పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/పూర్ణి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పూర్ణి

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


(తెభా-11-125-క.)[మార్చు]

రా జీవసదృశనయన! వి
'రా జితసుగుణా! విదేహరాజవినుత! వి
భ్రా జితకీర్తి సుధావృత
'రా జీవభవాండభాండ! ఘుకులతిలకా!

(తెభా-11-126-మాలి.)[మార్చు]

ణిదుహితృరంతా! ర్మమార్గానుగంతా!
ని రుపమనయవంతా! నిర్జరారాతిహంతా!
గు రుబుధసుఖకర్తా! కోసలక్షోణిభర్తా!
సు భయపరిహర్తా! సూరిచేతోవిహర్తా!

(తెభా-11-127-గ.)[మార్చు]

ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్త్ర సహజపాండిత్య పోతనామాత్యప్రియశిష్య వెలిగందల నారయ నామధేయ ప్రణీతంబైన శ్రీమహాభాగవతంబను మహాపురాణంబు నందుఁ గృష్ణుండు భూభారంబు వాపి యాదవుల కన్యోన్య వైరానుబంధంబుఁ గల్పించి, వారల హతంబు గావించుటయు, విదేహర్షభ సంవాదంబును, నారాయణ ముని చరిత్రంబును, నాలుగు యుగంబుల హరి నాలుగువర్ణంబులై వర్తించుటయు, బ్రహ్మాది దేవతలు ద్వారకానగరంబునకుం జని కృష్ణుం బ్రార్థించి నిజపదంబునకు రమ్మనుటయు, నవధూత యదు సంవాదంబును, నుద్ధవునకుఁ గృష్ణుం డనేకవిధంబు లైన యుపాఖ్యానంబు లెఱింగించుటయు, నారాయణప్రకారం బంతయు దారకుం డెఱింగివచ్చి ద్వారకానివాసులకుం జెప్పుటయుఁ, గృష్ణుండు దన దివ్యతేజంబుతోఁ బరమాత్మం గూడుటయు నను కథలు గల యేకాదశ స్కంధము.

21-05-2016: :

గణనాధ్యాయి 12:53, 12 డిసెంబరు 2016 (UTC)