Jump to content

పోతన తెలుగు భాగవతము/పంచమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వనంబునకు జనుట

వికీసోర్స్ నుండి


తెభా-5.1-21-సీ.
"క్కట! యే నింద్రిములచేఁ గట్టంగఁ-
డియుండి యందులఁ బాయలేక
జ్ఞాన విరచితం గు సర్వవిషయము-
ను నంధకూపంబులందు నడఁగి
రుణుల కే వినోమృగంబనై యుంటి-
వి యెల్ల నే నొల్ల"నుచు రోసి
రికృపచే నప్పు బ్బిన యాత్మ వి-
ద్యను గల్గి తనవెంట రుగుదెంచు

తెభా-5.1-21.1-తే.
కొడుకులకు నెల్ల రాజ్యము గుదురు పఱచి
నదు పత్నుల దిగనాడి నము విడిచి
రివిహారంబు చిత్తంబునందు నిలిపి
రఁగ నల్లన నారదదవి కరిగె.

టీక:- అక్కట = అయ్యో; ఏన్ = నేను; ఇంద్రియముల్ = ఇంద్రియముల; చేన = చేత; కట్టంగబడి = బంధనములలో; ఉండి = ఉండిపోయి; అందులన్ = వాటినుండి; పాయలేక = విడువడలేక; అజ్ఞాన = అజ్ఞానముచే; విరచితంబున్ = ఏర్పరుపబడినవి; అగు = అయిన; సర్వ = సకలమైన; విషయముల్ = ఇంద్రియార్థ విషయములు; అను = అనెడు; అంధ = చీకటి; కూపంబుల్ = కూపములు; అందున్ = అందు; అడగి = అణగిపోయి; తరుణుల = స్త్రీల; కిన్ = కి; ఏన్ = నేను; వినోద = క్రీడా; మృగంబన్ = జంతువును; ఐ = అయ్యి; ఉంటిన్ = ఉంటిని; అవి = వాటిని; ఎల్లన్ = అన్నిటిని; నేన్ = నేను; ఒల్లన్ = అంగీకరించను; అనుచున్ = అనుచూ; రోసి = అసహ్యించుకొని; హరి = నారాయణుని; కృప = దయ; చేన్ = వలన; అప్పుడు = అప్పుడు; అబ్బిన = అబ్భినట్టి; ఆత్మవిద్య = ఆత్మవిద్యను; కల్గి = కలిగుండి; తన = తనకు; వెంటన్ = వెంటను; అరుగుదెంచు = వచ్చెడి.
కొడుకులను = పుత్రులను; ఎల్లన్ = అందరను; రాజ్యమున్ = రాజ్యమును; కుదురుపఱచి = స్థిరపరచి; తనదు = తనయొక్క; పత్నులన్ = భార్యలను; దిగనాడి = వదలిపెట్టి; ధనము = సంపదలను; విడిచి = వదలివేసి; హరి = నారాయణుని; విహారంబున్ = వర్తనను; చిత్తంబున్ = మనసు; అందు = లో; నిలిపి = నిలుపుకొని; పరగన్ = ప్రసిద్ధముగ; అల్లన = మెల్లగా; నారద = నారదుని; పదవి = స్థానము; కిన్ = కి; అరిగె = వెళ్ళెను.
భావము:- “అయ్యో! నేను ఇంద్రియాలకు కట్టుబడి ఆ బంధనాల నుండి తప్పించుకోలేక అజ్ఞానంతో నిండిన విషయసుఖాలనే చీకటినూతిలో పడిపోయాను. విలాసవతులైన సతులకు వినోదమృగంగా అయినాను. ఇక అటువంటి సుఖాలను నేను ఏమాత్రం ఇష్టపడను” అని ప్రియవ్రతుడు నిశ్చయించుకున్నాడు. శ్రీహరి దయవల్ల అబ్బిన ఆత్మవిద్యను అందుకున్నాడు. తనవెంట వచ్చిన కుమారులందరికీ వారి వారి రాజ్యాలను స్థిరపరిచి, భార్యలను పరిత్యజించి, ధనాన్ని వదలుకొని, చిత్తంలో శ్రీహరిని నిలుపుకొని గొప్పదైన నారదుని స్థాయికి చేరాడు.

తెభా-5.1-22-వ.
ఇట్లు దన రథమార్గంబులు సప్త ద్వీపసాగరంబులుగాఁ జేసి సూర్యునకుఁ బ్రతిసూర్యుండై సరిద్గిరివనాదులచే భూత నిర్వృత్తికొఱకుఁ బ్రతి ద్వీపంబునకు నవధులు గల్పించి ద్వీపవర్ష నిర్ణయంబులం బుట్టించి పాతాళ భూ స్వర్గాది సుఖంబులు నరకసమానంబులుగాఁ దలంచి విరక్తింబొంది నిరంతర భగవద్ధ్యాన విమలీకృతాశయుం డగుచు హరిభక్తి ప్రియుండయిన ప్రియవ్రతుని చరిత్రంబు లీశ్వరునకుఁ దక్క నన్యుల కెఱుంగఁ దరంబుగా; దతని మహిమంబులు నేడుఁనుం గొనియాడుదు"రని శుకుండు మఱియు నిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; తన = తన యొక్క; రథ = రథమువెళ్ళెడి; మార్గంబులున్ = దారులు; సప్త = ఏడు (7); ద్వీప = ద్వీపములు {సప్తద్వీపములు - 1జంబూ(జంబూద్వీపము) 2ప్లక్ష(ప్లక్షద్వీపము) 3శాల్మలిద్వీప(శాల్మలీద్వీపము) 4కుశ(కుశద్వీపము) 5క్రౌంచ(క్రౌంచద్వీపము) 6శాక(శాకద్వీపము) 7పుష్కరములు(పుష్కరద్వీపములు)}; సాగరంబులు = సముద్రములు {సప్తసముద్రములు - 1క్షార(కారపు సముద్రము) 2ఇక్షురస(చెరకురసముసముద్రము) 3సుర(సురాసముద్రము) 4ఆజ్య(నెయ్యిసముద్రము) 5క్షీర(పాలసముద్రము) 6దధి(పెరుగుసముద్రము) 7ఉదకంబులు(నీటిసముద్రము)}; కాన్ = అగునట్లు; సూర్యున్ = సూర్యుని; కున్ = కు; ప్రతి = రెండవ; సూర్యుండు = సూర్యుడు; ఐ = అయ్యి; సరిత్ = నదులు; గిరి = పర్వతములు; వన = అడవులు; ఆదులు = మొదలగువాని; చేన్ = చేత; భూత = జీవుల; నిర్వృత్తి = తృప్తి; కొఱకున్ = కోసము; ప్రతి = ప్రతి యొక్క; ద్వీపంబున్ = ద్వీపమున; కున్ = కు; అవధులు = హద్దులు; కల్పించి = ఏర్పరచి; ద్వీప = ద్వీపము; వర్ష = వర్షములు అనెడి; నిర్ణయంబులన్ = నిర్ణయములను; పుట్టించి = ఏర్పరచి; పాతాళ = పాతాళపు; భూ = భూలోకపు; స్వర్గ = స్వర్గలోకపు; ఆది = మొదలగు; సుఖంబులున్ = సుఖములను; నరక = నరకలోకపు బాధలతో; సమానంబులు = సమానమైనవి; కాన్ = అగునట్లు; తలంచి = భావించి; విరక్తిన్ = వైరాగ్యమును; పొంది = పొంది; నిరంతర = ఎడతెగని; భగవత్ = భగవంతుని; ధ్యాన = ధ్యానమువలని; విమలీకృత = స్వచ్ఛము చేయబడిన; ఆశయుండు = భావములు గలవాడు; అగుచున్ = అగుచూ; హరి = నారాయణుని ఎడల; భక్తి = భక్తి యందు; ప్రియుండు = ఇష్టము గలవాడు; అయిన = ఐనట్టి; ప్రియవ్రతునిన్ = ప్రియవ్రతుని యొక్క; చరిత్రంబున్ = చరితములు; ఈశ్వరున్ = ఈశ్వరుని; కున్ = కి; తక్క = తప్పించి; అన్యుల్ = ఇతరుల; కిన్ = కి; ఎఱుంగన్ = తెలిసికొన; తరంబు = సాధ్యము; కాదు = కాదు; అతని = అతని; మహిమంబులున్ = గొప్పదనములను; నేడునున్ = ఇప్పటికిని; కొనియాడుదురు = కీర్తించెదరు; అని = అని; శుకుండు = శుకుడు; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా ప్రియవ్రతుడు తన రథమార్గాలతో ఏడు ద్వీపాలను, ఏడు సముద్రాలను ఏర్పరచి; సూర్యునికి ప్రతిసూర్యుడుగా ప్రకాశించి; జీవరాసులకు తృప్తిని కలిగించడానికి నదులను, కొండలను, వనాలను సరిహద్దులుగా నిర్ణయించి; ద్వీపాలలో దేశవిభాగాలు కల్పించాడు. భూలోక, స్వర్గలోక, నాగలోక సుఖాలను నరకప్రాయంగా భావించి, విరక్తి పొందాడు. నిరంతరం భగవంతుని ధ్యానించడంతో నిర్మలమైన ఆశయాలు కలవాడై, హరిభక్తి పరాయణుడైన ప్రియవ్రతుని పవిత్ర చరిత్రను తెలుసుకోవడం ఈశ్వరునికి తప్ప మరెవ్వరికీ శక్యం కాదు. అతని మహిమలను జనులు నేటికీ కొనియాడుతున్నారు” అని చెప్పి శుక మహర్షి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-5.1-23-క.
"హరిసేవనా ప్రియవ్రతుఁ
యఁగఁ గైవల్యపదవి నందుట యరుదే?
రఁ జండాలుం డైనను
రి నామస్మరణఁ జెందు వ్యయపదమున్."

టీక:- హరి = నారాయణుని; సేవనా = సేవించుట యందు; ప్రియవ్రతుడు = ప్రీతినిష్ఠ కలవాడు; అరయన్ = తరచి చూసిన; కైవల్య = ముక్తి; పదవిన్ = స్థానమును; అందుట = అందుకొనుట; అరుదే = అపూర్వమా ఏమి; ధరన్ = భూమిపైన; చండాలుండు = నీచ జన్మ గలవాడు; ఐననున్ = అయినప్పటికిని; హరి = నారాయణ; నామ = నామమును; స్మరణన్ = స్మరించుటవలన; చెందున్ = పొందును; అవ్యయ = తరగని; పదమున్ = స్థితిని.
భావము:- “హరిసేవా ప్రభావం వల్ల ప్రియవ్రతుడు ముక్తిని అందుకొన్నాడంటే ఆశ్చర్యం ఏముంది? లోకంలో ఎంతటి చండాలుడైనా సరే, హరి చరణ స్మరణం వల్ల మోక్షపదవిని చేరుకోగలడు”.