పుట:Sri Ramayanamu Yuddakanda Katta Varadaraju 1953 616 P 2030020024696.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేగంబు యొక్కొక్క విషమబాణమున
నేగురఁ దొమ్మండ్ర నేడ్గుర నేసె
మఱియునుఁ గడిమిమై మర్కటేశ్వరులు
నెరయంగ గిరిధరణీజంబులెత్తి
యా యింద్రజిత్తుపై నడరింప నతఁడు
సాయకంబుల వాని చతురుఁడై ద్రుంచి
పదునెనిమిది తీవ్ర బాణంబు లేసె
మదమెల్లఁజెడ గంధమాదనుఁ గడిమి
దీపింప నలుఁ దొమ్మిదిట రూపుమాపె
నేపారమైందుని నేడింట నొంచె
గదిసి పంచకమున గదుఁ బొలియించె
పదియింట భల్లూకపతి మేనుపించె
నూటను హనుమంతునొప్పించి మించె
మూట గవాక్షుని మొగిగాడ నేసె
శరభుని నేడింట శతబలిఁ బదిట
సరినెన్మిదిట హరు, సన్నాహుమూట
నరుదుగా తక్కిన యఖిల యూధపుల
వరదివ్య శస్త్రాస్త్ర వర్షంబుగురిసి"

ఈ సందర్భమున వరదరాజెంత మనోహరముగా రచియించి యున్నాడో చూడుడు.

'అసురేంద్రసుతుఁడు బ్రహ్మాస్త్రప్రభావ
లసమాన తేజోవిలాసియై లాసి
నెఱయించు నొకచోట నీలమేఘములు
గురియించు నొకచోట ఘోరాస్త్రవృష్టి