పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము/గ్రంథకర్త వంశవర్ణనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గ్రంథకర్త వంశవర్ణనము

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/షష్ఠ స్కంధము)
రచయిత: సింగయతెభా-6-26-సీ.
శ్రీవత్స గోత్రుండు శివభక్తి యుక్తుఁ డా-
స్తంబ సూత్రుఁ డపార గుణుఁడు
నేర్చూరి శాసనుం డెఱ్ఱన ప్రెగ్గడ-
పుత్రుండు వీరన పుణ్యమూర్తి
కాత్మజుం డగు నాదయామాత్యునకుఁ బోల-
మాంబకు నందను మితయశులు
సువనామాత్యుండు నుఁడు వీరనమంత్రి-
సింగధీమణియు నంచితగుణాఢ్యు

తెభా-6-26.1-తే.
లుద్భవించిరి తేజంబు లూర్జితముగ
సొరది మూర్తి త్రయం బన శుభ్రకీర్తిఁ
రఁగి రందులఁ గసువనప్రభువునకును
ముమ్మడమ్మను సాధ్వి యిమ్ములను వెలసె.

టీక:- శ్రీవత్స = శ్రీవత్స యనెడి; గోత్రుండు = గోత్రములో పుట్టినవాడు; శివ = పరమశివుని ఎడల; భక్తి = భక్తి; యుక్తుడు = కలిగినవాడు; ఆపస్తంబసూత్రుడు = ఆపస్తంబ సూత్రము ననుసరించు వాడు; అపార = అంతులేని; గుణుడున్ = సుగుణములు గలవాడు; ఏర్చూరి = ఏర్చూరును; శాసనుండు = ఏలెడివాడు; ఎఱ్ఱనప్రెగ్గడ = ఎఱ్ఱనప్రెగ్గడ; పుత్రుండు = కొడుకు; వీరన = వీరన; పుణ్యమూర్తి = (ఆ) పుణ్యాత్ముని; కిన్ = కి; ఆత్మజుండు = పుత్రుడు; అగు = అయిన; నాదయామాత్యున్ = నాదయ అమాత్యుని; కున్ = కి; పోలమాంబ = పోలమాంబ; కున్ = కు; నందనులు = పుత్రులు; అమిత = అంతులేని; యశులు = యశస్సు గలవారు; కసువనామాత్యుండు = కసువన అమాత్యుడు; ఘనుడు = గొప్పవాడును; వీరనమంత్రి = వీరనమంత్రియును; సింగధీమణియున్ = సింగధీమణియును; అంచిత = చక్కటి; గుణ = సుగుణములుతో; ఆఢ్యులు = గొప్పవారు; ఉద్భవించిరి = పుట్టిరి.
తేజంబుల్ = తేజస్సులు; ఊర్జితముగ = కూడబెట్టుకొని; సొరదిన్ = వరుసగా; మూర్తిత్రయంబు = మువ్వురు మూర్తులు; అనన్ = అనునట్లు; శుభ్ర = శుభ్రమైన; కీర్తిన్ = యశస్సుతో; పరగిరి = ప్రసిద్ధులైరి; అందులన్ = వారిలో; కసువనప్రభువున్ = కసువన అమాత్యుని; కును = కి; ముమ్మడమ్మ = ముమ్మడమ్మ; అను = అనెడి; సాధ్వి = సాత్వికురాలుకు; ఇమ్ములను = అనుకూలముగా; వెలెసె = వర్థిల్లెను.
భావము:- శ్రీవత్సగోత్రుడు, శివభక్తుడు, ఆపస్తంబ సూత్రుడు, సుగుణ సంపన్నుడు, ఏర్చూరుకు శాసకుడు అయిన ఎఱ్ఱన ప్రెగ్గడ కుమారుడు వీరన్న. ఆ పుణ్యమూర్తి పుత్రుడు నాదయామాత్యుడు. ఆయన భార్య పోలమ్మ. ఆ దంపతులకు కసువన్న, వీరన్న, సింగన్న అనే ముగ్గురు కుమారులు త్రిమూర్తుల వలె జన్మించారు. ఆ ముగ్గురు నిర్మల కీర్తిమంతులై వర్ధిల్లారు. వారిలో కసువన మంత్రికి ముమ్మడమ్మ అనే సాధ్వి అనుకూలవతి అయిన భార్యగా అలరారింది.

తెభా-6-27-ఉ.
దు భర్తమాట కెదురాడదు వచ్చినవారి వీఁడగా
నాదు పెక్కుభాష లెడనాడదు వాకిలి వెళ్ళి, కల్ల మా
టాదు మిన్నకేని సుగుణావళి కిందిరగాక సాటి యే
చేడియ లేదు చూరికుల శేఖరు కస్వయ ముమ్మడమ్మకున్.

టీక:- ఆడదు = పలుకదు; భర్త = మొగుని; మాట = మాట; కున్ = కు; ఎదురాడదు = ఎదురు చెప్పదు; వచ్చినవారి = ఇంటికి వచ్చినవారిని; వీడగాన్ = వదలిపొవునట్లు; ఆడదు = పలుకదు; పెక్కు = అనేక; భాషల = మాటల; ఎడన్ = పెడసరముగా; ఆడదు = పలుకదు; వాకిలి = గుమ్మము దాటి బయటకు; వెళ్ళి = వెళ్ళి; కల్ల = అనవసరపు మాటలను; మాటాడదు = మాట్లాడదు; మిన్నకేని = మాట్లాక నుండును గాని; సుగుణ = (ఆమె) మంచి గుణముల; ఆవళి = సమూహముల; కిన్ = కు; ఇందిర = లక్ష్మీదేవి; కాక = కాకుండ; సాటి = సరిపడగలిగిన; ఏ = ఎవరు; చేడియలు = స్త్రీలు; ఏరుచూరి = ఏరుచూరి వంశపు; కుల = మంచివంశపు; శేఖరు = ఉత్తముడు; కస్వయ = కసువయుని యొక్క; ముమ్మడమ్మ = ముమ్మడమ్మ; కున్ = కి;
భావము:- ముమ్మడమ్మ భర్త మాటకు ఎదురాడదు. ఇంటికి వచ్చినవారిని వెళ్ళగొట్టదు. వాకిలి దాటి పెద్దగా మాట్లాడదు. హాస్యానికైనా అసత్యమాడదు. ఏరుచూరి కులశేఖరుడైన కసువన్న భార్య అయిన ఆ ముమ్మడమ్మకు సుగుణాలలో లక్ష్మీదేవి తప్ప మరే స్త్రీ కూడ సాటి కాదు.

తెభా-6-28-క.
సువయమంత్రికిఁ బు
ణ్యాల్పశుభాంగి ముమ్మమ్మ మమున్న
వ్యాకుల చిత్తుల నిరువుర
శ్రీర గుణగణులఁ బుణ్యశీలురఁ గాంచెన్.

టీక:- ఆ = ఆ; కసువయమంత్రి = కసువయమంత్రి; కిన్ = కి; పుణ్యకల్ప = పుణ్యవతి; శుభాంగి = శుభకరమైన దేహము గలామె; ముమ్మడమ్మ = ముమ్మడమ్మ; మమున్ = మమ్ములను; అవ్యాకుల = తొందరపాటులేని; చిత్తులన్ = మనసులు గలవారను; ఇరువురన్ = ఇద్దరిని; శ్రీకర = శుభకరమైన; గుణ = గుణముల; గణ = సమూహములు గలవారిన్; పుణ్యశీలురన్ = పుణ్యవర్తనులను; కాంచెన్ = జన్మ నిచ్చెను.
భావము:- ఆ కసువన మంత్రికి, పుణ్యశీల అయిన ముమ్మడమ్మకు చీకాకు లేని చిత్తం కలవాళ్ళమూ సద్గుణ సంపన్నులమూ సాధువర్తనులమూ అయిన ఇరువురు కుమారులం కలిగాము.

తెభా-6-29-క.
అంజసమ లావణ్య శు
భాంగులు హరి దివ్యపదయుగాంబుజ విలస
ద్భృంగాయమాన చిత్తులు
సింయ తెలగయలు మంత్రిశేఖరు లనగన్.

టీక:- అంగజ = మన్మథునితో; సమ = సమానమైన; లావణ్య = సుకుమారముగల; శుభ = శుభకరమైన; అంగులున్ = శరీరములుగలవారు; హరి = నారాయణుని; దివ్య = దివ్యమైన; పద = పాదములనెడి; యుగ = జంట; అంబుజ = పద్మములందు; విలసత్ = విలాసముగాతిరిగెడి; భృంగాయమాన = తుమ్మెదవంటి; చిత్తులు = మనసులుగలవారు; సింగయ = సింగయ; తెలగయలు = తెలగయలు; మంత్రి = అమాత్యులలో; శేఖరులు = ఉత్తములు; అనగన్ = అనగా.
భావము:- మన్మథునికి సమానమైన సౌందర్యంతో, మంగళకరమైన శరీరాలు కలవాళ్ళం, తుమ్మెదల వలె శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించిన మనస్సులు కలవాళ్ళం అయిన సింగయ మంత్రి, తెలగయ మంత్రి అనే వాళ్ళం మేమిద్దరం.

తెభా-6-30-క.
అంగ్రజుండ శివపూ
జం నరినవాఁడ విష్ణురితామృత ని
ష్యంది పటు వాగ్వ్విలాసా
నందోచిత మానసుండ యకోవిదుఁడన్

టీక:- అందు = వారిలో; అగ్రజుండ = పెద్దవాడను; శివ = శివుని; పూజన్ = పూజించుటలో; తనరినవాడ = మునిగినవాడను; విష్ణు = నారాయణుని; చరిత = చరిత్ర యనెడి; అమృత = అమృతపు; నిష్యంది = చిలికెడు; పటు = ప్రౌడమైన; వాక్ = పలుకుల; విలాస = విలాసముల; ఆనంద = ఆనందముతో; ఉచిత = చక్కనైన; మానసుండ = మనసు గలవాడను; నయ = మేలైన; కోవిదుఁడన్ = పండితుడను.
భావము:- అందులో నేను పెద్దవాణ్ణి. శివపూజా పరాయణుణ్ణి. శ్రీహరి చరితమనే అమృతాన్ని స్రవించే వాక్యసంపద కలవాణ్ణి. ఆ ఆనందంలో మునిగి తేలే మనస్సు కలవాణ్ణి

తెభా-6-31-వ.
కావునం గృష్ణపాదారవింద సందర్శ నాదర్శతలాయమాన చిత్తుండ నై.
టీక:- కావునన్ = అందుచేత; కృష్ణ = శ్రీకృష్ణుని; పాద = పాదము లనెడి; అరవింద = పద్మదళములను; సందర్శనా = దర్శించవలె ననెడి; ఆదర్శ = ఆదర్శమే; తలాయమాన = ముఖ్యమైనట్టి; చిత్తుండను = మనసు గలవాడను; ఐ = అయి.
భావము:- అందుచత, నేను శ్రీకృష్ణుని పాదారవిందాలను సందర్శించ డమే ముఖ్య ఆశయంగా గల మనసు కలవాడను అయి.....