పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ససేమిరా సహజమైనదికాదు. అయితే ఎంత వద్దనుకొన్నను కడు పిన్నటనుండి బాగవత ప్రాణి కావునను, తానెనేక భాగవత కధలను హరికధలుగా రూపొందించిన వాడు కావునను దాసుగ్రి కా ధోరణి యొక్కొకపుడు నెట్టుకొని వచ్చుచుండున్. అది కాదాచిత్కము. అసలు ధోరణి యిది:

  మ॥ ష్మిత పూర్వాన్య సరోజ, మున్నత భురాశ్లిష్టంబు, నాజామలం
        బిత బాహుద్వయ, మబ్జ నిర్మల శిరోవేష్టంబు, సత్యామృతాం
        చిత వాక్పూర, మఖండవక్ష, మరులుస్పీతంబు శిస్యాళి బ్రో
    వుత మంచున్ గురు చంద్రశేఖర మహామూర్తిన్ సించెదన్(43)

నిక్కచ్చిగా చెప్పవలయు నన్నచో విరియకాదు దాసుగారి ధోర్ణి, సంగీతమున్ ఆయన బాణీ కెట్లొక ప్రత్యేకత యున్నదో అట్లే సాహిత్యమునను నున్నది. ఆ బాణీ ఆయనవలె తెలుగును వలచిన తిక్కన ఫక్కికి కొంత యిరుగు పొరుగుగా నుండును. తిక్కనగారివలెనె యాయనయు సాధారణముగ స్మనము నాశ్రయింపక ఉడుమువలె నొక యెడుపును బట్టుకొని చెప్పదలన బావమెల్ల చేవదేరునట్లు రచింతురు.

ఉదా॥ హనుమద్వి క్రమము (28):-
   సీ॥ ఉబికితి వేవి వస్తోర్ద్వ లోకంబులు
           గిరగిర సుడివడి తిరుగుకున్నె
      త్రొక్కితి వేవి యధోభువ్నము లెల్ల
            దట్టముగా నట్టగట్టాకున్నె
      ఊదితినెవి మహోదరు లన్నియుం
           జిఱుతుంపురై మింట జెదర్కున్నె
      గ్రుద్దితివేవి మేరుధ్రాధరంబైన
            మఱి తుమురై మచ్చ్ మాయ కున్నె
      సత్యవ్ంకల్పుడవు మనోజవుడ నీవు
      కామ రూపి వప్రతిహత గతిని నీవు
      నీ మహత్వ మొకింతయు న్నీ వెఱుగవు
      గాని హనుమంత ! నీవు సాక్షచ్చివుడవు.

ఇందొక చక్కని సమతతో గూడిన యెడుపు గలదు. ఆయెడూ చిక్కని యర్ధస్పూర్తికి గట్టినది. ఒక్క హనుమ ద్విక్రమ పరాజయ్య వస్తువాచక శబ్ద