కొయ్యవాఱెను. ఒక్క నిముసమునకుఁ బ్రజ్ఞగాంచి చూచుసరికిఁ దనపాదముల నాయన శలాకనుండి యావలకు లాగి వానిని గన్నులందుఁ జేర్చుకొని-శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః–యని భార్య యనుచున్నది. భర్తకుం గంటివెంట నీటిచుక్క లేదు. భార్యనంతకంటె లేదు. అతిశుష్కమైన వస్తువున కయిన రసమున్నది. అతినీచమైన కార్యమునకై రసమున్నది. అగ్నిజాలలకైన రసమున్నది. కాని యతిదుఃఖమున రసము లేదు. 'మీపాదసన్నిధిని నాకు మరణింపవలయునని యున్నది. కాని యీవ్యాధి గల నన్నిక్కడ గొంతసేపైన నుండనీయరు. భటులు పొమ్మనకుండనే స్వామీ వెడలిపోదును. నమస్కారము" అవి యూమె దేఁకుకొనుచుబోయెను. ఆమె యేమనుకొనుచు బోయెనో యేమను కొనుచు గొట్టులో నుండెనో వారికే తెలియదగినది. అంత
క. కలడందురు దీనులయెడఁ
గలడందురు పరమయోగి గణములపాలన్
గలడందు రన్నిదిశలను
గలడుకలం డనెడివాడు కలఁడో లేడో
యని చదువుకొనుచు నిట్టు గలిగిన సందేహమును వెంటనే పరిహరించుకొని-
క. నీపాదకమల సేవయు, నీపాదార్చకులతోడి నెమ్మి నితాంత
శ్రీపాదకమలసేవయు దాసమందార నాకు దయసేయఁగదే.
యని ధ్యానించుకొనుచుండెను. ఇంతలో విచారణకొఱ కాయనను గచ్చేరికిఁ దీసికొ నిపోవుభటులు వచ్చిరి. వా రాయనను తీసికొని పోవుచుండఁగ ' ఆకానుఁగు చెట్టుక్రింద నన్నొక్కసారి నిలుపవయ్యా! నా భార్యను చూచి వత్తు"నని వారిలో నొక్కని నాతండు కోరెను. వా రంగీకరింపక చెట్టుప్రక్కనుండియే యాతనిఁదీసికొనిపోవుచుండ, దుర్గా దుర్గా! దుర్గా యని సింసగర్జనమునఁ బిలిచెను. పలుకలేదు. ఆమె మరణించెనని నిశ్చయపఱచు కొని కోదండరామప్రభూ! యని యొక్క కేకవైచి " ఓ కానుగుచెట్టా! నాదుర్గను, నా బిడ్డను, నేను బోషించుకొనదైన నా భార్య కళేబరము ప్రక్కనుండియే దానిని జూడకుండ నేను బోవుచున్నాను. నీవు దానవుకావు. నీవింక నామెయెుద్దనే కనిపెట్టుకొని యున్నావు. నీవే నాకంటె ధన్యతకలదానవు. నీ కుత్తరజన్మమున మహోత్కృష్ణమగు జన్మము సిద్దించును గాక!" యని నడుచుచునే చెట్టును దీవించి కచ్చేరికిఁ బోయెను. కచ్చేరిలో విచారణ యేమున్నది. 'నీవు మాభటుని గంటముతోఁ గొట్టి చంపితివి నీకు మరణశిక్ష యేల విధింపఁగూడదో చెప్పకొందువా' యని నబాబుగా రాయన నడిగిరి. 'ఓయబ్బ గంటపు దెబ్బకే చచ్చిపోయినాడయ్యా గట్టిగాఁ గొట్టనే లేదయ్యా! మాయబ్బ ఎన్ని గ్రంథములు వ్రాసిన గంటమయ్యా! ముందుజన్మమున వాఁడు మంచికవియై పుట్టును. ఈడను మంచి మేలు పొందుటకే యాడకుఁ బోయినాఁడని నమ్మవయ్యా! మఱి నన్నేదో చెప్పమంటి వెందుకు? న న్నడుగు టెందుకు? నీయిష్టము వచ్చినట్టు చేసికోవయ్యా అడిగి యడిగి నీ వేమాత్రము చేయఁగలవయ్యా? పోపో యని కచ్చేరీ నుండి పోవుటకుఁ బ్రయత్నింప భటు లాయనను బట్టుకొనిరి. ఇంతగర్వి, ఇంత పొగరుబోతు, నింతదుర్మార్గుండు లేడని యచ్చటివారంద ఆనుకొనిరి. ప్రజల యభిప్రాయములు సౌష్టవము సౌభాగ్యము నిది. ఈ యంశమునందే కాదు. అన్ని యంశములందు గూడనిట్టిదే. ఆతనితల నఱుకవలయుననిన