పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/దుర్భర దానవ ప్రతాపము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దుర్భరదానవప్రతాపము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-449-వ.)[మార్చు]

అప్పుడు

(తెభా-8-450-క.)[మార్చు]

దు ర్భర దానవ శంఖా
వి ర్భూతధ్వనులు నిండి విబుధేంద్రవధూ
ర్భములు పగిలి లోపలి
ర్భకతతు లావు రనుచు నాక్రోశించెన్.

(తెభా-8-451-వ.)[మార్చు]

అంత

(తెభా-8-452-సీ.)[మార్చు]

లి వచ్చి విడియుట లభేది వీక్షించి;
ట్టిగాఁ గోటకుఁ గాపు పెట్టి
దేవవీరులుఁ దాను దేవతామంత్రిని;
ప్పించి సురవైరి రాకఁ జెప్పి
ప్రళయానలుని భంగి భాసిల్లుచున్నాఁడు;
ఘోరరాక్షసులను గూడినాఁడు
న కోడి చని నేఁడు రల వీఁ డేతెంచె;
నే తపంబున వీని కింత వచ్చె?

(తెభా-8-452.1-ఆ.)[మార్చు]

నీ దురాత్ముకునకు నెవ్వఁడు దోడయ్యె?
నింక వీని గెల్వ నేది త్రోవ?
యేమి చేయువార? మెక్కడి మగఁటిమి?
నెదురు మోహరింప నెవ్వఁ డోపు?

(తెభా-8-453-క.)[మార్చు]

మ్రిం గెడు నాకాశంబునుఁ
బొం గెడు నమరాద్రి కంటెఁ బొడవై వీఁడున్
మ్రిం గెడుఁ గాలాంతకు క్రియ
భం గించును మరలఁ బడ్డ బంకజగర్భున్.

(తెభా-8-454-క.)[మార్చు]

రాదు రాజ్య మెల్లనుఁ
బో రాదు రణంబు చేయఁ బోయితి మేనిన్
రా రాదు దనుజుచేతను
జా రా దిట మీఁద నేమిజాడ మహాత్మా!
 : : 21-05-2016: : గణనాధ్యాయి 15:35, 22 సెప్టెంబరు 2016 (UTC)