పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/హిరణ్యగ ర్భాగమనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

హిరణ్యగర్భాగమనము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-658-వ.)[మార్చు]

అని యిట్లు వింధ్యావళియుం బ్రహ్లాదుండును విన్నవించు నవసరంబున హిరణ్యగర్భుండు చనుదెంచి యిట్లనియె.

(తెభా-8-659-సీ.)[మార్చు]

భూతలోకేశ్వర! భూతభావన! దేవ! ;
దేవ! జగన్నాథ! దేవవంద్య!
న సొమ్ము సకలంబుఁ ప్పక నీ కిచ్చె;
దండయోగ్యుఁడు గాడు దానపరుఁడుఁ;
రుణింప నర్హుండు మలలోచన! నీకు;
విడిపింపు మీతని వెఱపు దీర;
తోయపూరము చల్లి దూర్వాంకురంబులఁ;
జేరి నీ పదము లర్చించునట్టి

(తెభా-8-659.1-తే.)[మార్చు]

క్తియుక్తుఁడు లోకేశుదము నందు
నీవు ప్రత్యక్షముగ వచ్చి నేఁడు వేఁడ
నెఱిఁగి తన రాజ్య మంతయు నిచ్చి నట్టి
లికిఁ దగునయ్య! దృఢపాశబంధనంబు?

(తెభా-8-660-వ.)[మార్చు]

అని పలికిన బ్రహ్మవచనంబులు విని భగవంతుం డిట్లనియె.

(తెభా-8-661-సీ.)[మార్చు]

వ్వనిఁ గరుణింప నిచ్ఛయించితి వాని;
ఖిల విత్తంబు నే పహరింతు
సంసార గురుమద స్తబ్దుఁడై యెవ్వఁడు;
దెగడి లోకము నన్ను ధిక్కరించు
తఁ డెల్ల కాలంబు ఖిల యోనుల యందుఁ;
బుట్టుచు దుర్గతిఁ బొందుఁ బిదప
విత్త వయో రూప విద్యా బలైశ్వర్య;
ర్మ జన్మంబుల ర్వ ముడిగి

(తెభా-8-661.1-తే.)[మార్చు]

యేక విధమున విమలుఁడై యెవ్వఁ డుండు
వాఁడు నా కూర్చి రక్షింపలయువాఁడు;
స్తంభ లోభాభిమాన సంసార విభవ
త్తుఁడై చెడ నొల్లఁడు త్పరుండు.

(తెభా-8-662-శా.)[మార్చు]

ద్ధుండై గురుశాపతప్తుఁడయి తా బంధువ్రజత్యక్తుఁడై
సి ద్ధైశ్వర్యముఁ గోలుపోయి విభవక్షీణుండునై పేదయై
శు ద్ధత్వంబును సత్యముం గరుణయున్ సొంపేమియుం దప్పఁ డు
ద్బు ద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెం బుణ్యుం డితం డల్పుఁడే.

(తెభా-8-663-ఆ.)[మార్చు]

సురనాథుఁ డనుచు నఘుని మర్యాద
యేను జూత మనుచు నింత వలుక
నిజము పలికె నితఁడు నిర్మలాచారుండు
మేలుమేలు నాకు మెచ్చువచ్చు.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 11:06, 23 సెప్టెంబరు 2016 (UTC)