పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామనుడు యఙ్ఞవాటిక చేరుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వామనుడుయఙ్ఞవాటికచేరుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-532-వ.)[మార్చు]

కని దానవేంద్రుని హయమేధ వాటి దఱియం జొచ్చు నయ్యవసరంబున.

(తెభా-8-533-శా.)[మార్చు]

శం భుండో హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో
దం భాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ
శుం ద్యోతనుఁ డీ మనోజ్ఞ తనుఁ డంచున్ విస్మయభ్రాంతులై
సం భాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్.

(తెభా-8-534-క.)[మార్చు]

గు గుజలు పోవువారును
జిబిజిఁ బడువారు చాలఁ లకల పడుచున్
జిబిజి యైరి సభాస్థలిఁ
బ్ర లెల్లను బొట్టివడుగు పాపని రాకన్.

(తెభా-8-535-వ.)[మార్చు]

ఆ సమయంబున బలిసభామండపంబుఁ దఱియం జొచ్చి.

(తెభా-8-536-సీ.)[మార్చు]

వులుగాఁ జెవులకు సామగానంబులు;
దువు నుద్గాతల దువు వినుచు
మంత్ర తంత్రార్థ సంబంధభావములు పే;
ర్కొనెడి హోతలతోడఁ గూడికొనుచు
హోమకుండంబులం దున్న త్రేతాగ్నుల;
వెలిఁగించు యాజక వితతిఁ గనుచు
క్షులై బహువిధాధ్వర విధానంబులు;
చెప్పెడు సభ్యులఁ జేరఁ జనుచుఁ

(తెభా-8-536.1-తే.)[మార్చు]

బెట్టుగోరెడు వేడుక పట్టుపఱుచు
దితి పుట్టువు లచ్చికి నాటపట్టు
కోరి చరియించె సభలోనఁ గొంతఁదడవు
పుట్టు వెన్నఁడు నెఱుగని పొట్టివడుఁగు.

(తెభా-8-537-వ.)[మార్చు]

మఱియును.

(తెభా-8-538-క.)[మార్చు]

వె చుచు వంగుచు వ్రాలుచు
ఱిముఱిఁ గబురులకుఁ జనుచు రిహరి యనుచున్
ఱుఁగుచు నులుకుచు దిఱదిఱఁ
గు రుమట్టపుఁ బడుచు వడుగుఁ గొంత నటించెన్.

(తెభా-8-539-క.)[మార్చు]

కొం ఱతోఁజర్చించును
గొం ఱతో జటలు చెప్పు గోష్ఠిం జేయుం
గొం ఱతోఁ దర్కించును
గొం ఱతో ముచ్చటాడుఁ; గొందఱ నవ్వున్.

(తెభా-8-540-వ.)[మార్చు]

మఱియు ననేక విధంబుల నందఱకు నన్ని రూపులై వినోదించుచు.

(తెభా-8-541-క.)[మార్చు]

వె వెడ నడకలు నడచుచు
నె నెడ నడు గిడక నడరి యిల దిగఁబడగా
బు డిబుడి నొడువులు నొడువుచుఁ
జి డిముడి తడఁబడగ వడుగు చేరెన్ రాజున్.

(తెభా-8-542-వ.)[మార్చు]

ఇట్లు డగ్గఱి మాయాబిక్షుకుండు రక్షోవల్లభుం జూచి యిట్లనియె.

(తెభా-8-543-మ.)[మార్చు]

తఁడే దానవచక్రవర్తి సురలోకేంద్రాగ్నికాలాది ది
క్ప తి గర్వాపనయప్రవర్తి, గతలోస్ఫూర్తి, నానా మఖ
వ్ర దానప్రవణానువర్తి, సుమనోరామామనోభేదనో
ద్ధ చంద్రాతపకీర్తి, సత్యకరుణా ర్మోల్లసన్మూర్తి దాన్.

(తెభా-8-544-వ.)[మార్చు]

అని కుశ పవిత్రాక్షత సంయుతం బయిన దక్షిణహస్తంబు సాఁచి యిట్లనియె.

(తెభా-8-545-ఉ.)[మార్చు]

స్వ స్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ద్వ స్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్ర స్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ
న్య స్త సువర్ణసూత్ర పరిర్తకు, దానవలోక భర్తకున్.

(తెభా-8-546-వ.)[మార్చు]

అని దీవించి కరచరణాద్యవయవంబులు ధరించిన వేదరాశియుం బోలె ముందట నకుటిలుండును, జటిలుండును, సదండఛత్రుండునుఁ, గక్షలంబిత బిక్షాపాత్రుండునుఁ, గరకలిత జల కమండలుండును, మనోహరవదన చంద్రమండలుండును, మాయావాదన నటుండును నగు వటునిం గని దినకర కిరణ పిహితంబులైన గ్రహంబుల చందంబునఁ దిరోహితులై భృగువులుఁ గూర్చున్న యెడల లేచి క్షేమం బడిగి తియ్యని మాటల నాదరించిరి; బలియును నమస్కరించి తగిన గద్దియ నునిచి, పాదంబులుఁ దుడిచి తన ప్రాణవల్లభ పసిండి గిండియల నుదకంబు పోయ వడుగు కొమరుని చరణంబులఁ గడిగి తడి యొత్తి తత్సమయంబున.

(తెభా-8-547-ఆ.)[మార్చు]

టుని పాద శౌచవారి శిరంబునఁ
రమ భద్ర మనుచు లి వహించె
నే జలము గిరీశుఁ డిందుజూటుఁడు దేవ
దేవుఁ డుద్వహించె ధృతి శిరమున.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 16:20, 22 సెప్టెంబరు 2016 (UTC)