పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7

క చ్చ పీ శ్రు తు లు

11. భీష్మ సంగ్రామము:

సీ॥ విరిగెడు నరదము, లొరిగెడు గుఱ్ఱముల్,
         తెగిపడు సిడములు, ద్రెళ్ళు కరులు,
      బంతులవలె ద్రుళ్ళు చటుల శిరంబులు,
         మొత్తంబులై యాడు మొండెములను,
      పొడియగు శస్త్రాస్త్రములు, మూలబదిన సా
         రధులు, మూర్చిల్లిన రిధికవరులు,
     మనరానులొ మాంసఖండము, లేఱుల
         సొబగున బాఱెడు కోణితంబు

గీ॥ గులుగునట్టుల పాండవబలము ద్రుంచు
      భీష్మ నిక్రమముం జూచి బీర మెడలి
      యున్న యర్జును బరికించి వెన్ను డవుడు
      తలను లంకించి యిట్లనె దాల్మి దొరగి.

భీష్మ చరిత్రము

12.పసిపాప:

గీ॥ వెక్కి వెక్కి యేడ్చు, వెంటనే చిఱునవ్వు,
     నడుమ నడుమ బున్సలిడుట, పాల
     గ్రుక్క మ్రింగినంత గుసగుసలాడెడి
     వేడ్క దెలిసి యబుభవించనైతి.

13. ప్రాయపు మాపు:

చ॥ వయసు ననంతనేవలె వచ్చుటకై కనిపెట్టి యుల్పుచున్
      దయితల గల్గువారల నెదల గొనియాడుచు మాటలాడుచుం
      ట యరిగె నక్కటా! బడు గనంగ భయంబును సిగ్గు దోచుటల్
      భయము దొరంగియు న్మతినిభావము జూపుట లిప్పు తెబ్బెగా.