పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామనుడు దాన మడుగుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వామనుడుదానమడుగుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-563-వ.)[మార్చు]

అదియునుం గాక

(తెభా-8-564-క.)[మార్చు]

రా జ్యంబు గలిగె నేనిం
బూ జ్యులకును యాచకులకు భూమిసురులకున్
భా జ్యముగ బ్రతుక డేనిం
ద్యా జ్యంబులు వాని జన్మ న గేహంబుల్.

(తెభా-8-565-క.)[మార్చు]

ము న్నెన్నుదురు వదాన్యుల
నె న్నెడుచో నిన్నుఁ ద్రిభువనేశుం డనుచున్;
న్ని దినంబుల నుండియు
నె న్నఁడు నినుఁ బెట్టు మనుచు నీండ్రము జేయన్.

(తెభా-8-566-ఆ.)[మార్చు]

ఒంటివాఁడ నాకుఁ నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల;
గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర!

(తెభా-8-567-వ.)[మార్చు]

అనిన బరమయాచకునకుఁ బ్రదాత యిట్లనియె.

(తెభా-8-568-ఆ.)[మార్చు]

న్నమాటలెల్ల నొప్పును విప్రుండ!
త్య గతులు వృద్ధ మ్మతంబు;
డుగఁ దలఁచి కొంచె డిగితివో చెల్ల;
దాత పెంపు సొంపుఁ లఁపవలదె.

(తెభా-8-569-వ.)[మార్చు]

అని మఱియు ని ట్లనియె.

(తెభా-8-570-మ.)[మార్చు]

సుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్
వె నూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో?
సి బాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గా
సురేంద్రుండు పదత్రయం బడుగ నీ ల్పంబు నీ నేర్చునే?

(తెభా-8-571-వ.)[మార్చు]

అనిన మొగంబునం జిఱునగవు మొలకలెత్త గృహమేథికి మేధావి యి ట్లనియె.

(తెభా-8-572-మ.)[మార్చు]

గొ డుగో. జన్నిదమో, కమండలువొ. నాకున్ ముంజియో, దండమో,
డుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్క ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

(తెభా-8-573-వ.)[మార్చు]

అదియునుంగాక.

(తెభా-8-574-క.)[మార్చు]

వ్యా ప్తిం బొందక వగవక
ప్రా ప్తంబగు లేశమైనఁ దివే లనుచుం
దృ ప్తిం జెందని మనుజుఁడు
ప్తద్వీపముల నయినఁ క్కంబడునే?

(తెభా-8-575-శా.)[మార్చు]

శాపాశము దాఁ గడున్ నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా
రా శిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గా సిం బొందిరిఁ గాక వైన్య గయ భూకాంతాదులున్నర్థకా
మా శం బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.

(తెభా-8-576-సీ.)[మార్చు]

సంతుష్టుఁడీ మూఁడు గములఁ బూజ్యుండు;
సంతోషి కెప్పుడుఁ రఁగు సుఖము
సంతోషిఁ గాకుంట సంసార హేతువు;
సంతసంబున ముక్తితియు దొరకుఁ
బూఁటపూఁటకు జగంబుల యదృచ్ఛాలాభ;
తుష్టిని దేజంబు తోన పెరుఁగుఁ
రితోష హీనతఁ బ్రభ చెడిపోవును;
లధార ననలంబు మయునట్లు

(తెభా-8-576.1-ఆ.)[మార్చు]

నీవు రాజ వనుచు నిఖిలంబు నడుగుట
గవు గాదు నాకుఁ; గిన కొలఁది
యేను వేఁడికొనిన యీ పదత్రయమునుఁ
జాల దనక యిమ్ము; చాలుఁజాలు.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 10:37, 23 సెప్టెంబరు 2016 (UTC)