ప్రబంధ రత్నావళి/మనవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మనవి

శ్రీ ప్రభాకరపరిశోధకమండలి పక్షమున కీ॥ శే॥ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు మున్ను రచించినవియుఁ గూర్చినవియు నగు గ్రంథములు కొన్ని నవ్యములును పునర్ముద్రణములును వెలువడినవి. అవి నేటికి చాలవఱకు చెల్లిపోయినవి కొన్ని మాత్రమే, కొలంది మాత్రమే మిగిలియున్నవి. “తెలుగు మెఱుగు' లతో (1948) నారంభమైన శ్రీ ప్రభాకరశాస్త్రి గారి వ్యాససంకలనములు పిదప 'మీగడ తఱకలు', 'సింహావలోకము' అను మఱిరెండు సంపుటములు వెలువడినవి. ఇంకను వారివి ప్రాచీనసాహిత్యమునకును, సంస్కృతాంధ్ర కవుల చరిత్రకును సంబంధించిన వ్యాసములు కొన్నియును; జానపదసాహిత్యము, చరిత్ర, శాసనములు, భాష మున్నగు విషయములకు సంబంధించిన వ్యాసములు కొన్నియును సంకలన రూపమున ప్రకటింపవలసినవి కలవు. శ్రీ ప్రభాకరశాస్త్రి గారు 1950 కంటె పూర్వము నాలుగాశ్వాసములకుపైపడి రచించిన ఉత్తర హరివంశ వ్యాఖ్యానము, వారే పరిష్కరించియుంచిన పద్యపాఠములతో కూడ ప్రకటింపబడవలిసి యున్నది.

ఇంకను నాటకములలో వారి ప్రతిమానాటకము పునర్ముద్రణ భాగ్యమును బడసినది. శ్రీ శాస్త్రిగారు సగమే ఆంధ్రీకరింపగా మిగిలిన భాగమును డా॥ దివాకర్ల వేంకటవధానిగారిచే పూరింపఁజేసి నాగానందనాటకము ను వెలువరించు టైనది.

ఇంకను వారి భాసనాటకానువాదములు, తెలుఁగుచేసిన ప్రహసనములు, స్వతంత్రములగు నాటికలు కొన్నియును, కలిపి, నాటకసంకలన మొకటి వెలువరింపవలసియున్నది. ఇక పద్యకృతులలో 'దివ్యదర్శనము' 'కపోతకథ' 'కడుపుతీపు' మున్నగు లఘుకృతులొండు రెండు పునర్ముద్రణమందినవి. ప్రభాకర కవిచూడామణి కృతములైన కావ్యఖండికలన్నియు వారెడనెడ చెప్పిన పద్యావళితో పాటు చేర్చి కూర్చిన కావ్యసంకలన మొకటి వెలువడ వలసియున్నది. శ్రీ శాస్త్రి గారి చాటుపద్యమణిమంజరి రెండు భాగములు ముద్రింప బడినవి! విస్తరింపబడిన ద్వితీయ భాగమున ప్రథమ సంవుటము మాత్రమే నేటికి అందుబాటులో నున్నది. ద్వితీయ సంపుటముగా రావలసిన సామగ్రితో కూడి సమగ్రమైన సంకలనము చాటుపద్య మణిమంజరి తిరిగి ముద్రింపవలసిన ఆవ సరమెంతేని కలదు. ఇద్దే వారి “నీతినిధి" వంటి ఉత్తమ వచన గ్రంధములు , "శృంగాశ్రీనాథము" వంటి మేటి విమర్శ గ్రంథములు పునర్ముదణ మంద వలసి యున్నవి. ఇట్లే ఇంకను వారి రచనలు కథలు-గాథలు; కాబులు-జవా బులు; డైరీలు; గ్రంథపీఠికలు, టీకలు-టిప్పణములు; సమీక్షలు, ఉపన్యాసములు; వ్యాఖ్యలు విశేషములు, ఆత్మకథ 'ప్రజాప్రభాకరము'; జీవితము-యోగము ఆను విభాగములతో ననేక సంపుటములును; --- సామెతలు - నానుళ్ళు, గాంధిరామ యణము మున్నగ సంకలనములు మఱికొన్నియును క్రమమున ముద్రింప వలసియున్నవి.

ఇట్లే ఇంకను పలువ్రాతప్రతులను పరిశీలించి పాఠనిర్ణయము గావించి ప్రకటనకు సిద్ధముచేసి యుంచిన ప్రాచీనకావ్యములు కొన్ని యున్నవి. 'లక్ష జోధార' మను లక్షణ గ్రంథవిషయ సంకనమునకు బ్రహత్రణాళికను రచించి, సామగ్రిని సేకరించి, విశ్లేషించి యున్నారు. అదియు వెలుగునకు రావలసి యున్నది.

ఇట్లు శ్రీ వేటూరి ప్రభాక శాస్త్రి గారి సంపూర్ణ గ్రంథావళి ప్రణాళికాబద్ధ ముగ క్రమమున వెలుపరింపవలసియున్నది. ఈ రచనా సామగ్రి నంతటిని శ్రీ ప్రజాకర పరిశోధక మండలి పరిశ్రమించి సేకరించి, పైని వివరించిన విధ మునే విశ్లేషించి ప్రక టించుటకు సిద్ధపఱచియున్నది. త్రత్ఫకటనమున కొక ప్పుడు కొంత యత్నించిమి గాని ఆయత్నము ఫలింపకేదు.

గ్రంథ ప్రకటన మనుకొన్నంత తేలిక పనికాదని తెలియును. ఆది మాట లతో జరగునదియు కాదు. అయినను దీక్షతో వానీసన్నిటి నొక క్రమప్రణాళిక ననుసరించి ప్రకటించుట కీపుడు శ్రీ ప్రభాకరపరిశోధక మండలి కృషి చేయు చున్నది.

ప్రథమ ముద్రణము జరిగిన యేఁబదియెనిమిఁదేండ్ల తరువాత నిప్పటికీ విలువగల సంకలన గ్రంథము 'ప్రబంధరత్నావళి' పునర్ముద్రణమందు చున్నది. దీనికై ఆర్డింపఁగా ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ వారు దయతో మూడువేల రూపాయలు, రెండేండ్ల వ్యవధిలో, వడ్డీ లేక తీర్చుకోవలసిన విఛమున, అప్పుగా నిచ్చిరి దానికి వారి కెంతో కృతజ్ఞులము. ఆ పైకముతోనే ఇప్పుడీ కార్యము నారంభింపగల్గితిమి.

అప్పుతీరి, తిప్పలు దాటి, ఆరుమాసములకొక పుస్తకము చొప్పున వెలువ రింప గల్గినను పదేండ్లపాటు జరుగవలసినంతపని యున్నది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వమును, అకాడమీలును ఈ విషయమై ఉదారముగ ఉచితరీతిని అరిక సహాయమందించి యీ బృహత్కార్యక్రమమునకు చేదోడు వాదోడు కాగలవనియు వారి తోడ్పాటుతో శ్రీ ప్రభాకరపరిశోధక మండలి తన బాధ్యతను నెరవేర్చి ఆంధ్ర పాఠక లోకముయొక్క ఆశయమును తీర్చగలదనియు ఆశించుచున్నది.

మా కోర్కి, మన్నించి అడిగినంతనే విలువగల ' భూమిక'ను రచించి యొసగిన కళాప్రపూర్ణ, విద్యారత్న శ్రీ నిడుదవోలు వేంకటరావుగారికి హృదయ పూర్వకముగా కృతజ్ఞతాభివందనము లర్పించుచున్నాము.

ఈ గ్రంథమునిప్పుడు ప్రథమముద్రణము ననుసరించి యథామాతృ రముగ పునర్ముద్రించుచున్నాము, అనుబంధమున చేర్పబడిన విషయములను అందలి సూచన ననుసరించి గ్రంథమున చేర్చితిమి. ఆ కారణమున పద్యసంఖ్యా క్రమము మారినదేగాని ప్రణాళిక మారలేదు. అక్కడక్కడ పుటలలో శ్రీ శాస్త్రి గారే గుర్తించిన విషయములను అధోజ్ఞాపికలలో పేర్కొంటిమి (పుటలు 6, 8, లి, 106 లోని ఆధాజ్ఞాపికలు మాత్రము మేము క్రొత్తగా చేర్చినవని మనవి.) గ్రంథమున శీర్షికల ప్రక్కనగల (ఆం); (జ); (ఇ) అను సంకేతములు ప్రథమ ముద్రణము (పు. 186- 188)లో గల సూచనల ననుసరించి సౌలభ్యము నకై కూర్పఁబడినవి. ఆ యనుబంధములను కూడ యథాపూర్వము గ్రంథం తమున పరిశీలనార్ధముంచితిమి, ప్రథమ ద్వితీయ ముద్రణములందుగల పద్య సంఖ్యా క్రమము నెరుఁగుటకై తుదిని పద్యానుక్రమణిక నకారాదిగా సంధానించి తిమి భూమికారచయిత పేర్కొన్న పద్యసంఖ్యలు ప్రథమ ముద్రణము ననుస రించినవే.