పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పోతన తెలుగు భాగవతము
ద్వాదశ స్కంధము

ఉపోద్ఘాతము

(తెభా-12-1-క.)[మార్చు]

శ్రీ రుదశనపతిశయన!
'కా మితమునిరాజయోగిల్పద్రుమ! యు
ద్ధా మ! ఘనజనకవరనృప
'జా మాతృవరేశ! రామచంద్రమహీశా!

(తెభా-12-2-వ.)[మార్చు]

మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుండు వాసుదేవ నిర్యాణ పర్యంతంబుఁ దజ్జన్మ కర్మంబులు సెప్పిన విని సంతసంబంది యన్నరపాలపుంగవుండు “మహాత్మా! నారాయణ కథా ప్రపంచంబును, దద్గుణంబులును, నాచారవిధియును, జీవాత్మభేదంబును, హరిపూజావిధానంబును, జ్ఞానయోగప్రకారంబు ననునవి మొదలైనవి యెఱింగించి విజ్ఞానవంతుగాఁ జేసి మన్నించితి; వింక భావి కార్యంబు లన్నియు నెఱింగింపు” మనిన శుకుండు రాజున కిట్లనియె.

(తెభా-12-3-క.)[మార్చు]

వర! యీ ప్రశ్నమునకు
' రి సెప్పఁగ రాదు; నేను సామర్థ్యముచేఁ
రికించి నీకుఁ జెప్పదఁ
' మొప్పఁగ భావికాలతులన్ వరుసన్.

21-05-2016: :

గణనాధ్యాయి 12:55, 12 డిసెంబరు 2016 (UTC)