Jump to content

పుట:SaakshiPartIII.djvu/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాబుగారు భటుల కాజ్ఞాపించెను. " ఓయబ్బ! ఇంతేనా? ఈమాత్రానికి న న్నీడకు బిలిపించు పెందుకయ్యా' యని యాబ్రాహ్మణుడు పలికెను. భటు లాతనిని వధ్యస్థాన మునకుఁ గొనిపోయిరి. తలారి కత్తి చేతఁ బట్టుకొని యాతని మొగము గాచి గడగడ వడంగి నే నీపనిని జేయజాలనని కత్తి నావల బాఱవైచెను. ఏల నఱుకలేవని నబాబుగా రాతని నడుగ ' ఆతనిరూపము నా కేమో భయంకరముగా నున్నది. నాచేతు లాడకున్న వని యాతండు నబాబు గారి పాదముల పైఁబడెను. 'నీవాతనిని నఱుకకుండునెడల నిన్ను ముందు నదఱకింతు’ నని నబాబుగా రాతని బెదరించిరి. అంత నాతడేమిచేయగలడు? గడగడ వడచుకు సుబ్బరాజుగారి కంఠమున బిస్మిల్గాయని కత్తి విసరెను. కంఠము తెగలేదు. మరియొక్కసారి చొరవ తెచ్చుకొని వైచెను. తెగలేదు. " ఓయబ్బ! నీవలనఁగాదయ్యా! భాగవతము తలమీఁదనుండఁగాఁ దలతెగుననియే యనుకొంటివఁటయ్యా! నీబొంద పడ! ఎక్కడనో యడవిమృగమువలె నున్నావు. విను. నీ వేమియుఁ గష్టపడకు. వెనుకకు విఱిచికట్టిన నాచేతులు విప్పవయ్యా? భాగవతము తలమీఁదినుండి దింపుదును. తరువాత సుళువుగా సుఖముగా నఱకుదువుగాని ఎందుకింత యోజన’ అని సుబ్బరాజుగారు పలికిరి. చేతులు విప్పమని నబాబుగారు భటునకు సంజ్ఞచేసిరి. అంత సుబ్బరాజుగారు, కొర్నిపాటి ప్రయాణమునుండి యానిముసమువఱకుఁ దలమీఁదనే కట్టుకొనియుంచిన భాగవతమును దీసి, కన్నులద్దుకొని దూరముగనుంచి దానికిఁ బ్రదక్షిణ మొనర్చి సాష్ట్రాంగ మాచరించి లేచి కోదండరామప్రభో యని బ్రహ్మాండకటాహ మదఱున బ్రొక్క కేక వైచి చాపచుట్టగఁ గ్రిందబడి ప్రాణములు విడిచెను. కత్తితో భటుడింక నఱుకుట యెందుకు? ఆతడెట్టు మరణించెనో? యనియందఱకాశ్చర్యముగా నున్నది. పరీక్షించి చూడగ నాతనినోటినుండి రక్తమొలికినది. పిడుగుపడినట్టు కోదండరామప్రభూ యని యాతండు వైచిన కేకతో గొంతులోని రక్తనాళము తెగి యారక్తపుజుక్కలు వాయుద్వారమునఁ బోవుటచే సూపిరి యాడక నిముసములో మరణ మీతనికి సిద్దించినదని యటనున్న వైద్యుఁడు శాస్త్రీయసమూధానమును (Scientific Explanation) చెప్పి, తనపాండిత్య మందఱకుఁ దెలిసినదో లేదో యని యటునిటు చూచెను. పరమాత్ముని యాజ్ఞ యయినది కావున బ్రాణములు దేహమును వదలిపోయిన వని చెప్పఁగ నందఱకును దెలిసినమాట.

సుబ్బరాజుగారు మరణించిరనుమాట చెవినిఁబడఁగనే కన్నుల కేదైనఁ గనబడునో, కడపులో నేమైన గుబులు పుట్టెనో కాని గడగడ వడకి నబాబుగా రేడ్చిరి. వారికంటె ముందుగానే కాంబోలు వారిభటు లేడ్చిరి. అచ్చటి ప్రజలందఱికంటె ముందుగాఁ గాబోలు నేడ్చిరి. అంద జేడ్చుచున్నారు. ఎందుల కేడ్చుచున్నారో యెవ్వరు నెఱుఁగరు? ఏది? ఆ సమయమున నెవ్వరికైన మతులున్నవా? చైతన్యము లున్నవా? గోలుమన్న రోదనము తప్ప నంతకంటె నేమియులేదు. అంతయు దీఱిన తరువాత నేడ్చిన లాభమేమి? సుబ్బరాజుగారి కథ విన్నవారికే కన్నులు చెమ్మగిల్గవలసి యుండఁగ నాయనకథను జూచిన వారికిఁ గడువు చెఱువయ్యె ననఁగ నాశ్చర్యమేమి? నబాబుగారేమో రామభక్తుఁడైనాడట! అగుగాక. రామభక్తులెందఱో లేరు. వారిలో నాతఁ డొకడు. సదా కోటి జంగాలలో నొక బోడిలింగము. లెక్కయేమి? ఆర్యావర్తదేశమున నారామచంద్రమూర్తి మహాత్మ్య మెఱుఁగని నరుఁడెవ్వఁడు? నరునివదఱ కెందులకు? కోఁతినడుగు, కొండముచ్చునడుగు, కాకినడుగు, గ్రద్దనడుగు అందఱకుఁ గూడ నెందులకు? చెట్టునడుగు, పుట్టనడుగు, ఱాతినడుగు,