ప్రబంధ రత్నావళి/పీఠిక (2)

వికీసోర్స్ నుండి

పీఠిక

తెలుగులో పూర్వకవుల కావ్యములను గూర్చి తెలిసికొనుటకు లక్షణ గ్రంథములును, సంకలన గ్రంథములును ప్రధానాధారములు. లక్షణ గ్రంథ ములలో అప్పకవీయము , రంగరాట్ఛందస్సు, సర్వలక్షణ సారసంగ్రహము మొదలైనవి మనకు పరిచితములైనవేగాని. అందుండి మనకు కాలగర్భమున నడగిపోయిన కావ్యములు చాల కొలదిగానే తెలియుటవల్ల వాజ్మయచరిత్ర కారుల కవి కొంతవఱకు మాత్రమే ఉపయోగకారులు.

అము ద్రితములైన లక్షణ గ్రంథము లింకను ఎన్నియో యున్నవి గాని యింతవజకు వానినిగూర్చే పరిశ్రమ యేలేదు వాని కూలంకష పరిశీలమువలన మన కీనాడు తెలియని ప్రాచీన కావ్యములు బయలుపడును పూర్తిగా పరిశీలితములైనగానీ వాజ్మయ చరిత్ర పూర్తికాదు.

సంకలన గ్రంథములు

మన యదృష్టవశమున సంకలన గ్రంథములు మానవల్లి రామకృష్ణ మహోదయులు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారి మూలమున వెలుగునకు వచ్చి, ఆంధ్ర వాజ్మయచరిత్రకారులకు విస్మృతములైన కావ్యములను, విస్మృతులైన కవులను పరిచయ మొనర్చినవి. అట్టి సంకలన గ్రంథములు మూడు.

1. ప్రబంధమణిభూషణము ----------- 1910. సంపాదకులు ----మానవల్లి కవిగారు,
2. సకల నీతి సమ్మతము ............1928. "
3.ప్రబంధరత్నావళి - ...................1018 సంపాదకులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు,

మొదటి రెండును ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారిచే విపుల పీఠిక లతో పునర్ముద్రితములైనవి 1[1] ప్రభాకరశాస్త్రి గారి గ్రంథము నేడు అనగా ప్రథమముద్రణమున కేబది యెనిమిదేండ్లయిన తరువాత తిరిగి ముద్రణ భాగ్యమునందుట సాహితీ చరిత్ర కారులకు ముదావహమైన విషయము.

సంకలన గ్రంథములు వాజ్మయ చరిత్ర

పై మూడు గ్రంథములుు తెలుగు వాజ్మయచరిత్రలో నన్నయకు పూర్వమునుండి, క్రీ. శ. 18వ శతాబ్దినలుకు గల విస్మృతములైన కవి కావ్య ములను దెలుపుచున్నవి. వాజ్మయ చారిత్రక దృష్ట్యా పరిశీలించిన వాని వివరణ మిట్లుండును.

ప్రబంధరత్నావళి .......... నన్నయకు పూర్వ కవికృతులు క్రీ. శ. 1689
                                       వఱకుగల కాలమున నున్న కవులు, కావ్య
                                        ములను దెలుపును

సకలనీతి సమ్మతము........నన్నయనుండి క్రీ. శ. 1430 వరకు గల
                                       కవులు కావ్యములను దెలుపును

ప్రబంధమణిభూషణము. క్రీ. శ. 18, 17 శతాబ్దములలోనున్న కవులు
                                       కావ్యములు తెలుపును.

--

ఆధారములు

ప్రబంధమణిభూషణమున కాధారమైన తాళపత్ర గ్రంథమును కవిగారు పేర్కొ నలేదు - కాని ప్రభాకరశాస్త్రి గారు ప్రబంధరత్నావళి పీఠికలో నిట్లు చెప్పినారు “కవిగారు ప్రబంధమణిభూషణమను పేరుతో ప్రచురించిన సంధాన మునకు ప్రతులు నాల్లైదు తంజావూరి పుస్తకళాలలో నున్నవి " (పుట 18)

దీనివలన - ప్రబంధమణిభూషణమునకు మూలము తంజావూరి పుస్తక శాలలోనున్న గ్రంథమనుట స్పష్టము.

సకలనీతి సమ్మతపు వ్రాతప్రతిని మాత్రము ఆత్మకూరు సంస్థ నాధీశ్వరులగు శ్రీమంతు రాజా ముక్కర సీతారామ బహద్దరు వారిచ్చినట్లు తెలిపినారు - (పుట 72 పునర్ముద్రణము). ప్రభాకరశాస్త్రి గారు తమ గ్రంథపీఠిక యందు తాము సంధానించిన విధా నము నిట్లు తెలిపిరి.

“ఇందలి పద్యములను సంకలనము చేసిన వారిర్వురు. ఒకడు పెదపాటి జగన్నాథకవి. నారాయణస్తుతి, శంకరస్తుతి, త్రిపుర విజయము, అర్ధనారీశ్వ రమునని మొదలు పెట్టి తెలుగున బెక్కువర్ణనాంశముల నేర్పఱచుకొని యై దొశ్వాసములుగా 'ప్రబంధరత్నాకర'మను పేర గ్రంథము రచించెను. పై గ్రంథ మున మొదటి మూడాశ్వాసములు మాత్రమే తంజావూరి సరస్వతీ పుస్తక భాండాగార మందున్నవి. కడమ గ్రంథమెక్కడ నున్నది కానరాదు. వేఱొక్కని పేరు తెలియరాదు. అతని సంధాన మాంధ్ర సాహిత్య పరిషద్భాండాగారమున నున్నది. ఆ సంధానమునకు బేరులేదు మొదలు లేదు తుదిలేదు - పరిషత్తువారుదాహరణ పద్యములని పేర్కొన్నారు. ఈ యిర్వుర కూర్పులందలి పద్యములను గ్రుచ్చి యెత్తి నేనీ ప్రబంధరత్నావళిని గొత్త వెలయించితివి".

పైదానిని బట్టి-ప్రబంధరత్నావళి కాధారములు, 1.జగన్నాధకవి ప్రబంధరత్నాకరము 2.ఉదాహరణ పద్యములు.

వీనిలో , ఉదాహరణ పద్యములు పరిషత్పత్రికలో ముద్రితములైనవి. మొదటిదగు ప్రబంధరత్నాకరమును గూర్చి వివరములు తెలిసికొనుట యావశ్యకము

తంజావూరి పుస్తకశాలలోని గ్రంథ వివరములు.

189. ప్రబంధరత్నాకరము- పేదపాటి జగ్గన Prabandbaratna- karamu-Pedapati Jaggana M. 382.S.C.187 X 1; d-162 = 114: G. 3240,

యుగ విభజనము

ప్రబంధరత్నావళి తెలుగు సంకలన గ్రంథములలో కాలక్రమమున ద్వితీయమైనను-ప్రాచీన కావ్యోదాహరణములను ప్రపంచించుటచేత నద్వితీయ మైనది. ముఖ్యముగా ఆంధ్రవాజ్మయ చరిత్ర గ్రంథమెట్లు తోడ్పడినదియు వివరించుచున్నాను. ఇంచు

నన్నయ పూర్వయుగము (క్రీ శ. 850-1000)

జై నసాహిత్యము

నన్నయకు పూర్వము తెలుగులో సాహిత్య మున్నదనియు నది జైన సాహిత్యమనియు మొదటిసారిగా నిరూపి:చినది ప్రబంధరత్నావళి-ఇందు

పద్మకవి జినేంద్రపురాణము. సర్వదేవుడు - ఆదిపురాణము.

ఆను రెండు కావ్యములనుండి పద్యములుదాహరింపబడినవి. వీనినిగూర్చి పీఠికలో (27 పుట, నిట్లున్నది.

“ద్రవిడ కర్ణాటభాషలలో జైనకృతులు పెక్కులున్నవి. జినేంద్రపురాణమనియు నాదిపురాణమనియు రెండు జైన ప్రబంధము లుదాహ రింపబడినవి. కాని వానియందలి పద్యము లేక్కువగా జేకొనబడవయ్యెను. ఉన్న పద్యములం జూడగా ప్రాచీనతర రచనముగా దోపకున్నది." నేను వీనినిగూర్చి పరిశ్రమచేసి-ఇవి ప్రాచీనములనియు, తేలుగున జైన సాహిత్యమునకు సంబంధించిన కృతులనియు నిర్ణయించితిని.

పద్మకవి జినేంద్రపురాణము (క్రీ శ. 841)

ఈ పద్మకవియే కన్నడ వాజ్మయమున ఆదికవియని ప్రసిద్ధిగాంచిన పంపమహాకవి. పద్మక ఏ పంపకవియేయని “నాడోజపంప" అను గ్రంథమున నిర్వివాదముగా నిరూపింపబడినది. పంపమహాకవి తెలుగుదేశమున కరీంనగర మండలమున వేములవాడ నివాసి వేములవాడ కధీశ్వరుడైన అరికేసరి ఆస్థానకవి పంపకవి. తెలుగు బ్రాహ్మణుడు, జైనమతము నవలంభించినవాడు. సోదరుడు జినవల్లభుడు వేయించిన శిలాశాసన మొకటి నేడు బయలుడినది. అందు 3 తెలుగు కందపద్యము లుండుట విశేషము. దీనినిబట్టి పంపకవి తెలుగున కవియని మనము నిశ్చయింపవచ్చును.

పంపకవి తన గురువైన జినేంద్రముని చరిత్రమును జినేంద్రపురాణము గా తెలుగున రచించినాడు. ఇందుండి యొక్క పద్యము మాత్రము నేడు మనకి

గ్రంథము ద్వారా లభ్యమైనది (చూ. నాతెలుగుకవుల చరిత్ర పుటలు 83-86)

సర్వదేవుడు (క్రీ. శ. 958)

సర్వ దేవుని తెలుగుకవులు స్తుతించిరి. ఎడపాటి ఎఱ్ఱన మల్హణ చరిత్ర లో.

చ. వినుతియొనర్తు నాంధ్రసుక విప్రభు నన్నయభట్టు తిక్కయ
జ్వను శివదేవు భాస్కరుని, జక్కన నాచనసోము సర్వదే
వుని భవదూరు వేము నలపోతన పిల్లలమర్రివీరభ
ద్రుని శరభాంకు వీరకవి ధూర్జటి కేతన భట్టబాణునిన్ .

ఎఱ్ఱున క్రీ. శ. 1500 ప్రాంతమువాడు.

దీనినిబట్టి తెలుగున సర్వదేవుడన్న కవి యున్నట్లు మనకు తెలియ గలదు.

ఈ సర్వదేవుడు కన్నడ రత్నత్రయమని ప్రసిద్ధిగన్న పంప, పొన్న, రన్న లలో- పొన్న అనునతడు. ఈతడు కన్నడ భాషలో శాంతిపురాణము ఆను గ్రంథము రచించి, ఆందు ద్వాదళాశ్వాసమున నిట్లు చెప్పుకొన్నాడు;

మ. సకలజ్ఞ కవిచక్రవర్తి జినచంద్రేంద్రంగ సద్భక్తిపూ
ర్వక దిందమ్మన భక్తినుంత దనుజాతం పొన్న నుం పేఱువదం
దుకర ప్రార్థిత శాంతి నాథ కథయం వేసప్పనం సర్వదే
వకవీంద్రం బరదంబుధర్ పొగఱిసం తన్నం మహోత్సాహదిం.

పైపద్యమువలన పొన్నకవియే సర్వదేవకవి యని నిశ్చితమైనది. పొన్నక వికూడ పంపకవి వలే తెలుగువాడే. ఆతడు వేంగీదేశమున కమ్మ నాటిలో పుంగనూరు వాస్తవ్యుడు,

ఆదిపురాణము

సర్వదేవకవి రచితమైన పై గ్రంథమునుండి రెండు పద్యము లుదాహ రింపబడినవి. అందొక మత్తేభము ఒక కందము గలవు.

క. హరినీలమణి విరాజిత
సురుచిర గోపురముదగిలి చూచి తమిస్రా
కరుడు విధుంతుదమండల
పరిశంకంజేసి పురముపై జననోడున్,

ఆదిపురాణమనగా జైనతీర్థంకరులలో తొలివాడైన ఋషభదేవతీర్థంకరుని చరిత్రము- దీనిని కన్నడ భాషలో పంపమహాకవి వ్రాయగా తెలుగున పొన్నకవి వ్రాసినాడు.

పొన్నకవి ఆదిపురాణము మన కీనాడు లభ్యముకాకపోయెను. తిక్కన కాలమునాటి కుండినట్లుగా మనకీ క్రింది పద్యములను బట్టి తెలియుచున్నది.

క. ఆరదములు దీవులున్నత కరులు గిరులు హరులు వీచికలు సుభటసము త్కర ముగ్ర సత్త్వములుగా శరనిధీగతి పాండుపుత్ర సైన్యం బొప్పెన్, (భీష్మ 1-181)

ఆదిపురాణము - కన్నడము

క. తరళ తరంగ తురంగం కరిమకరక రీంద్రమాఖిలశ ఫరతదాత్యు త్కరముగ్రహరథం భరతం గిత్తురుపయోధి బళ విళ సవమం.

ఆదిపురాణము తెలుగునను నిదే ప్రాస యుండనోపును తిక్కన పద్య మున - "ర" ప్రాసయే యుండుట గమనించదగినది.

తిక్కన - కరికరళీకరతురగో
                           త్కరలాలాజాలరక్తధారాపటలీ
                           పరిషి కంబై సంగర
                           ధరణీరజ మడఁగె నద్భుతం బెలరారన్ - (భీష్మ 1-245)

కన్నడము - కరికరశీకరమదజల
                 తురంగలాలాంబు సేక దిందఱదుఱది
                 ర్దరజం నరేంద్రచామర
                మరుదభిహతియందెరళ్దు తూళ్లత్తాగళ్

పైవానినిబట్టి తిక్కనాటికి సర్వదేవుని ఆదిపురాణము వ్యాప్తిలో నున్నది.

ఉ. శాలివనాలి తెలి జలజాతపరాగము దూలి పద్మిని
కూలలతాంత సౌరభము గ్రోలి మధూలిత పక్షజాతవా
తూలము నేలివాకణము దోలి మదేభమదాంబుధారలన్
దేలి వనాంతరాళములఁ ద్రిమ్మరు గాలి ప్రమోదశాలియై.

ఇది సర్వదేవుని యాదిపురాణమునందలి దని లక్షణసారమను నొక లక్షణ గ్రంథమున నున్నది

ఆప్పక వినాటికి ఆదిపురాణమున్నట్లు తెలియుచున్నది. ఆదిపురాణ మని యిచ్చిన పద్యము ఉత్తర హరివంశములో నున్నది కాని - ఆ కాలమునకు తెలుగున ఆదిపురాణ మున్నట్లుగా అది తెలుపుచున్నది.

(తెలుగు కవుల చరిత్ర పుటలు 91-96)

శివకవి యుగము (1100-1250) నన్నెచోడకవి

నన్నెచోడకవికృత్యంతరమగు కళావిలాసము నుండి యిందు 4 పద్య ము లుదాహరింపబడినవి. ఈ గ్రంధ్రమునకు ముందుగా కళావిలాసమును గూర్చి తొలుత మానవల్లి వారే తెలిపిరి-1908 లో కుమారసంభవ ప్రథమభాగమున- నాల్గు పద్యము లిచ్చిరి.

.....................................................................ప్రబంధరత్నావళి
క. తలపోయఁగ రుచులాఱును .....................184 పద్యము
చ. తొడవులు పెట్టుసంభ్రమముతో ..................185ప.
సీ. పృథుల విశ్వంథరారథము ....................186 ప.
క, శ్రీమంతుఁడు గుణవంతుఁడు...................... 187 ప

ప్రబంధరత్నావళిలో 187 పద్యముగా నున్న 'శ్రీమంతుఁడు' అన్న పద్యము కవిగారీయలేదు. దానికి బదులుగా

చ, లలనలు కొందరాత్మ పతులం దగగూడిన చెయ్వులన్నియున్
దలఁచి సభీజనంబులకు దప్పక చెప్పెడివారు పుణ్యజీ
పులు చెలి యామినీళుని కవుంగీల డాయుటెగాక తాల్మికీ
ల్దొలఁగిన తీరుగేరునట దోపవు నాకు రతి ప్రయోగముల్ ,

ఇందువలన కళావిలాసమున మనకు లభించిన పద్యములైదని తెలియ వలెను. ఇందలి మన్మథస్తుతి లోకోత్తరమైనది. ఇతరకవులెవ్వరును చేయనిది.

అభిజగజెట్టి మన్మథుఁ డఖిలలోక
ములకు వేఱగొంగ జీవులమూలకంద
యతని యిలుసొచ్చి వెడలని యతఁడుగలఁడె
యతని యమ్ములఁబడకున్న యతఁడు గలఁడె.
.....................................................................(కవిగారి రచనలు, పీఠికలు పుట 2)

సోమేశ్వరుడు పాలపర్తి . (6-11-12 పద్యములు)

ఇచ్చట 'పాలపర్తి ' అని యుండుట సరి కాదు. అది "పాలకుర్తి " యని యుండవలెను. ఇది ఆంధ్ర సాహిత్య పరిషత్తువారి ఉదాహరణ గ్రంథములో గలదు. అచ్చటి వ్రాతప్రతినిబట్టి నేను నా ప్రతిలో సవరించినాను. ఇం దుదాహ రింపబడినవి రెండును సీసపద్యములే. అవి త్రిపురాసుర సంహారమును ప్రశం సించునవి ఇందలి రెండవపద్యము భావధ్వనికి ప్రశస్తమైన లక్ష్యము .

సి. వింటి క్రిందికి కొమ్ము వికలించి పేఱికిన
          భూకాంతకును నాభి పొలుప మిగిలె
నమ్ము పుచ్చుకొనంగ నమితతరంగముల్
         పాలసంద్రంబునఁ బ్రజ్వరిల్లె
బండికండులు రెండు పండ్లిగిలించిన
        గలువలు తామరల్ చెలిమి చేసె
వాజులఁ గొనివచ్చి వర రథంబునఁ బూన్ప
       జిచ్చుకు నాకలి చిచ్చు పుట్టె

సి. నారి సంధింప కశ్యపునారి వడకే
గోల సంధింప లచ్చికి గోల వుట్టె
విల్లు తెగ బాపి పరములు దైళ్ళ నేసి
తరిది విలుకాఁడ వైదువు శరభలింగ!

త్రిపురాసుర సంహార మింత భావధ్వని వైభవముతో వర్ణించిన వేఱొక కవి లేడు.

రంగనాథుఁడు (407 - 409)

ఈతని పద్యములు మూడుదాహరింపబడినవి.ఈతడు పాల్కురికి సోమనాథుని సమకాలికుడైన చక్రపాణి రంగనాథుడు - ఈతనిగూర్చి తొలుత తెలిపినవారు ప్రభాకరశాస్త్రి గారే. (చూడుడు బసవపురాణము ప్రథమముద్ర ఇము (1926), పీఠిక పుటలు 28-28.)

ఈతడు శ్రీగిరినాథ విక్రమము అను 700 సీసపద్యములుగల గ్రంథము రచించెను. ఈతని చరిత్రము కన్నడ కవిచరిత్ర లో గలదు. అందాతడు పెక్కు శతకములను దండకములను తోటక వృత్తములను, రగడలను రచించినట్లు గలదు, ఇందు దుదాహరింపబడిన పద్యము-

బ్రకటించిరి.

“గిరిజాధినాయకా" అను

మకంటముగలది. ఆ పేరుగల శతకము లోనిది కావచ్చును-ఇట్లే ఈతని చంద్రోధరణశతకమునుండి యొక పద్యము లాక్షణికు లుదాహరించిరి. రగడలను రెండింటిని--నయన రగడ-సమశ్శివాయ రగడ అను వానిని శాస్త్రిగారే గుర్తించిరి. ఆ రెండింటిని వారు “రంగనాథుని శివకవిత్వము" అను వ్యాసమున అది శ్రీ వేంక టేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థపత్రిక యందు ప్రకటితమైనది. (1961)

తిక్కన -ఎఱ్ఱన యుగము (1250–1400)

తిక్కన

తిక్కన విజయ సేనమునుండి యిందు పద్యము లుదాహరింపబడినవి.(151 - 180)

161వ పద్యము "ఉత్సాహప్రభుమంత్రశక్తులు"అనునది- నీతి భూషణము లోని పద్యము-సకలనీతి సమ్మతము (150 పద్యము)

సీ. ఆరిమానసంబులు
ఉ. అల్లనఁ దొండ మెత్తి
క. కిసలయకదళీ
చ. కొనియెద మన్న

శా. గీర్వాణాచల
క. పరధన పరాంగనాజన
సీ.మదనవశీకార మంత్రదేవత
గీ. మహిమ చెడదు స్వామ్యమాత్య,

గ్రంథాంతమున:

సీ. పద్మంబులును
చ.. తరుణుల వీగు చన్నుగవ.

పై పద్యములుగాక - మానవల్లి కవిగారు కుమారసంభవమున లఘుటీకలో నీ క్రింది వానిని నుదాహరించినారు.

ఉ.పల్లవ పుష్పసంపదలఁబంచి వసంతుఁడు కావురాకకై
యెల్లవనంబుసంకటములేఁదగఁదారోడికంబుమీఱ న
ట్లల్లనగ్రోలి,లి మలయానిలు డందు పురాణపత్రముల్
డుల్లఁగఁజేసె సత్కియఁ బటుత్వము రాముఁడు పిచ్చలింపగన్

సోమయాజివిజయ సేనము

సీ కలయంగధారుణీతలమగ్నితప్తమై యుప్పరీ పెనమట్టు లుబ్బియుండుఁ గులపర్వతంబులు కొలిమిలోఁగ్రాఁగిన యినుపముద్దలక్రియ నెసఁగియుండు (మానవల్లికవి రచనలు పీఠికలు పుట 22)

ఆంధ్రకవితరంగిణియందు - 3 వసంపుటమున తిక్కన చరిత్రయందు పై పదకొండు పద్యము లుదాహరింపబడినవి కాని నేను పైని చూపిన పద్యము సీసపద్యపాదము అందు చూపబడ లేదు.

అప్పకవీయమున విజయ సనమునందు

వల్లభుఁడేగు దుర్లభుఁడు వానిదెసం దగులూది యిమ్మెయిన్
దల్లడమందెదేల యుచిత స్థితికి న్నను బాపఁజూపినన్
దల్లియు బంధులోకమును దండ్రియునేమను వాగెఱంగిరే
నుల్లమనీకు నిట్లు తగునో తగదో పరికించి చూడుమా. (8-258)

మున అని ప్లుతయతికి నుదాహరణముగా నీయబడినది. దీనినే కస్తూరిరంగకవి ఆనందరంగరాట్ఛందస్సున గ్రహించినాడు (8–189)

ఇందువలన విజయ సేనమునందలి పద్యములు 18 ను- ఒక సీసపద్యమున రెండు పాదములును లభించినవని గ్రహింపవలెను.

విజయ సేనము - తిక్కన కృతిగా పెదపాటి జగ్గన ప్రబంధ రత్నాకర యుదాహరించినాడు

ప్రబంధరత్నావళి చివర -

పెదపాటి జగన్నాథకవి మా త్రమే యుదాహరించిన కవులు కావ్యములు

ఆంధ్ర సాహిత్యపరిషద్గ్రంథ సంధాత మాత్రమే యుదాహరించిన కవులు కావ్యములు.

ఇర్వురు సుదాహరించిన కవులు కావ్యములు అను మూడ శీర్షికలలో కవి కావ్య వివరము లీయబడినవి.

ఇందు మూడవ శీర్షికలో -

“ి తిక్కన-విజయ సేనసు 168- ! 57. ఆం. 152, 154, 155-160" అని స్పష్టముగా దెలుపబడినది. కావున క్రీ.శ. 1580 నాటికది తిక్కనకృతియే యని సంకల నగ్రంథకర్తలు నిశ్చయించినట్లు తెలియగలదు.

(పుట 188)

విజయ సేనమునందలి -

“తరుణుల వీరుడన్నుగవ తాకున" అను ప్రబంధ రత్నావళిలోని పద్యము-- తిక్కన నిర్వచనోత్తర రామాయణము 1-51 లో నున్నది.

తిక్కన తన గ్రంథములలో నొక కృతిలోనివి మఱియొక కృతిలో గ్రహించు సంప్రదాయము గలవాడు. నిర్వచనోత్తర రామాయణ పద్యములను భారతమున గ్రహించినాడు, అట్లే తన విజయ సేనమునందలి పద్యమును నిర్వచనోత్తర రామాయణమున గ్రహించినాడు. ఇందువలన -

“ఈ లాక్షణిక గ్రంథ ప్రామాణ్యము ననుసరించి విజయ సేనమును తిక్కనగారే వ్రాసినారనుట కవకాశము కనిపించుటలేదు" అను వాక్యము పరా స్తమగుచున్నది. ( డాక్టరు కేతవరపు రామకోటిశ్రీ. తిక్కన కావ్య శిల్పము. (పుట 8). )

తిక్కన విజయ సేనములోని-

“మదనవశీకార మంత్రదేవత దృష్టి
గోచరమూర్తి గైకొనియె నొక్కొ"

అను పద్యపాదమును నూతనకవి సూరన తన ధనాభిరామమున నిట్లనుకరించి

“మదనవశీకార మంత్రరూపములోన మెలగేడు తొలుకొరు మెఱువులనఁగ" (2–24)

దీనినిబట్టి విజయ సేనము ప్రచారములోనున్నదని చెప్పవచ్చును.

ప్రబంధమణిభూషణమున (క్రీ. శ. 17 వ శతాబ్ది)గల విజయ సేనము నందలి పద్యములు ఇవి యీ గ్రంథమున లేవు.

సీ. ఆమ్మెద ననినఁ బద్మాషుఁ గౌస్తుభమైన వెఱవక కొనియెడు వెరవుగలిగి
విలువయిచ్చెదమని వేఁడినఁ బులిజున్నుఁ గమ్మపసిండియు నమ్మగలిగి
ఏ వస్తువైన ప్రొద్దెందఱు జనుదెంచి యెంతటి కడిగిన నెదురుగలిగి
తనయింటలేని యర్థము లర్దపతియింట నైన వెదకిన లేవనుటగలిగి

తమ కులాచార చారు వర్తనము కొఱకు
నంగడుల యొప్పునకును బేహారమాట
గాని లాభంబునకు నాటగాదనంగ
వరలుదురు పురవరంబున వైశ్యవరులు,

ఏనుగులు

100 సీ. ఉన్నచో గతిమాలి యునికి యిష్టంబని గ్రుమఱనేర్చిన కౌండలనఁగ
గాలిచేఁ దూలెడు కష్టంబు వోవఁగ ఘనమైన నీలమేఘంబు లనఁగ
వినురూపమై యున్కి వెల్లదనంబని కడు నల్లనైన దిగ్గజములనఁగ
తిమిరారి యట యని ద్యమణితో మార్కొని నిలిచిన యిరుల మన్నీ లనంగ

45

ఆ. నే దానవారినాభిదఘ్నమై వీథుల నేబులట్ల పొంగి పాఱుచుండఁ బవన బోయివచ్చు ప్రథమకేళీ జయ సారణములు పురము వారణములు.

మలయానిలము

144. సీ. ఘనసారకస్తూరికా గంధములనన్య గంధబంధంబుల గఱపి గఱపి

{
కుసుమితవల్లికాలసిత వీథులఁజొచ్చి

చనిసరోగృహములమునిగి మునిఁగి

సమధికాహర్యాంగ సంగీతములతోడ కన్నె తీగల కాట గఱపి గజపి

కుముదకుట్మలకుటీకోరకంబులుదూఱి

యలిదంపతుల నిద్ర తెలిపి తెలిపి

ఆ. వె. అనుదినంబునప్పురాంతికమ్మునగట్టి
వాలువోలే విప్రవరుఁడు వోలె
నట్టువొఱవోలె నచ్చిన చెలివోలె
మలయుచుండు మందమారుతంబు.

పై వివరణవలన తిక్కన విజయ సేనములో 18 పద్యములు. ఒక సీస పద్యమున రెండు పాదములు దొరికినవని గ్రహింపవలెను.

కే తన

ఇతఁడు తిక్కన పెదతండ్రి. ఈతఁడు కాదంబరీని పద్యకావ్యముగా వ్రాసెను. అందుండి రెండుపద్యము లుదాహృతములైనవి. (88-97). ఒకటి శార్దూలము ; రెండవది సీసము.

కేతన కాదంబరీ నుండి మటి రెండు పద్యములను కవిగా రుదాహరించినారు.

వేసవివర్ణన

సీ. కడు వేడి పెల్లెండ పుడమి పేల్చిన ! పొద్దు లాకాశ గతియ మేలని తలంప
హత్యా భిహతి లగ్గవాడి వియచ్చరు లవనిపై జనుట మేలని తలంప
వడవడగా నీళు లుడికిన జలచరుల్ వనచరవృత్తిమేలని తలంప
వనముల గార్చిచ్చు దనరిన వనచరు అంబు సంచరణమేలని తలంప

ఆ.వె.వాడి యెండ గాసె వడగొనె సురగాడ్పు
లెసరి వడయగాలి నెగడి వీచె
దావదహనమడరె జీవుల కధిక సం
తాపకారి యగునిదాఘవేళ

కవి స్తుతి

సీ, ఆనక యమృతంబు దానిట్టి చవియని జనులకేర్పఱుపగా జాలువారు చూడక మన్మథు సుందరాకారంబు గరిమ చూపగ జాలుకడక వారు వినక యపరతత్త్వ విపుల నినాదంబు వినిపింప జాలేడు వెరపువారు అంటక మెఱలుగులయందంబు వ్రేగును గణుతింపజాలు ప్రఖ్యాతివారు

గీ కంపుగొనకయ కల్పవృక్షముల పుష్ప
సౌరభంబిట్టిదని చెప్పఁ జాలువారు
ఎందుజూచినధాత్రిలో హృదయదృష్టి
కవులుగానని మర్మంబు గలదె జగతి.

కేతన కాదంబరినుండి మఱియొక సీసపద్యము మూడు పాదములు మాత్రమే కవిగా రుదహరించినారు.

సీ. దీనిలోపల గొన్ని దినములూనిన సుష్ఠకరుఁడైన సటు శీతకరుఁడుగా డె
దీని లోఁతెఱి గిన దానంబురాశిలోఁ గాదని జలశాయి కాపురాఁడె
దీని తియ్యనినీరు దివిజులు త్రావిన దమ యమృతంబుబేఁ డనుచుననరె*

అన్నయ (షోడశకుమార చరిత్ర)

వెన్నెలకంటి అన్నయకృతమగు షోడశ కుమార చరిత్రయం దుదాహ రింపబడినది. (చూడుడు పుట 768)

అన్న దానమహత్త్వము 514.515

ఆదిమూర్తి మహాలక్ష్మి యప్పురంబు
సొచ్చి నిల్చిన వారాశి చూడవచ్చి
కోటసొరరాక కూతు పైఁగూర్మిఁ జుట్టు
పారియున్నటు లొప్పారీ పరిఖమెఱయు.

గీ. మహిత సన్మార్గవర్తనమాన్యులనఁగ
బొలుచు నినరాజగురుకవి బుధులనైన
దగులఁబడ జేయుఁ బెంపునఁ దనరు వీటి
కొమ్మలకు సాటియై కోటకొమ్మలమరు.

షోడశకుమార చరిత్ర- ఆంధ్రసాహిత్య పరిషన్ముద్రితము 1984

గీ. అది.................... .ప్పురమునఁ
గాపురంబుండగాఁ జూడ గడలివచ్చి
కోట సొరరాక కూతుపై కూర్మిఁ జుట్టు
పారియున్నట్టు లొప్పార పరిఖ మెఱయు

పరిషత్తుకు దొరకిన తాళపత్ర ప్రతిలో మొదటి పాదముమధ్య లోపించినది. అది

“ 'ఆదిమూర్తి మహాలక్ష్మి యప్పురంబు" అని యీ గ్రంథమునుబట్టి పూరింపవచ్చును.

రెండవ పాదమున పాఠభేదమున్నది
“కాపురంబుండ గాఁజూడఁగడలి" ముద్రితప్రతి
సొచ్చినిల్చిన వారాశిచూడ-ప్ర ర. పాఠము
మహిత సన్మార్గవర్తనమాన్యు లనఁగఁ
బొలుచు నినరాజక చిగురుబుధుల నైనఁ
దగులువడఁ జేయు పెంపునఁదనరు వీటి
కోట కొమ్మలు తారకాస్ఫోటస జులు
కొమ్మలకు సాటియై కొటకోమ్మలమరు ప్రర. పాఠము

శివదేవయ్య (పురుషార్థసారము)

జై తరాజు ముమ్మయ విష్ణుకథా విధానములోనిదిగా

సీ. ఊకరల్ గొట్టక యుబ్బసంబందక వెఱవక దేహంబు విలుచుకొసక

ఈ పద్యమునందచ్చట చుక్కలున్నవి. ఆసలుపద్యమిది సి. ఊరక మురియక యుబ్బసంబందక వెఱవక దేహంబు వీఱిచికొనక నిడుసునఁబెట్టక ని ప్పోటమునఁబోక తరవాయి దప్పక తడవికొనక అక్షర స్పష్టతయన గీతనష్టత గొకుండ నర్థంటు గానఁబడఁగ నయ్యైరసంబుల కసురూపముగఁ బెక్కు రాగముల్ ఫణితుల బాగుపుట్ట

గీ. చెఱకు కొననుండి నమలిన చెలువు దోప నంతకంతకు వేడుక యతిశయిల్లఁ జదువుచున్నారు వీరల చదువుటోల జదువులేదని పోగడిరి సభికవరులు

................................సకలనీతి సమ్మతము, పురుషార్థసారము 308 ప.

ఎఱన

నృసింహపురాణము.

గ్రంథనామము కర్తనామము తెలియరానివి --

1. 524 సీ. అఖిలలోకాధార...
సొరమహనీయ ...................సృసింహపురాణము
మహిమకాధారమగుచు............1-26.
2. 587. కడలుఁ జేతులార్చుచు ఫేనఘనతరాట్ట
హాసరుచితో ప్రవాళజటాలివిచ్చి
......... ........ ...........
........... .......... ........ 1-26.

ఇందు రెండుపాదములులేవు. ఆ రెండు పాదములివి. యోర్వశిఖిపాలలోచనంబనఁగ సింధు వమరుఁ దాండవమాడెడు హరునివోలె

8, 540. మహాస్రగ్ధర.

కనీరుగ్రగ్రాహనక్రగ్రహణఘుమ ఘుమాకారకల్లోలడోలా ..............3-8.
స్వనస, ప్రద్యోత కేళీసరళ సపణభృచ్చారుజూటాగ్రజాగ్రత్
మచరత్నోదంచితోద్యత్కటు కుటిలమ యూఖచ్చటా టోపమిథ్యా
జనితౌర్వారంభ శుంభత్సలిలనివ్వని సంద్రురత్నాక రేంద్రున్.

ముద్రితపాఠము

1. క్రమణ
2. 'ప్రత్యూష' అయియుండును
3. కట-
4. 557. సీ. తిమిర భూతముకుదెలియ
..... ...... ........ .........
చంద్రుఁడుదయించెఁ గాంతి నిస్తంద్రుఁడగుచు 8-84
5. 577. ఉ. రాజిత తేజుఁడైన దీనరాజు. 8-81.
ఈ పద్యములను గ్రంథములో జేర్చుకొనుడు.

6. గీ. పొదలియొండొంట దివియును భువియుదెసలు
బొదివి కొనియెడిచీకటి ప్రోవువలన
మిక్కుటంబుగఁగాటుక గ్రుక్కినట్టి
కరవటంబనజగదండఖండమమరు ......................3-80. .

చెన్నమల్లు శ్రీ గిరన్న

ఈతని శ్రీరంగమహాత్మ్యమునుండి నాలుగు పద్యము లుదాహృతము లైనవి.

ఈ శ్రీ గిరన్నకవి-ప్రోలయవేముని మోగల్లు శాసనము (క్రీ. శ. 1815)న పేర్కొనబడిన "ప్రమథకవి శ్రీగిరి" అని వాజ్మయచరిత్రకారుల యభిప్రా యము. ఈతడు శ్రీరంగనూహాత్మ్యమే గాక “నవనాథచరిత్ర" అను పద్య కావ్యమును రచించినట్లును, దానిని తాను ద్విపదగా చేసినట్లును గౌరన తన నవ సౌథ చరిత్రలో తెలిపినాడు-మడికి సింగన సకలనీతి సమ్మతమున నుదాహరించిన శ్రీగిరీశ శతకము (చిరతరప్రకాశ - శ్రీగిరీశ - అనుమకుటము) శ్రీగిరిదే నని కొందరి యభిప్రాయము.

ఈతడు , శైవుడగుట స్పష్టము. ఆయితే శైవుడు వైష్ణవ క్షేత్రమై, వైష్ణవమత సంబంధమైన శ్రీరంగమాహాత్మ్యము వ్రాయునా అని మనకు సందే హము కలుగవచ్చును కాని అట్టి సందేహమున కవకాశము లేదు- శైవుడనని స్పష్టముగా చెప్పుకొన్న పోతన, వైష్ణవ గ్రంథమగు భాగవతమును రచించెను. పోతనకు ముందే శంభుదాసుడగు ఎఱ్ఱన రామాయణ హరివంశ ములను వైష్ణవ సంబంధ గ్రంథములు రచించెను.

నాచన సోమన

సోముని యుత్తరహరివంశమునుండి ఒక పద్యమిందుదాహృతమైనది-

386 జయనారాయణ పుండరీక నయనా శార్జీ జగన్నాయకా
జయపీతాంబర భక్తవత్సల విరించ స్తోత్రపాత్రక్రియా
జయ జంభారి విరోధి విక్రమకళాఖాఘా విఘాత క్రియా
జయ గోవింద ముకుంద మంధరగరాశారీ మురారీ హరీ

-

ఇది జైతరాజు ముమ్మయ విష్ణుకథానిధానములోనివిగా నున్నది. కాని ఉత్తర హరివంశమున (8-2) నిది గలదు--


చిమ్మపూడి అమరేశ్వరుడు

ఈతని కృతియగు విక్రమ సేనమునుండి (10-83)58 పద్యము లుదాహరింపబడినవి. ఈ సంకలన గ్రంథమున- పెమ్మన అని పెద్దచరిత్రనుండి 63 పద్యములు గ్రహింపబడినవి కనుక పద్యగ్రహణమున నిది రెండవది. అమరేశ్వరుడను కవియున్నట్లు లక్షణ గ్రంథమూలమున మనకు తెలిసినను, అతని పూర్వకవులు చాలగా ప్రశంసించినను, ఆతని కవితా వైశిష్ట్యమును తొలత లోకమున కెఱుక పఱచినది ప్రభాకర శాస్త్రి గారే- ప్రబంధ రత్నావళిలో సుదాహ రింపబడిన 53 పద్యములలో నాలుగుపద్యము లమరేశ్వరునికావు. కాబట్టి యందు నవి 48 పద్యములని మనము గ్రహింపవలెను.

క్రీ. శ. 1856 సంవత్సరముననున్న అప్పకవి సమకాలికుడగు అహో బలపతి తన అహా బలపండి తీయమున అమరేశ్వరుని విక్రమ సేనమునుండి యొక పద్యపాద ముదాహరించినాడు.

అజంతపరిచ్ఛేదము - “అర్థవిశేషము.. సమహత్తులకు మహనాకారము వచ్చును" అను ఆథర్వణకారిక నుదాహరించుచు-

“మాకెల్లఁ గలహరింబుకూడ డిక నీ మర్యాద జెల్లింపవే ”

అని యమరేశ్వరుని ప్రయోగము. (ఇందు మాకనుచోట బహువచనము.

(పుట 362)

క్రీ. శ. 1740లో కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ సారసంగ్రహ మున విక్రమ సేనమునండి యీ క్రింది పద్యము సుదాహరించినాడు-

ఆ. వె. నీరసగ్నియునికి మారయ విస్మయం
బనుచు బాడబాగ్ని కదలి యప్పు
రంబు జొచ్చెనొక్కొ రత్నాకరము మణు
లనగ జెలువమమరు నాపణములు.

ఇందువలస 1740 ప్రాంతమున నీ కావ్యము ప్రచారమున నుండెను.

క్రీ. శ 1908తో కవిగారు తమ కు సూర సంభవ లఘుటిక లో విక్రమ సేనమునుండి పద్యములుదాహరించుటచేత నిది యీ శతాబ్దిలోగూడ పరిశోధకు లకు పరిచితమని తెలియవలెను,

ఏక్రమ సేనముస ప్రబంధరత్నావళిలో లేని పద్యములు- ప్రబంధమణి భూషణము నుండి.

137. మ. శరధిప్రఖ్యము వేదమూర్తులు కుభృత్సంకాశముల్ మారుతో
ధురవేగంబులు కిన్న రేగధను బుద్ధూతారు లభ్రంకష
స్ఫురణాన్నత్యము లభగేహభముల్ పుణ్య స్తముల్ తత్పురీ
పరిభావి ప్రగజాశ్యవైశ్యసుభట ప్రాకార సౌధోన్నతుల్

.

147. సీ. వీక చారవింద దీర్ఘ కలలో విహరించి నలిఁగమ్మ దావులననగి పెనఁగి
కుసుమిత నవలతా విసరంబుగడలించి యలదేనియల సోననలము కొనుచు
సహకారపాదపచ్ఛాయలకై యేగి శశికాంత వేదులను చరించి
సురత కేళీ'శ్రాంతి సొగియు ముద్దియల పై చిట్టాడు తనువుల చెమటలార్చి
చంచరీకంబురీతి పర్జన్యు భాతి
వీరహపరీతాపహరుమాడ్కి సురటిరీతి
నప్పురంబుస సకల జనానుమోద
కరణదక్షుడు దక్షిణగంధవహుఁడు,

492. గీ. రత్నసుందరి వక్రేందు రమ్యలీల,
గాంచి విలసిల్లెనృప నేత్రకైరవములు
పొంగె రాగాంబుధులు నిట్టఁబుష్పఛస్వు
నగ్గమగువారి చేష్టల నభినుతింతు.

498. క. కప్పురపుధూళి యొక్కఁడు
గుప్పంబ్రస్వేద మొడలఁగూడక యున్నన్
మెప్పువడఁగుండ లద్వయి
నొప్పుగ వీడ్వడఁగఁదాల్చునొక్కొండొరిమన్ .

క. మంచాంతరంబు దస పా
దాంచలమున మేట్టిగర్వహాస వికాసా
భ్యంచిత వదనుండై యా
డించున్ కరవాలమలపుడిగం దోచున్ .

అమరేశ్వరుని విక్రమ సేనమున పై పద్యములతో గలిపిన- (ప్రబంధరత్నావళి 48 + 5)- 64 పద్యములు మనకు లభించుచున్నవి.

ఇంకను ఆముద్రితమైన సంకలన గ్రంథముల యందెన్ని యున్నవో తెలియరాదు

494 ఇందలి పద్యము (84) నన్నెచోడని పద్యమున కనుకరణము

శా. దానానేక పబృంహితస్వనము గంధర్వాపళీ హేషిత
ధ్వానంబున్ మృదువేదనాదమును గాంతానూపురారాపమున్
గాసపూనరసంబుఁ దూర్యమహుళంఖస్పారరావంబు బె
ల్లైనిరాకర ఘోషమోయనగ సత్యంబుం జలంగున్ బురిన్,

నన్నెచోడని పద్యము

మ. సమదానేక పబృంహితంబు హయ హేషామోషముణ గీతనా
ద్యమృదుద్వానము వేదరావము భటోద్దండోక్తులున్ గూరిపం
చమహాశబ్దరవంబుఁగూడి సుమహత్సంక్షోభితాంబోధినా
దమునాదిగ్భధిరీకృతంబగుచు నిత్యంబుం జెలంగుం బురిస్.

(కు. సం.71 76

)

35. విక్రమసేనము - ఈ సీసపద్యమున 3, 4 చరణములు ఎత్తుగీతి, ఎఱ్ఱన నృసింహపురాణములోని 3-84 పద్యముతో సరిపోవు చున్నది. ఈ పద్యము 557 గా అజ్ఞాతక ర్తృత్వముగా నున్నది.

శ్రీనాథ యుగము (1400_1600)

శ్రీ నాథుడు (వల్లభభ్యుదయము)

శ్రీనాథుడు వల్లభాభ్యుదయము అను కృతిని రచించినట్లే గ్రంథమూలము ననే లోకమునకు తెలిసినది (ప. 481). దీనిని గూర్చి ప్రభాకర`శాస్త్రి గారు పీఠిక లో చర్చించియున్నారు. (పుట. 25-26)

శ్రీనాథ కృతులనుండి యీ క్రింది పద్యము లిందుగలవు.

269. భావన పెమ్మన అనిరుద్ధ చరిత్ర
వేలుపు గియుం బరుసచేది ........ ........ భీమేశ్వర పురాణము 2-14
272. విష్ణుకథానిధానము.............. ........... " ........ 4 -149
శా ఆడెందాండవమార్బటి
547. క్షయకాలంబున ......... ............. కాశీఖండము 5-89

తాళ్లపాక అన్నమయ్య

అన్నమయ్య వేంకటేశ్వర శతకమునుండి యొక పద్యము(7)దాహ రింపబడినది. ఈ శతకమునుగూర్చి కీ. శే. వంగూరు సుబ్బారావుగారు శతక కవుల చరిత్ర (1924) లో వ్రాసిరి. 1953 లో వావిళ్లవారు నా పీఠికతో గూడ దీనిని ముద్రించిరి.

జై తరాజు ముమ్మయ్య

ఈతని విష్ణుకథానిధానము నుండి 42 పద్యము లు (884-406) దాహ రింపబడినవి. ఇందు ఆఱు పద్యము లీతనివిగావు. కావున యిందున్న పద్య ములు-36. ఇది ప్రశ స్తకావ్యము కావుననే యిన్ని పద్యములుదాహరింపబడినవి. ముమ్మకవి శ్రీనాథుని సమకాలికుడు. శ్రీనాథుడు ప్రౌఢ దేవరాయని ఆస్థానమునకు వెడలినప్పుడు తొలుత ఆస్థానమున నున్న ముమ్మకవిని దర్శించి యిట్లు చెప్పినాడు.

సి. పంపా విరూపాక్ష బహు జటాజూటికా రగ్వధప్రసవసౌరభ్యములకు
తుంగాభద్రాసముత్తుంగ వీచీఘటా గంభీరఘుమఘుమారంభములకు
కళసాపుర ప్రాంతక దళవనాంతర ద్రాక్షాలతా ఫల స్తబకములకు
కర్ణాట కామినీ కర్ణ హాటకరత్న తాటంక యుగధా ధళ్యములకు

గీ. నిర్ణి బంధ నిబంధమైనెనయుకవిత
తెలుగునను సంస్కృతంబున బలుక నేర్తు
ప్రౌఢదేవేంద్రరాయ భూపాలవరుని
సమ్ముఖమున దయజూడు ముమ్మ సుకవి. (చాటుపద్య మణిమంజరి,
ఈముమ్మకవియే-జై తరాజు ముమ్మయ ..........2 భా. పుట 28)

మడికి సింగన

మడికి సింగన పేరిందులేదు. కాని యాతని పద్మపురాణము నుండి రెండు పద్యము లుదాహరింపబడినవి.

ప. 586, శా ఆరాజాస్యలు-గాంచి రయ్యెడ- పద్మపురాణము 3-110
ప. 562. చ. పరమ వివేకసాగరుడు ........... " .......... 4-188

ప్రౌఢకవి మల్లన

ఈతని పేరిందులేదు కాని యీతని రుక్మంగద చరిత్రము నుండి యొక పద్య ముదాహరింవబడినది.

ప. 586. వెలువెలబాఱె దూర్పు - రుక్మాంగదచరిత్ర ..................3.187.

పోతన

పోతన పేరిందులేదు కాని యాతని భాగవతము దశమ స్కంధము నుండి 4 పద్యములున్నవి.

ప. 30. తరుణుండగుశీతల కరు ..... ....భాగవతము దశ. 1288
    58. భూమినిండె మిగుల ........ ........ " ............1291
   244. ధన్యవిభూతి ........... ....... " ...........1276
   580, విటసేన.......... ........... ......... " ........... 965

కుంటముక్కల తిమ్మయ

శైవాచార సంగ్రహము

ఈతని గ్రంథమునుండి ఒక పద్య ముదాహరింపబడినది. అది 167 పద్యము విభూతి వర్ణన ఈ గ్రంథము ముద్రితమైనది (మదరాసు ప్రాచ్య లిఖితపుస్తక భాండాగారము వారు 1961లో ప్రకటించిరి) ఇందు 167 వద్యము కపిలవర్ణము గోవు" అనునది. 1-26 పద్యముగా నున్నది.

నూతన కవి సూరన్న

ధనాభిరామము

ఇందుండి ఒక పద్య ముదాహరింపబడినది.

482. 'ఇరువది యాఱు వీక్షణము లెన్నగ" ఈ కావ్యము వావిళ్లవాZచే క్రీ. శ. 1950లో ప్రకటితము. అందు 482 పద్యము 2 అ . 45 పద్యముగా నున్నది.

ఈకావ్యము తెలుగు విమర్శకులు చదివినట్లు కాసరాదు. సొంఘికేతివృత్త మునకు సంబంధించినది. రూపము ధనము వీని రెండింటిలో నేది గొప్పది అని మన్మధుడును కుబేరుడును వాదించుకొని, ఒకరునొకరు గెలువ లేక పోయిరి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై రెండును మానవ జీవితమున కావశ్యకములే యని వెల్లడించును. కథ దాక్షారామమునకు సంబంధించినది.

అన్నయ - సాముద్రికము

ఈ గ్రంథమున 148 144 పద్యము లిట్లున్నవి చౌడయ్య గంగరాజు సాముద్రిక శాస్త్రము

క. ఉదరంబు దరురోదర
సదృశంబై జఘనమతి విశాలంబైనన్
సుదతీరత్నంబునక
భ్యుదయంబుగ ధరణి యేలు పుత్రుఁడు పుట్టున్ , ........... 143
క. కడునిడుదయుఁ గడుకులుచయుఁ
గడువలుదయుఁ గడుకృశంబుఁ గడునల్లనిదిన్
గడు నెఱ్ఱని దగు మెయిగల
పడతింగీడనిరి మునులు వరమునిచరితా , ........... 144

ఈ రెండు పద్యములు అన్నయ సాముద్రికము లోనివి (చూడుడు. ముద్రిత ప్రతి వావిళ్ల 1951 )

ఈ అన్నయ సాముద్రికము నుండి శ్రీనాధుడు కాశీ ఖండమున పద్యము లను గ్రహించినాడు . ........ (428-89)

చూ. సాహితి - చొక్కనాథయ్య - (శివసుంద రేశ్వరరావు వ్యాసము • 1955)

కృష్ణరాయ యుగము

హరిభట్టు

ఈతని యుత్తర నారసింహ పురాణమునుండి యొక పద్యము (618} దాహరింపబడినది. ఈ కావ్యము నాంధ్ర సాహిత్య పరిషత్తువారు 1925లో ముద్రించిరి అందు పై పద్యము 1-22 7 లో నున్నది.

ఎడపాటి ఎఱ్ఱన

- కుమారనైషధము మల్హణ చరిత్ర - అను రెండు కృతు లీతనివిందుదా హృతములైనవి.

కుమారనైషధము అను కృతి ఎడపాటి ఎఱ్ఱన వ్రాసినట్లుగా నీ ప్రబంధ రత్నావళి నుండియే తొలుత లోకమునకు తెలిసినది ఇందుండి (72-89) 17 పద్యములు గలవు. శ్రీనాథుని నైషధచ్ఛాయ లింధుగలవు “నైషధమందలిదిగా నీ పద్యము నాం. సొ. గ్రంథసంధాత యుదాహ రించినాడు నైషధమున గానరాదు

సీ. మించికన్నులఁ గోరగించు రాజాన్నఁబు లొలుపయించుక లేని యొలుపుబప్పు
నభినవసంత ప్త హై యంగలీ నంబుఁ బరువంపు రుచినొప్పు పాయసములు
నేతను మిరియాల నెనసిన కూరలు ఇండశర్కరతోడ పిండివంట
గొర్రుగా గాచిన గోక్షీరపూరంబు పనస రంభాచూతఫలచయంబు

గీ. ద్రాక్షపండులు ఖర్జూర మాక్షికములు
బహు సుగంధిరసావళుల్ పానకములు
పెక్కువిధముల పచ్చళ్లు పెరుగు మజ్జి
గలును వడ్డించి రెంతయుఁ గ్రమముతోడ. ........(పుట 182-88)

శ్రీనాథుని శృంగారనైషధమున నీ సందర్భమున నిట్టి పద్యము లేదు. అందాఱవ యాశ్వాసమున భోజన వర్ణనమున నీ క్రింది పద్యములు గలవు. (119-126 మొదళ్ళు)

6 - 120 సీ. గోధూమ సేవికానుచ్చంబు లల్లార్చి ఖండళత్కరలతో గలిపిగలిపి 121 చ తరుణులు చంచలాలతలు 122 గీ. పచ్చరామానికంబులఁ బళ్ళెరముల 128 క. అరుదుగనపుడొక్కోక్క యెడ 124 సి. అమృత రసోపమంబైన కమ్మనీయాన 125 ఉ. ఆదరణంబుతో నభినవోజ్య


వీనిని బట్టి నైషధమున అనునది శ్రీనాథ నైషధమున లేక పోవుటచేత ఎడపాటి యెఱ్ఱన కుమార నైషధములోని దనియే మనము గ్రహింపవచ్చును.

ఈ “మించి కన్నులఁ గోరగించు" అన్న పద్యము కొలని మార్పులతో జక్కన విక్రమార్క. చరిత్ర 4-188లో నున్నది.

ఇట్టిదే యింకొకటి

ఇందు 553 పద్యము.

చుక్కల నెయ్యపుందగవు సూచిన యామిని కూర్మి చూచినన్
జక్కన నాథు దీనతకు జాలక ముస్కడునస్త మించె య
మ్మక్క శీలా విశేషము గదా శశి యశ్మము సీలరోచిగా
దొక్కొ కలంక నొల్లనని యోర్చెదదీయ వియోగ దుఃఖమున్

శృంగార నైషధమున 8వ ఆశ్వాసమున 658 పుటలో నీపద్యముదాహరింప బడిన ... సంస్కృత మూలమునకు సరియైన పద్యము - “తటుకు నస్తమించె" అను దాని తరువాత,

చుక్కల నెయ్యపుందగవు సూచిన అను పద్యము ముద్రింపబడినది దీనికి ముందు

ఒక వ్రాత ప్రతిలో దీనికి పర్యాయంతరము" అని వ్రాయబడినది. ఇందు వలస శృంగార నైషధ బ్రాత ప్రతులలో నీదిలేదని యర్థము మూలమునకు సరిగా పద్యమున్నప్పుడు తిరిగి యదేయర్థముగల పద్యము శ్రీనాథుడు వ్రాయడు. కావున నిదియును కుమార నైషధము నందలిదే యనిగ్రహింపవలెను.

ఇందు వలన కుమారనైషధమున పద్యములు 19.

మల్హణ చరిత్ర

కుమార నైషధమునుండి 19 పద్యములను గ్రహించిన జగ్గన-మల్టణ చరిత్రనుండి మూడు పద్యములను మాత్రమే యుదాహరించుటచేత ఎఱ్ఱన కుమార నైషధము నుంచి రచనగల గ్రంథమని మనమంగీకరింపవచ్చును. మల్హణ చరిత్రపద్యములు (90-92). ఇది రెండు పరియాయములు ముద్రితమైనది.

1990 శృంగార గ్రంథమాల మదరాసు.
1940 శృంగార కావ్య గ్రంథమండలి బందరు.
ఇందలి పద్యము

క. కురువింద వజ్రమయ గో
పుర కాంతులవలనఁ బ్రొద్దుపోకలు రాకల్
పరికింప నరిదియయ్యెను
సరసిజ కైరవ వికాససంపద తెలియన్ ...........(1-12)

అనునది కుమారనైషధమునగలదు-79 పద్యము.

ఇందుదాహరింపబడినవానికి ముద్రణ ప్రతీ సంఖ్యలు,
90 సీ. కువలయ కమలాభినవ ..............1-33
91 చ.గములగు పద్మరాగము ..............1-35
92 సి. పగడపుఁ గంబాల

పెదపాటి సోమయ అరుణాచలపురాణములో నీ క్రింది పద్యము గలదు. (488)

సి, అంగయు క్తంబుగా నామ్నాయములు నాల్గు చదువంగ నేరని సద్విజాతి
బ్రహ్మపాద్మాది పురాణాగమేతిహా సము లెఱుంగని బ్రహ్మసంభవుండు
థాట్టవై శేషిక ప్రాధాకరాది శా స్త్రములాఱు చూడని ధరణిసురుడు
స్వకులోచితములైన సప్తతంతువులెల్లఁ బార మేమింపని బాడ బుండు

గీ. కావ్యనాటకలసదలంకారముఖ్య
విద్యలన్నియు నెఱుఁగని విప్రవరుడు
పంచయజ్ఞములును లేని బ్రాహ్మణుండు
వెదకిచూచిన బొడమండు వీటిలోన.

ఈ పద్యమే కొలది మార్పుతో మల్హణ చరిత్రలో నిట్లున్నది.

సీ. అంగయుక్తంబుగా నామ్నాయములు రెండు బల్లిపాఠంబుగాఁ బరిచయించే
బ్రహ్మాండ శైవాడి బహు పురాణఁబులు కరతలామలకంబుగా నెఱింగే
థాట్ట వైశేషిక ప్రముఖ శాస్త్రంబులు నవగతంబులుగాగ సభ్యసించే
శుకుల వ్యాసాది దేశికుల తత్త్వార్థముల్ శోధించె నామూలచూడముగసు

<poem>గీ వాదవహ్నా జలస్తం భవాదులరసి
నంజ వాకర్షణక్రియ లలమిఁ గనియె
సరస సంగీత సాహిత్య సరణి దెలిసె
సఖిల విద్యావిశారదుండయ్యె సంత, (1-6)

</poem>

తెనాలి రామలింగయ్య

ఈతని కందర్పకేతు విలాసమునుండి సోలుగు పద్యము లుదాహరింప బడినవి (425-428).

ఈ కందర్పకేతు విలాసమునుండి యొక పద్యము కవిగారిట్లుహదా రించినారు,

"లలితాస్యాంబురుహంబు నీలక చరోలంబంబు నేత్రాసితో
త్పలముచ్చైస్తనకోక మోస్థ విలసద్బంధూకముచ్యత్కటీ
పులినం బుద్ధతచిత్తజాతరసవాఃపూరంబు ప్రాణేశ్వరీ
జలజావాసముఁడొచ్చియాడక మనోజాతానలంబారునే.'

(కుమారసంభవము ప్రథమ భాగము పుట 107)

తెనాలి రామకృష్ణకవి పాండురంగ మాహాత్మ్యము తెనాలి రామలింగకవి హరి లీలావిలాసములోనిదిగా నీ క్రింది పద్య

ముదాహరింపబడినది..

చ. తెలతెలవాఱు నొయ్యనరుదెంచు నిశాంత రతాంతతాంతలొ
చెలువలకింపుగా మెలఁగుఁజెక్కులఁగూరిన చూర్ణకుంతలా
వశిసర సంబుగా జడియు వాలిన సెజ్జలమీది ప్రావిరుల్
దొలఁగఁగఁజేయు నూడిగపు తొయ్యలులంబలె వేగుదెమ్మెరల్ (487)

ఈ పద్యము పాండురంగ మాహాత్మ్యములోనిది 1-118.

తెనాలి రామలింగకవి -ఉద్భటారాధ్య చరిత్ర,

కాకమాని గంగాధరుడు బాలభారతము (182)

శా. సంసారార్ణవ పారగున్ పరమహంసవ్రాత చూడా పదో
వంసంబున్ శ్రుతి సంక రోడ్డళన పాథ 'క్షీర భేద క్రియా
హంసంబున్ జగదేకవంద్యు జలదశ్యామున్ మహాపాతక
ధ్వంసాబారతు ధారతామృతనిధిన్ వ్యాసున్ బ్రశంసించెదన్.

ఈ పద్యము రామలింగకవి ఉద్భటారాధ్య చరిత్రముసగల యీ క్రింది పద్యము ననుసరించినది.

శా, సంసారాహ్వయాసింధు పోతము జగత్సంబోచ దీపాంకురున్
కంసారాతి పదాబ్దబంభరము సాక్షాత్పద్మ గర్భున్ బుధో
వంసంబున్ శ్రుతి సంక రోడ్డళనపాథః క్షీరథీవక్రియా
హంసంబున్ బరిశీలిత స్మృతిరసున్ వ్యాసుంబ్రశంసించెదన్ (1-9)

నందితిమ్మన (పారిజాతాపహరణము)

గ్రంథనామము కర్తనామము తెలియరానిది

గీ. అమరులమృతాబ్ధిలో పలి యమృతరసము
నిండి చేరులపటికంపుఁ గుండగట్టి
చేదుకొనియెదరో నాగ శీతరోచి
మెల్ల మెల్లన రుచులతో మిన్ను వ్రాఁకె.

ఇది తిమ్మన పారిజాతాపహరణము 2-88 వ పద్యము, ఆంధ్ర వాజ్మయచరిత్రకారుల కత్యంతోపయుక్తమైన యీ గ్రంథమును పునర్ముద్రణము చేసినందులకు డాక్టరు వేటూరి ఆనందమూర్తిగారిని యత్యంతము నభినందించుచున్నాను.


ప్రభాకరశాస్త్రిగారి గ్రంథముల నన్నింటిని పునర్ముద్రించుటకు వారు చేసిన ప్రణాళిక పూర్తియై ఆంధ్ర సాహిత్యవీథి నలంకరించుగాత,


మానపల్లి కవిగారి సంకలన గ్రంథములు ప్రబంధమణిభూషణము, సకలనీతి సమ్మతముతోపాటు నీ ప్రబంధరత్నావళికి పీఠిక వ్రాయు నవకాశము నా కొసగిన డాక్టరు ఆనందమూర్తిగారికి ఈ పీఠికారచనమున నాకు చేదోడు వాదోడుగా నున్న నా పెద్ద కుమారుడు చీ|| శివసుందరేశ్వరరావునకు యాశీస్సులు.


ఇతి శివమ్


18-5-78

2-2-1187/5

లక్ష్మీకాంత నిలయము

నిడుదవోలు వేంకటరావు

హైదరా బాదు - 44.
  1. పీఠికిలకర్త నిరుదవోలు వేంకటరావు, సంపాదకులు డాక్టరు సి. యస్, ఆర్. అప్పారావు - (1870-71)