పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము/పురాణగ్రంథ సంఖ్యలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పురాణగ్రంథ సంఖ్యలు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము)
రచయిత: నారయ


(తెభా-12-48-వ.)[మార్చు]

మఱియు నష్టాదశపురాణంబు లందలి గ్రంథసంఖ్య లెట్లనిన బ్రహ్మపురాణంబు దశసహస్రగ్రంథంబు; పాద్మంబేఁ బదియైదువేలు; విష్ణుపురాణం బిరువదిమూఁడుసహస్రంబులు; శైవంబు చతుర్వింశతిసహస్రంబులు; శ్రీభాగవతం బష్టాదశసహస్రంబులు; నారదంబు పంచవింశతిసహస్రంబులు; మార్కండేయంబు నవసహస్రంబు; లాగ్నేయంబు పదియేనువేలనన్నూఱు; భవిష్యోత్తరంబు పంచశతాధికచతుర్దశసహస్రంబులు; బ్రహ్మకైవర్తం బష్టాదశసహస్రంబులు; లైగం బేకాదశసహస్రంబులు; వారాహంబు చతుర్వింశతిసహస్రంబులు; స్కాదం బెనుబదియొక్కవేల నూఱు; వామనంబు దశసహస్రంబులు; కౌర్మంబు సప్తదశసహస్రంబులు; మాత్స్యంబు చతుర్దశసహస్రంబులు; గారుడంబు పందొమ్మిది సహస్రంబులు; బ్రహ్మాండంబు ద్వాదశసహస్రంబు లిట్లు చతుర్లక్షగ్రంథ సంఖ్యాప్రమాణంబులం బ్రవర్తిల్లు నీ పదునెనిమిది పురాణంబుల మధ్యంబున నదుల యందు భాగీరథి విధంబున, దేవతల యందుఁ బద్మగర్భుని మాడ్కిఁ, దారకలందుఁ గళానిధి గరిమ, సాగరంబులందు దుగ్దార్ణవంబు చందంబున, నగంబులను హేమనగంబు భాతి, గ్రహంబుల విభావసుకరణి, దైత్యులందుఁ బ్రహ్లాదుని భంగి, మణులందుఁ బద్మరాగంబు రేఖ, వృక్షంబులందు హరిచందనతరువు రీతి, ఋషులందు నారదు మాడ్కి, ధేనువులందు గామధేనువు పోల్కి, సూక్ష్మంబులందు జీవుని తెఱంగున, దుర్జయంబు లందు మనంబు చొప్పున, వసువు లందు హవ్యవాహనుని పోఁడిమి, నాదిత్యులందు విష్ణువు కరణి, రుద్రుల యందు నీలలోహితుని రీతిని, బ్రహ్మలందు భ్రుగువు సొబగున, సిద్ధుల యందుఁ గపిలుని లీల, నశ్వంబులందుఁ నుచ్ఛైశ్శ్రవంబులాగున, దర్వీకరంబులందు వాసుకి రూపంబున, మృగములందుఁ గేసరి చెలువున, నాశ్రమంబులందు గృహస్థాశ్రమంబు క్రియ, వర్ణంబులలో నోంకారంబు నిరువున, నాయుధంబులఁ గార్ముకంబు సోయగంబున, యజ్ఞంబుల జపయజ్ఞంబు చాడ్పున, వ్రతంబులం దహింస కరణి, యోగంబు లందాత్మయోగంబు రమణ, నోషధుల యందు యవల సొబగున, భాషణంబులందు సత్యంబు ఠేవ, ఋతువులందు వసంతంబు ప్రౌఢి, మాసంబులందు మార్గశీర్షంబు మహిమ, యుగంబులందుఁ గృతయుగంబు నోజఁ దేజరిల్లు; నిట్టి భాగవతపురాణంబు పఠియించి విష్ణుసాయుజ్యంబుఁ జెందుదు; రని మఱియు నిట్లనియె.

(తెభా-12-49-క.)[మార్చు]

లాగమార్థ పారగుఁ
' లంక గుణాభిరాముఁ డంచిత బృందా
వంద్య పాదయుగుఁ డగు 'శు యోగికి వందనంబు సొరిది నొనర్తున్.

(తెభా-12-50-సీ.)[మార్చు]

కలగుణాతీతు ర్వజ్ఞు సర్వేశు;
ఖిలలోకాధారు, నాదిదేవుఁ
రమదయారసోద్భాసితుఁ ద్రిదశాభి;
వందిత పాదాబ్జు నధిశయను
నాశ్రితమందారు నాద్యంతశూన్యుని;
వేదాంతవేద్యుని విశ్వమయునిఁ
గౌస్తుభ శ్రీవత్స మనీయవక్షుని;
శంఖ చక్ర గదాసి శార్ఙ్గధరుని

(తెభా-12-50.1-తే.)[మార్చు]

శోభనాకారుఁ బీతాంబరాభిరాము
త్నరాజితమకుటవిభ్రాజమానుఁ
బుండరీకాక్షు మహనీయ పుణ్యదేహుఁ
లతు నుతియింతు దేవకీనయు నెపుడు.

(తెభా-12-51-మ.)[మార్చు]

ని యీ రీతి నుతించి భాగవత మాద్యంతంబు సూతుండు సె
ప్పి సంతుష్టమనస్కు లై విని మునుల్ ప్రేమంబునం బద్మనా
భు నిఁ జిత్తంబున నిల్పి తద్గుణములన్ భూషించుచున్ ధన్యులై
ని రాత్మీయ నికేతనంబులకునుత్సాహంబు వర్ధిల్లఁగన్.

21-05-2016: :

గణనాధ్యాయి 13:21, 12 డిసెంబరు 2016 (UTC)