పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/త్రికూటమందలి గజములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

త్రికూటమందలి గజములు

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-37-క.)[మార్చు]

క్కడఁ జూచిన లెక్కకు
నె క్కువ యై యడవి నడచు నిభయూథములో
నొ క్క కరినాథుఁ డెడతెగి
చి క్కె నొక కరేణుకోటి సేవింపంగన్.

(తెభా-8-38-వ.)[మార్చు]

ఇట్లు వెనుక ముందట నుభయ పార్శంబులఁ దృషార్దితంబులై యరుగుదెంచు నేనుంగు గములం గానక తెఱంగుదప్పి తొలంగుడుపడి యీశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండుటంజేసి తానును దన కరేణుసముదయంబును నొక్కతెరువై పోవుచు.

(తెభా-8-39-సీ.)[మార్చు]

ల్వలంబుల లేఁత చ్చిక మచ్చికఁ;
జెలుల కందిచ్చు నచ్చికము లేక;
నివురుజొంపములఁ గ్రొవ్వెలయు పూఁగొమ్ములఁ;
బ్రాణవల్లభలకుఁ బాలువెట్టు;
నదానశీతల ర్ణతాళంబుల;
యితల చెమటార్చుఁ నువు లరసి;
మృదువుగాఁ గొమ్ముల మెల్లన గళములు;
నివురుచుఁ బ్రేమతో నెఱపు వలపు;

(తెభా-8-39.1-తే.)[మార్చు]

పిఱుదు చక్కట్ల డగ్గఱి ప్రేమతోడ
డాసి మూర్కొని దివికిఁ దొండంబు జాఁచు
వెద వివేకించుఁ గ్రీడించు విశ్రమించు
త్తమాతంగ మల్లంబు హిమతోడ.

(తెభా-8-40-సీ.)[మార్చు]

న కుంభముల పూర్ణకు డిగ్గి యువతుల;
కుచములు పయ్యెదకొంగు లీఁగఁ;
న యానగంభీరకుఁ జాల కబలల;
యానంబు లందెల నండగొనఁగఁ;
న కరశ్రీఁ గని లఁకి బాలల చిఱు;
దొడలు మేఖలదీప్తిఁ దోడు పిలువఁ;
న దంతరుచి కోడి రుణుల నగవులు;
ముఖచంద్ర దీప్తుల ముసుఁగు దిగువఁ;

(తెభా-8-40.1-తే.)[మార్చు]

నదు లావణ్యరూపంబుఁ లఁచిచూఁడ
నంజనాభ్రము కపిలాది రిదిభేంద్ర
యిత లందఱుఁ దనవెంటఁ గిలినడవఁ;
గుంభివిభుఁ డొప్పె నొప్పులకుప్ప బోలె.

(తెభా-8-41-వ.)[మార్చు]

మఱియు నానాగహన విహరణ మహిమతో మదగజేంద్రంబు మార్గంబుఁ దప్పి పిపాసాపరాయత్త చిత్తంబున మత్తకరేణువుల మొత్తంబునుం దానునుం జని చని.

(తెభా-8-42-మ.)[మార్చు]

టఁ గాంచెం గరిణీవిభుండు నవఫుల్లాంభోజకల్హారమున్
దిందిందిర వారముం గమఠ మీగ్రాహ దుర్వారమున్
హింతాల రసాల సాల సుమనో ల్లీకుటీతీరముం
టులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గాసారమున్.

21-05-2016: :
గణనాధ్యాయి 16:55, 16 సెప్టెంబరు 2016 (UTC)