పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/బలిని బంధించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బలినిబంధించుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-638-వ.)[మార్చు]

అట్లు గావున రణంబున శత్రుల కిప్పు డెదురు మోహరించుట కార్యంబుఁ గాదు; మనకుం దగు కాలంబున జయింతము; నలంగక తొలంగుం డనిన దలంగి భాగవత భట భీతులై చిక్కి రక్కసులు రసా తలంబునకుం జని; రంత హరి హృదయం బెఱింగి తార్క్ష్యనందనుండు యాగసుత్యాహంబున వారుణ పాశంబుల నసురవల్లభుని బంధించెను; అంత.

(తెభా-8-639-క.)[మార్చు]

బా హులుఁ బదములుఁ గట్టిన
శ్రీ రి కృపగాక యేమి జేయుదు నని సం
దే హింపక బలి నిలిచెను
హా హారవ మెసఁగె దశ దిగంతములందున్.

(తెభా-8-640-క.)[మార్చు]

సం ద చెడియును దైన్యము
గం పంబును లేక తొంటికంటెను బెంపుం
దెం పును నెఱుకయు ధైర్యము
వం ని సురవైరిఁ జూచి టుఁ డిట్లనియెన్.

(తెభా-8-641-సీ.)[మార్చు]

దానవ! త్రిపదభూల మిత్తు నంటివి;
రణిఁ జంద్రార్కు లెందాఁక నుందు
రంత భూమియు నొక్క డుగయ్యె నాకును;
స్వర్లోకమును నొక్క రణమయ్యె;
నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు;
డమ పాదమునకుఁ లదె భూమి?
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు;
నిరయంబు బొందుట నిజముగాదె?

(తెభా-8-641.1-తే.)[మార్చు]

కాన దుర్గతికినిఁ గొంత కాల మరుగు
కాక యిచ్చెదవేని వేగంబ నాకు
నిపుడ మూఁడవ పదమున కిమ్ముఁ జూపు
బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె?

(తెభా-8-642-వ.)[మార్చు]

అని యిట్లు వామనుండు పలుక సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్య నికృత్త హృదయుం డయ్యును విషణ్ణుండుఁ గాక వైరోచని ప్రసన్న వదనంబుతోడఁ జిన్ని ప్రోడ వడుగున కి ట్లనియె.

(తెభా-8-643-ఆ.)[మార్చు]

సూనృతంబుఁ గాని నుడియదు నా జిహ్వ
బొంకఁజాల; నాకు బొంకు లేదు;
నీ తృతీయపదము నిజము నా శిరమున
నెలవు జేసి పెట్టు నిర్మలాత్మ!

(తెభా-8-644-ఆ.)[మార్చు]

నిరయమునకుఁ బ్రాప్త నిగ్రహంబునకును
దవిహీనతకును బంధనమున
ర్థ భంగమునకు ఖిల దుఃఖమునకు
వెఱవ దేవ! బొంక వెఱచినట్లు.

(తెభా-8-645-వ.)[మార్చు]

అదియునుం గాక.

(తెభా-8-646-సీ.)[మార్చు]

ల్లిదండ్రులు నన్నమ్ములు జెలికాండ్రు;
గురువులు శిక్షింపఁ గొఱతపడునె?
పిదప మేలగుఁ గాక; పృథుమదాంధులకును;
దానవులకు మాకుఁ ఱియెఱింగి
విభ్రంశచక్షువు వెలయ నిచ్చుటఁ జేసి;
గురువులలోనాదిగురువ వీవ;
నీవు బంధించిన నిగ్రహమో లజ్జ;
యో నష్టియో బాధయో తలంప

(తెభా-8-646.1-తే.)[మార్చు]

నిన్నునెదిరించి పోరాడి నిర్జరాదు
లాదియోగీంద్రు లందెడు ట్టి టెంకి
నందరే తొల్లి పెక్కండ్రు? ర్షమూర్తి!
యీశ! నీ యెడ దుర్లభ మేమి కలదు?

(తెభా-8-647-మ.)[మార్చు]

చె లియే మృత్యువు? చుట్టమే యముఁడు? సంసేవార్థులే కింకరుల్?
శి లం జేసెనె బ్రహ్మదన్ను? దృఢమే జీవంబు? నో చెల్లరే;
లితం బౌట యెఱుంగ కీ కపట సంసారంబు నిక్కంబుగాఁ
లఁచున్ మూఢుఁడు సత్యదాన కరుణార్మాదినిర్ముక్తుఁడై.

(తెభా-8-648-సీ.)[మార్చు]

చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు;
కాంతలు సంసార కారణములు;
నము లస్థిరములు; ను వతి చంచల;
గార్యార్థు లన్యులు; డచుఁగాల
మాయువు; సత్వర మైశ్వర్య మతి శీఘ్ర;
ని కాదె తమ తండ్రి తకరించి
మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు;
నీ పాదకమలంబు నియతిఁ జేరె

(తెభా-8-648.1-తే.)[మార్చు]

ద్రుఁ డతనికి మృతి లేని బ్రతుకుఁ గలిగె
వైరులై కాని తొల్లి మా వారుఁ గాన
ర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్ల
ద్మలోచన! నా పుణ్య లము గాదె?

(తెభా-8-649-వ.)[మార్చు]

అని యిట్లు పలుకుచున్న యవసరంబున.

(తెభా-8-650-శా.)[మార్చు]

దైత్యేంద్రుఁడు పీనవక్షు, నవపద్మాక్షుం, బిశంగాంబరా
చ్ఛా దున్. నిర్మలసాధువాదు. ఘనసంసారాదివిచ్ఛేదు. సం
శ్రీ దున్ , భక్తిలతాధిరోహిత హరిశ్రీపాదు, నిఃఖేదుఁ, బ్ర
హ్లా దున్ బోధకళావినోదుఁ గనియెన్ ర్షంబుతో ముందటన్
 : : 21-05-2016: : గణనాధ్యాయి 11:03, 23 సెప్టెంబరు 2016 (UTC)