Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/జలక మాడించుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-189-తే.
పాపనికి నూనెఁ దలయంటి, సుపుఁ బూసి,
బోరుకాడించి, "హరిరక్ష పొ"మ్మటంచు
లము లొక కొన్ని చుట్టి రాఁల్లి, తొట్ల
నునిచి, దీవించి, పాడి ర య్యువిద లెల్ల.

టీక:- పాపని = బాలుని; కిన్ = కి; నూనెన్ = చమురు పెట్టి; తలయంటి = అభ్యంగన స్నానము చేయించి; పసుపు = పసుపును; పూసి = రాసి; బోరుకాడించి = పిల్లవానికి బోరున నీళ్ళు పోసి; హరి = శ్రీహరే; రక్ష = అండ; పొమ్ము = కావలెను; అంచున్ = అనుచు; జలములు = నీళ్ళు; ఒకకొన్ని = కొంచెము; చుట్టి = చూట్టూరాతిప్పి; రాన్ = వచ్చునట్లు; జల్లి = చల్లి; తొట్లన్ = ఉయ్యాల యందు; ఉనిచి = ఉంచి, పడుకోబెట్టి; దీవించి = ఆశీర్వదించి; పాడిరి = పాటలు పాడిరి; ఉవిదలు = పడతులు; ఎల్లన్ = అందరు.
భావము:- గోపికలు అందరూ కలసి ఆ బాలుడి తలకు నూనె అంటి శరీరానికి పసుపు రాసారు. శుభ్రంగా స్నానం చేయించారు. చివరగా బోరున నీళ్ళు పోసి, “ఇదే నీకు శ్రీరామరక్ష” అని కొన్ని నీళ్ళు చుట్టూ త్రిప్పి చల్లారు. ఊయల తొట్టెలలో పడుకోబెట్టి దీవించారు; ఇలా జోల పాటలు పాడేరు.

తెభా-10.1-190-క.
"జోజో కమలదళేక్షణ!
జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా!
జోజో పల్లవకరపద!
జోజో పూర్ణేందువదన! జోజో"యనుచున్.

టీక:- జోజో = బజ్జో నాయనా బజ్జో; కమల = తామర; దళ = రేకులవంటి; ఈక్షణ = కన్నులు కలవాడా; జోజో = బజ్జో నాయనా బజ్జో; మృగరాజ = సింహము వంటి; మధ్య = నడుము కలవాడా; జోజో = బజ్జో నాయనా బజ్జో; కృష్ణా = నల్లనయ్యా {కృష్ణుడు - సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహములు అనెడి పంచకృత్యములు చేయువాడు, శ్రీకృష్ణుడు}; జోజో = బజ్జో నాయనా బజ్జో; పల్లవ = చిగురుటాకులవంటి; కర = చేతులు; పద = పాదములు కలవాడా; జోజో = బజ్జో నాయనా బజ్జో; పూర్ణ = నిండు; ఇందు = చంద్రుని వంటి; వదన = మోము కలవాడా; జోజో = బజ్జో నాయనా బజ్జో; అనుచున్ = అనుచు.
భావము:- గోపికలు చిన్నికృష్ణునికి శుభ్రంగా స్నానం చేయించి, నిద్రపుచ్చుతు – "జోజో కమలదళేక్షణ! జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా! జోజో పల్లవకరపద! జోజో పూర్ణేందువదన! జోజో"అంటు జోలపాటలు పాడారు.

తెభా-10.1-191-వ.
ఇ వ్విధంబున.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగా.
భావము:- ఈ విధంగా. . . .

తెభా-10.1-192-క.
లు తోయంబులు జగములఁ
లు తోయములందు ముంచి, భాసిల్లెడి యా
లుతోయగాఁడు, వల్లవ
నా కరతోయములఁ జెలంగుచుఁ దడియున్.

టీక:- పలు = అనేక; తోయంబులున్ = మారులు; జగములన్ = భువనములను; పలు = అధికములైన (ప్రళయ); తోయములు = జలముల (సముద్రముల); అందున్ = లో; ముంచి = ముంచేసి; భాసిల్లెడు = ప్రకాశించెడి; ఆ = ప్రసిద్ధుడైనట్టి; పలు = బహు; తోయగాడు = విధములు కలవాడు; వల్లవ = గోపికా; లలనా = స్త్రీల; కర = చేతులతో పోయబడెడి; తోయములన్ = నీళ్ళలో; చెలంగుచున్ = చెలరేగుచు; తడియున్ = తడిసెను.
భావము:- ఎన్నెన్నో ప్రళయసమయాలలో ఎన్నోమార్లు జగత్తులను నీటిలో ముంచివేసి తాను ప్రకాశిస్తూ ఉండే ఆ మాయలాడు గోపికల చేతుల్లో జలకాలాడుతూ కేరింతలు కొడుతూ ఆడుకున్నాడు.

తెభా-10.1-193-క.
లోములు నిదుర వోవఁగ
జోకొట్టుచు, నిదురవోని సుభఁగుడు, రమణుల్
జోకొట్టి పాడ, నిదురం
గైకొను క్రియ నూరకుండెఁ ను దెఱవకయున్.

టీక:- లోకములున్ = ఎల్లలోకులను; నిదురవోవగన్ = నిద్రించేలాగ; జోకొట్టుచున్ = నిద్రపుచ్చుతు; నిదురవోని = ఏమరుపాటు పొందని; సుభగుడు = అందగాడు; రమణుల్ = సుందరీమణులు; జోకొట్టి = నిద్రపుచ్చి; పాడన్ = పాటలు పాడగా; నిదురన్ = నిద్రను; కైకొను = స్వీకరించుతున్న; క్రియన్ = అనిపించునట్లు; ఊరకుండెన్ = కదలక మెదలక ఉండెను; కను = కళ్ళు; తెఱవకయున్ = తెరవకుండా.
భావము:- లోకాలన్నింటినీ జోకొట్టి నిదురపుచ్చుతూ తాను మాత్రం మెలకువగా ఉండే ఆ అందగాడు, గోపికలు జోకొడుతూ ఉంటే నిద్రపోయినట్లు కనులు తెరవకుండా కదలకుండా పడుకున్నాడు.

తెభా-10.1-194-సీ.
బాము లెఱుగక యేపారు మేటికిఁ-
సుల కాపరియింటఁ బాము గలిగె;
నే కర్మములు లేక యెనయు నెక్కటికిని-
జాత కర్మంబులు సంభవించె;
నే తల్లి చనుఁబాలు నెఱుఁగని ప్రోడ, య-
శోద చన్నుల పాల చొరవ నెఱిఁగె;
నే హాని వృద్ధులు నెఱుఁగని బ్రహ్మంబు-
పొదిఁగిటిలో వృద్ధిఁ బొందఁ జొచ్చె;

తెభా-10.1-194.1-తే.
నే తపములనైన నెలమిఁ బండనిపంట
ల్లవీ జనముల వాడఁ బండె;
నే చదువుల నైన నిట్టిట్టి దనరాని
ర్థ మవయవముల నంద మందె.

టీక:- ఏ = ఎట్టి; బాములున్ = పుట్టుకలు; ఎఱుగక = ఎప్పుడు లేకుండగ; ఏపారు = అతిశయించెడి; మేటి = గొప్పవాని; కిన్ = కి; పసులకాపరి = ఆవులుకాసే గొల్లల; ఇంటన్ = ఇంట్లో; బాము = పుట్టుట; కలిగెన్ = సంభవించెను; ఏ = ఏవిధమైన; కర్మములు = కర్మలు; లేక = అంటక; ఎనయు = పొందిక కలిగిన; ఎక్కటి = ఒంటరి; కినిన్ = కి; జాతకర్మంబులు = పుట్టినప్పుడు చేయుక్రియ; సంభవించెన్ = పొందెను; ఏ = ఏవిధమైన; తల్లి = మాతృమూర్తి; చను = స్తనముల; పాలున్ = క్షీరమును; ఎఱుగని = తెలియని; ప్రోడ = నిపుణుడు; యశోద = యశోద యొక్క; చన్నుల = స్తనముల; పాలన్ = క్షీరమునందు; చొరవన్ = ఆసక్తిని; ఎఱిగెన్ = చూసెను; ఏ = ఎటువంటి; హాని = కీడు; వృద్ధులున్ = మేలు; ఎఱుగని = ఏమాత్రము లేని; బ్రహ్మంబు = పరబ్రహ్మ; పొదిగిటి = ఒడి; లోన్ = అందు; వృద్ధిన్ = వర్ధిల్లుటను; పొందజొచ్చెన్ = పొందసాగెను; ఏ = ఎట్టి.
తపములన్ = తపస్సులను; ఐనన్ = అయినప్పటికి; ఎలమిన్ = వికసించి; పండని = ఫలించని; పంట = పరమపదము; వల్లవీ = గోపికాస్త్రీ; జనముల = జనముల యొక్క; వాడన్ = పల్లెలో; పండెన్ = పండుకొనెను, ఫలించెను; ఏ = ఎటువంటి; చదువులన్ = విద్యల వలన; ఐనన్ = అయినప్పటికి; ఇట్టిట్టిది = అలాంటిది ఇలాంటిది; అనరాని = అని చెప్ప సాధ్యము కాని; అర్థము = పదార్థము; అవయవములన్ = కరచరణాదు లందు; అందము = అందమును; అందెన్ = పొందెను.
భావము:- దుఖాలు అనేవి ఎరుగని మహాత్మునికి పశువుల కాపరుల ఇంట పుట్టి బాధలలో పెరుగవలసిన స్థితి వచ్చింది; కర్మలనేవి లేకుండా తానొక్కడే ప్రకాశించే విష్ణువు జాతకర్మలు చేయించుకున్నాడు; తానే జగత్తుకు తల్లితండ్రి అయి తల్లిపాలు ఎరుగనివాడు నేడు యశోదాదేవి చనుబాల రుచి మరిగాడు. పెరుగుట తరుగుట అనేవి యెరుగని పరబ్రహ్మము ఈనాడు యశోద ఒడిలో పెరగసాగాడు. ఎన్ని తపస్సులు చేసినా పండని బంగారుపంట నేడు గోపకుల వ్రేపల్లె వాడలో కన్నులపండువగా పండింది. ఎన్ని చదువులు శాస్త్రాలు చదువుకున్నా ఇలా ఉంటుంది అని తెలియరాని ఆ పరమార్ధం అందాలుచిందే బాలుని అవయవా లన్నింటిలోనూ అభివ్యక్తం కాసాగింది.

తెభా-10.1-195-మ.
చెయువుల్ జేయుతఱిన్ విధాతకరణిం జెన్నొందు, సంతోష దృ
ష్టి యుతుండై నగుచున్ జనార్దనుని మాడ్కిం బొల్చు, రోషించి యు
న్న యెడన్ రుద్రునిభంగి నొప్పును, సుఖానందంబునం బొంది త
న్మయుడై బ్రహ్మముభాతి బాలుఁ డమరు న్బాహుళ్య బాల్యంబునన్.

టీక:- చెయువుల్ = పాకుట పలుకుటాది చేష్టలు; చేయు = చేయ మొదలిడెడి; తఱిన్ = సమయము నందు; విధాత = బ్రహ్మదేవుని; కరణిన్ = విధముగా; చెన్నొందున్ = ఒప్పును; సంతోష = ఆనందపు; దృష్టి = చూపులతో; యుతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; నగుచున్ = నవ్వుతూ; జనార్దనుని = విష్ణుమూర్తి; మాడ్కిన్ = వలె; పొల్చున్ = పోలియుండును; రోషించి = కోపగించి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయము నందు; రుద్రుని = పరమశివుని; భంగిన్ = వలె; ఒప్పును = చక్కగా ఉండును; సుఖ = సుఖములవలన; ఆనందంబున్ = సంతోషమును; పొంది = పొంది; తన్మయుడు = పరవశము పొందినవాడు; ఐ = అయ్యి; బ్రహ్మము = పరబ్రహ్మ; భాతిన్ = వలె; బాలుడు = పిల్లవాడు; అమరున్ = చక్కగా అమరి ఉండును; బాహుళ్య = గొప్ప; బాల్యంబునన్ = బాల్యావస్థ అందు.
భావము:- ఆ చిన్నికృష్ణుడు బాల్యచేష్టలు చేస్తూ క్రొత్త క్రొత్త లీలలు ప్రకటించే టప్పుడు సృష్టికర్త యైన బ్రహ్మదేవుడివలె ప్రకాశిస్తాడు. సంతోషం నిండిన చూపులతో ఉన్నప్పుడు విష్ణువువలె కనిపిస్తాడు. కోపంవచ్చి రోషం తెచ్చుకున్న సమయంలో రుద్రునివలె భయం గొలుపుతాడు. ఆనందంతో తన్మయుడు అయినప్పుడు పరబ్రహ్మములాగా గోచరిస్తాడు. ఈవిధంగా ఎన్నోరీతులతో బాలకృష్ణుని బాల్యం గడుస్తున్నది.

తెభా-10.1-196-వ.
అ య్యవసరంబున
టీక:- అయ్యవసరంబునన్ = అప్పుడు.
భావము:- అప్పుడు . . .

తెభా-10.1-197-ఆ.
కొడుకుఁ గన్న వేడ్క కొనసాగ రోహిణిఁ
జీరఁబంచి, చిత్రచేలములను
మండనముల నిచ్చి, న్నించె, నందుఁ డా
యంబుజాక్షి ప్రీతయై చరించె.

టీక:- కొడుకున్ = పుత్రుని; కన్న = ప్రసవించిన; వేడ్కన్ = సంతోషము; కొనసాగన్ = కలకాలము ఉండుటకు; రోహిణిన్ = రోహిణీదేవిని; చీరబంచి = పిలిపించి; చిత్ర = నానావిధ రంగులతో చిత్రించిన; చేలములన్ = వస్త్రములను; మండనములన్ = ఆభరణములను; ఇచ్చి = బహూకరించి; మన్నించెన్ = గౌరవించెను; నందుండు = నందుడు; ఆ = ఆ; అంబుజాక్షి = పద్మాక్షి, పడతి; ప్రీత = సంతోషించినది; ఐ = అయ్యి; చరించెన్ = వర్తించెను.
భావము:- నందుడు తాను కొడుకును కన్న సంబరంలో రోహిణీదేవిని పిలిపించాడు రంగురంగుల చీరలను ఆభరణాలను బహుకరించి గౌరవించినాడు. ఆమె చాలా సంతోషించింది.