పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21

వరదరాజు వైష్ణవప్రపత్తి గలవాడగుట చేతనో శ్రీరాముఁడు రామలింగ ప్రతిష్ట చేయుటకు మారుగా విభీషణునికి శ్రీరంగశాయి నొసంగెనని యిట్లు చెప్పియున్నాడు.

"చాల చింతిలి విభీ - షణుఁడు పాదముల
వ్రాలి యో దేవ! నీ - వాఁడనై యిచట
నుందు నింతియెకాని , యొండెడకేఁగ
నెందుకు లంక నా కేల ? పోననిన
నెందుచే నీతనిఁ - దృప్తునిఁ జేతు
నెందుల ననుబాయఁ - డితడని యెంచి
తనమారు తనకుల - ధనము పూర్వమున
మనపుత్రుఁ డిక్ష్వాకు - మనుజేశ్వరుండు
నిలిపిన మాపాలి - నిక్షేపమీవు
కొలువుము లంకకు - గొని పొమ్మటంచు
సజ్ఞతో శ్రీరంగ - శాయినొనంగ
నజ్జ చేసుక య - మ్మహాను భావుండు
గైకొని లంకకుఁ - గదలి పోవుటయు 12302-12314

రంగనాథ రామాయణమున రామలింగేశ్వర ప్రతిష్టను గూర్చి చెప్పఁబడినదిగాని వైష్ణవమత ప్రతిపాదకమగు పైయంశము చెప్పఁబడ లేదు. కావున రంగనాథ రామాయణము కేవల వైష్ణవ భక్తిని ప్రకటించుటకు రచిత మైనదని ఘంటాపథముగఁ జెప్పలేము, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వాru ప్రకటించిన రంగనాథ రామాయణమునందలి యనుబంధము రెండింటిలో రెండవదానియం దీ క్రింది పంక్తులు గలవు.

ద్వి. అంత విభీషణుఁ డారాముఁజూచి
     యెంతఁగు భక్తితో నిలఁ జూడీ మొక్కి