ప్రబంధ రత్నావళి/కృతజ్ఞతలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కృతజ్ఞతలు

ప్రబంధరత్నావళి ప్రకటనమునకై చేయూత నొసగిన ఆంఛప్రదేశ సాహిత్య అకాడమీ వారికిని-ప్రత్యేకముగా అకాడమీ అధ్యక్షులైన డా॥ బెజవాడ గోపాలరెడ్డిగారికిని మా కృతజ్ఞత తెలుపుకొనుచున్నాము.

సరసమైన ధరకు అచ్చుకాగితమును లభింపజేసిన ప్రభుత్వ యంత్రాంగమునకు మా కృతజ్ఞత.

స్వల్పవ్యవధిలో వడివడిగా అచ్చుపని సాగుచుండగా పద్యపదానుక్రమణికల సకారాదిగా తీర్చుటలో తోడుపడిన చిరంజీవులు విశ్వమోహన్, రాధాకల్యాణి, ఆదిత్య, ప్రభాకరులను ఆశీర్వదించి అభినందించుచున్నాము. భూమిక అచ్చు అగుచుండఁగా ప్రెస్సుపనిలో మాకు తోడుపడిన శ్రీ నిడుదవోలు శివసుందరేశ్వరరావుగారికి మా కృతజ్ఞతలు.

గ్రంథము నీరీతిని సుందరముగా ముద్రించి వేళకందించిన చంద్రశేఖర ప్రింటింగ్ వర్క్స్ వారికి, ముఖ్యముగా శ్రీ ఏ. వి. రావు గారికి, మేనేజరు శ్రీ లీలాకృష్ణ రాజుగారికిని, శ్రీ కే యన్ సుందరంగారికిని మా కృతజ్ఞతలు.

హైదరాబాదు-28.
22-5-76.

ప్రకాశకులు.