Jump to content

పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/గోవిందుని ద్వారకాగమనంబు

వికీసోర్స్ నుండి


తెభా-1-244-మ.
జాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్రశృంగారకం,
హంసావృతహేమపద్మపరిఖా కాసారకం, దోరణా
ళిసంఛాదితతారకం, దరులతార్గానువేలోదయ
త్ఫపుష్పాంకుర కోరకన్, మణిమయప్రాకారకన్, ద్వారకన్.

టీక:- జలజాతాక్షుఁడు = కృష్ణుడు {జలజాతాక్షుడు - పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, కృష్ణుడు}; శౌరి = కృష్ణుడు {శౌరిః- శూరుని మనుమడు, కృష్ణుడు, బలవత్తరములైన ఇంద్రియ మనో బుద్దులను అణచినవాడు, విష్ణుసహస్రనామాలు 340వ నామం}; డగ్గఱెన్ = సమీపించెను; మహా = పెద్ద; సౌధ = మేడల; అగ్ర = అగ్ర భాగములచే; శృంగారకన్ = అలంకరింపబడినదైన; కల = మనోహరమైన కంఠధ్వని కల; హంస = హంసలచే; ఆవృత = చుట్టబడిన; హేమ = బంగారు రంగు పుప్పొడి కలిగిన; పద్మ = పద్మములతో కూడిన; పరిఖా = కందకములు; కాసారకన్ = కోనేళ్ళు కలదైన; తోరణా = తోరణముల; ఆవళి = సమూహముచే; సంఛాదిత = బాగాకప్పబడిన; తారకన్ = నక్షత్రములు కలదైన; తరు = చెట్ల; లతా = లత; వర్గ = వరుసలు; అనువేల = ఎల్లప్పుడు; ఉదయత్ = ఉద్భవిస్తున్న; ఫల = పండ్లు; పుష్ప = పుష్పములు; అంకుర = మొలకలు; కోరకన్ = మొగ్గలును కలదైన; మణి = రత్నములు; మయ = తాపిన; ప్రాకారకన్ = ప్రహారీగోడ కలదైన; ద్వారకన్ = ద్వారకా నగరమును.
భావము:- బంగారు కలశాలతో ప్రకాశించే ఎత్తైన మేడలు కలది; కలహంసలతో కాంచనవర్ణ కమలాలతో అలరారే అగడ్తలు చుట్టు కలది; చుక్కలు తాకే చక్కని తోరణాలు, పండ్లు, పువ్వులు, చివుళ్లు, మొగ్గలుతో నిండిన లతాకుంజాలు, పంక్తులు పంక్తుల వృక్షాలు కలది; రత్నఖచిత ప్రాకారాలు కలది అయిన ద్వారకానగరాన్ని తామరరేకుల లాంటి కళ్ళున్న శ్రీకృష్ణుడు సమీపించాడు.

తెభా-1-245-వ.
ఇట్లు దన ప్రియపురంబు డగ్గఱి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; తన = తనయొక్క; ప్రియ = ప్రియమైన; పురంబు = నగరము; డగ్గఱి = సమీపించి.
భావము:- ఈ విధంగా తనకు అత్యంత ప్రియమైన రాజధాని సమీపించి.

తెభా-1-246-మత్త.
న్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్
న్యులై వినఁ బాంచజన్యము, దారితాఖిలజంతు చై
న్యమున్, భువనైకమాన్యము, దారుణధ్వని భీతరా
న్యముం, బరిమూర్చితాఖిలత్రుదానవసైన్యమున్.

టీక:- అన్య = శత్రువులచేత; సన్నుత = స్తుతింపబడిన; సాహసుండు = సాహసము కలవాడు, కృష్ణుడు; మురారి = కృష్ణుడు {మురారి - మురాసురుని శత్రువు, కృష్ణుడు}; ఒత్తెన్ = పూరించెను; యదు = యాదవులలో; ఉత్తముల్ = శ్రేష్ఠులు; ధన్యులు = ధన్యులు; ఐ = అయి; వినన్ = వినునట్లు; పాంచజన్యమున్ = పాంచజన్యమును; దారిత = చీల్చబడిన; అఖిల = సమస్త; జంతు = జంతువుల; చైతన్యమున్ = చైతన్యము కలది; భువనైక = లోకము మొత్తము చేత; మాన్యము = గౌరవింపబడునది; దారుణ = భయంకరమైన; ధ్వని = శబ్దముచేత; భీత = భీతిచెందిన; రాజన్యమున్ = రాజులు కలది; పరిమూర్చిత = మూర్చిల్లిన; అఖిల = సమస్త; శత్రు = శత్రువుల; దానవ = దానవుల; సైన్యమున్ = సైన్యము కలది;
భావము:- ఆత్మీయులే కాక అన్యులు సైతం అభినందించే ధైర్యసాహసాలు కల గోవిందుడు సమస్త ప్రాణులను నిశ్చేష్టులను చేసేడెది, లోకం ప్రశంసలు అందుకోగలిగినది, చెవులు బద్దలయ్యె శబ్దంతో రాజులను బెదరగొట్టేడిది, ప్రతిపక్షులైన రాక్షసయోధు లందరినీ మూర్ఛిల్లచేసేది అయిన పాంచజన్య మనే తన శంఖాన్ని పూరించాడు. మాన్యులైన యదుకులాగ్రగణ్యు లందరూ ఆ శంఖధ్వనిని విని ధన్యులైనారు.

తెభా-1-247-శా.
శంఖారావము వీనులన్ విని జనుల్ స్వర్ణాంబరద్రవ్యముల్
శంఖాతీతము గొంచు వచ్చిరి దిదృక్షాదర్పితోత్కంఠన
ప్రేంద్భక్తులు వంశ, కాహళ, మహాభేరీ, గజాశ్వావళీ
రింఖారావము లుల్లసిల్ల దనుజారిం జూడ నాసక్తులై.

టీక:- శంఖా = శంఖముయొక్క; రావము = ధ్వని; వీనులన్ = చెవులతో; విని = వినినవారై; జనుల్ = ప్రజలు; స్వర్ణ = బంగారము; అంబర = వస్త్రములు; ద్రవ్యముల్ = ద్రవ్యములును; శంఖాతీతము = లెక్కకు మించినవి, అధికమైనన్ని {శంఖాతీతము = శంఖమునకు (మిక్కిలి పెద్ద సంఖ్యకు; 1,000, 000,000,000,000,000; పదికి పద్దెనిమిదవ ఘాతము) అతీతము (మిక్కిలినవి), లెక్కకు మించినవి}; కొంచు = తీసికొనుచు; వచ్చిరి = వచ్చిరి; దిదృక్షా = దర్శించు కోరికతో; దర్పిత = తుళ్ళుతున్న; ఉత్కంఠన = ఉత్కంఠతో; ప్రేంఖత్ = చలించిన; భక్తులు = భక్తులు; వంశ = వేణవులు; కాహళ = బాకాలు; మహాభేరీ = పెద్దరాండోళ్ళు; గజ = ఏనుగులు; అశ్వ = గుఱ్ఱములు; ఆవళీ = వరుసలు; రింఖా = గిట్టల; రావములు = ధ్వనులు; ఉల్లసిల్ల = చెలరేగగా; దనుజారిన్ = కృష్ణుని {దనుజారి - రాక్షసుల శత్రువు, కృష్ణుడు}; చూడన్ = చూడవలెనను; ఆసక్తులు = ఆసక్తి కలవారు; ఐ = అయి.
భావము:- పాంచజన్య శంఖారావం చెవులలో పడగానే ప్రజలంతా ఉరకలేసే ఉత్సాహంతో, పరవళ్ళు తొక్కే భక్తితో, అతిశయించే ఆసక్తితో; వేణువులు, బాకాలు ఊదుతు, నగారాలు మ్రోగిస్తు, , ఏనుగులు చేస్తున్న గిట్టల చప్పుళ్లు చెలరేగుతుండగా, బంగారు వస్తువులు, విలువగల వలువలు మున్నగు కానుకలు లెక్కపెట్టలేనన్ని తీసుకు వచ్చి యదుకుల విభునికి ఎదురొచ్చారు.

తెభా-1-248-క.
బంధులుఁ బౌరులుఁ దెచ్చిన
గంధేభ హయాదులైన కానుకలు దయా
సింధుఁడు గైకొనె నంబుజ
బంధుఁడు గొను దత్త దీప పంక్తులభంగిన్.

టీక:- బంధులున్ = బంధువులును; పౌరులున్ = పౌరులును; తెచ్చిన = తీసుకు వచ్చిన; గంధేభ = మదించిన ఏనుగులు; హయ = గుఱ్ఱములు; ఆదులు = మొదలగునవి; ఐన = అయినట్టి; కానుకలు = కానుకలు; దయాసింధుఁడు = కృష్ణుడు {దయాసింధుడు - దయాసముద్రుడు, కృష్ణుడు}; కైకొనె = స్వీకరించెను; అంబుజబంధుఁడు = సూర్యుడు {అంబుజబంధువు - పద్మముల బంధువు, సూర్యుడు}; కొను = స్వీకరించు; దత్త = ఒసగబడిన; దీప = దీపముల; పంక్తుల = వరుసలు; భంగిన్ = వలె.
భావము:- బంధుమిత్రులు, ప్రజలు తీసుకు వచ్చిన ఏనుగులు, గుఱ్ఱాలు మొదలైన బహుమతులను దయాసాగరుడైన శ్రీకృష్ణమూర్తి, భక్తు లర్పించిన దీపపంక్తులను పరిగ్రహించే పద్మబంధునిలా అందుకొన్నాడు.

తెభా-1-249-వ.
ఇట్లాత్మారాముండునుఁ బూర్ణకాముండును నైన యప్పరమేశ్వరునికి నుపాయనంబు లిచ్చుచు నాగరులు వికసితముఖు లయి గద్గద భాషణంబుల తోడ డయ్యకుండ నడపునయ్యకు నెయ్యంపుఁ జూపుల నడ్డంబులేని బిడ్డల చందంబున మ్రొక్కి యిట్లనిరి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ఆత్మారాముండును = ఆత్మ యందే రమించు వాడును; పూర్ణకాముండును = పూర్ణమైన కోరికలు కలవాడు; ఐన = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుని = పరమమైన ఈశ్వరుని, కృష్ణుని; కిన్ = కి; ఉపాయనంబులు = కానుకలు; ఇచ్చుచున్ = ఇచ్చుచూ; నాగరులు = నగరమున నివశించువారు; వికసిత = వికసించిన; ముఖులు = ముఖము కలవారు; అయి = అయి; గద్గద = వణుకుచున్న గొంతుతో పలుకు; భాషణంబులు = మాటల; తోడన్ = తో; డయ్యకుండన్ = అలసిపోకుండగ; నడపున్ = నడిపించే; అయ్య = వాని; కున్ = కి; నెయ్యంపు = స్నేహపూరిత; చూపులన్ = చూపులతో; అడ్డంబు = అడ్డము; లేని = లేని; బిడ్డల = సంతానము; చందంబునన్ = వలె; మ్రొక్కి = నమస్కరించి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఈ విధంగా ద్వారకాపుర పౌరులు ఆత్మారాముడు, సంపూర్ణకాముడు ఐన శ్యామసుందరునికి కానుకలు సమర్పించి ఆనందంతో వికసించిన ముఖాలు, హర్షగద్గద భాషణలు కలవారు అయి, తమను కంటికి రెప్పలా కాపాడే నల్లనయ్యకు, కన్నతండ్రికి చిన్నబిడ్డల వలె నమస్కరించి ఇలా పలికారు.

తెభా-1-250-శా.
"నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా, నీ సేవ సంసార సం
తాధ్వంసినియౌఁ గదా, సకలభద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతు గదా ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని
ర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ ర్ణింప బ్రహ్మాదులున్.

టీక:- నీ = నీయొక్క; పాద = పాదము అనే; అబ్జము = పద్మము; బ్రహ్మ = బ్రహ్మచేత; పూజ్యము = పూజింపదగినది; కదా = కదా; నీ = నీమీది; సేవ = భక్తి; సంసార = సంసారమందలి; సంతాప = బాధలను; ధ్వంసిని = నాశనముచేయగలది; ఔన్ = అవును; కదా = కదా; సకల = సమస్త; భద్ర = శుభముల; శ్రేణులన్ = పంక్తులను; ప్రీతి = ప్రేమ; తోన్ = తో; ఆపాదింతు = సంక్రమింప చేయుదువు; కదా = కదా; ప్రపన్నులు = ఆశ్రితులు; కున్ = కు; కాల = కాలమునకు; అధీశ = అధిపతీ; కాలంబు = కాలము; నిర్వ్యాపారంబు = ప్రవర్తనలు లేనిది; కదా = కదా; అయ్య = అయ్యా; చాలరు = సరిపోరు; నినున్ = నిన్ను; వర్ణింపన్ = వర్ణించుటకు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులున్ = మొదలగువారును.
భావము:- “స్వామీ! నీ పాదపద్మాలు బ్రహ్మపూజ్యాలు; నీ చరణ సేవ సంతాపమయ మైన సంసార సముద్రాన్ని దాటించే నావ; నీవు ఆశ్రితులకు సకలసౌభాగ్యాలను సంతోషంగా ప్రసాదించే కరుణామూర్తివి; కాలస్వరూపుడవు; కాలానికి అధీశ్వరుడవు; బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను ప్రశంసించ సమర్థులు కారు.

తెభా-1-251-క.
న్నారము సౌఖ్యంబున,
విన్నారము నీ ప్రతాప విక్రమకథలన్,
న్నారము ధనికులమై,
న్నారము తావకాంఘ్రిమలములు హరీ!

టీక:- ఉన్నారము = ఉన్నాము; సౌఖ్యంబునన్ = సుఖంగ; విన్నారము = విన్నాము; నీ = నీ యొక్క; ప్రతాప = శౌర్యము; విక్రమ = పరాక్రమముల యొక్క; కథలన్ = కథలు; మన్నారము = మంటిమి, బ్రతికుతున్నాము; ధనికులము = ధనవంతులము; ఐ = అయి; కన్నారము = కంటిమి, చూచితిమి; తావక = నీయొక్క; అంఘ్రి = పాద; కమలములు = పద్మములు; హరీ = కృష్ణా.
భావము:- కృష్ణయ్యా! నీ దయవల్ల మేమంతా సుఖంగా ఉన్నాం. నీ శౌర్యప్రతాపాల గురించిన విశేషాలు వింటున్నాం, సంతోషిస్తున్నాం. మాకు ఇన్నాళ్ళకి మళ్ళా నీ పాదపద్మాల దర్శనం అయింది. భాగ్యవంతులమై విలసిల్లుతున్నాం.

తెభా-1-252-క.
రాటము మది నెఱుఁగము,
పోరాటము లిండ్లకడలఁ బుట్టవు పురిలోఁ,
జోరాటన మెగయదు నీ,
దూరాటన మోర్వలేము తోయజనేత్రా!

టీక:- ఆరాటము = ఆందోళనలు; మదిన్ = మా మనసులో; ఎఱుఁగము = లేనే లేవు; పోరాటములు = కలహములు; ఇండ్ల = గృహముల; కడలన్ = వద్ద; పుట్టవు = లేనే లేవు; పురి = నగరము; లోన్ = లో; చోర = దొంగల; ఆటనము = సంచారము; ఎగయదు = లేనే లేదు; నీ = నీనుండి; దూరాటనము = దూరముగ నుండుట; ఓర్వలేము = భరించలేము; తోయజనేత్రా = కృష్ణ {తోయజ నేత్రుడు - (నీటినుండి పుట్టునది) పద్మముల వంటి నేత్రములు కల వాడు - కృష్ణుడు}.
భావము:- కమలాల వంటి కన్నులున్న కన్నయ్య! మా మనసులలో ఆరాటా లన్నవి లేవు. ఇళ్ళల్లో కలహా లన్నవి లేవు. నగరంలో చోర భయాలు లేనే లేవు. అయినా కూడ నీవు దూరప్రాంతాలకు వెళ్ళి నప్పుడు నీ వియోగాన్ని సహించలే మయ్యా.

తెభా-1-253-ఉ.
తండ్రుల కెల్లఁ దండ్రియగు ధాతకుఁ దండ్రివి దేవ! నీవు మా
తండ్రివిఁ, దల్లివిం, బతివి, దైవమవున్, సఖివిన్, గురుండ; వే
తండ్రులు నీ క్రియం బ్రజల న్యులఁ జేసిరి, వేల్పు లైన నో
తండ్రి భవన్ముఖాంబుజము న్యతఁ గానరు మా విధంబునన్.

టీక:- తండ్రుల = తండ్రుల; కున్ = కు; ఎల్లన్ = అందరికి; తండ్రి = తండ్రి; అగు = అయిన; ధాత = బ్రహ్మ {ధాత - ధరించు వాడు, బ్రహ్మ}; కున్ = కి; తండ్రివి = తండ్రివి; దేవ = కృష్ణా; నీవు = నీవు; మా = మాయొక్క; తండ్రివిన్ = తండ్రివి; తల్లివిన్ = తల్లివి; పతివి = భర్తవి; దైవమవున్ = దేవుడవు; సఖివిన్ = స్నేహితుడవు; గురుండవు = గురువువి; ఏ = ఏ; తండ్రులు = తండ్రులు{తండ్రులు - అయిదుగురు తన్ను గన్నవాడు, ఉపనయనము జేసినవాడు, చదువు చెప్పిన వాడు, విపత్తున కాపాడినవాడు, అన్నము పెట్టి పోషించినవాడు}; నీ = నీ; క్రియన్ = వలె; ప్రజల = లోకులను; ధన్యులన్ = ధన్యులనుగా; చేసిరి = చేసిరి; వేల్పులు = దేవతలు; ఐనన్ = అయినప్పటికిని; ఓ = ఓ; తండ్రి = తండ్రి; భవన్ = నీయొక్క; ముఖ = ముఖము అనే; అంబుజము = పద్మము; ధన్యతన్ = ధన్యతతో; కానరు = చూడలేరు; మా = మా; విధంబునన్ = వలె.
భావము:- తండ్రులందరికి తండ్రి యైన బ్రహ్మదేవునికి నీవు తండ్రివి. మా అందరికి తండ్రివి, తల్లివి, దైవానివి, భర్తవు, మిత్రుడవు, గురుడవు, సమస్తము నీవే; తండ్రులు ఐదుగురు (తన్ను గన్నవాడు, ఉపనయనము జేసినవాడు, చదువు చెప్పిన వాడు, విపత్తున కాపాడినవాడు, అన్నము పెట్టి పోషించినవాడు) ఎవరు కూడ నీలాగ ప్రజలను పరమానంద భరితులను చేసి ధన్యులను చేయలేరు. దేవతలైనా మా లాగా నీ ముఖ పద్మాన్ని వీక్షించి కృతార్థులు కాలేరు.

తెభా-1-254-క.
చెచ్చెరఁ గరినగరికి నీ
విచ్చేసిన నిమిషమైన వేయేండ్లగు నీ
వెచ్చోటికి విచ్చేయక
చ్చికతో నుండుమయ్య మా నగరమునన్.

టీక:- చెచ్చెరన్ = తొందరతొందరగా; కరినగరి = హస్తినాపురము; కిన్ = నకు; నీవు = నీవు; విచ్చేసిన = వెళ్ళిన; నిమిషము = నిమిష మాత్రపు సమయము; ఐన = అయినను; వేయి = పది వందల; ఏండ్లు = సంవత్సరములు; అగు = వలె ఉండును; నీవు = నీవు; ఎచ్చోటి = ఎక్కడ; కిన్ = కును; విచ్చేయక = వెళ్ళకుండగ; మచ్చిక = ప్రేమ; తోన్ = తో; ఉండుము = ఉండుము; అయ్య = తండ్రీ; మా = మాయొక్క; నగరమునన్ = నగరములో.
భావము:- ప్రభు! నీవు మాటిమాటికి హస్తినాపురానికి వెళ్తున్నావు. అలా వెళ్ళినప్పు డల్లా ప్రతి నిమిషము మాకు పదివందల సంవత్సరాల లాగ అనిపిస్తున్నది. అందుచేత, మా ద్వారకానగరాన్ని వదలి ఎక్కడకి వెళ్ళకుండా ప్రేమగా ఇక్కడే ఉండిపోవయ్య నల్లనయ్య!

తెభా-1-255-ఆ.
అంధకారవైరి పరాద్రి కవ్వలఁ
నిన నంధమయిన గముభంగి
నిన్నుఁ గానకున్న నీరజలోచన!
యంధతమస మతుల గుదు మయ్య."

టీక:- అంధకారవైరి = సూర్యుడు {అంధకార వైరి - చీకటికి శత్రువు, సూర్యుడు}; అపర = పడమటి; అద్రి = కొండ; కిన్ = కు; అవ్వలన్ = ఆవతల పక్కకి; చనినన్ = వెళ్ళగా; అంధము = చీకటిగా; అయిన = అయి నట్టి; జగము = లోకము; భంగిన్ = వలె; నిన్నున్ = నిన్ను; కానక = చూడగా లేకుండగ; ఉన్న = ఉన్న యెడల; నీరజలోచన = కృష్ణ {నీరజ లోచన - (నీటిలో పుట్టినది) పద్మము వంటి కన్నుల ఉన్న వాడు}; అంధతమస = చీకటి వంటి అజ్ఞానముతో కూడిన; మతులము = బుద్ధి కల వారము; అగుదుము = అవుతాము; అయ్య = తండ్రీ.
భావము:- సూర్యభగవానుడు పశ్చిమ పర్వతం చాటుకు పోయి నప్పుడు జగత్తు అంతా అంధకార బంధుర మైనట్లు నీవు కానరాకుంటే, మేము కటిక చీకటిలో పడి కొట్టుమిట్టాడు తుంటాము.”

తెభా-1-256-వ.
అని యిట్లు ప్రజలాడెడి భక్తియుక్త మధుర మంజులాలాపంబులు గర్ణ కలాపంబులుగా నవధరించి, కరుణావలోకనంబులు వర్షించుచు హర్షించుచుఁ, దన రాక విని మహానురాగంబున సంరంభ వేగంబుల మజ్జనభోజనశయనాది కృత్యంబు లొల్లక యుగ్రసే, నాక్రూర, వసుదేవ, బలభద్ర, ప్రధ్యుమ్న, సాంబ, చారుధేష్ణ, గద ప్రముఖ యదు కుంజరులు కుంజర, తురగ, రథారూఢు లై దిక్కుంజరసన్నిభం బయిన యొక్క కుంజరంబు ముందట నిడుకొని; సూత, మాగధ, నట, నర్తక, వంది సందోహంబుల మంగళ భాషణంబులును; భూసురాశీర్వాద వేదఘోషంబులును; వీణా, వేణు, భేరీ, పటహ, శంఖ, కాహళ ధ్వానంబులును; రథారూఢ విభూషణ భూషిత వారయువతీ గానంబులును; నసమానంబులై చెలంగ నెదురుకొని యథోచిత ప్రణామాభివాదన పరిరంభ కరస్పర్శన సంభాషణ మందహాస సందర్శనాది విధానంబుల బహుమానంబులు సేసి, వారలుం దానును భుజగేంద్రపాలితంబైన భోగవతీనగరంబు చందంబున స్వసమాన బల యదు, భోజ, దశార్హ, కుకురాంధక, వృష్ణి, వీరపాలితంబును; సకల కాలసంపద్యమానాంకుర పల్లవ, కోరక, కుట్మల, కుసుమ, ఫల, మంజరీపుంజ భార వినమిత లతా పాదపరాజ విరాజితోద్యాన మహావనోపవనారామ భాసితంబును; వనాంతరాళ రసాల, సాల, శాఖాంకురఖాదనక్షుణ్ణకషాయ కంఠ కలకంఠ మిథున కోలాహల ఫలరసాస్వాదపరిపూర్ణ శారికా, కీర, కుల, కలకల, కల్హార, పుష్ప మకరంద పాన పరవశ భృంగ భృంగీ కదంబ ఝంకార సరోవర కనక కమల మృదులకాండ ఖండ స్వీకార మత్త వరటాయత్త కలహంస నివహ క్రేంకారసహితంబును; మహోన్నత సౌధజాల రంధ్రనిర్గత కర్పూర ధూపధూమపటల సందర్శన సంజాత జలధర భ్రాంతి విభ్రాంతి సముద్ధూత పింఛ నర్తన ప్రవర్తమాన మత్తమయూర కేకారవ మహితంబును; నానారూప తోరణ ధ్వజ వైజయంతికా నికాయ నిరుద్ధ తారకాగ్రహ ప్రకాశంబును; ముక్తాఫలవిరచితరంగవల్లి కాలంకృత మందిర ద్వారదేహళీ వేదికా ప్రదేశంబును; ఘనసార గంధసార కస్తూరికా సంవాసిత వణిగ్గేహ గేహళీ నికర కనకగళంతికా వికీర్యమాణ సలిలధారా సంసిక్త విపణి మార్గంబునుఁ; బ్రతినివాస బహిరంగణ సమర్పిత రసాలదండ, ఫల, కుసుమ, గంధాక్షత, ధూప, దీప, రత్నాంబరాది. వివిధోపహారవర్గంబునుఁ; బ్రవాళ, నీల, మరకత, వజ్ర, వైఢూర్య, నిర్మితగోపురాట్టాలకంబును, విభవ నిర్జిత మహేంద్రనగరాలకంబును నైన పురవరంబుం బ్రవేశించి; రాజమార్గంబున వచ్చు సమయంబున.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; ప్రజలు = జనులు; ఆడెడి = పలికెడి; భక్తి = భక్తితో; యుక్త = కూడుకొన్న; మధుర = తీయని; మంజుల = ఇంపైన; ఆలాపంబులు = పలుకులు; కర్ణ = చెవులకు; కలాపంబులుగాన్ = ఆభరణములుగా; అవధరించి = ధరించి; కరుణ = దయతో కూడిన; అవలోకనంబులు = చూపులు; వర్షించుచున్ = వెదజల్లుచు; హర్షించుచున్ = సంతోషించుచు; తన = తన; రాక = రాకను; విని = విని; మహా = గొప్ప; అనురాగంబున = అనురాగముతో; సంరంభ = ఆత్రుతతోను; వేగంబుల = తొందరతోను; మజ్జన = స్నానము చేయుట; భోజన = భోజనము తినుట; శయన = నిద్రించుట; ఆది = మొదలగు; కృత్యంబులు = పనులు; ఒల్లక = ఒప్పుకొనక; ఉగ్రసేనా = ఉగ్రసేనుడు; అక్రూర = అక్రూరుడు; వసుదేవ = వసుదేవుడు; బలభద్ర = బలభద్రుడు; ప్రధ్యుమ్న = ప్రద్యుమ్నుడు; సాంబ = సాంబుడు; చారుధేష్ణ = చారుధేష్ణుడు; గద = గదుడు; ప్రముఖ = మొదలగు ముఖ్యులు; యదు = యదు వంశమున; కుంజరులు = ఏనుగుల వంటివారు; కుంజర = ఏనుగు; తురగ = గుఱ్ఱము; రథ = రథము; ఆరూఢులు = ఎక్కినవారు; ఐ = అయి; దిక్కుంజర = దిగ్గజమునకు; సన్నిభంబు = సమానమైన; అయిన = అయినట్టి; ఒక్క = ఒక; కుంజరంబు = ఏనుగు; ముందటన్ = ముందర; ఇడుకొని = ఉంచుకొని; సూత = రథము తోలువారు; మాగధ = స్తోత్రము చేయువారు; నట = అభినయము చేయువారు; నర్తక = నాట్యము చేయువారు; వంది = వంశవర్ణన చేయువారు; సందోహంబుల = గుంపులు గుంపులుగా; మంగళ = శుభకరమైన; భాషణంబులును = పలుకులును; భూసుర = బ్రాహ్మణులు చేయు; ఆశీర్వాద = ఆశీస్సుల; వేద = వేదమంత్రములను; ఘోషంబులును = గట్టిగా చదువుటలు; వీణ = వీణలు; వేణు = పిల్లనగ్రోవులు; భేరీ = డోళ్ళు; పటహ = రాండోళ్ళు; శంఖ = శంఖములు; కాహళ = బాకాలు యొక్క; ధ్వానంబులును = ధ్వనులును; రథ = రథములు; ఆరూఢ = ఎక్కిన; విభూషణ = విశిష్ట ఆభరణములను; భూషిత = అలంకరించుకొన్న; వార = భోగమువారిలో {వార జనులు - భోగమువారు, కుటుంబవ్యవస్త నుండి దూరముగ నుండువారు}; యువతీ = యువతుల {యువతి - యౌవనమున ఉన్నామె, స్త్రీ}; గానంబులును = పాటలుతో; అసమానంబులు = మిక్కిలుచున్నవి; ఐ = అయి; చెలంగన్ = చెలరేగగా; ఎదురుకొని = అభిముఖముగ వచ్చి; యథోచిత = తగిన విధముగ; ప్రణామ = నమస్కారము చేయుట, చేతులు జోడించుట; అభివాదన = మ్రొక్కుట, నమస్కార పూర్వక పలకరింపు; పరిరంభ = కౌగలించు కొనుట; కరస్పర్శన = చేతులు స్పృశించుట; సంభాషణ = పలకరించుట; మందహాస = చిరునవ్వు చిందించుట; సందర్శన = గౌరవపూర్వకముగ వెళ్ళి చూచుట; ఆది = మొదలగు; విధానంబుల = విధములుగా; బహుమానంబులు = గౌరవములు; చేసి = చేసి; వారలున్ = వారును; తానును = తానే స్వయముగను; భుజగేంద్ర = నాగేంద్రునిచే; పాలితంబు = పరిపాలింప బడునది; ఐన = అయినట్టి; భోగవతీనగరంబు = భోగవతీనగరము {భోగవతీనగరము - నాగలోక ముఖ్య పట్నము}; చందంబున = వలె; స్వ = తనతో; సమాన = సమానమైన; బల = బలముగల; యదు = యాదవులు; భోజ = భోజులు; దశార్హ = దశార్హులు; కుకుర = కుకురలు; అంధక = అంధకులు; వృష్ణి = వృష్ణికులు; వీర = (ఐన) వీరులచే; పాలితంబును = పాలింప బడునదియును; సకల = సర్వ; కాల = కాలములందును; సంపద్యమాన = పొందబడుచున్న; అంకుర = మొలకలు; పల్లవ = చిగుళ్ళు; కోరక = మొగ్గలు; కుట్మల = అరవిచ్చుమొగ్గలు; కుసుమ = పూవులు; ఫల = పండ్లు; మంజరీ = గుత్తులు; పుంజ = గెలలు యొక్క; భార = బరువుచేత; వినమిత = వంగిన; లతా = తీగలు; పాదపరాజ = పెద్ద చెట్లు తోను; విరాజిత = ప్రకాశిస్తున్న; ఉద్యాన = తోటలు; మహావన = పెద్దతోటలు; ఉపవన = పెరటితోటలు; ఆరామ = ఊరి వెలుపలి తోటలు తోను; భాసితంబును = ప్రకాశించు చుండగ; వన = తోటల; అంతరాళ = లోపలి భాగము నందు; రసాల = తీయ మామిడి చెట్లు; సాల = మద్దిచెట్లు; శాఖ = కొమ్మల; అంకుర = చివుళ్ళను; ఖాదన = తినుటవలన; క్షుణ్ణ = ఉత్పన్నమైన; కషాయ = పదునెక్కిన; కంఠ = కంఠములుగల; కలకంఠ = కోకిల; మిథున = జంటల; కోలాహల = కలకలములతోను; ఫల = పండ్ల యొక్క; రస = రసములను; ఆస్వాద = గ్రోలి; పరిపూర్ణ = సంతుష్టి చెందిన; శారికా = గోరువంకలు; కీరకుల = చిలుకలు; కలకల = కలకలములుతోను; కల్హార = కలువ; పుష్ప = పువ్వుల; మకరంద = తేనెలు; పాన = త్రావుటచే; పరవశ = ఒడలు మరచిన; భృంగ = గండు తుమ్మెదలు; భృంగీ = ఆడ తుమ్మెదలు; కదంబ = గుంపుల యొక్క; ఝంకార = జుమ్మనే శబ్దముల తోకూడిన; సరోవర = కొలనుల లోని; కనక = బంగారు పుప్పొడి కల; కమల = పద్మముల; మృదుల = మెత్తని; కాండ = తూడుల; ఖండ = ముక్కలను; స్వీకార = తీసుకొనుటచే; మత్త = మత్తెక్కిన; వరట = ఆడ హంసతో; ఆయత్త = సంసిద్ధమైన; కలహంస = మంచి కంఠనాదము కల హంసల; నివహ = గుంపుల యొక్క; క్రేంకార = కూతలతో; సహితంబును = కూడినదియు; మహ = మిక్కిలి; ఉన్నత = ఎత్తైన; సౌధ = మేడల; జాల = కిటికీల; రంధ్ర = కన్నముల నుండి; నిర్గత = వెలువడుచున్న; కర్పూర = కర్పూరము మొదలగునవాటిని; ధూప = దూపము వేయుట వలని; ధూమ = పొగల; పటల = చుట్టలు, అల్లికలు; సందర్శన = చూచుట వలన; సంజాత = కలిగిన; జలధర = మేఘములనే; భ్రాంతి = భ్రమచే; విభ్రాంతి = చక్కటి భ్రమణములతో; సముద్ధూత = విచ్చుకొన్న; పింఛ = పించములతో; నర్తన = నాట్యముతో కూడిన; ప్రవర్తమాన = నడకలతో ప్రకాశిస్తున్న; మత్త = మదించిన; మయూర = నెమళ్ళ; కేక = కేకల; ఆరవ = శబ్దములతోను; మహితంబును = పెచ్చరిల్లు తున్నదియును; నానా = అనేక; రూప = రూపముల; తోరణ = తోరణములు; ధ్వజ = జెండాలు; వైజయంతికా = ద్వారములకు అలంకరించిన విజయ మాలికల; నికాయ = సమూహములచేత; నిరుద్ధ = అడ్డగింప బడిన; తారకా = నక్షత్రముల యొక్క; గ్రహ = గ్రహముల యొక్క; ప్రకాశంబును = ప్రకాశము కలదియును; ముక్తాఫల = ముత్యములో; విరచిత = కూర్పబడిన; రంగవల్లికా = ముగ్గులతో; అలంకృత = అలంకరింప బడిన; మందిర = మందిరముల యొక్క; ద్వార = ద్వారములు; దేహళీ = గుమ్మములు; వేదికా = అరుగులు; ప్రదేశంబును = వాకిలి ప్రదేశములు కలదియును; ఘనసార = కర్పూరము; గంధసార = మంచి గంధము; కస్తూరికా = కస్తూరిచేత; సంవాసిత = సువాసనాభరితముగా కల; వణిక్ = వైశ్యుల; గేహ = ఇండ్ల; గేహళీ = ద్వారబంధముల; నికర = సమూహము; కనక = బంగారు; గళంతికా = గిండి చెంబులు నుండి, కళ్ళాపి యంత్రము నుండి; వికీర్యమాణ = వెదజల్లబడుచున్న; సలిల = జల; ధారా = ధారలచే; సంసిక్త = బాగుగా తడుపబడిన; విపణి = వాణిజ్య; మార్గంబును = వీథులును; ప్రతి = ఒక్కొక; నివాస = ఇంటియొక్క; బహిరంగణ = వాకిలి యందు; సమర్పిత = సమర్పింపబడిన; రసాల = చెరుకు; దండ = గడలు; ఫల = పండ్లు; కుసుమ = పుష్పములు; గంధా = గంధములు; అక్షత = అక్షతలు; ధూప = ధూపములు; దీప = దీపములు; రత్న = రత్నములు; అంబర = వస్త్రములు; ఆది = మొదలగు; వివిధ = అనేక విధములైన; ఉపహార = నైవేద్యముల; వర్గంబును = సమూహములతో కూడినదియు; ప్రవాళ = పగడములు; నీల = నీలములు; మరకత = పచ్చలు; వజ్ర = వజ్రములు; వైఢూర్య = వైఢూర్యములతోను; నిర్మిత = నిర్మింప బడిన; గోపుర = గోపురములు; అట్టాలకంబును = కోట బురుజులతోను; విభవ = వైభవముచే; నిర్జిత = ఓడింపబడిన; మహేంద్రనగర = అమరావతి {మహేంద్రనగరము - ఇంద్రుడి యొక్క నగరము, అమరావతి}; అలకంబును = అలకాపురము {కుబేరుని పట్టణము అలకాపురము}; ఐన = అయిన; పుర = పురములలో; వరంబున్ = శ్రేష్ఠమైనదానిని; ప్రవేశించి = ప్రవేశించి; రాజమార్గంబున = రాజమార్గమున; వచ్చు = వచ్చుచున్న; సమయంబున = సమయములో.
భావము:- ఈ విధంగా ద్వారాకానగర ప్రజలు పలుకుతున్న భక్తి బంధురమైన మధుర మంజులాలాపాలు వీనులవిందుగా వింటు, కరుణతో ఆర్ద్రాలైన కడకంటిచూపులను కురిపిస్తు, మురిపిస్తు తన ఆగమనం విని మిక్కిలి అనురాగంతో, సంరంభవేగంతో స్నాన భోజన శయనాది నిత్యకృత్యాలు కూడ పరిత్యజించి ఉగ్రసేనుడు, అక్రూరుడు, వసుదేవుడు, బలభద్రుడు మున్నగు పెద్దలు; ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్ణుడు, గదుడు మొదలైన యదువీరులు ఏనుగులు గుఱ్ఱాలు రథాలు అధిరోహించినవారై, ఐరావతం వంటి ఒక భద్రగజాన్ని ముందుంచుకొని; సూతులు, నటులు, నర్తకులు, వందిమాగధులు మొదలైనవారి మంగళభాషణాలతో భూసురోత్తముల ఆశీర్వాద వేదనినాదాలతో; వీణ, వేణువు, నగారా, తప్పెట, శంఖం, బాకా మొదలైన వాద్యధ్వనులతో; నానాలంకారాలూ ధరించి రథాలపై కూర్చున్న వారకాంతల కమనీయ గానాలతో ఎదురువచ్చారు. వారందరినీ శ్రీకృష్ణుడు వందనాలతో, అభివాదాలతో, కౌగిలింతలతో, కరస్పర్శలతో యథోచితంగా గౌరవించాడు. వారితో కూడిన మధుర నాగరాజులచే పరిపాలింపబడెడి భోగవతీనగరంలా, తనంతటి బలసంపన్నులైన యదు భోజ దాశార్హ కుకుర అంధక వృష్టి వీరులచేత సంరక్షింపబడుతున్న ద్వారకాపురాన్ని వాసుదేవుడు ప్రవేశించాడు. ఆ మహానగరం ఎల్లకాలము లందు కోకొల్లలుగా ఉండే అంకురాలతో, పల్లవాలతో, కోరకాలతో, కుట్మలాలతో, కుసుమాలతో, పండ్ల గుత్తులతో, వంగిన లతల యొక్క సమూహాలతో, విరాజిల్లే ఉద్యానవనాలతో, ఉపవనాలతో, క్రీడావనాలతో ప్రమదవనాలతో ప్రకాశిస్తున్నది. ఆ వనాల నడుమ నున్న బాలరసాల సాల నవపల్లవాలను కొరికి కషాయకంఠులైన కలకంఠ దంపతుల కుహూనినాదాలతో, ఫలరసాలను సంతృప్తిగా ఆస్వాదించిన గోరువంకల చిలుకల కలకల ధ్వనులతో, వికసించిన కలువపూవుల్లోని మకరందాన్ని పానంచేసి పరవశించిన తుమ్మెద దంపతుల కమ్మని ఝంకారాలతోనూ, సరస్సులలో బంగరుతామరతూండ్ల తునుకలు తిని మైమరిచి కలహంస దంపతుల క్రేంకారాలతోను కూడి ఉన్నది. మహోన్నతాలైన మేడల గవాక్షాలలో నుంచి బయలు వెడలిన కర్పూర ధూపాలు, అగరుధూమాలు చూసి నీలమేఘాలనే భ్రాంతితో ఒడలు తెలియక పింఛాలు విప్పి నాట్యాలు చేస్తున్న మత్తమమూరాల కేకారవాలతో నిండి ఉంది. ఆ నగరంలోని నానావిధాలైన మకర తోరణాలతో, విజయధ్వజాలతో, వైజయంతికలతో ఆకాశంలోని నక్షత్ర గ్రహ మండలాల ప్రకాశాలు నిరుద్ధము లౌతున్నాయి; మంచిముత్యాలతో కూర్చిన రంగవల్లికలతో, అలంకరింపబడ్డ మందిరద్వారాలు, గడపలు, వేదికలు ప్రకాశిస్తున్నాయి; కర్పూరం, చందనం, కస్తూరి పరిమళించే వర్తకుల గృహాల ద్వారబంధాలు, బంగారు కళ్ళాపిగిండిగిలతో జల్లుమని చల్లుతున్న నీటి జల్లులతో బాగా తడిసిన రాజమార్గాలు; మంగళాక్షతలు, ధూపదీపాలు, రత్మాంబరాలు మొదలైన నానావిధాల కానుకలు కనువిందు కావిస్తున్నాయి; పగడాలతో, నీలాలతో, పచ్చలతో, వజ్రవైడూర్యాలతో నిర్మింపబడ్డ గోపురాలు, చంద్రశాలలు అంతటా ప్రకాశిస్తున్నాయి; తన మహావైభవంతో ఆ పట్టణం మహేంద్రుని స్వర్గపట్టణం అమరావతిని, కుబేరుని అలకాపట్టణాన్ని తిరస్కరిస్తున్న ట్లున్నది; ఇటువంటి ద్వారకానగరాన్ని ప్రవేశించి శ్రీకృష్ణుడు రాజమార్గము వెంట వస్తున్నాడు.

తెభా-1-257-మత్త.
న్నులారగ నిత్యమున్ హరిఁ గాంచుచున్ మనువార ల
య్యున్నవీన కుతూహలోత్సవయుక్తి నాగరకాంత ల
త్యున్నతోన్నతహర్మ్యరేఖల నుండి చూచిరి నిక్కి చే
న్నలం దమలోనఁ దద్విభు సౌకుమార్యము సూపుచున్.

టీక:- కన్నుల = కళ్ళ; ఆరంగ = నిండుగ; నిత్యమున్ = ఎల్లప్పుడు; హరిన్ = హరిని; కాంచుచున్ = దర్శించుచు; మనువారలు = జీవించువారు; అయ్యున్ = అయినప్పటికిని; నవీన = కొత్తదనముతో కూడిన; కుతూహల = కుతూహలము అనే; ఉత్సవ = ఉత్సవములతో; యుక్తి = కూడిన; నాగర = నగరమున వసించు; కాంతలు = స్త్రీలు; అతి = అత్యంత; ఉన్నతోన్నత = బాగా ఎత్తైన; హర్మ్య = మేడల; రేఖల = పంక్తుల; నుండి = నుండి; చూచిరి = చూచినారు; నిక్కి = ఉత్సుకతో బొటనవేళ్ళపై నిలబడి; చేన్ = చేతులవలని; సన్నలన్ = సంజ్ఞలతో; తమలోనన్ = తమలోతాము; తత్ = ఆయొక్క; విభు = ప్రభువు; సౌకుమార్యము = సుకుమార లక్షణములు; సూపుచున్ = చూపుచూ;
భావము:- అప్పుడు నగరంలోని పౌరకాంత లందరు ఆయన్ని చూడటానికి ఉన్నతోన్నతమైన సౌధాలను అధిరోహించారు. ప్రతినిత్యం కన్నుల విందుగా కనుగొంటన్నప్పటికీ వారు క్రొంగ్రొత్త కుతూహలాలతో కూడినవారై నిక్కినిక్కి చూడసాగారు. తమలో తాము ఆ శ్యామసుందరుని సౌందర్య సౌకుమార్య లావణ్యమయ స్వరూపాన్ని చేతుల చాచి తమలోతాము చూపించుకొంటు ఆనందించారు.

తెభా-1-258-సీ.
లుముల నీనెడు లకంఠి యెలనాఁగ-
ర్తించు నెవ్వాని క్షమందు;
నదృక్చకోరకసంఘంబునకు సుధా-
పానీయపాత్ర మే వ్యుముఖము;
కలదిక్పాలకమితికి నెవ్వాని-
బాహుదండంబులు ట్టుఁగొమ్మ;
లాశ్రితశ్రేణి కే ధిపుని పాదరా-
జీవయుగ్మంబులు చేరుగడలు;

తెభా-1-258.1-ఆ.
భువనమోహనుండు పురుషభూషణుఁ డెవ్వఁ
ట్టి కృష్ణుఁ డరిగె ర్మ్యశిఖర
రాజమాన లగుచు రాజమార్గంబున
రాజముఖులు గుసుమరాజిఁ గురియ.

టీక:- కలుములను = సంపదలను; ఈనెడు = ఇచ్చునట్టి; కలకంఠి = మనోహర కంఠధ్వని కలిగిన; ఎలనాఁగ = యౌవనము కల స్త్రీ, లక్ష్మి; వర్తించు = వసించును; ఎవ్వాని = ఎవని; వక్షము = వక్షస్థలము; అందున్ = అందు; జన = ప్రజల; దృక్ = చూపులు అనే; చకోరక = చకోర పక్షుల; సంఘంబున్ = సమూహము; కున్ = నకు; సుధా = వెన్నెల; పానీయ = తాగు; పాత్రము = పాత్ర; ఏ = ఏ; భవ్యు = శుభాకారుని; ముఖము = ముఖము; సకల = సమస్త; దిక్ = దిక్కులను; పాలక = పాలించువారి; సమితి = సమూహము; కిన్ = నకు; ఎవ్వాని = ఎవని; బాహు = భుజముల; దండంబులు = దండములు; పట్టుఁగొమ్మలు = ఆధారభూతములు; ఆశ్రిత = ఆశ్రయించిన; శ్రేణి = సమూహము; కిన్ = నకు; ఏ = ఏ; అధిపుని = అధికుని; పాద = పాదము లనే; రాజీవ = పద్మముల; యుగ్మంబులు = జంటలు; చేరు = గమ్య; గడలు = స్థానములు;
భువన = లోకములకే (కును); మోహనుండు = అందగాడు, మోహింప చేయువాడు; పురుష = పురుషులలో; భూషణుఁడు = అలంకారము; ఎవ్వఁడు = ఎవడు; అట్టి = అటువంటి; కృష్ణుఁడు = హరి; అరిగెన్ = వెళ్ళెను; హర్మ్య = మేడల; శిఖర = పైభాగములందు - డాబాలపై; రాజమానలు = ప్రకాశించువారు; అగుచు = అవుతు; రాజ = ముఖ్యమైన; మార్గంబున = మార్గములో; రాజముఖులు = చంద్రముఖులు, స్త్రీలు; కుసుమ = పుష్పముల; రాజిన్ = రేఖలు; కురియన్ = కురిపిస్తుండగా.
భావము:- ఏ మహానుభావుని వక్షస్థలంలో సిరిసంపదలు కురిసే నారీ శిరోమణి శ్రీదేవి నర్తిస్తూ ఉంటుందో, ఏ మహాత్ముని పావనవదనం ప్రేక్షకుల నయనచకోరాలకు అమృతం చిందే వెన్నెల పాత్రమో, ఏ మహనీయుని భుజాదండాలు సర్వదిక్పాలకులకు పట్టుకొమ్మలో, ఏ మహితాత్ముని పాదపద్మాలు ఆశ్రితులకు అండదండలో, ఏ మహాపురుషుడు భువనమోహనుడో అట్టి పురుషోత్తముడు, శ్రీకృష్ణుడు, సౌధశిఖరాలపై విరాజిల్లే రాజీవలోచనలు కుసుమరాజి కురిపించగా రాజమార్గంలో వెళ్లసాగాడు.

తెభా-1-259-ఉ.
జాతాక్షుఁడు సూడ నొప్పె ధవళఛ్ఛత్రంబుతోఁ, జామరం
బుతోఁ, బుష్ప పిశంగ చేలములతో, భూషామణిస్ఫీతుఁ డై
లినీభాంధవుతో, శశిధ్వజముతో, క్షత్రసంఘంబుతో,
భిచ్ఛాపముతోఁ, దటిల్లతికతో, భాసిల్లు మేఘాకృతిన్.

టీక:- జలజాతాక్షుడు = కృష్ణుడు {జలజాతాక్షుడు - జలజాత (పద్మములవంటి) అక్షుడు, కృష్ణుడు}; చూడన్ = చూచుటకు; ఒప్పె = చక్కగా ఉన్నాడు; ధవళత్ = తెల్లని; ఛత్రంబు = గొడుగుల; తోన్ = తో; చామరంబుల = చామరముల; తోన్ = తో; పుష్ప = పుష్పములతో; పిశంగ = కపిలవర్ణము గల; చేలముల = వస్త్రముల; తోన్ = తో; భూషా = భూషణములలోని; మణి = మణులు; స్పీతుఁడు = అధికముగా కలవాడు; ఐ = అయి; నలినీభాంధవు = పద్మముల బంధువు, సూర్యుని; తోన్ = తో; శశిధ్వజము = చంద్రుని (కుందేలు గుర్తుగల వాడు, చంద్రుడు); తోన్ = తో; నక్షత్ర = తారకల; సంఘంబు = సమూహము తోన్ = తో; బలభిచ్ఛాపము = ఇంద్రధనుస్సు; తోన్ = తో; తటిల్లతిక = మెరుపుల; తోన్ = తో; భాసిల్లు = ప్రకాశించు; మేఘ = మేఘము యొక్క; ఆకృతిన్ = ఆకృతితో.
భావము:- ఆ కమలనేత్రుడు శ్యామసుందరుడు శ్వేతఛత్రం అనే సూర్యునితో, చామరా లనే చంద్రునితో, పూలనే నక్షత్రాల సమూహంతో, కపిలవర్ణము గల అంబరాలనే ఇంద్రధనుస్సుతో, భూషణాలలోని మణుల కాంతులనే మెరుపు తీగలతో భాసిల్లే మేఘంలా ప్రకాశిస్తున్నాడు.

తెభా-1-260-వ.
ఇట్లరిగి తల్లిదండ్రుల నివాసంబు సొచ్ఛి దేవకీ ప్రముఖు లయిన తల్లుల కేడ్వురకు మ్రొక్కిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అరిగి = వెళ్ళి; తల్లిదండ్రుల = తల్లిదండ్రుల; నివాసంబు = గృహము; చొచ్ఛి = ప్రవేశించి; దేవకీ = దేవకీదేవి; ప్రముఖులు = మొదలగు ప్రముఖులు; అయిన = అయినట్టి; తల్లుల = తల్లులకు; ఏడ్వురు = ఏడుగురు {వసుదేవుని భార్యలు - ఏడుగురు}; కున్ = కు; మ్రొక్కిన = నమస్కరించిన.
భావము:- శ్రీకృష్ణుడు జననీజనకుల సౌధానికి వెళ్లాడు. దేవకి మొదలైన తల్లులు ఏడుగురకు నమస్కరించాడు.

తెభా-1-261-క.
బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు
డ్డన నంకముల నునిచి న్నుల తుదిఁ బా
లొడ్డగిలఁ బ్రేమభరమున
డ్డువడం దడిపి రక్షిలముల ననఘా!

టీక:- బిడ్డఁడు = కుమారుడు; మ్రొక్కినన్ = నమస్కరింపగ; తల్లులు = తల్లులు; జడ్డనన్ = తటాలున; అంకములన్ = తొడలపై; ఉనిచి = ఉంచుకొని; చన్నుల = చన్నుల; తుదిన్ = మొనలలో; పాలు = క్షీరము; ఒడ్డగిలన్ = పొంగి రాగా; ప్రేమ = ప్రేమ యొక్క; భరమునన్ = భారము వలన; జడ్డువడన్ = ఆశ్చర్యకరముగ; తడిపిరి = చెమ్మగిల చేసిరి; అక్షిజలములన్ = కన్నీటితో; అనఘా = పాపము లేని వాడా.
భావము:- చాలా రోజుల తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి నమస్కరించగా, అతని తల్లులు అందరు బిడ్డడిమీది బద్దానురాగంతో చటుక్కున తమ తొడలపై కూర్చుండ బెట్టుకున్నారు. ఆపేక్షతో పొంగిపొర్లి చన్నులు చేపుతుండగా, తమ కన్నీటితో అతనిని అభిషేకించారు.