Jump to content

పోతన తెలుగు భాగవతము/పంచమ స్కంధము (ప్రథమాశ్వాసము)/విప్రుడు బ్రతికివచ్చుట

వికీసోర్స్ నుండి


తెభా-5.1-130-క.
పురిలోన వృషలపతి దా
రుదుగ సంతాన కాముఁడై వేడుకతోఁ
బురుషుఁడగు పశువుఁ గాళికి
ఱుముక గొనిపోవఁ బశువు లఁగిన భృత్యుల్.

టీక:- పురి = పురము; లోనన్ = లోని; వృషలపతి = శూద్రుల; పతి = పెద్ద; తాన్ = తను; అరుదుగన్ = అపూర్వముగా, ఎప్పుడో కాని జరుగనిది ఐన; సంతాన = సంతానమును; కాముడు = కోరెడివాడు; ఐ = అయ్యి; వేడుక = జాతర ఊరేగింపు; తోన్ = తోటి; పురుషుడు = మగమనిషి; అగు = అయిన; పశువున్ = బలిపశువును; కాళి = కాళికాంబ {కాళి - భయంకర రూపమున ఉన్న శక్తిస్వరూపిణి, కాళికాదేవి}; కున్ = కు; తఱుముకున్ = వెంటబడి; కొనిపోవ = తీసుకొనిపోతుండగా; పశువున్ = బలిపశువు; తలగిన్ = తప్పించుకొనిపోగా; భృత్యుల్ = సేవకులు.
భావము:- భరతుడు ఉంటున్న నగరానికి నాయకుడైన భిల్లరాజుకు పిల్లలు లేరు. సంతానం కోసం కాళికాదేవికి నరబలి ఇవ్వడం కోసం ఒక మనుష్యుణ్ణి వెంట బెట్టుకొని పోతుండగా ఆ బలిపశువు తప్పించుకొని పారిపోయాడు. అప్పుడు సేవకులు…

తెభా-5.1-131-ఆ.
రసి కానలేక యా రాత్రి వీరాస
మునఁ జేని కాఁపు విల బుద్ధి
నెసఁగు విప్రయోగి నొయ్యనఁ బొడగాంచి
శువు మంచి దనుచుఁ ట్టి రతని.

టీక:- అరసి = వెదకినను; కానలేక = కనుగొనలేక; ఆ = ఆ; రాత్రి = రాత్రి; వీరాసనమునన్ = వీరాసనము వేసికొని {వీరాసనము – యోగాసనములలో నొకటి, పాదములు రెండును రెండవ తొడపక్కకి వచ్చెడి భంగిమగల ఆసనము}; చేనిన్ = పొలమును; కాపు = కాపలా కాసెడి; విమల = నిర్మలమైన; బుద్ధిన్ = బుద్ధితో; ఎసగు = అతిశయించుతున్న; విప్ర = బ్రాహ్మణ; యోగిన్ = యోగిని; ఒయ్యనన్ = ఒప్పిదముగా; పొడగాంచి = కనుగొని; పశువు = బలిపశువు; మంచిది = బాగున్నది; అనుచున్ = అనుచూ; పట్టిరి = పట్టుకొనిరి; అతనిన్ = అతనిని.
భావము:- (భటులు) ఎంత వెదకినా ఆ వ్యక్తి కనిపించలేదు. చేలో ఒకచోట వీరాసనం వేసికొని పొలానికి కావలి కాస్తున్న బ్రాహ్మణ యోగి భరతుని చూచి నరబలికి తగినవాడని భావించి పట్టుకున్నారు.

తెభా-5.1-132-క.
రీతిని భూసురవరు
నాయ నా కాళికాగృమునకు భృత్యుల్
బోనఁ గొని చని సల్పిరి
చారుత రాభ్యంజనాది సంస్కారంబుల్.

టీక:- ఆ = ఆ; రీతిన్ = విధముగ; భూసుర = బ్రాహ్మణులలో; వరున్ = శ్రేష్ఠుని; ఆరయన్ = చూచి; ఆ = ఆ; కాళికా = కాళిక యొక్క; గృహమున్ = గుడి; కున్ = కి; భృత్యుల్ = సేవకులు; బోరనన్ = సందడిగా; కొని = తీసుకొని; చని = పోయి; సల్పిరి = చేసిరి; చారుతర = అతి మనోహరముగ {చారు - చారుతరము - చారుతమము}; అభ్యంజన = తలస్నానము; ఆది = మొదలగు; సంస్కారముల్ = సిద్దపరచుటలు.
భావము:- ఆ విధంగా సేవకులు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని కాళికాలయానికి తీసికొని వెళ్ళారు. తలంటి పోయడం మొదలైన బలి సంస్కారాలు చేశారు.

తెభా-5.1-133-వ.
ఇట్లభ్యంజనాది కృత్యంబులు దీర్చి నూతన వసనంబు గట్ట నిచ్చి గంధ పుష్పాభరణాక్షతాలంకృతునిం జేసి మృష్టాన్నంబులు భుజియింపం బెట్టి ధూపదీప మాల్యలాజకిసలయాంకుర ఫలోపహారాదులు సమర్పించి పంచమహావాద్య ఘోషంబులతోడ నా పురుషపశువుం గాళికాదేవి సమ్ముఖంబున నాసీనుం గావించి యా వృషలపతి పురుషపశువు రక్తంబున భద్రకాళి సంతోషపెట్టం దలంచి కాళికామంత్రాభిమంత్రితంబు నతికరాళంబు నైన ఖడ్గం బంది నిజాభీష్ట సిద్ధికి హింసింపం దలంచిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; నూతన = కొత్త; వసనంబున్ = బట్ట; కట్టన్ = కట్టుకొనుటకు; ఇచ్చి = ఇచ్చి; పుష్ప = పూల; ఆభరణ = ఆభరణములతో; అలంకృతునిన్ = అలంకరింపబడినవానిగా; చేసి = చేసి; మృష్ట = రుచికరములైన; అన్నంబులున్ = ఆహారములు; భుజియింపంబెట్టి = తినిపించి; ధూప = ధూపము; దీప = దీపము; మాల్య = మాలలు; లాజ = పేలాలు; కిసలయాంకుర = చివుళ్ళు; ఫల = పండ్లు; ఉపహార = ఫలహారములు; ఆదులున్ = మొదలగునవి; సమర్పించి = చక్కగాఇచ్చి; పంచమహావాద్య = పంచమహావాద్యముల {పంచమహావాద్యములు - 1. భేరి, 2. కాహళము, 3. పటహము, 4. శంఖము, 5. జయఘంట.}; ఘోషంబుల్ = గట్టి శబ్దముల; తోడన్ = తోటి; ఆ = ఆ; పురుష = నరుడైన; పశువున్ = బలిపశువు; కాళికాదేవి = కాళికాదేవి; సమ్ముఖంబునన్ = ఎదురుగా; ఆసీనుంగావించి = కూర్చుండ బెట్టి; ఆ = ఆ; వృషల = శూద్రుల; పతి = పెద్ద; పురుష = నరుడైన; పశువు = బలిపశువు; రక్తంబునన్ = రక్తముతో; భద్రకాళిన్ = భద్రకాళిని; సంతోషపెట్టన్ = సంతోషపెట్టవలె నని; తలంచి = భావించి; కాళికామంత్ర = కాళికాదేవి యొక్క మంత్రములతో; అభిమంత్రింతంబున్ = మంత్రింపబడినది; అతి = మిక్కిలి; కరాళంబున్ = భయంకరము; ఐన = అయినట్టి; ఖడ్గంబున్ = కత్తిని; అంది = అందుకొని; నిజ = తన; అభీష్ట = కోరిక; సిద్ధి = తీరుట; కిన్ = కోసము; హింసింపన్ = చంప; తలంచినన్ = అనుకొనుచుండగా.
భావము:- ఈ విధంగా భరతుణ్ణి అభ్యంజన స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి గంధం, పుష్పాలు, ఆభరణాలు, అక్షతలు మొదలైన వాటితో అలంకరించారు. మృష్టాన్నాదులు తినిపించారు. పూలదండలు, పేలాలు, చివుళ్ళు, పండ్లు మొదలైన ఉపహారాలు సమర్పించారు. 1. భేరి, 2. కాహళము, 3. పటహము, 4. శంఖము, 5. జయఘంట అనెడి పంచమహావాద్యాలను మ్రోగించారు. బలిపశువును కాళికాదేవి ఎదుట కూర్చోబెట్టారు. ఆ భిల్లరాజు నరబలి ఇచ్చి ఆ రక్తంతో భద్రకాళిని సంతోష పెట్టాలని భావించి, కాళికా మంత్రంతో మంత్రితమైన భయంకరమైన ఖడ్గాన్ని ధరించి తన కోరిక తీర్చుకొనడానికి ఆ భరతుణ్ణి హింసించడానికి సిద్ధపడగా…

తెభా-5.1-134-సీ.
ర్వభూతములకు ఖుఁడును బ్రహ్మభూ-
తాత్ముఁడు నిర్వైరుఁ యిన బ్రహ్మ
సుతుని తేజం బంతఁ జూడ దుస్సహమైన-
యమంది వడఁకుచు ద్రకాళి
క్రోదంబు ముమ్మడిగొనఁగ హుంకారంబు-
లుపుచు నట్టహాసంబు చేసి
పాపాత్ములును దౌష్ట్యరులును రాజస-
తామస కర్మ సంధాను లగుచు

తెభా-5.1-134.1-తే.
విప్రవరు నట్లు హింసించు వృషలపతిని
భృత్యువర్గంబుఁదోఁ దలల్ పృథ్విఁ గూల్చి
పుడు వృషలాధిపుని శిరమంది లీలఁ
బాడి యాడుచు నందంద క్రీ సలిపె.

టీక:- సర్వ = అఖిలమైన; భూతముల్ = ప్రాణుల; కున్ = కు; సఖుడున్ = స్నేహితుడు; బ్రహ్మభూత = పరబ్రహ్మయైన; ఆత్ముండున్ = ఆత్మగలవాడు; నిర్వైరుండు = వైరము లేనివాడు; అయిన = అయిన; బ్రహ్మసుతునిన్ = బ్రాహ్మణబాలునియొక్క; తేజంబున్ = తేజస్సును; అంతన్ = అంతట; చూడన్ = చూచుటకు; దుస్సహము = సహించుటకురానిది; ఐన = అయిన; భయమున్ = భయమును; అంది = చెంది; వడకుచున్ = వణికిపోతూ; భద్రకాళి = భద్రకాళి; క్రోధంబున్ = కోపము; ముమ్మడిగొనగన్ = ఎక్కువైపోగా {ముమ్మడిగొను - మూడురెట్లుగా పెరిగిపోవు}; హుంకారంబు = హూంకారము, హూమ్మనుశబ్దము; సలుపుచున్ = చేయుచూ; అట్టహాసంబున్ = వికృతముగానవ్వుటను; చేసి = చేసి; పాపత్ములును = పాపపు బుద్ధిగలవారు; దౌష్ట్యపరులును = దుర్మార్గముగలవారు; రాజస = రజోగుణములు; తామస = తమోగుణములుగల; కర్మ = పనులను; సంధానులు = తలపెట్టినవారు; అగుచున్ = అగుచూ.
విప్ర = బ్రాహ్మణ; వరున్ = శ్రేష్ఠుని; అట్లు = ఆ విధముగ; హింసించు = బాధించు; వృషల = శూద్రుల; పతిని = ప్రభువును; భృత్యు = సేవకుల; వర్గంబున్ = సమూహము; తోన్ = తోపాటు; తలల్ = శిరస్సులను; పృథ్విన్ = నేలపైన; కూల్చి = కూల్చివేసి; అపుడు = అప్పుడు; వృషల = శూద్రుల; అధిపుని = పెద్ద యొక్క; శిరమున్ = తలను; అంది = అందుకొని; లీలన్ = క్రీడగా; పాడి = పాడుచు; ఆడుచున్ = నాట్యముచేయుచూ; అందంద = అక్కడక్కడే; క్రీడన్ = ఆటలు; సలిపెన్ = ఆడెను.
భావము:- సర్వజీవరాసులకు మిత్రుడు, పరబ్రహ్మ స్వరూపుడు, వైరభావం లేనివాడు అయిన భరతుడి తేజస్సును చూచి భద్రకాళి భయపడి వణికిపోతూ, భరింపరాని కోపం ముప్పిరి గొనగా హుంకారంతో అట్టహాసం చేసింది. పాపాత్ములు, దుష్టులు, రాజోగుణ తామస గుణాల ప్రేరణతో బ్రాహ్మణుని హింసించే బోయరాజు మీద, అతని సేవకుల మీద విజృంభించింది. వారి తలలను నేల కూల్చింది. నాయకుడైన భిల్లరాజు శిరస్సు చేత పట్టుకొని ఆడుతూ పాడుతూ ఆనంద తాండవం చేసింది.

తెభా-5.1-135-క.
లోన నెవ్వరేనియు
ణీసురవరుల కెగ్గు గఁ దలచిన వా
యఁగఁ జెడుదురు; నిక్కము
రి ధరణీసురవరేణ్యు లం దుండుటచేన్.

టీక:- ధర = భూలోకము; లోనన్ = లోపల; ఎవ్వరు = ఎవరు; ఏనియున్ = అయినాసరే; ధరణీసుర = బ్రాహ్మణులలో; వరుల్ = శ్రేష్ఠుల; కున్ = కు; ఎగ్గు = కీడు; తగన్ = తగుల్కొని; తలచిన = భావించిన; వారు = వారు; అరయగన్ = పరిశీలించి చూడగా; చెడుదురు = చెడిపోవుదురు; నిక్కము = ఇది నిజము; హరి = నారాయణుడు; ధరణీసుర = బ్రాహ్మణ; వరేణ్యులు = శ్రేష్ఠుల; అందున్ = ఎడ; ఉండుటన్ = ఉండుట; చేన్ = చేత.
భావము:- బ్రాహ్మణులలో విష్ణువు ఉంటాడు. అందువల్ల లోకంలో ఎవరైనా సరే వారికి కీడు తలపెడితే తప్పక చెడిపోతారు.

తెభా-5.1-136-వ.
మఱియును.
టీక:- మఱియునున్ = ఇంకను.
భావము:- ఇంకా…

తెభా-5.1-137-ఉ.
చ్చట విప్రసూనుఁడు భయం బొకయించుకలేక చంపఁగా
చ్చిన వారియందుఁ గరవాలమునందును గాళియందుఁ దా
చ్చుతభావ ముంచి హృదయంబునఁ బద్మదళాక్షు నెంతయున్
చ్చికతోడ నిల్పి యనుమానము నొందక యుండె నెంతయున్.

టీక:- అచ్చటన్ = అక్కడ; విప్ర = బ్రాహ్మణ; సూనుడు = బాలుడు; భయంబున్ = భయము; ఒకయించుక = కొంచముకూడ; లేక = లేకుండగ; చంపగాన్ = చంపుటకు; వచ్చిన = వచ్చిన; వారిన్ = వారిని; అందున్ = అందు; కరవాలము = కత్తి; అందునున్ = అందు; కాళి = కాళికాదేవి; అందున్ = అందు; తాన్ = అతను; అచ్యుత = విష్ణువుగా; భావమున్ = భావమున; ఉంచి = ధరించి; హృదయంబునన్ = హృదయములో; పద్మాక్షున్ = విష్ణుని; ఎంతయున్ = ఎంతో, మిక్కిలి; మచ్చిక = ఆసక్తి; తోడన్ = తోటి; నిల్పి = నిలుపుకొని; అనుమానము = సంశయము; ఒందక = పడక; ఉండెన్ = ఉండెను; ఎంతయున్ = ఎంతగానో.
భావము:- ఆ బ్రాహ్మణ కుమారుడైన భరతుడు ఏమాత్రం భయపడకుండా తనను చంపడానికి వచ్చినవారిలోను, కత్తిలోను, కాళికాదేవిలోను అచ్యుత భావాన్నే ఉంచి. పద్మాక్షుడైన విష్ణువును మనస్సులో నిల్పుకొని, ఏమాత్రం అనుమానం లేకుండా నిశ్చలంగా ఉన్నాడు.

తెభా-5.1-138-వ.
మఱియు నా విప్రవరుండు చండికాగృహంబు వెలువడి క్రమ్మఱం జేని కావలి యుండు నెడ.
టీక:- మఱియున్ = ఇంకా; ఆ = ఆ; విప్ర = బ్రాహ్మణ; వరుండు = ఉత్తముడు; చండికా = కాళికాదేవి; గృహంబున్ = ఆలయము నుండి; వెలువడి = బయటకువచ్చి; క్రమ్మఱన్ = మరల; చేనిన్ = పొలమునకు; కావలి = కాపలా; ఉండున్ = ఉండెడి; ఎడన్ = సమయములో.
భావము:- తరువాత బ్రహ్మణ శ్రేష్ఠుడైన భరతుడు కాళికాలయం నుండి బయలుదేరి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి కాపలా కాస్తున్నాడు.