పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

    అమరన్ బంగరునుండి దాని దగు చాయన్ వేఱుసేయంగ శ
    క్యము కానట్టుల నిజ్జగల బెడవరా దయ్యారె విన్నుండి: ద
    క్రమునం గొణము రీతి వారయగ నీత్రైలోక్య మేసరి నా
    శము నీ యందున జెందుచుండు పరమెశా! సూర్యనారాయణా!
                                                 (కచ్చపి. పుట 58)

ఆ ఊహలలో నున్నది మహత్వము. వాని నుచితోసమముగ విన్యసింఛుటలొ నున్నది కవిత్వము.

  ఊహవైభవము:
    దాసుగారి సముదాత్తమైన ఊహవైభవ మాయన సర్వకృతు లందును దర్శన మిచ్చుచునే యుండును. ఆ వైభవ సాంద్రత నొక్కచొ సందర్శింప వలెనన్న నిందలి సంస్కృత సారణ్ యందలి 'తత్త్వదర్శనము ', 'భక్త హృదయము ', 'ఈశ్వర తత్త్వము '. ఆదర్శ పురజనులు ' అను శేర్షికలు చూడదగును. అయితే తదవగాహనకు తాదృశచక్షువు కావలసి వచ్చును. ఆ ముప్పదికి పైబడిన శ్లోకము లందు ఉదారోహలేకాక ప్ర్తి శ్లోకమునందును కవితా కల్యాణి కటాక్షము లైన ఒక అలంకారమో, చమత్కారమో లెని శ్లోకమే లేదనవచ్చునుజ్. భావసంపద యందు ఆయన యెంత సంప్రదాయ విధేయుడో అంత సర్వతంత్ర స్వతంత్రుడు అభ్యుదయభావుడు: ఎంత ప్రాచీనుడో అంత నవీనుడు. ఎంత పారమార్ధిక చింతకుడో అంత ఐహిక లోకజ్ఞడు. తన భక్తి  దృక్పధమును స్థాపించు కొర్కు శాస్త్రములను, కర్మకాండను అవతవములను, ద్వైతాద్వైతములను, జ్ఞాన మార్గమును గూడ కాదనుటకు వెనుకాడలేదు. (చూ.కచ్చపి. పుట 58), క్రతు విరాసమును కంఠోక్తిగాచేసిన సందర్భముంకు కచ్చపి - పుటలు 30,31 చూడుడు. పూర్వోక్త పుటలందే దాసుగారి కెంత సత్యదయా  ప్రత్యయబుద్దిగలదో తెలియగలదు. "ఆదర్శ పురజనులు ' ఖండికలో పరమ నవనాగరిక భావనను జూడగలము. ఆ సందర్భము లన్నిట ఆయన వ్యక్తిత్వము చక్కగా ప్రతిఫలించినది. కవియొక్క సముదాత్త వ్యక్తిత్వము కళాత్మకముగ వ్యక్త మైనప్పుడే అక్కడ కవిశ్వముండును, మహత్వముండును. ఆయన శతకము లన్నియు సార్ధవముగ ఆయన వ్యక్తిత్వవైశిష్ట్యము నభివ్యక్తమొనర్చినవి.
    ఈ కచ్చనీ శ్రుతులను బట్టి వారి విశిష్టోహలను, పటిష్టాభిప్రాయములను క్రమానుసార నుదాహరింతును. (పక్కనున్న యెంకెలు ఈ గ్రంధమునందలి పుట