పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/లక్ష్మీ నారాయణ సంభాషణ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

లక్ష్మీనారాయణసంభాషణ

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-128-వ.)[మార్చు]

అప్పుడు జగజ్జనకుండగు న ప్పరమేశ్వరుండు దరహసిత ముఖకమల యగు నక్కమల కిట్లనియె.

(తెభా-8-129-క.)[మార్చు]

బా లా! నా వెనువెంటను
హే లన్ వినువీథినుండి యేతెంచుచు నీ
చే లాంచలంబుఁ బట్టుట
కా లో నేమంటి నన్ను నంభోజముఖీ!

(తెభా-8-130-క.)[మార్చు]

ఱుఁగుదు తెఱవా! యెప్పుడు
వను సకలంబు నన్ను ఱచిన యెడలన్
తు నని యెఱిఁగి మొఱఁగక
వక మొఱ యిడిర యేని ఱి యన్యములన్.

(తెభా-8-131-వ.)[మార్చు]

అని పలికిన నరవిందమందిర యగు నయ్యిందిరాదేవి మందస్మితచంద్రికా సుందరవదనారవింద యగుచు ముకుందున కిట్లనియె.

(తెభా-8-132-క.)[మార్చు]

దే వా! దేవర యడుగులు
భా వంబున నిలిపి కొలచు ని నా పని గా
కో ల్లభ! యే మనియెద
నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతీ!

(తెభా-8-133-క.)[మార్చు]

దీ నుల కుయ్యాలింపను
దీ నుల రక్షింప మేలు దీవనఁ బొందన్
దీ నావన! నీ కొప్పును.
దీ పరాధీన! దేవదేవ! మహేశా!

(తెభా-8-134-వ.)[మార్చు]

అని మఱియును సముచిత సంభాషణంబుల నంకించుచున్న యప్పరమ వైష్ణవీరత్నంబును సాదర సరససల్లాప మందహాస పూర్వకంబుగా నాలింగనంబు గావించి సపరివారుండై గరుడ గంధర్వ సిద్ధ విబుధగణ జేగీయమానుండై గరుడారూఢుం డగుచు హరి నిజసదనంబునకుం జనియె" నని చెప్పి శుకయోగీంద్రుం డిట్లనియె.

21-05-2016: :
గణనాధ్యాయి 17:24, 16 సెప్టెంబరు 2016 (UTC)