పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సామాన్యుడైతే అత డే విషయము నే యుపాది నాశ్రయించి ఆవిష్కరించు చున్నాడో తేలిపోవును. అదే మహాకవియైతే అతడు సర్వమును అనుభూతి సాక్షికముగనే ఆవిష్కరించినట్లుడును. అయితే మహాకవియును సామాన్యకవి వలె సంఘోపజీవియే. ఇరువురికి అనుభవ పరిమాణమునకు నొక అవధి యుండును. అతడెంత మహాకవియైనను తత్కావ్యగత సర్వవిషయములు నతని అనుభూతి పరిదిలోనివే యైయుండుట కవకాశములేదు. కాని యతడు ప్రతి విషయమును తన ప్రతిభాప్రకర్షమున మనశ్చక్షువు ముందు సాక్షాత్కరింపజెసి కొని అంతస్సన్నిధి చేసికొని తా ననుభవించినట్లుగనే ఆవిష్కరించును. అందులకే సామాన్యకవుల వాక్కులు చెవెకెక్కవు. మదికించవు. అందు పేలవత్వమే గాని మార్ధవ ముండరు. కాఠిన్యమే గాని మనృణత్వముండదు. మహాకవుల వాక్కులు పద్యోహృద్యములు సహృదయ నైవేద్యములు. శక్తి మంతులు, అర్ధగంభీరములు, చిరస్మరణీయములు. లోకమున శృంగారమును పొషించిన కవు లెందరు లేరు? అందులో నెందరు కాళిదాస భట్ట బాణ జయ దేవామరుకుల చాయలకు రాగలరు? అట్టి మహాకవులును కాక వట్టి సామాన్యలునుగాక మధ్యస్థముగా మరియొక కోవ కవులుగలరు - విగగ్దమాత్రులు, తరచు మన మెప్పులకు పాత్రులైన కవులలో ముక్కాలు ముంవీనము వీరే. సామాన్యకవుల చేతిలో ఇత్తడిగూడ పుత్తడియగును. ఇదే భేదము, ఆకోవకు జెందిన మహాకవులలో కోటికి పడగెత్తిన వాడు నారాయణ దాసు, ఏమందురా: --

తరువోజ|| తొల్లింటి వారు చదువుకొని టెల్ల
                    తోడివారలకు బెంద్రోవ జూపుటకు,
              మళ్లి పుట్టేడు తెవుల్ మాన్పించు మంచి
                  మందిచ్చి నిచ్చలుం బ్రతికించ్ కొఱకు.(కచ్ఫపి-పుట 49)

భారతీయుడైన మహాకవియే అనగండీ మాట.

      "ధరణిం జీకటివేళ దవ్వు వెలుగున్ దర్శించు కందోయికి
      న్మఱి యే వస్తువులైన దోచనలు విన్ ద్యావించు నవ్వాని క
      ద్దిర యీ లోకవికారముల్ మరి రవంతేనిం గనన్రావుగా
      అరయంగా దన జీవితంబున మహత్మా! సూర్యనారాయణా!
                                                 (లత్చపి- పుట58)