పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
8

దా స భా ర తి

9. ఆత్మహితము:

గీ॥ నిరత మన్యోన్యమైత్రితో బరగుచుంట
     చెలగి మన తొంటి మర్యాద నిలుపుకొంట
     జాతినీతులు తప్పక అరుగుచుంట
     చాలు నాకాశపంచాంగ మేల మనకు.

గీ॥ నూవుగింజ బ్ర్రహ్మణుని సామెతగ మింట
     మెద్దె అల్లుకొనుచు నొద్దనున్న
     దాని తన్నుకొనుట తగునె, యాముష్మిక
     స్వప్న మేల యిహము జాడ గనక ॥

10.భీష్మ ప్రతిజ్ఞ :

సీ॥ రాలనీ చుక్కలు, కూలనీ కులగిరు,
        లిల గ్రుంకనీ, వార్డు లింకిపోని,
     ఆకస్మికంగ సూర్యాచంద్రముల్ గతుల్
        దప్పనీ, జగమెల్ల తల్లదిలని,
     పెడుగులు గురిల్యనీ, పెటిలి బ్రహ్మాండముల్
        పేలాల పోలికం దేలిపడని,
     ప్రళయము పుట్టనీ, భైరవుందు త్రిశూల
        ధారుడై పాలనెత్రము తెరువని,

గీ॥ యేది యెట్లైన గాని యొక్కింతయైన
     నా ప్రతిన తప్పిపొవదు నమ్మవలయు
     అభిలపావని నా తల్లి యయ్యెనేని
     దర్ము నెప్పుడు నాతండ్రి తప్పడేని.