Jump to content

పుట:హరవిలాసము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

5


బ్రాయ మింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
గాశికాఖండ మనుమహాగ్రంథ మేను
దెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశకటక
పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.”

—పద్యమునందు “కర్ణాటకటక పద్మవనహేళి” (కర్ణాటదేశపట్టణమున కమలములకు సూర్యుఁడు) అను విశేషణమును శ్రీనాథుఁడు దనకుఁ కూర్చుకొనియున్నందునను—

భీమేశ్వరఖండములో—

"ప్రౌడ పరికింప సంస్కృతభాష యండ్రు
పలుకునుడికారమున నాంధ్రభాషయందు
రెవ్వరేమన్న నండ్రు నా కేమి కొఱత
నా కవిత్వంబు నిజము కర్ణాటభాష.”

—పద్యములో “నాకవిత్వంబు నిజము కర్ణాటభాష” యని తనకుఁ కర్ణాటభాషయందుఁ గల ప్రేమను సూచించియున్నందునను—

ఆభీమఖండములోనే—

"కనకక్ష్మాధరధీరు వారిధితటీకాల్పట్టణాధీశ్వరున్
ఘనునిం బద్మపురాణసంగ్రహకళాకావ్యప్రబంధాధిఫున్
వినమజ్జ్యాంతరసార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు నా
యనుఁగుందాతఁ బ్రదాత శ్రీకమలనాభామాత్య చూడామణిన్.”

—పద్యమునందు శ్రీనాథునిపితామహుడును బద్మపురాణగ్రంథనిర్మాణాలంకర్మీణుఁడును కవితావిద్యాధురంధరుండును నగుకమలనాభామాత్యగ్రామణి పశ్చిమసముద్రతీరమునఁ గర్ణాటదేశములోఁ జేరిన కాల్పట్టమునకుఁ బ్రభువుగా నున్నట్లు చెప్పియున్నందునను—

శ్రీనాథుని వీథినాటకములో—

"కుళ్ళాయుంచితిఁ గోక సుట్టితి మహాకూర్పాసముం దొడ్గితిన్
వెల్లుల్లిన్ దిలపిష్టమున్ బిసికితిన్ విశ్వస్త వడ్డింపఁగాఁ
జల్లాయంబలి త్రావితిన్ రుచులు దోసంబంచుఁ బోనాడితిన్
దల్లీ! కన్నడరాజ్యలక్ష్మి! దయ లేదా నేను శ్రీనాథుఁడన్."

—పద్యమునఁ "దల్లీ!” యని కర్ణాటదేశమును సంబోధించినందునను—