పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పూర్ణి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పూర్ణి

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పూర్ణి)
రచయిత: పోతన


(తెభా-10.2-1340-చ.)[మార్చు]

' సిజపత్త్రనేత్ర! రఘుత్తమ! దుష్టమదాసురేంద్రసం
' ణ! దయాపయోధి! జనకాత్మభవాననపద్మమిత్ర! భా
'స్క కులవార్ధిచంద్ర! మిహికావసుధాధరసూతిసన్నుత
'స్ఫు రితచరిత్ర! భక్తజనపోషణభూషణ! పాపశోషణా!

(తెభా-10.2-1341-క.)[మార్చు]

మా రీచభూరిమాయా
'నీ రంధ్రమహాంధకారనీరేజహితా!
క్ష్మా మణవినుతపాదాం
'భో రుహ! మహితావతార! పుణ్యవిచారా!

(తెభా-10.2-1342-మాలి.)[మార్చు]

' ధిమదవిరామా! ర్వలోకాభిరామా!
'సు రిపువిషభీమా! సుందరీలోకకామా!
' ణివరలలామా! తాపసస్తోత్రసీమా!
'సు చిరగుణధామా! సూర్యవంశాబ్ధిసోమా!

(తెభా-10.2-1343-గ.)[మార్చు]

ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బైన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందుఁ బ్రద్యుమ్న జన్మంబును, శంబరోద్యోగంబును, సత్రాజిత్తునకు సూర్యుండు శమంతకమణి నిచ్చు టయుఁ దన్నిమిత్తంబునం ప్రసేనుని సింహంబు వధియించుటయు, దాని జాంబవంతుండు దునిమి మాణిక్యంబు గొనిపోవుటయు, గోవిందుండు ప్రసేనుని దునిమి మణిఁ గొనిపోయె నని సత్త్రాజిత్తు కృష్ణునందు నింద నారోపించుటయుఁ, గృష్ణుండు దన్నిమిత్తంబున జాంబవంతునిం దొడరి మణియుక్తంబుగా జాంబవతిం గొనివచ్చి వివాహం బగుటయు, సత్త్రాజిత్తునకు మణి నిచ్చుటయు, సత్యభామా పరిణయంబును, బాండవులు లాక్షాగృహం బున దగ్ధులైరని విని వాసుదేవుండు బలభద్ర సహితుం డయి హస్తినాపురంబున కరుగుటయు, నక్రూర కృతవర్మల యనుమతంబున శతధన్వుండు సత్త్రాజిత్తుఁ జంపి మణిఁ గొనిపోవుటయుఁ, దదర్థం బా సత్యభామ కరినగరంబున కేగి కృష్ణునకు విన్నవించిన నతండు మరలి చనుదెంచి శతధన్వుం ద్రుంచుటయు, బలభద్రుండు మిథిలానగరంబునకుం జనుటయు, నందు దుర్యోధనుండు రామునివలన గదావిద్య నభ్యసించుటయుఁ, గృష్ణుండు సత్రాజిత్తునకుం బరలోకక్రియలు నడపుటయు, శమంతకమణిం దాఁచిన వాఁడయి యక్రూరుండు భయంబున ద్వారకానగరంబు విడిచిపోయిన నతని లేమి ననావృష్టి యైనం గృష్ణుం డక్రూరుని మరల రప్పించుటయు, దామోదరుం డింద్రప్రస్థపురంబున కరుగుటయు, నం దర్జున సమేతుం డయి మృగయావినోదార్థం బరణ్యంబునకుం జని, కాళిందిం గొనివచ్చుటయు, ఖాండవ దహనంబును, నగ్నిపురుషుం డర్జునునకు నక్షయతూణీర గాండీవ కవచ రథ రథ్యంబుల నిచ్చుటయు, మయుండు ధర్మరాజునకు సభ గావించి యిచ్చుటయు, నగధరుండు మరలి నిజనగరంబున కరుగుదెంచి కాళిందిని వివాహంబగుటయు, మిత్రవిందా నాగ్నజితీ భద్రా మద్ర రాజకన్యలం గ్రమంబునఁ గరగ్రహణం బగుటయు, నరకాసుర యుద్ధంబును, దద్గృహంబున నున్న రాజకన్యకలం బదాఱువేలం దెచ్చుటయు, స్వర్గగమనంబును, నదితికిం గుండలంబు లిచ్చు టయుఁ, బారిజాతాపహరణంబును, బదాఱువేల రాజకన్యలం బరిణయం బగుటయు, రుక్మిణీదేవి విప్రలంభంబును, రుక్మిణీ స్తోత్రంబును, గృష్ణకుమారోత్పత్తియుఁ, దద్గురు జనసంఖ్యయుఁ, బ్రద్యుమ్ను వివాహంబును, ననిరుద్ధు జన్మంబును, దద్వివాహార్థంబు కుండిననగరంబునకుం జనుటయు, రుక్మి బలభద్రుల జూదంబును, రుక్మి వధయు, నుషాకన్య యనిరుద్ధుని స్వప్నంబునం గని మోహించుటయుఁ, ద న్నిమిత్తంబునఁ, జిత్రరేఖ సకలదేశ రాజులఁ బటంబున లిఖించి చూపి యనిరుద్ధునిఁ దెచ్చుటయు, బాణాసుర యుద్ధంబును, నృగోపాఖ్యానంబును, బలభద్రుని ఘోష యాత్రయుఁ, గాళింది భేదనంబును, గృష్ణుండు పౌండ్రక వాసుదేవ కాశీరాజుల వధించుటయుఁ, గాశీరాజపుత్రుం డయిన సుదక్షిణుం డభిచారహోమంబు గావించి కృత్యం బడసి కృష్ణుపాలికిం బుత్తెంచిన సుదర్శనంబుచేతఁ గృత్యను సుదక్షిణ సహితం బుగాఁ గాశీపురంబును భస్మంబు సేయుటయు, బలరాముండు రైవతనగరంబు నందు ద్వివిదుండను వనచరుని వధియించుటయు, సాంబుండు దుర్యోధనుకూఁతు రగు లక్షణ నెత్తికొనివచ్చినఁ గౌరవు లతనిం గొనిపోయి చెఱఁబెట్టుటయుఁ, దద్వృత్తాంతం బంతయు నారదువలన విని బలభద్రుండు నాగనగరంబునకుఁ జనుటయుఁ, గౌరవు లాడిన యగౌరవవచనంబులకు బలరాముండు కోపించి హస్తినాపురంబును గంగం బడఁద్రోయ గమకించుటయుఁ, గౌరవులు భయంబున నంగనాయుక్తంబుగా సాంబునిం దెచ్చియి చ్చుటయు, బలభద్రుండు ద్వారకానగరంబునకు వచ్చుటయు, నారదుండు హరి పదాఱువేల కన్యకల నొకముహూర్తంబున నంద ఱకన్ని రూపులై వివాహంబయ్యె నని విని తత్ప్రభావంబు దెలియంగోరి యరుగుదెంచుటయుఁ, దన్మాహాత్మ్యంబు సూచి మరలి చనుటయు, జరాసంధునిచేత బద్ధు లైన రాజులు కృష్ణు పాలికి దూతం బుత్తెంచుటయు, నారదాగమనంబును, బాండవుల ప్రశంసయును, నుద్ధవ కార్యబోధంబును, నింద్రప్రస్థాగమనంబును, ధర్మరాజు రాజసూయారంభంబును, దిగ్విజయంబును, జరాసంధ వధయును, రాజ బంధమోక్షణంబును, రాజసూయంబు నెఱవేర్చుటయును, శిశుపాల వధయును, నవభృథంబును, రాజసూయ వైభవదర్శ నాసహమాన మానసుం డయి సుయోధనుండు మయనిర్మిత సభామధ్యంబునం గట్టిన పుట్టంబులు దడియం ద్రెళ్ళుటయుఁ, దన్నిమిత్తపరిభవంబు నొంది రారాజు నిజపురి కరుగుటయుఁ, గృష్ణుండు ధర్మరాజ ప్రార్థితుం డయి యాదవుల నిలిపి కొన్ని నెలలు ఖాండవప్రస్థంబున వసియించుటయు, సాళ్వుండు దపంబు సేసి హరుని మెప్పించి సౌభకాఖ్యం బగు విమానంబు వడసి నిజసైన్య సమేతుండై ద్వారకానగరంబు నిరోధించుటయు, యాదవ సాళ్వ యుద్ధంబును, గృష్ణుండు మరలి చనుదెంచి సాల్వుం బరిమార్చుటయును, దంతవక్త్ర వధయును, విదూరథ మరణంబును, గృష్ణుండు యాదవ బల సమేతుండై క్రమ్మఱ నిజపురంబునకుం జనుటయును, గౌరవ పాండవులకు యుద్ధం బగునని బలదేవుండు తీర్థయాత్ర సనుటయు, నందు జాహ్నావీప్రముఖ నదులం గృతస్నానుం డయి నైమిశారణ్యంబు నకుం జనుటయు, నచ్చటి మునులు పూజింపం బూజితుం డయి తత్సమీపంబున నున్నతాసనంబున నుండి సూతుండు దన్నుం గని లేవకున్న నలిగి రాముండు గుశాగ్రంబున నతని వధించుటయు, బ్రహ్మహత్యా దోషంబు గలిగె నని మునులు వలికిన సూతుం బునర్జీవితుం జేయుటయు, నమ్మునులకుం బ్రియంబుగాఁ గామపాలుం డిల్వల సుతుండగు పల్వలుం బరిమార్పుటయు, వారిచేత ననుమతుం డయి హలధరుండు దత్సమీప తీర్థంబుల స్నాతుం డయి గంగా సాగర సంగమంబునకుం జనుటయు, మహేంద్రనగ ప్రవేశంబును, బరశురామ దర్శనంబును, సప్త గోదావరిం గ్రుంకుటయు, మఱియు మధ్యదేశంబునంగల తీర్థంబులాడి శ్రీశైల వేంకటాచలంబులు దర్శించుటయు, వృషభాద్రి హరి క్షేత్ర సేతుబంధ రామేశ్వరములం గని తామ్రపర్ణీ తీర్థంబు లాడుటయు, గోదానంబు లొనరించి మలయగిరి యందు నగస్త్యునిం గనుటయు, సముద్రకన్యా దుర్గాదేవుల నుపాసించుటయు, నందు బ్రాహ్మణజనంబువలనం బాండవ ధార్తరాష్ట్ర భండనంబున సకల రాజలోకంబును మృతి నొంది రని వినుటయు, వాయునందన సుయోధనులు గదా యుద్ధసన్నద్ధు లగుట విని వారిని వారించుటకై, రౌహిణేయుం డందుల కరుగుటయు, నచట వారిచేతం బూజితుండయి వారిని వారింప లేక మగిడి ద్వారక కరుగుటయుఁ, గొన్ని వాసరంబులకు మరల నైమిశారణ్యంబునకుం బోయి యచట యజ్ఞంబు సేసి రేవతియుం దానును నవభృథంబాడి నిజపురంబున కేతెంచుటయుఁ, గుచేలోపాఖ్యానంబును, సూర్యోపరాగంబునం గృష్ణుఁడు రామునితోఁ జేరి పురరక్షణంబునకుఁ బ్రద్యుమ్నాది కుమారుల నిలిపి షోడశసహస్రాంగనా పరివృతుండయి యక్రూర వసుదేవోగ్రసేనాది యాదవ వీరులు దోడరా శమంతపంచక తీర్థంబున కరిగి కృతస్నానుండయి వసియించి యుండుటయుఁ, బాండవకౌరవాది సకల రాజలోకంబును దత్తీర్థంబునకు వచ్చుటయుఁ, గుంతీదేవి దుఃఖంబును, నందయశోదా సహితు లైన గోపగోపి జనంబులు చనుదెంచుటయుఁ, గుశలప్రశ్నాది సంభాషణంబులును, మద్రకన్యా ద్రౌపదీ సంభాషణంబును, దదనంతరంబ సకల రాజలోకంబును శమంతపంచకతీర్థంబున స్నాతులై రామకృష్ణాది యాదవ వీరుల నామంత్రణంబు చేసి నిజ దేశంబులకుఁ బోవుటయుఁ, గృష్ణుని దర్శించుటకు మునీంద్రు లేతెంచుటయు, వారి యనుమతిని వసుదేవుండు యాగంబు నెరవేర్చుటయు, నంద యశోదాది గోపికానివహంబుల నిజపురంబున కనిచి యుగ్రసేనాది యాదవవీరులుం దానును మాధవుండు నిజపురప్రవేశంబు సేయుటయుఁ, దొల్లి కంసునిచేత హతులై బలిపురంబున నున్న దేవకీదేవి సుతుల రామకృష్ణులు యోగమాయాబలంబునఁ దెచ్చి యామె కిచ్చుటయు, నర్జునుండు సుభద్రను వివాహంబగుటయుఁ, గృష్ణుండు మిథిలానగరంబున కరుగుటయు, శ్రుతదేవ జనకుల చరిత్రంబును, వారలతో బ్రాహ్మణ ప్రశంస సేయుటయు, శ్రుతిగీతలును, హరిహరబ్రహ్మల తారతమ్య చరిత్రంబును, గుశస్థలి నుండు బ్రాహ్మణుని చరిత్రంబును, నతని తనయులు పరలోకంబునకుం బోయినఁ గృష్ణార్జునులు తమ యోగబలంబున వారిం దెచ్చి యవ్విప్రున కిచ్చుటయుఁ గృష్ణుం డర్జునుని వీడ్కొని ద్వారక కరుగుటయు, నందు మాధవుం డయ్యై ప్రదేశంబుల సకల భార్యా పరివృతుండయి విహరించుటయు, యాదవ వృష్ణి భోజాంధక వంశ చరిత్రంబును నను కథలు గల దశమస్కంధంబు నందు నుత్తరభాగము.

21-05-2016: :
గణనాధ్యాయి 11:36, 12 డిసెంబరు 2016 (UTC)