పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ములే సంస్కృతములు గాని కడమ వన్నియు తేట తెలుగు మాటలే. ఉదాహృత పూర్వములైన - "ధనమా రాదు, దురాశపోదు--", కోరిక తీరదాయె, వినుగొల్పున జూడగ దూరమాయె....."ఇత్యాదిపద్యములు నిట్టివే భీష్మ ప్రతిజ్ఞ, భీష్మవంగ్రామము (పరిశిష్టము - 8, 7 పుటలు) సీసపద్యములు నిట్టివే. ఇదే అసలు దాసుగారి బాణి. లోకములో అందరి కవితలలోను శైలి యుండదు. లోకము చేసుకొన్నపుణ్యమును బట్టి కొందరి కుండును. అదరికిని వ్యక్తిత్వ ముండునా? పదిమందిలో తొమ్మండ్రు నిర్గుణ ప్రబ్రహ్మలుందురు. దాసుగారు సగుణ పరబ్రహ్మెయే. వట్టికన్నుతొ చదువుకొనువారి కొక్కొకపుడు వారిశైలి తేలి పోయునట్లనిపించును. అదిపద్యముగానీ గద్యముగానీ సంగీతానువగు దాసుగారు తదుచ్చారణ కూపిరి పోయుదురు. ఆయన హరికధలందు గద్య చదువు నొడుపు విన్నవారు మరచిపోలేరు. ఒకపాటి సంగీత శ్వాసగల మనసుతో చదినినచో వారి పద్యములందు హృద్యమైన శైలి సర్వత్ర గోచరించును. గద్య శైలి య్ందును వారి వ్యక్తిత్వ ముద్రను గాంచగలము. (చూ.వ్యాస పీఠము). అందు కాదంబరీ మర్యాదలు మరికొన్ని గలవు. గీర్వాణమునందును దానవాణి వాల్మీకి వ్యాస కాళిదాస బర్తృహరి ప్రభృతుల అవగాభావపటువు లైన సరళహృదయుల అపేలవ వాగాలింత మైన లాలిత్యము డక్కగొన్నది.

        ఉదాహృత శ్లోకములు పరిశీలింపుడు.

భాషానుషమ:

     ఒక సధవ యైన సంస్కృతాంధ్ర కళాశాలాద్యక్షురాలికి క్రొత్తల్లుడు ఆమె కాంగ్లము రాదనియేకాక తెలుగున జాబు వ్రాసిన తెగ మురిసిపొవునని యెంచి అసలుత్తరపు టెత్తుగడయే పగడగా నుండవలెనని "గంగా భాగీరధీ సమానురాలైన అత్తకామణికి" అని ప్రారంభించెనట. అది చూచుకొన్న యామె మిక్కిలి వెక్కసంపడి కుక్కకాటుకు చెప్పుదెబ్బ కొట్టవలె నని తలపోసి అల్లువానికి తగిన తాదృశములైన పురుషసంబుద్ధులు తన యుభయభాషా పాండిత్య పరిణాహమున నెచ్చటం గానక విసుగెత్తి చివరకు--"నేను గంగాభాగీరధీ సమానురాలను కాను కాని మీ భాషాయోష ట్లున్నది" అని రెండుముక్కలు గీకి పారవైచెను. అంతట "నేను కెవలము పవిత్రతాగౌరవము నుద్దేశింక్ష్చి యట్లు వ్రాసితిని. కాని మీ సమాధానము నాకు సంతోషాశ్చ ర్యములను కలిగించినది" అని తిరుగు టపాలో ఆమెకు సమాధానము వచ్చినది. అట్లున్నది మన తెనుగుయొక్క స్థితి. సంస్కృత సాహచర్యము