పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/రాక్షసుల సుతల గమనంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రాక్షసుల సుతలగమనంబు

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-664-క.)[మార్చు]

సా ర్ణి మనువు వేళను
దే వేంద్రుండగు నితండు దేవతలకు; దు
ర్భా విత మగు నా చోటికి
రా వించెద; నంతమీఁద క్షింతు దయన్.

(తెభా-8-665-క.)[మార్చు]

వ్యా ధులుఁ దప్పులు నొప్పులు
బా లుఁ జెడి విశ్వకర్మభావిత దనుజా
రా ధిత సుతలాలయమున
నే ధిత విభవమున నుండు నితఁ డందాకన్.

(తెభా-8-666-వ.)[మార్చు]

అని పలికి బలిం జూచి భగవంతుం డి ట్లనియె.

(తెభా-8-667-సీ.)[మార్చు]

సేమంబు నీ కింద్రసేన మహారాజ! ;
వెఱవకు మేలు నీ వితరణంబు;
వేలుపు లం దుండ వేడుక పడుదురు;
దుఃఖంబు లిడుములు దుర్మరణము
లాతురతలు నొప్పు లందుండు వారికి;
నొందవు సుతల మందుండు నీవు;
నీ పంపు జేయని నిర్జరారాతుల;
నా చక్ర మేతెంచి ఱకుచుండు;

(తెభా-8-667.1-ఆ.)[మార్చు]

లోకపాలకులకు లోనుగా వక్కడ
న్యు లెంతవార చట? నిన్ను
నెల్ల ప్రొద్దు వచ్చి యేను రక్షించెదఁ
రుణతోడ నీకుఁ గానవత్తు.

(తెభా-8-668-క.)[మార్చు]

దా వ దైత్యుల సంగతిఁ
బూ నిన నీ యసురభావమును దోడ్తో మ
ద్ధ్యా మునఁ దలఁగి పోవును
మా నుగ సుతలమున నుండుమా మా యాజ్ఞన్.

(తెభా-8-669-వ.)[మార్చు]

అని యిట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుకవేల్పు తియ్యని నెయ్యంపుఁ పలుకుఁ జెఱకు రసంపుసోనలు వీనుల తెరువులం జొచ్చి లోను బయలు నిండి ఱెప్పల కప్పు దప్పం ద్రోచికొని కనుఁ గవ కొలంకుల నలుగులు వెడలిన చందంబున సంతసంబునం గన్నీరు మున్నీరై పఱవ, నురః ఫలకంబునం బులకంబులు కులకం బులయి తిలకంబు లొత్తఁ, గేలు మొగిడ్చి నెక్కొన్న వేడుకం ద్రొక్కుడు పడుచుఁ జిక్కని చిత్తంబునఁ జక్కని మాటల రక్కసుల ఱేఁ డిట్లనియె.

(తెభా-8-670-ఉ.)[మార్చు]

న్నడు లోకపాలకుల నీ కృపఁ జూడని నీవు నేఁడు న
న్ను న్నతుఁ జేసి నా బ్రతుకు నోజయు నానతి యిచ్చి కాచి తీ
న్నన లీ దయారసము మాటలు పెద్దఱికంబుఁ జాలవే?
న్నగతల్ప! నిన్నెఱిఁగి ట్టిన నాపదఁ గల్గనేర్చునే?

(తెభా-8-671-వ.)[మార్చు]

అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకుం బ్రణామంబు జేసి, యిందు ధరునకు వందనం బాచరించి, బంధవిముక్తుండై తన వారలతోఁ జేరికొని బలి సుతలంబునకుం జనియె; నంత హరి కృపావశంబునం గృతార్థుండై కులోద్ధారకుం డయిన మనుమనిం గని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతున కిట్లనియె.

(తెభా-8-672-సీ.)[మార్చు]

తురాననుఁడు నీ ప్రసాదంబు గానఁడు;
ర్వుఁడీ లక్ష్ముల జాడఁ బొందఁ,
న్యుల కెక్కడి? సురులకును మాకు;
బ్రహ్మాదిపూజితదుఁడ వయిన
దుర్లభుండవు నీవు దుర్గపాలుఁడ వైతి;
ద్మజాదులు భవత్పాదపద్మ
కరంద సేవన హిమ నైశ్వర్యంబు;
లందిరి కాక యే ల్పమతుల

(తెభా-8-672.1-తే.)[మార్చు]

ధిక దుర్యోనులము కుత్సితాత్మకులము
నీ కృపాదృష్టిమార్గంబు నెలవు చేర
నేమి తప మాచరించితి మెన్నఁగలమె?
మ్ముఁ గాచుట చిత్రంబు మంగళాత్మ!

(తెభా-8-673-వ.)[మార్చు]

అదియునుం గాక.

(తెభా-8-674-ఆ.)[మార్చు]

ర్వగతుఁడ వయ్యు మదర్శనుఁడ వయ్యు
నొకట విషమవృత్తి నుండు దరయ
నిచ్ఛలేనివారి కీవు భక్తులు గోరు
లఁపు లిత్తు కల్పరువు మాడ్కి.

(తెభా-8-675-వ.)[మార్చు]

అని విన్నవించుచున్న ప్రహ్లాదుం జూచి పరమ పురుషుం డిట్లనియె.

(తెభా-8-676-తే.)[మార్చు]

త్స! ప్రహ్లాద! మేలు నీ వారు నీవు
సొరిది మనుమనిఁ దోడ్కొని సుతలమునకుఁ
యనమై పొమ్ము నే గదాపాణి నగుచుఁ
జేరి రక్షింప దురితంబు చెంద దచట.

(తెభా-8-677-వ.)[మార్చు]

అని యిట్లు నియమించినం బరమేశ్వరునకు నమస్కరించి వలగొని కరకమల పుట ఘటిత నిటల తటుండయి, వీడ్కొని, బలిం దోడ్కొని సక లాసురయూథంబునుం దాను నొక్క మహాబిలద్వారంబు చొచ్చి ప్రహ్లాదుండు సుతల లోకంబునకుం జనియె; నంత బ్రహ్మవాదు లయిన యాజకుల సభామధ్యంబునం గూర్చున్న శుక్రునిం జూచి నారాయణుం డి ట్లనియె.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 11:07, 23 సెప్టెంబరు 2016 (UTC)