Jump to content

పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము/హంసగుహ్య స్తవరాజము

వికీసోర్స్ నుండి

హంసగుహ్య స్తవరాజము

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము)
రచయిత: సింగయ


తెభా-6-213-తే.
"రమునికి వందన మొనర్తుఁ రిఢవించి
మున్నవితథానుభూతికి మ్రొక్కికొందు;
మెఱయు గుణములఁ దేలు నిమిత్తమాత్ర
బంధువై నట్టి వానికిఁ బ్రణతు లిడుదు.

టీక:- పరముని = నారాయణుని {పరముడు - సర్వమునకు అతీతమైన వాడు, విష్ణువు}; కి = కి; వందనము = నమస్కారము; ఒనర్తు = చేసెదను; పరిఢవించి = విశేషించి; మున్న = ముందుగా; అవితథానుభూతి = పరమాత్మ {అవితథానుభూతి - అవితథ (అసత్యము కాని, యథార్థమైన, వ్యర్థము కాని) అనుభూతి యైన వాడు, ఆత్మానుభూతి యైన వాడు)}; కి = కి; మ్రొక్కికొందు = కొలిచెదను; మెఱయు = ప్రకాశించెడి; గుణములన్ = గుణములలో; తేలు = తేలుచుండెడి; నిమిత్తమాత్ర = నామమాత్రపు; బంధువు = బంధువు; ఐనట్టి = అయినట్టి; వాని = వాని; కిన్ = కి; ప్రణతులు = నమస్కారములు; ఇడుదు = చేసెదను.
భావము:- “ముందుగా పరమేశ్వరునికి విశేషించి నమస్కరిస్తున్నాను. అనుభూతియే ఆకారమైన వానికి మ్రొక్కుతున్నాను. గుణవంతుడై విరాజిల్లుతూ నిమిత్తమాత్రంగా బంధురూపంలో ఉన్నవానికి ప్రణామాలు చేస్తున్నాను.

తెభా-6-214-ఆ.
విలి గుణుల చేతఁ త్త్వబుద్ధులచేత
నిగిడి కానరాని నెలవువాని
మొదలఁ దాన కలిగి ముక్తి మానావధి
రూమైనవాని ప్రాపుఁ గందు.

టీక:- తవిలి = పూని; గుణుల = సుగుణములు గలవారి; చేతన్ = చేతను; తత్త్వబుద్ధులు = తత్త్వజ్ఞానుల; చేతన్ = చేతను; నిగిడి = నిక్కి; కానరాని = కనుగొనబడని; నెలవువాని = స్థానము గలవాని; మొదలన్ = సృష్ట్యాదిని; తాన = తను మాత్రమే; కలిగి = ఉండి; ముక్తి = మోక్షము యనెడి; మాన = కొలతకి; అవధి = హద్దునకు; రూపము = మూర్తిత్వము; ఐనవాని = అయినవాని; ప్రాపుగన్ = రక్ష; కందు = పొందెదను.
భావము:- సుగుణవంతులకు కాని, తత్త్వవేత్తలకు కాని తెలియరాని ఉనికి కలవాడు, మొదటినుండి ఉన్నవాడు, మోక్షానికి పరమావధి అయిన రూపం కలవాడు అయిన ఆ భగవంతుని ఆశ్రయిస్తున్నాను.

తెభా-6-215-ఆ.
ల్ల తనువులందు నిరవొంది తనతోడఁ
బొందు చేసినట్టి పొందుకాని
పొందు పొందలేఁడు పురుషుండు గుణము నా
గుణినిఁ బోలు నట్టి గుణి భజింతు.

టీక:- ఎల్ల = అఖిలమైన; తనువులు = దేహములు; అందు = లోను; ఇరవొంది = నివాస ముండి; తన = తన (ఆత్మ); తోడన్ = తోటి; పొందు = కూడి యుండుట; చేసినట్టి = చేసిన; పొందుకాని = సహచరుని; పొందు = స్నేహము; పొందలేడు = పొందలేడు; పురుషుండు = మానవుడు; గుణమున్ = గుణముల వలన; ఆ = అటువంటి; గుణిని = గుణములు గలవాని; పోలునట్టి = వలె నుండు నట్టి; గుణిన్ = గుణము గల వానిని; భజింతు = పూజించెదను.
భావము:- సమస్త జీవుల దేహాలలో నివసిస్తున్నా జీవులు ఆ అంతర్యామిని గుర్తించడం లేదు. వారు తమలో తాము స్నేహం చేస్తున్నారే కాని పరమాత్మతో పొందు చేయడం లేదు. గుణాలలో చిక్కుకున్న జీవులు గుణాలకు అధీశ్వరుని దర్శింపలేకున్నారు. అటువంటి గుణవంతుడైన భగవంతుణ్ణి స్తుతిస్తున్నాను.

తెభా-6-216-ఉ.
పూని మనంబునుం దనువు భూతములున్ మఱి యింద్రియంబులుం
బ్రాములున్ వివేక గతిఁ బాయక యన్యముఁ దమ్ము నెమ్మెయిం
గానఁగనేర వా గుణనికాయములం బరికించునట్టి స
ర్వానుగతున్ సమస్తహితు నాదిమపూరుషు నాశ్రయించెదన్.

టీక:- పూని = తగిలి; మనంబునున్ = మనసు; తనువు = దేహము; భూతములున్ = పంచభూతములు; మఱి = ఇంకా; ఇంద్రియంబులున్ = పంచేంద్రియములు; ప్రాణములున్ = పంచప్రాణములును; వివేకగతిన్ = దేహాత్మాది విభేద జ్ఞానము; పాయక = విడువక; అన్యమున్ = అతీతమైన పరమాత్మను; తమ్మున్ = తాముగా; ఎమ్మెయిన్ = ఏ విధముగను; కానగనేరవు = కనుగొనలేవు; ఆ = ఆ; గుణ = గుణముల; నికాయములన్ = సమూహములను; పరికించు = చూసెడి; అట్టి = అటువంటి; సర్వానుగతున్ = నారాయణుని {సర్వానుగతు - అఖిలమును అనుసరించు వాడు, విష్ణువు}; సమస్తహితున్ = నారాయణుని {సమస్త హితుడు – సమస్త మైన వారికి హితుడు, విష్ణువు}; ఆదిమపూరుషున్ = నారాయణుని {ఆదిమ పూరుషుడు - ఆదిమ (సృష్టికి మూలము యైన) పూరుషుడు (పురుషోత్తముడు), విష్ణువు}; ఆశ్రయించెదన్ = ఆశ్రయించెదను.
భావము:- మనస్సు, దేహం, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు కలిగి ఉన్న జీవులు ఈ దేహమే తాము అనుకుంటున్నారు. ఆ భావంతోనే అంతర్యామిని గుర్తింపలేక ఉన్నారు. వారికి వివేకబుద్ధి ప్రాప్తించినపుడు ఇంద్రియాదులు వేరని, జీవుడు వేరని తెలుసుకుంటున్నారు. ఈ సృష్టి నంతటినీ పరికించేవాడు, సమస్తానికి మూలమైనవాడు విశ్వహితుడు అయిన ఆదిపురుషుని ఆశ్రయిస్తున్నాను.

తెభా-6-217-వ.
మఱియు; ననేకవిధ నామ రూప నిరూప్యంబగు మనంబునకు దృష్టస్మృతుల నాశంబువలనఁ గలిగెడు నుపరామం బగు సమాధి యందుఁ గేవల జ్ఞానస్వరూపంబునఁ దోచు నిర్మల ప్రతీతిస్థానంబైన హంసస్వరూపికి నమస్కరింతు; దారువందు నతి గూఢంబైన వీతిహోత్రుని బుద్ధిచేతం బ్రకాశంబు నొందించు భంగి, బుద్ధిమంతులు హృదంతరంబున సన్నివేశుం డయిన పరమపురుషుని నాత్మశక్తిత్రయంబులచేతం దేజరిల్లఁ జేయుదు; రట్టి దేవుండు, సకల మాయావిచ్ఛేదకం బయిన నిర్వాణ సుఖానుభవంబునం గూడి యుచ్ఛరింపం గొలఁదిగాని శక్తిగల విశ్వరూపుండు నాకుం బ్రసన్నుండగుంగాక; వాగ్భుద్ధీంద్రియ మానసంబులచేతం జెప్పను, నిట్టి దని నిరూపింపను, నలవిగాక యెవ్వని గుణరూపంబులు వర్తించు, నెవ్వండు నిర్గుణుండు, సర్వంబు నెవ్వనివలన నుత్పన్నంబగు, నెవ్వనివలన స్థితిం బొందు, నెవ్వని వలన లయంబగు, నట్టి పరాపరంబులకుం బరమంబై, యనన్యంబై, ప్రాక్ప్రసిద్ధంబై, సర్వవ్యాపకంబై, యాదికారణంబై యున్న తత్త్వంబు నాశ్రయింతు; నెవ్వని ప్రభావంబు మాటలాడెడు వారలకు, వాదంబు చేయువారలకు వివాద సంవాదస్థలంబు లగుచు నప్పటప్పటికి మోహంబు నొందించుచుండు, నట్టి యనంతగుణంబులు గల మహాత్మునకుం బ్రణామంబు చేయు; దస్థి నాస్థి యను వస్తుద్వయ నిష్ఠలం గలిగి, యొక్కటన యుండి విరుద్ధ ధర్మంబులుగఁ గనంబడు నుపాసనా శాస్త్ర సాంఖ్యశాస్త్రంబులకు సమంబై, వీక్షింపఁదగిన పరమంబు నాకు ననుకూలంబగు గాక, యెవ్వఁడు జగదనుగ్రహంబుకొఱకు జన్మ కర్మంబులచేత నామరూపంబు లెఱుంగంబడ కుండియు, నామరూపంబులు గలిగి తేజరిల్లు, నట్టి యనంతుడయిన భగవంతుండు ప్రసన్నుండగుం గాక; యెవ్వండు జనులకుఁ బురాకృత జ్ఞాన పదంబుల చేత నంతర్గతుండై, మేదినిం గలుగు గంధాది గుణంబుల నాశ్రయించిన వాయువు భంగి మెలంగుచుండు నా పరమేశ్వరుండు మదీయ మనోరథంబు సఫలంబు జేయు గాక"యనుచు భక్తి పరవశుండయి యుక్తి విశేషంబున స్తుతియించుచున్న దక్షునికి భక్తవత్సలుం డైన శ్రీవత్సలాంఛనుండు ప్రాదుర్భావంబు నొందె; నప్పుడు.
టీక:- మఱియున్ = ఇంకను; అనేక = అనేక; విధ = రకముల; నామ = నామములు; రూప = రూపములను; నిరూప్యంబు = నిరూపించెడిది; అగు = అయిన; మనంబున్ = మనసున; కు = కు; దృష్ట = చూసినది; స్మృతుల = స్మరించునది; నాశంబు = నాశన మగుట; వలన = వలన; కలిగెడు = కలుగు; ఉపరామంబు = విరామము; అగు = అయిన; సమాధి = సమాధి; అందున్ = లోను; కేవల = కేవలము; జ్ఞాన = జ్ఞానము యొక్క; రూపంబునన్ = రూపములో; తోచు = గోచరించెడి; నిర్మల = స్వచ్ఛమైన; ప్రతీత = తత్త్వము వెలువడు; స్థానంబు = స్థానము; ఐన = అయినట్టి; హంస = హంస; స్వరూపి = స్వరూపము గలవాని; కి = కి; నమస్కరింతు = నమస్కరించెదను; దారువు = కఱ్ఱ; అందు = లో; అతి = మిక్కిలి; గూఢంబు = రహస్యముగ నుండు నది; ఐన = అయిన; వీతిహోత్రుని = అగ్నిహోత్రుని; బుద్ధి = జ్ఞానము; చేతన్ = వలన; ప్రకాశంబున్ = కనబడునట్లు; ఒందించు = చేసెడి; భంగిన్ = విధముగ; బుద్ధిమంతులు = జ్ఞానులు; హృదంతరంబునన్ = హృదయము లోపల; సన్నివేశుండు = కూడి యుండెడివాడు; అయిన = అయినట్టి; పరమపురుషుని = సర్వోత్తమమైన పురుషుని; ఆత్మశక్తిత్రయంబు = ఆత్మ యొక్క మూడు శక్తులు {ఆత్మ శక్తి త్రయంబు - ఆత్మయొక్క మూడుశక్తులు 1ఆజ్ఞాశక్తి 2 సంకల్పశక్తి 3మంత్రశక్తి}; చేతన్ = చేతను; తేజరిల్లన్ = ప్రకాశముగ; చేసెదరో = చేస్తారో; అట్టి = అటువంటి; దేవుండు = దేవుడు; సకల = సమస్తమైన; మాయా = మాయలను; విచ్ఛదకంబు = తెగనరికి వేయు నది; అయిన = అయినట్టి; నిర్వాణ = మోక్షపద; సుఖ = సుఖము యొక్క; అనుభవంబునన్ = అనుభవముతో; కూడి = కలసి; ఉచ్చరింపన్ = చెప్పుటకు; కొలదికాని = శక్యముకాని; శక్తి = శక్తి; కల = కలిగిన; విశ్వరూపుండు = విశ్వమే తన రూపమైన వాడు; నాకున్ = నాకు; ప్రసన్నుండు = ప్రసన్నమైన వాడు; అగుంగాక = అగుగాక; వాక్ = మాటలు; బుద్ధి = జ్ఞానము; ఇంద్రియ = ఇంద్రియములు; మానసంబు = మనసు; చేతన్ = చేతను; చెప్పను = చెప్పుటకు; ఇట్టిది = ఇటువంటిది; అని = అని; నిరూపింపను = నిరూపించుటకు; అలవిగాక = శక్యము గాకుండగ; ఎవ్వని = ఎవని; గుణ = గుణములు; రూపంబులు = స్వరూపములు; వర్తించున్ = నడుస్తుండునో; ఎవ్వండు = ఎవడైతే; నిర్గుణుండు = త్రిగుణరహితుడో; సర్వంబు = సమస్తము; ఎవ్వని = ఎవని; వలనన్ = వలన; ఉత్పన్నంబు = సృష్టింపబడుట; అగున్ = జరుగునో; ఎవ్వని = ఎవని; వలన = వలనైతే; స్థితిన్ = స్థితిని; పొందున్ = పొందునో; ఎవ్వని = ఎవని; వలన = వలనైతే; లయంబు = లయమగుట; అగున్ = అగునో; అట్టి = అటువంటి; పర = ఇతరమైనది; అపరంబులు = అనితరమైనవాని (రెంటి); కున్ = కి; పరమంబు = అతీతమైనది; ఐ = అయ్యి; అనన్యంబు = అద్వితీయము; ఐ = అయ్యి; ప్రాక్ = మొదటినుండి; ప్రసిద్ధంబు = మిక్కిలి సిద్ధించి యుండునది; ఐ = అయ్యి; సర్వవ్యాపకంబు = సమస్తము నందు వ్యాపించి యుండునది; ఐ = అయ్యి; ఆదికారణంబు = మూలకారణము; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; తత్త్వంబున్ = తత్త్వమును; ఆశ్రయింతు = ఆశ్రయించెదను; ఎవ్వని = ఎవని; ప్రభావంబు = ప్రభావము; మాటలాడెడు = మాట్లాడే; వారల = వారల; కున్ = కు; వాదంబు = వాదనలు; చేయు = చేసెడి; వారల = వారల; కున్ = కు; వివాద = తగవు; సంవాద = తర్క; స్థలంబులు = స్థానములు; అగుచున్ = అగుచు; అప్పటప్పటికి = ఎప్పటి కప్పుడే; మోహంబు = మోహము; ఒందించున్ = పొందించు; అట్టి = అటువంటి; అనంత = అంతులేని; గుణంబులు = లక్షణములు; కల = కలిగిన; మహాత్మున్ = గొప్పవాని; కున్ = కి; ప్రణామంబు = నమస్కారములు; చేయుదు = చేయుదును; అస్థి = ఉన్నది; నాస్థి = లేనిది; అను = అనెడి; వస్తు = పదార్థముల; ద్వయ = రెంటి; నిష్ఠలన్ = ఉనికి; కలిగి = ఉండి; ఒక్కటన = ఏకమై; ఉండి = ఉండి; విరుద్ధ = విరుద్ధమైన; ధర్మంబులుగన్ = లక్షణములువలె; కనంబడు = కనబడెడు; ఉపాసనాశాస్త్ర = ఉపాసించెడి శాస్త్రము; సాంఖ్యశాస్త్రంబుల = సాంఖ్యా శాస్త్రముల; కున్ = కు; సమంబు = సమానమైనది; ఐ = అయ్యి; వీక్షింపదగిన = దర్శించదగిన; పరమంబు = పరమాత్మ; నా = నా; కున్ = కు; అనుకూలంబు = ప్రసన్నము; అగుగాక = అగుగాక; ఎవ్వడు = ఎవడైతే; జగత్ = భువనమును; అనుగ్రహంబు = అనుగ్రహించుట; కొఱకు = కోసము; జన్మ = పుట్టుక; కర్మంబుల = కర్మల; చేతన్ = వలన; నామ = నామములు; రూపంబులు = స్వరూపములు; ఎఱుంగంబడక = తెలియకుండగ; ఉండియు = ఉండియు; నామ = నామములు; రూపంబులు = రూపములు; కలిగి = కలిగి; తేజరిల్లున్ = విరాజిల్లును; అట్టి = అటువంటి; అనంతుడు = అంతము లేనివాడు; అయిన = అయినట్టి; భగవంతుండు = భగవంతుడు; ప్రసన్నుండు = అనుకూలుడు; అగుంగాక = అగుగాక; ఎవ్వండు = ఎవడైతే; జనులు = మానవులు; కున్ = కు; పురాకృత = పూర్వము చేసిన సుకృతముల; జ్ఞాన = కలిగిన జ్ఞాన; పదంబుల = స్థితి; చే = వలన; తను = తను; అంతర్గంతుండు = లోన వ్యాపించి యుండువాడు; ఐ = అయ్యి; మేదినిన్ = భూమిపైన; కలుగు = ఉండెడి; గంధ = వాసన; ఆది = మొదలైన; గుణంబులన్ = గుణములను; ఆశ్రయించిన = ఆశ్రయించినట్టి; వాయువు = వాయువు; భంగిన్ = వలె; మెలంగుచుండున్ = తిరుగుచుండు; ఆ = ఆ; పరమేశ్వరుండు = నారాయణుడు {పరమేశ్వరుడు - పరమ (అందరికంటె పై నుండెడి) ఈశ్వరుడు, విష్ణువు}; మదీయ = నా యొక్క; మనోరథంబు = కోరికను; సఫలంబు = తీరునట్లు; చేయుగాక = చేయుగాక; అనుచున్ = అనుచూ; భక్తి = భక్తితో; పరవశుండు = పరవశము పొందిన వాడు; అయి = అయ్యి; యుక్తివిశేషంబునన్ = యోగవిద్యారహస్యముతో; స్తుతియించుచున్న = స్తోత్రము చేయుచున్న; దక్షున్ = దక్షుని; కి = కి; భక్త = భక్తుల యెడ; వత్సలుండు = వాత్సల్యము గలవాడు; ఐన = అయిన; శ్రీవత్సలాంఛనుండు = నారాయణుడు {శ్రీవత్స లాంఛనుడు - శ్రీవత్సము అనెడి పుట్టుమచ్చ గలవాడు, విష్ణువు}; ప్రాదుర్భవంబున్ = ప్రత్యక్ష మగుటను; ఒందె = పొందెను; అప్పుడు = అప్పుడు.
భావము:- నానావిధాలైన నామ రూపాలను నిరూపించే మనస్సుచేత గమనింపబడినవి, స్మరింపబడినవి అయిన విషయాలు తొలగినప్పుడు కలిగే సమాధి స్థితిలో కేవలం జ్ఞానస్వరూపంగా గోచరించి, అటువంటి సమాధి స్థితికి ఆశ్రయభూతుడైన హంసస్వరూపునకు నమస్కరిస్తాను. ఎండుకట్టెలో దాగి ఉన్న అగ్నిని తమ బుద్ధితో ప్రకాశింపజేసినట్లు బుద్ధిమంతులు తమ హృదయాంతరాలలో ఉన్న పరమపురుషుని తమలోని శక్తిత్రయం చేత ప్రకాశింపజేస్తారు. అటువంటి భగవంతుడు సమస్త విధాలైన మాయలకు అతీతమైన మోక్షసంబంధమైన ఆనందానుభూతితో విలసిల్లుతుంటాడు. మాటలకు అందని మహత్తర శక్తితో కూడి ఉన్న ఆ విశ్వరూపుడు నాకు ప్రసన్నుడు అగును గాక! వాక్కు, బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు మొదలైనవి ఆ పరమాత్ముని స్వరూపాన్ని వెల్లడించలేవు. అది ఇటువంటిదని నిరూపింపలేవు. ఇంద్రియాలకు అతీతాలైన గుణరూపాలతో వర్తిస్తూ ఉన్న ఆ నిర్గుణ స్వరూపానికి నమస్కరిస్తున్నాను. ఈ సమస్త విశ్వం ఏ మహాశక్తి వలన సృష్టింప బడుతున్నదో, ఏ మహాశక్తి వలన రక్షింపబడుతున్నదో, ఏ మహాశక్తి వలన లయం పొందుతున్నదో అటువంటి పరమాత్మ స్వరూపం పరాపరాల కంటే ఉత్తమమైనది. అనన్యమైనది, అనాది కాలం నుండి ప్రసిద్ధమైనది, అంతటా వ్యాపించి ఉన్నది, అన్నిటికీ మూలమైనది అయిన ఆ పరబ్రహ్మను ఆశ్రయిస్తున్నాను. ఆ పరమాత్మ ప్రభావం వల్లనే ప్రాణులు మాట్లాడుతున్నారు. వాదోపవాదాలు చేస్తున్నారు. వివాదాలు పెడుతున్నారు. అన్నింటికీ కారణం ఆ పరమాత్మ అనంత గుణాలే. జీవులను ఎప్పటి కప్పుడు మోహంలో ముంచి తేల్చే ఆ భగవంతునికి ప్రణామం చేస్తున్నాను. ఉన్నది, లేదు అనే వస్తు ద్వయానికి ఆలవాలాలై పైకి విరుద్ధ ధర్మాలుగా కనబడుతున్న యోగసాంఖ్య దర్శనాలను రెంటికీ సమత్వం సమకూర్చే పరమాత్మ నన్ను అనుగ్రహించు గాక! ఏ దేవుడు మానవుల పురాకృత పుణ్య విశేషాల చేత సుగంధాన్ని ఆశ్రయించిన వాయువు వలె అంతర్యామియై ఈ భూమిమీద ఉద్భవిస్తుంటాడో ఆ పరమేశ్వరుడు నా మనోరథాన్ని సఫలం చేయు గాక!” అంటూ భక్తిపరవశుడై తన భక్తి విశేషాలతో స్తుతిస్తున్న దక్షునికి భక్తవత్సలుడైన శ్రీహరి సాక్షాత్కరించాడు. అప్పుడు....

తెభా-6-218-సీ.
ర్మాచలేంద్ర ప్రపాతద్వయంబునఁ-
లిగిన నీలంపు ను లనంగ
మొనసి తార్క్ష్యుని యిరుమోపు పై నిడినట్టి-
దముల కాంతులు రిఢవిల్లఁ
జండ దిఙ్మండల శుండాల కరముల-
కైవడి నెనిమిది రము లమరఁ
క్ర కోదండాసి శంఖ నందక పాశ-
ర్మ గదాదుల రవిఁ బూని

తెభా-6-218.1-ఆ.
ల్లమేను మెఱయ గుమొగం బలరంగఁ
ల్ల చూపు విబుధ మితిఁ బ్రోవ
సిఁడికాసెఁ బూని హు భూషణ కిరీట
కుండలముల కాంతి మెండు కొనఁగ.

టీక:- భర్మాచలేంద్ర = మేరుపర్వతము యొక్క {భర్మాచలేంద్రము - భర్మ (బంగారు) చల (కొండ)లలో ఇంద్రము (శ్రేష్ఠమైనది), మేరుపర్వతము}; ప్రపాత = కొండ చరియల; ద్వయంబునన్ = జంట యందు; కలిగిన = ఉన్నట్టి; నీలంపు = ఇంద్రనీలముల; గనులు = గనులు; అనగ = అన్నట్లు; మొనసి = కలిగి; తార్క్ష్యుని = గరుత్మంతుని; ఇరు = రెండు (2); మోపులు = భుజములు; పైన్ = మీదను; ఇడినట్టి = పెట్టినట్టి; పదముల = పాదముల; కాంతులు = ప్రకాశములు; పరిఢవిల్లన్ = అతిశయించగా; చండ = భయంకరమైన; దిఙ్మండలశుండాల = దిగ్గజముల యొక్క {దిఙ్మండల శుండాలు - దిక్ (దిక్కుల) చివర మండల (స్థలము లందలి) శుండాలములు (ఏనుగులు), దిగ్గజములు}; కరముల = తొండముల; కైవడి = వలె; ఎనిమిది = ఎనిమిది (8); కరములన్ = చేతులలోను; అమరన్ = అమరిన; చక్ర = చక్రము; కోదండ = విల్లు; అసి = ఖడ్గము; శంఖ = శంఖము; నందక = నందకము యనెడి కత్తి; పాశ = త్రాడు; చర్మ = శతచంద్రము; గద = గద; అదుల = మొదలైనవానిని; సరవిన్ = వరుసగా; పూని = ధరించి;
నల్ల = నల్లని; మేను = దేహము; మెఱయన్ = మెరుస్తుండగా; నగు = నవ్వు; మొగంబు = ముఖము; అలరంగ = ప్రకాశించగా; చల్ల = చల్లని; చూపు = చూపు; విబుధ = దేవతల, జ్ఞానుల; సమితిన్ = సమూహమును; ప్రోవన్ = కాపాడుతుండగా; పసిడి = బంగారు; కాసెన్ = కాసెకోక, దట్టి; పూని = ధరించి; బహు = అనేక; భూషణ = అలంకారములు; కిరీట = కిరీటములు; కుండలముల = చెవికుండలముల; కాంతి = వెలుగులు; మెండుకొనగ = అతిశయించగా.
భావము:- శ్రీమహావిష్ణువు గరుత్మంతుని మీద ఆసీనుడై ఉన్నాడు. గరుడుని రెండు భుజాల మీద చాచిన ఆ స్వామి పాదాలు మేరు పర్వతం చరియకు రెండు ప్రక్కలా ప్రకాశించే ఇంద్రనీలమణుల గనులవలె ఉన్నాయి. అతని అష్టబాహువులు అందంగా పైకి చాచిన అష్టదిగ్గజాల తొండాలవలె ప్రకాశిస్తున్నాయి. ఎనిమిది చేతులలో చక్రం, ధనుస్సు, పద్మం, శంఖం, ఖడ్గం, పాశం, డాలు, గదాదండం విరాజిల్లుతున్నాయి. నల్లని దేహంతో, నగుమొగంతో, సాధుజనులను సంరక్షించే చల్లని చూపులతో, బంగారు రంగు పట్టు పీతాంబరంతో, మణిమయ కిరీటంతో, నలుమూలలా కాంతులు విరజిమ్మే భూషణాలతో, మకర కుండలాలతో (ప్రత్యక్షమైనాడు).

తెభా-6-219-సీ.
కుండల మణిదీప్తి గండస్థలంబులఁ-
బూర్ణేందురాగంబుఁ బొందుపఱుప
దివ్యకిరీట ప్రదీప్తులంబర రమా-
తికి గౌసుంభవస్త్రంబు గాఁగ
క్షస్థలంబుపై నమాలికాశ్రీలు-
శ్రీవత్స కౌస్తుభ శ్రీల నొఱయ
నీలాద్రిఁ బెనఁగొని నిలిచిన విద్యుల్ల-
ల భాతిఁ గనకాంగదంబు మెఱయ

తెభా-6-219.1-ఆ.
ఖిలలోక మోహనాకార యుక్తుఁడై
నాదాది మునులు జేరి పొగడఁ
దిసి మునులు పొగడ గంధర్వ కిన్నర
సిద్ధ గాన రవము చెవుల నలర.

టీక:- కుండల = చెవికుండలముల; మణి = మణుల యొక్క; దీప్తి = కాంతులు; గండస్థలంబులన్ = చెంప లందు, చెక్కి ళ్ళందు; పూర్ణేందు = నిండుచంద్రుని; రాగంబు = వెలుగులు; పొందుపఱుప = చక్కగ కలుగ జేయగా దివ్య = దివ్యమైన; కిరీట = కిరీటము యొక్క; ప్రదీప్తులు = మిక్కిలి ప్రకాశవంతమైన కాంతులు; అంబర = ఆకాశము యనెడి; రమాసతి = లక్ష్మీదేవి; కిన్ = కి; కౌసుంభ = కుంకుమపువ్వు రంగు గల; వస్త్రంబు = బట్ట; కాగ = అవ్వగా వక్షస్థలంబు = రొమ్ము; పై = మీద; వనమాలికా = వనమాలికల {వనమాలిక - ఆకులు పువ్వులు చేర్చికట్టిన మాల}; శ్రీలు = శోభలు; శ్రీవత్స = శ్రీవత్సము {శ్రీవత్సము - విష్ణుమూర్తి రొమ్ముపై నుండెడి శ్రీవత్సము అనెడి పేరుగల పుట్టుమచ్చ}; కౌస్తుభ = కౌస్తుభముల యొక్క {కౌస్తుభము - విష్ణుమూర్తి వక్షస్థలమున ధరించెడి కౌస్తుభము అను పేరుగల ఒక మణి}; శ్రీలన్ = శోభలతో; ఒఱయన్ = పోటీపడుతుండగా; నీలాద్రిన్ = నీలగిరిని; పెనగొని = చుట్టుకొని; నిలిచిన = నిలబడినట్టి; విద్యుల్లతల = మెరపుతీగల; భాతిన్ = వలె; కనక = బంగారు; అంగదంబు = భుజకీర్తులు; మెఱయ = తళతళ లాడుచుండ; అఖిల = సమస్త; లోక = లోకములకు;
మోహన = మనోహరమైన; ఆకార = స్వరూపము; యుక్తుడు = కలవాడు; ఐ = అయ్యి; నారద = నారదుడు; ఆది = మొదలగు; మునులు = మునులు; చేరి = చేరి; పొగడన్ = కొలుస్తుండగా; కదిసి = సమీపించి; మునులు = మునులు; పొగడ = స్తుతించుచుండగ; గంధర్వ = గంధర్వుల; కిన్నర = కిన్నరల; సిద్ధ = సిద్ధుల; గాన = కీర్తనల; రవము = శబ్దము; చెవులన్ = చెవులను; అలర = అలరించుతుండగ.
భావము:- శ్రీమన్నారాయణుని కర్ణకుండలాల కాంతులు ప్రసరించి చెక్కిళ్ళు చంద్రబింబాలవలె తళతళ లాడుతున్నాయి. తలమీద ధరించిన కిరీటం తన దివ్యదీప్తులతో గగనలక్ష్మికి కుంకుమరంగు చీరను అలంకరిస్తున్నది. అతని వక్షఃస్థలంమీద విరాజిల్లే వనమాలిక శోభలు శ్రీవత్సంతోను, కౌస్తుభంతోను పోటీ పడుతున్నాయి. బాహువులకు చుట్టుకొని ఉన్న భుజకీర్తులు నీలగిరికి చుట్టుకొన్న మెరుపు తీగలవలె మెరుస్తున్నాయి. ఆ స్వామి సౌందర్యం సమస్తలోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నది. నారదాది మహర్షులు చుట్టూ చేరి సేవిస్తున్నారు. దేవతా బృందాలు కైవారాలు సలుపుతున్నారు. గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు వీనుల విందుగా గానం చేస్తున్నారు.

తెభా-6-220-క.
ర్వేశుఁడు సర్వాత్ముఁడు
ర్వగతుం డచ్యుతుండు ర్వమయుండై
ర్వంబుఁ జేరి కొలువఁగ
ర్వగుఁడై దక్షునకుఁ బ్రన్నుం డయ్యెన్.

టీక:- సర్వేశుడు = నారాయణుడు {సర్వేశుడు - సర్వ (సమస్తమునకు) ఈశుడు (ప్రభువు), విష్ణువు}; సర్వాత్ముడు = నారాయణుడు {సర్వాత్ముడు - సర్వ (అఖిల జీవులకు) ఆత్ముడు (అంతరాత్మ యైన వాడు), విష్ణువు}; సర్వగతుండు = నారాయణుడు {సర్వగతుడు - సర్వ (సమస్త మందు) గతుడు (ఉండెడి వాడు), విష్ణువు}; అచ్యుతుండు = నారాయణుడు {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేని వాడు, విష్ణువు}; సర్వమయుండు = సర్వము నందు నిండినవాడు {సర్వమయుడు - సర్వము నందు నిండినవాడు, విష్ణువు}; ఐ = అయ్యి; సర్వంబు = అందరు; చేరి = పూని; కొలువగన్ = సేవిస్తుండగా; సర్వగుడు = సర్వమునందు వ్యాపించినవాడు {సర్వగుడు - సర్వము నందు వ్యాపించినవాడు, విష్ణువు, విష్ణుసహస్రనామములులో 123వ నామము}; ఐ = అయ్యి; దక్షున్ = దక్షుని; కున్ = కి; ప్రసన్నుడు = ప్రత్యక్షము; అయ్యెన్ = అయ్యెను.
భావము:- సర్వేశ్వరుడు, సర్వాత్ముడు, సర్వాంతర్యామి, సర్వమయుడు, అచ్యుతుడు అయిన భగవంతుడు అందరూ తనను చేరి సేవిస్తుండగా కోరినవన్నీ ఇచ్చేవాడై దక్షునకు ప్రసన్నుడైనాడు.

తెభా-6-221-వ.
ఇట్లు ప్రసన్నుండయిన సర్వేశ్వరుని సర్వంకషంబును మహాశ్చర్యధుర్యంబును నయి తేజరిల్లు దివ్యరూపంబుఁ గాంచి, భయంబును హర్షంబును విస్మయంబును జిత్తంబున ముప్పిరిగొని చొప్పు దప్పింపం దెప్పఱి, కప్పరపాటునం బుడమిపైఁ జాగిలంబడి, దండ ప్రణామంబు లాచరించి, కరకమలంబులు మొగిడ్చి సెలయేఱుల తొట్టునఁ గొట్టుపడి, యిట్టట్టుఁ బట్టుచాలక నిట్టపొడిచి, మున్నీరుదన్ని నిలచిన పెన్నీరునుం బోలె, సర్వాంగంబులుం దొంగిలింపఁ, జిత్తంబు నాత్మాయత్తంబుజేసి, పిక్కటిల్లిన సంతోషంబుచేత భగవంతుం బలుకను, నత్యంత మంగళ సందోహాపాదకంబు లైన తన్నామంబు లుగ్గడింపను, నతి నిర్మలంబులైన తదీయకర్మంబులు దడవను, విబుధ హర్షకరంబులైన తత్పౌరుషంబులు పొగడను, నాత్మీయ మనోరథంబు వాక్రువ్వను నోపక ప్రజాకాముండై యూరకున్న ప్రజాపతిం జూచి, సర్వజీవ దయాపరుండును, సర్వసత్త్వ హృదంతరస్థుండును, సర్వ జ్ఞుండునుం, గావున నతని భావంబు దెలిసి, జగన్నాథుం డార్తపోషణంబులైన భాషణంబుల నిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ప్రసన్నుండు = ప్రత్యక్షమైనవాడు; అయిన = అయిన; సర్వేశ్వరుని = నారాయణుని {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు (భగవంతుడు), విష్ణువు}; సర్వంకషంబును = సమస్తము నందు వ్యాపించినది; మహ = మిక్కిలి; ఆశ్చర్య = అద్భుతములకు; ధుర్యంబున్ = మూలమైనది; అయి = అయ్యి; తేజరిల్లు = ప్రకాశించెడి; దివ్య = దివ్యమైన; రూపంబున్ = స్వరూపమును; కాంచి = దర్శించి; భయంబును = భయమును; హర్షంబును = సంతోషమును; విస్మయంబును = ఆశ్చర్యమును; చిత్తంబున = మనసునందు; ముప్పిరిగొని = ముప్పేటలపెనగొని; చొప్పు = జాడ; తప్పింపన్ = తప్పిపొవునట్లుచేయగా; తెప్పఱి = తెప్పరిల్లి; కప్పరపాటునన్ = తొట్రుపాటుతో; పుడమి = భూమి; పైన్ = మీద; చాగిలంబడి = సాగిలబడి; దండప్రణామంబులు = సాష్టాంగనమస్కారములు; ఆచరించి = చేసి; కర = చేతులు యనెడి; కమలంబులు = పద్మములు; మొగిడ్చి = ముకుళించి; సెలయేఱుల = సెలయేళ్ళు; తొట్టునన్ = చెరువు కింది పొలములను; కొట్టుపడి = కొట్టుకుపోతూ; ఇట్టట్టు = ఇటు నటు ప్రక్కల; పట్టు = గట్లు; చాలక = సరిపడక; నిట్టపొడిచి = పొంగిపొర్లి; మున్నీరు = సముద్రమునకు; తన్ని = ఎగదన్ని; నిలిచిన = నిలబడిపోయిన; పెన్నీరునున్ = వరదనీరును; పోలె = వలె; సర్వాంగంబులు = సర్వావయవములు; తొంగిలింప = వశము తప్పగా; చిత్తంబున్ = మనసును; ఆత్మాయత్తంబు = తన వశములోనికి తెచ్చుకొనుట; చేసి = చేసికొని; పిక్కటిల్లిన = అతిశయించిన; సంతోషంబు = సంతోషము; చేత = వలన; భగవంతున్ = నారాయణుని; పలుకను = స్తుతించుటకు; అత్యంత = అత్యధికమైన; మంగళ = శుభముల; సందోహ = సమీకరములను; ఉపాదకంబులు = కలిగించునవి; ఐన = అయిన; తత్ = అతని; నామంబులు = నామములను; ఉగ్గడింపన్ = పలుకుటకు; అతి = మిక్కిలి; నిర్మలంబు = స్వచ్ఛము; ఐన = అయిన; తదీయ = అతని; కర్మంబులు = లీలలను; తడవను = అభివర్ణించను; విబుధ = దేవతలకు; హర్షకరంబులు = సంతోషకరములు; ఐన = అయిన; తత్ = అతని; పౌరుషంబులు = పరాక్రమములు; పొగడను = కీర్తించను; ఆత్మీయ = తన యొక్క; మనోరథంబు = మనసులోని కోరికను; వాక్రువ్వను = పలుకుటకు; ఓపక = సమర్థుడు కాకుండగ; ప్రజా = సంతానములను; కాముండు = కోరెడివాడు; ఐ = అయ్యి; ఊరకున్న = ఉరకుండిపోయిన; ప్రజాపతిన్ = ప్రజాపతిని; చూచి = చూసి; సర్వ = అఖిల; జీవ = ప్రాణులకు; దయాపరుండును = కృపావరుండును; సర్వ = అఖిలమైన; సత్త్వ = ప్రాణుల యొక్క; హృద = హృదయముల; అంతరస్థుండును = లోనుండు వాడును; సర్వజ్ఞుండును = సమస్తము తెలిసినవాడు; కావునన్ = కనుక; అతని = అతని యొక్క; భావంబు = ఉద్దేశ్యము; తెలిసి = తెలిసికొని; జగన్నాథుండు = నారాయణుడు {జగన్నాథుడు - జగత్ (భువనములకు) నాథుడు (ప్రభువు), విష్ణువు}; ఆర్త = ఆర్తులను; పోషణంబులు = పాలించెడివి; ఐన = అయిన; భాషణంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా ప్రత్యక్షమైన సర్వేశ్వరుని దివ్యరూపం అన్ని దిక్కులనూ ప్రాకాశింపజేస్తూ మహాశ్చర్యాన్ని కలిగించింది. దానిని చూచిన దక్షుని హృదయంలో భయం, ఆనందం, ఆశ్చర్యం ముప్పిరి గొన్నాయి. ఎలాగో ఆ తన్మయత్వం నుంచి తెప్పరిల్లి రెప్పపాటు కాలంలో స్వామికి సాష్టాంగ దండప్రణామం చేసాడు. చేతులు జోడించి నమస్కరించాడు. సెలయేళ్ళ కలయికతో దరులొరసి పొంగి మిన్నంటి సముద్రాన్ని దరిసిన మహానదీ ప్రవాహం వలె దక్షప్రజాపతి పులకించిన దేహంతో భగవంతుని ముందు నిలిచాడు. పరవశించిన తన హృదయాన్ని ఎలాగో స్వాధీనం చేసుకొని పొంగిపొరలే ఆనందంతో ఆ పరమేశ్వరునితో ఏమేమో మాట్లాడా లనుకున్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్ర నామాలను ఉచ్చరించా లనుకున్నాడు. పరమ పవిత్రాలైన ఆయన లీలలను అభివర్ణించా లనుకున్నాడు. విబుధులకు సంతోషాన్ని కలిగించే ఆయన పరాక్రమాన్ని ప్రస్తుతించా లనుకున్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించా లనుకున్నాడు. కాని ఏమీ చేయలేక పోయాడు. ఆ ప్రజాకాముడైన దక్షప్రజాపతిని చూచి సర్వజ్ఞుడు, సర్వప్రాణి హృదయాంతర్యామి అయిన ఆ స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి ఆర్తజన పరిపోషకాలైన మాటలతో ఇలా అన్నాడు.

తెభా-6-222-క.
"మెచ్చితిఁ బ్రాచేతస! తప
మిచ్చట ఫలసిద్ధి యయ్యె నిట్లతిభక్తిన్
హెచ్చగు మద్వరవిభవము
చ్చుపడం బొంద నెవ్వఁ ర్హుఁడు? జగతిన్.

టీక:- మెచ్చితి = మెచ్చుకొంటిని; ప్రాచేతస = ప్రచేతసుల పుత్రుడా; తపము = తపస్సు; ఇచ్చటన్ = ఇక్కడితో; ఫలసిధ్ది = సఫలము; అయ్యెన్ = అయినది; ఇట్లు = ఈ విధముగ; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; హెచ్చు = అధికము; అగు = అయిన; మత్ = నా యొక్క; వర = వరముల; విభవమున్ = వైభవమును; అచ్చుపడన్ = స్పష్టపడునట్లు; పొందన్ = పొందుటకు; ఎవ్వండు = ఎవరు; అర్హుండు = అర్హత గలవారు; జగతిన్ = లోకమున.
భావము:- “దక్షప్రజాపతీ! నిన్ను మెచ్చుకొన్నాను. నీ తపస్సు ఫలించింది. అచంచలమైన భక్తితో నన్ను సేవించి నా నుంచి వైభవోపేతమైన వరాలను అందుకొనడానికి నీకంటె అర్హుడు ఈ లోకంలో ఎవరున్నారు?

తెభా-6-223-ఆ.
పము చాలు నింకఁ గ భూతతతికి వి
భూతు లొనరుఁ గాక పొందుపడఁగ;
నిదియ సుమ్ము మాకు నిచ్చలోఁ గల కోర్కి
పొసఁగ నీదువలనఁ బొందుపడియె.

టీక:- తపము = తపస్సు; చాలును = చాలు; ఇంకన్ = ఇంక; తగన్ = బాగుగా; భూత = ప్రాణుల; తతి = సమూహమున; కి = కి; విభూతులు = వైభవములు; ఒనరుగాక = కలుగుగాక; పొందుపడగన్ = చక్కగా; ఇదియె = ఇదే; సుమ్ము = సుమా; మాకున్ = మాకుకూడ; ఇచ్చ = సంకల్పము; లోన్ = లోపల; కల = ఉన్నట్టి; కోర్కి = కోరిక; పొసగ = చక్కగా; నీదు = నీ; వలన = వలన; పొందుపడియె = నెరవేరినది.
భావము:- ఇక నీ తపస్సు చాలించు. సకల ప్రాణికోటికి సమస్త శుభాలు చక్కగా సమకూరు గాక! నా మనస్సులోని సంకల్పం కూడా ఇదే. అది నీ వల్ల నెరవేరింది.

తెభా-6-224-వ.
వినుము, బ్రహ్మయు, భర్గుండును, బ్రజాపతులును, మనువులును, నింద్రులును, నిఖిల భూతంబులకు భూతిహేతువులయిన మద్భూతి విభవంబులు; మఱియు, నాకు యమ నియమాది సహిత సంధ్యావందనాది రూపంబగు తపంబు హృదయంబు; సాంగ జపవద్ధ్యానరూపం బగు విద్య శరీరంబు; ధ్యానాది విషయంపు వ్యాపారంబుగా నుండు భావనాది శబ్దవాచ్యంబగు క్రియ యాకృతి; క్రతు జాతంబు లంగంబులు; ధర్మం బాత్మ; దేవతలు ప్రాణంబులు; నిగమంబు మత్స్వరూపంబు; జగదుత్పత్తికి నాది యందు నే నొక్కండన తేజరిల్లుచుంటి; బహిరంతరంబుల వేఱొక్కటి లేక సుషుప్త వ్యవస్థ యందు సర్వంబు లీనం బగుటం జేసి సంజ్ఞామాతృండును, నవ్యక్తుండునుగా నుండు జీవుని భంగి నొక్కఁడన యుండుదు; ననంతుండ నై యనంతగుణంబులు గల మాయా గుణంబువలన గుణ విగ్రహం బగు బ్రహ్మాండంబును, నయోనిజుండు స్వయంభువు నగు బ్రహ్మయును నుదయించిరి; మదీయ వీర్యోపబృంహితుండయి మహా దేవుం డగు నా బ్రహ్మ యసమర్థుండునుంబోలె నకృతార్థమ్మన్యమాన మనస్కుండయి, సృజింప నుద్యమించు తఱి తపం బాచరింపు మని నాచేత బోధితుండై, ఘోరంబైన తపం బాచరించి తొలుత సృష్టికర్తృత్వంబు వహించిన మిమ్ము సృజియించె; నంతఁ బంచజన ప్రజాపతి తనూజయగు యసిక్ని యను పేరిట వినుతినొంది యున్న యిక్కన్యకను నీ కిచ్చితి; దీనిం బత్నిఁగాఁ గైకొని మిథునవ్యవాయ ధర్మంబు గలవాఁడవై మిథునవ్యవాయధర్మంబు గల యీ నాతి యందుఁ బ్రజాసర్గంబు నతి విపులంబుగ గావింపం గలవాఁడవు. మఱియు నీకుఁ బిదప నీ క్రమంబున నిఖిల ప్రజలును మన్మాయా మోహితులై మిథునవ్యవాయధర్మంబునఁ బ్రజావృద్ధి నొందించి మదారాధనపరులై యుండ గలవా"రని పలికి, విశ్వభావనుండైన హరి, స్వప్నోపలబ్ధార్థంబునుం బోలె నంతర్ధానంబు నొందె; నప్పుడు దక్షుండు విష్ణుమాయోపబృంహితుం డై పాంచజని యగు నసక్ని యందు హర్యశ్వసంజ్ఞల వినుతిఁ జెందియున్న యయుతసంఖ్యాపరిగణితు లైన పుత్రులం గాంచె; అప్పుడా ధర్మశీలు రైన దాక్షాయణులు పితృనిర్దేశంబునం బ్రజాసర్గంబు కొఱకుఁ దపంబుచేయువారై పశ్చిమ దిశకుం జని, యచ్చట సింధు సముద్ర సంగమంబున సమస్త దేవ ముని సిద్ధగణ సేవితంబై, దర్శనమాత్రంబున నిర్ధూతకల్మషులను నిర్మలచిత్తులనుం జేయుచున్న నారాయణ సరస్సనం బరగు తీర్థరాజంబున నవగాహనంబు చేసి, నిర్మలాంతరంగులై పరమహంసధర్మంబు నందు నుత్పన్నమతు లై ప్రజాసర్గంబు కొఱకుఁ దండ్రి యనుమతంబున నుగ్రతపంబు చేయుచుండ, వారికడకు నారదుండు వచ్చి, యిట్లనియె.
టీక:- వినుము = వినుము; బ్రహ్మయు = బ్రహ్మదేవుడు; భర్గుండును = పరమశివుడును; ప్రజాపతులును = ప్రజాపతులు; మనువులును = మనువులు {చతుర్దశమనువులు - 1స్వాయంభువుడు 2స్వారోచిషుడు 3ఉత్తముడు 4తామసుడు 5రైవతుడు 6చాక్షుసుడు 7వైవస్వతుడు 8సూర్యసావర్ణి 9దక్షసావర్ణి 10బ్రహ్మసావర్ణి 11ధర్మసావర్ణి 12రుద్రసావర్ణి 13రౌచ్యుడు 14భౌచ్యుడు}; ఇంద్రులును = ఇంద్రులు; నిఖిల = సమస్తమైన; భూతంబుల్ = ప్రాణుల; కున్ = కు; భూతి = వైభవములకు; హేతువులు = కారణములు; అయిన = ఐన; మత్ = నానుండి; భూతి = పుట్టిన; విభవంబులు = వైభవములు; మఱియు = ఇంకను; నాకు = నాకు; యమ = యమము {యమనియమాది - అష్టాంగయోగముమార్గములు, 1 యమము 2 నియమము 3 ఆసనము 4 ప్రాణాయామము 5 ప్రత్యాహారము 6 ధారణ 7 ధ్యానము 8 సమాధి}; నియమ = నియమము; ఆది = మొదలైనవానితో; సహిత = కూడిన; సంధ్యావందన = సంధ్యావందనము; ఆది = మొదలగు; రూపంబు = స్వరూపములు గలది; అగు = అయిన; తపంబు = తపస్సు; హృదయంబు = హృదయము; సాంగజప = అంగవిన్యాస పూర్వక జపము; ధ్యాన = ధ్యానముల; రూపంబు = స్వరూప మైనది; అగు = అయిన; విద్య = విద్య; శరీరంబు = దేహము; ధ్యాన = ధ్యానము; ఆది = మొదలైనవాని; విషయంపు = విషయములలోని; వ్యాపారంబుగా = వర్తనగా; ఉండు = ఉండెడి; భావన = భావనము; ఆది = మొదలగు; శబ్ద = శబ్దములచే; వాచ్యంబు = చెప్పబడునది; అగు = అయిన; క్రియ = క్రియలే; ఆకృతి = స్వరూపము; క్రతు = యజ్ఞముల; జాతంబులు = వరుసలు; అంగంబులు = అవయవములు; ధర్మంబు = ధర్మము; ఆత్మ = ఆత్మ; దేవతలు = దేవతలు; ప్రాణంబులు = ప్రాణములు; నిగమంబు = వేదములు; మత్ = నా యొక్క; స్వరూపంబు = స్వరూపము; జగత్ = భువనము యొక్క; ఉత్పత్తి = సృష్టి; కిన్ = కి; ఆది = మూల కారణము; అందు = లో; నేను = నేను; ఒక్కండన = ఒక్కడినే; తేజరిల్లుచుంటి = విలసిల్లుతుంటిని; బహిర్ = బయట; అంతరంబులన్ = లోపల యందు; వేఱొక్కటి = మరి యొకటి; లేక = లేకుండగ; సుషుప్త = నిద్రాణ {త్ర్యవస్థలు - 1జాగ్రత్త 2స్వప్నము 3సుషుప్తి}; అవస్థ = స్థితి; అందు = లో; సర్వంబు = సమస్తమ; లీనంబు = లీనము; అగుటన్ = అగుట; చేసి = వలన; సంజ్ఞామాతృండును = నామమాతృడును; అవ్యక్తుండును = వ్యక్తము కానివాడు; కాన్ = అయ్యి; ఉండు = ఉండెడి; జీవుని = జీవుడి; భంగిన్ = వలె; ఒక్కండన = ఒక్కడినే; ఉండుదు = ఉండెదను; అనంతుండను = అంతము లేనివాడను; ఐ = అయ్యి; అనంత = అంతులేని; గుణంబులు = గుణములు; కల = ఉన్నట్టి; మాయాగుణంబు = మాయాగుణము; వలన = వలన; గుణ = గుణములు; విగ్రహంబు = విభాగములుగా కలది; అగు = అయిన; బ్రహ్మాండంబునున్ = బ్రహ్మాండము; అయోనిజుండు = గర్భమున పుట్టనివాడు {అయోనిజుడు - గర్భమున పుట్టనివాడు, బ్రహ్మదేవుడు}; స్వయంభువును = తనకు తానే పుట్టినవాడు {స్వయంభువు - తనకు తానే పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; అగు = అయిన; బ్రహ్మయును = బ్రహ్మదేవుడు; ఉదయించిరి = పుట్టిరి; మదీయ = నా యొక్క; వీర్య = తేజస్సుచే; ఉపబృంహితుండు = సంవృద్ధమైనవాడు; అయి = అయ్యి; మహా = గొప్ప; అగు = అయిన; ఆ = ఆ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; అసమర్థుండును = చేతకానివాని; పోలె = వలె; అకృతార్థమ్మన్యమాన = తాను కృతార్థుడను కానని తలచెడు; మనస్కుండు = మనసు గలవాడు; అయి = అయ్యి; సృజింపను = సృష్టించుటకు; ఉద్యమించు = సిద్ధపడు; తఱి = సమయము నందు; తపంబు = తపస్సు; ఆచరింపుము = చేయుము; అని = అని; నా = నా; చేత = చేత; బోధితుండు = తెలియ జెప్పబడినవాడు; ఐ = అయ్యి; ఘోరంబు = తీవ్రము; ఐన = అయిన; తపంబులు = తపస్సులు; ఆచరించి = చేసి; తొలుత = ముందుగా; సృష్టి = సృష్టించుటకు; కర్తృత్వంబు = బాధ్యత; వహించిన = స్వీకరించిన; మిమ్ము = మిమ్ములను; సృజియించెను = పుట్టించెను; అంతన్ = అంతట; పంచజన = పంచజనుడు యనెడి {పంచజనుడు - మనుష్యుడు, మానిసి}; ప్రజాపతి = ప్రజాపతి యొక్క; తనూజ = పుత్రిక {తనూజ - తనువు (శరీరము) నుండి జ (పుట్టినది), కుమార్తె}; అగు = అయిన; అసిక్ని = అసిక్ని {అసిక్ని - అంతఃపురమున పనిచేసెడి పడుచుస్త్రీ}; అను = అనెడి; పేరిటన్ = పేరుతో; వినుతి = ప్రసిద్ధి; ఒంది = పొంది; ఉన్న = ఉన్నట్టి; ఈ = ఈ; కన్యకను = కన్యను; నీ = నీ; కున్ = కు; ఇచ్చితి = ఇచ్చితిని; దీనిన్ = దీనిని; పత్ని = భార్యగా; కైకొని = చేపట్టి; మిథునవ్యవాయ = జతకట్టెడి, దంపతుల యొక్క; ధర్మంబు = లక్షణము; కలవాడవు = ఉన్నవాడవు; ఐ = అయ్యి; మిథునవ్యవాయ = జతకట్టెడి; ధర్మంబు = లక్షణము; కల = ఉన్నట్టి; ఈ = ఈ; నాతి = స్త్రీ; అందు = అందు; ప్రజా = సంతానములు; సర్గంబు = పుట్టించుట; అతి = మిక్కిలి; విపులంబుగా = విస్తారముగా; కావింపగలవాడవు = చేయగలవు; మఱియు = ఇంకను; నీ = నీ; కున్ = కు; పిదప = తరువాత; ఈ = ఈ; క్రమంబునన్ = విధముగనే; నిఖిల = సమస్తమైన; ప్రజలును = జనులును; మత్ = నా యొక్క; మాయా = మాయ యందు; మోహితులు = మోహింప బడినవారు; ఐ = అయ్యి; మిథునవ్యవాయధర్మంబునన్ = జతకట్టెడి లక్షణముతో; ప్రజా = జనులను; వృద్ధిన్ = పెంచుట; ఒందించి = చేసి; మత్ = నా యొక్క; ఆరాధనాపరులు = సేవలలో లగ్నమైనవారు; ఐ = అయ్యి; ఉండగలవారు = ఉండెదరు; అని = అని; పలికి = చెప్పి; విశ్వభావనుండు = సకలలోకములచే భావింపబడువాడు {విశ్వ భావనుడు - సకల లోకములచే భావింపబడువాడు, విష్ణువు}; ఐన = అయిన; హరి = నారాయణుడు; స్వప్న = కలలో; ఉపలబ్ధ = లభించినట్టి; అర్థంబునున్ = పదార్థంబును; పోలె = వలె; అంతర్థానంబున్ = అదృశ్య మగుటను; ఒందెన్ = పొందెను; అపుడు = అప్పుడు; దక్షుండు = దక్షుడు; విష్ణు = నారయణుని; మాయా = మాయచే; ఉపబృంహితుండు = సంవృద్ధమైనవాడు; ఐ = అయ్యి; పాంచజని = పంచజనుని పుత్రిక యైనది; అగు = అయిన; అసక్ని = అసక్ని; అందు = అందు; హర్యశ్వ = హర్యశ్వ యనెడి; సంజ్ఞలన్ = పేరుతో; వినుతి = ప్రసిద్ధి; చెంది = చెంది; ఉన్న = ఉన్నట్టి; అయుత = పదివేల; సంఖ్యా = సంఖ్యలలో; పరిగణితులు = లెక్కింపబడెడివారు; ఐన = అయిన; పుత్రులన్ = కుమారులను; కాంచె = కనెను; అప్పుడ = అప్పుడు; ఆ = ఆ; ధర్మశీలురు = ధర్మ బద్ధమైన వర్తన గలవారు; ఐన = అయిన; దాక్షాయణులు = దక్షునికి పుట్టినవారు; పితృ = తండ్రి యొక్క; నిర్దేశంబునన్ = చెప్పిన ప్రకారము; ప్రజాసర్గంబు = జనులను సృష్టించుట; కొఱకు = కోసము; తపంబు = తపస్సు; చేయువారు = చేసెడివారు; ఐ = అయ్యి; పశ్ఛిమ = పడమర; దిశ = దిక్కున; కున్ = కు; చని = వెళ్ళి; అచ్చట = అక్కడ; సింధు = సింధునది; సముద్ర = సముద్రము నందు; సంగమంబునన్ = కలిసెడి చోట; సమస్త = అఖిల; దేవ = దేవతలు; ముని = మునులు; సిద్ధ = సిద్ధుల; గణ = సమూహములచే; సేవితంబు = కొలువబడునది; ఐ = అయ్యి; దర్శన = చూసినంత; మాత్రంబునన్ = మాత్రముచేత; నిర్ధూత = పోగొట్టబడిన; కల్మషులను = పాపములు గలవారిని; నిర్మల = స్వచ్ఛమైన; చిత్తులనున్ = మనసు గలవారిని; చేయుచున్న = చేస్తున్న; నారాయణసరస్సు = నారాయణసరస్సు; అనన్ = అనగా; పరగు = ప్రసిద్ధమైన; తీర్థ = పుణ్యతీర్థములలో; రాజంబునన్ = శ్రేష్ఠమైనదానిలో; అవగాహనంబు = స్నానము చేయుట; చేసి = చేసి; నిర్మల = స్వచ్ఛమైన; అంతరంగులు = మనసులు గలవారు; ఐన = కాగా; పరమహంస = పరమహంసల యొక్క; ధర్మంబున్ = ధర్మము; అందున్ = లో; ఉత్పన్న = పుట్టిన; మతులు = మనసులు గలవారు; ఐ = అయ్యి; ప్రజాసర్గంబు = జనులను పుట్టించు; కొఱకు = కోసము; తండ్రి = తండ్రి యొక్క; అనుమతంబునన్ = అనుజ్ఞతో; ఉగ్ర = తీవ్రమైన; తపంబు = తపస్సు; చేయుచుండ = చేస్తుండగా; వారి = వారి; కడ = వద్ద; కున్ = కు; నారదుండు = నారదుడు; వచ్చి = వచ్చి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- విను. బ్రహ్మ, శివుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రులు మొదలైనవారు సమస్త ప్రాణుల వైభవాలకు కారణమైనవారు. వీరంతా నా మహాశక్తి వలన జన్మించినవారే. ఇంద్రియ నిగ్రహం, నియమం, సంధ్యావందనం మొదలైన వానితో కూడిన తపస్సే నా హృదయం. అంగోపాంగ సహితమై ధ్యానరూపమైన విద్యయే నా దేహం. ధ్యానం మొదలైన విషయాలలో ప్రవర్తించే భావనాది క్రియయే నా ఆకారం. యజ్ఞాలే నా అవయవాలు. ధర్మమే నా ఆత్మ. దేవతలే నా ప్రాణాలు. వేదాలే నా స్వరూపం. ఈ జగత్తు ఉద్భవించడానికి పూర్వం నేను ఒక్కడినే ఉన్నాను. వెలుపల గానీ, లోపల గానీ వేరొక పదార్థం లేదు. అప్పుడు ఈ సమస్త విశ్వం సుషుప్తి అవస్థలో ఉండగా నేనొక్కడనే సంజ్ఞామాత్రంగా అవ్యక్తంగా ఉన్నాను. నేను అనంతుడనే. అనంత గుణాలతో కూడిన నా మాయవల్ల గుణశరీరమైన ఈ బ్రహ్మాండాన్ని, అయోనిజుడైన బ్రహ్మను సృష్టించాను. నా తేజస్సుతో నిండిన ఆ చతుర్ముఖ బ్రహ్మ సృష్టికార్యాన్ని చేపట్టి కూడా తనను కృతార్థుడైన వానిగా తలచుకోలేదు. అసమర్థతతో ఈ సృష్టి తనవల్ల కాదని భావించాడు. అప్పుడు తపస్సు చేయమని బ్రహ్మను నేను ప్రబోధించాను. చతుర్ముఖుడు నాచేత ప్రబోధితుడై ఘోరమైన తపస్సు చేసి మొట్టమొదటి సారిగా సృష్టికర్తలైన మిమ్మల్ని ప్రజాపతులుగా సృష్టించాడు. దక్షప్రజాపతీ! ఇప్పుడు పంచజన ప్రజాపతి పుత్రిక అయిన అసిక్ని అనే పేరు గల ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ఈమెను భార్యగా పరిగ్రహించు. ఈమె యందు దాంపత్యధర్మంతో ప్రవర్తించి విస్తారంగా ప్రజలను సృష్టించు. అనంతరం ప్రజలందరూ నా మాయచే మోహితులై దాంపత్యధర్మాన్ని అవలంబించి ప్రజాభివృద్ధి కావించి నన్ను సేవించగలరు” అని దక్షప్రజాపతితో పలికి శ్రీమన్నారాయణుడు కలలో కనిపించిన పదార్థం వలె అంతర్ధానమైనాడు. అనంతరం దక్షప్రజాపతి విష్ణుదేవుని మాయచేత విమోహితుడై పంచజనుని పుత్రిక అయిన అసిక్ని అనే పత్ని యందు హర్యశ్వులు అనే పేరుగల వారిని పదివేలమంది కుమారులను కన్నాడు. ధర్మస్వభవులైన ఆ దక్షుని కుమారులు పదివేలమంది తమ తండ్రి ఆజ్ఞానుసారం ప్రజలను సృష్టించే నిమిత్తం తపస్సు చేయాలని నిశ్చయించారు. ఆ హర్యశ్వులు పడమటి దిక్కుకు ప్రయాణం చేశారు. అక్కడ సింధునది నముద్రంలో సంగమించే ప్రదేశంలో నారాయణ సరస్సు అనే తీర్థరాజాన్ని చూశారు. ఆ పుణ్యతీర్థం సమస్త దేవతలచేత, మునీశ్వరులచేత, సిద్ధపురుషులచేత సేవింపబడుతూ ఉంటుంది. ఆ తీర్థాన్ని దర్శించినవారు సమస్త పాపాల నుండి విముక్తులై నిర్మల హృదయులౌతారు. అటువంటి పవిత్ర తీర్థంలో ఆ హర్యశ్వులు స్నానం చేశారు. పరిశుద్ధమైన మనస్సులు కలవారై ప్రజాసర్గం నిమిత్తం పరమాత్మను ఉద్దేశించి భయంకరమైన తపస్సును ప్రారంభించారు. ఒకనాడు నారదుడు అక్కడికి వచ్చి వారితో ఇలా అన్నాడు.

తెభా-6-225-సీ.
"మీ రతిమూఢులు మీదఁటి గతి గాన-
రెన్నంగఁ బసిబిడ్డ న్నలార!
పుమిఁ దా నింతని డఁ బరికింపరు-
ప్రజలఁ బుట్టింప నే ప్రతిభ గలదు?
ట్లైన నొక్క మహాత్ముఁడు పురుషుండు-
హురూపములు గల భామ యొకతె
పుంశ్చలి గర్తంబు బురణింప నుభయ ప్ర-
వాహంబు గల నది ఱలఁ గదల

తెభా-6-225.1-ఆ.
నంచ యొకటి యిరువదైదింటి మహిమలఁ
లిగియుండు తెరువు గానరాక
జ్రనిబిడ మగుచు రుసఁ దనంతన
తిరుగుఁ గాష్ఠబిలము దేటపడఁగ.

టీక:- మీరు = మీరు; అతి = మిక్కిలి; మూఢులు = తెలివితక్కువవారు; మీదటి = రాబోవు; గతిన్ = గతిని; కానరు = చూడలేరు; ఎన్నంగ = తరచి చూసిన; పసి = బాగా చిన్న; బిడ్డలు = పిల్లలు; అన్నలార = అన్నల్లారా; పుడమిన్ = భూమిపై; తాన్ = తను; ఇంత = ఇంత; అని = అని; కడన్ = చివరను; పరికింపరు = చూడరు; ప్రజలన్ = జనులను; పుట్టింపన్ = పుట్టించుటలో; ఏ = ఏమి; ప్రతిభ = గొప్పదనము; కలదు = ఉన్నది; అట్లు = అలా; ఐన = అయినచో; ఒక్క = ఒక్క; మహాత్ముడు = మహాత్ముడు; పురుషుండు = పురుషుడు; బహు = అనేక; రూపములు = స్వరూపములు; కల = కలిగిన; భామ = స్త్రీ; ఒకతె = ఒకామె; పుంశ్చలి = రంకుటాలు {పుంశ్చలి - పురుషుని చూచి చలించునట్టి ఆడుది, రంకుటాలు}; గర్తంబు = గొయ్యి; పురణింపన్ = విజృభించుటకు; ఉభయప్రవాహంబు = రెండు ప్రక్కలకు ప్రవహించుట; కల = ఉన్నట్టి; నది = నది; వఱలన్ = ప్రవర్తించును; కదలని = కదలని; అంచ = హంస, ఆత్మ;
ఒకటి = ఒకటి; ఇరువదైదింటి = పంచవింశతితత్వములు {పంచవింశతి తత్వములు - 1 అవ్యక్తము 2మహత్తు 3అహంకారము 4మనసు 5నుండి14జ్ఞానేంద్రియకర్మేంద్రియములు పది 15నుండి19 తన్మాత్రలు ఐదు 20నుండి24మహాభూతములు ఐదు 25పురుషుడు}; మహిమలన్ = మహిమలను; కలిగియుండు = కలిగి ఉండెడి; తెరువు = దారి; కానగరాక = చూడలేక; వజ్ర = వజ్రమువంటి; నిబిడము = సాంద్రత గలది; అగుచు = అగుచు; వరుసన్ = వరుస లందు; తనంతన = తనంత తాను; తిరుగున్ = తిరుగును; కాష్ఠబిలము = కాష్ఠబిలము; తేటపడగ = తెలియునట్లు.
భావము:- “నాయనలారా! మీరు మిక్కిలి మూఢులుగా ఉన్నారు. భవిష్యత్తును చూడలేకున్నారు. మీరు పసిబిడ్డలు. ఈ భూమి పరిమాణం ఎంతో తెలియనివారు. ఇక జీవులను ఎలా సృష్టించగలరు? మహాత్ముడైన పురుషుడు ఒక డున్నాడు. స్త్రీరూపిణియై అనేక రూపాలు ధరించిన ప్రకృతి ఒకటున్నది. మాయలమారి అయిన ఆ ప్రకృతి పురుషుణ్ణి లోబరచుకుంటుంది. ప్రకృతి, పురుషుడు కలిసి సంసార ప్రవాహాన్ని సాగిస్తారు. ఈ సంసారమనే నది రెండు వైపులనుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ఒక హంస విహరిస్తూ ఉంటుంది. ఆ హంసకు ఇరవై అయిదు మహిమ లుంటాయి. అయినా ఆ హంస సరియైన మార్గం కానరాక వజ్రకాంతులతో మెరుస్తున్న జలప్రవాహం పడే గోతి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

తెభా-6-226-క.
వినుఁ డందుల ననురూపము
ను పొందఁగ నెఱుఁగ కాత్మ నాత్మ గురూక్తిం
గొసాగించెద మను మి
మ్మ నేమియు లేదు మూఢు ని తెలిసి తగన్. "

టీక:- వినుడు = వినండి; అందుల = దానిలో; అనురూపమునను = అనుకూలముగా; పొందగన్ = పొందుట; ఎఱుగక = తెలియక; ఆత్మన్ = మనసున; ఆత్మన్ = తమయొక్క; గురు = తండ్రి; ఉక్తిన్ = చెప్పినట్లు; కొనసాగించెదము = చేసెదము; అను = అనెడి; మిమ్ము = మిమ్ములను; అనన్ = అనుటకు; ఏమియు = ఏమి; లేదు = లేదు; మూఢులు = తెలివితక్కువవారు; అని = అని; తెలిసి = తెలిసికొని; తగన్ = తగినట్లు.
భావము:- హర్యశ్వులారా! వినండి. ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోకుండా కేవలం మీ త్రండి ఆజ్ఞలను పాటించడానికి పూనుకొన్నారు. అటువంటి మిమ్ములను తెలివి తక్కువవాళ్ళు అని కాకుండా ఇంకేమనాలి?”

తెభా-6-227-వ.
అని నారదుండు బోధించిన హర్యశ్వులు సహజబుద్ధిచేత నారద వాక్యంబులఁ దమలోన నిట్లని వితర్కించిరి.
టీక:- అని = అని; నారదుండు = నారదుడు; బోధించిన = తెలియజెప్పగా; హర్యశ్వులు = హర్యశ్వులు; సహజ = సహజసిద్ధమైన; బుద్ధి = జ్ఞానము; చేత = చేత; నారద = నారదుని; వాక్యంబులన్ = మాటలను; తమలోన్ = తమలో తాము; ఇట్లు = ఈ విధముగ; అని = అని; వితర్కించిరి = మిక్కిలిగ తర్కించుకొనిరి.
భావము:- అని నారదుడు బోధించగా హర్యశ్వులు తమ బుద్ధితో విమర్శించుకొని తమలో తాము ఇలా తర్కించుకొన్నారు.

తెభా-6-228-తే.
"సొరిది క్షేత్రజ్ఞుఁడన నతిసూక్ష్మ బుద్ధి
రయ నజ్ఞానబంధనం గుచు లింగ
దేహమన నెద్ది గల దది దెలియకున్నఁ
లదె? మోక్షంబు దుష్కర్మ తులచేత.

టీక:- సొరిది = వరుసగా; క్షేత్రజ్ఞుడు = క్షేత్రజ్ఞుడు {క్షేత్రజ్ఞః - విష్ణుసహస్రనామములలో 16వ నామము, క్షేత్రము (శరీరము}ను తెలిసికొనువాడు; అనన్ = అనగాను; అతి = మిక్కిలి; సూక్ష్మ = సూక్ష్మమైన; బుద్ధిన్ = బుద్ధితో; అరయన్ = తెలిసికొని; అజ్ఞానబంధనంబు = అజ్ఞానబంధము; అగుచు = అగుచు; లింగదేహము = లింగదేహము {లింగదేహము - పూర్వసంస్కారములచే చేయబడిన దేహము, లింగము (సంజ్ఞ నామ రూపాది)లచే తెలియబడునది}; అనన్ = అనగా; ఎద్ది = ఏదైతే; కలదు = ఉన్నదో; అది = దానిని; తెలియకున్న = తెలిసికొనకపోయినచో; కలదే = దొరకునా ఏమి మోక్షంబు = ముక్తి; దుష్కర్మ = దుష్టకర్మ; గతుల = విధానముల; చేత = చేత.
భావము:- “ముందుగా మనం సూక్ష్మబుద్ధితో క్షేత్రజ్ఞుడంటే ఎవరో తెలుసుకోవాలి. తర్వాత అజ్ఞానబంధన రూపమైన లింగదేహమంటే ఏమిటో గ్రహించాలి. ఆత్మ, దేహం ఈ రెండింటి స్వరూపాలను తెలుసుకోకుండా కేవలం నిరుపయోగాలైన కర్మలు ఆచరించిన మాత్రాన మోక్షం లభించదు.

తెభా-6-229-తే.
లఁడు జగదేక సన్నుత కారణుండు
స్వామి భగవంతుఁ డభవుండు స్వాశ్రయుండు
రముఁ డాతనిఁ జూడక బ్రహ్మ కైనఁ
లుగునే? ముక్తిపదము దుష్కర్మగతుల.

టీక:- కలడు = ఉన్నాడు; జగత్ = లోకములు; ఏక = అన్నిటను; సన్నుత = స్తుతింపబడు; కారణుండు = కారణమైనవాడు; స్వామి = నారాయణుడు {స్వామి - వస్తు స్వాతంత్ర్యము గలవాడు, విష్ణువు}; భగవంతుడు = నారాయణుడు {భగవంతుడు - ఐశ్వర్యవంతుడు, విష్ణువు}; అభవుండు = నారాయణుడు {అభవుండు - పుట్టుక లేనివాడు, విష్ణువు}; స్వాశ్రయుండు = నారాయణుడు {స్వాశ్రయుండు - స్వయం (తనకు తనే) ఆశ్రయమైన వాడు, విష్ణువు}; పరముడు = నారాయణుడు {పరముడు - సమస్తమునకు పై నుండువాడు, విష్ణువు}; ఆతనిన్ = అతనిని; చూడక = దర్శించకుండగ, తెలియక; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కైనన్ = కి అయినప్పటికి; కలుగునే = లభించునా ఏమి; ముక్తిపదము = మోక్షమార్గము; దుష్కర్మ = దుష్టకర్మ; గతుల = విధానముల వలన.
భావము:- ఈ సమస్త లోకాలకు మూలకారకుడైన భగవంతుడు ఒక డున్నాడు. ఆయన సర్వేశ్వరుడు, పుట్టుక లేనివాడు, ఆత్మాశ్రయుడు, పురుషోత్తముడు. అటువంటి అంతర్యామి అయిన స్వామిని దర్శింపలేకుంటే బ్రహ్మకైనా మోక్షం లభిస్తుందా?

తెభా-6-230-ఆ.
పురుషుఁ డెట్టులేనిఁ బూని బిలస్వర్గ
తుఁడుఁ బోలె వర్తకంబు మాను
ట్టి బ్రహ్మ మెఱుఁగు య్యకు స్వర్భోగ
ర్మగతుల నేమి గానఁబడును?

టీక:- పురుషుడు = జీవుడు; ఎట్టులేని = ఎలా ఐనా; పూని = ప్రయత్నించి; బిలస్వర్గ = పాతాళమునకు; గతుడు = పోవువాని; పోలె = వంటి; వర్తకంబు = ప్రవర్తన; మానునట్టి = మానివేసినట్టి; బ్రహ్మ = పరబ్రహ్మ స్వరూపము; ఎఱుగు = తెలిసిన; అయ్య = వాని; కు = కి; స్వర్భోగ = స్వర్గసుఖముల నిచ్చెడి; కర్మ = కర్మముల; గతులన్ = విధానములలో; ఏమి = ఏమి; కానబడును = ప్రయోజనము.
భావము:- పురుషుడు సంసారమనే పాతాళ కూపంలో కూరుకొనిపోయి బయట పడకుండా ఉంటే పరబ్రహ్మ స్వరూపాన్ని ఎట్లా గుర్తించగలుగుతాడు? కర్మలు ఆచరించటం వల్ల స్వర్గఫలాలు ప్రాప్తిస్తాయి. కాని కైవల్యం చేకూరదు.

తెభా-6-231-శా.
న్నిష్ఠాగతి లేనివానికి నసత్కర్మప్రచారంబుచే
మున్నే మయ్యెడి నాత్మబుద్ధి గుణ సమ్మోహంబునం దోఁచుచున్
న్నెల్ పెట్టుక వింతబాగుల తఱిన్ ర్తించు దౌర్గుణ్య సం
న్నస్త్రీయును బోలె నెల్లగతులం బ్రఖ్యాతమై యుండగన్.

టీక:- తత్ = భగవంతుని యెడల; నిష్ఠాగతి = లగ్నమైన విధానము; లేని = లేనట్టి; వాని = వాని; కిన్ = కి; అసత్ = అసత్యమైన; కర్మ = కర్మల; ప్రచారంబు = వ్యాప్తుల; చేన్ = చేత; మున్ను = ముందు; ఏమి = ఏమి; అయ్యెడున్ = ప్రయోజనము; ఆత్మ = ఆత్మ; బుద్ధి = బుద్ధి యొక్క; గుణ = గుణములచే; సమ్మోహనంబునన్ = మోహింపబడుట వలన; తోచుచున్న = అనిపించుతూ; వన్నెల్ = రంగులు; పెట్టుక = వేసుకొని; వింత = అబద్దపు; బాగుల = అందాల; తఱిన్ = వెంట; వర్తించు = తిరిగెడు; దౌర్గుణ్య = దుర్గుణము లనెడి; సంపన్న = సంపదలు గల; స్త్రీయును = స్త్రీని; పోలె = వలె; ఎల్ల = అన్ని; గతులన్ = విధములుగను; ప్రఖ్యాతము = ప్రసిద్ధము; ఐ = అయ్యి; ఉండగన్ = ఉండగా.
భావము:- భగవన్నిష్ఠ లేకుండా దుష్కర్మలు చేసేవారికి ఏమీ ప్రయోజనం ఉండదు. చంచలమైన బుద్ధి చెడు గుణాల వ్యామోహానికి లొంగి రంగులు పులుముకొని వింత వింత వేషాలు వేస్తూ ఉంటుంది. అటువంటి దుర్గుణాల వలయంలో చిక్కుకొని దిక్కుతోచని వానికి మోక్షం అందనే అందదు.

తెభా-6-232-సీ.
నువొంద సృష్టిన వ్యయముగఁ జేయుచుఁ-
బ్రచుర ప్రవాహ సంతిత మైన
నెఱయఁ గూలం బను నిర్గమ స్థానంబు-
నందు వేగముగల క్రందు మాయ
దిలి యహంకార తివశంబునఁ జాల-
వివశుఁడై బోధకు విపరి యైన
వానికి నీరీతి లవంత కర్మ ప్ర-
చారంబులను మీఁదఁ క్కనైన

తెభా-6-232.1-ఆ.
న్మ మరణ ముఖ్య జాడ్యంబుతోఁ బాసి
నిఖిల సౌఖ్య పదవి నెఱసి కమ్ర
మార్గమైనయట్టి హనీయ ధామంబు
జిత్త మార నెట్లు చేరఁ గలడు?

టీక:- అనువొంద = అనుకూలముగ; సృష్ఠిన్ = జనులను పుట్టించుట; అవ్యయముగ = ఎడతెగక; చేయుచు = చేస్తూ; ప్రచుర = విస్తారమైన; ప్రవాహ = ప్రవాహమునందు; సంపతితము = మిక్కిలి పడిపోయినది; ఐన = అయిన; నెఱయన్ = చక్కటి; కూలంబు = తీరము; అను = అనెడి; నిర్గమస్థానంబు = బయటపడుదారి; అందు = లో; వేగము = మిక్కిలి వేగముతో; కల = ఉన్నట్టి; క్రందు = కమ్ముకొనెడి; మాయన్ = మాయకు; కదిలి = చలించిపోతూ; అహంకార = అహంకారపు; గతిన్ = వేగమునకు; వశంబునన్ = లొంగిపోవుటచే; చాల = మిక్కిలి; వివశుడు = స్వవశముగాని బుద్ధిగలవాడు; ఐ = అయ్యి; బోధకువిపరి = అవివేకి; ఐన = అయిన; వాని = వాడి; కిన్ = కి; ఈ = ఈ; రీతిన్ = విధముగ; బలవంత = నిర్బంధమైన; కర్మ = కర్మల; ప్రచారంబులను = వ్యాప్తులచే; మీద = ఇకపైన; చక్కనైన = చక్కటి;
జన్మ = పుట్టుక; మరణ = మరణము; ముఖ్య = అనెడి; జాడ్యంబు = జబ్బు; తోన్ = నుండి; పాసి = దూరమై; నిఖిల = సర్వ; సౌఖ్య = సుఖప్రదమైన; పదవి = స్థానమున; నెఱసి = అతిశయించి; కమ్ర = చక్కటి; మార్గము = మార్గము; ఐనయట్టి = అయినట్టి; మహనీయ = గొప్ప; ధామంబు = మోక్షధామమును; చిత్తమారన్ = మనస్ఫూర్తిగా; ఎట్లు = ఎలా; చేరగలడు = అందుకోగలడు.
భావము:- మానవుడు అవకాశాన్ని కల్పించుకొని ఎడతెగకుండా సంతతిని సృష్టిస్తూ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. మాయ వల్ల అతిశయించిన ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక సతమతమౌతూ ఉంటాడు. అహంకారం అతణ్ణి వివశుణ్ణి చేసి జ్ఞానమార్గానికి దూరం చేస్తుంది. బలవంతంగా వానిచేత దుష్కర్మలు చేయిస్తుంది. ఈ విధంగా పుట్టుక, చావు, రోగం అనే దురవస్థలలో మునిగి తేలే జీవుడు ఆ బంధలనుండి బయటపడి సకల సౌఖ్యాలకు ఆకరం, పరమ సుందరం అయిన మోక్షమార్గాన్ని ఎలా అందుకోగలడు?

తెభా-6-233-తే.
దాని సంసర్గ గుణములు ప్పి నడచు
కుచ్చితపు భార్యఁ జేకొన్న కుమతిబోలె
దివిరి సుఖదుఃఖములఁ గూడి తిరిగి జీవ
రూ మెఱుఁగని వారికిఁ బ్రాపు గలదె?

టీక:- దానిన్ = అందుచేత; సంసర్గ = సంసారపు; గుణములు = గుణము లందు; తప్పి = తప్పి; నడచు = వర్తించు; కుత్సితపు = నికృష్టపు; భార్యన్ = భార్యను; చేకొన్న = చేపట్టిన; కుమతి = చెడు బుద్ధి గలవాని; పోలె = వలె; తివిరి = పూని; సుఖదుఃఖములన్ = సుఖదుఃఖములను; కూడి = అనుభవించి; తిరిగి = వర్తించి; జీవరూపము = ఆత్మస్వరూపము; ఎఱుగని = తెలియని; వారు = వారు; కిన్ = కి; ప్రాపు = ఆశ్రయము, రక్షణ; కలదే = ఉన్నదాఏమి.
భావము:- దుర్బుద్ధి కల పురుషుడు వక్రబుద్ధి కల స్త్రీని పెండ్లాడితే ఆ సంసారం సరసంగా ఉండదు. అటువంటి సుఖదుఃఖ మయమైన సంసారంలో పడిన జీవుడు తిరిగి స్వస్వరూపాన్ని తెలుసుకోలేడు. అతనికి మోక్షం లభించదు.

తెభా-6-234-మత్త.
పంవింశతి తత్త్వరాశి కపారదర్పణ మయ్యుఁ దాఁ
గొంమై పురుషుండు తత్త్వముఁగోరి పట్టఁగ నేర కే
మంచుఁ గించుఁ దలంచువాఁడు కధ్వ కర్మము జేయఁగా
మంచిలోకము వానికేటికి మానుగా సమకూరెడిన్?

టీక:- పంచవింశతి = ఇరవై ఐదు {పంచవింశతి తత్త్వములు - పంచభూతములు (1-5), పంచజ్ఞానేంద్రియములు (6-10) పంచకర్మేంద్రియములు(11- 15) పంచతన్మాత్రలు(16-20) మనసు(21) బుద్ధి(22) చిత్తము(23) అహంకారము(24) పురుషుడు(25)}; తత్త్వ = తత్త్వముల; రాశి = సమూహమున; కి = కు; అపార = అంతులేని; దర్పణము = అద్దము; అయ్యున్ = అయినప్పటికిని; తాన్ = తను; కొంచము = చిన్నది; ఐ = ఐనట్లు; పురుషుండు = పురుషుడు; తత్త్వమున్ = తత్త్వజ్ఞానమును; కోరి = కోరి; పట్టగనేరక = తెలియలేక; ఏమి = ఏమి; అంచున్ = అనుచు; కించు = తక్కువగా; తలంచు = భావించు; వాడు = వాడు; కదధ్వకర్మము = చెడు మార్గమున నడచు కర్మములు; చేయగా = చేయుచుండగ; మంచిలోకము = ముక్తిమార్గము; వాని = వాడి; కి = కి; ఏటికి = ఎందుకు; మానుగ = తథ్యముగ; సమకూరెడిన్ = లభింపగలదు.
భావము:- పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, పురుషుడు అనే ఇరవైయైదు తత్త్వాలను ప్రతిబింబించే అద్దం వంటిది పరతత్త్వం. అటువంటి పరతత్త్వాన్ని పట్టుకొనే ఉపాయం తెలుసుకోకుండా జీవుడు పనికిమాలిన పనులు చేస్తుంటే వానికి ఉత్తమమైన ముక్తిమార్గం ఎందుకు అందుతుంది?

తెభా-6-235-క.
బంధాను మోక్షణక్రమ
సంధా నైశ్వర్యధుర్య శాస్త్ర సమగ్ర
గ్రంథంబు మాను చిద్రూ
పాంధునకును గర్మగతుల గునే శుభముల్.

టీక:- బంధ = బంధముల నుండి; అనుమోక్షణ = విమోచన; క్రమ = మార్గ; సంధాన = సంభవించెడి; ఐశ్వర్య = సంపదల యొక్క; ధుర్య = అగ్రస్థితి; శాస్త్ర = శాస్త్రము యొక్క; సమగ్ర = సమగ్రమైన; గ్రంథంబు = గ్రంథమును అభ్యసించుట; మాను = వదలివేసిన; చిత్ = జ్ఞాన; రూప = రూపము యెడల; అంధున్ = గుడ్డివాని; కును = కి; కర్మ = కర్మల; గతులన్ = ఆచరించెడిదారిలో; అగునే = కలుగునా; శుభముల్ = శుభములు.
భావము:- సంసారబంధంలో చిక్కుకొని మోక్షాన్ని అనుసంధానం చేసే ఆధ్యాత్మిక విద్యను పరిత్యజించి కర్మ కలాపంలో పడిన అజ్ఞానాంధుడైన అభాగ్యునికి శుభాలు ఎలా కలుగుతాయి?

తెభా-6-236-మత్త.
చూ నీ జగమంతయున్ వెసఁ జుట్టి పట్టుక లీల నే
జోడులేక రయంబునం గుడి సుట్టుపట్టి స్వతంత్రముం
గూడి యుండిన కాలచక్రముఁ గోరి చూడని వారి కే
జాడఁగల్గును గర్మ సంగతిఁ జారుమోక్షపదం బిలన్.

టీక:- చూడన్ = చూడగా; ఈ = ఈ; జగము = భువనము; అంతయున్ = అంతా; వెసన్ = శ్రీఘ్రమే; చుట్టి = చుట్టుముట్టి; పట్టుక = పట్టుకొని; లీలన్ = లీలవలె; ఏ = ఎలాంటి; జోడు = సహాయము; లేక = లేకుండగ; రయంబునన్ = శ్రీఘ్రమే; గుడిసుట్టుపట్టి = సున్నా చుట్టివేసి; స్వతంత్రమున్ = స్వతంత్రమును; కూడి = కలిసి; ఉండిన = ఉన్నట్టి; కాలచక్రమున్ = కాలచక్రమును; కోరి = పూని; చూడని = తెలిసికొనని; వారు = వారి; కి = కి; ఏ = ఏ; జాడన్ = విధముగను; కల్గును = లభించును; కర్మసంగతి = కర్మబంధముల నుండి; జారు = విడువడు; మోక్షపదంబు = ముక్తిమార్గము; ఇలన్ = లోకమున.
భావము:- శక్తిమంతమైన ఈ కాలచక్రానికి సమస్త జగత్తును చుట్టచుట్టి పట్టుకొని సున్న చుట్టి మటుమాయం చేసే కిటుకులు తెలుసు. అటువంటి కాలస్వరూపాన్ని తెలుసుకోకుండా ఊరకే కర్మలు చేసేవానికి అక్షయమైన మోక్షపదం ఎలా దక్కుతుంది?

తెభా-6-237-ఆ.
న్మ హేతు వైన నకునిర్దేశంబు
నకుఁ జేయరాని నుచుఁ దెలిసి
గుణమయప్రవృత్తి ఘోరాధ్వ నిశ్శ్వాస
నిరతుఁ డగుచుఁ జేయ నేరఁ డతఁడు. "

టీక:- జన్మహేతువు = తన పుట్టుకకు కారణము; ఐన = అయిన; జనకు = తండ్రి యొక్క; నిర్దేశంబు = ఆజ్ఞ; తన = తన; కున్ = కు; చేయరానిది = చేయరానిది; అనుచున్ = అని; తెలిసి = తెలిసికొని; గుణమయ = గుణమయ మైన; ప్రవృత్తిన్ = ప్రవర్తన గల; ఘోర = ఘోరమైన; అధ్వ = మార్గము నందు; నిశ్వాస = మిక్కిలి; నిరతుడు = ఆసక్తి లేనివాడు; అగుచున్ = అగుచు; చేయనేరడు = చేయలేడు; అతడు = అతడు.
భావము:- ఈ సృష్టి కార్యాన్ని మనతండ్రి అయిన దక్షప్రజాపతికి అతని తండ్రి బ్రహ్మదేవుడు అప్పగించాడు. అతి భయంకరమైన ప్రవృత్తి మార్గం పై ఆసక్తి లేనివాడై మనతండ్రి ఆ కార్యాన్ని పూర్తి చేయలేకపోయాడు.”

తెభా-6-238-వ.
అని తమలో వితర్కించి యా కుమారు లప్పుడు.
టీక:- అని = అనుచు; తమలో = తమలోతాము; వితర్కించి = మిక్కిలి తర్కించుకొని; ఆ = ఆ; కుమారులు = బిడ్డలు; అప్పుడు = అప్పుడు.
భావము:- ]అని ఆ దక్షుని కుమారులు తమలో తాము తర్కించుకొని...

తెభా-6-239-సీ.
వివయ్య! భూపాల! మునివరేణ్యుని మాట-
నువొందఁ దలపోసి వియ మలర
లగొని యతనికి వందనంబు లొనర్చి-
తిరిగి యెన్నఁడు రాని తెరువు పట్టి
య్యన నేగిరి హజ సత్త్వబ్రహ్మ-
యమైన పంకజయను పాద
ద్మ మరందంబు పానంబు జేయుచు-
త్తిల్లి నిలిచిన మానసాళి

తెభా-6-239.1-ఆ.
రిణమింప విష్ణుఁ బాడుచుఁ దత్కీర్తి
రణి మ్రోయు మహతి సంఘటించి
నారదుండు గుణవిశారదుం డెందేనిఁ
నియెఁ దన్ను జగము న్నుతింప.

టీక:- వినవు = వినుము; అయ్య = తండ్రి; భూపాల = రాజా; మునివరేణ్యుని = నారదుని {మునివరేణ్యుడు - మునులలో శ్రేష్ఠుడు, (ఇక్కడ) నారదుడు}; మాటలను = మాటలను; అనువొంద = అనుకూలముగా; తలపోసి = ఆలోచించుకొని; వినయము = వినయము; అలర = విలసిల్లగా; వలగొని = ప్రదక్షణములు ఆచరించి; అతని = అతని; కి = కి; వందనంబులు = నమస్కారములు; ఒనర్చి = చేసి; తిరిగి = వెనుకకు; ఎన్నడు = ఎప్పుడు; రాని = రానట్టి; తెరువుపట్టి = దారిపట్టి; చయ్యన = వేగముగ; ఏగిరి = వెళ్ళిరి; సహజ = సహజముగ; సత్త్వ = సత్త్వగుణము; బ్రహ్మ = బ్రహ్మముతో; మయము = నిండినది; ఐన = అయిన; పంకజనయను = నారాయణుని {పంకజనయనుడు - పంకజము (పద్మము)వంటి నయనుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; పాద = పాదములు యనెడి; పద్మ = పద్మముల యొక్క; మరందంబు = మకరందమును; పానంబు = తాగుట; చేయుచు = చేస్తూ; మత్తిల్లి = మత్తెక్కి; నిలిచిన = ఉన్నట్టి; మానస =మానసము అను; అళి = తుమ్మెద; పరిణమింప = సంతోషించగా, పరవశించగా;
విష్ణున్ = నారాయణుని; పాడుచున్ = కీర్తించుతూ; తత్ = అతని; కీర్తి = యశస్సు; సరణిన్ = క్రమమును; మ్రోయు = పలికెడి; మహతి = మహతి యనెడి వీణ {మహతి - నారదుని వీణ యొక్క పేరు}; సంఘటించి = కూర్చి; నారదుండు = నారదుడు; గుణ = సుగుణముల; విశారదుండు = మిక్కిలి జ్ఞానము గలవాడు; ఎందేని = యథేచ్ఛగా, ఎక్కడకో; చనియె = వెళ్ళిపోయెను; తన్ను = తనను; జగము = లోకములు; సన్నుతింప = స్తుతించగా.
భావము:- రాజా! విను. ఆ హర్యశ్వులు నారద మునీంద్రుని హితోపదేశాన్ని శిరసావహించి భక్తితో అతనికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తత్క్షణమే మోక్షమార్గాన్ని అవలంబించి కృతార్థులయ్యారు. సహజ మధురమైన శ్రీమన్నారాయణుని పాదకమల మకరందాన్ని పానం చేస్తూ, తన మానసమనే మధుకరం పరవశిస్తుండగా, గుణవిశారదుడైన నారదుడు శ్రీహరి లీలలను తన మహతీవీణపై మ్రోగిస్తూ, యథేచ్ఛగా వెళ్ళిపోయాడు.

తెభా-6-240-క.
ప్పుడు దక్షుఁడు దనయులు
ప్పి మహాపథము గనుటఁ గ నారదుఁడే
చెప్పినఁ గప్పిన శోకము
ముప్పిరిగొని చిత్తవృత్తి మూరిం బోవన్.

టీక:- అప్పుడు = అప్పుడు; దక్షుడు = దక్షుడు; తనయులు = పుత్రులు; తప్పి = తన మాట తప్పి; మహాపథము = ముక్తిమార్గము; కనుట = పట్టిపోవుట; తగ = పూని; నారదుడే = నారదుడే; చెప్పినన్ = చెప్పగా; కప్పిన = కమ్మిన; శోకము = దుఃఖము; ముప్పిరిగొని = పెనగొని; చిత్తవృత్తి = మానసవర్తన; మూరింబోవన్ = నశింపగా.
భావము:- అప్పుడు దక్షుడు తన కుమారులు ప్రవృత్తి మార్గాన్ని పరిత్యజించి నివృత్తి మార్గాన్ని స్వీకరించి మోక్షప్రవృత్తులైనారని నారదుడు చెప్పగా విన్నాడు. అతనికి దుఃఖం పొంగి వచ్చింది. హృదయం వ్యాకుల మయింది.

తెభా-6-241-చ.
లుచు నున్న వచ్చి కమలాసనుఁ డూఱడిలంగఁ బల్కె మున్
సిన లీలఁ బుత్రుల నపార గుణాఢ్యులఁ గాంచుమన్న నా
డఁతుక యందుఁ బల్వురను న్నుగఁ దా శబళాశ్వ సంజ్ఞలం
బెడఁగగు వారిఁ బుణ్యముల చేర్చినవారి సహస్ర సంఖ్యులన్.

టీక:- అడలుచున్న = శోకించుతున్న; వచ్చి = వచ్చి; కమలాసనుడు = బ్రహ్మదేవుడు {కమలాసనుడు - కమలము ఆసనముగా గలవాడు, బ్రహ్మ}; ఊరడిలంగన్ = ఊరడించుటకు; పల్కె = పలికెను; మున్ = ఇంతకు ముందు; పడసిన = పొందిన; లీలన్ = విధముగ; పుత్రులన్ = కుమారులను; అపార = అంతులేని; గుణ = సుగుణముల; ఆఢ్యులన్ = శ్రేష్ఠులను; కాంచుము = పొందుము; అన్నన్ = అనగా; ఆ = ఆ; పడతుక = స్త్రీ; అందున్ = అందు; పల్వురను = అనేక మందిని; పన్నుగ = యుక్తిగ; తాన్ = తాను; శబళాశ్వ = శబళాశ్వ యనెడి; సంజ్ఞలన్ = పేర్లతో; బెడగు = చక్కనైనవారు; అగు = అయిన; వారిన్ = వారిని; పుణ్యములన్ = పుణ్యములను; చేర్చిన = కూడబెట్టిన; వారిన్ = వారిని; సహస్ర = వేల (1000); సంఖ్యులన్ = సంఖ్యలలో యున్నవారిని.
భావము:- దక్షుడు దుఃఖిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి ఓదార్చి “పూర్వంలాగా అపార గుణవంతులైన కొడుకులను పుట్టించు” అని ప్రోత్సహించాడు. దక్షుడు తండ్రి ఆజ్ఞను పాటించి అసిక్ని యందు శబలాశ్వులు అను చక్కనివారు, పుణ్యాత్ములు అయిన వేలకొలది కుమారులను కన్నాడు.

తెభా-6-242-క.
పుట్టించిన జనకుని మదిఁ
బుట్టిన తలఁ పెఱిగి వారు పూనికఁ బ్రజలం
బుట్టించు వ్రతముఁ గైకొనిఁ
ట్టిగఁ దప మాచరింపఁగాఁ జనిరి వెసన్.

టీక:- పుట్టించిన = జన్మనిచ్చిన; జనకుని = తండ్రి యొక్క; మదిన్ = మనసున; పుట్టిన = కలిగిన; తలపు = భావము; ఎఱిగి = తెలిసి; వారు = వారు; పూనికన్ = పట్టుదలగా; ప్రజన్ = జనులను; పుట్టించు = పుట్టించెడు; వ్రతము = దీక్ష; కైకొని = చేపట్టి; గట్టిగన్ = గట్టిగా; తపము = తపస్సు; ఆచరింపగా = చేయుటకు; చనిరి = వెళ్ళిరి; వెసన్ = శ్రీఘ్రమే.
భావము:- తమను పుట్టించిన తండ్రి అంతరంగాన్ని తెలుసుకొన్న ఆ కుమారులు ప్రజలను సృష్టించడానికి దీక్ష వహించి, తపస్సు చేయటానికి వెళ్ళారు.

తెభా-6-243-వ.
ఇట్లు శబళాశ్వులు ప్రజాసర్గంబు కొఱకుఁ దండ్రి పంపునం దపంబు జేయువారై యే తీర్థంబు తీర్థరాజం బై సకలతీర్థఫలంబు నాలోకన మాత్రంబునన నుగ్రహించుచు సకలపాపంబుల నిగ్రహించు, నే తీర్థ ప్రభావంబున నగ్రజన్ములు ఫలసిద్ధిం బొందుదు, రట్టి నారాయణసర స్సను పుణ్యతీర్థంబునకుం జని, త దుపస్పర్శమాత్రంబున నిర్ధూత మలాశయులై.
టీక:- ఇట్లు = ఈ విధముగ; శబళాశ్వులు = శబళాశ్వులు; ప్రజాసర్గంబు = జనులను పుట్టించుట; కొఱకు = కోసము; తండ్రి = తండ్రి; పంపున = నియమించిన ప్రకారము; తపంబు = తపస్సు; చేయువారు = చేసెడివారు; ఐ = అయ్యి; ఏ = ఏ; తీర్థంబు = పుణ్యతీర్థము; తీర్థరాజంబు = తీర్థములలో శ్రేష్ఠమైనది; ఐ = అయ్యి; సకల = సర్వ; తీర్థ = తీర్థముల; ఫలంబున్ = ఫలితములను; ఆలోకన = దర్శన; మాత్రంబునన్ = మాత్రముచేత; అనుగ్రహించుచు = ప్రసాదిస్తూ; సకల = సర్వ; పాపంబులన్ = పాపములను; నిగ్రహించున్ = నాశనము చేయును; ఏ = ఏ; తీర్థ = తీర్థము యొక్క; ప్రభావంబునన్ = ప్రభావమువలన; అగ్రజన్ములు = శ్రేష్ఠమైన జన్మము గలవారు, అన్నలు; ఫల = ఫలితముల; సిద్ధిన్ = సిద్దించుటను; పొందుదురు = పొందుదురు; అట్టి = అటువంటి; నారాయణసరస్సు = నారాయణసరస్సు; అను = అనెడి; పుణ్యతీర్థంబున్ = పుణ్యతీర్థమున; కున్ = కు; చని = వెళ్ళి; తత్ = దానిని; ఉపస్పర్శ = తాకిన; మాత్రంబునన్ = మాత్రముచేత; నిర్ధూత = పోగొట్టబడిన; మలాశయులు = దోషములు గలవారు; ఐ = అయ్యి.
భావము:- ఆ శబలాశ్వులు తండ్రి ఆజ్ఞానుసారం ప్రజాసృష్టి కొరకు తపస్సు చేయాలనే కోరికతో తీర్థాలలో ఉత్తమమైన నారాయణ తీర్థాన్ని చేరుకున్నారు. ఆ పుణ్యతీర్థం దర్శనమాత్రం చేతనే సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలాన్ని అనుగ్రహిస్తుంది. సకల పాపాలను హరిస్తుంది. అటువంటి తీర్థరాజాన్ని స్పర్శించి తమ దోషాలను పోగొట్టుకొని పవిత్రులైనారు.

తెభా-6-244-శా.
బ్రహ్మేంద్రాదులు నందనేరని పరబ్రహ్మంబుఁ జింతించుచున్
బ్రహ్మానందముఁ బొంది జిహ్వికలపై బ్రహ్మణ్యమంత్రంబులన్
బ్రహ్మాలోకనవాంఛతో నిలుపుచున్ బ్రహ్మం బితండంచు మున్
బ్రహ్మజ్ఞాన గురున్ హరిం దపమునం బాటించి రబ్బాలకుల్.

టీక:- బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఇంద్ర = ఇంద్రుడు; ఆదులు = మొదలగువారు; అందనేరని = అందుకొనలేని; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మమును; చింతించుచున్ = ధ్యానించుతూ; బ్రహ్మానందమున్ = బ్రహ్మానందమును; పొంది = పొంది; జిహ్వికల = నాలుకల; పై = మీద; బ్రహ్మణ్య = పరమాత్మకు చెందిన; మంత్రంబులన్ = మంత్రములను; బ్రహ్మ = పరబ్రహ్మమును, పరమాత్మను; ఆలోకన = దర్శించెడి; వాంఛ = కోరిక; తో = తోటి; నిలుపుచున్ = ధారణచేయుచు; బ్రహ్మంబు = పరమాత్మ; ఇతడు = ఇతడు; అంచున్ = అని; మున్ = ముందుగా; బ్రహ్మజ్ఞాన = బ్రహ్మజ్ఞానమునకు; గురున్ = తండ్రిని; హరిన్ = నారాయణుని; తపమునన్ = తపస్సు నందు; పాటించిరి = ధ్యానించిరి; ఆ = ఆ; బాలకుల్ = చిన్నవారు.
భావము:- శబలాశ్వులు బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా అందుకోలేని పరబ్రహ్మాన్ని బ్రహ్మానందంతో ధ్యానం చేశారు. ఆ బాలకులు తమ నాలుకలతో పరమాత్మకు సంబంధించిన మంత్రాలను ఉచ్చరిస్తూ భగవంతుణ్ణి దర్శించాలనే కుతూహలంతో సమస్తమూ ఆ పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆనందమయుడైన ఆ దేవదేవుని గురించి తపస్సు చేశారు.

తెభా-6-245-సీ.
కపాదాంగుష్ఠ మిలమీఁద సవరించి-
నిశ్చల కాయులై నిక్కి నిలిచి
రములు గీలించి రవి మీఁదికి నెత్తి-
గుఱుతుగాఁ బెనుబయల్ గుట్టిపట్టి
నిడివిగాఁ గ్రూరమై నిగిడిన చూడ్కులఁ-
గఁడు దీవ్రభానునిఁ బొడిచిపట్టి
డిఁ గొంతకాలంబు వాయువు భక్షించి-
యంతనుండియు నిరాహారు లగుచు

తెభా-6-245.1-ఆ.
కలలోకములకు సంహారకరమును
బేర్చి దేవతలకు భీతికరము
గాఁగ ఘోరతపముఁ గావింపఁ దొడఁగిరి
హిత చిత్తు లక్కుమారవరులు.

టీక:- ఏక = ఒంటి; పాద = కాలు యొక్క; అంగుష్ఠము = బొటకనవేలు; ఇల = భూమి; మీద = పైన; సవరించి = ఆనించి; నిశ్చల = చలనములేని; కాయులు = దేహములు గలవారు; ఐ = అయ్యి; నిక్కి = నిగిడి; నిలిచి = నిలబడి; కరములు = చేతులు; కీలించి = జోడించి; సరవిన్ = వరుసగా; మీది = పై; కిన్ = కి; ఎత్తి = ఎత్తి; గుఱుతుగా = గుర్తుగా, లక్ష్యముగా; పెనుబయలు = మహాకాశమును; గుట్టిపట్టి = గురిపెట్టి; నిడివిగా = పొడుగ్గా; క్రూరమైన = క్రూరమై; నిగిడిన = నిక్కిన; చూడ్కుల = చూపులచే; కడు = మిక్కిలి; తీవ్ర = తీవ్రమైన; భానుని = సూర్యుని; పొడిచిపట్టి = గట్టిగాపట్టుకొని వడిన్ = నిష్ఠగా; కొంతకాలంబు = కొన్నాళ్ళు; వాయువు = గాలిని; భక్షించి = ఆహారముగా తీసుకొని; అంత = తరువాత; నుండియు = నుండి; నిరాహారులు = ఆహారమేమియు తీసుకొననివారు; అగుచు = అగుచూ;
సకల = సమస్తమైన; లోకముల = లోకముల; కు = కు; సంహారకరమును = నాశనము చేసెడిది; పేర్చి = పూనుకొని; దేవతల = దేవతల; కున్ = కు; భీతికరమున్ = భయమును కలిగించెడిది; కాగ = అగునట్లు; ఘోర = భయంకరమైన; తపమున్ = తపస్సును; కావింపన్ = చేయుట; తొడగిరి = ఆరంభించిరి; మహిత = గొప్ప; చిత్తులు = మనసులు గలవారు; ఆ = ఆ; కుమార = పిల్లలలో; వరులు = శ్రేష్ఠులు.
భావము:- ఆ శబలాశ్వులు ఒంటికాలి బొటనవ్రేలు నేలమీద మోపి నిక్కి నిశ్చలదేహులై నిలుచున్నారు. రెండు చేతులను జోడించి పైకెత్తి ఆకాశంలోకి చూశారు. సూటిగా ప్రసరించే చురుకైన చూపులతో సూర్యుణ్ణి చూస్తూ కొంతకాలం వాయు భక్షణం చేస్తూ మరికొంత కాలం నిరాహారులై లోకాలు కంపించగా, దేవతలు భయపడగా తపస్సు కొనసాగించారు.