంత్యవిజయము

నీచమైన మంటలలో మరణించు శిక్ష తనకియ్య బడినదని ఆదిక్కు లేని పందొమ్మిది వత్సరముల యీడుగల ఆడబిడ్డ వెక్కి వెక్కి యేడ్చెను. తనకు శిరచ్ఛేదము చేసిన చాల మేలని రోదనము చేసెను, ఆమెకు దిక్కెవ్వరు? ఆమెను బండిలో వేసికొని 800 మంది ఆంగ్లేయ సైనికులు ఆయుధపాణులై ఇరు పక్క- లను నడువగ చేపల బజారునకు తీసికొనిపోయిరి. అచట నెత్తుగా పేరుప బడియున్న కట్టెలపై యామెను బడ వేసి బంధించి నిప్పం టించిరి. ఆమె దైవమును ఏసుక్రీస్తు ప్రభువును ప్రార్థించుచు తన శత్రువులను క్షమించుచు మంటలో కాలి ఘోరమరణ మును పొందెను.

4

ఇంగ్లీషు వారి
అపజయములు

ఆమెను చంపిన తర్వాత ఆంగ్లేయు అపజయముల వెంట సపజయముల నొందిరి. పరాసువారిలో ప్రతి చోటను విదే శీయులగు నాంగ్లేయులనుండి తమ దేశమును సంరక్షించవ లెనను 'దేశాభిమాసము పుట్టెను. జోన్ ఆఫ్ ఆర్కును పరాసుప్రజలు దేశము కొరకై ఘోర మరణము నొందిన మహాత్మురాలిగ జ్ఞాపకముంచుకొనిరి. బగ్గండీప్రభువు ఆంగ్లేయ రాజునుండి చీలివచ్చి పరాసు రాజుతో సంధి చేసికొనెను. ఆంగ్లేయుల బలము క్షీణించెను. 1436 వ సంవత్సరమున ఏడప చార్లెసు (పరాసురాజు) పారిసుపట్టణము నాక్రమించెను. 1439 వ సంవత్సరమున నార్మండీ రాష్ట్రము ఆంగ్లేయుల పై తిరుగబడగ పరాసురాజు తిరుగుబాటును ప్రో త్సహించెను. క్రమముగా పరాసు దేశములోని ఉత్తర భాగము

నంతను పరాసువారు స్వాధీనము చేసికొనిరి. గ్వయ నీ రాష్ట్రము

56

అయిదప అధ్యాయము

కూడ పరాసురాజుకు వశమయ్యెను. తుదకు 1453 సంవత్సర మున కాస్టిలానునొద్ద జరిగిన యుద్ధములో నూరు సంవత్సర ముల యుద్ధము ముగిసినది.ఈ యుద్ధములో పరాసు రాజు సంపూర్ణముగా జయమొందెను. కెలే అను "రేవుపట్టణ ముతప్ప మిగిలిన యావత్తు ఫ్రాన్సు దేశమునుండియు ఆంగ్లేయులు పెళ్లగొ ట్టబడిరి. ఫ్రాన్సు దేశ మంతయు పరాసురాజగు ఏడవచార్లెసు రాజు కిందికి వచ్చెను. ఈ నూరుసంవత్సరముల యుద్ధము అంతరించుసరికి పరాను దేశములో రాజు బలవంతుడయ్యెను. దేశమున కంతయు ఆయన ముఖ్యుడయ్యెసు. దేశములోని వర్తకులును ప్రజలును రాజుపక్షమున చేరిరి. ప్రజల యొక్క యిండ్ల మీదను భూముల మీదను టాలీయను పన్ను వేసి రాజు స్వంత పటాలములను సమకూర్చుకొనెను. ఈ యుద్ధములలో ఆ నేకులను ప్రభువులు చనిపోయి కొన్ని ప్రభువంశము లంతరిం చెను. ప్రభువుల బలము తగ్గెను.