పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామనుని సమాధానము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వామునునిసమాధానము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-552-సీ.)[మార్చు]

ది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు? ;
నొక చో టనక యెందు నుండ నేర్తు;
నెవ్వనివాఁడ నం చేమని నుడువుదు? ;
నా యంతవాఁడనై డవనేర్తు;
నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ? ;
బూని ముప్పోకల బోవ నేర్తు;
దినేర్తు నిదినేర్తు ని యేలఁ జెప్పంగ? ;
నేరుపు లన్నియు నేన నేర్తు;

(తెభా-8-552.1-తే.)[మార్చు]

నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు
నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు
సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి
సుజనులందుఁ దఱచు చొచ్చియుందు.

(తెభా-8-553-వ.)[మార్చు]

అది యట్లుండ నిమ్ము.

(తెభా-8-554-సీ.)[మార్చు]

ననాథ! నీ మాట త్యంబు సత్కీర్తి;
దంబు గులార్హంబు ర్మయుతముఁ
రుణానువర్తులు నసత్త్వమూర్తులు;
కాని మీ కులమందుఁ లుగ రొరులు
ణభీరువులు వితణభీరువులు లేరు;
ప్రత్యర్థు లర్థులు ప్రబ్బికొనిన
దానశౌండిమమునఁ నుపుదు రధికులై;
మీ తాత లందఱు మేటిమగలు

(తెభా-8-554.1-ఆ.)[మార్చు]

మీ కులంబునందు మెఱయుఁ బ్రహ్లాదుండు
మింటి చంద్రుమాడ్కి మేలి రుచులఁ
బ్రథిత కీర్తితోడ వదీయవంశంబు
నీరరాశి భంగి నెగడు చుండు.

(తెభా-8-555-వ.)[మార్చు]

తొల్లి మీ మూఁడవ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు జేసి గదాయుధుండై భూతలంబునఁ బ్రతివీరులం గానక సంచరింప విష్ణుండు వరాహరూపంబున నతని సమయించె; తద్భ్రాత యగు హిరణ్యకశిపుఁ డది విని హరిపరాక్రమంబునకు నాశ్చర్యంబు నొంది తన జయంబును బలంబునుం బరిహసించి గ్రద్దన నుద్దవిడి నద్దనుజమర్దను మందిరంబునకుం జనియె; అప్పుడు.

(తెభా-8-556-క.)[మార్చు]

శూ లాయుధహస్తుండై
కా లాకృతి వచ్చు దనుజుఁ ని విష్ణుండుం
గా జ్ఞత మాయాగుణ
శీ త నిట్లని తలంచెఁ జిత్తములోనన్.

(తెభా-8-557-మ.)[మార్చు]

దురై పోర జయింప రా దితనిఁ; గా కెందేనియుం బోవ భీ
ప్ర దుఁడై ప్రాణులఁ దోలు మృత్యువు క్రియం బైవచ్చు నంచుం గ్రియా
వి దుఁ డబ్జాక్షుఁడు సూక్ష్మరూపమున నావేశించె నిశ్శ్వాస రం
ధ్ర దిశన్ దైత్యు హృదంతరాళమునఁ బ్రత్యక్షక్రియాభీరుఁడై.

(తెభా-8-558-వ.)[మార్చు]

అంత నద్దైత్యవల్లభుండు వైష్ణవాలయంబు జొచ్చి వెదకి హరిం గానక కోపంబు మానక మిన్ను మన్ను నన్వేషించి త్రిదివంబు నరసి, దిశలం బరికించి, భూ వివరంబులు వీక్షించి, సముద్రంబులు వెదకి, పురంబులు శోధించి, వనంబులు విమర్శించి, పాతాళంబు పరీక్షించి, జగంబున నదృష్టశత్రుండై మార్గణంబు చాలించి, తనలో నిట్లనియె.

(తెభా-8-559-క.)[మార్చు]

వాఁడు మడియ నోపును
దె డేనియు నెదురుపడఁడె? దేహధరులకుం
దె గిన యెడఁ బగఱ మీఁదనుఁ
గఁ గొనఁ దగ ద నుచు నుడిగెఁ బ్రాభవశక్తిన్.

(తెభా-8-560-వ.)[మార్చు]

అతండు మీ ప్రపితామహుం; డతని గుణంబు లనేకంబులు గలవు; అవి యట్లుండనిమ్ము.

(తెభా-8-561-క.)[మార్చు]

తుర భూసురగతిఁ బురు
హూ తాదులుఁ దన్ను వేఁడ నొగిఁ గొం డనుచున్
మీ తండ్రి యిచ్చె నాయువు
నే న్మాత్రుఁడవె నీవు నీలోకమునన్?

(తెభా-8-562-క.)[మార్చు]

లితివి మూఁడు జగములుఁ;
దో లితి వింద్రాది సురలఁ; దొల్లిటివారిం
బో లితివి దానగుణముల;
సో లితివి పిశాచరాక్షసుల రక్షింపన్.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 16:45, 22 సెప్టెంబరు 2016 (UTC)