పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/అంతరిక్షుసంభాషణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అంతరిక్షు సంభాషణ

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము)
రచయిత: పోతన


(తెభా-11-50-వ.)[మార్చు]

అనిన విని యంతరిక్షుం డను ఋషిశ్రేష్ఠుం డిట్లనియె.

(తెభా-11-51-క.)[మార్చు]

మబ్రహ్మ మనంగాఁ
తత్త్వ మనంగఁ బరమద మనఁగను నీ
శ్వ రుఁ డనఁ గృష్ణుఁ డన జగ
ద్భ రితుఁడు నారాయణుండు దా వెలుఁగొందున్‌.

(తెభా-11-52-వ.)[మార్చు]

అవ్యక్తనిర్గుణపరబ్రహ్మంబునందుఁ దనకు విపర్యయంబుగా జననం బయిన జ్ఞానంబె విష్ణుమాయ యనంబడుఁ; బరమేశ్వరుఁ డట్టి మాయచేత జగంబు నిర్మించి నిశ్చింతుండై యుండు; నింద్రియార్థ భ్రమణంబు సేసెడు దుర్మతులకు సుషుప్త్యాద్యవస్థలు వరుసన కలుగుటంజేసి పరమేశ్వరునిం బొందరామి యను నాలుగవ యవస్థయుఁ గలుగు; స్వప్నంబునందు గ్రాహ్యగ్రాహక గ్రహణంబు లను త్రివిధభేదంబు గలిగియుండు; నీచందంబున నవిద్యాంధకార సంవృతంబై మూఁడు విధంబులఁ బర్యవసించు మనోరథంబు స్వప్నావస్థయం దణంగిన క్రియఁ ద్రివిధం బగు మాయయు నాత్మ యందు లీనంబగుఁ; బరమేశ్వరుండు మొదలం బృథివ్యాది మహా భూతమయం బయిన సృష్టిని గలుగఁజేసి యందుఁ బంచభూతాత్మకం బయిన యాత్మ కేకాదశేంద్రియంబులచేత భేదంబు పుట్టించుచు, గుణంబులచేత గుణంబు లంగీకరించుచు నాత్మ యందుఁ బ్రద్యోతితగుణంబులవలన గుణానుభవంబుఁ జేయుచునున్న వాఁడై, సృష్టి నాత్మీయంబుగాఁ భావించు; దేహి కర్మమూలంబున నైమిత్తిక కర్మంబుల నాచరించుచుఁ దత్ఫలం బంగీకరించి దుఃఖైక వశుండై వర్తించుఁ; బెక్కు దుఃఖంబులం బడిన యా దేహి కర్మఫలప్రాప్తుం డగుచు భూత సంప్లవపర్యంతంబు పరవశుండై జన్మమరణంబులం బొరలుచుండు; నంత్యకాలం బాసన్నంబయిన ద్రవ్యగుణ స్వరూపం బగు జగంబు ననాదినిధనంబగు కాలంబు ప్రకృతింబొందించు; నటమీఁద శతవర్షంబులు వర్షంబు లేమిచేత నత్యుగ్రలోక లోచనుతేజంబున సకలలోకంబులు దహింపఁబడు; నంత నధో లోకంబుననుండి సంకర్షణముఖజనితానలం బూర్ధ్వశిఖాజాలంబుల వాయుసహాయంబై దిక్కులయం దెల్లఁ బ్రవర్తించు; నటమీఁద సంవర్తక వలాహక గణంబులు నూఱు హాయనంబులు సలిలధారా పాతంబుగా వర్షంబు గురియు; నందు విరాడ్రూపంబు లీనంబగు; నంత నీశ్వరుం డింధనాగ్నిచందంబున నవ్యక్తంబుఁ బ్రవేశించు; తదనంతరంబ ధరణీమండలంబు వాయుహృతగంధం బై కబంధ రూపంబుఁ దాల్చు; నా జలంబు హృతరసంబై తేజోరూపంబు నొందు నా తేజంబు తమోనిరస్తం బై వాయువం దడంగు; నా గంధవహుండు స్పర్శవిరహితుం డయి యాకాశంబు నందు సంక్రమించు; నా విష్ణుపదంబును విగత శబ్దగుణంబు గలది యై యాత్మ యందడంగు; నింద్రియంబులును మనంబును బుద్ధియు వికారంబులతోడ నహంకారంబుఁ బ్రవేశించు; నా యహంకారంబును స్వగుణయుక్తంబై పరమాత్మునిం జేరు; నిట్లు త్రివర్ణాత్మకయై సర్గ స్థితి లయకారిణి యగు మాయ యిట్టిది” యని తత్స్వరూప మాహాత్మ్యంబులు వివరించిన నరపాలుం డిట్లనియె.

(తెభా-11-53-ఉ.)[మార్చు]

'జ్ఞా విహీనులైన నరసంఘముఁ గానఁగరాని మాయఁ దా
'లో నడంచి యెట్లు హరిలోకముఁ జెందుదు రంతయుం దగన్‌
'భూ నుత! సత్యవాక్యగుణభూషణ! యిక్కథ వేడ్కతోడుతం
'బూ నికఁ జెప్పు మన్నను బ్రబుద్ధుఁడు నిట్లను గారవంబునన్‌.

21-05-2016: :

గణనాధ్యాయి 12:46, 12 డిసెంబరు 2016 (UTC)