పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/శుక్ర బలి సంవాదంబును

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శుక్రబలిసంవాదంబును

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-577-వ.)

అని యిట్లు పలుకుచున్న ఖర్వునకు నుర్వీదానంబు చేయం దలంచి కరకలిత సలిల కలశుండైన య వ్వితరణగుణముఖరునిం గని, నిజ విచారయుక్త దనుజ రాజ్య చక్రుండగు శుక్రుం డిట్లనియె.

(తెభా-8-578-సీ.)[మార్చు]

నుజేంద్ర! యీతఁడు రణీసురుఁడుఁ గాడు;
దేవకార్యంబు సాధించుకొఱకు
రి విష్ణుఁ డవ్యయుం దితి గర్భంబునఁ;
శ్యపసూనుఁడై లిఁగె; నకట!
యెఱుగ కీతని కోర్కి నిచ్చెద నంటివి;
దైత్య సంతతి కుపద్రవము వచ్చు
నీ లక్ష్మిఁ దేజంబు నెలవు నైశ్వర్యంబు;
వంచించి యిచ్చుఁ దా వాసవునకు;

(తెభా-8-578.1-ఆ.)[మార్చు]

మొనసి జగము లెల్ల మూఁడు పాదంబుల
ఖిలకాయుఁ డగుచు నాక్రమించు
ర్వ ధనము విష్ణు సంసర్జనము చేసి
డుగు పగిది నెట్లు బ్రతికె దీవు?

(తెభా-8-579-క.)[మార్చు]

క్కపదంబున భూమియు
నొ క్కటఁ ద్రిదివంబు ద్రొక్కి యున్నతమూర్తిన్
ది క్కులు గగనముఁ దానై
వె క్కసమై యున్న నెందు వెడలెదు? చెపుమా!

(తెభా-8-580-సీ.)[మార్చు]

చ్చెద నని పల్కి యీకున్న నరకంబు;
ద్రోవ నీవును సమర్థుఁడవుఁ గావ;
యే దానమున నాశ మేతెంచు నదియును;
దానంబుఁ గా దండ్రు త్త్వవిదులు;
దానంబు యజ్ఞంబుఁ పముఁ గర్మంబును;
దా విత్తవంతుఁడై లఁపవలయుఁ;
న యింటఁ గల సర్వనమును నైదు భా;
ములుగా విభజించి కామమునకు

(తెభా-8-580.1-ఆ.)[మార్చు]

ర్థమునకు ధర్మశముల కాశ్రిత
బృందములకు సమతఁ బెట్టునట్టి
పురుషుఁ డిందు నందు బూర్ణుఁడై మోదించుఁ
న్ను మాని చేఁత గవుఁ గాదు.

(తెభా-8-581-వ.)[మార్చు]

అదియునుం గాక యీ యర్థంబునందు బహుభంగి బహ్వృచ గీతా ర్థంబుఁ గల దొక్కటి; సావధానుండవై యాకర్ణింపుము.

(తెభా-8-582-సీ.)[మార్చు]

అంగీకరించిన ఖిలంబుఁ బోవుచో;
నృతంబుఁగాదు లే నిన నధిప!
యాత్మ వృక్షము మూల నృతంబు నిశ్చయ;
నృత మూలముఁ గల్గ నాత్మ చెడదు;
పుష్పఫలము లాత్మ భూజంబునకు సత్య;
మామ్రాను బ్రతుకమి దియుఁ జెడును;
లపుష్పములు లేక స చెడి వృక్షంబు;
మూలంబుతో వృద్ధిఁ బొందుఁ గాదె?

(తెభా-8-582.1-తే.)[మార్చు]

చేటుఁ గొఱతయు లఘిమయుఁ జెందకుండ
నిచ్చు పురుషుండు చెడకుండు నిద్ధచరిత!
కాక యంచిత సత్య సంతి నటంచు
నిజధనం బర్థి కిచ్చిన నీకు లేదు.

(తెభా-8-583-ఆ.)[మార్చు]

ర్వమయినచోట ర్వధనంబులు
డుగ లే దటంచు నృతమాడు
చెనటి పందనేమి చెప్పఁ బ్రాణము తోడి
వము వాఁడు; వాని న్మ మేల?

(తెభా-8-584-వ.)[మార్చు]

మఱియు నిం దొక్క విశేషంబు గలదు; వివరించెద.

(తెభా-8-585-ఆ.)[మార్చు]

వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
కిత గోకులాగ్ర న్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!

(తెభా-8-586-మ.)[మార్చు]

కు మున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
తిం బోఁడు; త్రివిక్రమస్ఫురణ వాఁడై నిండు బ్రహ్మాండముం;
లఁడే మాన్ప నొకండు? నా పలుకు లార్ణింపు కర్ణంబులన్;
దీ దానము గీనముం బనుపుమా ర్ణిన్ వదాన్యోత్తమా!

(తెభా-8-587-వ.)[మార్చు]

అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండయి యశస్వి యిట్లనియె.

(తెభా-8-588-సీ.)[మార్చు]

నిజ మాన తిచ్చితి వీవు మహాత్మక! ;
హిని గృహస్థధర్మంబు నిదియ
ర్థంబుఁ గామంబు శమును వృత్తియు;
నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు
ర్థ లోభంబున ర్థిఁ బొమ్మను టెట్లు? ;
లికి లే దనుకంటెఁ బాప మెద్ది?
యెట్టి దుష్కర్ముని నే భరించెదఁ గాని;
త్యహీనుని మోవఁ జాల ననచుఁ

(తెభా-8-588.1-తే.)[మార్చు]

లుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ
మరముననుండి తిరుగక చ్చుకంటె
లికి బొంకక నిజమునఁ రఁగుకంటె
మానధనులకు భద్రంబు ఱియుఁ గలదె.

(తెభా-8-589-క.)[మార్చు]

ధా త్రిని హలికునకును సు
క్షే త్రము బీజములు నొకటఁ జేకుఱు భంగిం
జి త్రముగ దాత కీవియుఁ
బా త్రము సమకూరునట్టి భాగ్యము గలదే?

(తెభా-8-590-శా.)[మార్చు]

కా రే రాజులు? రాజ్యముల్ గలుగవే? ర్వోన్నతిం బొందరే?
వా రేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బే రైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీ రే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!

(తెభా-8-591-క.)[మార్చు]

డుగని క్రతువులఁ వ్రతములఁ
బొ గనఁ జన నట్టి పొడవు పొడవునఁ గుఱుచై
డిగెడినఁట; ననుబోఁటికి
ని రాదె మహానుభావ! యిష్టార్థంబుల్.

(తెభా-8-592-శా.)[మార్చు]

దిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,
బా దాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ
ర్యా దం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గా దే ? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?

(తెభా-8-593-మ.)[మార్చు]

ని యంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మ ణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;
రుఁడైనన్, హరియైన, నీరజభవుం భ్యాగతుండైన నౌఁ;
ది రుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?

(తెభా-8-594-ఆ.)[మార్చు]

నొడివినంత పట్టు నుసలక యిచ్చుచో
నేల కట్టు విష్ణుఁ డేటి మాట?
ట్టెనేనిఁ దాన రుణించి విడుచును
విడువకుండ నిమ్ము విమలచరిత!
 : : 21-05-2016: : గణనాధ్యాయి 10:39, 23 సెప్టెంబరు 2016 (UTC)