పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మలయించ నొకచోట మంచు పెందెరలు
పొలయించు నొకచోట భుగభుగ బొగలు
వినుపించు నొకచోట విలు నారి మ్రోత
కనిపించు నొక చోట కాంచన రథము
చెలఁగించు నొకచోట సింహనాదములు
నెలకొల్పు నొకచోట నేమికాధ్వనులు
నడరించు నొకచోట హయ హేషితములు
జడియించు నొకచోట శక్తులువైచి
విసివించు నొకచోట విలుకేలఁబూని
నసముంచు నొకచోట నాకృతిఁ జూపి
యీవేల నెలయించె నింద్రజిత్తుండు ” (8009-8024)

ఇచట యింద్రజిత్తుయొక్క యస్త్రవిద్యా నైపుణ్యము చక్కగా ప్రదర్శితమైనది.

నేడు వరదరాజ రామాయణము పూర్తిగా లభ్యమగు చున్నది గాన, సాహిత్య విమర్శకాగ్రేసరులగు విద్వాంసులు, రంగనాథ రామాయణము తోడను, మూలము తోడను, దీనిని పఠించి విమర్శనములు వెలయింతురుగాత !

తక్కినకాండ లందువలెనే నిందును వరదరాజు రచనము మూలానుసరణముగనే యున్నది.
నేఁడు భాస్కర రామాయణము, రంగనాథ రామాయణములలో గానవచ్చు. కైకసి వృత్తాంతము, సులోచనా వృత్తాంతము, రామేశ్వరమున రామలింగప్రతిష్ట మున్నగునవి రామాయణమునఁ గానరావు. వైష్ణవమతము ' వ్యాపించిన వెనుక రచితమగుట చేతనో,