పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లేనిచో అది వట్టి ముండమోపి తెలుగు. ఆకల్తీ యున్నచొ నదే మనకు పరమ పావన మైన తెనుగు, ఇదీ వరుస, అల్లావాని యర్ధమును తన కావ్యభాష యందు సార్ధకము చేయ సంకల్పించిరి దాసుగారు. వెనుకటి 'సంస్కృత ప్రాకృత సమేతరం బయిన భాష అచ్చ యనంబడు ' నెమోగాని 'అచ్చా ' యనిపించుకో లేదాయె: దానికితోడీయన తదృవములను గూడ పరిహరించి కేవల దేశ్యాంధ్రమునందే దానికి 'నాటు తెలుగు ', 'సీమపలుకు ' అను పేర్లు పెట్టి అందు పలు కృతులను, ఒక అపూర్వ నిఘంటువును వెలయించిరి. (వివరముల కిందలి 3వ అనుబంధమును చూడనగును).

          "మొలక లేతదనము, దలిరుల నవకంబు,
           మొగ్గ సోగదము, పువ్వు కాని
          తేనె తీయదనము, తెనుగుననే గాక
          పరుష సంస్కృతాఖ్య భాషకేది?" (62)

అవి తెనుగు యొక్క సౌబదు చెప్పుట గాక సంస్కృతమునకే యొక పెటకము పెట్టిరి. చరమపాదమున "మోట లాతి నాటు మాటకేది?" అవియు మరియొకచో పాఠాంతరమును వెలయించిరి. తెలుగన్న యంత మమకారము తిక్కన్నకును లేదేమో ! అసలు చాలమంది అచ్చతెలుగు కవులును అందు కావ్యము వ్రాసి సలుగురినీ మెప్పించుట యొక గొప్పగా బావించిన వారే కాని వారే యందును ఇంత వల్లమాలిన మక్కువ గలవారుండరేమో! పాల్కురికి సొమనాధుడొకడు "తెలుగు మాట లనంగవలదు వేదముల కొలదియగా జూడు" డన్నాడు గాని--

     "త్రిలింగ భూరేవ భూమి: । త్రిలింగవర ఏవ నా
     త్రిలింగ భాషైన భాషా । నాత్ర కార్యా విచారణా॥

అని యన్న దాసుగారి యంత ఆంద్రాభిమానము జూపిన వాడు గాడు. అన లట్టివారుండరేమో ! అయితే చిత్రము, అంత కఠోర నియమ నిగళమును కోరి తగుల్చు కొన్నారా దాసుగరు, అయినా అందు రచన అతిహేలగా అవలీలగా చేయుదురు.

ఉదా॥ కోరిక (70):-
     "తెల్లముగా నచ్చ తెలుగులో జెప్పు
     మేల బల్మిన్ జేయ నెగ్గెఱింగియును
     మానిసి ! నా యరమర తీర్పు మప్ప!"