పుట:SaakshiPartIII.djvu/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పనడుగు దేశమంతటను రామనామము శతకోటిజిహ్వలతో మాఱుమ్రోంగుచున్నది. రాముఁడు లేనిచోటేది? రామునిగూర్చి యొకానొక డిట్టు పలికినాఁడు.

సీ. వీధి పురాణంపు వేదికపై నీవు,
పారాయణపు బీటపైని నీవు,
దృశ్యప్రబంధంపుఁ దెరలసందున నీవు,
మృతివార్త శ్రుతిఁ బడ్డ యెడను నీవు,
గొల్లసుద్దుల లేకు డొల్లలలందున నీవు,
యకగానపు జిందులందు నీవు,
చండాలుబుజముపై మొండితంబుర నీవు,
తొలుబొమ్మలసంత గోల నీవు,

పడుకగదుల గోడల నీవు, భక్తహృదయ
రసనలను నీవు, యాయావరతను నీవు,
సృష్టినీమయయేూ? నీవు సృష్టిమయమొ?
యెట్టయిననేమి? రామ! రక్షింపుమయ్య!

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః