పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
8

దా స భా ర తి

14. తెలివి:

గీ॥ తెలివి గల్గియు లేనట్లు దిరుగువారు
     తెలివి లేకుండి యున్నట్లు లులుకువారు
     చెలగుచున్నట్టి లోకంబ్ చెల్వు జూచి
     యెద్దియుం దోచకుండె నే నేమిసేతు?

15. అస్తినాస్తి విచికిత్స :

సీ॥ ఉన్నదె జరుగుచునున్న దటంచు ని
           ర్లక్ష్యంబు జూపెడు లక్ష్యవతులు
     నున్నదానికి లేని చిన్నెల నలరించి
           నామంబు దిద్దెడు న్యాయమతులు
     నున్న దెఱుంగక యున్నట్లు దెల్పంగ
         జాలుట లెక్కించు సాంఖ్యర్తులు
     నున్నది మన మనుకున్నది సత్యవి
         శేష మున్న దను విశేషగతులు

గీ॥ ఉన్న జెల్లును లేకున్న నుత్తమంబు
     సందియం బేల తలపుల శాంత బూను
     డనెడు యోగప్రతులు గలియందు శస్త్ర
     వాదమాత్రులుగా ననవాదు గొంద్రు॥

16. చంద్రోదయము:

చ॥ తరఱియు బశ్చిమాంబుధికి దానె, విహంగము లున్కినట్లకుం
     బిరబిర బాఱె జీకటులు మీరె, సమీరుడు చల్లనారె, సం
     రమున గుందమానముల మాడ్కిని రిక్కలు జాలువారె, బం
     ధురగతి కైరవాప్తు డురితుండయి వెన్నెల వెండిగారగన్