పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము/పూర్ణి
పూర్ణి
←పురాణగ్రంథ సంఖ్యలు | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము) రచయిత: నారయ |
తెలుగు భాగవతము→ |
(తెభా-12-52-క.)[మార్చు]
జ నకసుతాహృచ్చోరా!
జ నకవచోలబ్దవిపినశైలవిహారా!
జ నకామితమందారా!
జ ననాదికనిత్యదుఃఖచయసంహారా!
(తెభా-12-53-మాలి.)[మార్చు]
జ గదవనవిహారీ! శత్రులోకప్రహారీ!
సు గుణవనవిహారీ! సుందరీమానహారీ!
వి గతకలుషపోషీ! వీరవర్యాభిలాషీ!
స్వ గురుహృదయతోషీ! సర్వదాసత్యభాషీ!
(తెభా-12-54-గ.)[మార్చు]
ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారయ నామధేయ ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబు నందు రాజుల యుత్పత్తియు, వాసుదేవ లీలావతార ప్రకారంబును, గలియుగధర్మ ప్రకారంబును, బ్రహ్మప్రళయ ప్రకారంబును, బ్రళయ విశేషంబులును, దక్షకునిచే దష్టుండై పరీక్షిన్మహారాజు మృతినొందుటయు, సర్పయాగం బును, వేదవిభాగక్రమంబును, బురాణానుక్రమణికయు, మార్కండేయో పాఖ్యానంబును, సూర్యుండు ప్రతిమాసంబును వేర్వేఱు నామంబుల వేర్వేఱు పరిజనంబులతో జేరుకొని సంచరించు క్రమంబును, తత్తత్పు రాణగ్రంథసంఖ్యలు నను కథలుగల ద్వాదశస్కంధము, శ్రీమహాభాగవత గ్రంథము సమాప్తము.
ఓం ఓం ఓం
ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
2016: :
గణనాధ్యాయి 13:23, 12 డిసెంబరు 2016 (UTC)