పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

    సీ॥ చిఱుణాలపై జలజలబాఱు సెలయేటి
             నీటిపై లకుముకి దాటు జూచి
         నానాట నలవాటు బూని మెల్లన జేర
             వచ్చు జింకల కూర్మిపాలు జూచి
        మడుగుల జెఱలాడి బెడిదపు బొడ్డుల
              బోలియించు నేనుగుపోటు జూచి
       దువ్వి ముద్దుకొనుచు దొడ్డపులుల తోడ
             నాటాడు చెంచెత నీటు జూచి.
      వర్ణణము చేయుచున్ భూరి వనములందు
      బలురకంణుల పిట్టల పలుకులకును
      స్వరము గట్టుచు జెట్టుల పట్టలందు
      పద్యములు వ్రాయ బాగ్యంబు పట్టు నెపుడు!"
      

అసలు దాసుగారి వింత నివర్గ మధుర ప్రకృతిని, బహుళ కళ సురభిళాత్ముని జేసినది వారి యభిజన మజ్జాడ నావరించిన సువర్ణ ముఖీ సజీవ స్రోతస్వినీ పరమరమణీయ పరివర ప్రకృతి ప్రకృతినవిత్రిని రసప్రసువుగా బావించిన ఆ మహానుభావు డా తరంగిణి సముత్తంగ తరంగముల గముల గలగలలలో తీరస్థ నానీర వికుంజ కికీదివి నంకుల కింకరాత సమరకళా హళాహలి కలిత లలిత కల కూజీతములలో వినిపించిన సంగీత సరస్వతీ కచ్చపీశ్రుతులను కనిపించిన కవితా సరస్వతీ దరహాసములను తన కళాభిరుచి వికాసమునకు పంచకరువుగా గ్రహించెను.

దాస కవితా దర్శనము

కవిత్వ మహత్వము:

   దాసుగారి నిర్యాణనంతరము 29-1-1945 తేదీ ఆంధ్ర పత్రికలో శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారు "గానమునందు వలెనే కవిత్వమునందుగూడ శ్రీదాసుగరికి విశిష్టస్థాన మీయక తప్పదు" అని వక్కాణీంచి యుండిరి. ఆ విశిష్ట్య మెట్టిదియో యధావకాశముగ పరిశీలింతం, ఏ కవికైనను అతని సాహితీవర్గమునకు ప్రధానములైన యుపాదులు నాలుగు; ఊహాశలిత (Imagination), అనుశీలనము (Observation), విషయజ్ఞత (Information), అనుభవము (Experience), కవి