పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25

యోధ నిర్మధన శౌర్యోరుదంతములు
తపమును దమము మాత్సరశత్రు నిగళ
కపటాసురులు కొలిగడలు వారలుగ
తనరునీపేరి గంధగజంబుగూలె
జనకజరమణ కేసరి నెదిరించి,
క్రోధనిశ్వాస సంకులధూమ నిర్ని
రోధకమతి శౌర్యరూపహేమములు
బలమును వేఁడిమిఁ బరఁగనీపేర
విలసిల్లు దుస్సహ వీతిహోత్రుండు
చల్లనారెను రామ జలధరనిశిత
భల్లదృష్టిని దైవబలము లేకునికి"
 

యుద్ధకాండ (10891-10410)

ఛందోవ్యాకరణాంశములు

ఈ ద్విపద కావ్యము చిన్నన్న చెప్పిన ద్విపదలక్షణము ననుసరించి రచితమైనది. ఇందు ప్రాసయతులుగాని, పాదాం తమునందును పద మధ్యమందును విఱుఫులుగాని లేవు. ఏపాద కాపాదము విడివడియేయుండును.

ఇందు మూడు చోట్ల దీర్ఘ పూర్ణ బిందు ప్రాసము- అనగా దీర్ఘముమీద నియతముగాఁ గాఁదగిన యర్థబిందువునకు పూర్ణ బిందువు వచ్చుట. దానితో సిద్ధబిందు శబ్దముల ప్రాస నుపయోగించుపద్ధతి గలదు.